నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం! | Watch Viral Video Of Tap Water Catches Fire In China | Sakshi
Sakshi News home page

నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!

Published Sat, Nov 28 2020 11:27 AM | Last Updated on Sat, Nov 28 2020 1:29 PM

Watch Viral Video Of Tap Water Catches Fire In China  - Sakshi

బీజింగ్‌ : సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్‌ డెయిలీ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు.

చైనాకు చెందిన వెన్‌ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్‌ తెలిపింది. కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు.. ఇక్కడున్న దాదాపు వంద ఇళ్లలో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం అని పేర్కొంది. కాగా వీడియోపై అక్కడి జలవనరులశాఖ అధికారులు స్పందించారు. 'వాస్తవానికి గ్రామాన్ని మొత్తం అండర్‌గ్రౌండ్‌ వాటర్‌తో కనెక్టివిటీ చేశాం. ఆ సందర్భంలో ఒక దగ్గర నేచురల్‌ గ్యాస్‌కు సంబంధించిన పైప్‌లైన్‌ పగిలి కొద్దిపాటి గ్యాస్‌ లీకై అండర్‌గ్రౌండ్‌ వాటర్‌తో కలిసిపోయింది. దీంతో ఇలా తరచుగా నీళ్లకు మంటలు అంటుకుంటున్నాయని అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రస్తుతం నీళ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి మరమత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement