alair
-
Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్లోని డొల్లతనానికి అద్దం పడుతోంది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై -
ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. పొటిలికల్ లీడర్లు పార్టీ నేతలకు షాకిస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బీజేపీకి షాకిచ్చారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా భిక్షమయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురయ్యాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక లాభం కోసమే ఉప ఎన్నిక వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భిక్షమయ్య గౌడ్ ఆయన అనుచరులతో కలిసి కొద్దినెలల క్రితమే బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందజేశారు. -
నన్ను ఆగం చేశారు.. బాధ ఎవరికీ చెప్పలేక..
సాక్షి,మహబూబాబాద్/నెల్లికుదురు/మహబూబాబాద్ రూరల్: ‘నన్ను ఆగం చేశారు.. నా బాధను ఎవరికీ చెప్పుకోలేక.. నేను పిరికి పందను కాదు..’ అంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి ఉత్తరం రాసి తనువు చాలించింది. ఉత్తరంలో తనను ఆగం చేసిన నలుగురి పేర్లు రాయడంతో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా తెలిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇంటికొచ్చి.. గడ్డి మందు తాగి.. ఆలేరుకు చెందిన శ్రీరాం వెంకటనారాయణ, హైమావతి దంపతులకు సుప్రియ (22), కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి లారీ క్లీనర్‌గా వెళ్తున్నాడు. దీంతో కు మార్తె, కుమారుడితో పాటు నానమ్మ, తాతలు జగదాంబ, నర్సయ్య ఉంటున్నారు. ఈ క్రమం లో తమ కుమార్తె కొడుకు పెళ్లి ఉండటంతో నానమ్మ–తాత వేరే గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఇద్దరే ఉండగా సుప్రియ ఈ నెల 16న స్నేహితురాలు స్వప్న ఇంటికెళ్లి తెల్లవారుజా మున వచ్చింది. 17న రాత్రి 8.15 గంటలకు మళ్లీ స్వప్న ఇంటికెళ్లి 15 నిమిషాల్లో వెళ్లిపో యింది. తర్వాత తెల్లవారుజామున 2.30 గం టలకు ఎవరో తరిమినట్టు ఊపిరి బిగబట్టుకొని ఇంటికి వచ్చింది. రాగానే ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఉదయం అక్కను చూసిన తమ్ముడు హుటాహుటిన ఆస్పత్రికి తరలిం చాడు. 5 రోజులు మృత్యువుతో పోరాడి 22న రాత్రి సుప్రియ మృతి చెందింది. చనిపోతానని తెలిశాకే.. యువతి కిడ్నీలు, అవయవాలు పాడ య్యాయ ని, వరంగల్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు డాక్టర్లు చెప్పగా విన్న సుప్రియ తాను చనిపోతానని తెలుసుకొని పక్కనున్న గ్రామస్తులతో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. మాట్లాడలేకపోవడంతో వాళ్లు కాగితాలు, పెన్ను ఇచ్చారు. దీంతో విషయం పేపర్‌పై రాసినట్లు ఆస్పత్రిలోని వారు చెబుతున్నారు. కాగా, 17న సుప్రియ అత్యాచారానికి గురైనట్లు పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసేటప్పుడు నిందితులు ఫొటోలు తీశారని, విషయం బయటపెడితే ఫొటోలు అందరికీ చూపిస్తామని బెదిరించారని ప్రచారం జరు గుతోంది. అందుకే విషయం ఎవరికీ చెప్ప లేదని, చనిపోతానని తెలిశాక పేపర్‌పై నింది తుల పేర్లు రాసిందని బంధువులు అంటు న్నారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో సుప్రియ మృతదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు సందర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అదుపులో ముగ్గురు.. మృతురాలు తమ్ముడి ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేశాం. 17న రాత్రి అత్యాచా రానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు కారణమైన నలుగురి పై కేసు నమోదు చేశాం. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నాం. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నాం. – ఎస్పీ శరత్చంద్ర పవార్, మహబూబాబాద్ -
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా
సాక్షి, యాదాద్రి భువనగిరి: ప్రాణాంతక కరోనా వైరస్ రాజకీయ నాయకులను నీడలా వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. వరుస పెట్టి నాయకులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో టీఆర్ఎస్ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే హోంశాఖ మంత్రి కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ నాయకురాలు కరోనా బారిన పడ్డారు. (గుండెపోటుతో మరో డీఎస్పీ మృతి) ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ గొంగిడి సునీత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో సునీత అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా) అయితే ఎమ్మెల్యే సునీత ఇటీవల తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేగాక ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితం ఇంకా రావాల్సి ఉంది. కాగా కరోనా బారిన పడిన మొదటి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సునీతానే. ఇప్పటి వరకు టీఆర్ఎస్లో ఏడుగురికి కరోనా సోకింది. (కరోనా నుంచి కోలుకున్న మహమూద్ అలీ) -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెనుప్రమాదం తప్పింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో భేటీ తర్వాత లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడానికి సునీత సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీలింగ్ పైకప్పు పెచ్చులు ఊడి అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్‌పై పెచ్చులు పడటంతో టేబుల్ విరిగి గ్లాస్ ముక్కలు తగలడంతో ఆమె మోకాళ్లు, చేతి వేలికి గాయమైంది. సునీత పక్కనే ఉన్న ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇందిర, గొలనుకొండ సర్పంచ్ లక్ష్మి తలలకు గాయాలయ్యాయి. వారి ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
నెత్తురోడిన నల్గొండ రహదారులు
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన బాణావత్ రూప్లా(37), దామరచర్ల మండలం కొండ్రపోలు శివారు మాన్‌తండాకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కిష్టాపురం వద్ద నెల్లూరు నుంచి హైదరబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రూప్లా అక్కడికక్కడే మృతిచెందగా, ఐదు కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకుపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సైదాబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి బస్సును స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శాంతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యాదగిరిగుట్ట (ఆలేరు) : చౌటుప్పల్ మండలం వెలిమినేడుకు చెందిన రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వరంగల్ నుంచి భువనగిరి వైపు శనివారం వేకువజామున వెళ్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడా.. లేక మరో లారీ ఎదురుగా ఢీ కొట్టిందా తెలియలేదు. భువనగిరి వైపు వస్తున్న లారీలో ఉన్న రమేష్ అందులో ఇరుక్కుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. దేవరకొండ : పట్టణానికి చెందిన శివకార్ ఈశ్వర్‌జి(50) తన భార్యతో కలిసి టీవీఎస్ మోటర్‌సైకిల్‌పై ఇంటి నుంచి మార్కండేస్వామి దేవాలయానికి వెళ్తున్న క్రమంలో భార్యను రోడ్డు పక్కన దింపాడు. అనంతరం స్థానిక భారత్ ఫిల్లింగ్ స్టేషన్లోకి పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా కొండమల్లేపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్‌జి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. గేదె కళేబరాన్ని ఢీకొని వ్యక్తి.. మేళ్లచెరువు (హుజూర్నగర్) : చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు (24) కొంతకాలంగా మేళ్లచెరువులో ఉంటూ స్థానిక మైహోం సిమెంట్ పరిశ్రమలో రైల్వేట్రాక్ పాయింట్ మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి తన దగ్గరి బంధువు అంబడిపూడి శ్రీనివాస్‌తో కలిసి కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి పునరావాసకేంద్రంలో ఓ వివాహానికి హాజరై తిరిగి మేళ్లచెరువు వస్తుండగా కందిబండ సమీపంలోని రోడ్డుమీద పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఇదే సమయంలో లారీ వెంకటేశ్వర్లు తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి కొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జయకర్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మరొకరు.. నాంపల్లి(మునుగోడు) : మండల పరిధిలోని దామెర గ్రామానికి అబ్బనబోయిన స్వామి (25), తన సోదరుడు అబ్బస్వామితో కలిసి శనివారం మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వస్తుండగా వడ్డెపల్లి శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న అబ్బస్వామికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, స్వామికి 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మోత్కుపల్లి నర్సింహులు కూరలో కరివేపాకేనా?
కూరలో కరివేపాకు... టీడీపీలో ఆ మాట మోత్కుపల్లి నరసింహులుకు బాగా అతుకుతుంది. కేసీఆర్ ను తిట్టాలంటే చంద్రబాబుకు మోత్కుపల్లి గుర్తుకు వస్తారు. ఎన్నికలప్పుడు టికెట్ ఇవ్వాలంటే మోత్కుపల్లి గుర్తకురారు. ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య. ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య. పాపం మోత్కుపల్లితో చంద్రబాబు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ఓటర్లు 2004లో మోత్కుపల్లిని తిరస్కరించారు. ఆ తరువాత 2009 లో ఆలేరులో పోటీ చేద్దామంటే అది జనరల్ నియోజకవర్గం అయింది. దీంతో మోత్కుపల్లి వేరే నియోజక వర్గం వెతుక్కుని, తుంగతుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ మధ్య ఆయన రాజ్యసభ రూటులో ఢిల్లీకి వెళ్దామనుకున్నారు. చివరి దాకా ఊరించిన చంద్రబాబు చివరికి తుస్సుమనిపించారు. మోత్కుపల్లి అప్పట్నుంచీ అలకపూనారు. ఇంతలోనే ఎన్నికలు ముంచుకురావడంతో మోత్కుపల్లి అసెంబ్లీ సీటు కోసం పోటీ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే తుంగతుర్తిలో వోటర్లు ఆయనపై కోపంగా ఉన్నారు. అక్కడ పోటీ చేస్తే గెలవడం కష్టం అనిపించింది. దీంతో ఆయన ఖమ్మం జిల్లా మధిరకు మారిపోయారు . నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మధిర ఎస్సీ రిజర్వుడ్‌గా మారిపోయింది. మధిరలో సీపీఎంకు గట్టి పట్టుంది. గతంలో కొద్ది తేడాతో ఓడిపోయినసీపీఎం అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఈ సారి మళ్లీ పోటీ పడుతున్నారు. పైగా ఇక్కడి నుంచే డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా పోటీ పడుతున్నారు. మధిరలో మన మోత్కుపల్లికి లక్ కలిసొస్తుందా? ఆయన గెలుపు సాధించగలరా? మధిరలో ఇప్పటివరకూ 13 సార్లు ఎన్నికలు జరిగితే, కార్గిల్ వేవ్ పుణ్యమా అని ఒక్క 1999 లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి మోత్కుపల్లి నరసింహులు చరిత్రను తిరగరాయగలరా? బిజెపికి ఏ హవా లేని మధిరలో, బిజెపి పొత్తుతో గట్టెక్కగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!