Gang rape victim
-
దాష్టీకం తర్వాత ఆమెను చంపేయాలనుకున్నారట!
Kasturba Nagar Gang-Rape Charge Sheet Details: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కస్తూర్బానగర్ సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై బూట్ల దండతో ఆమెను ఊరేగించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో ప్రకంపనలు పుట్టించాయి ఈ జనవరిలో. ఈ కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. బాధితురాలిని చంపేయాలన్న ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన దేశ రాజధానిలో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు 20 ఏళ్ల బాధితురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లి, ఓ గదిలో బంధించి ఆడవాళ్ల సమక్షంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఊరేగించారు. జుట్టు కత్తిరించి, ముఖానికి మసి పూసి కస్తూర్బా వీధుల వెంట ఆమె మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి కొట్టుకుంటూ నడిపించారు. పోలీసుల ఎంట్రీతో.. వాళ్లంతా ఆమెను వదిలేసి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరగ్గా.. ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతీకారంగానే.. బాధితురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. బాధితురాలు, నిందితుల కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు స్నేహితులు. అయితే.. కిందటి ఏడాది నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు ఆమే కారణమని ఆరోపించింది కుర్రాడి కుటుంబం. ఆమె వల్లే తప్పతాగి.. రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కుటుంబం అంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో.. ప్రతీకారంతో ఈ హేయనీయమైన చేష్టలకు పాల్పడింది. ఛార్జ్‌షీట్ వివరాలు.. మొత్తం 762 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది ఈ కేసులో. ఈ ఘాతుకం తర్వాత ఆమెను చంపేయాలన్న ఉద్దేశంతో నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 21 మంది పేర్లను ఛార్జీ షీట్లో పొందుపర్చగా.. 12 మంది మహిళలు, నలుగురు మగవాళ్లు, ఐదుగురు మైనర్ల పేర్లను చేర్చారు. నేరపూరిత కుట్ర, సామూహిక అత్యాచారం, హత్య చేయాలనే ప్రయత్నం, దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. తన ఆటోలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సహకరించిన డ్రైవర్ దర్శన్ సింగ్ పేరును సైతం పోలీసులు చేర్చారు. సాక్షులుగా ప్రజలతో పాటు పోలీసుల పేర్లను, డాక్టర్లను సైతం చేర్చారు. మొత్తం 26 వీడియోలు, 12 సోషల్ మీడియా నుంచి.. 14 వీడియోలను నిందితుల మొబైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. యాభై మంది పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగం అయ్యారు. మరోవైపు బాధితురాలి సోదరికి సైతం ఆ కుటుంబం నుంచి లైంగిక వేధింపులు ఎదురుకాగా.. ఆమె ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. 10 లక్షల సాయం.. ఇదిలా ఉండగా.. బాధితురాలిగా ఆర్థిక సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఆమె తరపున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వమే ఓ లాయర్ని నియమిస్తుందని మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. -
నన్ను ఆగం చేశారు.. బాధ ఎవరికీ చెప్పలేక..
సాక్షి,మహబూబాబాద్/నెల్లికుదురు/మహబూబాబాద్ రూరల్: ‘నన్ను ఆగం చేశారు.. నా బాధను ఎవరికీ చెప్పుకోలేక.. నేను పిరికి పందను కాదు..’ అంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి ఉత్తరం రాసి తనువు చాలించింది. ఉత్తరంలో తనను ఆగం చేసిన నలుగురి పేర్లు రాయడంతో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా తెలిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇంటికొచ్చి.. గడ్డి మందు తాగి.. ఆలేరుకు చెందిన శ్రీరాం వెంకటనారాయణ, హైమావతి దంపతులకు సుప్రియ (22), కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి లారీ క్లీనర్‌గా వెళ్తున్నాడు. దీంతో కు మార్తె, కుమారుడితో పాటు నానమ్మ, తాతలు జగదాంబ, నర్సయ్య ఉంటున్నారు. ఈ క్రమం లో తమ కుమార్తె కొడుకు పెళ్లి ఉండటంతో నానమ్మ–తాత వేరే గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఇద్దరే ఉండగా సుప్రియ ఈ నెల 16న స్నేహితురాలు స్వప్న ఇంటికెళ్లి తెల్లవారుజా మున వచ్చింది. 17న రాత్రి 8.15 గంటలకు మళ్లీ స్వప్న ఇంటికెళ్లి 15 నిమిషాల్లో వెళ్లిపో యింది. తర్వాత తెల్లవారుజామున 2.30 గం టలకు ఎవరో తరిమినట్టు ఊపిరి బిగబట్టుకొని ఇంటికి వచ్చింది. రాగానే ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఉదయం అక్కను చూసిన తమ్ముడు హుటాహుటిన ఆస్పత్రికి తరలిం చాడు. 5 రోజులు మృత్యువుతో పోరాడి 22న రాత్రి సుప్రియ మృతి చెందింది. చనిపోతానని తెలిశాకే.. యువతి కిడ్నీలు, అవయవాలు పాడ య్యాయ ని, వరంగల్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు డాక్టర్లు చెప్పగా విన్న సుప్రియ తాను చనిపోతానని తెలుసుకొని పక్కనున్న గ్రామస్తులతో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. మాట్లాడలేకపోవడంతో వాళ్లు కాగితాలు, పెన్ను ఇచ్చారు. దీంతో విషయం పేపర్‌పై రాసినట్లు ఆస్పత్రిలోని వారు చెబుతున్నారు. కాగా, 17న సుప్రియ అత్యాచారానికి గురైనట్లు పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసేటప్పుడు నిందితులు ఫొటోలు తీశారని, విషయం బయటపెడితే ఫొటోలు అందరికీ చూపిస్తామని బెదిరించారని ప్రచారం జరు గుతోంది. అందుకే విషయం ఎవరికీ చెప్ప లేదని, చనిపోతానని తెలిశాక పేపర్‌పై నింది తుల పేర్లు రాసిందని బంధువులు అంటు న్నారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో సుప్రియ మృతదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు సందర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అదుపులో ముగ్గురు.. మృతురాలు తమ్ముడి ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేశాం. 17న రాత్రి అత్యాచా రానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు కారణమైన నలుగురి పై కేసు నమోదు చేశాం. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నాం. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నాం. – ఎస్పీ శరత్చంద్ర పవార్, మహబూబాబాద్ -
జయపురం, కొట్‌పాడ్‌లలో విస్తృతంగా దర్యాప్తు
జయపురం/కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందులి గ్యాంగ్‌రేప్ బాధితురాలి కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ పంపించిన దర్యాప్తు బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ దర్యాప్తు చేస్తోంది. కొరాపుట్, కుందులి, బాధితురాలి గ్రామం ముషి గుడలను సందర్శించి ఆయా ప్రాంతాలలో అనేక మందిని, ముఖ్యంగా ఆమె బంధువర్గాన్ని ఆమెకు వైద్యసేవలందించిన డాక్టర్లను, పోలీసులు విచారణ చేసిన తరువాత జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించింది. ఈ పర్యటనలో ఆమెను ఉంచిన ప్రాంతాలను, వైద్య చికిత్స చేసిన జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ ఆస్పత్రిని సందర్శించి అనేక విషయాలను తెలుసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్‌లో కొంతమంది జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించి అనేక విషయాలపై దర్యాప్తు జరిపినట్లు సమాచారం. రవిసింగ్ నేతృత్వంలో టీమ్ మొదట కొట్‌పాడ్ వెళ్లి అక్కడ శిశు పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఆ కేంద్రంలో కుందులి బాధితురాలిని అధికారులు కొన్ని రోజులు ఉంచారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఇతరులతో ఎలా ఉండేది, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆమె అక్కడ ఉన్న వారితో ఏమైనా చెప్పిందా? ఎన్నాళ్లు కేంద్రంలో ఉంది? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తి వివరాలు సేకరించిన టీమ్ జయపురం వచ్చి బాధితురాలిని అధికారులు కొద్దిరోజులు ఉంచిన స్టేహోంను సందర్శించింది. అక్కడ ఉన్నవారిని బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది. వైద్యాధికారి విచారణ ఆమె స్టేహోంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఎక్కడికి తీసుకు వెళ్లారని స్టే హోం నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. ఆ సమయంలో బాధితురాలిని జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని ఆస్పత్రిని సందర్శించింది. హాస్పిటల్లో బాధితురాలు ఉన్న సమయంలో ఆమెకు ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో టీమ్ ప్రతినిధులు పలువురు ఆస్పత్రి ఉద్యోగులను విచారణ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జయపురం హాస్పిటల్లో ఉన్న సమయంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై సబ్‌డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారి డాక్టర్ దొధిబామణ త్రిపాఠిని ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడి నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్ భరిణిపుట్ గ్రామ పంచాయతీ బి.మాలిగుడలో బాధితురాలి బంధువుల ఇంటికి వెళ్లి వారికి తెలిసిన వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో మానవ హక్కుల కమిషన్ బృందంతో పాటు కొరాపుట్ జాల్లా శిశు సురక్షా సమితి అధికారి, పోలీసులు ఉన్నారు. -
'ఆమె చదువుకయ్యే ఖర్చు భరిస్తాం'
వీణవంక (కరీంనగర్) : చల్లూరులో గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలి ఉన్నత చదులకయ్యే ఖర్చు వైఎస్సార్సీపీ భరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం వీణవంకలో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ఆమెకు మనో ధైర్యాన్ని కలిగించారు. ఆమె న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని సింగిరెడ్డి హామీ ఇచ్చారు.