
ముంబై : నడిరోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ముంబైలోని గోరెగావ్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రైవర్ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఘటనా స్ధలాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం దృశ్యాన్ని రికార్డు చేసిన స్ధానికులు ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. తమ సిబ్బంది ఘటనా స్ధలంలో సహాయక చర్యలు చేపడుతున్నారని, త్వరలోనే ట్రాఫిక్ పునరుద్ధరిస్తామని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment