ఆలేరు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో గురువారం నియోజకవర్గ స్థాయిలో మహిళా సాధికారత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశారని.. నేడు విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి ఊసు, రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని, మిషన్ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు తాను ఏదో చే స్తున్నట్టు గారడీ చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని డి.శ్రీనివాస్ లాంటి వారు పార్టీని వీడడం వల్ల వచ్చే నష్టమేమీలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని స్పష్టం చేశారు. సర్పంచ్‌లు కందగట్ల నిర్మల, దూసరి విజయ, నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం వెంకటస్వామి, కె.సాగర్‌రెడ్డి, బబ్బూరి రవీంద్రనాథ్, అర్కాల గాల్‌రెడ్డి, నీలం పద్మ, జూకంటి రవీందర్, ఎంఏ ఎజాజ్, కందుల శంకర్, రామకృష్ణారెడ్డి, తిరుమల్లేశ్ పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్
Published Thu, Jul 9 2015 11:28 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement