నెల్లూరు జిల్లాలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
బిట్రగుంట : నెల్లూరు జిల్లాలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు బ్రిటగుంట స్టేషన్లో ఆగి ఉండగా బోగీ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పొగలు వస్తున్న బోగిని పరిశీలించారు. సాంకేతిక కారణాల వల్లే పొగలు వచ్చాయని నిర్ధారించారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు యధావిధిగా బయలుదేరింది.