
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. పొటిలికల్ లీడర్లు పార్టీ నేతలకు షాకిస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బీజేపీకి షాకిచ్చారు.
ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా భిక్షమయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురయ్యాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక లాభం కోసమే ఉప ఎన్నిక వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, భిక్షమయ్య గౌడ్ ఆయన అనుచరులతో కలిసి కొద్దినెలల క్రితమే బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment