విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి.
వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్‌ని ప్రకటించి కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్‌పోర్ట్ తెరిచే ఉందని జాన్‌గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్‌లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్‌లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు.
Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023
Comments
Please login to add a commentAdd a comment