![Accident Missed To Krishna Express At Alair Railway Station - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/31/krishna-Express.jpg.webp?itok=t6hjE4Ks)
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment