
మాట్లాడుతున్న బూడిద భిక్షమయ్యగౌడ్
సాక్షి. యాదగిరిగుట్ట : కాంగ్రెస్ సారథ్యంలో వస్తున్న ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రజాఫ్రంట్‌తోనే నేరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బీర్ల అయిలయ్య, కళ్లెం కృష్ణ, కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
తుర్కపల్లి : తనను ఆశీర్వదిస్తే.. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment