నూజివీడు: మంటల్లో చిక్కుకొని ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ముసునూరు వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్‌లో ఈ రోజు తెల్లవారుజామన ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఆ విషయాన్ని గమనించిన ట్యాంకర్ డ్రైవర్తోపాటు క్లీనర్ కిందకి దూకేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే యాసిడ్ ట్యాంకర్ పూర్తిగా మంటల్లో ఆహుతి అయింది.