సాక్షి,మహబూబాబాద్/నెల్లికుదురు/మహబూబాబాద్ రూరల్: ‘నన్ను ఆగం చేశారు.. నా బాధను ఎవరికీ చెప్పుకోలేక.. నేను పిరికి పందను కాదు..’ అంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి ఉత్తరం రాసి తనువు చాలించింది. ఉత్తరంలో తనను ఆగం చేసిన నలుగురి పేర్లు రాయడంతో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా తెలిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ఇంటికొచ్చి.. గడ్డి మందు తాగి..
ఆలేరుకు చెందిన శ్రీరాం వెంకటనారాయణ, హైమావతి దంపతులకు సుప్రియ (22), కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి లారీ క్లీనర్‌గా వెళ్తున్నాడు. దీంతో కు మార్తె, కుమారుడితో పాటు నానమ్మ, తాతలు జగదాంబ, నర్సయ్య ఉంటున్నారు. ఈ క్రమం లో తమ కుమార్తె కొడుకు పెళ్లి ఉండటంతో నానమ్మ–తాత వేరే గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఇద్దరే ఉండగా సుప్రియ ఈ నెల 16న స్నేహితురాలు స్వప్న ఇంటికెళ్లి తెల్లవారుజా మున వచ్చింది. 17న రాత్రి 8.15 గంటలకు మళ్లీ స్వప్న ఇంటికెళ్లి 15 నిమిషాల్లో వెళ్లిపో యింది. తర్వాత తెల్లవారుజామున 2.30 గం టలకు ఎవరో తరిమినట్టు ఊపిరి బిగబట్టుకొని ఇంటికి వచ్చింది. రాగానే ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఉదయం అక్కను చూసిన తమ్ముడు హుటాహుటిన ఆస్పత్రికి తరలిం చాడు. 5 రోజులు మృత్యువుతో పోరాడి 22న రాత్రి సుప్రియ మృతి చెందింది.
చనిపోతానని తెలిశాకే..
యువతి కిడ్నీలు, అవయవాలు పాడ య్యాయ ని, వరంగల్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు డాక్టర్లు చెప్పగా విన్న సుప్రియ తాను చనిపోతానని తెలుసుకొని పక్కనున్న గ్రామస్తులతో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. మాట్లాడలేకపోవడంతో వాళ్లు కాగితాలు, పెన్ను ఇచ్చారు. దీంతో విషయం పేపర్‌పై రాసినట్లు ఆస్పత్రిలోని వారు చెబుతున్నారు. కాగా, 17న సుప్రియ అత్యాచారానికి గురైనట్లు పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసేటప్పుడు నిందితులు ఫొటోలు తీశారని, విషయం బయటపెడితే ఫొటోలు అందరికీ చూపిస్తామని బెదిరించారని ప్రచారం జరు గుతోంది. అందుకే విషయం ఎవరికీ చెప్ప లేదని, చనిపోతానని తెలిశాక పేపర్‌పై నింది తుల పేర్లు రాసిందని బంధువులు అంటు న్నారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో సుప్రియ మృతదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రవీందర్‌రావు సందర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
అదుపులో ముగ్గురు..
మృతురాలు తమ్ముడి ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేశాం. 17న రాత్రి అత్యాచా రానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు కారణమైన నలుగురి పై కేసు నమోదు చేశాం. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నాం. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నాం.
– ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment