Woman passenger charred to death as auto-rickshaw catches fire in Maharashtra - Sakshi
Sakshi News home page

ఆటోరిక్షాలో మంటలు చెలరేగడంతో..‍ప్రయాణికురాలు సజీవదహనం

Published Wed, May 3 2023 2:02 PM | Last Updated on Wed, May 3 2023 3:19 PM

Woman Passenger Charred To Death As Auto Rickshaw Catches Fire - Sakshi

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్‌ రోడ్డులోని గైముఖ్‌ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు.

ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్‌ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్‌ రాజేష్‌ కుమార్‌కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

(చదవండి: కింగ్‌ చార్లెస్‌ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement