Budida Bikshamaiah Goud
-
భువనగిరికి భిక్షమయ్య?
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న భువనగిరి, నల్లగొండ స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఉన్నందున భువనగిరి సీటును అదే సామాజిక వర్గానికి చెందిన భిక్షమయ్యగౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భిక్షమయ్య వైపు మొగ్గు భువనగిరికి అభ్యర్థి ఎంపికలో బీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. సామాజికవర్గాల వారీగా పలువురు నేతల పేర్లను పరిశీలించింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌న్‌రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్‌రెడ్డి, జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్‌కు చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. అయితే పైళ్ల శేఖర్‌రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలిసింది. అలాగే డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే పోటీలో ఉంటానని ప్రకటించారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. -
బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్లోని డొల్లతనానికి అద్దం పడుతోంది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై -
ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. పొటిలికల్ లీడర్లు పార్టీ నేతలకు షాకిస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బీజేపీకి షాకిచ్చారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా భిక్షమయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురయ్యాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక లాభం కోసమే ఉప ఎన్నిక వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భిక్షమయ్య గౌడ్ ఆయన అనుచరులతో కలిసి కొద్దినెలల క్రితమే బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందజేశారు. -
ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకుందాం: బిక్షమయ్యగౌడ్
సాక్షి. యాదగిరిగుట్ట : కాంగ్రెస్ సారథ్యంలో వస్తున్న ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రజాఫ్రంట్తోనే నేరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బీర్ల అయిలయ్య, కళ్లెం కృష్ణ, కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా తుర్కపల్లి : తనను ఆశీర్వదిస్తే.. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు : బూడిద భిక్షమయ్య
సాక్షి, బొమ్మలరామారం : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అ డ్డుకోలేదని ఆలేరు అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, కాండ్లకుంట తండా, గోవింద్ తండా, లక్క తండా, సీత తండా, చీకటిమామిడి, సోలిపేట్, ప్యారారం, తి మ్మాపూర్, బోయిన్పల్లి గ్రామాల్లో సోమవారం ని ర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్æ పార్టీకే పట్టం కట్టాలన్నారు. మరోసారి తనను ఆదరించి ఆలేరు అభివృద్ధికి దో హదం చేయాలని భిక్షమయ్యగౌడ్ ఓటర్లను కో రారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. ఆడ పిల్లలకు వరంలాంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఆరు లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు, ఐదు లక్షల వ్యయంతో బీసీ ఓసీ లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుం బమే బంగారుమయం చేసుకున్నాడన్నారు. కేసీ ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకితోసి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పీఏ సీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేష్, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడమటి పావని, తిరుమల కృష్ణగౌడ్, అన్నెమైన వెంకటేష్, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, ఎనగండ్ల వీరేశం, మాందాల రామస్వామి, చీర సత్యనారాయణ, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మ హదేవుని రాజు, మోటే వెంకటేష్, గుర్రం శ్రీని వాస్‌రెడ్డి, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బో యిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, చంద్రశేఖర్, మోహన్‌నాయక్, రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సోమవా రం గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.ఆలేరు మ హాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ కాం గ్రెస్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, క్రిష్ణ, రామిడి బాల్‌రెడ్డి, ఇప్పల పల్లి స్వామి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజాపేటలో.. రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రంగ కిష్టయ్య గౌడ్, రంగ బాలస్వామి గౌడ్‌లతోపాటు 50 మంది యువకులు సోమవారం డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ గెలపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని పాండు, కార్యదర్శి రంగ నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రంగ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలేరును పునర్నిర్మాణం చేస్తా : బూడిద భిక్షమయ్యగౌడ్
సాక్షి, యాదాద్రి : ఆలేరు నియోజకవర్గం ధ్వంసమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రజలు కోరుకున్న ఫలాలు అందలేదు. సాగు, తాగునీటికి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు సమస్యలపై ప్రజలనుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీటికి పెద్దపీట వేస్తాను. చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేయడంతోపాటు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో ఆలేరు పునర్నిర్మాణానికి కృషి చేస్తానంటున్నారు.. ఆలేరు ప్రజాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? భిక్షమయ్యగౌడ్ : ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రెండేళ్లుగా గడపగడపకూ కాంగ్రెస్ పేరుతో ప్రజల మధ్యనే ఉన్నా. గ్రామాల్లో ఎక్కడకు వెళ్లినా ప్రజాకూటమి అభ్యర్థిగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రతిపక్షాల అంచనాలను మించి భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. సాక్షి: నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేమిటి? భిక్షమయ్యగౌడ్: సాగు, తాగునీరు ప్రధాన సమస్య. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి రాజాపేట, ఆలేరు మండలాలకు, నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలానికి, బునాదిగాని కాల్వ నుంచి ఆత్మకూరు మండలాలకు సాగునీరు రావడం లేదు. పూర్తి చేయడంలో పాలకులు విఫలమయ్యారు. ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు కాలేదు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారు బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి లేక రైతులు, యువత వలసపోతున్నారు. సాక్షి: మీరు గెలిస్తే ఏమి చేస్తారు? భిక్షమయ్యగౌడ్: ప్రధానంగా సాగు నీటి సాధన కోసం కృషి చేస్తాను. తపాస్‌పల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్లు, బునాదిగాని కాల్వల ద్వారా రైతాంగానికి సాగు నీరందించడమే లక్ష్యం. పాడి రైతుల కోసం వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తా. యాదగిరిగుట్ట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతా. ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతా. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయిస్తా. జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రిభువనగిరి జిల్లాలోకి తీసుకువస్తా. చేనేత కార్మికులకు సిరిసిల్ల ప్యాకేజీ ఇప్పిస్తాం. ప్రతి 500 జనాభాకు ఒక వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. మరిన్ని వార్తాలు... -
కేసీఆర్‌కు ఓటమి భయం
సాక్షి, ఆలేరు : సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఇక ఫాంహౌస్‌కే పరిమితం కావాలని ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. మండలంలోని రాఘవాపురం, గుండ్లగూడెం, శ్రీనివాసపురం, కందిగడ్డతండా, శివలాల్‌తండా, కొల్లూరు తదితర గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మాటతప్పిన కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేక, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులతో పాటు సామాన్యుడి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అలాగే మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో దోచుకున్న అవినీతి సొమ్ముతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపాదికన చేపట్టేందుకు తనను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టోను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో భిక్షమయ్యకు స్వాగతం పలికారు. కందిగడ్డతండాలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగాం ఉపేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నీలం పద్మ, దూసరి విజయ, దూసరి ఆంజనేయులు, పుట్ట మల్లేషం, సందుల సురేశ్, ముదిగొండ శ్రీకాంత్, జూకంటి ఉప్పలయ్య, జంపాల దశరథ, శ్రీను, హరిలాల్, కృష్ణ, రవి, మోతిలాల్, వెంకటేశ్, ప్రేం రాజు, భీంరాజు, రాజు, లక్ష్మీ, విజయ, అనిత, శాంతి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
బూడిద భిక్షమయ్య గౌడ్ - లీడర్‌తో
-
తెలంగాణలో పెరిగిన రాజ్యహింస
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయిందని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడమే దీనికి నిదర్శనమని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. యాదగిరి గుట్టలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన రోజు నే అరెస్టులు చేయడం ఇది ప్రజాస్వామ్యమా.. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిం చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇక్కడి ప్రజలు బాగుపడుతారనుకుంటే.. బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో నయా నవాబు, దొరల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో గొల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసి, ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రసంగించిన కేసీఆర్.. నాలుగేళ్లైనా ఇప్ప టి వరకు ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 4,860 పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంతా విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కాంట్రా క్టర్లు, కమిషన్ల కోసమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. తెలం గాణలో కేసీఆర్ కుటుం బం, టీఆర్ఎస్ నాయకులే బాగుపడుతున్నారని, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, అధికారంలో వస్తామని, అప్పు డు సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందే విధంగా కృషిచేస్తామన్నారు. సూర్యాపేటలో అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులు వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రసిడెంట్ కలకుంట్ల బాల్‌నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి గుడ్ల వరలక్ష్మి, మండల, పట్టణ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి నర్సింహగౌడ్, నాయకులు తంగళ్లపల్లి సుగుణాకర్, గాంధీ, రాజేష్, రాజిరెడ్డి, నర్సయ్య, గుజ్జ శ్రీనివాస్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుంది
డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లెర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరేష్ తల్లిదండ్రులు వెంటకయ్య–ఇందిరమ్మలను పరామర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు çశ్రీనివాసరెడ్డి చేతిలో హత్యకు గురయినట్లు వెంకటయ్య తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ మండల అ«ధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, కొరటికల్ సర్పంచ్ కొడిమాల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, సింగిల్‌విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడే నాగేష్, మండల ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, నాయకులు కట్టెకోల హన్మంతుగౌడ్, పోతగాని మల్లేశంగౌడ్, మహేష్ ఉన్నారు. -
ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
ఆలేరు : నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులోని ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొలుపుల హరినాథ్ కె సాగర్‌రెడ్డి, ఎండీ జైనోద్దీన్, పల్లె సంతోష్, నీలం పద్మ, గ్యాదపాక నాగరాజు, ఇల్లెందుల మల్లేశం, జంపాల దశరథ, బేతి రాములు, పుట్ట మల్లేశం, ఎగ్గిడి యాదగిరి, ముదిగొండ శ్రీకాంత్, ఎండీ బాబా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్
ఆలేరు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక పద్మావతి ఫంక్షన్హాల్లో గురువారం నియోజకవర్గ స్థాయిలో మహిళా సాధికారత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశారని.. నేడు విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి ఊసు, రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని, మిషన్ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు తాను ఏదో చే స్తున్నట్టు గారడీ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని డి.శ్రీనివాస్ లాంటి వారు పార్టీని వీడడం వల్ల వచ్చే నష్టమేమీలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని స్పష్టం చేశారు. సర్పంచ్‌లు కందగట్ల నిర్మల, దూసరి విజయ, నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం వెంకటస్వామి, కె.సాగర్‌రెడ్డి, బబ్బూరి రవీంద్రనాథ్, అర్కాల గాల్‌రెడ్డి, నీలం పద్మ, జూకంటి రవీందర్, ఎంఏ ఎజాజ్, కందుల శంకర్, రామకృష్ణారెడ్డి, తిరుమల్లేశ్ పాల్గొన్నారు. -
ఇద్దరు సీఎంలు దోషులే..
గుండాల : రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులిద్దరూ దోషులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. శనివారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పదవులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రులు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను పక్కతోవ పట్టించడానికి ఓటుకు కోట్లు పేరుతో ఒకరు, ఎమ్మెల్యేలు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మరొకరు కపట నాటకాలు ఆడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చడాన్ని మరిచి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వేల కోట్లతో ప్రారంభించిన చెరువుల పూడికతీత పనులు ఎక్కడ పూర్తయ్యాయో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ కాకతీయలో అక్రమంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. మాయమాటలు చెప్పి పార్టీలు మార్చేందుకు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ దుంపల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మాదరబోయిన సునీత, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన పోరు
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. యాదగిరిగుట్టలో శనివారం డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భువనగిరి : ‘యాదగిరిగుట్ట సభావేదికపై వెల్లివిరిసిన ఐక్యతతో ప్రజావ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. 2019 ఎన్నికల్లో విజయం కోసం ఇక్కడి నుంచే రాజీలేని పోరాటం చేయా.. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే వరకు మేమంతా నిద్రపోయేది లేదు’ అని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం గుట్టలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ ఆయకట్టులో రెండవ పంటకు నీరిచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుతానికి సాగర్‌నీటి విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా శాసనసభలో ప్రకటించిందన్నారు. రబీలో నీరివ్వడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదన్నారు. కొందమంది స్వార్థనాయకులే కాంగ్రెస్ వల్ల లాభపడి , టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అలాంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. పార్టీకి కొండంత అండగా పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు. భవిష్యత్ అంతా యువతదేనన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సమాయత్తం కావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా ముందుకుపోతామని అందరి ఆమోదం ఉన్న వారిని పోటీలో ఉంచుతామన్నారు. కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ కి చెందిన వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా సహించి ఊరుకోబోమని హెచ్చరించారు. అందరిని కలుపుకొని పోతా : భిక్షమయ్యగౌడ్ జిల్లాలో పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోతానని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తెలిపారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు.టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలను ఎండగడతామన్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ముందుకుసాగుతామన్నారు. పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం : గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పార్టీనే ఫణంగా పెట్టిన దేవత సోనియా అని కొనియాడారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి ఆమె రుణం తీర్చుకోవాలని కోరారు. ఉన్నవారు పార్టీని వీడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతం అందరిపై ఉందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా : పాల్వాయి కార్యకర్తలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో పార్టీ ని పటిష్ఠపరిచి , వలసలు నివారించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ రుణం తీర్చుకునేలా వ్యవహరించాలన్నారు. పదవులు ముఖ్యం కాదు - కోమటిరెడ్డి కార్యకర్తలకు అండగా ఉండడానికి తనను ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. తమకు పార్టీ తప్ప పదవులు ముఖ్యం కాదని పార్టీ కన్నతల్లి లాంటిదన్నారు. అలాంటి పార్టీకి ఎవరూ ద్రోహం చేయరన్నారు. తాను పదవులను కూడా లెక్క చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నానన్నారు. శాసనసభలో జానా గళమెత్తాలి : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి ప్రభుత్వంపై శాసన సభలో ప్రతిపక్షనేత జానారెడ్డి గళమెత్తాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శాసన సభలో ప్రజా సమస్యలపైమీగొంతు తప్పా కేసీఆర్‌తో సహా ఎవరి గొంతు వినపడవద్దన్నారు. కేసీఆర్‌పైన యుద్ధం ప్రకటిద్దామన్నారు. 10 సంవత్సరాల తర్వాత జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిపిన జిల్లా అధ్యక్షుడు బిక్షమయ్యగౌడ్ అభినందనీయుడన్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇచ్చినా ముందుండి పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, వేదాసు వెంకయ్య, టి. దేవేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి,జి. నారాయణరెడ్డి, మోతె సోమిరెడ్డి, అద్దంకి దయాకర్, బొందుగుల నర్సింహారెడ్డి,పోతం శెట్టి వెంకటేశ్వరు,్ల గర్దాసుబాలయ్య, సుంకరి మల్లేషం, రాపోలు జయప్రకాష్, పోత్నక్ ప్రమోద్‌కుమార్,బర్రె జహంగీర్, కర్నాటి లింగారెడ్డి, రామకృష్ణారెడ్డి, బీర్ల ఐలయ్య, టి. రవికుమార్, గుడిపాటి నర్సయ్య పాల్గొన్నారు.