grand alliance
-
బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలది మరోదారి: మమత
కూచ్‌బెహార్: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల చర్యలు రాష్ట్రంలో బీజేపీకి లాభం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. కూచ్‌బెహార్‌లో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు మేం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, బెంగాల్‌ల్లో మాత్రం సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి. అటువంటి అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాం’అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు ఆధిర్ రంజన్ ఛౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఎంసీ విశ్వసనీయతపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమకు చెప్పే అర్హత మమతా బెనర్జీకి లేదని సీపీఎం ఎదురుదాడి చేసింది. ఈ నెల 23న బిహార్‌లోని పట్నాలో సీఎం నితీశ్ సారథ్యంలో 12కు పైగా రాజకీయ పార్టీల నేతలు సమావేశమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలని వీరు నిర్ణయించారు. తాజాగా మమతా బెనర్జీ మరో బాంబు పేల్చడం గమనార్హం. -
నితీష్‌తో భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం మమతా కీలక వ్యాఖ్యలు
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన నేడు(సోమవారం) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పశ్చిమబెంగాల్ సచివాలయానికి చేరుకున్న ఆయన.. దీదీతో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి ఇగో(అహం) లేదని స్పష్టం చేశారు. అందరం కలిసి సమష్టిగా ముందుకు వెళ్తామని తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా జరగనున్నాయని, ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి రావడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’ నితిష్ కుమార్‌ను తను ఒక్కటే అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ ఉద్యమం ప్రారంభించిన బిహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మన తదుపరి కార్యచారణ ఏంటో నిర్ణయించుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. అయితే ముందుగా మనం ఐక్యంగా ఉన్నామనే సందేశం ప్రజలకు చేరాలని ఇందులో తనకేం అభ్యంతరం లేదని చెప్పారు. ‘బీజేపీని జీరో చేయడమే నాకు కావాలి. మీడియా సపోర్టు, అబద్ధాలతో వారు హీరోలయ్యారు’ అని మమతా పేర్కొన్నారు. అయితే ఇటీవల లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య అరుదైన ఐక్యత చోటు చేసుకుంది. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌ల భేటీతో బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా దాదాపు అన్ని పార్టీల నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు నితీష్. బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకు సాగేందుకు విపక్షాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశయ్యారు. మమతాతో భేటీ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కుమార్‌తో కూడా చర్చలు జరపనున్నారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
‘మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి’
పట్నా : నూతనంగా ఏర్పాడిన కేంద్ర మంత్రి వర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ రబ్రీ దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్ కుమార్ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ మహాకూటమిలో చేరతానంటే మాకేం అభ్యంతరం లేదు. మేం ఆయనను స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆర్జేడీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘువంశ ప్రసాద్ సింగ్ స్వాగతించారు. అయితే నితీష్ ఎప్పుడు ఎవరి వైపు మారతాడో.. ఎవరికి మద్దతిస్తాడో ఊహించలేం అన్నాడు. గతంలో చాలా సార్లు అతను ఇలానే చేశాడని గుర్తు చేసుకున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునే వారికి తాను మద్దతిస్తానని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. ఎన్డీఏతో చేరిన సంగతి తెలిసిందే. -
‘నితీష్జీ కూటమిలో చేరండి’
పట్నా : కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్ కుమార్ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాషాయ పార్టీ నిర్ణయంతో నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్ కంగుతున్నారు. ఎన్డీయేలో అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించిన నితీష్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చని పేర్కొనడం గమనార్హం. -
‘మహా కూటమి’ ఏర్పడితే ఏమయ్యేది ?!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా పటిష్టమైన మహా కూటమిని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడం వల్లనే మరోమారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రయ్యారంటూ రాహుల్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమితో జతకట్టి ఉన్నట్లయితే, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాదితో విభేదాలు పరిష్కరించుకున్నట్లయితే, ఢిల్లీలో ఆప్‌తో జతకట్టి ఉన్నట్లయితే ఫలితాలు వేరుగా ఉండేవని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. వారి వాదనలో నిజమెంత? వారన్నట్లుగా ఇవన్నీ పక్షాలు కలిసి మహా కూటమిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవి ? ఏడాది క్రితం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు ఏకమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయన్న ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది కుదిరి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వల్ల 38 సీట్లకుగాను 37 సీట్లను ప్రతిపక్షాలు గెలుచుకోగలిగాయి. బీహార్‌లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌తోనే కాకుండా అన్ని ప్రతిపక్షాలతో కలిసి మహా కూటమిగా పోటీ చేసినా 40 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేపీ ప్రభంజనాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా దాన్ని అడ్డుకునేవి కావు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో 159 సీట్లు ఉండగా, కాంగ్రెస్–మిత్రపక్షాలకు పది సీట్లు రాగా, కూటమిలో చేరే అవకాశం ఉండిన పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 132 సీట్లు వచ్చేవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకపక్షాలన్నింటితో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఉన్నట్లయితే ఈ కూటమికి అదనంగా 18 సీట్లు వచ్చేవి. అంటే బీజేపీకి కూటమికి 104, వ్యతిరేక కూటమికి 45 వచ్చి ఉండేవి. ఆయా పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఈ లెక్క తేలింది. పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఒక్క పార్టీకి వచ్చే ఓట్ల శాతం పూర్తిగా ఇతర పార్టీలకు రావు. ఆ లెక్కన ఈ 18 సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అఖిల భారత ఐక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఏఐయుడిఎఫ్)తో పొత్తు పెట్టుకున్నట్లయితే కరీంగంజ్ నియోజకవర్గంలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కృఫాల్నాథ్ మల్లా 44.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. అక్కడ ఫ్రంట్ అభ్యర్థి రాధేశ్వామ్ బిశ్వాస్కన్నా బీజేపీ అభ్యర్థికి కేవలం 3.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్ దాస్‌కు 11.36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ శాతాన్ని కూడితే ఫ్రంట్ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం అంతా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా భావిస్తోన్న ఫ్రంట్ అభ్యర్థికి ఓటు వేశారు. ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నట్లయితే కొత్త మంది ముస్లింలు ఓటింగ్‌కే వచ్చేవారు కాదు. ఢిల్లీలో ఢిల్లీలో చివరకు ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని ఇరువర్గాలు భావించాయి. ఆ రెండు కలిస్తే బీజేపీకి గట్టిపోటీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అది జరిగి ఉండేది కాదు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో 50 శాతానికిపైగా ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీకే సహజంగా ఓటు వేస్తారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని జన్నాయక్ జనతా పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్లయితే ఒక్క రోహతక్ నియోజకవర్గం సీటు మాత్రమే కాంగ్రెస్ కూటమికి వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థికి 21,211, బీఎస్పీకి 38,364 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క పార్టీతోని పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ కూటమికి ఈ సీటు వచ్చేది. మహారాష్ట్రలో మహారాష్ట్రలో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉన్నట్లయితే కాస్త మంచి ఫలితాలే వచ్చేవి. అంటే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదితో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పొత్తు పెట్టుకున్నట్లయితే బుల్దానా, హాత్కనంగల్, పర్భణి, సోలాపూర్, నాందేడ్, సాంగ్లీ, గడ్చీరోలి చిమూర్...ఏడు సీట్లను గెలుచుకునేది. అంటే కాంగ్రెస్ కూటమికి ఐదు బదులు 12 సీట్లు వచ్చేవి. బీజేపీ–శివసేన కూటమికి 41కి బదులు 34 వచ్చేవి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, తన మిత్రపక్షమైన జన అధికార్ పార్టీతో కలిసి ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో కలిసి పోటీ చేసినట్లయితే దౌరాష్ట్ర, మీరట్, బదౌన్, బారబంకి, బాండా, సుల్తాన్పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, ఛందౌలి...తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చేవి. అంటే రాష్ట్రంలోని 80 సీట్లకుగాను మహా కూటమికి 24 సీట్లు వచ్చేవి. బీజేపీ కూటమికి 64కు బదులు 56 సీట్లు వచ్చేవి. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 18 సీట్లు పెరిగేవి, బీజేపీ కూటమికి 18 సీట్లు తగ్గేవి. దీనివల్ల ఫలితం ఏమీ ఉండేది కాదు. -
చంద్రబాబు గేమ్ ప్లాన్‌కి మమత బ్రేక్
-
‘రాహుల్ వల్లే కూటమి నుంచి తప్పుకొన్నాను’
పట్నా : రాహుల్ గాంధీ వల్లే తాను మహాకూటమి నుంచి బయటకు వచ్చానని తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ విషయం గురించి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల రాహుల్ గాంధీ ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం వంటి అంశాలను నేను ఎన్నటికి అంగీకరించను. ఆర్జేడీ విధానాలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవు. దాంతో వారితో కలిసి పనిచేయడం నాకు చాలా కష్టంగా మారింద’ని తెలిపారు. అంతేకాక ‘ప్రతి విషయంలో వాళ్లు నాకు అడ్డుపడేవారు. ఆ పార్టీ కార్యకర్తలు నా అనుమతి లేకుండానే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసేవారు. ఇవన్ని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. అయితే వీటన్నింటి గురించి రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో నేను కూటమి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు. -
మోదీ సర్వేలో విపక్ష కూటమిపై ప్రశ్న
న్యూఢిల్లీ: ‘బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న మహా కూటమి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా?’.. ఈ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన నమో యాప్‌లో నిర్వహిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ సర్వేలోనిది. దీంతో పాటు పలు ఇతర ప్రశ్నలకు కూడా ఈ సర్వేలో పాల్గొనేవారు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా పౌరులను కోరుతూ ఓ చిన్న వీడియోను తన ట్విటర్ హ్యాండిల్లో సోమవారం ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘నమో యాప్‌లో ఓ సర్వే ప్రారంభమైంది. అందులో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నా. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మాకు తోడ్పడుతాయి’ అని అందులో మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం, అవినీతి రహిత పాలన, స్వచ్ఛభారత్, మౌలిక వసతులు, చవకగా ఆరోగ్యం, ఆర్థిక రంగం, జాతీయ భద్రత, ఉపాధి, గ్రామీణ విద్యుదీకరణ.. తదితరాలపై పలు ప్రశ్నలున్నాయి. -
బెడిసి కొట్టిన రాజకీయ క్రీడ
సందర్భం ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో విలక్షత కన్పించింది ఒక్క తెలంగాణలోనే. తక్కిన 4 రాష్ట్రాలలో ఓటర్లు మార్పును ఆశించారు, ఆహ్వానించారు. తెలంగాణ ఓటరు మాత్రం తమకు ఆ అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజా కూటమి పేరుతో సిద్ధాంతరాహిత్యంతో ఒక్కటై పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం, టీజెఎస్, సీపీఐలకు ఎదురైంది ఓటమి అనేకంటే ఘోరపరాభవం అనడం సముచితం. బలం లేకున్నా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయి బీజేపీ తన పరువు తానే తీసుకొంది. కుల పార్టీలతో కలిసి ‘బహుజన లెఫ్ట్ పార్టీ’గా సీపీఎం జనం ముందుకెళ్లినా లభించింది సున్నాయే! సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్ఎస్ : కేసీఆర్ పాలనలో ఎన్నదగినది ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయడం. బడ్జెట్ నిధుల్లో 39% మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొక్కుబడిగా కాకుండా నిజాయితీగా, చిత్తశుద్ధితో తమ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు కృషి చేయడాన్ని వేరొకరు కాకుండా ఆయా వర్గాలు గ్రహించగలిగాయి. విశిష్ట పథకాలుగా కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ, పండుగలకు పేదలకు అభివృద్ధి కానుకల పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూవ్ు ఇళ్ల నిర్మాణం మొదలైన పథకాలు సామాన్యులను ప్రభావితం చేశాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొదలైనవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటికన్నా మిన్నగా రైతు భీమా, వ్యవసాయ పెట్టుబడి రాయితీలు, సాగునీటి పథకాలు, హామీ మేరకు వ్యవసాయ రుణమాఫీ లాంటివి రైతాంగంలో ఎనలేని భరోసా కల్గించగలిగాయి. పైగా, గొర్రెల పంపిణీ, పాల పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ లాంటివి సామాన్యుని మనో ధైర్యాన్ని పెంచాయి. కనుకనే ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా, వాటిని చెవికెక్కించుకోకుండా ప్రజలు తమ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చాటుకున్నారు. ప్రజా కూటమి విఫలం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పార్టీ తొలి రోజు నుండి టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాట నిజమే. అయితే, 2014లో ఎదురైన ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ఆధిపత్య ధోరణులు తగ్గలేదు. దానికితోడు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత, ఎక్కువ పెత్తనం అప్పజెప్పడం చాలామందికి మింగుడు పడలేదు. పీసీసీ అధ్య క్షుడ్ని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడ్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తులపరంగా అధికార పార్టీని విమర్శించడంలో కాంగ్రెస్ నేతలు ముందున్నప్పటికీ, ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించలేకపోయారు.మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తన సహజలక్షణాలను విడిచిపెట్టలేదు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలపడలేదు. ఇక, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో జతకట్టడం ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశమైంది. నిర్మాణం గానీ, నాయకులు గానీ లేని కోదండరావ్ పార్టీని కలుపుకోవడం కాంగ్రెస్ చేసిన మరో తప్పిదం. సీపీఐను కలుపుకోవడం వల్ల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంతమేర లాభం చేకూరింది. మొత్తం మీద ‘ప్రజాకూటమి’ ఏర్పాటు అన్నది సహజ రాజకీయ ప్రక్రియగా జరగలేదు. తెలంగాణ ఉద్యమం ఆసాంతం నడిచింది ఆత్మగౌరవ నినాదాంతోనే. అటువంటిది ప్రజా కూటమి గెలిస్తే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తిరిగి పెత్తనం సాగించ గలడన్న భయాందోళనలు తెలంగాణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కన్పించాయి. చంద్రబాబు పదేళ్ల పాలనలో ‘పల్లెకన్నీరు’ పెట్టింది. రైతాంగం, చేనేతలు, కులవత్తులవారి ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెలంగాణ పల్లెల్లో మత్యు ఘోష విన్పించింది. ఫలితంగానే, టీఆర్ఎస్కు ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చి ప్రజాకూటమిని మట్టి కరిపించారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అనుభవాన్ని దష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా వెళ్దామని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొంటే.. దండిగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుతాయన్న ఆశ కొందరిలో బలంగా ఉంది. డబ్బుతో కొన్ని సీట్లయినా గెలవచ్చునని కొందరు కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ‘టీ’ అంటే తినడం; ‘డీ’ అంటే దోచుకో వడం; ‘పీ’ అంటే పంచుకోవడంగా టీడీపీ తయారైందని, చంద్రబాబు రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ కార్యకర్తలకు పాఠాలు బోధించింది. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్లు ఏ పార్టీనైతే నాలుగున్నరేళ్లుగా విమర్శిస్తూ వస్తున్నారో.. ఆ పార్టీతో జాతీయస్థాయిలో, తెలంగాణలో చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పొత్తును సమర్థించుకోవడానికి చూపగల హేతుబద్ధమైన కారణం ఏదీ రాష్ట్ర కాంగ్రెస్ వద్ద లేదు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష, జ్ఞానభేరి మొదలైన కార్యక్రమాలను ప్రజాధనంతో నిర్వహిస్తూ.. ఆ వేదికల నుండి తను ఎందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నారు. తమ కలయికకు నైతికత ఆపాదించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర విభజన సహేతుకంగా చేయని ‘పాపి’ కాంగ్రెస్ పార్టీ అని తిట్టిన చంద్రబాబునాయుడు ఆ ‘పాపి’ తోనే చేతులు కలపడాన్ని ఆంధ్ర ప్రజానీకం హర్షిస్తుందా? ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణలో తెలుగుదేశం ఓటమికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడమే కారణమని సొంత మీడియాలో కథనాలు రాయించుకొని పరువు నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం తాపత్రయ పడుతున్నది. మరోపక్క తెలుగుదేశం వల్ల ఓటమి ఎదురైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోలో పల మధనపడుతున్నది కానీ, బాహాటంగా చెప్పడానికి ధైర్యం చేయలేకపోతోంది. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను, ప్రధాని మోదీని గద్దె దించడం ప్రజాస్వామ్య అనివార్యతగా తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది. అవినీతికి పాల్పడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ దేశానికి ప్రమాదకారిగా చంద్రబాబునాయుడు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల అంశంగా అవినీతిని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కావడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివస్తే.. ఆ రెంటి విషయంలో మోదీ ప్రభుత్వం కంటే చంద్రబాబు సర్కార్ అందనంత ఎత్తులో ఉంది. ఈ లెక్కన చంద్రబాబు సర్కార్‌ను ఓడించడం ప్రజాస్వామ్యరీత్యానే కాదు.. రాజ్యాంగరీత్యా, ప్రజా ప్రయోజనాలరీత్యా అనివార్యం! తెలంగాణ ఎన్నికలో చంద్రబాబు సాగించిన రాజకీయ క్రీడ బెడిసికొట్టింది. ఇక మిగిలిందల్లా.. ఏపీ ఎన్నికలే. వ్యాసకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి -
రాహుల్ ‘మహా కూటమి’ కుదిరేనా?
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలోని గురుద్వార్ రకబ్గంజ్ రోడ్డులోని తన నివాసంలో గత వారం జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ప్రఫుల్ పటేల్ ప్రతి ఏడాది శీతాకాలంలో మీడియా ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేస్తారు. ఈసారి అందుకు భిన్నంగా 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రయిన్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, డీఎంకే నాయకులు కనిమోళి, రాష్ట్రీయ జనతా దళ్ నుంచి మిసా భారతిలు హాజరయ్యారు. మాజీ రాజకీయ ప్రత్యర్థులైన యాదవ్, మిశ్రాలు ఒకే టేబుల్‌పై కూర్చోవడం విశేషం. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఒకే వేదికపైకి వస్తున్నామన్న సంకేతానికి చిహ్నంగా వాళ్లంతా విందుకు హాజరయ్యారు. అయితే ఇంతకుముందు భావించినట్లుగా కాంగ్రెస్ నాయకత్వాన మహా కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీ. చిదంబరం, అహ్మద్ పటేల్, గులామ్ నమీ ఆజాద్‌లు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే రాష్ట్రాల వారీగా కూటమిలు ఏర్పాటు చేసుకొని విజయం సాధించిన అనంతరం జాతీయ స్థాయిలో ఒక్క కూటమిగా ఏర్పాటు కావాలని ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా భావిస్తున్నాయి. అందుకనే ఉత్తరప్రదేశ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కోసం అమేథి, రాయ్‌బరేలి నియోజక వర్గాలను వదిలేసి మిగతా అన్ని నియోజక వర్గాల్లో తాము కలసికట్టుగా పోటీ చేస్తున్నామని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయి. యూపీలోని 80 సీట్లకుగాను ఎనిమిది సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ఎస్పీ, బీఎస్పీలు ప్రతిపాదించాయని, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 21 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, అందుకని కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేనదని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎనిమిదయితే ఎనిమిదికే పొత్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా దిగి ఎక్కువ సీట్లలో పోటీ చేసినట్లయితే అది బీజేపీకి లాభిస్తుందని వారు వాదిస్తున్నారు. ఎన్నికల చివరి నిమిషం వరకు పొత్తుపై చర్చలు జరుగుతాయన్నది తెల్సిందే. అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ తణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. 2014లో జరిగిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని బెంగాల్ ప్రదేశ్ కమిటీ కూడా పార్టీ అధిష్టానంను డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే. ఈసారి కాంగ్రెస్, వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేసినట్లయితే మమతా బెనర్జీ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీకి లాభం చేకూర్చినట్లు అవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ పిలుపు మేరకు జనవరి 19వ తేదీన కోల్‌కతాలో జరుగనున్న ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకారదని కూడా బెంగాల్ కాంగ్రెస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆ ర్యాలీకి రాహుల్‌తోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను మమతా బెనర్జీ ఆహ్వానించారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న ర్యాలీకి రాహుల్ వెళ్లకపోతే ఎలా అన్నది పార్టీ అధిష్టానం వాదన. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. -
బీజేపీకి మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, హిందూస్తాన్ అవామ్ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్ స్వాగతించారు. ‘బిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్ జనశక్తి(ఎల్జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్ పాశ్వాన్ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు. -
ఏ ‘మాయ’ చేస్తారో.. బిగ్ ఎనౌన్స్మెంట్ ఏంటీ?
లక్నో: బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టిన రోజు (జనవరి 15) సందర్భంగా బీఎస్పీ-ఎస్పీ కూటమిని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు పలు దఫాలుగా చర్చలు జరిపారని, కాంగ్రెస్ లేకుండా 50-50 సీట్ల ఒప్పందంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీటి మిత్రపక్షమైన ఆర్ఎల్డీని మూడు స్థానాల్లో పోటీలో నిలుపుతున్నట్లు సమాచారం. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేసి బీజేపీ యుందు బొక్కబోర్ల పడ్డ విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేసి కమలం కంచుకోటను బద్దలుకొట్టాయి. ఉపఎన్నికల ఫలితాలను పునావృత్తం చేయాలనే ఆలోచనతో మాయా, అఖిలేష్‌లు మాత్రమే ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారని యూపీలో పెద్దచర్చే జరగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు మాయా పుట్టినరోజున బిగ్ ఎనౌన్సమెంట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈఇద్దరు యూపీ నేతలు డుమ్మాకోట్టారు. ఎన్నికల ముందు పొత్తులకు దూరంగా ఉంటామంటూ, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను బీఎస్పీ దూరంగా ఉంచింది. ఒకవేళ బీజేపీయేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకునేందుకు మాయావతి, అఖిలేష్ సిద్ధంగా లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లే. -
‘ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో తేలుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఖరారు అవుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 2004లో వచ్చిన ఫలితాలే మరోసారి రానున్నాయని, వారి తల రాతలో ఓటమి రాసిపెట్టి ఉందని జోస్యం చెప్పారు. కేవలం ప్రధాని మోదీ వల్ల బీజేపీ ఓటమి చవిచూడబోదని.. ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే ఎన్డీయేకు చెంపపెట్టులా మారతాయని వ్యాఖ్యానించారు. అదే రిపీట్ అవుతుంది... ‘మోదీకి పోటీ ఎవరు అని ఈరోజు బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. 2004లో కూడా వాజ్‌పేయికి పోటీ ఎవరు అంటూ అతి విశ్వాసం ప్రదర్శించారు. ఫలితం ఏమైందో మనందరికీ తెలిసిందే. 2019లో అదే పునరావృతం అవుతుంది ’అని సీతారాం వ్యాఖ్యానించారు. కాగా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని అడగగా...‘ స్టాలిన్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. కానీ మేము ఆయనతో ఏకీభవించలేం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని ఖరారు చేయాలనేది మా అభిమతం’ అని సీతారం పేర్కొన్నారు. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో, సీపీఎం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. -
కేసీఆర్‌కు రెండు ఓట్లు ఎలా ఉంటాయ్: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్ల ఓట్లు పొందారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్ రాఘవరావు అనే పేరు మీద ఒక ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో చంద్రశేఖర రావు సన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద మరో ఓటు హక్కును నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పేర్ల మీద ఓటు హక్కును నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ రెండు ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల అధికారే ఒప్పుకొని క్షమాపణ కోరారని తెలిపారు. అర్హులకు ఓటు హక్కు కల్పించకపోవడం వలన తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది అర్హుల ఓట్లను తొలిగించారన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం చేస్తున్నారని, ఓడకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా? అని రేవంత్ సవాల్ విసిరారు. మహాకూటమిలో కాంగ్రెస్ తొలి స్థానంలో, టీడీపీ రెండవ స్థానంలో, టీజేఎస్, సీపీఐలు తర్వాతి స్థానంలో ఉంటాయని జోస్యం చెప్పారు. -
మా నేతే గెలుస్తడు!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకంగా మారాయి. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అన్న చర్చ జోరందుకుంది. ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానుండగా.. ఆ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయనే దానిపై బెట్టింగ్‌లు కూడా ఊపందుకున్నాయి. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్ సర్వేలు గందరగోళం సృష్టిస్తుండగా.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్లతోపాటు జగిత్యాల, మంథనిలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్ల, రామగుండం, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్ ఫలితాలపైనా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. మిగతా 12 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలను ప్రజాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..? గెలుపు ఓటములపై ఎవరి ప్రభావం ఎంత..? అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. పోరు ప్రతిష్టాత్మకం.. గెలుపుపై ప్రశ్నార్థకం.. లెక్కలు, విశ్లేషణల్లో ప్రధాన పార్టీలు.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ జోరందుకుంది. విశ్లేషణలు, సర్వేలు అటూఇటుగా వస్తున్నా.. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ప్రశ్నార్థకంగా మారాయి. 13 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం నల్లేరుపైనడకగా భావించిన స్థానాల్లో కూడా అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొన్నట్లు నిఘావర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణలే ఇందుకు కారణంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు చెప్తుండగా.. బయట ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా అన్నిస్థానాల్లోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెబుతున్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి, ఇంటలిజెన్స్, ఎగ్జిట్‌పోల్ నివేదికలు ముందరేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు, విశ్లేషణలతో గెలుపోటముల అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బూత్‌కమిటీ సభ్యులుగా వ్యవహరించిన పార్టీ కార్యకర్తలతో సమీక్ష చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో గెలుపుపై జోరుగా సమీక్షలు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. జోరుగా సర్వేలు, విశ్లేషణలు.. అన్ని స్థానాల్లో బెట్టింగ్‌లు.. ఉమ్మడి కరీంనగర్‌లోని అన్నిస్థానాలపైనా సర్వేలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. మరో రెండురోజుల్లో ఫలితాలు వెలువడనుండగా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. హుజూరాబాద్, సిరిసిల్ల, మంథని, జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఇక్కడ అభ్యర్థులుగా ఉండటమే ఇందుకు కారణం. ఈటల రాజేందర్ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా.. హుజూరాబాద్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారన్న చర్చ రెండురోజులుగా జోరందుకుంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే. మహేందర్ రెడ్డి కూడా అదేస్థాయిలో పోటీ ఇచ్చారన్న ప్రచారం ఆ రెండు పార్టీల కేడర్, అభిమానుల్లో బెట్టింగ్‌లకు కారణమవుతోంది. కరీంనగర్ నుంచి మూడోసారి బరిలోకి టీఆర్ఎస్ నుంచి దిగిన గంగుల కమలాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. మంథని నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ పుట్ట మధుకర్, జగిత్యాలలో కాంగ్రెస్ దిగ్గజం టి.జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్‌కుమార్ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా సాగడంపై ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) ధర్మపురిలో గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మానకొండూరులో రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), ఆరెపెల్లి మోహన్ (కాంగ్రెస్), చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగ శోభ (బీజేపీ), వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్), కోరుట్లలో కె.విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్), జె.నర్సింగరావు (కాంగ్రెస్), పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి (టీఆర్ఎస్), సీహెచ్.విజయరమణారావు (కాంగ్రెస్), రామగుండంలో సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), కోరుకంటి చందర్ (ఫార్వర్డ్ బ్లాక్), రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పోటాపోటీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందన్న కోణంలో ఆయా పార్టీల అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారు. -
100 ఖాయం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని, పోలింగ్‌లో తమకే మద్దతు కనిపిస్తోందన్నారు. ఓటమి ఖాయమని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటి నుంచే సాకులు వెతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.మహేందర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. ‘మాకొచ్చిన సమాచారం ప్రకారం 73 శాతం పోలింగ్ జరిగింది. ఇది ప్రభుత్వ అనుకూల ఓటేనని మా నిశ్చిత అభిప్రాయం. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజల తీర్పు ఏకపక్షంగా రాబోతోంది. టీఆర్ఎస్ పాలనకు, సంక్షేమానికి మద్దతుగా ప్రజలు ఓటు వేశారు. జాతీయ చానళ్లు అన్ని టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. టీఆర్ఎస్కు దాదాపుగా వంద సీట్లు రానున్నాయి. మూడింట రెండొంతుల స్థానాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అసెంబ్లీ రద్దు రోజు సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే పోలింగ్ వరకు అదే పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల వారు చేసిన విమర్శలను, వారి గారడీలను ప్రజలు పట్టించుకో ’అని ఆయన పేర్కొన్నారు. కుట్రలన్నీ విఫలమయ్యాయి ‘కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోనున్నా రు. ఇది ఖాయం. ఆ పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న వారు సొంత నియోజకవర్గాలు దాటలేదు. మేం ఫలితాల కోసం వేచి చూస్తున్నాం. 11న టీఆర్ఎస్ విజయోత్సవాలు జరుగుతాయి. ప్రజలు మావైపే ఉన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు వందలకోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నారు. అవన్నీ విఫలమయ్యాయి. గెలుపు సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు ముందుగానే సాకులు వెతుక్కుంటున్నారు. అందుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈవీఎంలలో ఏదో జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అలాగే అనుమానాలు వ్యక్తం చేశారా? ఈవీఎంలనీ.. ఇంకోటని మాకు పనికిమాలిన అనుమానాలు లేవు. కూటమిది అపవిత్ర, అవకాశవాద పొత్తు అని ప్రజలు గమనించారు. బాబు కూటమిలో చేరడం వల్ల ఓడిపోయామని ఫలితాల రోజు మాట్లాడేం దుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై, ప్రజలపై మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ నేతలు ముందే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. ఫలితాల రోజు చూడండి. చంద్రబాబుతో పొత్తు వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు అంటారు. మిగతా విషయాలు 11 తర్వాత మాట్లాడుకుందాం’అని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ధన్యవాదాలు ఎన్నికలలో నిర్వహణపై అధికార యంత్రాంగానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారీగా ఓటిం గ్లో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటింగ్‌కు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, అభినందనలు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఎక్కడా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా, శాంతియుతంగా, ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి, అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అభినందనలు. వినయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలలో మూడు నెలలుగా శ్రమించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు మరో మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి ఈ స్ఫూర్తిని ఓట్ల లెక్కింపు వరకు కొనసాగించాలి. చివరి ఓటు లెక్కించే వరకు అప్రమత్తంగా ఉండాలి’అని మంత్రి సూచించారు. ఓట్ల గల్లంతు జరిగిన మాట వాస్తవమేనని.. పార్లమెంటు ఎన్నికల వరకైనా ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే బాగుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు 75 వేల మెజారిటీ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ 75 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ‘పెరిగిన ఓటింగ్ శాతం అంతా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు టీఆర్ఎస్కు ఓట్లు వేశారు. మాకు ఉన్న సమాచారం ప్రకారం వంద సీట్లలో గెలుస్తాం. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో 75 వేలకుపైగా మెజారిటీతో గెలుస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో టీఆర్ఎస్ 16 నుంచి 17 సీట్లు గెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్లో 12 స్థానాల్లో మాదే విజయం. ఖమ్మంలోనూ మెజారిటీ సీట్లు మాకే వస్తాయి. బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్ దక్కదు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లో మాత్రమే మాకు బీజేపీ పోటీ ఇస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు ఒక్కరూ గెలవరు. బెల్లంపల్లిలోనూ వినోద్ ఓడిపోతారు. అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రజ లు పనితీరును గమనించి తీర్పు ఇస్తారు. రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు’అన్నారు. లగడపాటి సర్వే సన్యాసం లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని.. ఇప్పుడాయనకు సర్వే సన్యాసం కూడా తప్పదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ వచ్చింది. ఉద్యమం దెబ్బకు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవదని లగడపాటి అంటున్నారు. కానీ కచ్చితంగా మేం విజయం సాధిస్తాం. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో రాజగోపాల్ సర్వే సన్యాసం తప్పదు’అని మంత్రి పేర్కొన్నారు. -
ఇక.. ప్రలోభాల జాతర
నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్ చేరడంతో మరింత హాట్‌హాట్‌గా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్ఎస్ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలుపెరగకుండా.. శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్‌లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సైతం.. ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. హోరెత్తించిన కమలదళం బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హాన్స్‌రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్లు ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. ఉరుకులు పరుగులకు తెర ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. -
ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకుందాం: బిక్షమయ్యగౌడ్
సాక్షి. యాదగిరిగుట్ట : కాంగ్రెస్ సారథ్యంలో వస్తున్న ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రజాఫ్రంట్తోనే నేరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బీర్ల అయిలయ్య, కళ్లెం కృష్ణ, కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా తుర్కపల్లి : తనను ఆశీర్వదిస్తే.. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రజాకూటమిదే విజయం... జీవన్‌రెడ్డి
ప్రతిపక్ష శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డ. నా కృషితో ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగినా టీఆర్ఎస్ నాయకులు దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బోర్నపల్లి బ్రిడ్జి పనుల అంచనాలు రూపొందించుకుని నిర్మాణం చేపట్టాలని విన్నవించిన. ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ వెంటనే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ అంతా మాదేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నేను ప్రతిపాదించిన ఇలాంటివి మరెన్నో పనులనూ టీఆర్ఎస్ నేతలు తామే చేశామని ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేనునందునే సీఎం కేసీఆర్ తన వద్ద ఉంచుకున్న రూ.2వేల కోట్ల వరకు రాష్ట్ర అభివృద్ధి నిధుల నుంచి నయాపైసా జగిత్యాలకు ఇవ్వలేదు. అదే మానకొండూరు, వేములవాడ ఇతర నియోజకవర్గాలకు నిధులిచ్చారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. జనమే నా బలం.. బలగం. వాళ్ల ఆశీర్వాదంతో నేను మళ్లీ గెలవబోతున్న. ఓడినా వారి వెన్నంటే ఉంటా. రాష్ట్రంలోనూ ప్రజాకూటమిదే విజయం..’ అన్నారు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి. ఎన్నికల ప్రచారతీరు.. గెలుపు అవకాశాలు.. నాలుగేళ్ల పాలన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, జగిత్యాల : నేను ప్రజల మనిషిని. నిత్యం అందుబాటులో ఉంటున్న.. రాజకీయాలకతీతంగా నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వింటా. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్న. నేను ప్రతిపక్షంలో ఉన్నా నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్న. నిరుపేదల సంక్షేమాన్ని కాంక్షించేలా ప్రజాకూటమి రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే మించి నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే నన్ను గెలిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన వ్యక్తికే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. కానీ.. ఇక్కడ దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నేను గెలిచినా ఎంపీ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తుత నా ప్రత్యర్థి సంజయ్కుమార్నే ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా బహిరంగ సభల్లోనూ పదే పదే చెప్పడం నన్ను బాధించింది. నేను ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామని చెబుతున్నరు. ఆ ఫైలును తొక్కిపెట్టారు..! ఈ ఎన్నికల్లో యావర్‌రోడ్డు సమస్య అన్ని పార్టీలకు ప్రధాన ఎజెండా మారింది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా గతంలో 60ఫీట్లకు ఆమోదం పొందిన యావర్‌రోడ్డు విస్తరణ.. 40ఫీట్లకు పరిమితమైంది. జగిత్యాల ఇప్పుడు జిల్లాకేంద్రం అయింది. ఆ రోడ్డు వంద ఫీట్లకు విస్తరించబడాలి. దీనికి సంబంధించి తీర్మానం చేసిన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ గతేడాది జూన్ 31న ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌లోని ‘డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్’కు పంపింది. అక్కడ ఆ ఫైలును తొక్కిపెట్టారు. దీనికి సంబంధించిన లేఖ ఇప్పటికీ మా దగ్గర ఉంది. యావర్‌రోడ్డు విస్తరణకు కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల కౌన్సిల్ కట్టుబడి ఉంది. 2009లో మేం (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు నూకపల్లిలో 4వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూసేకరణ చేసి.. ఒక్కో ఇంటికి రూ.లక్షతో పనులు మొదలుపెట్టినం. ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. మరో రూ.లక్ష కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తయ్యేవి. అవి పూర్తి చేస్తే నాకు పేరొస్తుందనే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పక్కనబెట్టింది. అదే ప్రాంతంలో కొత్తగా 4వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీనికి టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగేళ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని టీఆర్ఎన్ పార్టీని అన్నివర్గాలు.. పార్టీలు చీదరించుకుంటున్నాయి. నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ, నియంతృత్వ పాలనను తుది ముట్టించేందుకు.. నాడు ఉద్యమంలో పాల్గొన్న పార్టీలు, ముఖ్యులందరూ ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. ఇది నేను చేసింది కాదా..? 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పనులు చేపట్టిన. అవి టీఆర్ఎస్ నేతలకు కనిపించినా.. చూడనట్లు మాట్లాడుతున్నరు. నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన.. అది భవిష్యత్తులో యూనివర్సిటీగా రూపుదిద్దుకోబోతుంది. పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నిరుద్యోగ యువతకు సంబంధించిన నాక్ శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీలు తెచ్చింది నేను కాదా..? జగిత్యాల జిల్లాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఇక్కడ ఓ మెడికల్ కాలేజీ అవసరమైంది. ఇప్పుడు నా దృష్టి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఉంది. చల్గల్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసుకుని జగిత్యాలలో కోర్టు భవనం నిర్మించుకున్నం. గోదావరి నదిపై రూ.40 కోట్లతో కమ్మునూరు – కలమడుగుపై వంతెన మంజూరు చేయించిన. వాటి పనులు పూర్తయ్యాయి. నా నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని గ్రామాలు లేనేలేవు. పట్టణ విషయానికి వస్తే అంతర్గత, బహిర్గత బైపాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టిన. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి.. నాలుగేళ్లలో టీఆర్ఎస్ అభివృద్ధి ఆ పార్టీ నేతలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడ్ 1 ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50కోట్లు కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు గ్రేడ్–2, గ్రేడ్ –3 మున్సిపాలిటీలు అయిన కోరుట్ల, మెట్పల్లిలకూ అవే నిధులు కేటాయించారు. ఇందులో జగిత్యాల పట్టణానికి ప్రత్యేకంగా చేసిందేమిటో వారికే తెలియాలి. వీటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు..? గత విద్యాసంవత్సరం రాయికల్‌లో డిగ్రీ కాలేజీ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. కానీ బోధన, బోధనేతర సిబ్బంది నియామకం లేక ప్రారంభంకాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ మధ్య వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఇంతవరకు దాని నిర్మాణ పనులకు పరిపాలన అనుమతి రాలేదు. రాయికల్‌లో మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. సారంగాపూర్‌లో 0.25నీటి సామర్థ్యం ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును టీఎంసీకి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆధునీకరణ పనులు నత్తకునడక నేర్పుతున్నాయి. రాయికల్ మండలం మూటపల్లి–భూపతిపూర్‌లో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన రోడ్డు ధ్వంసమై నాలుగేళ్లవుతున్నా.. రెన్యువల్ చేయలేదు. బీటి రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇప్పుడు టెండర్, అగ్రిమెంట్, అంచనాలు లేకుండా ఎన్నికల కోడ్ అని కూడా చూడకుండా బినామీతో పనులు ప్రారంభించాలని చూస్తే కోర్టు పనులు ఆపేసింది. ఐదు నెలల క్రితం జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.8 కోట్లతో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిండ్రు.. ఆ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. -
షాద్‌నగర్ బాద్షా ఎవరో..!
షాద్‌నగర్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్కు పట్టం కట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ముఖ్యంగా నలుగురి మధ్యే గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి(కాంగ్రెస్), బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్యయాదవ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అండతో కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఏనుగు గుర్తుతో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన శ్రీవర్ధన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: 17 ప్రధాన అభ్యర్థులు నలుగురు ఎల్గనమోని అంజయ్యయాదవ్ (టీఆర్ఎస్) చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్) నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి (బీజేపీ) వీర్లపల్లి శంకర్ (బీఎస్పీ) సాక్షి, షాద్‌నగర్: తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఎల్గనమోని అంజయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా రు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు కృషి చేస్తాయని అంజయ్య యాదవ్ చెబుతున్నారు. నియోజకవర్గంలో వరుసగా ఒక్క శంకర్రావు తప్పా ఇతరులెవరు వరుసగా విజయం సాధించసాధించలేదు. ఈసారి ఆ రికార్డును తాను సమం చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి (కాంగ్రెస్) అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, అధికారంలోకి వస్తే హమీలన్నీ నెరవేరుస్తామని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. కేంద్ర సాయంతో అభివృద్ధి చేస్తాం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నుంచి బరిలో దిగిన నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయంతో కనీవిని ఎరగని రీతితో షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రజలకు శాశ్వత తాగు, సాగు నీరు అందించడానికి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని శ్రీవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. గత ఎన్నికల్లో తృతీయ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇస్తూ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పరిపూర్ణనందస్వామి పర్యటనలతో కేడర్‌లో జోష్ పెరిగింది. చాపకింది నీరులా బీఎస్పీ.. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి బీఎస్పీ నుంచి బీఫామ్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలను కలుపుపోతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శంకర్ టీఆర్ఎస్లో ఉండగానే తనకంటూ ఓ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చివరకు పార్టీ టికెట్ నిరాకరించడంతో బీఎస్పీ నుంచి బరిలో దిగారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోరుట్ల 'రెవెన్యూ' డివిజన్
సాక్షి, కోరుట్ల: ‘జిల్లాలోనే పెద్ద పట్టణం కోరుట్ల.. దీనిని పక్కాగా రెవెన్యూ డివిజన్ చేస్తామని సీఎం కేసీఆర్ మాటగా ప్రకటిస్తున్నా..’ అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కోరుట్ల డివిజన్ ఏర్పాటు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, మెట్పల్లి ప్రజలు ఆగం కావద్దని, మెట్పల్లి డివిజన్ అలాగే ఉంటుందని తెలిపారు. ఒకే సెగ్మెంట్లో రెండు డివిజన్లు ఉంటాయని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిండు.. ఇగో అట్లనే మీ కేటీఆర్ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు రెవెన్యూ డివిజన్లు సాధించి చరిత్ర సృష్టిస్తున్నారు..అని పేర్కొన్నారు. ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా కోరుట్లకు వచ్చానని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్లో ముంబయి రైలు ఆగేలా అనుమతి సాధిస్తామన్నారు. ఈ మూడు హామీలు నేరవేర్చే బాధ్యత తనదేనన్నారు. విద్యాసాగర్‌రావు అందరికీ అందుబాటులో ఉంటాడు.. మూడుసార్లు అభిమానాన్ని చాటి గెలిపించారు.. మరోసారి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి..అని కేటీఆర్ కోరారు. మహాకూటమి ముసుగులో కాంగ్రెస్‌కు ఓటేయాలని వస్తున్నారు.. వారిని నమ్మద్దు. ఎన్నికలు అయిపోగానే తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో పోతారు.. ఈ విషయం మీకు కూడా తెలుసు..అందుకే ఎప్పుడూ అందుబాటులో ఉండే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఓటేసి ఆశీర్వదించండి..’ అని కోరారు. 24గంటల ఉ చిత కరెంట్, రైతుబంధు, రుణమాఫీతో రైతులకు అండగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పేద ప్రజల కష్టాలు గుర్తించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీడి, నేత, గీత కార్మికులకు పించన్లు అందించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పించన్లను రూ.2016 చేస్తామన్నారు. పింఛన్ అందించే వయసును 57కు కుదిస్తామన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉంటుందన్నారు. సోనియాను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆశీర్వదించండి: విద్యాసాగర్‌రావు కోరుట్ల సెగ్మెంట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిరోజూ అందుబాటులో ఉన్నానన్నారు. మిషన్ భగీరథతో మంచినీరు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు రూ.50కోట్ల చొప్పున నిధులు తెచ్చామన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో ధర్నా చేసి కోరుట్లలో వెటర్నరీ కళాశాలకు రూ.300 కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్లు ఉమారాణి, శీలం వేణు, కోరుట్ల పట్టణ, మండల టీఆర్ఎస్ అ ద్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశం, జడ్పీటిసిలు, ఎంపీటిసిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు : బూడిద భిక్షమయ్య
సాక్షి, బొమ్మలరామారం : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అ డ్డుకోలేదని ఆలేరు అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, కాండ్లకుంట తండా, గోవింద్ తండా, లక్క తండా, సీత తండా, చీకటిమామిడి, సోలిపేట్, ప్యారారం, తి మ్మాపూర్, బోయిన్పల్లి గ్రామాల్లో సోమవారం ని ర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్æ పార్టీకే పట్టం కట్టాలన్నారు. మరోసారి తనను ఆదరించి ఆలేరు అభివృద్ధికి దో హదం చేయాలని భిక్షమయ్యగౌడ్ ఓటర్లను కో రారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. ఆడ పిల్లలకు వరంలాంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఆరు లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు, ఐదు లక్షల వ్యయంతో బీసీ ఓసీ లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుం బమే బంగారుమయం చేసుకున్నాడన్నారు. కేసీ ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకితోసి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పీఏ సీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేష్, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడమటి పావని, తిరుమల కృష్ణగౌడ్, అన్నెమైన వెంకటేష్, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, ఎనగండ్ల వీరేశం, మాందాల రామస్వామి, చీర సత్యనారాయణ, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మ హదేవుని రాజు, మోటే వెంకటేష్, గుర్రం శ్రీని వాస్‌రెడ్డి, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బో యిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, చంద్రశేఖర్, మోహన్‌నాయక్, రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సోమవా రం గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.ఆలేరు మ హాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ కాం గ్రెస్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, క్రిష్ణ, రామిడి బాల్‌రెడ్డి, ఇప్పల పల్లి స్వామి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజాపేటలో.. రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రంగ కిష్టయ్య గౌడ్, రంగ బాలస్వామి గౌడ్‌లతోపాటు 50 మంది యువకులు సోమవారం డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ గెలపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని పాండు, కార్యదర్శి రంగ నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రంగ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి మాటలు నమ్మొద్దు
సాక్షి, రామగిరి/మంథని : మాయమాటలు చెబుతూ మభ్యపెట్టేందుకు వస్తున్న మహాకూటమి నాయకులను నిమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు పేర్కొన్నారు. చందనాపూర్, ఎస్సీకాలనీ, పెద్దంపేట, పస్నూరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్యగౌడ్, ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, నాయకులు దాసరి రాయలింగు, బేతి కుమార్, ఇజ్జగిరి రాజు, గద్దల శంకర్, మేదరవేన కుమార్, రొడ్డ శ్రీనివాస్, పొన్నం సదానందం, శ్యాం(లడ్డా), వేగోళపు మల్లయ్య, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నాల్గున్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్‌ను కలిశారు. పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన యువత ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారితో మాట్లాడారు. యోగా సాధన చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు, ఏగోళపు శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వాగ్దాన శూరుడు కేసీఆర్
హుస్నాబాద్ : ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలు చేసి గెలిచాక నెరవేర్చకపోవడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు ఉండరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో ప్రజాకూటమి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నాడని, కేసీఆర్‌కు ఓటేస్తే అది బీజేపీకి ముట్టినట్టవుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్.. నీళ్లు ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద దొర, నియోజకవర్గంలో చిన్న దొర ఉన్నాడని.., దొరల రాజ్యం పోవాలంటే పేదల రాజ్యం రావాలని అందుకు ప్రజలు ఆలోచించాలని కోరారు. కొండగట్టులో బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోతే వారిని పరామర్శించలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం చేశామని అన్నారు. కేసీఆర్ అక్రమాలపై ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని జీవితాంతం జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రజాకూటమిలో భాగంగా తాను జగిత్యాల సీటును త్యాగం చేశానని, ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుందని, నావంతు సాయంగా ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలే నాలుగు రోజులు నిద్రాహారాలు మాని, కూటమిగా ఏర్పడ్డ నాలుగు జెండాలను హుస్నాబాద్‌లో ఎగురవేయాలని రమణ పిలుపునిచ్చాడు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో దొరల అహంకారం పెరిగిందని, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించాడు. అందరి త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని.. చారిత్రాత్మక భద్రతగా గుర్తించి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించాలని అన్నారు. హుస్నాబాద్ సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి కేసీఆర్‌ను ఇంటికి పంపే కూటమిగా మారాలని అన్నారు. 2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. రీ డిజైన్ల పేరుతో టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని, తాను గెలిస్తే సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించి నీరందిస్తానని అన్నారు. ప్రజాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్, రాంగోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, గడిపె మల్లేష్, శోభారాణి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీడీపీ నాయకులు ప్రవీణ్‌కుమార్, బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, దొమ్మాటి మల్లేశం, తెలంగాణ జనసమితి నాయకులు కొంరెల్లి, చింతల రామచంద్రం, జీవన్‌రెడ్డి తదితరులున్నారు. ఆకట్టుకున్న వందేమాతరం శ్రీనివాస్ పాటలు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజాకూటమి బహిరంగ సభకు వందేమాతరం శ్రీనివాస్ పాటలు హైలెట్‌గా నిలిచాయి. రాములమ్మ ఓ రాములమ్మ, ఎర్రజెండ.. ఎర్రజెండ ఎనియలో.. వంటి పాటలకు కళాకారులతో పాటు సభకు వచ్చిన జనం కోరస్ పాడుతూ ఉత్సాహంగా కనిపించారు. సభకు నియోజకవర్గం నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. హుస్నాబాద్ బహిరంగ సభలో పాటలు పాడుతున్న సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ . -
‘చేతి’ చాటు చంద్రుడు చేటేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ ఒక వైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కూడిన ప్రజాఫ్రంట్ మరో వైపు హోరా హోరీ యుద్ధం మాదిరి ప్రచారం సాగిస్తున్నాయి. ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేయగలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా పోయిందో మరేమో తెలియదు కాని..ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా అత్యధికంగా కాంగ్రెస్ ప్రచారమే హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ వెనుకాడడం లేదు. ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఇంతవరకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్లు కనిపించలేదు. బహుశా చివరి మూడు రోజులు ఏమైనా ఇస్తుందేమో తెలియదు. కాంగ్రెస్‌కు అయినా, టీఆర్ఎస్ కు అయినా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలే. బీజేపీ కూడా ప్రచారంలో దూకి రకరకాల టీవీ యాడ్స్, పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఆరంభించింది. ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రచారం విషయంలో కాంగ్రెస్ దూకుడు ముందు ఆగడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్ గత ఐదేళ్లుగా తెలంగాణలోను, ఆంధ్రలోను అధికారంలో లేదు. కాంగ్రెస్‌కు లాభమా..నష్టమా! తెలంగాణ ఇచ్చినా ఇక్కడ అధికారం రాకపోవడంతో ఆ సెంటిమెంటును ప్రయోగించి ఏమైనా లాభం పొందే అవకాశం ఉందా అన్నదానిపై కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి టీడీపీని కలుపుకోవడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు నష్టమా? లాభమా అన్నది ఆ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మొదట ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను వాడుకున్న కాంగ్రెస్ , తన సొంత ముఖ్యమంత్రులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కాంగ్రెస్ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కూడా అవసరం లేదని భావించిందో ఏమో తెలియదు కాని చంద్రబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగాలలో వారి ప్రస్తావన తేలేదు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో ఎక్కడా కాంగ్రెస్ పదేళ్ల పాలన గురించి చెప్పడం లేదు. పదిహేనేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ అభివృద్ధి అంతా తనదే అంటూ తన ఖాతాలో క్రెడిట్ వేసుకుంటుంటే, కాంగ్రెస్ నేతలు తెల్లబోవడం తప్ప ఏమీ మాట్లాడడం లేదు. ఒకరకంగా చేష్టలుడిగినట్లుగా వారి పరిస్థితి మారింది. కేసీఆర్ ఆత్మగౌరవ సమస్యను ప్రస్తావిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని చెబుతున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు పడగొట్టి పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు కాని విజయవాడ అనండి..అమరావతి అనండి ఆ ప్రాంతంలో ఎక్కడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభావం లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదానిపై కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారకుండా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కాని, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రసంగాలలో ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజంగానే ఆత్మగౌరవ సమస్యను ప్రజలందరు తీసుకుంటారా అంటే చెప్పలేం. కొంత మేర ఉండవచ్చు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కొంత చర్చ జరుగుతోంది. పథకాలపై టీఆర్ఎస్ ఆశలు... స్థూలంగా చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది వోకల్ సెక్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. కింది స్థాయి వర్గాలలో అది అంతగాఉన్నట్లు అనిపించదు. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల వారికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని చెప్పాలి. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెలు, చేపపిల్లల పంపణీ తదితర స్కీములపై టీఆర్ఎస్ ఎక్కువ ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ స్కీముల గురించి ఎక్కువగా చెప్పకుండా కేసీఆర్ దొరల పాలన అని, నియంతృత్వం అని, సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని, ఇలాంటి విమర్శలను ఎక్కువగా చేస్తోంది. అదే సమయంలో రెండు లక్షల రూపాయల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కేసీఆర్ చేపట్టిన వివిధ స్కీములను పెద్దగా విమర్శించకుండా, తాము మరింతగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వపరంగా పెద్దగా విఫలం అయినట్లు కనిపించదు. కాకపోతే యాటిట్యూడ్ లో కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ కు మరింంత పోటీ ఎదురై ఉండేది. కాని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ వారు కేసీఆర్‌కు ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. తేడా వస్తే... ఎంఐఎం అండ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి అయితే చంద్రబాబో, ఎవరో ఒకరు తమకు గెలిచే విధంగా ఆర్థిక వనరులు సాయం చేస్తే చాలన్నట్లుగా సర్దుకుంటున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు కాంగ్రెస్‌కు నష్టం చేయవచ్చు. అందువల్లే లగడపాటి రాజగోపాల్ పది మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొందరు టీఆర్ఎస్కు ఇబ్బంది అని ప్రచారం చేస్తున్నా, కాంగ్రెస్ కు ఇబ్బందే ఎదురు అవుతుందనిపిస్తుంది..ఎందుకంటే టీఆర్ఎస్కు ఒకవేళ 50 సీట్లు వచ్చినా, ఎంఐఎం అండ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లను ఆకట్టుకున్నా సరిపోతుంది. టీఆర్ఎస్ మాత్రం తమకు పూర్తి మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ తన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కూడా ఐదు నుంచి పది సీట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కూటమికి పూర్తి మెజార్టీ వస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాని టీఆర్ఎస్కు 50 సీట్లు వచ్చినా అధికారం పొందే అవకాశం ఉండవచ్చు. ఇక డబ్బు ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల ఎదురవుతున్న ఆత్మగౌరవ సమస్య పనిచేస్తే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. ఆయన ప్రభుత్వ విధానాలు కాకుండా, కేసీఆర్ వైఖరి , సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం వంటి విమర్శలు అధికంగా పనిచేస్తే కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరగవచ్చు. ఇప్పటికైతే కేసీఆర్‌ది పై చేయిగానే కనిపిస్తోంది. అలా అని చెప్పి ప్రజా కూటమి పూర్తిగా వెనుకబడిందని చెప్పలేం. - కొమ్మినేని శ్రీనివాసరావు -
మహా కూటమి.. ఇంత మోసమా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, మిగతా వర్గాల పేదలకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. సరిగ్గా పోలింగ్‌కు ముందు ఇప్పుడు మాట మార్చిందన్నారు. మొన్నటి వరకు డబ్బులిస్తామని చెప్పి.. ఇప్పుడు అది రుణమని ప్రకటనలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఆదివారం దినపత్రికల్లో వచ్చిన మహాకూటమి వాణిజ్య ప్రకటనల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ.. కూటమి మోసాన్ని ట్విటర్ వేదికగా ఎండగట్టారు. లగడపాటి సర్వే ఓ జోక్.. తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ప్రకారం 10 మంది స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అదో పెద్ద జోక్ అని, అవన్నీ నకిలీ సర్వేలని, వాటిని విశ్వసించవద్దని సూచించారు. ఆదివారం నెటిజన్లతో ట్విటర్ వేదికగా చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శంకర్ 2.0, రాజమౌళి బాహుబలి చిత్రాల గ్రాఫిక్స్‌లకన్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సూపర్ అని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. దీనికి కేటీఆర్ సైతం అంగీకరించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు విద్యుత్త్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ 24 గంటల కరెంట్ ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు అంశాన్ని టీఆర్ఎస్ సరిగ్గా ప్రచారానికి వాడుకోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సమాధానమిచ్చారు. మరో నెటిజన్ కేసీఆర్ మిమ్మల్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. రాము అని పిలుస్తారని, అది తన నిక్‌నేమ్ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు మొబైల్ కనిపెట్టానని చెప్పారని, దీనిపై అభిప్రాయం ఏమనగా.. ఆయన చందమామను కూడా కనిపెట్టారని సెటైర్ వేశారు. వీళ్లు చేసే వాగ్ధానాలు ఎంత మోసపూరితమో, ఇదే మంచి ఉదాహరణ. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మొదలుచెప్పి, ఇప్పుడు రుణం ఇస్తామని మాటమార్చిన కాంగ్రెస్. pic.twitter.com/vNSWPUqRae — KTR (@KTRTRS) December 2, 2018 Be careful Babu Garu. Telangana is ‘powerful’ https://t.co/8AU9x5d1Ds — KTR (@KTRTRS) December 2, 2018 -
కూటమి విజయం ఖాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కర్ణాటక సాగునీటి మంత్రి డి.కె.శివకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పదవిని, అధికారయంత్రాంగాన్ని వాడుకుని గెలవాలని చూస్తున్నారని, కానీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని, తనతో పాటు పార్టీ శ్రేణులను కలుపుకుని తెలంగాణలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ పాత్రపై ప్రశ్నించగా అది రాహుల్ గాంధీ, చంద్రబాబులు కలిసి నిర్ణయిస్తారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. -
గెలుపుపై టీపీసీసీ చీఫ్‌కే నమ్మకం లేదు: హరీష్ రావు
సాక్షి, వర్థన్నపేట : మహాకూటమి గెలుపుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే నమ్మకం లేదని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వర్ధన్నపేటలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధని, కాంగ్రెస్, టీడీపీలవి మోసపూరిత వాగ్ధానాలని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణను తెచ్చుకున్నామని, రాష్ట్రంలో పరాయిపాలన అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజా కూటమి వస్తే రైతులకు కష్టాలేనన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్కు ఓటేయ్యాలని, వర్థన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
చొప్పదండి: దొంగల కూటమిని నమ్మకండి
సాక్షి, కొడిమ్యాల: కేసీఆర్‌ను ఓడించడం లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి దోపిడీ దొంగల కూటమిని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు నమిలికొండ, శ్రీరాములపల్లి, గోపాల్రావుపేట, ఆరెపల్లి, పూడూరు, అప్పారావుపేట, రామారావుపేట, చింతలపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. మళ్లీ మోసపోయి కాంగ్రెస్, టీడీపీలకు ఓటువేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. జగిత్యాల సభ నుంచి కరీంనగర్ సభకు కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో తనను వెంట తీసుకెల్లినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శోభ కేసీఆర్ ప్రసంగంలో తన పేరు కూడా ప్రస్తావించలేదని అనడం హాస్యాస్పదమన్నారు. మండలంలోని మైసమ్మచెరువు, పోతారం పెద్దచెరువు రిజర్వాయర్లను ఎల్లంపల్లి నీటితో నింపి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. ఎంపీపీమేన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, విండోచైర్మన్ పునుగోటి కృష్ణారావు, నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, ఎంపీటీసీలు నాగరాజు, చంద్రశేఖర్, బల్కంమల్లేశం, కోఆప్షన్మెంబర్ చాంద్‌పాషా, ఆదయ్య, హన్మయ్య, లింగాగౌడ్, చంద్రమోహన్‌రెడ్డి, బైరివెంకటి, బింగిమనోజ్, కొత్తూరిస్వామి, శివప్రసాద్‌రెడ్డి, మొగిలిపాలెం శ్రీనివాస్, పులి వెంకటేష్, నసీర్ పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం... మల్యాల: మండల కేంద్రంతో పాటు, ఒబులాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. ఒబులాపూర్‌లో ఎండీ.సుభాన్, అనిల్‌రెడ్డి, మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బూసి గంగాధర్, పొన్నం మల్లేశం గౌడ్, అమీర్, పందిరి శేఖర్, లాలా మహమ్మద్, నూర్ మహమ్మద్, సలీం, మాజీద్ పాల్గొన్నారు. -
అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ
సాక్షి, గంగాధర: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి మండల కేంద్రంతో పాటు రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట, చాకుంట గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా కుటుంబపాలనకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు, ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తినన్నారు. ఈసారి అవకాశం ఇస్తే చొప్పదండి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపుతానని, అసంపూర్తి కాలువ నిర్మాణం పనులు పూర్తి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజక్టులకు రిడిజైన్ పేరుతో అంచనా వ్యయంతో పెంచి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు, ఒక ఇంట్లో ఎందరు అర్హులుంటే వారందరికీ పింఛన్ మంజూరు చేస్తోందని తెలిపారు. అంతేగాక పింఛను పెంచుతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వారికి అదనంగా రెండు లక్షలు, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 50వేల నగదును, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్ కావాలని విమర్శించిన టీఆర్ఎస్ అదే మేనిఫెస్టోను కాపీ కొట్టిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ నాయకులతో పాటు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఖమ్మంలో సిని నటుడు వేణు విస్తృత ప్రచారం
సాక్షి, ఖమ్మంఅర్బన్: ప్రజాకూటమి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సినీ నటుడు తొట్టెంపూడి వేణు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మేలు చేసేవారికి అవకాశం కల్పించాలి .. ఖమ్మంమామిళ్లగూడెం: ప్రజలకు మేలు చేసేవారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజాస్వామ్య కమ్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధనాల కొండయ్యచౌదరి కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ట్రస్టు ద్వారా 5 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు నీళ్లు అందించి గతంలో ఎంపీగా పనిచేసి అభివృద్ధికి చేసిన ప్రజాకూటమి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కుటుంబ పార్టీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిటాల లింగరాజుయాదవ్, కె.కృష్ణమూర్తి, పాటి శ్రీనివాస్‌చౌదరి, కొమ్మినేని వంశీ, పతాని సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమిని తరిమికొట్టాలి : కేసీఆర్
సాక్షి, కొత్తగూడెం: ‘పాలనాపరంగా వ్యవస్థలను దెబ్బతీసిన కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నాయి. చైతన్యం ఎక్కువ కలిగిన జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఆ కూటమిని తరిమికొట్టాలి.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరులలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. గత 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో రాష్ట్రంలో పూర్తిగా జీవన విధ్వంసం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు ఈ ప్రాంతానికి వచ్చానని, రాజకీయంగా చైతన్యవంతమైన ఆలోచనా శక్తి ఉన్న ఇక్కడి ప్రజలతో అనేక విషయాలు పంచుకున్నానని గుర్తుచేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. దీంతో అందరి సహకారంతో 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించామన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలనాపరంగా అద్భుతమైన విధానాలు చేపట్టామన్నారు. ప్రజలు పరిణితితో ఆలోచించి ప్రజా ఎంజెండా అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. కమీషన్లు దండుకున్న చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే.. ఆరు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు కమీషన్లు భారీగా దండుకున్నాయని కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో రైతుల మేలు కోసం సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమే చేసినట్లు రాహుల్‌గాంధీ ఆరోపణలు చేసి జోకర్ అయ్యారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతీ అంగుళానికి నీరిచ్చేందుకు రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమని ఆరోపించడం ఏమిటన్నారు. రాహుల్‌కు దమ్ముంటే ఇక్కడకు వస్తే చూపిస్తానన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టులకు రాహుల్ కుటుంబ సభ్యుల పేర్లే పెట్టడం ఏమిటన్నారు. మేము మాత్రం దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయి హిమాలయాలకు వెళ్లి ఆకుపరస తాగి వచ్చి పవిత్రమైనారా లేక చంద్రమండలం నుంచి దిగివచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ నిధులు మింగిన చరిత్ర ఉన్న రాహుల్‌కు కమీషన్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాహుల్‌కు స్క్రిప్టు ఎవరు రాసిస్తారో కానీ సొల్లు విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానికంగా స్వయంపాలన తెచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 3,500 గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్థానికంగా స్వయంపాలన సాగించేలా చేశామన్నారు. జనవరిలో కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంతకు ముందు కొత్త జిల్లాలతో పాలన మరింత చేరువ చేశామన్నారు.రాష్ట్రంలో కంటివెలుగు పథకం ద్వారా 90లక్షల మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు ఇస్తున్నామన్నారు. తరువాత దశల్లో చెవి, ముక్కు, గొంతు, దంత, శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రతీ ఒక్కరి రక్తనమూనాలు సేకరించి బీపీ, షుగర్ తదితర వివరాలన్నింటినీ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి తగినవిధంగా వైద్యసేవలు, అత్యవసర వైద్యం సైతం అందిస్తామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు. గొర్రెల పెంపకం పథకం కింద 4వేల కోట్లతో 70లక్షల గొర్రెలను ఇచ్చి సంతతి పెంచామన్నారు. మహారాష్ట్ర నుంచి మాంసం దిగుమతి చేసుకునే స్థితి నుంచి దుబాయ్‌కు మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బలమైన అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆదాయం పెంచి రైతులకు, వివిధ వర్గాలకు పంచుతున్నామన్నారు. తమ హయాంలో ఇసుక ద్వారా ఆదాయం పెంచామని అన్నారు. విద్య విషయంలో ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ, ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తాం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కలిగి కొత్తగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాల రాకపోకలకు వీలుగా ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లెందులో సింగరేణి భూగర్భగని కొత్తగా ప్రారంభిస్తామన్నారు. బయ్యారంలో సింగరేణి ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పోడు భూముల సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో మంచి నాయకులు.. జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు మంచి నాయకులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావులు అభివృద్ధికాముకులన్నారు. జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు అయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కొత్తగూడేనికి చెందిన మహిళ నాగమణిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నీ తమ్ముడిలాంటివాడు. నీ విషయం నేను చూసుకుంటాను’ అని అన్నారు.కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలిప్పిస్తాం పోడు భూముల సమస్య కొంత ఉందని, ఈసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారందరికీ పోడు భూములకు హక్కును కల్పిస్తూ పట్టాలు ఇప్పిస్తామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. వయసు అయిపోయింది, ఆఖరుసారి అని ఓట్లను అర్జించే నాయకులను నమ్మవద్దని, వయసు అయిపోతే ఓటెందుకని ఆయన వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు నీచమైన పాలన చేశాయని విమర్శించారు. మరిన్ని వార్తాలు... -
అవకాశవాద పార్టీలను ఓడించాలి
చర్ల: తెలంగాణలో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను ఓడించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ సీపీఎం శాసనసభ అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆయన చర్ల మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలలో అవకాశవాద రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశపడిన ప్రజానీకానికి భంగపాటే ఎదురయిందని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలన్ని వేరైనప్పటికీ, వాటి విధానాలన్నీ ఒక్కటేనని, అవన్ని ఒకే తానులోని ముక్కలని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, దళితులను టీఆర్ఎస్ బలవంతంగా వెళ్లగొట్టిందని, అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటీ చట్టాన్ని నీరుగార్చి తీవ్రంగా అవమానించిందని అన్నారు. పంటసాగుకు సాయం కోసం రైతుబంధు పేరిట తీసుకొచ్చిన పథకం బడా రైతులకు మాత్రమే ఉపయోపడిందని, చిన్నకారు రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. వద్ధిపేట చెక్‌డ్యాం నిర్మాణం కోసం రానున్న రోజుల్లో తమ పార్టీ పోరాడి సాధిస్తుందని అన్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావును గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మిడియం బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు కొలగాని బ్రçహ్మాచారి, మండల కార్యదర్శి కారం నరేష్, సీనియర్ నాయకులు చింతూరు వెంకట్రావు, చీమలమర్రి మురళీకృష్ణ, వినోద్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి జగిత్యాల మాదే..!
2014 ఎన్నికల్లో నేను ఓడి కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా.. మా అధినేత కేసీఆర్ జగిత్యాలను ఏనాడూ చిన్నచూపు చూడలేదు. నాలుగేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,250 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇక్కడి ప్రజలకు అందించారు. జిల్లా ఏర్పాటు.. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. రాయికల్ మున్సిపాలిటీ దాని అభివృద్ధికి రూ. 25 కోట్ల మంజూరు దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు, పాత బస్టాండు విస్తరణ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు టీఆర్ఎస్తోనే సాధ్యం..’ అంటున్నారు జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్. ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి.. ప్రచార తీరు.. హామీలు.. గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, జగిత్యాల: 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఆ రెండు పార్టీల పుణ్యమా అని 1956లో ఏర్పాటైన జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు విస్తరణ అంశాన్నీ ఆయా పార్టీలు పట్టించుకోలేదు. 58 ఏళ్లలో ఆయా పార్టీల పనితీరు.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పనితీరు ప్రజల ముందుంది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అద్భుత పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ టీఆర్ఎస్ నెరవేర్చింది. డాక్టర్‌గా ప్రజల్లో నాకు మంచి ఆదరణ, గౌరవం ఉంది. ఇవే నా గెలుపునకు సహకరిస్తాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి జగిత్యాలపై గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఓడినా ప్రజల మధ్యే.. వృత్తిరీత్యా నేను కంటి వైద్యనిపుణుడిని. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు 50వేల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశా. 2014 సాధారణ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే నేను టీఆర్ఎస్లో చేరిన. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయా. రాష్ట్రంలో మాత్రం మా పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఓడినా నిరుత్సాహపడలే. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసిన. పార్టీ అధిష్టానం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న. నిజామాబాద్ ఎంపీ కవిత, పార్టీ క్యాడర్ అందించిన సహాయసాకారాలు నాకు వరంలా కలిసొచ్చాయి. 2014కు ముందు జగిత్యాలలో అసలు టీఆర్ఎస్ కార్యాలయమే లేదు. నేను మోతెలో విశాలమైన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. దాని కేంద్రంగా ప్రజలకు సేవలందించా. ఆరు నెలల క్రితమే ఆస్పత్రిని మరో వైద్యుడికి అప్పగించి పూర్తిగా ప్రజల మధ్యే ఉంటున్న. రూ. 1250 కోట్లతో అభివృద్ధి.. నేను ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏనాడూ చిన్నచూపు చూపలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు దీటుగా జగిత్యాలలో అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసింది. రాయికల్ మండలం బోర్నపల్లిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్లు విడుదల చేయగా.. పనులు ముగింపు దశలో ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. కొత్తగా రాయికల్ మున్సిపల్ ఏర్పాటుతో పాటు రూ.25 కోట్లు, నియోజకవర్గంలో 26వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతి, 58వేల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య శ్రీ పథకం కింద 9వేల మందికి కార్పొరేట్ వైద్యం, వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల, 2800 మందికి కల్యాణలక్ష్మీ.. 750 మందికి షాదీముబారక్ చెక్కులు, 3,500 మందికి కేసీఆర్ కిట్ల పంపిణీ, చెరువుల పునరుద్ధరణ మొత్తంమీద నియోజకవర్గానికి నాలుగేళ్ల కాలంలో రూ.1250 కోట్లు మంజూరు చేయించిన. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ఇవి నా గెలుపునకు సహకరిస్తున్నాయనే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులూ కేసీఆర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఉపాధ్యాయుల సీపీఎస్ సమస్య పరిష్కారం కేంద్ర ఆధీనంలోనిది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రెండు నెలల క్రితమే మా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 2014 ఎన్నికల ఫలితాల ప్రకటన మరుసటి రోజే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజల మధ్య ఉంటున్న నేను.. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన. ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తాన్నీ రెండు సార్లు చుట్టి వచ్చిన. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత పర్యటనలతో నియోజకవర్గంలో మరింత ఊపు వచ్చింది. పార్టీ క్యాడర్, నాయకులందరూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. ఫలితంగా ప్రచారానికి నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామనీ తీర్మానాలు, వాగ్దానాలు చేస్తున్నారు. అది ప్రతిపక్షాల కుట్ర నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. చిరువ్యాపారులను ఇబ్బంది పెడతానని ప్రతిపక్షాలు నన్ను బద్నాం చేసే కుట్ర పన్నుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్‌ను విస్తరిస్తానని మాత్రమే నేను చెబుతున్న. ఏ ఒక్క చిరువ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్న. అదో మాయకూటమి అభివృద్ధి నినాదం కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో 58 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడ్డాయి. మహాకూటమి పేరుతో ప్రజలను మాయచేసేందుకే వీరందరూ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించని ఆ రెండు పార్టీలను ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. జగిత్యాలలో కాదు అసలు రాష్ట్రంలోనూ మహాకూటమి ప్రభావం లేదు. జనాల్లో చర్చ లేదు. రాష్ట్రంలో మాదిరిగానే జగిత్యాలలోనూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం -
మందమర్రిపైనే అందరి ఆశలు
సాక్షి, చెన్నూర్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రగిలింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు రాత్రి, పగలనక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 1,64,191 ఓట్లు ఉండగా, మందమర్రి మండలంలోనే 65,553 ఓట్లు ఉన్నాయి. మందమర్రిలో ఎక్కువ ఓట్లు ఉండడంతో ప్రధానపార్టీ అభ్యర్థులతోపాటు ఇతర పార్టీ అభ్యర్థులు మందమర్రిలో ప్రచారాన్ని ఎక్కువ సాగిస్తున్నారు. అన్నిపార్టీల అభ్యర్థుల ఆశలన్నీ మందమర్రి మీదనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయా పార్టీల అనుచరవర్గం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీఓటరు కలిసేందుకు గడపగడపకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వినూత్న రితీలో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులతోపాటు అనుచరవర్గంలో పడరాని పాట్లు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని ప్రార్థిస్తూ వారి నిర్వహించే వృత్తులను అభ్యర్థులు, నాయకులు నిర్వహిస్తున్నారు. టీ స్టాల్స్‌లో టీ తయారు చేయడంతో దోసెలు వేయడం, ఇస్త్రీ చేయడం, పండ్లు అమ్మడం, కట్టుమిషన్లు కుట్టడం పనులు చేస్తూ వినూత్న రితీలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. అన్ని పార్టీలకు సవాలే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు ఆలస్యం కావడంతో ముందుగానే టీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సూడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని కలియతిరుగుతున్నారు. మహాకూటమి అభ్యర్థు ఖారారు కావడం అలస్యమైనప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేత టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌తో పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ, బీఎస్పీ, బీఎల్ఎఫ్, న్యూ ఇండియా, ఆర్పీ (ఏ) ఆర్పీ (కె), పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్సీపీతోపాటు నలుగురు స్వంతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాలుగా మారాయి. అభివృద్ధి నినాదంతో టీఆర్ఎస్, ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అంతేకాక బీజేపీ, బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు సైతం ప్రభుత్వం వ్యతిరేక ఓటుపైనే ఆశతో ముందుకుపోతున్నారు. పెరిగిన జంప్ జిలానీలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జంప్ జిలానీల పెరిగారు. నిన్న మొన్నటి వరకు ఒక పార్టీలో పనిచేసి నాయకులు, కార్యకర్తలు తెల్లవారే సరికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. జంప్ జిలానీల బెడద అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ప్రధాన స్థాయి నాయకులకు ఒక రేటు, కింద స్థాయి నాయకులకు మరో రేటుతో పార్టీలు మారుతున్నారు. నాయకులు పార్టీలు మారడంలో వారిని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. -
మహాకూటమికి గుణపాఠం చెప్పాలి
మైలార్‌దేవ్‌పల్లి: మహాకూటమి పేరుతో వస్తున్న వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు కూటమి పేరుతో మీ ముందుకు వస్తున్నాయన్నారు. ఆ పార్టీ నాయకులకు బుద్ధిచెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేవలం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో ఉన్న 35 లక్షల కుటుంబాలకు 2 వేల కోట్ల ఖర్చుతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. నెక్నాంపూర్, గండిపేట చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. గండిపేట చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యటక కేంద్రంగా చేసేందుకు గాను ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తూ నగరానికి నలుదిక్కులా మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. శంషాబాద్ కొత్వాల్‌గూడలో రూ.100 కోట్లతో నైట్ సఫారీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మిగూడలో వంద పడకల ఆసుపత్రి మంజూరైనట్టు తెలిపారు. రూ.541 కోట్లతో నగర శివారులోని చెరువు ఆధునీకరణకు విడుదల చేయడం జరిగిందన్నారు. మూసీ నది సుందరీకరణతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా 111 జీవోను వెసులుబాటు చేసుకునేందుకు ఆలోచిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్ అందుతుందన్నారు. దానిని రూ.2016కు పెంచుతామన్నారు. రాజేంద్రనగర్‌లో ఇప్పటికే 3వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, హిమాయత్‌సాగర్‌లో కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని అందులో అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పాత్రినిత్యం వహించి మంత్రులుగా చలామని అయిన వారంతా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, రాజేంద్రనగర్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. పది సంవత్సరాల పాటు సబితాఇంద్రారెడ్డి కిస్మత్పూర్ బ్రిడ్జీని నిర్మించలేకపోయారని అన్నారు. తాను కేటీఆర్‌తో చర్చించి రూ.8 కోట్లు వెచ్చించి కిస్మత్పూర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామోహన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, నాయకులు విప్లవ్‌కుమార్, నాగేందర్, వెంకటేష్, మహ్మద్ ముర్తుజా అలీ, వెంకటేష్, లక్ష్మిరాజ్, మల్లేష్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్, బండ చంద్రారెడ్డి, జయశ్రీసదానంద్, మాలతీనాగరాజ్, సురేష్‌గౌడ్, మహేందర్‌గౌడ్, ప్రేమ్‌గౌడ్, సాయిబాబా, అజయ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
కరువు పోవాలంటే... టీఆర్ఎస్ గెలవాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం తలరాత మారాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే రెండేళ్లలోపు కచ్చితంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చే బాధ్యత తనదన్నారు. ‘ఎన్నో ఎన్నికలు.. పార్టీలు వచ్చాయి. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎవరూ కల్వకుర్తి తలరాత మార్చలే. సాగునీరు.. తాగు నీరు రాలేదు. ప్రజలకు ఏం ప్రయోజనం కలుగలేదు. దీనికంతటికీ ఎవరు బాధ్యులో ఆలోచించాలి. ఎన్నికల్లో వ్యక్తులు గెలవడం ముఖ్యంకాదు. ప్రజల ఆకాంక్షలు గెలవాలి. ఇది టీఆర్ఎస్తో సాధ్యమవుతుంది. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. భీకరమైన కరువు, దరిద్రం పోయి సాగు నీరు రావాలంటే కల్వకుర్తిలో టీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన నాయకులు ఉన్నా.. పేదరికం, వెనకబాటుతనం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి దాకా పనికిమాలిన దందాలు చేశారని మండిపడ్డారు. వీరి కారణంగానే ప్రతిరంగంలో వెనకబాటుతనం ఉందని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో అన్నీ ధ్వంసం చేసినా కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోయారని అన్నారు. చివరకు కులవృత్తులనూ చెడగొట్టారని, ప్రజల హక్కుల కోసం ఏనాడూ వాళ్లు కోట్లాడలేదన్నారు. బాబు ఏంచేసిండు? ‘చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు మహబూబ్‌నగర్ జిల్లాని దత్తత తీసుకుని ఏం చేశాడో చూడలేదా? ఆయన కాలంలో తొమ్మిది సుక్కల నీళ్లైనా వచ్చినయా? నిరంతర కరెంటు, రైతుబంధు పథకం వచ్చిందా? నీటి తీరువా పన్నులు, భూమి శిస్తు వసూలు చేశారే తప్ప ప్రజలకు ఒరగపెట్టిందేమీ లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారు. ఇప్పుడు ఓట్లు కావాలని మీ దగ్గరికి వస్తున్నారు. అంత సిగ్గు.. శరం లేకుండా ఉన్నామా మనం? మన వేళ్లతోని మన కళ్లలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరుకు నీళ్లు రానివ్వని బాబు తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు? ఈ విషయంలో పాలమూరు రచయితలు, మేధావులు స్పందించాలి. గొర్రెల్లా, అమాయకుల్లా ఉండొద్దు’ అని కోరారు. నోట్ల కట్టలు ఇస్తానంటే ఎవరూ అమ్ముడు పోవద్దని, పౌరుషం లేకుండా ఉంటే బతుకులు వ్యర్థమైతాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తోందన్నారు. ఇప్పటికే 30 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, 30 చెరువులకు నీళ్లు వచ్చాయని వివరించారు. జిల్లాలో 80 కొత్త పంచాయతీలు ఏర్పాటైతే.. ఇందులో 57 తండాలు పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఈ పంచాయతీలన్నింటినీ ఇకపై లాంబాడీలే పాలించుకుంటారని చెప్పారు. ఆమనగల్లుకు వరాలు అధికారంలోకి రాగానే కల్వకుర్తి నియోజకవర్గ దశ తిరుగుతుందని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అభ్యర్థన మేరకు ఆమనగల్లుపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి విరివిగా నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యాన్ని 150 పడకలకు పెంచుతామని చెప్పారు. ఈ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు ఇజ్జత్‌కా సవాల్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ‘బక్కోన్ని కొట్టడానికి చాత కాకే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నుంచి చంద్రబాబును తెస్తున్నారు.. అంటే పాలమూరు ప్రజలం అంత ఇజ్జత్ లేకుండా ఉన్నామా? రేషం లేనోళ్లమా? ఆంధ్రా వలసవాద పార్టీ పెత్తనం పాలమూరులో అవసరమా’ అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు సుమారు 60 వేల మందికి పైగా ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... పాలమూరు అంటే అభిమానం పాలమూరుపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఇక్కడి ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు గర్వంగా ఉంది. అలాంటి జిల్లా ముందు ప్రస్తుతం ఓ చాలెంజ్ ఉంది. ఈ ఎన్నికల ఆషామాషీ ఎన్నికలు కావు. జిల్లా ప్రజల బతుకులు మార్చే ఎన్నిక. తొమ్మిదేళ్లు దత్తత తీçసుకుని జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక జిల్లాను వలసల జిల్లాగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు పార్టీకి పాలమూర్లో ఏం పని? ప్రజలు మేల్కోవాలి. మన కంటిని మన వేలితోనే పొడిపించేందుకు ఇక్కడ టీడీపీ పోటీ చేస్తోంది. పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని కేంద్రానికి 30 ఉత్తరాలు రాయడంతో పాటు సుప్రీం కోర్టులెఓ వేసిందని నిజం కాదా? కరువు జిల్లాకు సాగునీళ్లు, తాగు నీళ్లు రానివ్వని టీడీపీ పార్టీ అభ్యర్థి ఓటేయాలా? మనం ఆలోచించి టీడీపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలి. పాలమూరులో టీడీపీ అభ్యర్థి గెలిస్తే తెలంగాణ ఇజ్జత్ పోతది. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టవద్దని కేసులు వేసింది నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థులు కారా? ఇలాంటి నాయకులు జిల్లాలోఉండడం మన దరిద్రం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. రౌడీయిజం చెల్లదు... టీఆర్ఎస్ పాలనలో పాలమూరు పట్టణం ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ రౌడీయిజం చెల్లదు. మన బతుకులు చిన్నాభిన్నం చేసిన టీడీపీని ఓడించి పాలమూరు సత్తానుతెలంగాణకు చాటాలి. తుమ్మ చెట్లు మొలిచే పెద్ద చెరువును ట్యాంక్ బంగా మార్చిన ఘనత శ్రీనివాస్‌గౌడ్‌ది. మెడికల్ కాలేజీ, 3,700 డబుల్ బెడ్రూం ఇళ్ల కట్టడం పూర్తయింది. జిల్లా కేంద్రానికి మరో బైపాస్ రోడ్డు రావాల్సి ఉంది. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆయన లక్ష మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ సభకు 20, 30 వేల మంది వస్తారనుకుంటే.. ఇంత పెద్దమొత్తంలో వచ్చారు.. దీంతో శ్రీనివాస్‌గౌడ్ గెలుపు ఖయంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యోగుల సమస్యలు శ్రీనివాస్‌గౌడ్‌కు తెలుసు. ఉద్యోగుల అన్ని డిమాండ్లను పరిష్కరించుకుందాం.శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంచి స్థానంలో చూస్తారు. ప్రధాని హోదాలో మోదీ గల్తీ బాత్ ఎలా? దేశ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోదీ గారు తెలంగాణలో ప్రజలు కరెంట్, నీళ్ల కష్టాలు పడుతున్నారని గల్తీ బాత్ ఎలా మాట్లాడుతారు? నిజామాబాద్ సభలో ప్రధాని మాట్లాడుతు తెలంగాణలో కరెంట్ కష్టాలతో బాధపడుతున్నారని చెప్పి ఆయనలాంటి తెలివి తక్కువ ప్రధాని మరెవరూ లేరని అనిపించుకున్నారు. ఇప్పుడే హెలీక్యాప్టర్‌లో నిజామాబాద్‌కు వెళ్లి ప్రజలను అడుగుదాం. కరెంట్ కష్టాలు ఉన్నాయో, లేదో చూద్దామా? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చుకోవాలని చూస్తుంటే కేంద్రంలో మత పిచ్చి ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉండడంతో అడ్డంకులు వస్తున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాం. ఉద్యోగులకు ఐఆర్‌తోపాటు పీఆర్సీ ఇస్తాం. దద్దరిల్లిన ఆటాపాట... ప్రజా ఆశీర్వాద సభాప్రాంగణం లో కళాకారుడు సాయిచంద్ ఆటపాటలతో దద్దరిల్లిపోయింది. పాలమూర్‌కు శ్రీనివాస్‌గౌడ్ చేసిన అభివృద్ది పనులను తన పాటల ద్వారా వివరిస్తూ సభను హోరెత్తించారు. సాయిచంద్ పాటలకు కొంత మంది యువకులు, యువతులు నృత్యాలు చేశారు. సీఎం కేసీఆర్ సభకు వచ్చే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. కాగా, సీఎం కేసీఆర్ ప్రసంగం ముగుస్తున్న క్రమంలో ఒక్క సారిగా మైక్ కట్ కాగా ఆయన కొంత çఅసహనానికి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మైక్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తగా సరిచేశాక కేసీఆర్ మాట్లాడారు. ఈ సభలో శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఉపాధి హామీ మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధ, రాములు, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, శివరాజ్, కౌన్సెలర్లు ప్రసన్న, జ్యోతి, వనజ, రషీద్, అనిత, పెద్ద విజయ్‌కుమార్, ఇంతియాజ్, హాది, రవీందర్‌రెడ్డి, కృష్ణ ముదిరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏడు నెలల్లో పూర్తయిన తుమ్మిళ్లమహబూబ్నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఏళ్ల తరబడి ఆర్డీఎస్ ఆయకట్టు రై తాంగం నీళ్ల కోసం గోస పడుతున్నారు. ఆ రైతాంగ సమస్యను కేవలం ఏడు నెలల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తి చేశామని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్ సమస్యను ఉద్యమ కా లంలో ఉద్యమ నేతగా పాదయాత్ర చేసినప్పు డే కేసీఆర్ గుర్తించారన్నారు. ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు. గతంలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో పండేదని.. ఇప్పుడు సాగునీటి వనరులు పెరగడంతో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ఎంపీ తెలిపారు. నీవు ప్రజలకేం చేస్తవ్? టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సర్పంచ్ పదవి కో సం సొంత తమ్ముడి ని కడతేర్చిన వ్యక్తి ప్రజలకు ఏం సేవ చేస్తారని టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఎర్ర శేఖర్ కుటుంబ సభ్యులెవరూ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిపారు. రెండు నెలల క్రితం వరకు పట్టణంలో ఎలాంటి గొడవలు లేవని.. ఇప్పుడు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ మేరకు సత్యమ్మన్న అభిమానులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూర్లో దాదాగిరీ సాగదని.. ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో అందరు కుల సంఘాల సమావేశాలు పెడితే.. టీడీపీ అభ్యర్థి మాత్రం రౌడీ షీటర్లతో సమావేశమై ఒక్కొక్కరికి ఒక్క ఏరియా పంచి ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఆంధ్రా పార్టీని సాగనంపాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తే పాలమూర్ ప్రజల జీవితాలు ఆగం అవుతాయని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
అభ్యర్థులు వారే.. కూటములే మారాయి
సాక్షి, బూర్గంపాడు: పినపాక నియోజకవర్గం ఎన్నికల ముఖచిత్రం రివర్సయింది. 2009లో మహాకూటమి అభ్యర్థిగా సీపీఐ నుంచి పాయం వెంకటేశ్వర్లు బరిలో నిలిచారు. పోటీగా కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు బరిలో దిగి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా కాంతారావు బరిలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా అధికార టీఆర్ఎస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ రెండోసారి తలపడుతున్నారు. 2009 2009లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా జట్టు కట్టాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాం గ్రెస్ ఒంటరిగా పోటీలో నిలిచింది. ఆ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన పూర్తి బాధ్యత తనదేనని వైఎస్ ప్రకటించారు. 2009లో నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా బూర్గంపాడు నియోజవర్గాన్ని రద్దుపరిచి కొత్తగా పినపాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అనూహ్య పరిస్థితుల మధ్య కాంగ్రెస్ టిక్కెట్ దక్కించుకున్న రేగా కాం తారావు మహాకూటమి అభ్యర్థి పాయంపై 350 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన రేగా కాంతారావు విజయానికి వైఎస్ చరిష్మా ఎంతగానో ఉపయోగపడింది. 2014 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో జట్టు కట్టగా, టీడీపీ, బీజేపీలు జట్టుగా నిలిచాయి. ఈ రెండు కూటములకు వైఎస్సార్సీపీ, సీపీఎం కూటమి పోటీగా నిలిచాయి. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో నిలిచింది. 2014 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ సిట్టింగ్ సీటును సీపీఐకి కేటాయించింది. దీంతో ఈ ఎన్నికల్లో రేగా కాంతారావు పోటీలో నిలిచే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే సీపీఐ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన పాయం వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ఆ తరువాత పరిణామాలలో ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. 2018 ప్రస్తుత ఎన్నికల్లో పాత ప్రత్యర్థులు మళ్లీ తలపడుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పాయం మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టిన సీపీఐ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీలో నిలిచి.. టీడీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. ప్రస్తుతం ప్రధానపోటీదారులైన పాయం వెంకటేశ్వర్లు సీపీఐ నుంచి ఒకసారి, వైఎస్సార్సీపీ నుంచి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. పోటీచేసిన తొలిసారే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన రేగా కాంతారావు మరోసారి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. -
తలుపు తట్టుడే..!
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చమటోడ్చుతున్న అభ్యర్థులు ప్రచార శైలిని విభిన్నంగా మార్చారు. ఓవైపు మాస్‌గా ప్రచారం సాగిస్తూనే.. మరో వైపు ప్రతీ ఇంటి తలుపు తట్టే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోలింగ్ బూత్‌ల వారీగా బృందాలు కేటాయించగా, బీజేపీ ఓటరుజాబితాలోని పేజీల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేయడం విశేషం. బూత్‌స్థాయిలో కమిటీలు ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతీ ఇంటికి తమ ప్రచారం వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. గతంలో అభ్యర్థులు గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా, కాలనీల్లో మాత్రమే ప్రచారాన్ని పరిమితం చేశారు. ఓటరు స్లిప్‌లు పంచే సమయంలోనే ఇంటింటికి వెళ్లే వాళ్లు. కానీ.. ఈసారి చాలా ముందుగా ఎన్నికల వాతావరణం జిల్లాలో ఏర్పడడంతో అన్ని పార్టీలు ముందస్తు వ్యూహరచనలు చేశాయి. పల్లెలు, పట్టణాలు అనేతేడా లేకుండా అన్ని ఇళ్లను తట్టే విధంగా ప్రచారాన్ని రూపొందించాయి. అభ్యర్థులు ప్రచారం చేస్తూ వెళుతుంటే, కొన్ని ప్రత్యేక బృందాలు మాత్రం తమకు కేటాయించిన ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోనే నిమగ్నమవుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కోబూత్ పరిధిలో పదిమంది పార్టీ కార్యకర్తలు ప్రచారపర్వాన్ని నిత్యం కొనసాగిస్తుంటారు. ఆ బూత్ పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమపార్టీకే ఓటు వేయాలంటూ నేరుగా ప్రభావితం చేస్తారు. ఇక బీజేపీ రథసారథి అమిత్‌షా జాతీయస్థాయిలో పన్నిన వ్యూహాలను ఇక్కడా అమలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పోలింగ్ బూత్‌ను పరిగణలోకి తీసుకొని కమిటీలు వేస్తుంటే, బీజేపీ మాత్రం ఓఅడుగు ముందుకేసి కమ్మకమిటీ వేసింది. ఓటరుజాబితాలోని ఒకపేజీలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేసేదే కమ్మకమిటీ. దాదాపు 50 మంది ఓటర్లకు ఇన్‌చార్జీగా ఆ కమిటీ పనిచేస్తుండడంతో.. ప్రచార ప్రభావం ఓటర్లపై నేరుగా పడుతుందనే భావనతో అభ్యర్థులున్నారు. అందుకే పోలింగ్ బూత్‌స్థాయి కమిటీలు, కమ్మ కమిటీలకు పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఈ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేస్తేనే ఆ పార్టీల లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి నెట్వర్క్.. ఓటర్లను నేరుగా ప్రభావితం చేసేందుకు అన్నిపార్టీలు క్షేత్రస్థాయి నుంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాయి. బూత్‌కమిటీ, కమ్మ కమిటీలను సమన్వయపరిచేందుకు ఐదు గ్రామాలకు ఒక పార్టీ నాయకుడిని ఇన్‌చార్జీగా నియమించారు. ఈ గ్రామాల ఇన్చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేత ఒకరు పనిచేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో ప్రచార కమిటీలు నియమించడం విశేషం. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు, ఇతర పార్టీలకు చెందిన, తటస్థులుగా ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిచేపట్టారు. ఇదిలాఉంటే కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆయా సంఘాలతో టచ్‌లో ఉన్న సదరు నేతలు, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. -
పోటా పోటి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచా రం ఊపందుకుంది. ఈనెల 22న నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. అగ్రనేతల పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉండగా.. టీఆర్ఎస్–ప్రజాకూటమి (మహాకూటమి) అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొం డూరు నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తున్నా, కరీంనగర్, చొప్పదండిలలో హోరాహోరీగా పోరాడుతున్నా రు. మానకొండూరులోనూ బీజేపీ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఎల్ఎఫ్, బీఎస్పీ తదితర 14 పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 61 మంది పోటీలో ఉండగా.. ప్రధానంగా టీఆర్ఎస్–ప్రజాకూటమి అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: నామినేషన్ల ఉపసంహరణ గురువారం తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, బీజేపీ నేత అమిత్‌షా, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి తదితరులు కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో కేసీఆర్ సభ విజయవంతమైంది. కాగా.. మరోమారు ప్రచారానికి ఈనెల 25 నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. దీంతో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ప్రచారం దూకుడు పెంచాయి. శనివారం నాటికి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉంది. హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పో టీ జరుగుతున్నా.. ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది. 2009 వరకు కమలాపూర్, ఆ నియోజకవర్గం తర్వాత హుజూరా బాద్ నుంచి మొత్తం ఐదు పర్యాయాలు విజయ దుందుబి మోగించిన మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి ఆరోసారి విజయం సాధించేందుకు దూసుకెళ్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాలలో అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పాడి కౌశిక్‌రెడ్డిని ప్రకటించింది. ఈనెల 19న వీణవంక మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ నాలుగున్నరేళ్లలో చేసిన సుమారు మూడు వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మంత్రి ఈటల రాజేందర్ ›ప్రచారం చేస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘు ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. కరీంనగర్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి మొదటìసారిగా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ›ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రికార్డు స్థాయిలో నిధులు, పనులను ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ తనను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ బండి సంజయ్‌కుమార్ ఈసారి కూడా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ హిందుత్వ నినాదం, మోదీ పథకాలతో ముందుకెళ్తున్న ఆయన చాపకింది నీరులా ప్రచారం చేస్తున్నారు. మానకొండూరు (ఎస్సీ): మానకొండూరు నియోజకవర్గంలో మళ్లీ పాతకాపుల మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ పార్టీల మధ్యన నెలకొనగా టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బాలకిషన్‌కు అండగా మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ప్రచారం నిర్వహించగా.. మోహన్ కోసం మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి రోడ్‌షోలు నిర్వహించారు. ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు సైతం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు. చొప్పదండి (ఎస్సీ): చొప్పదండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బొడిగె శోభను నిరాకరించగా, ఆమె బీజేపీ నుంచి బరిలో దిగారు. తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన రవిశంకర్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరిస్తూ తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. -
ప్రచార హోరు..
ఎన్నికల రణరంగంలో రాటుదేలిన అభ్యర్థులు. ప్రధాన రాజకీయ పక్షాల్లో బరి సమంగా ఉండడంతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేయడం.. మొదట్లో కొన్నిచోట్ల అభ్యర్థులకు అసమ్మతి సెగ ఆందోళనకు గురిచేసినా.. పార్టీ నాయకత్వం సమసిపోయేలా చేయడం.. మరికొన్నిచోట్ల తీవ్రతను తగ్గించేలా చేయడంతో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఇక ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పలుచోట్ల ప్రజాకూటమి అభ్యర్థుల వ్యవహార శైలిపై భాగస్వామ్య పక్షాలు అసంతృప్తితో ఉండగా.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పోటీ చేస్తుండగా.. బీజేపీ పది స్థానాల్లోనూ.. బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి పది స్థానాల్లోనూ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పలు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాయి. ప్రధానంగా టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్యే పోటాపోటీ నెలకొంది. ఈసారి ఎన్నికల గోదాలోకి దిగిన ఇరుపక్షాల అభ్యర్థుల్లో అనేక మందికి గతంలో పోటీ చేసిన అనుభవం ఉండడం.. కొందరు పోటీ చేస్తున్న పార్టీకి కొత్త అయినా.. గత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరో పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ప్రధాన పార్టీ ప్రత్యర్థుల రాజకీయ బలాలు, బలహీనతలపై తమకున్న అవగాహన మేరకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుని ప్రచారంలో రాజకీయ అస్త్రాలను సంధిస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీ మూడు నియోజకవర్గాల్లో.. సీపీఐ ఒక నియోజకవర్గంలో బరిలో నిలిచింది. అయితే భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదలాయింపు అంశం ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ తొలిసారిగా మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, గతంలోనూ కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి కొనసాగించిన సీపీఐ ఈసారి సైతం కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఆయా పార్టీలకు.. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలం తమ గెలుపునకు దోహదపడుతుందని అభ్యర్థులు అంచనాలో మునిగితేలుతున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య సమన్వయం సాధించి.. రాజకీయ ప్రత్యర్థిపై కలిసికట్టుగా ప్రచారాస్త్రాలను సంధించాలన్న పార్టీల లక్ష్యం మాత్రం జిల్లాలో ఇంకా ఆచరణకు నోచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటి వరకు ఒంటరిగానే తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క తన ప్రచారం కొనసాగిస్తూనే.. మధిరకు గల రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో కలిసి నియోజకవర్గంలో ఒక దఫా ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు, పాలేరు, మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు, మూడు రోజుల్లో జిల్లాకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరాలో ప్రజాకూటమి అభ్యర్థిగా సీపీఐ నుంచి గుగులోతు విజయాబాయి పోటీ చేస్తుండగా.. ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రాములునాయక్ రంగంలో ఉండడం, ఆయన కాంగ్రెస్ శ్రేణులతో నిత్యం సమావేశాలు నిర్వహించడం.. టీఆర్ఎస్ అసమ్మతి నేతలను తనవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ శ్రేణులు ప్రచార పర్వంలో పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడంపై సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. వైరాలో కాంగ్రెస్ శ్రేణులు సహకరించేలా చూడాలని, లేదంటే కూటమి భాగస్వామ్య పక్షమైన తమ పార్టీ శ్రేణులు ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహకరించే అంశంపై ప్రభావం పడుతుందని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వైరా నియోజకవర్గంలోని పరిస్థితులను చక్కబెట్టే పనిని భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేంసూరు మండలంలో రోడ్‌షో నిర్వహించారు. ప్రచారంలో భాగస్వామ్యం కల్పించకపోవడంపై అసంతృప్తి ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచార సరళి కాంగ్రెస్ శ్రేణులను పూర్తిస్థాయిలో మమేకం చేయలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన పక్షాన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ బహిరంగ ప్రచారానికి రాకపోవడం.. పార్టీ ప్రచారం, ఇతర వ్యవహారాల్లో కూటమి నేతల పాత్ర నామమాత్రంగా ఉండడం.. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది ప్రచారంలో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు, టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడంపై టీడీపీ వర్గాల్లోనే ‘మారిందన్నావురో.. ఎక్కడ మారిందిరో’ అంటూ తమ పార్టీ నేతల వ్యవహార శైలిపై వ్యంగ్య వాగ్భాణాలు వదులుతున్నారు. కూటమి పక్షాన జరిగే ప్రచారంలో తమకు పూర్తిస్థాయి సమాచారం ఉండడం లేదని ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ శ్రేణులు నిర్వేదం చెందుతుండగా.. వచ్చిన వారినే కలుపుకుపోతామనే భావనతో ప్రచార పర్వాన్ని భుజానికెత్తుకున్న టీడీపీ నేతలు వ్యవహరిస్తుండడంతో ఖమ్మం నియోజకవర్గంలో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి మనుషులు కలిసినా.. మనసులు కలవని పరిస్థితి నెలకొందనే విమర్శలు వినవస్తున్నాయి. ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సీనియర్ నేతల్లో సైతం అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నా.. తమను ప్రజాకూటమి అభ్యర్థి పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని అనేక సందర్భాల్లో తమ సమీప ప్రాంతాల్లో జరిగే ఆత్మీయ సమావేశాలకు, కార్యకర్తల సమావేశాలకు ఆహ్వానం సైతం ఉండడం లేదని మథన పడుతున్నట్లు సమాచారం. ఖమ్మం టికెట్ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కూటమిలోని భాగస్వామ్య పక్షం ఆయన సేవలను వినియోగించుకోకపోవడంపై సుధాకర్‌రెడ్డి వర్గీయుల్లో అసంతృప్తి రగులుతోంది. అయితే ఈనెల 28న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండడంతో ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాగం హేమంతరావు తదితరులు ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించి.. కూటమి విజయానికి సర్వశక్తులు ఒడ్డుతామని స్పష్టం చేశారు. -
టీడీపీ ఇంటింటా ప్రచారం
సాక్షి,సత్తుపల్లిటౌన్: ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రామిశెట్టి సుబ్బారావు, గాదె చెన్నకేశవరావు, దేవళ్ల పెద్దిరాజు, గాదెరెడ్డి సుబ్బారెడ్డి, పింగళి సామేలు, కిరణ్, పూచి గోవర్ధన్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, నారాయణ, గురవయ్య, రాజేష్, గోపి, రాము, శ్రీను, వెంకటేశ్వరరావు, బాపయ్య, లక్ష్మణ్, ఆదినారాయణ పాల్గొన్నారు. టీడీపీ ఇంటింటా ప్రచారం కల్లూరురూరల్: మండల పరిధిలోని వెన్నవల్లిలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపునకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, పక్కా గృహాలు మంజూరు చేయలేదని నాయకులు వివరించారు. రానున్న మహాకూటమి ప్రభుత్వంలో పేదలందరికీ స్వంత స్థలాల్లోనే ఇండ్లు కట్టిస్తుందని, దీంతోపాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఇనుపనూరి మోహనరావు, మేడి సీతయ్య, అంజి, మత్తే సత్యం, మాజీ సర్పంచ్ ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, గుమ్మా భాస్కర్‌రావు, మార్తా పెద్దిరాజు, కావేటి వెంకట శ్రీను, ఖమ్మం పాటి వెంకటేశ్వర్లు, జాని, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోడ్డుపై సేద తీరిన నాయకులు సత్తుపల్లి: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రచారంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం కాకర్లపల్లి గ్రామానికి వస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎదురు చూశారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కాకర్లపల్లి గ్రామానికి రావాల్సి ఉండగా.. ప్రచారం ఆలస్యం కావటంతో.. రాత్రి 7.30 గంటల వరకు ఎదురు చూశారు. గ్రామ శివారులో ఆలసిపోయిన టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డా శంకర్రావు, కార్యకర్త లాల్‌కుమార్ రోడ్డుపైనే సేద తీరారు. -
ఓట్లు రాబట్టడం ఎలా?
పల్లె పట్నం.. ఊరూవాడా.. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యరులను రెండున్నర నెలల కిందటే ప్రకటించినా.. మహాకూటమి అభ్యర్థుల జాబితాలో ఆలస్యమైంది. బీజేపీ సైతం ఐదు స్థానాలు మినహా అన్నింటా అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల కూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో జాప్యం కారణంగా ఆపార్టీల అభ్యర్థులు ఆలస్యంగా ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన పోటీ టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. అక్కడక్కడా జైభారత్ జనసేన, ఆర్పీఐ, బహుజన రాష్ట్ర సమితి, దళిత బహుజన పార్టీ, ఇండియన్ ప్రజాబంధు, తెలంగాణ కార్మిక రైతురాజ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, ఏఐఎఫ్బీ, బీఎల్ఎఫ్ తదితర 14 పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నా.. పోటీ నామమాత్రంగానే ఉంది. సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 12,39,497 మంది పురుషులు 12,65,662 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సైతం ముగిసి ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఓట్లు రాబట్టడం ఎలా? అన్న అంశంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సామాజిక వర్గాలు, యువత, మహిళలు, వృద్ధులు.. కేటగిరీల వారీగా ఏ వర్గాల ఓటు బ్యాంకు ఎంత? అగ్రవర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు ఉన్నాయి? ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను ఆకర్షించడం ఎలా? వచ్చే ఎన్నికల్లో ఏవర్గం ఓట్లు ఏ నియోజకవర్గంలో ఏమేరకు ప్రభావం చూపుతాయి? అంటూ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఓటు బ్యాంకు లెక్కల్లో పడ్డాయి. నోటిఫికేషన్ విడుదల వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా అన్ని పార్టీల్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు రాబట్టడం ఎలా? అన్న వ్యూహాల్లో ఉన్న అభ్యర్థులు.. ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు.. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారాలపై ఆశలు పెట్టుకున్నారు. ఎనిమిది స్థానాల్లో మహిళలే అధికం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో పురుషులు 12,39,497 మంది కాగా, మహిళా ఓటర్లు 12,65,662 మంది ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే మాత్రం ఆరు స్థానాల్లో మహిళలు, మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరో చోట దాదాపుగా పురుష ఓటర్లతో మహిళలు సమానంగా ఉన్నారు. వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా, కరీంనగర్, రామగుండం, మంథని, పెద్దపల్లిల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు. హుజూరాబాద్‌లో పురుషులు 1,02,903 కాగా, మహిళా ఓటర్లు 1,02,919లు కాగా, మానకొండూరులో పురుషులు 99,133లు, మహిళల ఓటర్లు 99,965లుగా ఉన్నారు. మంథనిలో కూడా మహిళ ఓటర్లు 1,00,860 కాగా, పురుష ఓటర్లు 1,00,989తో స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో టీఆర్ఎస్ ఉండగా.. దీనిని గమనించిన కాంగ్రెస్ నేతలు జిల్లాస్థాయిలో ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ మద్దతు ఓట్లలో చీలిక తెచ్చే వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో సైతం ప్రధాన పార్టీలు ఓటుబ్యాంక్ లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటం, సామాజికవర్గాల వారీగా ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఏంచేద్దాం.. ఎలా వెళ్దాం!
పల్లె పట్నం.. ఊరూవాడా.. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యరులను రెండున్నర నెలల కిందటే ప్రకటించినా.. మహాకూటమి అభ్యర్థుల జాబితాలో ఆలస్యమైంది. బీజేపీ సైతం ఐదు స్థానాలు మినహా అన్నింటా అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల కూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో జాప్యం కారణంగా ఆపార్టీల అభ్యర్థులు ఆలస్యంగా ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన పోటీ టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. అక్కడక్కడా జైభారత్ జనసేన, ఆర్పీఐ, బహుజన రాష్ట్ర సమితి, దళిత బహుజన పార్టీ, ఇండియన్ ప్రజాబంధు, తెలంగాణ కార్మిక రైతురాజ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, ఏఐఎఫ్బీ, బీఎల్ఎఫ్ తదితర 14 పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నా.. పోటీ నామమాత్రంగానే ఉంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 12,39,497 మంది పురుషులు 12,65,662 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సైతం ముగిసి ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఓట్లు రాబట్టడం ఎలా? అన్న అంశంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సామాజిక వర్గాలు, యువత, మహిళలు, వృద్ధులు.. కేటగిరీల వారీగా ఏ వర్గాల ఓటు బ్యాంకు ఎంత? అగ్రవర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు ఉన్నాయి? ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను ఆకర్షించడం ఎలా? వచ్చే ఎన్నికల్లో ఏవర్గం ఓట్లు ఏ నియోజకవర్గంలో ఏమేరకు ప్రభావం చూపుతాయి? అంటూ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఓటు బ్యాంకు లెక్కల్లో పడ్డాయి. నోటిఫికేషన్ విడుదల వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా అన్ని పార్టీల్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు రాబట్టడం ఎలా? అన్న వ్యూహాల్లో ఉన్న అభ్యర్థులు.. ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు.. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారాలపై ఆశలు పెట్టుకున్నారు. ఎనిమిది స్థానాల్లో మహిళలే అధికం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో పురుషులు 12,39,497 మంది కాగా, మహిళా ఓటర్లు 12,65,662 మంది ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే మాత్రం ఆరు స్థానాల్లో మహిళలు, మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరో చోట దాదాపుగా పురుష ఓటర్లతో మహిళలు సమానంగా ఉన్నారు. వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా, కరీంనగర్, రామగుండం, మంథని, పెద్దపల్లిల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు. హుజూరాబాద్‌లో పురుషులు 1,02,903 కాగా, మహిళా ఓటర్లు 1,02,919లు కాగా, మానకొండూరులో పురుషులు 99,133లు, మహిళల ఓటర్లు 99,965లుగా ఉన్నారు. మంథనిలో కూడా మహిళ ఓటర్లు 1,00,860 కాగా, పురుష ఓటర్లు 1,00,989తో స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో టీఆర్ఎస్ ఉండగా.. దీనిని గమనించిన కాంగ్రెస్ నేతలు జిల్లాస్థాయిలో ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ మద్దతు ఓట్లలో చీలిక తెచ్చే వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో సైతం ప్రధాన పార్టీలు ఓటుబ్యాంక్ లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటం, సామాజికవర్గాల వారీగా ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం
సాక్షి,ఆళ్లపల్లి: కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమమని, పినపాకలో కూటమి అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు ఖాయమని కూటమి నాయకులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మహాకూటమి గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నిలదీయాలని వారు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్‌తోనే సంక్షేమమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటువేసి రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పాయం నర్సింహరావు, రేసు ఎల్లయ్య, శ్రీనివాసచారి, పడిగ సమ్మయ్య, బుర్ర వెంకన్న, ఆదాం, ఆరీఫ్, వెంకన్న, ఖాలీద్, పరమేష్, ప్రశాంత్, రాజేష్, శివ, లక్ష్మయ్య, ఎన్.శివ, హరీష్, అగ్ని, మాణిక్యమ్మ పాల్గొన్నారు. -
పొత్తు.. గల్లంతు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టయ్యింది... జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పొత్తులు, సీట్ల కేటాయింపులు జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేశాయి. ఫలితంగా సీనియర్ నాయకుడు ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని కంటతడి పెట్టి గులాబీ గూటికి చేరగా.. మరో నాయకుడు ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోటీ నుండి అనివార్యంగా నిష్క్రమించాల్సిన దుస్థితి నెలకొంది. పార్టీలో సీనియర్ నాయకులకు జరిగిన అవమానాన్ని తలచుకుని రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంగ్రెస్‌లో ఉన్న జూనియర్ నాయకులు అయోమయంలో పడ్డారు. సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ టికెట్ వస్తుందని గత యాభై రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో గ్రామగ్రామాన మాజీ మంత్రి ముత్యం రెడ్డి ప్రచారం చేశారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించి, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకున్న పెద్దాయనకు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్రంగా కలత చెందారు. తనను పరామర్శించడానికి ఇంటికొచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ముందు కంట తడి పెట్టారు. పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ముత్యం రెడ్డి వంటి వారే బోరున విలపించడంతో కార్యకర్తలు నివ్వెరపోయారు. నియోజకవర్గంలో కొందరు ముత్యం రెడ్డితోపాటు టీఆర్ఎస్ గూటికి చేరగా.. మరికొందరు కాంగ్రెస్‌లో ఉండి ముందుకు నడవలేక.. అలాగని టీఆర్ఎస్లో చేరలేక సంకట స్థితిలో ఉన్నారు. ముత్యం రెడ్డి కేడర్ ఆయనతోనే ఉందని, మంగళవారం సిద్దిపేటలో జరిగిన సీఎం సభకు దుబ్బాక నియోజకవర్గం నుండి ముత్యం రెడ్డి అనుచరులు వేలాదిగా తరలి వచ్చారని ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీ ఫారం తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి ఎంతమాత్రం రాణిస్తారో వేచి చూడాల్సిందే. స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని కోల్పోయిన ప్రవీణ్‌రెడ్డి జిల్లాలోని మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హుస్నాబాద్‌కు చెందిన ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ సీట్ల పంపకాల్లో హుస్నాబాద్ సీటును సీపీఐకి కేటాయించింది. అయితే రాష్ట్రంలో టీజేఎస్‌కు కేటాయించిన సీట్లలో మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీ ఫారాలు కూడా ఇచ్చారు. తనకు కూడా ఇస్తారనే ధీమాతో ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గుర్తింపు పొందిన పార్టీ నుండి నామినేషన్ వేస్తుండటంతో నామినేషన్‌కు ఒక్కరు మాత్రమే ప్రతిపాదించారు. అయితే తీరా సమయానికి బీ ఫారం రాకపోవడంతో ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అనివార్యంగా ప్రవీణ్‌రెడ్డి పోటీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఇస్తుందనే నమ్మకంతో మోసపోయానని, మోసం చేస్తుందని అనుకుంటే స్వతంత్రంగా పోటీలో ఉండేవాడినని ప్రవీణ్‌రెడ్డి తన అనుచరులతో చెప్పి వాపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో ప్రవీణ్‌రెడ్డి ఆయన అనుచరులు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డికి మద్దతు తెలుపుతారా..లేదా అనేది కూడా నియోకవర్గంలో చర్చనీయాంశమైంది. -
దోపిడీ పాలకులను తరిమికొట్టాలి
చర్ల నల్గొండ: రాష్ట్రంలో, దేశంలో ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్న పాలక ప్రభుత్వాలను తరిమికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. భద్రాచలంలో బీఎల్ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం మండలంలోని ఆర్కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గం పోరాటాల గడ్డ అని, ఇక్కడి ఓటర్లు నిరంతరాయంగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించి సీపీఎంను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో, దేశంలో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు దళితులు, గిరిజనుల గురించి మాట్లాడే అర్హత లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. హక్కుల కోసం ఆదివాసీలు ఆత్మ గౌరవ పోరాటాలు చేపట్టి దానిని ముందుకు తీసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లలో ప్రజలకు చేసింది శున్యమని అన్నారు. ప్రజలపై అప్రకటిత యుద్ధం చేస్తూ వారి హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రజలపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నోళ్లు మూసుకున్నాయని విమర్శించారు. ఇప్పుడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని, ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు కోసం సీపీఎం అగ్రభాగాన నిలిచి పోరాటాలు సాగించిందని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న భూములన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. భూములను బలవంతంగా లాక్కొందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కేరళ రాష్ట్రంలో సీపీఎం ప్రభుత్వ హయాంలో ఒక్క రైతూ ఆత్మహత్యకు పాల్పడలేదన్నారు. డిసెంబర్ 7న జరరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అభ్యర్థులను ఓడించి సీపీఎం అభ్యర్థిని గెలించాలని కోరారు. ఈ ఎన్నిల ప్రచార సభలో అభ్యర్థి మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బ్రహ్మాచారి, తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం నరేష్, మురళీకృష్ణ, రాంపండు, ముత్యాలరావు, వినోద్ పాల్గొన్నారు. -
‘స్టార్’లొస్తున్నారు..
ముందస్తు ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. ప్రచారానికి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలను రప్పించే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి, గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలు నిర్వహించి ఆయా పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. తాజాగా గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడింది. దీంతో మిగిలిన 13 రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు సభల నిర్వహణ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే కొందరు అగ్రనేతల పర్యటనల షెడ్యూల్‌ను ప్రకటించిన రెండు ప్రధాన పార్టీలు.. మరో రెండు మిగతా షెడ్యూల్ సైతం ఖరారు చేసేందుకు కసరత్తులో మునిగాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు సోనియాగాంధీ శుక్రవారం హైదరాబాద్‌లో సభకు హాజరవుతుండగా, 24 నుంచి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్లంతా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్‌రెడ్డి ఈ నెల 24 కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యంతో వహిస్తున్న సిరిసిల్లతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నారు. 26న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మరోమారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు, సభలు నిర్వహించనున్నారు. జగిత్యాల, కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ, 2:45కు కరీంనగర్లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవితలు సైతం ఆయా నియోజవకర్గాల్లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రానున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలో ఓ సభకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి తదితరులు ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కూడా ఆ కూటమి అగ్రనేతలతో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. -
ఎక్కడి నాయకులు అక్కడే..
సిరిసిల్ల: ముందస్తు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగానే సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మంగళవారం సభ నిర్వహించడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయగా మంగళవారం నిర్వహించిన సీఎం సభకు మాత్రం భారీ జనసమీకరణ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి జనాలను సమీకరించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థులు కేటీఆర్, రమేశ్‌బాబు సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులతో సభ సక్సెస్ చేయాలని స్పష్టం గా చెప్పి ఆ మేరకు జనాన్ని సమీకరించి విజయవంతమయ్యా రు. టీఆర్ఎస్కు ఇదే పెద్దసభ కావడంతో ఇకక్షేత్రస్థాయి ప్రచా రంలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఎక్కడి నాయకులు అక్కడే.. ఏ ఊరు నాయకులు ఆ ఊరిలోనే క్షేత్రస్థాయిలో ప్రచారాలు ని ర్వహించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించాలన్నారు. గడపగడపకూ గులాబీజెండా చేరాలని, ప్రతీ ఓటరుకు గులాబీ పార్టీ చేసిన ప్రయోజనాలను వివరించాలని కేటీఆర్ ఉద్బోధించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఏఎంసీ, సింగిల్‌విండో చైర్మన్లు, సింగిల్‌విండో, ఏఎంసీల డైరెక్టర్లు, సెస్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పల్లెబాటపట్టాయి. ఈ పక్షం రోజులు పనిచేయాలని గులాబీబాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో పటిష్టమైన ప్రణాళికతో గెలుపుకోసం టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. సభలో సీఎం ఉత్సాహం.. సిరిసిల్ల సభలో సీఎం కేసీఆర్ ఉత్సాహంగా స్థానిక నేతలతో ముచ్చటిస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. సభకు భారీగా జనం రావడంతో ఆ పార్టీ శ్రేణులు సభా విశేషాలను బుధవారం చర్చించుకోవడం కనిపించింది. సీఎం కేసీఆర్ జిల్లా నాయకులను పేరుపెట్టి పిలుస్తూ పలకరించడాన్ని టీఆర్ఎస్ నాయకులు ఉటంకించారు. మొత్తంగా సిరిసిల్లలో సీఎం సభ సక్సెస్ కావడంతో రెట్టింపు ఉత్సాహంతో గులాబీ శ్రేణులు ప్రచార పర్వంలో బీజీ అయ్యారు. -
బరిలో నిలిచేదెవరో..!
సాక్షి, సిరిసిల్ల: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం తుది గడువు కాగా ఎంతమంది బరిలో నిలువనున్నారు.. ఎంతమంది తప్పుకోనున్నారో, అసలు పోటీదారులెందరో తేలనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకరు, వేములవాడ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌పత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు అంగీకరించడంతో ఆయా పార్టీల అనుబంధంగా వేసిన ఇతర అభ్యర్థులతోపాటు, నామినేషన్ పత్రాలను సరిగా పూర్తిచేయని మరికొంత మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపసంహరణ తర్వాత ఎన్నికల పోరులో నిలువనున్న అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల్లోకి చేరికలు, నియోజకవర్గం అంతటా పర్యటనలు, ర్యాలీలు, ప్రచార వ్యూహాలతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రచారానికి మిగిలింది 14 రోజులే.. ముందస్తు ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేసుకుని మలిదశ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా 14రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మైలేజీ పొందేలా అభ్యర్థులు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ నియోజకవర్గంలో ఏదోఒక మూలన సభ, ర్యాలీ, సమావేశం, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళిక చేసుకుంటున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లో పార్టీలు, జెండాల వేడి ఇంతకింతకు రాజుకోనుంది. పెద్ద తలలపైనే భారం.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో తమ శక్తియుక్తులను ధారబోశారు. ఇకపై ఉన్న సమయంలో తమదైన ప్రచారంతోపాటు తమతమ పార్టీల పెద్దల ప్రచార స మయాన్ని నియోజకవర్గంలో కేటా యించాలని ప్రయత్నాలు చేసుకుం టున్నారు. ఇప్పటి కే గులాబీ అధినేత కేసీఆర్ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వేడి పుట్టించగా.. అదే దిశగా మిగిలిన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు స్టార్ కాంపెయినర్ల సమయం కోసం జిల్లాలోని అభ్యర్థులు వేచిచూస్తున్నారు. వారిరాక కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మిగిలిన రెండు వారాల సమయంలో జిల్లాలో వివిధ పార్టీల నేతల అధినేతలు, పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్లతో మోత పుట్టించేం దుకు ఆయా పార్టీల అభ్యర్థులంతా రెడీ అవుతున్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైన సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి 1) అర్వరాజు కృష్ణంరావు – న్యూఇండియా పార్టీ వేములవాడ అభ్యర్థులు.. 1) ఆది వనజ – కాంగ్రెస్ 2) ప్రతాప మార్తాండ తేజ – బీజేపీ 3) చెల్మెడ రాజేశ్వర్‌రావు – టీఆర్ఎస్ 4) మ్యాకల ఉదయ్‌కుమార్ – సమజ్వాదీ పార్టీ 5) కొండ దినేశ్ – ఇండిపెండెంట్ 6) గోగుల రమేశ్ – సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా 7) గంటా ఇస్తరీ – ఇండిపెండెంట్ -
త్వరలో రైలు కూత: హరీశ్‌రావు
మెదక్ మున్సిపాలిటీ: వలస వాద పార్టీలతో పొత్తు పెట్టుకున్న లైన్‌లైని కూటమి ప్రజలకేం చేస్తుందని, ప్రజలకోసం పనిచేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ మొదలుకొని ఎందరో హామీలిచ్చినా మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లా ఏర్పాటు కలను నెరవేర్చుకున్నామన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఆగిపోలేదని, పద్మాదేవేందర్‌రెడ్డి నాయత్వంలో జిల్లాకు రైల్వేలైన్ కూడా పూర్తి కానుందన్నారు. రెండు, మూడు నెలల్లో మెదక్‌కు రైలు కూత వినిపించబోతుందన్నారు. అలాగే మెదక్‌కు ఇటీవలే రింగురోడ్డు మంజూరైందని, చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే పూర్తిగా గుంతలమయంగా ఉండేదని, ప్రస్తుతం ఆ రోడ్డుపై వస్తుంటే ఏయిర్‌పోర్టులో రన్‌వే మీద వెళ్తున్నట్లుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక చెక్‌డ్యాం కూడా నిర్మించలేదని, 21వేల ఎకరాలకు నీరందించాల్సిన ఘనపురం ఆనకట్ట కాంగ్రెస్ హయాంలో 10వేలకు పడిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద కోట్లతో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో ఘనపురం ఆనకట్ట నీళ్లు కావాలంటే పాపన్నపేట రైతులు పత్రాలు పట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కాని టీఆర్ఎస్ హయాంలో పద్మాదేవేందర్‌రెడ్డి ఒక ఫోన్‌చేస్తే సీఎం కేసీఆర్ స్పందించి రెండు పంటలకు నీటి విడుదల చేయించారన్నారు. రూ.2కోట్లతో మెదక్‌లో రైతు బజార్, స్థానిక పిట్లం చెరువులో రూ.9కోట్లతో మినీ ట్యాంకుబండ్ నిర్మించడం జరుగుతుందన్నారు. పాపన్నపేట రైతులు మాకు మార్కెట్ యార్డు కావాలి...జోగిపేట, మెదక్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి కోరగానే రూ.3కోట్లతో మార్కెట్ యార్డు గోదాములు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరవై యేళ్ల పాలనలో ఏడుపాయల దుర్గమ్మకు కేవలం పట్టు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించారే తప్ప రాష్ట్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడుపాయల అభివృద్ధికి ప్రతియేడు కోటి రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రామాయంపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతోపాటు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్‌కు మహిళా డిగ్రీ కళాశాల సా«ధించిన పద్మాదేవేందర్‌రెడ్డిదేనన్నారు. చరిత్రలో ఎన్నడులేని విధంగా మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డి గెలుస్తుందన్నారు. మహా కూటమి మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డినే గెలిపించాలని ప్రజలను కోరారు. -
నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎడవల్లి కృష్ణ, కూటమి నుంచి కూనంనేని సాంబశివరావులు ఓట్లను సాధించారు. ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు. -
మహాకూటమి ఓ మాయకూటమి : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను ఆకర్షించటంలో మహాకూటమి విఫలమైందని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి అన్నారు. మహాకూటమిని మాయకూటమిగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమిలో 119 స్థానాలుంటే 130 మంది నామినేషన్ వేశారన్నారు. మహాకూటమిలో ఉన్నవారే ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంలో కేసీఆర్ యజ్ఞాలు చేస్తున్నారని, ఇప్పుడు ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పోలీసుల నిర్భంధాల కారణంగా ప్రజలు ధర్నాలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్ 7 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా రోహింగ్యాలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డులు వారికి ఎలా వచ్చాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
‘కూటమి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది’
సాక్షి, సిద్దిపేట : మహాకూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యిందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకే సీటు లేదని, రాత్రి ఇచ్చిన జనగామ సీటును తెల్లారి లేదనటం ఏంటన్నారు. మహాకూటమిని ఎటుకాకుండా చేశారన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకంలేదని, మహాకూటమిపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను విషకౌగిలి, దృతరాష్ట కౌగిలిగా అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ దక్కుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో చేతులు కలిపిన వారి పరిస్థితి అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ సభలో చంద్రబాబు నాయుడు కూర్చుంటారా అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఇచ్చే నోట్ల కట్టలు కావాలి కానీ చంద్రబాబు కాదు’ అని అన్నారు. -
కాంగ్రెస్ నాయకులు బుజ్జగింపులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగకుండా పార్టీ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. జిల్లాలో టికెట్లు దక్కని నేతలను ఆ పార్టీ సీనియర్లు బుజ్జగించారు. ఏఐసీసీ సభ్యులు రంగంలోకి దిగి మల్రెడ్డి రంగారెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిలతో చర్చించారు. భవిష్యత్‌లో పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని హామీ ఇచ్చారు. రెబల్స్‌గా బరిలోకి దిగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను మల్రెడ్డి, రాజేంద్రనగర్ టికెట్‌ను పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆశించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేసి ఓటమి పాలైన మల్రెడ్డి రంగారెడ్డి ఈసారి ఇబ్రహీంపట్నం టికెట్ దక్కుతుందన్న దీమాతో ఉన్నారు. అలాగే రాజేంద్రనగర్ సెగ్మెంట్‌ని ఆశించిన కార్తీక్ రెడ్డి కొంతకాలంగా ఈ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలు అనూహ్యంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. వీరిద్దరికి టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు తదితరులు.. టికెట్ దక్కని అభ్యర్థులు, సీట్ల సర్దుబాటులో నష్టపోయిన వారితో సమావేశమయ్యారు. మన జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, కార్తీక్రెడ్డిలు ఈ భేటీకి హాజరయ్యారు. ఏ పరిస్థితులు, కారణాల వల్ల ఇతరులకు సీట్లు ఇవ్వాల్సి వచ్చిందో వారికి వివరించారు. ఈ క్రమంలో కార్తీక్ రెడ్డి కాస్త శాంతించారు. ఆయన తల్లి సబిత పోటీలో ఉన్న దృష్ట్యా మెత్తబడ్డారు. అయితే టికెట్ తెచ్చుకోవాలని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ సవాల్ విసిరాడని, తనకు టికెట్ దక్కదని ముందే ఆయనకెలా తెలిసిందనే అంశంపై కమిటీ సభ్యుల ఎదుట కార్తీక్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మల్రెడ్డి నేడు నామినేషన్ ఇదిలావుండగా.. ఇబ్రహీంపట్నం టికెట్‌పై మల్రెడ్డి ఏమాత్రం పట్టువీడనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున సోమవారం నామినేషన్ వేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విలేకరులతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ కుమ్మక్కై సామ రంగారెడ్డిని బలి పశువును చేశారని ఆయన ఆరోపించడం కొసమెరుపు. -
కూటమిపక్షాలకు మొండి'చేయి'
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ మహాకూటమి ఊసు లేకుండా పోయింది. ఇప్పటికే ఆ పార్టీ పదకొండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇక మిగిలిన మిర్యాలగూడ టికెట్‌ను ఆదివారం రాత్రి తన ఖాతాలో వేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క స్థానంపై తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నాయి. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ప్రకటించింది. కాగా, టీజేఎస్ అభ్యర్థిగా గవ్వా విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్‌లో ఆదివారం బీఫాం కూడా అందజేశారు. మరో వైపు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని ఆశపడుతున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఒకవేళ ఈ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తే తాను రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిం చడంతో తరువాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. మొత్తానికి కూటమి పక్షాలకు ఎక్కడా అవకాశం రాకపోగా, అన్ని చోట్లా కాంగ్రెస్ పోటీలో ఉంది. కూటమి పక్షాల డకౌట్ కాంగ్రెస్ మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ సీట్లు ఆశించాయి. టీడీపీ కోదాడ, లేదంటే నకిరేకల్ ఇవ్వాలని పట్టుబట్టాయి. సీపీఐ ఆలేరు లేదా మునుగోడు కావాలని భీష్మించాయి. ఆ పార్టీకి రాష్ట్రంలో మూడు స్థానాలే కేటాయించడం సమస్యగా మారింది. ఒకవేళ అదనంగా తమకు ఓ స్థానం ఇస్తే దేవరకొండ కావాలని ఆపార్టీ కోరింది. మరోవైపు టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ గురించే పట్టుబడుతోంది. తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్‌ను కోరుతూ వచ్చింది. ఒక దశలో ఆ పార్టీకి నకిరేకల్ ఇస్తున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. ఇది కాదంటే మునుగోడు గురించి చర్చ జరుగుతుందన్నారు. తీరా కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాక కూటమి పక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకుండా పోయాయి. ప్రతి ఎన్నికల్లో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీపీఐ ఈసారి మాత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతకుముందు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈసారి ఆ పార్టీ ఎన్నికల బరిలోనే లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ కూటమినుంచి బయటకు వచ్చేసి నకిరేకల్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో సుదీర్ఘ కాలం ఆధిపత్యం వహించిన టీడీపీ కూడా ఈసారి ఒక్కస్థానం నుంచి కూడా పోటీలో లేకుండా అయ్యింది. బయటకు వస్తున్న నేతలు కాంగ్రెస్, కూటమిలోని ఇతర పార్టీల నుంచి టికెట్లు ఆశించిన నేతలు ఇక, తమకు టికెట్లు రావన్న నిర్ధారణకు వచ్చాక సొంత పార్టీలను వీడుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్ ఏడాది కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిందే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందన్న ఆశతో. కానీ, కాంగ్రెస్ ఆయనకు మొండిచేయి చూపెట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్‌కు దేవరకొండ టికెట్‌ను ప్రకటించడంతో బిల్యానాయక్ కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చారు. సోమవారం ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక, టీడీపీనుంచి కోదాడ టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్‌కూ అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానం కావడంతో తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతికే అభ్యర్థిత్వం ఖరారు చేసింది. దీంతో అవకాశం కోల్పోయిన మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇలా ఆయా స్థానాల్లో బలమైన నాయకులు అనుకున్న వారు సొంత పార్టీలను వీడి బయటకు వచ్చి పోటీకి సిద్ధమవుతున్నారు. -
టీడీపీ కథ కంచికే!
అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు కనిపించకుండా పోనుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా పోయింది! మహా కూటమి పేరుతో కాంగ్రెస్‌తో జత కట్టినా, బరిలో నిలిచేందుకు టీడీపీ వెనుకడుగు వేసింది. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైనట్లయింది. మోర్తాడ్(బాల్కొండ): ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ జెండా కనుమరుగు కానుంది. ఈవీఎంలలో సైకిల్ గుర్తు కనిపించకుండా పోనుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఎక్కడ కూడా పోటీలో లేకుండా పోయింది. దీంతో రెండున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ రెండు జిల్లాల్లో ఉనికే లేకుండా పోయింది. తెలుగు వారిని ఏకం చేయాలనే నినాదంతో ఆనాడు సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్రకు మహాకూటమి పొత్తుతో ఉమ్మడి జిల్లాలో చరమగీతం పాడినట్లయింది. ముందస్తు ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్, టీడీపీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మహాకూటమిగా అవతరించిన విషయం విదితమే. అయితే, పొత్తులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీకి అవకాశం దక్కలేదు. దీంతో ఎన్నికల బ్యాలెట్లో సైకిల్ గుర్తు కనుమరుగైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతిష్ట మసకబారింది ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న తొమ్మిది నియోజకవర్గాలలో మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. ఈ మేరకు హస్తం పార్టీ నేతలకే అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. దీంతో టీడీపీ కథ ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ ఉమ్మడి జిల్లాలో టీడీపీకి బలమైన పట్టు ఉండింది. ఆ తర్వాతి పరిస్థితుల్లో తెలుగుదేశం క్రమంగా బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత టీడీపీ ప్రాభవం పూర్తిగా మసక బారిపోయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీకి ఉనికే లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తరువాత 2014లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బాల్కొండ, ఆర్మూర్, బోధన్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీకి కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలను కేటాయించారు. కానీ, ఆ రెండు పార్టీలు విఫలం కాగా, అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించారు. ముందుకు రాని అభ్యర్థులు! తాజా ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు మహా కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించాలని టీడీపీ పట్టుబట్టింది. బాల్కొండ బరిలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని నిలపడానికి గట్టిగా ప్రయత్నించింది. కానీ ఆయన మహా కూటమి తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపినా, కాంగ్రెస్ గుర్తు (హస్తం)పైనే పోటీకి ఆసక్తి కనబరిచారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును పోటీ చేయించాలని తెలుగుదేశం భావించింది. ఆయన కొన్నేళ్ల నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఆయన పోటీకి నిరాసక్తతను కనబరచడంతో టీడీపీ తన ప్రయత్నాలను విరమించుకుంది. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలను మినహాయించి ఇతర నియోజకవర్గాలలో పోటీకి టీడీపీ తరపున అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడంతో అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీకి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆవిర్బావం నుంచి బాల్కొండ మినహా ఇతర నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే, తర్వాతి కాలంలో టీడీపీకి నాయకత్వ లేమి, క్యాడర్ ఇతర పార్టీల్లోకి మారడంతో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా పోటీ చేయక పోవడంతో ఆ పార్టీ కథ దాదాపు ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు. -
కూటమిపక్షాలకు కాంగ్రెస్ రిక్తహస్తం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ మహాకూటమి ఊసు లేకుండా పోయింది. ఇప్పటికే ఆ పార్టీ పదకొండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇక మిగిలిన మిర్యాలగూడ టికెట్‌ను ఆదివారం రాత్రి తన ఖాతాలో వేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క స్థానంపై తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నాయి. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ప్రకటించింది. కాగా, టీజేఎస్ అభ్యర్థిగా గవ్వా విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్‌లో ఆదివారం బీఫాం కూడా అందజేశారు. మరో వైపు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని ఆశపడుతున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఒకవేళ ఈ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తే తాను రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిం చడంతో తరువాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. మొత్తానికి కూటమి పక్షాలకు ఎక్కడా అవకాశం రాకపోగా, అన్ని చోట్లా కాంగ్రెస్ పోటీలో ఉంది.కూటమి పక్షాల డకౌట్ కాంగ్రెస్ మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ సీట్లు ఆశించాయి. టీడీపీ కోదాడ, లేదంటే నకిరేకల్ ఇవ్వాలని పట్టుబట్టాయి. సీపీఐ ఆలేరు లేదా మునుగోడు కావాలని భీష్మించాయి. ఆ పార్టీకి రాష్ట్రంలో మూడు స్థానాలే కేటాయించడం సమస్యగా మారింది. ఒకవేళ అదనంగా తమకు ఓ స్థానం ఇస్తే దేవరకొండ కావాలని ఆపార్టీ కోరింది. మరోవైపు టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ గురించే పట్టుబడుతోంది. తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్‌ను కోరుతూ వచ్చింది. ఒక దశలో ఆ పార్టీకి నకిరేకల్ ఇస్తున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. ఇది కాదంటే మునుగోడు గురించి చర్చ జరుగుతుందన్నారు. తీరా కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాక కూటమి పక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకుండా పోయాయి. ప్రతి ఎన్నికల్లో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీపీఐ ఈసారి మాత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతకుముందు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈసారి ఆ పార్టీ ఎన్నికల బరిలోనే లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ కూటమినుంచి బయటకు వచ్చేసి నకిరేకల్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో సుదీర్ఘ కాలం ఆధిపత్యం వహించిన టీడీపీ కూడా ఈసారి ఒక్కస్థానం నుంచి కూడా పోటీలో లేకుండా అయ్యింది. బయటకు వస్తున్న నేతలు కాంగ్రెస్, కూటమిలోని ఇతర పార్టీల నుంచి టికెట్లు ఆశించిన నేతలు ఇక, తమకు టికెట్లు రావన్న నిర్ధారణకు వచ్చాక సొంత పార్టీలను వీడుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్ ఏడాది కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిందే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందన్న ఆశతో. కానీ, కాంగ్రెస్ ఆయనకు మొండిచేయి చూపెట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్‌కు దేవరకొండ టికెట్‌ను ప్రకటించడంతో బిల్యానాయక్ కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చారు. సోమవారం ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక, టీడీపీనుంచి కోదాడ టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్‌కూ అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానం కావడంతో తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతికే అభ్యర్థిత్వం ఖరారు చేసింది. దీంతో అవకాశం కోల్పోయిన మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇలా ఆయా స్థానాల్లో బలమైన నాయకులు అనుకున్న వారు సొంత పార్టీలను వీడి బయటకు వచ్చి పోటీకి సిద్ధమవుతున్నారు. -
టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట టీజేఎస్ బీ-ఫారం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు దేశం, తెలంగాణ జన సమితి పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్నాయి. మహాకూటమిలో భాగంగా తమ పార్టీ తరపున సీటు ఖరారైన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ-ఫారాలు ఇస్తున్నాయి. ఈ ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ 13 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. నందమూరి సుహాసిని తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారామె. ఇక తెలంగాణ జన సమితి సైతం ఎన్నిక చేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసింది. మహకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 4 స్థానాలు కేటాయించగా, టీజేఎస్ మాత్రం 7 నియోజవర్గాల అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. మెదక్, సిద్ధిపేట, దుబ్బాక, మల్యాజిగిరి, వరంగల్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు అధ్యక్షుడు కోదండరామ్ ఫారాలు అందజేశారు. కాగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట కూడా తమ అభ్యర్థికి టీజేఎస్ బీ-ఫారం ఇచ్చింది. -
అగ్గి రాజుకుంది...
సాక్షి, కొత్తగూడెం: నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ప్రకటించడంతో పోరు షురూ అయింది. కాంగ్రెస్ కూటమి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే పినపాక మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో తుదివరకు పార్టీ నాయకత్వం అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టి.. తాజాగా శనివారం హరిప్రియ పేరు ప్రకటించింది. దీంతో మిగిలిన ముఖ్యమైన నాయకులతో పాటు వారి అనుచరుల్లో అసంతృప్తి మొదలైంది. పార్టీని నమ్ముకుని మొదటి నుంచీ పనిచేస్తున్న చీమల వెంకటేశ్వర్లుకు టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య.. తనకు అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బయ్యకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఎక్కువగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుప్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు ఆశావహులు మరో జాతీయ పార్టీ నుంచి టికెట్ సాధించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘పేట’లోనూ ఆగ్రహ జ్వాలలు... అశ్వారావుపేట నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే అక్కడ టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ములకలపల్లి మండలంలోని గుట్టగూడెంలో సున్నం నాగమణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు హాజరయ్యారు. సున్నం నాగమణి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని అన్ని మండలాల నాయకులు తెలిపారు. టీడీపీకి ఏ మాత్రం బలం లేకున్నా ఈ టికెట్ ఎలా కేటాయిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ కొత్తవారే అయినప్పటికీ నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో స్థానిక నాయకులు మద్దతు పలికారు. అయితే అనూహ్యంగా ఇక్కడ స్థానికేతరుడైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవరించింది. వైరా నియోజకవర్గం పరిధిలోని జూలూరుపాడు మండలంలో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ టికెట్‌ను సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి తలెత్తింది. మరోవైపు సీపీఐలోనూ అసమ్మతి లేచింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా బాణోత్ లాల్‌సింగ్ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా, ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ సభ్యుడు లకావత్ గిరిబాబు పార్టీకి రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు లావుడ్యా రాములు నాయక్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నారు. జూలూరుపాడు మండలంలోని ఎల్లంకి గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని పార్టీలకు చెందిన అసమ్మతి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాములు నాయక్‌కు మద్దతు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. -
తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్లు
నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో మిత్ర బృందంతో ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో ఇటీవల వర్తమాన రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల గెలుపోటములపై జరిగిన చర్చ ఇటీవల తీవ్ర స్థాయికి చేరింది. ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే.. కాదు వేరే పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని మిత్రుల మధ్య మెస్సేజ్ వార్ నడిచింది. చివరికి అది పందెం కాసే వరకు వెళ్లింది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ప్రతి గ్రామంలో అనేకం చోటుచేసు కుంటున్నాయి. నర్సంపేట: ఎన్నికల వేళ ఏ వాట్సప్ గ్రూప్ చూసినా.. ఏ పట్టణం చూసినా ఎవరు గెలుస్తారు.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదే ప్రధాన చర్చ. మా పార్టీ నాయకుడు గెలుస్తాడంటే మా వాడే గెలుస్తాడని మరొకరు చర్చించుకోవడం పరిపాటిగా మారింది. కాని ఇప్పుడు ఈ చర్చ బెట్టింగ్‌ల స్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల గెలుపుఓటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. గెలుపోటములతోపాటు మెజారిటీ ఫిగర్స్ మీద చర్చ సాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో కొందరు కార్యకర్తలు తమ పార్టీ నాయకుడి కోసం ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నికలను జూదంగా మారుస్తున్నారు. కొందరు వీటిని సరదాగా కాస్తే, మరికొందరు డబ్బే ధ్యేయంగా పందేలు కాస్తున్నారు. పార్టీపై ఉన్న మోజుతో మరికొందరు బెట్టింగ్ చేస్తున్నారు. దీంతో అంతిమంగా వారందరూ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. క్రికెట్‌తో మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పందేలు ఇలా.. సాధారణంగా క్రికెట్లో ఎవరు టాస్ గెలుస్తారు నుంచి ఏ బాల్‌కు సిక్స్, ఫోర్ కొడుతారులాంటి పలు అంశాలపై బెట్టింగ్ కాస్తారు. ఎన్నికల సమయంలో అనేక రకాలైన అంశాలపై రూ.వేల నుంచి లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేయకముందు కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తాడా..? లేదా..? అన్న అంశం నుంచి మొదలుకొని, సిట్టింగ్‌లకు సీట్లపై, తర్వాత మహాకూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయి? ఏ నాయకుడికి టికెట్ వస్తుంది? రెబల్స్‌గా ఎవరు నామినేషన్లు వేస్తారు? నామినేషన్లు ఉపసంహరణ 19 వరకు ఉండడంతో అప్పటి వరకు ఉపసంహరించుకోకుండా బరిలో ఎవరు నిలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఫలానా నాయకుడే గెలుస్తాడు. ఇంత మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాటిపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాయడం గమనార్హం. నర్సంపేట, పరకాల నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా రాష్ట్రంలోని నాయకులు, పార్టీలు, వారి గెలుపోటములపై బెట్టింగ్‌లు కాయడం విశేషం. ముఖ్యంగా నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పలుకుబడి ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు, రాజకీయాలంటే ఎంతో ఆసక్తి చూపే ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటిని పసిగట్టిన కొంతమంది బెట్టింగ్‌రాయుళ్లు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారిని గమనించి వారిని బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారు. లక్షల్లో బెట్టింగ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం విందుల్లో తేలుతున్నారు. ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చించుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు రూ. లక్షల్లో పందెం కాస్తే, మరికొందరు ఫలితం తెలిసిన తర్వాత ఓడిపోయిన వారు పార్టీ ఇవ్వాలనే షరతులు పెట్టుకుంటున్నారు. కొందరైతే మాట మీద నమ్మకం లేక బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంతో వీటివైపు పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు విజృంభిస్తున్నారు. బెట్టింగ్‌లపై కఠిన చర్యలు.. ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్‌ల విషయం మా దృష్టికి రాలేదు. బెట్టింగ్‌లకు పాల్పడడం చట్టరీత్యా నేరమే. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో, లేదంటే ఇతర సోషల్ మీడియాలో బెట్టింగ్‌లకు పాల్పడినా, మరెవరైనా ఈ పందేలను నిర్వహించినా సమాచారం ఉన్నవారు పోలీసుల దృష్టికి తీసుకురావాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –సునీతామోహన్, ఏసీపీ, నర్సంపేట -
కూటమిదే గెలుపు
సాక్షి వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలకు కలిపి సుమారు 1.05 లక్షల ఓటు బ్యాంకు ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రావుల వనపర్తి సీటు కావాలని అడిగితే ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నానని, సిట్టింగ్ స్థానం కావడంతోనే కాంగ్రెస్‌కు కేటాయించారని వివరించారు. శనివారం నామినేషన్ వేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి తన బాల్యమిత్రుడని, తరువాత వేర్వేరు పార్టీల్లో కొనసాగినా ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని, వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. మీరిద్దరు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తే ఓటమి ఎరుగని నేతలుగా కొనసాగుతారని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుంటారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ 9నెలల ముందుగా ఎన్నికలకు వె ళ్లడం ద్వారా ప్రజలపై రూ.4వేలకోట్ల అదనపు భారం పడిందని తెలిపారు. కేసీఆర్ దయతో నా మినేటెడ్ పోస్టు తెచ్చుకున్న నాయకుడు నాలుగేళ్ల పాటు నిరంకుశపాలన కొనసాగించారని, ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, వనపర్తి ప్రజలమీద ఉన్న గౌరవంతో ఓర్చుకున్నామని వెల్లడించారు. డాక్టర్ బాలకిష్టయ్య, అయ్యప్ప, రావులతో పాటు తాను ప్రజల్లో ఒకరిగా కలిసిపోయామని, కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని చెప్పారు. అన్ని సీట్లూ మావే: నాగం కాంగ్రెస్, టీడీపీతో పొత్తేమిటని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టీ డీపీతోనే మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచారని మాజీ మంత్రి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగా ణ బిల్లు పార్లమెంట్లో పాసైనప్పుడు 272 మంది ఎంపీలు ఓటు వేశారని కేసీఆర్ ఆ సమయంలో పార్లమెంట్లో లేరని, ఓటు వేయకుండా తప్పించుకున్నారని విమర్శించారు. 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం, సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 ఎన్ని కల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, మిషన్ భగీరథ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో అధికారంలోకి వ చ్చిన కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలోనూ కూటమి అ భ్యర్థులే గెలుస్తారని నాగం ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గ బాగుకోసమే ఇద్దరం కలిశాం: రావుల వనపర్తి నియోజవర్గం అభివృద్ధి కోసమే చిన్నారెడ్డి, తాను ఇద్దరం కలిశామని, రాష్ట్రంలోనూ ప్ర జాస్వామ్యానికి ముప్పు పొంచి ఉండటంతోనే కాం గ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో కలిసి తె లంగాణ ప్రజాకూటమిగా ఏర్పడ్డామని టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. తామిద్దరం పదో తరగతి వరకు ఇక్కడే చదువుకుని పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో ఆటలాడుకునే వాళ్లమని, త ర్వాత ఇద్దరం చెరో రాజకీయపార్టీలో చేరి సి ద్ధాం తపరంగా విభేదించుకున్నామే తప్ప ఏనాడూ వ్య క్తిగత విమర్శలు, గొడవలకు దిగలేదని గుర్తుచేశా రు. వనపర్తి అభివృద్ధికి ఎంతో కృషిచేశామని చె ప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి ఉన్న మంచిపేరు చెడిపోయే ప్రమాదం ఉండటంతో ఇద్దరం కలిసి మీ ముందుకు వస్తున్నామని ప్రజలకు వివరించా రు. చిన్నారెడ్డితో కలిసి ప్రతి మండలానికి ప్రచారానికి వస్తానని, గెలుపునకు కృషియాలని కోరారు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దుచేసిన సమయం లో సీఎం కేసీఆర్ 100 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రాబోతున్నామని అనడం చూస్తే ఆయ నకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మహాకూటమి లెక్కతేలింది..
సాక్షి, హైదరాబాద్: కేవలం 11 స్థానాలు మినహా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 88, టీడీపీ 13, టీజేఎస్ 4, సీపీఐ 3 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. పెండింగ్‌లో ఉన్న 11 స్థానాలకు ఆదివారం క్లియరెన్స్ రానుంది. ఆదివారం కాంగ్రెస్ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో కూటమి లెక్క పక్కాగా తేలనుంది. శనివారమే కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వస్తుందని భావించినా, కేవలం 13 సీట్లకే అభ్యర్థులను ప్రకటించి 6 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. దీంతో కూటమిలోని ఇతర పార్టీలకు సంబంధించిన మరో ఐదు స్థానాలు కూడా అస్పష్టంగా మిగిలిపోయాయి. కాగా, శనివారం టీజేఎస్ 4స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కోటాలోకి జనగామ.. కూటమిలోని 17 మంది అభ్యర్థులను శని వారం అధికారికంగా ప్రకటించారు. ఇం దులో 13 కాంగ్రెస్, 4 జనసమితి స్థానాలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. టీజేఎస్ అధినేత కోదండరాం పోటీచేస్తారని భావించిన జనగామ నియోజకవర్గాన్ని అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో కాంగ్రెస్ కోటాలో వేయడంలో పొన్నాల సఫలీకృతులయ్యారు. ఈయనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), డి.సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ)కు కూడా టికెట్లు కేటాయించింది. రేవంత్‌రెడ్డి కోటాలో ఇల్లెందు స్థానం బాణోతు హరిప్రియా నాయక్‌కు ఖరారు చేశారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్‌లో అవకాశమిచ్చారు. ఇక, పాతబస్తీలోని యాకుత్‌పుర, బహుదూర్‌పుర నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కొల్లాపూర్‌లో ముందునుంచీ ఊహించినట్లుగానే హర్షవర్దన్‌రెడ్డికి టికెటిచ్చారు. ఇక, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు మరోమారు అవకాశమిచ్చారు. తెలంగాణ జనసమితి కూడా నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కపిలవాయి దిలీప్‌కుమార్ (మల్కాజ్గిరి), చిందం రాజ్‌కుమార్ (దుబ్బాక), భవానీరెడ్డి (సిద్ధిపేట), జనార్దన్‌రెడ్డి (మెదక్)లున్నాయి. ‘మర్రి’కి మొండిచేయి... మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. శనివారం ఆ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం, ఆ జాబితా వచ్చిన వెంటనే సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ను టీడీపీ ప్రకటించడంతో ఆయన అవాక్కయ్యారు. షాక్ నుంచి తేరుకున్న శశిధర్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే, శశిధర్‌రెడ్డికి శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ కోటరీలో శక్తివంతమైన నేతగా పేరున్న అహ్మద్‌పటేల్ నుంచి ఫోన్ రా>వడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో మర్రి భవితవ్యం ఏంటనేది ఆదివారం తేలనుంది. పెండింగ్ వీరికేనా... కూటమి పక్షాన ఇంకా ప్రకటించకుండా పెండింగ్‌లో ఉన్న 11 నియోజకవర్గాల్లో 6 చోట్ల కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. ఇందులో నారాయణŠ ఖేడ్ నుంచి సురేశ్‌షెట్కార్, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, దేవరకద్ర నుంచి పవన్‌కుమార్‌రెడ్డి, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డి లేదా షరాబు శివకుమార్, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లేదా ఆదం ఉమ లేదా బండా కార్తీక, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు లేదా కొమిరెడ్డి జ్యోతి రామ్‌లు ఖరారు కానున్నారు. ఇక, రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ పోటీచేస్తే అక్కడ సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. జన సమితి పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో వర్ధన్నపేట నుంచి డాక్టర్ దేవయ్య, అంబర్‌పేట నుంచి సత్యంగౌడ్, మిర్యాలగూడ నుంచి విజయేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి గాదె ఇన్నారెడ్డి ఖరారు కానున్నారు. వరంగల్ తూర్పు స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇస్తే అక్కడ వద్దిరాజు రవిచంద్ర పోటీ చేయనున్నారు. మిర్యాలగూడ కూడా కాంగ్రెస్‌కు ఇచ్చే పక్షంలో అక్కడ జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలో ఉంటారు. పఠాన్‌చెరు స్థానాన్ని టీడీపీకి కేటాయించనుండగా అక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పేరు వినిపిస్తోంది. ‘కూటమి’కులాల వారీగా.... ఇప్పటి వరకు కూటమి పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల వివరాలను కులాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 32 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించింది. ఆ తర్వాత ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 8 సీట్లు ప్రకటించింది. ఎస్టీల్లో లంబాడీలు, ఆదివాసీలకు చెరో 5 నియోజక వర్గాలను కేటాయించగా, బీసీల్లో అత్యధికంగా మున్నూరు కాపులకు 7 చోట్ల అవకాశమిచ్చింది. ఆ తర్వాత గౌడ కులస్తులకు 4, పద్మశాలీలకు 2, యాదవ, బొందిలి, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, పవార్ కులస్తులకు ఒక్కోటి చొప్పున ఇచ్చింది. ముస్లిం మైనార్టీలకు 7 చోట్ల అవకాశం కల్పించింది. ఇక అగ్రవర్ణాల్లో వెలమలకు 3 చోట్ల, బ్రాహ్మణులకు 1 స్థానంలో అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 13 స్థానాలకు గాను కమ్మ కులస్తులకు 3, వైశ్యులకు 1, రెడ్లకు 3, బీసీలకు 3, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. జనసమితి శనివారం సాయంత్రం ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు ఓసీ, ఒక బీసీ ఉన్నారు. అందులో ఒకరు బ్రాహ్మణ, ఒకరు మున్నూరుకాపు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారు. సీపీఐ తరఫున పోటీచేసే ముగ్గురిలో ఎస్సీ (మాదిగ) ఒకటి, ఎస్టీ (లంబాడ) ఒకటి, ఓసీ (రెడ్డి) ఒకటి చొప్పున కేటాయించారు. స్నేహపూర్వక పోటీ లేనట్టే... కూటమి పక్షాల్లో సీట్ల సర్దుబాటు శనివారంతో పూర్తికానుండగా, స్నేహపూర్వక పోటీలకు కూడా అవకాశం లేదని తెలుస్తోంది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ చెప్పినా గందరగోళానికి తావు లేకుండా ఈ పోటీలను నివారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని చోట్ల కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించిన చోట్ల ఇంకో పార్టీ అభ్యర్థులు రెబల్‌గా బరిలో దిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూటమిలోని పార్టీలు ప్రకటించిన స్థానాల సంఖ్య: కాంగ్రెస్: 88 టీడీపీ: 13 టీజేఎస్ : 04 సీపీఐ: 03 మొత్తం: 108 పెండింగ్: 11 కూటమి అభ్యర్థులను ప్రకటించని స్థానాలు: నారాయణ్‌ఖేడ్, నారాయణపేట, మిర్యాలగూడ, హుజూరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట, వరంగల్ (ఈస్ట్), పఠాన్‌చెరు, కోరుట్ల, దేవరకద్ర, వర్ధన్నపేట. ఇప్పటివరకు కాంగ్రెస్ మిత్రపక్షాలు అభ్యర్థులను ఖరారు చేసిన నియోజకవర్గాలివే: తెలుగుదేశం: నియోజకవర్గం అభ్యర్థి పేరు సామాజిక వర్గం 1. ఉప్పల్ టి.వీరేందర్‌గౌడ్ బీసీ (గౌడ్) 2. శేరిలింగంపల్లి భవ్య ఆనందప్రసాద్ ఓసీ (కమ్మ) 3. కూకట్పల్లి సుహాసిని ఓసీ (కమ్మ) 4. సనత్‌నగర్ కూన వెంకటేశ్‌గౌడ్ బీసీ (గౌడ్) 5. రాజేంద్రనగర్ గణేశ్‌గుప్తా ఓసీ (వైశ్య) 6. ఇబ్రహీంపట్నం సామా రంగారెడ్డి ఓసీ (రెడ్డి) 7. ఖమ్మం నామా నాగేశ్వరరావు ఓసీ (కమ్మ) 8. అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు ఎస్టీ (కోయ) 9. సత్తుపల్లి సండ్రవెంకటవీరయ్య ఎస్సీ (మాదిగ) 10. మహబూబ్‌నగర్ ఎర్ర శేఖర్ బీసీ (ముదిరాజ్) 11. మక్తల్ కొత్తకోట దయాకర్‌రెడ్డి ఓసీ (రెడ్డి) 12. వరంగల్ (వెస్ట్) రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓసీ (రెడ్డి) 13. మలక్‌పేట ముజఫర్‌అలీ ముస్లిం మైనార్టీ (టీడీపీ ప్రకటించిన 13 స్థానాల్లో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో.. లేదంటే ఒకచోట కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. పఠాన్‌చెరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్నారు.) తెలంగాణ జనసమితి: 1. దుబ్బాక చిందం రాజ్‌కుమార్ బీసీ (మున్నూరుకాపు) 2. సిద్ధిపేట భవానీరెడ్డి ఓసీ (రెడ్డి) 3. మల్కాజ్గిరి కె. దిలీప్‌కుమార్ ఓసీ (బ్రాహ్మణ) 4. మెదక్ జనార్దనరెడ్డి ఓసీ (రెడ్డి) (ఈ పార్టీ విషయంలో స్పష్టత వచ్చిన నియోజకవర్గాల్లో అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్) నియోజకవర్గాల విషయంలో నేడు పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.) సీపీఐ: 1. బెల్లంపల్లి గుండా మల్లేశ్ ఎస్సీ (మాదిగ) 2. వైరా బి. విజయ ఎస్టీ (లంబాడీ) 3. హుస్నాబాద్ చాడా వెంకటరెడ్డి ఓసీ (రెడ్డి) కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు: ఓసీ – 36, బీసీ – 18, ఎస్సీ – 17, ఎస్టీ – 10, మైనార్టీ – 7 , మొత్తం – 88 కూటమి తరఫున ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు: ఓసీ – 47, బీసీ – 22, ఎస్సీ – 19, ఎస్టీ – 12, మైనార్టీ – 8, మొత్తం – 108. కాంగ్రెస్ మూడో జాబితా నిజామాబాద్(అర్బన్) : తాహెర్ బిన్ హమ్దాన్ నిజామాబాద్(రూరల్) : రేకుల భూపతిరెడ్డి బాల్కొండ : ఇ.అనిల్‌కుమార్ ఎల్బీనగర్ : డి.సుధీర్‌రెడ్డి కార్వాన్ : ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ యాకుత్‌పుర : కె.రాజేందర్ రాజు బహదూర్పు : కాలెం బాబా కొల్లాపూర్ : బీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి దేవరకొండ(ఎస్టీ) : బాలూనాయక్ తుంగతుర్తి(ఎస్సీ) : అద్దంకి దయాకర్ జనగామ : పొన్నాల లక్ష్మయ్య ఇల్లెందు : బానోతు హరిప్రియా నాయక్ బోథ్(ఎస్టీ) : సోయం బాపూరావు టీజేఎస్ జాబితా.. మల్కాజ్గిరి : దిలీప్‌కుమార్ దుబ్బాక : రాజ్‌కుమార్ సిద్ద్ధిపేట్ : భవానీరెడ్డి మెదక్ : జనార్దన్‌రెడ్డి -
జీవనదిగా...మానేరు
సాక్షి, పెద్దపల్లి: కరువంటే తెలియని జిల్లాగా అభివృద్ధిచేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హుజూరాబాద్, పెద్దపల్లి అన్నాచెల్లెలాంటి ఊళ్లన్నారు. మానేరు ఎండిపోయి కాల్వశ్రీరాంపూర్, ఓదెల, వీణవంక రైతులు ఏటా అల్లాడిపోతున్నారని.. ఇక ముందు అలాంటి సమస్యలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించిందని గుర్తుచేశారు. మానేరుపై నాలుగుచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయని .. మరో నాలుగుచోట్ల నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే మానేరు జీవనదిగా మారుతుందన్నారు. ఇప్పటికే వర్షాకాలంలో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపించాయన్నారు. వచ్చే రెండేళ్లలో పెద్దపల్లి మానేరు, హుస్సేన్‌మియా వాగులు జలా హా రంగా కనువిందు చేస్తాయన్నారు. గతంలో రైతులు రాత్రి వేళ కరెంట్ కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని.. ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరాలతో ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలతో పాటు ఆడబిడ్డల పెళ్లీలకు అన్నదమ్ములు కూడా ఇవ్వని రీతిలో రూ.లక్ష కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించినట్లు చెప్పారు. బీజేపీ, మహాకూటమిలపై ఈటల ఆగ్రహం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేదని ఈటల మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో ఓట్లకోసం తిరుగుతున్న బీజేపీని నమ్మొద్దన్నారు. మహాకూటమిలో జతకట్టిన పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు. ఇక్కడ దాసరి.. అక్కడ కేసీఆర్ గెలవాలి.. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతం విముక్తి కావడానికి తన తండ్రి వెంకటస్వామి కృషి చేశారని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. ప్రాణాహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కూటమి వెనుక ఉన్న చంద్రబాబు కుట్రలను గమనించాలని సమావేశంలో భానుప్రసాద్‌రావు కోరారు. కూటమి తాళం చెవి చంద్రబాబు వద్ద ఉందన్నారు. సమావేశానికి స్థానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, నాయకులు కోట రాంరెడ్డి, డాక్టర్ టీవీరావు, నల్ల మనోహర్‌రెడ్డి, బాలజీరావు, పారుపెల్లి రాజేశ్వరి, సందవేన సునీత, గట్టు రమాదేవి, రఘువీర్‌సింగ్, అమ్రేష్, రాజు, రాజ్‌కుమార్, హన్మంత్, వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కొమురయ్య యాదవ్, మార్క్ లక్ష్మణ్, రమారావు, వెంకట్‌రెడ్డి, రమేష్, పురుషోత్తం, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పురాజు కుమార్, కొయడ సతీష్‌గౌడ్, తబ్రేజ్, సాబీర్‌ఖాన్, శ్రీనివాస్, చంద్రమౌళి, రాజేందర్‌యాదవ్ పాల్గొన్నారు. -
సిద్దిపేట బరిలో ఉద్దండులు
నాడు తొలి దశ తెలంగాణ ఉద్యమం.. తర్వాత మలి దశ ఉద్యమంలో అగ్గి పుట్టింది సిద్దిపేట జిల్లాలోనే.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా సిద్దిపేట నుంచే సీఎం కేసీఆర్, కీలక మంత్రి హరీశ్‌రావు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. టీజేఎస్ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల అభ్యర్థుల తొలి ప్రకటన దుబ్బాకలోనే చేశారు. మరో ఉద్యమ నేత రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా పెన్ను, గన్ను పట్టిన నాయకుడిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. ఇక మహాకూటమిలో భాగస్వామ్యమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లోనూ కీలక వ్యక్తులే బరిలో నిలిచారు. సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో సమీప అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే ఆదే వంటేరును కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి బరిలో దింపారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇది పసిగట్టిన టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. కుల సంఘాలను ఏకం చేస్తూ మద్దతు సభలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇతర నాయకులు వస్తే ఏం జరుగుతుందో ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నియోజకవర్గంలోని 15వేల మంది కార్యకర్తలతో తన ఫాం హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని నింపారు. వీరితోపాటు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేశారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తూ అందరి దృష్టి గజ్వేల్ వైపు మళ్లేలా చేస్తున్నారు. సిద్దిపేట మెజార్టీపై లెక్కలు దశాబ్దాలుగా గులాబీ కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపు గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇక్కడి నుండి పోటీ చేసే మాజీ మంత్రి హరీశ్‌రావుకు మెజార్టీ ఎంత వస్తుందనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు కేసీఆర్, ఐదు పర్యాయాలు హరీశ్‌రావు విజయం ఢంకా మోగించారు. గత ఎన్నికల్లో 95వేల మెజార్టీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి లక్ష మెజార్టీ సాధించి రికార్డు సాధించాలనే ఊపుతో ముందుకు వెళ్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా హరీశ్‌రావుకే ప్రజలు చందాలు వేసుకొని ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం... ఎక్కడా లేని విధంగా సబ్బండ కులాలు పోటాపోటీగా ఆశీర్వాద సభలు నిర్వహించడం విశేషం. గతంలో ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇప్పుడు కూటమిలో భాగంగా సిద్దిపేట సీటు టీజేఎస్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై టీఆర్ఎస్ దృష్టి సారించారు. ఇక ఇక్కడి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి అత్యధిక ఓట్లు సాధించి మార్కు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి అన్నల ఇలాకాగా చెప్పుకునే దుబ్బాక నియోజకవర్గం అందరికీ ప్రతిష్టాత్మకంగానే మారింది. భూమి కోసం.. భుక్తి కోసం సాగిన పోరాటంలో గన్ను, పెన్ను పట్టిన నాయకుడిగా పేరున్న తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా కీలక భూమిక పోషించారు. దీనిని గమనించిన కేసీఆర్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ పదవి కూడా అప్పగించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటితో అనుబంధం పెంచుకున్న సోలిపేట.. ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు తర్వాత దుబ్బాకలో నిర్వహించిన తొలి సభలో కోదండరాం ప్రసంగిస్తూ తన పార్టీ అభ్యర్థి దుబ్బాక నుండి పోటీ చేస్తాడని ప్రకటించారు. దానికి కట్టుబడి కూటమి నాయకులను ఒప్పించి దుబ్బాక సీటును టీజేఎస్‌కు కేటాయించేలా చేశారు. ప్రకటన చేయడమే ముఖ్యం కాదు. నియోజకవర్గంలో తన అభ్యర్థికి ఓటు బ్యాంకు పెంచుకోవడం, పార్టీ సత్తా చాటడం కోదండరాంకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మరో ఉద్యమ నాయకుడు రఘునందన్ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. ఆ పార్టీలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొంది మొదటి జాబితాలో సీటు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉందని ప్రతిష్టాత్మకంగా భావించి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ముత్యం రెడ్డి కూడా చివరిసారి పోటీలో ఉండి అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ గ్రామాలను పర్యటిస్తున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా.. స్వతంత్రంగా పోటీ చేసి సత్తాచాటుతానని చెబుతున్నాడు. హుస్నాబాద్‌లో కామ్రేడ్స్‌కు పరీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి భాగస్వామ్య పార్టీ సీపీఐకి హుస్నాబాద్ కీలకం. పొత్తులో భాగంగా పోరాడి మరీ హుస్నాబాద్ టికెట్ సాధించుకున్నారు. ఇక్కడి నుండి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీలో ఉంటున్నారు. పార్టీకి కీలకమైన హుస్నాబాద్‌ను గెలిపించుకొని మిత్రుల మధ్య గౌరవం పెంచుకోవాలని ఆ పార్టీ కేడర్ అంటున్నారు. అయితే గత నెలన్నర నుండి తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సభ పెట్టించి కార్యకర్తలకు నూతనోత్సాహం నింపారు. ఇంటింటి ప్రచారం చేసి ఓటరుకు దగ్గరయ్యామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ సీపీఐకి కేటాయించినా.. తాను పోటీ ఉండి తీరుతానని, స్నేహ పూర్వక పోటీలో ఉండి తన సత్తా చాటుతానని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేయడం గమనార్హం. -
కూటమి ‘ఆశ’లు నెరవేరేనా!
మెదక్ టికెట్‌పై కాంగ్రెస్ నేతల ఆశలు ఇంకా సడలడం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఒక్కరికైనా బీ ఫాం దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారు. పొత్తులున్నప్పటికీ మెదక్‌లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే శనివారం మెదక్ సీటుపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను శనివారం ప్రకటించనుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే మెదక్ స్థానం ఉంటుందని స్థానిక కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ బీఫాం దక్కుతుందని ఆశావహులంతా వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సాక్షి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు మ్యాడం బాలకృష్ణలు కాంగ్రెస్ పార్టీ పేరిట నామినేషన్లు వేశారు. శుక్రవారం శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ బీసీ నేత బట్టి జగపతి కాంగ్రెస్ పార్టీ పేరిట నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు సైతం శనివారం ఉదయం నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ఆశావహులంతా నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మెదక్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ, చంద్రపాల్ సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని తెలంగాణ జన సమితికి ప్రకటించినప్పటికీ స్నేహపూర్వక పోటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్నేహపూర్వక పోటీకి అధిష్టానం అంగీకరించి ఆశావహుల్లో ఎవరికి బీఫాం దక్కినా మిగతా వారంతా నామినేషన్లు ఉపసహరించుకుని బీఫాం వచ్చిన నాయకుడి విజయం కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహులంతా శుక్రవారం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో సమావేశమయ్యారు. విజయశాంతి సైతం స్నేహపూర్వక పోటీకోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం స్నేహపూర్వక పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తే 12 స్థానాలను ప్రకటించుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏకపక్షంగా టీజేఎస్ సీట్లు ప్రకటించినందున స్నేహపూర్వక పోటీ అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే టీజేఎస్ 8 సీట్లకు అంగీకరించిన పక్షంలో స్నేహపూర్వక పోటీ ఉంటుందా లేదా అన్న శంక కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులంతా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి శశిధర్‌రెడ్డి మొగ్గు కాంగ్రెస్ అధిష్టానం తనకు బీఫాం ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇది వరకే నామినేషన్ వేసిన ఆయన శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా మ రోసెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫాం ఇవ్వ ని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయ న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వతం త్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచా రం. ఇదిలా ఉంటే శశిధర్‌రెడ్డి ఎన్సీపీ పార్టీ నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
మిగిలింది 2రోజులే.. కొల్లాపూర్, దేవరకద్ర స్థానాలు.?
సాక్షి, వనపర్తి: నామినేషన్ మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. గంటలు గడుస్తున్నా కొద్దీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణాన్ని లెక్కించుకుంటూ అధిష్టానం పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాకూటమి తరఫున కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా తేలకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నామినేషన్లు దాఖలుచేసేందుకు చివరి గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుంది. ప్రచారానికి పట్టుమని 15రోజు సమయం కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పొత్తు, సీట్ల విషయం కొలిక్కి వచ్చాక కూడా అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఖరారు చేయకపోవడంతో టికెట్లను ఆశిస్తున్న వారు లోలోపల రగిలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత65 మందికి, రెండో విడత 10 మందికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా కూటమిలోని టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇద్దరి మధ్యే తీవ్రపోటీ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించనున్నారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వెంట పార్టీలో చేరిన జగదీశ్వర్‌రావు టికెట్‌ను ఆశిస్తున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య కేవలం 6శాతం మాత్రమే తేడా ఉంది. ఈసారి టికెట్ వస్తుందని నాలుగేళ్లుగా అనుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన హర్షవర్ధన్‌రెడ్డికి కొన్నినెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌రావు మధ్య నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జగదీశ్వర్‌రావుకు మద్దతి ఇస్తుండగా, హర్షవర్ధన్‌రెడ్డికి మాజీమంత్రి డీకే అరుణ టికెట్ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిద్ధమైన జాబితాలో హర్షవర్ధన్‌రెడ్డి పేరు ఖరారైందని వస్తున్న వార్తలో ఏమేర నిజం ఉందో అభ్యర్థులే తేల్చుకోవాల్సి ఉంది. బీసీలకు దక్కేనా..? దేవరకద్ర నియోజకవర్గం సీటును నిన్న మొన్నటి వరకు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానాన్ని కేటాయిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన డోకూరి పవన్‌కుమార్‌రెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీసీలకు ఒక్క స్థానమైనా కేటాయించలేదనే అపవాదు నెలకొనే అవకాశం ఉందని భావించి బీసీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, రామేశ్వర రావు ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పెద్దగా సమయం లేకపోవడంతో నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రగిలిపోతున్న కేడర్ కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలకు మహాకూటమి అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించకపోవడంతో డోకూరి పవన్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు లోలోపల రగిలిపోతున్నారు. పవన్‌కుమార్‌రెడ్డికి శనివారంలోగా టికెట్ ప్రకటించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆయన అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొల్లాపూర్‌లోనూ హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు పార్టీ అధిష్టానం తీరుపై కోపంతో రగిలిపోతున్నారు. ఇదిలాఉండగా, టీఆర్ఎస్ రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అన్ని గ్రామాలు, మండలాలను చుట్టేశారు. ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. కానీ కూటమి అభ్యర్థులు ఎవరనే విషయం తేలకపోవడంతో కిందిస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఏదేమైనా నామినేషన్లకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నేడోరేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇన్ని రోజుల పాటు టికెట్లను ఆశించి ఎదురుచూసిన అభ్యర్థులకు టికెట్లు రాకపోతే పరిస్థితి ఏమిటన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. -
ఇంకెంత లేటు?
సాక్షి, హైదరాబాద్: సీట్ల సర్దుబాటు విషయం లో కాంగ్రెస్ అవలంభిస్తున్న నాన్చుడి ధోరణిపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. కూటమి పార్టీలు పొత్తులంటూ జాప్యం చేయడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద తన అసహనాన్ని వెళ్లగక్కారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీరు ఏమాత్రం హర్షణీయంగా లేదని, కాంగ్రెస్ చేస్తున్న జాప్యం మొత్తం కూటమి లక్ష్యానికే విఘాతం కల్గిస్తుందని హెచ్చరించారు. శుక్రవారం నాటికి కొలిక్కి వస్తుందనుకున్న సీట్ల సర్దుబాటు అంశం ఎటూ తేలలేదు. ముఖ్యంగా టీజేఎస్‌కు కాంగ్రెస్ ఎన్ని టికెట్లు కేటాయిస్తుంది.. ఏయే స్థానాలకు ఒకే చెప్పనుందన్న దానిపై ప్రతిష్టంభన వీడలేదు. జనగామ, మిర్యాలగూడతోపాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. అర్ధరాత్రి చర్చలు... తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, టీజేఎస్‌కు 8 స్థానాలే కేటాయిస్తామని చెబుతూ వస్తున్న కాంగ్రెస్.. వీటిలో ఆరింటికి ఓకే చెప్పింది. జనగామ, మిర్యాలగూడపై స్పష్టత ఇవ్వలేదు. వీటితోపాటే స్టేషన్ ఘన్పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అక్కడ పోటీ చేసేందుకు టీజేఎస్ కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్ కార్యాలయానికి వచ్చి కోదండరాంతో చర్చించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్‌పేట, సిధ్దిపేట, వర్ధన్నపేట స్థానాలు ఇచ్చేందుకు ఉత్తమ్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. జనగామ విషయంలో పొన్నాల లక్ష్మయ్య పట్టుదలతో ఉన్నందున, ఆ సీటు వదిలేయాలని కోరినట్టు సమాచారం. దీనిపై శనివారం జరిగే కోర్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కోదండరామ్ బదులిచ్చినట్టు తెలిసింది. మిర్యాలగూడలో టీజేఎస్ తరఫున విద్యాధర్‌రెడ్డిని పోటీలో నిలుపుతామని చెప్పగా.. ఇదే స్థానంలో జానారెడ్డి తన బంధువు విజయ్‌కుమార్‌రెడ్డిని నిలపాలని పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్ వివరించారు. విజయ్‌కు జానారెడ్డి మద్దతు ఉన్నందున ఆయనకే విజయావకాశాలు ఉంటాయన్నారు. అయినప్పటికీ, తమకు ఆ స్థానం ముఖ్యమని కోదండరామ్ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లో టీజేఎస్ పోటీ పెట్టకూడదని ఉత్తమ్ కోరినట్లుగా సమాచారం. అయితే అక్కడ స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చన్న ధోరణిని కోదండరామ్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చర్చల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు ఉత్తమ్ నిరాకరించారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 12.30కి వచ్చిన కుంతియాను తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 10 గంటలకు టీజేఎస్ కోర్ కమిటీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ] మూడు తీర్మానాలకు ఓకే.. టీజేఎస్ కోర్ కమిటీ తీసుకున్న మూడు తీర్మానాలను ఉత్తమ్‌కు తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే కామన్ మినిమం ప్రోగ్రాం అమలు కమిటీకి చట్టబద్ధత కల్పించాలని, ఆ కమిటీకి కోదండరామ్‌ను చైర్మన్ చేయాలని తీర్మానించిన విషయాన్ని వివరించారు. అలాగే కోదండరామ్‌ను కేబినెట్లోకి తీసుకొని కామన్ మినిమం ప్రోగ్రాం అమలు బాధ్యతను ఆయన పరిధిలోనే ఉంచాలని తీర్మానించిన విషయాన్ని తెలియజేశారు. ఈ మూడు తీర్మానాలు తమకు సమ్మతమేనని ఉత్తమ్ స్పష్టంచేసినట్లుగా తెలిసింది. -
కూటమి కథ క్లైమాక్స్‌కు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కథ క్లై్లమాక్స్‌కు చేరుతోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలతో సీట్ల సర్దు బాటు వ్యవ హారం దాదాపుగా తుది అంకానికి వచ్చింది. నామినేషన్ల ఘట్టానికి ఇక 3రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికను శనివారం పూర్తిచేయాలని ఆయా పార్టీలు కృత నిశ్చయంతో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు కాంగ్రెస్ 75 మందిని, టీడీపీ 12 మందిని, సీపీఐ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 29 స్థానాల్లో 19 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో టీజేఎస్, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించడానికి శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో టీజేఎస్ కార్యాలయానికి వెళ్లి కోదండ రాంతో చర్చలు జరిపారు. అవి కొలిక్కి రాకపోవడంతో శనివారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. జనగామ, మిర్యాలగూడపై వీడని ప్రతిష్టంభన.. పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు 8 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. అయితే, తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల టీజేఎస్ నేతలు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ వెళ్లి, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన టీజేఎస్ అధినేత కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. తమకు కేటాయించిన 8 స్థానాల్లో ఆరింటిలోనే స్పష్టత వచ్చిందని, మిగిలిన స్థానాల గురించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో ఆయన ఎవరిని కలిశారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు జనగామ, మిర్యాలగూడ సీట్ల విషయంలో కాంగ్రెస్–టీజేఎస్‌ల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. జనగామ నుంచి కోదండరాం పోటీచేయాలని యోచిస్తుండగా, అక్కడ కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య టికెట్ ఆశిస్తున్నారు. తన స్థానాన్ని టీజేఎస్‌కు ఇస్తున్నారనే సమాచారం వచ్చిన వెంటనే పొన్నాల మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పార్టీ పెద్దలను కలిసి టికెట్ విషయంలో తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి కోదండరాంతో జరిగిన చర్చల్లోనూ జనగామ విషయం ఏమీ తేలలేదని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ వర్గాలు మాత్రం జనగామ బరి నుంచి కోదండరాం తప్పుకుంటున్నారని, అక్కడ పొన్నాలకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. ఇక, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు. ఈ స్థానం కూడా తమకు కావాలని టీజేఎస్ పట్టుపడుతోంది. అయితే, ఈ వ్యవహారంపై రఘువీర్‌తో రాహుల్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో తెలియకపోయినప్పటికీ, రాహుల్‌తో భేటీ తర్వాత తన నామినేషన్ పత్రాలను సిద్ధం చేయాలని రఘువీర్ హైదరాబాద్‌లోని తన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రఘువీర్‌కు టికెట్ ఇవ్వడం సాధ్యం కానందునే రాహుల్ పిలిపించి మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ రఘువీర్‌కు టికెట్ ఇవ్వకపోతే ఆ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తారా, కాంగ్రెస్‌కు ఇస్తారా... కాంగ్రెస్‌కు ఇస్తే ఇటీవలే పార్టీలో చేరిన అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తారా..? టీజేఎస్‌కు వదిలిపెడితే విద్యాధర్‌రెడ్డి పోటీచేస్తారా.. లేదంటే కొత్తగా తెరపైకి వచ్చిన జానారెడ్డి బంధువు విజయేందర్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తారా అనే విషయాలు శనివారం తేలనున్నాయి. అలాగే జనగామలో కోదండరాం పోటీచేస్తారా లేక పొన్నాల బరిలో ఉంటారా అనే సస్పెన్స్‌కు కూడా నేడు తెరపడనుంది. 19 స్థానాలతో కూడిన కాంగ్రెస్ పెండింగ్ జాబితా కూడా శనివారం విడుదల కానుంది. అవి ఇటు.. ఇవి అటు.. తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాలపైనా ఢిల్లీలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. టీడీపికి కేటాయించిన 14 స్థానాల్లో 12 చోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో రెండు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను తిరిగి కాంగ్రెస్‌కు ఇచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటికి బదులుగా హుజూరాబాద్, పఠాన్‌చెరు స్థానాలను టీడీపీకి ఇస్తారని అంటున్నారు. ఈ సర్దుబాటు జరిగినప్పటికీ మరో రెండు స్థానాలు టీడీపీకి ప్రకటించాల్సి ఉంటుంది. అవి ఏమిటనేది కూడా శనివారమే తేలనుంది. ఇక టీడీపీ తిరిగి ఇచ్చే ఇబ్రహీంపట్నం సీటును మల్రెడ్డి రంగారెడ్డికి, రాజేంద్రనగర్ స్థానాన్ని సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు కేటాయించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కూకట్పల్లి సీటు ఆశించిన పెద్దిరెడ్డికి హుజూరాబాద్ స్థానం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, అక్కడి నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి పెద్దిరెడ్డి నిరాకరించినట్టు సమాచారం. ఒకవేళ పెద్దిరెడ్డి అక్కడ నుంచి బరిలో దిగకపోతే ఆ స్థానం తిరిగి కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ స్థానం నుంచి రేసులో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అక్కడ కా>ంగ్రెస్ నుంచి ప్రధానంగా కౌశిక్‌రెడ్డి పేరే వినిపించినప్పటికీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బంధువు అనే కారణంతో ఆయన పేరు పెండింగ్‌లో ఉంచారు. ఐదు నియోజకవర్గాల ఆశావహులతో రాహుల్ భేటీ... కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిన 19 స్థానాల్లో పీటముడి పడి ఉన్న ఐదు నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తుంగతుర్తి సీటు ఆశిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ వడ్డేపల్లి రవి, మిర్యాలగూడ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, ఇల్లెందు నుంచి బాణోతు హరిప్రియ, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, బోధ్ నుంచి అనిల్‌జాదవ్ రాహుల్‌తో భేటీలో పాల్గొన్నారు. ఒక్కో నేతతో విడివిడిగా సమావేశమైన ఆయన.. సీట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను వారితో చర్చించారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సీటు వస్తుందా లేదా అన్నది మాత్రం రాహుల్ చెప్పలేదు. దీంతో తమకు సీటు వస్తుందా లేదా అన్నది తేలకపోవడంతో వారంతా జాబితా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
మహా కుంపటి !
సాక్షి,ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్ ప్రకటించిన మధిర, పాలేరు నియోజకవర్గాల్లో అసంతృప్తి జాడలు పెద్దగా కనిపించకపోయినా.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న ఖమ్మం సీటును మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేటాయించడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశావహులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. దీనిని టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర అనుచరులు ఈ సీటును కూటమికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భవిష్యత్ కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో తనకు సీటు ఖాయమని భావించి.. ఏడాది కాలంగా ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న పోట్ల.. తన అనుచరులతో సమావేశమై తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో కమ్మ సామాజిక వర్గానికి గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ సైతం తనకు టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెబుతున్నా.. ఆయన వర్గీయులు గురువారం మానుకొండ వ్యవసాయ క్షేత్రం వద్ద సమావేశం నిర్వహించారు. మానుకొండతోపాటు పాలేరు టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సన్నిహితుడు దిరిశాల భద్రయ్య తదితరులు హాజరయ్యారు. రాధాకిషోర్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి తీరాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని.. పొత్తుల పేరుతో టీడీపీకి ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జరిగిన నష్టమే ఈసారీ పునరావృతం అవుతుందని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకుంటామని, కార్యకర్తల అభిప్రాయాలను ఆమె దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుందామని మానుకొండ కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పొంగులేటి కలత.. ఇక కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్న తనకు పదేపదే పార్టీలో అన్యాయం జరుగుతోందని, ఖమ్మం టికెట్‌పై పూర్తిస్థాయి ఆశలు పెట్టుకున్న శాసన మండలి ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తనకు సీటు రాకపోవడంపై తీవ్ర కలత చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సుధాకర్‌రెడ్డి అనుచరులు ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే కోరారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు పార్టీపరంగా తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్‌గాంధీ భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం లభిస్తుందని భరోసా ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థిగా అధికారికంగా ఖరారైన నామా నాగేశ్వరరావుకు సొంత పార్టీలో పెద్దగా తలనొప్పులు లేకపోయినా.. కాంగ్రెస్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను సర్దుబాటు చేయడం సవాల్‌గానే పరిణమించింది. టికెట్ ప్రకటించిన వెంటనే ఖమ్మం చేరుకున్న నామాకు టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకడంతో శుభపరిణామంగా భావించినా.. 24 గంటల్లో అదే పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు సిద్ధం కావడంతో ఆనందం ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులతోపాటు మాజీ మంత్రి సంభాని, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ వర్గీయులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు.. వారికి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. కూటమి విజయానికి కృషి చేయాల్సిందిగా కోరేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. టీడీపీ తరఫున జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు జరిపారు. గురువారం రాత్రి నగరంలోని త్రీటౌన్ ఏరియాలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి నామా హాజరుకావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నామా నామినేషన్ వేసే నాటికి కాంగ్రెస్ శ్రేణుల్లో తనపై ప్రజ్వరిల్లిన అసమ్మతి సెగలను చల్లార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరాపై ఫలించని విజ్ఞప్తులు.. ఇక వైరా నియోజకవర్గాన్ని ఈసారి కాంగ్రెస్‌కే కేటాయించాలని, పొత్తుల్లో ఏ పార్టీకి ఇవ్వొద్దంటూ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా విజయాబాయిని ప్రకటించింది. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేత, మాజీ పోలీస్ అధికారి రాములునాయక్, మరో నేత లకావత్ గిరిబాబు కూటమి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాములునాయక్ కాంగ్రెస్ నుంచి టికెట్ చేజారడంతో తన రాజకీయ భవిష్యత్‌పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో పర్యటించి.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత సైతం తనకు కలిసొస్తుందనే భావనతో రాములునాయక్ ఈ ఎన్నికల్లో వైరా నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. 17వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 18వ తేదీన వైరా సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక పాలేరు విషయానికొస్తే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఈ నియోజకవర్గ టికెట్ లభించకపోవడంతో ఆయన కినుక వహించారు. పాలేరుతో ఆయనకు గల రాజకీయ సంబంధాల దృష్ట్యా.. తనకు సహకరించాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి సంభానిని అభ్యర్థించినట్లు సమాచారం. -
కూటమిలో ‘ఇంటి’ పోరు
టీఆర్ఎస్ను ఓడించాలన్న కూటమి లక్ష్యం రోజురోజుకూ నీరుగారిపోతోంది. మహాకూటమిలోని పార్టీలకు సమన్వయం కుదరకపోవడంతో ఎవరికివారే నామినేషన్లు వేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు పొందిన పార్టీలకు ఇతర పార్టీల వారు సహకరించడం లేదు. కేసీఆర్‌ను మరోసారి సీఎం కాకుండా అడ్డుకుంటామని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాతావరణం ఏమంత సానుకూలంగా కనిపించడం లేదు. జిల్లాలోని నాలుగింట మూడు చోట్ల ఆశావహులు తలనొప్పిగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొనడం ఏమంత సులువు కాదని కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : మహాకూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు.. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కూటమి ఏర్పాటుకు మూలస్థంభమైన తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మొదటి నుండి సిద్దిపేట జిల్లాలోని రెండు సీట్లపై కన్నేశారు. ఆ దిశగానే దుబ్బాక, సిద్దిపేట టికెట్లు కూటమికే కేటాయించాలని పట్టుబట్టారు. చివరకు సాధించారు. ఇప్పటి వరకు టీజేఎస్‌కు ఆరు స్థానాలు కేటాయించగా అందులో రెండు స్థానాలైన దుబ్బాక, సిద్దిపేట పేర్లు ఉన్నాయి. అయితే దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థిగా చిన్నం రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా భవానీ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తలోదారిలో కూటమి పార్టీలు రెండు స్థానాలు టీజేఎస్‌కు కేటాయించినా.. తామూ బరిలో ఉంటామని దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. తాను ఏం తప్పు చేశానని పార్టీ నాకు టికెట్ ఇవ్వడంలేదని కార్యకర్తలు, ప్రజల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా... ఈసారి పోటీలో ఉండటం మాత్రం తథ్యమని, పార్టీ అధిష్టానం మనస్సు మార్చుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే సరే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీలో ఉండి తన సత్తా రుజువు చేసుకుంటానని సవాల్ విసురుతున్నారు. సిద్దిపేట బరిలో కాంగ్రెస్ రెబల్స్ సిద్దిపేట సీటును టీజేఎస్‌కు ఎలా కేటాయిస్తారని కాంగ్రెస్ నాయకులు అధిస్టానాన్ని విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే ఒక సెట్ కాంగ్రెస్ నుండి మరోసెట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అదేవిధంగా దరిపల్లి చంద్రం కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రజావేదన ర్యాలీ తీశారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ వర్మ సిద్దిపేట టికెట్ టీజేఎస్‌కు కేటాయించడం సరికాదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. అదేవిధంగా సిద్దిపేట టీడీపీ అభ్యర్థిగా భూపేష్ కూడా నామినేషన్ వేయడం విశేషం. సర్దుకుంటామంటున్న నాయకులు పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించిన దుబ్బాక, సిద్దిపేటల్లో కాంగ్రెస్ నాయకులు కూడా పోటాపోటీగా నామినేషన్లు వేయడంపై టీజేఎస్ నాయకలు కలవరపడుతున్నారు. అయితే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రం నిర్భయంగా ప్రచారం చేసుకోండి అని ఆదేశించారని దుబ్బాక అభ్యర్థి రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా చెప్పుకునే భవానీరెడ్డిలు అంటున్నారు. టికెట్ రాలేదనే ఆవేదన ఉంటుందని, అయితే నామినేషన్ల విత్‌డ్రా నాటికి అంతా సర్దుకుటుందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. మిత్ర ధర్మం పాటించాలని కోరుతున్న టీజేఎస్ అభ్యర్థులు కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి కట్టుగా కూటమి గెలుపు కోసం పాటు పడతారని చెబుతున్నారు. హుస్నాబాద్‌లో కూడా సీపీఐ అభ్యర్థే కూటమి అభ్యర్థిగా ఉంటారని, కాంగ్రెస్, టీడీపీ మా అభ్యర్థి గెలుపు కోసం పాటు పడుతారని సీపీఐ నాయకులు చెప్పుకుంటున్నారు. -
కూటమికి రె‘బెల్స్’ బెడద
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలు ‘మహా కూటమి’ లోని భాగస్వామ్య పక్షాలకే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలు కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడమే సంకేతంగా కనిపిస్తోంది. హుస్నాబాద్ స్థానంలో పోటీ చేస్తామని కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు టీజేఎస్ కూడా జిల్లాలో తాము మూడు స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాకున్నా పటాన్చెరులో టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న నందీశ్వర్ లోలోన ప్రచారాన్ని ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : నామినేషన్ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహాకూటమి’లోని భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత ఇచ్చింది. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబ«ంధించి తామే సొంతంగా పోటీ చేస్తారా లేదా సీట్ల సర్దుబాటులో భాగస్వాములకు కేటాయిస్తారా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరికి వారుగా తాము పోటీ చేసే స్థానాల జాబితాను ప్రకటించాయి. హుస్నాబాద్ స్థానం నుంచి తాము పోటీ చేస్తామని ఇప్పటికే సీపీఐ ప్రకటించగా, మూడు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉంటామని కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ స్పష్టం చేసింది. మెదక్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్ అభ్యర్థుల జాబితాను మాత్రం విడుదల చేయలేదు. మరోవైపు పటాన్చెరు అసెంబ్లీ స్థానాన్ని కూటమి భాగస్వామ్య పార్టీ టీడీపీ కోరుతుండగా, అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ లోలోన ప్రచారం కూడా ప్రారంభించారు. నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖేడ్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొలిక్కి రాకపోవడంతో తొలి, రెండో జాబితాలోనూ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో రె‘బెల్స్’ ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా ఐదు సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఐ ఆశిస్తున్న హుస్నాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ బాట పట్టారు. టీజేఎస్ తాము పోటీ చేస్తామని ప్రకటించిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన నేతలు నామినేషన్లు వేస్తున్నారు. సిద్దిపేటలోనూ కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న తాడూరు శ్రీనివాస్‌గౌడ్, దరపల్లి చంద్రం నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు ఎల్.ప్రభాకర్ వర్మ కూడా అదే బాటలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కాంగ్రెస్ పక్షాన నామినేషన్ వేసి పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మ్యాడం బాలకృష్ణ నామినేషన్ పత్రాలు సమర్పించారు. టీడీపీ పోటీ పడుతున్న పటాన్చెరులో గోక శశికళ, సపాన్‌దేవ్, కాటా శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ పక్షాన నామినేషన్లు వేసి ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఏకంగా అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న మెదక్, దుబ్బాక, పటాన్చెరు, హుస్నాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేసి స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. -
రాజుకుంటున్న ఎన్నికల సెగ
రాజన్నా సిరిసీల్లా: వేములవాడ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు తన నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి రామకృష్ణ తమతమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార వేగం పెంచేశారు. ఇప్పటికే ఓ దఫా నియోజకవర్గంలోని మేజర్ గ్రామాలను సందర్శించిన నాయకులు మలి దఫా ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతేకాకుండా తమతమ ముఖ్యనాయకులను రప్పించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్‌రావులతో బహిరంగ సభలు నిర్వహించారు. ఇంటింటికీ ప్రచారం... టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనప్పటి నుంచే ఆయా పార్టీల నాయకులు టికెట్లు వచ్చినా.. రాకున్నా... ఎవరికి వారుగా తమతమ ప్రచారాన్ని గ్రామగ్రామాన తిరగడం ప్రారంభించారు. కేసీఆర్ ముందస్తుగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్‌బాబుకు కేటాయించడంతో ఆయన తమ అనుచరగణంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి ప్రతాప రామకృష్ణ సైతం ఇంటింటి ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు. బుజ్జగింపుల పర్వం... ఆయా పార్టీల్లో అలకలు, అసంతృప్తి వాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతునే ఉంది. దీంతో ఆయా పార్టీల అధినాయకత్వం వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో తుల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌తోపాటు వెయ్యి మంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు బుజ్జగింపులు ప్రారంభించారు. అయినప్పటికీ ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా సమర్పించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో తన అనుచరగణంతో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ మాత్రం నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమయ్యేంత వరకు అభ్యర్థి ప్రకటించలేకపోయారు. అధికారికంగా ఇంకా ప్రకటనలు వెలువడకపోయినప్పటికీ తమకు అధిష్టానం నుంచి ఓకే చెప్పారని పేర్కొంటూ ప్రతాప రామకృష్ణ పార్టీ శ్రేణులతో కలసి సంబరాలు జరుపుకున్నారు. జంపింగ్ జపాంగ్‌లు ఎన్నికల సమయంలో తమ అనుభవం, ఓటు బ్యాంకును ప్రదర్శిస్తున్న గ్రామస్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకులు సైతం తమ ప్రాబల్యం చూపుకుంటూ ఆయా పార్టీల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేధాలు ఇక నుంచి తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమతమ పార్టీల్లోకి ఆహ్వానించుకుంటున్నారు. వేడెక్కిన వాతావరణం ఎన్నికల ఫీవర్ పెరిగింది. ఎక్కడ చూసినా రాజకీయ చర్చనే సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ఊళ్లబాట పట్టారు. దీంతో ఊళ్లలో ఓట్ల పండుగ వాతావరణం పెరిగిపోయింది. ఇంతేకాకుండా గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. డప్పు కళాకారులకు ఉపాధి పెరిగిపోయింది. ఊళ్లలోకి వచ్చే నాయకులకు ఘనస్వాగతం పలికేందుకు గ్రామీణులకు కాస్త ఉపాధి లభిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో రైతులకు కూలీల కొరత తీవ్రమైంది. -
మిగిలిన 19 స్థానాలు రేపు ప్రకటిస్తాం: కాంగ్రెస్
ఢిల్లీ: అసెంబ్లీ అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో ఖరారైందని, మిగిలిన 19 స్థానాలకు రేపు ప్రకటన ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు తెలిపారు. ఢిల్లీలో బోస్ రాజు విలేకరులతో మాట్లాడుతూ..సందిగ్ధత ఉన్న 4 స్థానాల్లో ఆశావహులతో రాహుల్ గాంధీ చర్చించారని తెలిపారు. టీజేఎస్ అధినేత కోదండరాంతో సమావేశం కూడా చాలా ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. చర్చలన్నీ కొలిక్కి వచ్చాయని, అసంతృప్తులు ప్రతీ రాజకీయ పార్టీలో ఉంటారని వ్యాక్యానించారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటే అక్కడ ఇటువంటి సమస్యలే ఉంటాయని పేర్కొన్నారు. బీసీలకు టీఆర్ఎస్ కంటే తామే ఎక్కువ స్థానాలు కేటాయించామని వెల్లడించారు. స్థానాలు దక్కని వారికి పార్టీ తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ను ఓడించడమే మహా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నెల 22న సోనియా గాంధీ సభకు సంబంధించి ఏర్పాట్లపై కర్ణాటక భవన్లో భేటీ అయి చర్చించామని తెలిపారు. జనగామ సీటుపై డైలమా జనగామ సీటు ఏ పార్టీకి దక్కుతుందోనని పెద్ద డైలమా ఏర్పడింది. జనగామ సీటు కావాలంటే కోదండరాంతో మాట్లాడుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అదిష్టానం సూచించినట్లు తెలిసింది. ఈ సీటుపై నిర్ణయం కాంగ్రెస్ కోదండరాం, పొన్నాలకే వదిలేసింది. ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి పొన్నాల, కోదండరాం భేటీ తర్వాత పరిణామాలు మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. -
అసంతృప్తులకు గాలం
మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందని ప్రకటించడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కన్న కలలపై నీళ్లు చల్లినట్లయింది. టీజేఎస్ పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వడంపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా స్థానికేతరుడికి టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారంతో స్థానిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గందరగోళ పరిస్థితిలో టీఆర్ఎస్ అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని నేతలు కూడా కండువాలు మార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి, మెదక్ : మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని టీఆర్ఎస్ భావించింది. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో నైరాశ్యం అలముకుంది. శ్రేణులు సైతం మెదక్ సీటును వదులుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ తీరును బాహాటంగానే వారందరూ తప్పుబడుతున్నారు. అయితే తాజాగా టీజేఎస్ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆశావహులతో పాటు అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరి మద్దతు ఇస్తే వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ నేతలకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండరని తెలియడంతో కాంగ్రెస్ నాయకులు సైతం పార్టీలు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వీరిని టీఆర్ఎస్లో చేర్చుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అసంతృప్త నేతలతో ఆమె కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తర్వాత చేరికలపై స్పష్టత ఇస్తామని వారు చెప్పినట్లు సమాచారం. కాగా బీజేపీ నేతలు సైతం పార్టీ తీరుతో కొంత అసంతృప్తితో ఉన్నారు. స్థానికులకు కాకుండా మెదక్ టికెట్ ఇతరులకు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దీన్ని పసిగట్టిన కొంత మంది బీజేపీ నాయకులు పార్టీ తీరుపై అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీ తీరు నచ్చని బీజేపీ జిల్లా నాయకుడు సుభాష్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మెదక్ నియోకజవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
మహాకూటమి ఓ 'విష'కూటమి
కరీంనగర్‌అర్బన్: టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు ఊరట లభించిందని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. 3వ డివిజన్లో గురువారం నిర్వహించిన మహిళల ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చెట్టు ఫలాలను పొందాలంటే మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. మేయర్ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల ఆశోక్, ఆర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 27, 30 డివిజన్లలో టీఆర్ఎస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్లు కోడూరి రవీందర్‌గౌడ్, చొప్పరి జయశ్రీ వేణు, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే అధోగతే.. కొత్తపల్లి: కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఓ విషకూటమని, కూటమి గెలిస్తే తెలంగాణ అధోగతి పాలు కాకతప్పదని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్‌లో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పడుతూ స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా యాదవ సంఘ భవనంలో గంగులను గొర్రె గొంగళితో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో చేరిక కరీంనగర్: మీసేవ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో జేఏసీ, బీసీ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొల్లం లింగమూర్తి, బిజిగిరి నవీన్‌కుమార్, బొల్లం రాజ్‌కుమార్, కొట్టె కిరణ్, పల్లె నారాయణగౌడ్ తదితరులున్నారు. డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, బోనాల శ్రీకాంత్, డిష్ మధు, కుమార్, మహేందర్, సత్యనారాయణ, ఉదారపు మారుతి, తోట మధు, శంకర్, మిర్యాల్‌కార్ నరేందర్ పాల్గొన్నారు. -
హుస్నాబాద్‌లో వెనక్కి తగ్గేది లేదు: సీపీఐ
టీఆర్ఎస్ను ఓడించాలన్న కూటమి లక్ష్యం రోజురోజుకూ నీరుగారిపోతోంది. మహాకూటమిలోని పార్టీలకు సమన్వయం కుదరకపోవడంతో ఎవరికివారే నామినేషన్లు వేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు పొందిన పార్టీలకు ఇతర పార్టీల వారు సహకరించడం లేదు. కేసీఆర్‌ను మరోసారి సీఎం కాకుండా అడ్డుకుంటామని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాతావరణం ఏమంత సానుకూలంగా కనిపించడం లేదు. జిల్లాలోని నాలుగింట మూడు చోట్ల ఆశావహులు తలనొప్పిగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొనడం ఏమంత సులువు కాదని కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : మహాకూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు.. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కూటమి ఏర్పాటుకు మూలస్థంభమైన తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మొదటి నుండి సిద్దిపేట జిల్లాలోని రెండు సీట్లపై కన్నేశారు. ఆ దిశగానే దుబ్బాక, సిద్దిపేట టికెట్లు కూటమికే కేటాయించాలని పట్టుబట్టారు. చివరకు సాధించారు. ఇప్పటి వరకు టీజేఎస్‌కు ఆరు స్థానాలు కేటాయించగా అందులో రెండు స్థానాలైన దుబ్బాక, సిద్దిపేట పేర్లు ఉన్నాయి. అయితే దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థిగా చిన్నం రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా భవానీ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలు టీజేఎస్‌కు కేటాయించినా.. తామూ బరిలో ఉంటామని దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. తాను ఏం తప్పు చేశానని పార్టీ నాకు టికెట్ ఇవ్వడంలేదని కార్యకర్తలు, ప్రజల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా... ఈసారి పోటీలో ఉండటం మాత్రం తథ్యమని, పార్టీ అధిష్టానం మనస్సు మార్చుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే సరే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీలో ఉండి తన సత్తా రుజువు చేసుకుంటానని సవాల్ విసురుతున్నారు. సిద్దిపేట బరిలో కాంగ్రెస్ రెబల్స్ సిద్దిపేట సీటును టీజేఎస్‌కు ఎలా కేటాయిస్తారని కాంగ్రెస్ నాయకులు అధిస్టానాన్ని విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్ ఇప్పటికే ఒక సెట్ కాంగ్రెస్ నుండి మరోసెట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అదేవిధంగా దరిపల్లి చంద్రం కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రజావేదన ర్యాలీ తీశారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ వర్మ సిద్దిపేట టికెట్ టీజేఎస్‌కు కేటాయించడం సరికాదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. అదేవిధంగా సిద్దిపేట టీడీపీ అభ్యర్థిగా భూపేష్ కూడా నామినేషన్ వేయడం విశేషం. సర్దుకుంటామంటున్న నాయకులు పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించిన దుబ్బాక, సిద్దిపేటల్లో కాంగ్రెస్ నాయకులు కూడా పోటాపోటీగా నామినేషన్లు వేయడంపై టీజేఎస్ నాయకలు కలవరపడుతున్నారు. అయితే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రం నిర్భయంగా ప్రచారం చేసుకోండి అని ఆదేశించారని దుబ్బాక అభ్యర్థి రాజ్‌కుమార్, సిద్దిపేట అభ్యర్థిగా చెప్పుకునే భవానీరెడ్డిలు అంటున్నారు. టికెట్ రాలేదనే ఆవేదన ఉంటుందని, అయితే నామినేషన్ల విత్‌డ్రా నాటికి అంతా సర్దుకుటుందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి కట్టుగా కూటమి గెలుపు కోసం పాటు పడతారని చెబుతున్నారు. హుస్నాబాద్‌లో కూడా సీపీఐ అభ్యర్థే కూటమి అభ్యర్థిగా ఉంటారని, కాంగ్రెస్, టీడీపీ మా అభ్యర్థి గెలుపు కోసం పాటు పడుతారని సీపీఐ నాయకులు చెప్పుకుంటున్నారు. హుస్నాబాద్‌లో ఒడవని గొడవ ఇక కూటమిలో చిచ్చుపెట్టేలా హుస్నాబాద్ గొడవ ముదిరి పాకాన పడుతోంది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించే మూడు సీట్లలో హుస్నాబాద్ ఉంటుందని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే హుస్నాబాద్ సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తరఫున నియోజకవర్గం నాయకులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే లేదు లేదు.. ఈ సీటు కాంగ్రెస్‌కే కేటాయిస్తారు.. పోటీలో నేనే ఉంటాను.. అధిష్టానం కూడా నాకు పచ్చజెండా ఊపిందని చెబుతూ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. దీనిపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. తమకు కేటాయించిన మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచడం న్యాయం కాదని కూటమి సభ్యుల ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. -
అది ప్రజలు లేని కూటమి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాకూటమిలో ప్రజలు లేరని, కేవలం పైరవీకారులు మాత్రమే ఉన్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజల హృదయాల్లో లేని మహాకూటమి మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. గురువారం నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్‌ను గుడ్డిగా విమర్శించడం తప్ప.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రం అథోగతేనన్నారు. భూపతిరెడ్డి రాజీనామా చేయాలి ఎమ్మెల్సీ పదవి పొంది పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆయనను ప్రజలు ఎప్పుడో సస్పెండ్ చేశారన్నారు. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ సస్పెన్షన్ సిఫార్సుపై జిల్లా ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామన్నారు. కారు నడిపిన కవిత ఎంపీ కవిత గురువారం కారు నడిపి సందడి చేశారు. నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్త నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మారుతీనగర్‌లోని ఆయన నివాసానికి కవిత వచ్చా రు. అక్కడి నుంచి గులాబీ కారును నడుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. కారు నడుపుతున్న కవితను రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా చూశారు. కారులో అభ్యర్థి గణేష్‌గుప్తతో పాటు నగర మేయర్ ఆకుల సుజాత, పోశెట్టి ఉన్నారు. -
పొత్తులు..‘పంతాలు’
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియలో తలెత్తిన అసంతృప్తుల కారణంగా ఆయా పార్టీలు ఏ మేరకు సహకరించుకుంటాయో అనే విషయంలో ఒక స్పష్టత లేకుండా పోయింది. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత సన్నగిల్లుతోంది. ఈ సీటును పొత్తుల్లో భాగంగా సీపీఐ గట్టిగా కోరినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం వనమా వెంకటేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కూటమిలోని సీపీఐ, టీడీపీ కత్తులు దూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావుకు సీపీఐ నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయకుండా కాంగ్రెస్ కొత్తగూడెం సీటు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని సీపీఐ గరంగా ఉంది. ఈ సీటును ఆశించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాహాటంగానే కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆ పార్టీ కూటమికి అహంకారపూరిత పెద్దన్న పాత్ర పోషించిందని అన్నారు. పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్న సీపీఐ విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని అన్నారు. తమకు మూడు సీట్లు మాత్రమే కేటాయించడం కాంగ్రెస్ నాయకత్వం తీరుకు నిదర్శనమన్నారు. వివిధ రకాల సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ హైప్ సృష్టించిందన్నారు. తాను టీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకుని టికెట్ ఆశించానని వనమా వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేయడం పట్ల కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీ–ఫారం కూడా సిద్ధంగా ఉంచుకున్నానని తెలిపారు. అయితే తనకు మద్దతు ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరారవు కూనంనేని ఇంటికి వెళ్లి కోరగా, రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని కూనంనేని తెలిపారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బరిలోకి దిగుతానంటున్న ఎడవల్లి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ సైతం వనమాకు ఏ మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దిగుతానని అంటున్నారు. ఇప్పటికే తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తాను ఏ బ్యానర్‌పై బరిలోకి దిగేది శుక్రవారం నాటికి స్పష్టత ఇస్తానని ఎడవల్లి చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కూడా ఈ స్థానాన్ని ఆశించారు. టికెట్ తనకు వచ్చే అవకాశం ఉండగా, నామా నాగేశ్వరారవు తన స్వార్థం కోసం రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. మంగళవారం కొత్తగూడెంలో నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో వనమాకు ఏమాత్రం సహకరించేది లేదని తెగేసి చెప్పారు. కోనేరుకు టికెట్ ఇవ్వకపోతే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని టీడీపీ నాయకులు కాపా కృష్ణమోహన్, రావి రాంబాబు అంటున్నారు. ‘పేట’లోనూ సహకారం డౌటే.. అశ్వారావుపేటలో బలంగా ఉన్న తమకు కాకుండా ఏ మాత్రం కేడర్ లేని టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మరో ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ కేడర్ సహకరిస్తేనే ఉపయోగం ఉంటుందని, లేదంటే గడ్డు పరిస్థితి నెలకొంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
హమ్మయ్య..పంచుడయింది..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సీట్ల లెక్క ఎట్టకేలకు పూర్తయింది. కాంగ్రెస్, మహాకూటమి భాగస్వామ్య పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ రెండు.. సీపీఐ ఒకటి.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులను సైతం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో మధిర అభ్యర్థిగా మల్లు భట్టి విక్రమార్కను ప్రకటించగా.. రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డిని ఖాయం చేసింది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల ఎన్నికల సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లాకు చేరుకుని.. నామినేషన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక మల్లు భట్టి విక్రమార్క, కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య రెండు, మూడు రోజుల్లో నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వైరా నుంచి మహాకూటమి తరఫున పోటీ చేయనున్న సీపీఐ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన విజయ పేరును సీపీఐ ఖరారు చేసి.. ప్రకటించింది. 17 లేదా 18వ తేదీల్లో ఆమె నామినేషన్ వేయనున్నారు. ఇక జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగనుంది. బీజేపీ ఇప్పటికే సత్తుపల్లి, వైరా, పాలేరుకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, మధిర అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పాలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఆ పార్టీ నుంచి తొలిసారిగా టికెట్ దక్కలేదు. దాదాపు 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండి.. పాలేరు నుంచి అనేకసార్లు పోటీ చేసి.. పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంభానికి ఈసారి టికెట్ చేజారడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి గూడుకట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009, 2014 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన కందాళ ఉపేందర్‌రెడ్డి ఎట్టకేలకు ఈసారి టికెట్ దక్కించుకోగలిగారు. టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేతలు పలువురు తమ రాజకీయ భవితవ్యంపై సమాలోచనల్లో పడ్డారు. దూరంగా కాంగ్రెస్ వర్గాలు.. అయితే బుధవారం ఖమ్మం చేరుకున్న ఆ నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటనకు కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా పీసీసీ నుంచి నియమితులైన సంధ్యారెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు, మాజీ కౌన్సిలర్ కూల్‌హోం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. అనేక మంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండడం గమనార్హం. ఇక కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరులు ఎవరూ నామా స్వాగత కార్యక్రమంలో పెద్దగా పాల్గొనలేదు. మానుకొండ రాధాకిషోర్ రఘునాథపాలెం మండలం బాలప్పేటలో తన ఇంటివద్ద బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటూ ఆయనపై కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి తేవడంతో గురువారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి దృష్టికి కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామని రాధాకిషోర్ ద్వితీయ శ్రేణి నేతలకు చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ టికెట్ ఆశించిన వద్దిరాజు రవిచంద్రను సైతం ఆయన వర్గీయులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పోట్ల నాగేశ్వరరావు కూడా తన అనుచరులతో సమావేశమై.. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తమ నేతకు టికెట్ రాలేదనే ఆవేదనతో ఆయా వర్గాల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వర్గ రాజకీయాలకు కేంద్రంగా ఉండే ఖమ్మం కాంగ్రెస్‌లో అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఇప్పుడు నామాకు ఒక సవాల్‌గా పరిణమించనున్నది. కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్ కలిగి ఉన్న ఖమ్మంలో ఆ పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకోవడానికి ఏ పరిస్థితుల్లో తాను పోటీ చేస్తోంది వివరించడానికి మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఆయా నేతలను బుజ్జగించి.. సర్దిచెప్పే పనిలో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక వైరాలో కాంగ్రెస్ టికెట్ ను తొలి నుంచి ఆశిస్తున్న రాములునాయక్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించేందుకు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై సొంత పార్టీలో అసంతృప్తి ఉండడం, అనేక మంది టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారానికి దూరంగా ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌లోని ఒక వర్గం రాములునాయక్‌ను ఎన్నికల బరిలోకి దించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇక పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డి నియోజకవర్గానికి స్థానికుడు కావడం, పార్టీ శ్రేణులతో పరిచయాలు ఉండడం, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటుండడం వంటి అంశాలు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ, సీపీఐ సైతం ఈ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వారిని తన విజయానికి కృషి చేసేలా ఒప్పించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. నామినేషన్ దాఖలుకు 19వ తేదీ వరకు సమయం ఉండడంతో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉంటారోననే అనుమానం ఆయా పార్టీల నేతలను వేధిస్తోంది. -
పట్నం సీటు సైకిల్‌కు..
ఇబ్రహీంపట్నం టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నించిన డీసీసీ అధ్యక్షుడు మల్లేష్, మల్రెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం షాకిచ్చింది. వైరి వర్గాలుగా విడిపోయి ఢిల్లీలో మకాం వేసిన ఈ ఇరువురు నేతలకు టీడీపీతో పొత్తు అశనిపాతంలా మారింది. తామిద్దరికీ కాకుండా సీటు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోవడం ఖంగు తినిపించింది. వీరిద్దరు టికెట్ తమ కంటే.. తమకంటూ వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. వీరి ప్రచారానికి ఎట్టకేలకు బుధవారం రాత్రి ఫుల్స్టాప్ పడింది. అయితే టీడీపీకి సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ మల్రెడ్డి, క్యామ బరిలో దిగే ఆలోచన చేయవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజుకో మలుపు తిరుగుతున్న మహాకూటమి పొత్తు వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. అనూహ్యంగా ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సీట్లను తెలుగుదేశం పార్టీ ఎగరేసుకుపోయింది. మొదటి నుంచి ఈ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో టీడీపీ అధిష్టానానికి అయిష్టంగానే తలూపింది. జిల్లాలో ఇప్పటికే శేరిలింగంపల్లి సీటును టీడీపీకి సర్దుబాటు చేయగా తాజాగా ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సీట్లను కూడా ఆ పార్టీకి వదిలేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో బుధవారం రాత్రి టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో సామ రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), గణేష్‌గుప్తా (రాజేంద్రనగర్) పేర్లను ఖరారు చేసింది. వాస్తవానికి ఎల్బీనగర్ సీటును ఆశించిన సామ రంగారెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇదే సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ ససేమిరా అంది. దీంతో టీడీపీ అనివార్యంగా ఎల్బీనగర్ స్తానే ఇబ్రహీంపట్నం సీటును తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నంలో సర్దుబాటు చేసింది. ఇక రాజేంద్రనగర్ విషయంలోనూ అవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నేళ్లుగా ఈ సీటు తనకే దక్కుతుందని భరోసాతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్తీక్‌రెడ్డికి టీడీపీ రూపేణా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీటుకు టీడీపీ అభ్యర్థిగా గణేష్ గుప్తా పేరును ఖరారు చేస్తూ నిర్ణయం వెలువడడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ నెలకొంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ ఖాతాలో షాద్‌నగర్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన రెండో విడత జాబితాలో షాద్‌నగర్, మేడ్చల్ అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాలో చౌలపల్లి ప్రతాపరెడ్డి (షాద్‌నగర్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్) పేర్లు ఉన్నాయి. తొలి లిస్టులోనే వీరికి చోటు లభిస్తుందని భావించినప్పటికీ సామాజిక సమతూకం, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు కారణంగా పెండింగ్‌లో ఉంచింది. ఎల్బీనగర్ సెగ్మెంట్ దాదాపుగా సుధీర్‌రెడ్డికి ఖారారైనట్లేనని తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం కేటాయించడంతో సుధీర్‌రెడ్డికి ఒక రకంగా మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసే మూడో జాబితాలో ఈయన పేరు ఉండే అవకాశముంది. కూకట్పల్లి నియోజకవర్గం విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది -
నేనే ఇబ్రహీంపట్నం అభ్యర్థిని..
హైదరాబాద్: టీడీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. పొత్తుల్లో భాగంగా సీట్లు వదుకోవాల్సి రావడంతో స్థానికంగా ఉన్న బలమైన నేతలను బుజ్జగించడానికి వేరే నియోజకవర్గ టికెట్ కేటాయించాల్సి వస్తోంది. దీంతో అక్కడ ఉన్న అభ్యర్థులు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థిని తానేనంటూ టీడీపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం టీడీపీ ఇంచార్జ్ రొక్కం భీం రెడ్డి ప్రకటించుకున్నారు. టీడీపీ అదిష్టానం సామ రంగారెడ్డికి ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టికెట్ కేటాయించిన సంగతి తెల్సిందే. అప్పటిదాకా ఇబ్రహీంపట్నంలో టీడీపీ కార్యక్రమాలను, పార్టీ బరువు బాధ్యతలను మోసిన రొక్కం భీం రెడ్డికి కాకుండా సామ రంగారెడ్డికి కేటాయించడంతో భీంరెడ్డి వర్గీయులు కోపంగా ఉన్నారు. గురువారం వనస్తలిపురంలోని వైదేహినగర్లో భీం రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పని చేస్తున్నానని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా పార్టీలో వివిధ పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేశానని, టికెట్ ఇస్తానని గత సంవత్సరమే తనకు టీడీపీ అధిష్టానం నుంచి హామీ వచ్చిందని, తీరా ఎన్నికల వేళ ఇలా చేయడం బాగాలేదన్నారు. గత రెండు నెలల నుంచి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నానని, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. నిన్న టీడీపీ ప్రకటించిన అభ్యర్థి సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నంలో పోటీ చేయడానికి సుముఖంగా లేరని, తానే టీడీపీ తరపున ఇబ్రహీంపట్నం అభ్యర్థినని చెప్పారు. ఎల్బీనగర్ సీటు ఇప్పించండి: సామ అమరావతి: ఎల్బీనగర్ సీటు కావాలని కోరుతూ సామ రంగా రెడ్డి ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఎల్బీనగర్ సీటు వెళ్లిపోయిందని, ఇప్పుడేమీ చేయలేమని సామకు చంద్రబాబు తెలిపారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ఇబ్రహీంపట్నంలో పోటీ చేయాలని సామకు బాబు సూచించినట్లు తెలిసింది. సామ రంగారెడ్డి గెలుపునకు పార్టీ పూర్తి సహకారం ఉంటుందని కూడా చెప్పారు. ఎల్బీనగర్ టికెట్ దక్కక పోవానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణయే కారణమని ఆరోపిస్తూ సామ అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సామ అనుచరులకు నామా నాగేశ్వరరావు సర్దిచెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సామ రంగారెడ్డిని వెంటబెట్టుకుని నామా నాగేశ్వరరావు హైదరాబాద్ బయలుదేరారు. -
అమరావతిలోనే తేల్చుకుంటా..
హైదరాబాద్: సీట్ల పంపకం మహాకూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు స్థానాలతో టీడీపీ నిన్న విడుదల జాబితా.. కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడం పట్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్లు తీవ్రంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో మల్రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని అనుచరులతో చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. క్యామ మల్లేష్ కూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వనస్థలిపురంలోని ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి అనుచరులు మంతనాలు కూడా జరిపారు. మల్రెడ్డి సోదరుడు రాంరెడ్డి, సామ రంగారెడ్డితో రహస్య భేటీ జరిపినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి పేరు ప్రకటించడంపై మల్రెడ్డి, క్యామ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయమై అమరావతి వెళ్లి చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని సామ రంగారెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తనకు కేటాయించడంపట్ల సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి టీడీపీని ఎల్బీనగర్లో బలోపేతం చేశానని సామ రంగారెడ్డి మీడియాతో తెలిపారు. ఎల్బీనగర్లో ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు టీడీపీ కంటే ఆధిక్యం రాదని అన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ తనకు రావడంతో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఎందుకు తనకు ఇచ్చారని మల్రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుగుబాట్లు, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: గందరగోళం.. తకరారు.. తెగని పంచాయితీ.. అయోమయం.. అనిశ్చితి.. అసంతృప్తి.. అసమ్మతి.. ఈ పదాలన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరేం చేస్తారో.. అభ్యర్థుల జాబితా ఎప్పుడొస్తుందో.. అందులో ఏయే స్థానాలుంటాయో.. సీట్ల సర్దుబాటు ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో.. అసలు ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో.. ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నా.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు పదుల సార్లు కూర్చుని మాట్లాడుకున్నా.. సీట్ల పంచాయితీ తేలడం లేదు.. ఎవరెక్కడ పోటీ చేయాలనే లెక్కలు కుదరడంలేదు. కాలం కరిగిపోతూనే ఉన్నా.. ఈ తకరారుకు తెరపడటంలేదు.. కూటమి కోలుకునే పరిస్థితులూ కనిపించడంలేదు. ఆది నుంచీ అదే పరిస్థితి ఈ ఏడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికి చాలా ముందుగానే కూటమికి బీజం పడింది. అప్పుడెప్పుడో తెరవెనుక పడిన ఈ బీజం.. తెరపైకి వచ్చి కూడా రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుంచీ ప్రతి రోజూ గందరగోళం, సందిగ్ధత కనిపిస్తూనే ఉన్నాయి. అసలు కూటమిలో ఏయే పార్టీలుంటాయనే దానిపై కూడా స్పష్టత లేకుండా సాగిన నేతల చర్చలు.. నెలలు గడుస్తున్నా ముగియకపోవడం కూటమి శ్రేణులను నైరాశ్యంలో ముంచెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం కూటమిలో ఎండమావి లాంటి ఐక్యతకు అద్దం పడుతోంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులు, ప్రచారానికి 21 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంపై ఆయా పార్టీలు శ్రేణులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. కూటమి నేతలు సీట్లు పంచుకునే లోపు తాము స్వీట్లు పంచుకుంటామని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసి చాలా రోజులు అయినా, ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు కుదరకపోవడం గమనార్హం. తాము 26 స్థానాల్లో పోటీచేస్తామని టీడీపీ, 36 స్థానాల జాబితా ఇచ్చామని టీజేఎస్, 12 స్థానాలు తమకివ్వాల్సిందేనని సీపీఐ పట్టు పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అర్థవంతమైన చర్చలకు కూటమిలో ఆస్కారం లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సీట్లు పోటీ చేస్తామన్నది అప్రస్తుతమని, గెలుపే ధ్యేయంగా సీట్లను ఎంచుకుంటామని అన్ని పార్టీలు చెబుతున్నా, ఏ పార్టీ కూడా తాము అనుకున్న స్థానాల్లో పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేకపోవడం కూటమిలోని గందరగోళ పరిస్థితులను తెలియజేస్తోంది. ఇందుకు నిదర్శనంగా బుధవారం సాయంత్రం టీజేఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాము పోటీచేస్తున్నట్టు ప్రకటించిన స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించిన స్థానాలుండడం విశేషం. ఆయా స్థానాల్లో తమ పోటీ ఖాయమని, తాము పోటీచేసే చోట్ల స్నేహపూర్వక పోటీలుండవని, తాము మాత్రమే బరిలో ఉంటామని చెప్పిన టీజేఎస్ నాయకత్వం.. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన మహబూబ్‌నగర్‌లోనూ పోటీలో ఉంటామని చెప్పడం కూటమిలో నెలకొన్న సందిగ్ధతను తెలియజేస్తోంది. ఆయా స్థానాల్లో పోటీచేస్తామని చెబుతూనే.. కూటమి ఉంటుందని, అవగాహనతో వెళ్తామని టీజేఎస్ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఏకపక్ష ప్రకటన... సర్దుబాటు పరిస్థితి అలా ఉంటే.. టికెట్ల పంచాయతీ వారం రోజులుగా కూటమి పక్షాల్లో అప్రతిహతంగా సాగుతోంది. తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారు కోసం టీపీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిపించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారం రోజులుగా జాబితాపై కుస్తీలు పట్టిన కాంగ్రెస్ నాయకత్వం చివరకు గత సోమవారం 65 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో టీజేఎస్ అడుగుతున్న స్థానాల్లో కూడా అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించింది. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 93 చోట్ల, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్ 8, ఇంటిపార్టీ 1 స్థానంలో పోటీచేస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు. భాగస్వామ్య పక్షాలతో సర్దుబాటు పూర్తికాక ముందే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందో చెప్పేసి అన్ని పార్టీలను గందరగోళంలో పడేశారు. అయితే, ఇంటిపార్టీకి ఇస్తామని చెప్పిన ఒక్క స్థానాన్ని కూడా తేల్చకపోవడంతో ఆ పార్టీ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక, మిగిలిన పార్టీల్లోనూ ఏ పార్టీ ఎక్కడ పోటీచేయాలన్న దానిపై ఇంతవరకు సరైన అభిప్రాయానికి రాలేకపోయారు. కాంగ్రెస్‌లోనూ పెండింగే...! కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్నామని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీవీ సీరియల్లా సాగుతూనే ఉంది. తాము పోటీ చేస్తామని చెబుతున్న స్థానాల్లో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. ఇక, టీడీపీ అడుగుతున్న చోట్ల 11 స్థానాల్లో మాత్రమే స్పష్టత రాగా, మిగిలిన స్థానాలు ఎక్కడెక్కడన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. టీజేఎస్ పరిస్థితి మరీ గందరగోళంగా ఉంది. ఆ పార్టీ అడుగుతున్న స్థానాలు వచ్చే పరిస్థితి లేకపోగా, పోటీ చేయాలనుకుంటున్న చోట కూడా కాంగ్రెస్ మెలికలు పెడుతోంది. దీంతో చేసేదేమీ లేని పరిస్థితుల్లో టీజేఎస్ నాయకత్వం తాము పోటీచేయాలనుకుంటున్న 12 స్థానాలను ప్రకటించి బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసింది. సీపీఐ కూడా దింపుడు కళ్లెం ఆశలతో 3 సీట్లకు సరిపెట్టుకుంటామని చెబుతూనే.. దేవరకొండ స్థానం కాంగ్రెస్ వదిలిపెడుతుందని నమ్మకముందని వ్యాఖ్యానించింది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించిన చోట్ల తిరుగుబాట్లు, ఆందోళనతో కూటమి పక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇక, అందరం ఒకేచోట కూర్చుని అభ్యర్థులను ప్రకటిస్తామని, అక్కడే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ అవేవీ జరిగే పరిస్థితులు కనిపించడంలేదు. ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకుంటుండగా, సీఎంపీ ఎప్పుడు ప్రకటిస్తారన్నది కూడా తేలడంలేదు. ఈ పరిస్థితుల్లో అసలు కూటమి ఏ తీరం చేరుతుందో అర్థంకాని పరిస్థితులు అటు రాష్ట్ర రాజకీయ వర్గాలను, ఇటు ఆయా పార్టీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. -
మహాకూటమి దొంగ కూటమి
సాక్షి, హుస్నాబాద్: 67 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో గిరిజనుల్లో ఏలాంటి మార్పు రాలేదని, మళ్లీ ఓట్లకోసం తండాలకు ఏ ముఖం పెట్టుకోని వస్తారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో గిరిజనుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాష్ట్రంలో 1.80 మంది గిరిజనులపై గుడుంబా కేసులు పెట్టారని, ఇందులో లక్ష మంది చనిపోయారన్నారు. మహాకూటమి దొంగ కూటమని, కోదండరాంను కూటమిలోకి రమ్మని టికెట్ల కోసం వార్‌రూం, స్క్రీనింగ్ కమిటీల చుట్టూ తిప్పుతున్నారని, ఏ రూంకు పోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించలేదని అన్నారు. గిరిజనులకు 9శాతం రిజర్వేషన్లు కావాలని కోరామని, అందుకు వ్యతిరేకంగా 198 కేసులు వేశారని అన్నారు. 50శాతం రిజర్వేషన్లుకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గోరుగోలి భాష మాట్లాడమే గొప్పతనం.. లంబాడిలీలు మాట్లాడే భాష గోరుగోలి భాష అని, ఆ భాష మాట్లాడటం గిరిజనుల గొప్పతనమని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన, ఏ దేశానికి వెళ్లిన లంబాడీల జాతి ఒక్కటే గోరుగోలి భాష మాట్లాడుతారన్నారు. మా దైవమైన సేవాలాల్ మహారాజ్ కొరుకున్న మా జాతిలో మార్పు రావాలంటే కేసీఆర్‌ను సీఎం, ఎమ్మెల్యేగా సతీష్‌కుమార్‌ను గెలిపించుకుంటేనే ఆ కల నిజమైతదని సీతారాంనాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రూప్సింగ్, కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్రావు, ఎంపీపీ భూక్య మంగ, భీమదేవరపల్లి జెడ్పీటీసీ రామచంద్రంనాయక్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ బీలునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎడబోయిన తిరుపతిరెడ్డి, పేర్యాల దేవేందర్‌రావు, గిరిజన సంఘాల నాయకులు తిరుపతినాయక్, తదితరులున్నారు. వడ్డెర బతుకులు మారబోతాయి.. హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, బీడు భూములకు గోదావరి జలాలను తెచ్చేందుకు రాత్రిబవళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మంగళవారం మీర్జాపూర్ క్రాసింగ్ శుభం గార్డెన్లో నిర్వహించిన ఒడ్డరుల ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల కాలంలో వడ్డెరులు పేదరికంలో మగ్గెవారన్నారు. నిలువ నీడ లేక, పిల్లలను చదివించుకోనే ఆర్థిక స్థోమత లేక బండ రాళ్లను పిండి చేసే శక్తి ఆ దేవుడు ఇస్తే వారి బతుకులు మార్చే పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప పనులు చేసే సీఎం కేసీఆర్‌ను గద్దె దించుటకు కొందరు దళారులు కూటమి కట్టి మీ ముందుకు వస్తున్నారని మహాకూటమి నాయకులకు వడ్డెరుల గన్ను దెబ్బ ఏట్లా ఉంటుందో చూపించాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్, బొంత సమ్మయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడోరేపో నాలుగు స్థానాలపై ‘కూటమి’ ప్రకటన
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఫైనల్‌కు చేరింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీట్ల కేటాయింపు, సర్దుబాటుపై ఆ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సోమవారం హైదరాబాద్, ఢిల్లీలో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం రాత్రికిరాత్రే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 65 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది మందిలో ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు ముగ్గురు బీసీలు, ఇద్దరు దళిత అభ్యర్థులకు అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను సోమవారం రాత్రి ప్రకటించిన అధిష్టానం.. మరో ఐదుస్థానాలపై సస్పెన్స్ పెట్టింది. పొత్తుల్లోభాగంగా సీపీఐకి మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో హుస్నాబాద్ కూడా ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీంతో మరో నాలుగుస్థానాలపై నేడో, రేపో కాంగ్రెస్, కూటమి పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సీట్ల సర్దుబాటు.. ఫైనల్‌కు చేరినట్లేనని భావిస్తున్నారు. టీటీడీపీ, టీజేఎస్ తప్పుకున్నట్లే?.. హుస్నాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థి... తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీటీడీపీ, టీజేఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఆశిస్తున్న స్థానాలపై కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారితీసింది. మొదట టీడీపీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడిగింది. హుజూరాబాద్ నుంచి మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కోరుట్ల నుంచి ఎల్.రమణ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పోటీచేసేందుకు ఆఇద్దరు నేతలు విముఖత వ్యక్తం చేయడంతో ధర్మపురి (ఎస్సీ) నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని భావించారు. చివరినిమిషంలో అక్కడా కాంగ్రెస్అభ్యర్థులకే అవకాశం కల్పించనున్నారని చెప్తున్నారు. అలాగే తెలంగాణ జనసమితి కూడా హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం స్థానాలపై గురిపెట్టింది. ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, గోపు ఐలయ్యకు టికెట్ ఇవ్వాలని అడిగారు. తర్వాత నేరుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామే రామగుండం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు టీజేఎస్‌కు కేటాయించిన, ప్రకటించిన సీట్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కటి కూడా లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ, టీజేఎస్‌లు పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. సీట్ల కేటాయింపులో మొత్తంగా కేటాయించిన మూడుస్థానాల్లో హుస్నాబాద్ నుంచి సీపీఐకే అవకాశం కల్పించినట్లు ఆపార్టీ నేత వెంకటరెడ్డి ప్రకటించగా.. ఆయన తరఫున ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం హుస్నాబాద్‌లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సైతం పోటీలో ఉంటామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే స్నేహపూర్వక పోటీ.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేందుకు సమాయత్తం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ.. నేడోరేపో మలిజాబితా..? ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో ఐదు స్థానాలపై సస్పెన్స్ పెట్టింది. తొలి జాబితాలో తమ పేర్లుంటాయని భావించిన హుజూరాబాద్ నుంచి టికెట్ ఆశించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, కేకే.మహేందర్ రెడ్డి (సిరిసిల్ల), మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (హుస్నాబాద్)కి నిరాశ మిగిలింది. కోరుట్ల, ధర్మపురి అభ్యర్థుల ప్రకటన విషయమై కూడా సస్పెన్స్ నెలకొంది. మంగళవారం కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య జరిగిన సంప్రదింపులు, చర్చల నేపథ్యంలో హుస్నాబాద్ సీపీఐకే కేటాయిస్తామని పేర్కొనగా.. ఇప్పుడు నాలుగు స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. సిరిసిల్లలో కేకే.మహేందర్ రెడ్డి పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. దాదాపుగా టికెట్ ఖాయమైందన్న భరోసాతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చివరి నిమిషంలో ఆయన పేరు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. ఇక్కడినుంచి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం గట్టిగా పట్టుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధర్మపురిలో వరుసగా ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్థానంలో డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, దరువు ఎల్లయ్యతోపాటు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోరుట్ల నుంచి కొమొరెడ్డి రామ్‌లు తదితరులు గతంలో దరఖాస్తు చేసుకోగా.. టికెట్ కమిట్మెంట్పై కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు జువ్వాడి నర్సింగ్‌రావు పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరిగింది. ఆ టికెట్ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తంగా నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ నెలకొనగా, నేడో, రేపో ప్రకటించే మలి జాబితాతో తెరపడనుంది. -
మిగిలింది...ఇల్లెందే!
సాక్షి, కొత్తగూడెం: రెండు నెలలుగా కొనసాగుతున్న ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేర్లను వెల్లడించారు. భద్రాచలం నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా అశ్వారా వుపేట స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఇల్లెందు విషయంలో మాత్రం ఇంకా ముడి వీడలేదు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 31 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో హరిప్రియ, చీమల వెంక టేశ్వర్లు, దళ్‌సింగ్, డాక్టర్ రామచంద్రనాయక్‌తో పా టు, తాజాగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు టికెట్ విషయంలో పార్టీ నాయ కత్వం డైలమాలో ఉంది. తొలి జాబితాలో ఇక్కడి అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్ భారీగా ముందు కొస్తారని, అం దుకే నామినేషన్ల ఘట్టం చివరి వరకు పెండింగ్‌లో పెట్టునున్నారని తెలుస్తోంది. ఇక పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేరు అందరూ ఊహించిందే. ఆయ న 2009లో మొదటిసారి విజయం సాధించారు. 2014 లో పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయించడంతో రేగాకు టికెట్ దక్కలేదు. అయిన్పప్పటికీ పార్టీని వీడకుండా విధేయంగా పనిచేయడంతో ఈసారి టికెట్ వరించింది. కొత్తగూడెం అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తీవ్ర పోటీని తట్టుకుని టికెట్ సాధించారు. ఇక్కడి నుంచి ఎడవల్లి కృష్ణ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు సైతం చివరకు వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించగా, భంగపాటుకు గురైన వనమా చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం టికెట్ సాధించారు. భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య స్థానికేతరుడు. ములుగు టికెట్ కోసం వీరయ్య గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ స్థానాన్ని దనసరి అనసూయ(సీతక్క) దక్కించుకోవడంతో వీరయ్యకు స్థానచలనం తప్పలేదు. ఇక పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి అశ్వారావుపేట టికెట్ దక్కించుకున్న మెచ్చా నాగేశ్వరరావు గత ఎన్నికల్లోనూ టీడీపీ తరఫునే పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. -
రెబెల్స్ రెడీ!
సాక్షి, కొత్తగూడెం: రెండు నెలలుగా సాగదీస్తూ.. చివరకు నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కూటమి పార్టీల నాయకులు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అయితే ఇంతకాలం టికెట్లు ఆశించి భంగపడిన వారి అనుచరులు, అసమ్మతి నేతలు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. మరోవైపు కూటమి పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి, నిరాశకు లోనైన భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం ఆగ్రహావేశాలతో ఉన్నారు. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించినప్పటికీ.. ఒక రకమైన గందరగోళం మాత్రం కొనసాగుతూనే ఉంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐ గట్టిగా కోరింది. ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో సీపీఐ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించేదీ, లేనిదీ ఇప్పటికీ సీపీఐ కచ్చితంగా చెప్పడం లేదు. ఇక కాంగ్రెస్ టికెట్ కోసం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణకు సీటు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచలో ఎడవల్లి వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వనమా వెంకటేశ్వరరావుకు సహకరించేది లేదని వారు చెబుతున్నారు. నేడు (బుధవారం) తన వర్గీయులతో ఎడవల్లి సమావేశం ఏర్పాటు నిర్వహించనున్నారు. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానని ఎడవల్లి ‘సాక్షి’కి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఆశించారు. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భంగపాటు తప్పలేదు. దీంతో చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వర్గీయులు కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. నామా తన ఒక్కడి స్వార్థం చూసుకుని తనకు అన్యాయం చేశారంటూ కోనేరు చిన్ని నేరుగానే విమర్శిస్తున్నారు. కోనేరు సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అశ్వారావుపేట సీటును టీడీపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీకి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు.. మెచ్చాను ఓడిస్తామని అంటున్నారు.టీడీపీ కేడర్ మొత్తం ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉందని, ఈ నేపథ్యంలో టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. ఇల్లెందు మిగిలింది.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 31 మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇక్కడ అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. ఈ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ ముందే అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్ భారీగా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండడంతో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ∙భద్రాచలం నియోజకవర్గం నుంచి నలుగురూ కొత్తవారే టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వీరయ్య స్థానికేతరుడు కావడంతో ఫలితం ఎలా ఉంటుందో అని శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
ఆరింటిపైనే స్పష్టత..
సాక్షి, హైదరాబాద్: పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించే సీట్లపై కాంగ్రెస్‌తో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తెలిపారు. తాము 11 స్థానాలు కోరు తుండగా.. ప్రస్తుతానికి ఆరు సీట్లపై స్పష్టత వచ్చిం దని వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, వర్ధన్నపేట, అంబర్‌పేట, మల్కాజ్గిరి స్థానాలు తమకే దక్కే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై కాంగ్రెస్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఎవరూ అందుబాటులోకి రాలేదని వివరించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ స్థానంతోపాటు ఖమ్మం నుంచి ఒక బీసీ సీటును అడుగుతున్నామని పేర్కొన్నారు. అన్ని స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. కాగా, జనగామలో పోటీచేసే విషయంపై మాట్లాడటానికి కోదండరాం నిరాకరించారు. అయితే, జనగామ బరి నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండించారు. ఊహాగానాల ఆధారంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. టీజేఎస్ నిలబడే స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉండదని స్పష్టంచేశారు. -
నామినేషన్ పర్వం...
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో నామినేషన్ దాఖలు ఈనెల 19 వరకు కొనసాగనుంది. తొలిరోజు జిల్లాలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైరా తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి.. బీ ఫారం అందజేశారు. మదన్‌లాల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరాలో టీఆర్ఎస్ ప్రదర్శన నిర్వహించింది. ఇక బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి తరఫున వైరా అభ్యర్థిగా భూక్యా వీరభద్రం నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా విజయ్‌ప్రసాద్ నామినేషన్ వేశారు. సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆదివారం పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌లో నామినేషన్ పత్రాలు అందజేసినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ ముహూర్త బలం ఆధారంగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ఈనెల 19వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మధిర నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మహాకూటమి జాబితాను అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఎప్పుడు నామినేషన్ వేసేది తేలనున్నది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ 14న నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఈనెల 17న మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 19న మహాకూటమి తరఫున భారీ ర్యాలీతో వెళ్లి రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి 14వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు 19వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైరా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేష్మా ఈనెల 14న నామినేషన్ వేయనున్నారు. పాలేరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఈనెల 14 లేదా 19న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఐ మధ్య సీట్ల లెక్క తేలకపోవడంతో ఆయా పార్టీల నుంచి అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారయ్యాకే నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉండడంతో.. దాని ఆధారంగా బీజేపీ ఖమ్మం, కొత్తగూడెం అభ్యర్థులను, సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కొంత స్పష్టత వచ్చినా.. అధికారికంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కూటమి అభ్యర్థులు 15, 16 తేదీల్లో జిల్లావ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ముహూర్తం ‘బలం’ ఉందా !
సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా, జిల్లాలో తొలి రోజు కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది. నామినేషన్ పత్రాలను మాత్రం పదుల సంఖ్యలో సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు తీసుకెళ్లారు. ముహూర్త బలాన్ని చూసుకున్న తర్వాతే నామినేషన్ దాఖలు చేసేందుకు మెజారిటీ అభ్యర్థులు, ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు నామినేషన్ తొలి సెట్‌ను సాదాసీదాగా దాఖలు చేసి, ముహ్తూరం కుదిరిన రోజు భారీ హంగామాతో తరలివెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు కాగా, 14 నుంచి నామినేషన్ల దాఖలు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ల స్వీకరణకు వీలుగా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వంద మీటర్ల దూరం నుంచి బారికేడ్లు నిర్మించి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల తరపున 42 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు జారీ చేశాయి. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మంతపురి బాలయ్య ఒక్కరే తొలిరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి 15 సెట్ల నామినేషన్ ఫారాలు జారీ చేయగా, జహీరాబాద్‌లో నలుగురు అభ్యర్థులు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా మంది అభ్యర్థులు ముహూర్త బలాన్ని చూసుకున్న తర్వాతే నామినేషన్ దాఖలు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఎలాంటి హడావుడి లేకుండా దాఖలు చేసి, ముహూర్తం కుదిరిన రోజు భారీ హంగామాతో నామినేషన్లు దాఖలు వేయాలనే యోచనలో ఉన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీలు, రోడ్‌షోల ద్వారా బల ప్రదర్శన చేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ దాఖలుకు సంబంధించి ర్యాలీకి అనుమతి కోరుతూ ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి దరఖాస్తులు అందుతున్నాయి. కూటమిలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా మహాకూటమి భాగస్వామి పార్టీల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రి య కొలిక్కి రావడం లేదు. జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఉన్నా కాంగ్రెస్ జాబితా విడుదల కావడం లేదు. దీంతో నామినేషన్ల దాఖలుపై మహా కూట మి నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో స్పష్టత కొరవడింది. టీడీపీ, కాంగ్రెస్ నడుమ ఏకాభిప్రాయం కుదరక పటాన్చెరు, కాంగ్రెస్‌లో అంతర్గత పోరుతో నారాయణఖేడ్ అభ్యర్థుల ప్రకటనపై మహాకూటమిలో పీటముడి పడింది. మరోవైపు బీజేపీలో కూడా అందోలు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడంతో నామినేషన్ల దాఖలు సందడి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పలువురు ఔత్సాహికులు స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపుతూ సన్నాహాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు కూడా పంపిణీ కావడంతో ముహ్తూరం చూసుకుని నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా
సాక్షి,మునుగోడు : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు టీఆర్ఎస్ బహిష్కృత నేత వేనేపల్లి వెంకటేశ్వర్ రావు అన్నారు. సోమవారం మునుగోడులో మునుగోడు, నారాయణపురం మండలాల టీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చౌటుప్పల్, నాంపల్లి మండలాల కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తే ప్రతి ఒక్కరు ఎన్నికల బరిలో నిలవాలని కోరుతున్నారన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై వ్యతిరేకత కలిసి వస్తుందని, ఆయనకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అదేవిధంగా మహాకూటమి అభ్యర్థి నేటికీ తేలకపోవడంతో కాస్త శ్రమించి ప్రజల్లోకి వెళ్లి తాను చేయబోయే అభివృద్ధి వివరించి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అందరి కోరిక మేరకు ఈ నెల 14 న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాజీ ఎమ్మెల్యే కొందరిపై చేస్తున్న కక్షపూరిత చర్యలను అడ్డుకునేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌లు వీరమళ్ల నర్సింహగౌడ్, పందుల నర్సింహ, ముప్ప రవీందర్‌రెడ్డి, జీడిమెట్ల యశోధ, భిక్షం, ఎంపీటీసీ జీడిమడ్ల నర్సమ్మ, యాదయ్య, ఎండీ పాష, కొత్త శంకర్, చలిచీమల యాదగిరి, సైదులు, నాగేందర్, యాదయ్య, వీరేశం, తీగల యాదయ్య, పందుల వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వీడని ‘ సీటు’ముడి
ఒక పక్క సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభమైంది. ఇంకా మెదక్ నియోజవర్గ టికెట్‌పై కూటమిలో చిక్కుముడి వీడటం లేదు. కాంగ్రెస్, టీజేఎస్ ఈ టికెట్ తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొలగించడానికి స్నేహ పూర్వక పోటీ చేద్దామనే కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీజేఎస్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనపై ఆసక్తి లేదన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి ఈ టికెట్ వస్తుం దోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సాక్షి, మెదక్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌పై ప్రతిష్టంభన తొలగడంలేదు. ఈ టికెట్ కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్ సైతం మెట్టు దిగడం లేదు. దీంతో మధ్యేమార్గంగా మెదక్ అసెంబ్లీ నుంచి స్నేహ పూర్వక పోటీచేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వనుంది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కావాలని వారు కోరుతున్నారు. అయితే మెదక్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉండటం, ఇటీవల నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మెదక్ సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌ను కోరుతున్నట్లు సమాచారం. దీనికితోడు మెదక్ టికెట్‌పై కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా మెదక్ స్థానం టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఆశావహులంతా మాజీ ఎంపీ విజయశాంతిని ఆశ్రయించారు. మెదక్ సీటు ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు దక్కేలా చూడాలని, తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని వారు విజయశాంతిపై వత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో విజయశాంతి చొరవ తీసుకుని స్నేహ పూర్వక పోటీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 14న నామినేషన్.. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, టీజేఎస్ స్నేహ పూర్వకపోటీ చేసేలా చూడాలని అధిష్టానం నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. స్నేహ పూర్వక పోటీ అంశంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ నేతలు సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్నేహపూర్వక పోటీ అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నేతల్లో మెదక్ టికెట్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీజేఎస్ ఈ పోటీకి అంగీకరిస్తే బరిలో దిగేందుకు ఆశావహులు ఎవరికివారే సిద్ధం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఏకంగా ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమైన ఆయన 14న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బీ ఫామ్ తనకే దక్కుతుందని ధీమా సైతం వ్యక్తం చేశారు. మెదక్‌లో కాంగ్రెస్, టీజేఎస్ మధ్య స్నేహ పూర్వక పోటీ దిశగా అడుగులు పడుతున్నాయని, తాను స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటం ఖామయని చెప్పారు. కాగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. స్నేహపూర్వక పోటీ ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకువచ్చిందని, అయితే తమ పార్టీ ఆసక్తిచూపడం లేదన్నారు. -
9 మందితో టీడీపీ..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు మహాకూటమి అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందితో తన తొలి జాబితా ప్రకటించింది. దీంతో కూటమికి సంబంధించిన మొత్తం 74 స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే, కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే సరికి రాత్రి కావడంతో టీజేఎస్, సీపీఐలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీలు మంగళవారం తమ జాబితాలను విడుదల చేసే అవకాశముంది. ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ‘షాక్’ : తొలి జాబితాతో కాంగ్రెస్ అధిష్టానం టీజేఎస్, సీపీఐలకు షాక్ ఇచ్చింది. ఆ రెండు పార్టీలు అడుగుతున్న స్థానాల్లోనూ తమ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించింది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లను టీజేఎస్ అడుగుతుండగా.. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ కోరుతోంది. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆ రెండు పార్టీలనూ ఆత్మరక్షణలో పడేసినట్టయింది. ఉమ్మడి వేదికన్నారు.. హైదరాబాద్‌లోనే అన్నారు.. కూటమి అభ్యర్థులను ఉమ్మడి వేదికగా అన్ని పార్టీలు కలిసి ప్రకటిస్తాయని గతంలో ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఎప్పటిలాగే ఢిల్లీలో కాకుండా ఈసారి హైదరాబాద్ వేదికగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, ఇవేమీ జరగకుండానే కాంగ్రెస్, టీడీపీలు విడివిడిగా, హడావుడిగా తమ తొలి జాబితాలను ప్రకటించగా.. సీపీఐ, టీజేఎస్‌లు నేడు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ తొలి జాబితా ఇదే..! ఖమ్మం: నామా నాగేశ్వర్రావు సత్తుపల్లి: సండ్ర వెంకటవీరయ్య అశ్వారావుపేట: ఎం.నాగేశ్వర్రావు వరంగల్ వెస్ట్: రేవూరి ప్రకాశ్‌రెడ్డి మక్తల్: కొత్తకోట దయాకర్‌రెడ్డి మహబూబ్‌నగర్: ఎర్ర శేఖర్ ఉప్పల్: తూళ్ల వీరేందర్ గౌడ్ శేరిలింగంపల్లి: భవ్య ఆనంద్ ప్రసాద్ మలక్‌పేట: ముజఫర్ అలీ ఖాన్ -
జంప్ జిలానీలకు కాంగ్రెస్ ఝలక్!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలపై గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణ జన సమితి పార్టీకి కేటాయించిన స్థానాలు క్షణక్షణానికి మారుతున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమకు కేటాయించిన స్థానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ కూడా ఆగ్రహంగా ఉంది. ఇక ఆశావహులు తమ పార్టీల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంపై ఆందోళనలకు దిగుతున్నారు. హస్తినలో టెన్షన్ టెన్షన్ కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. నోటిఫికేషన్ వచ్చినా ఇంకా చర్చలేనా అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాయంత్రానికి తుది జాబితా సిద్ధం చేసి.. మరోసారి ఆయనతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. 70 మంది అభ్యర్థులకు ఆమోదం లభించినట్టు సమాచారం. మరోవైపు జానారెడ్డి, రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ప్యారాచుట్లకు చెక్ టికెట్ కోసం చివరి నిమిషంలో పార్టీలో చేరిన నేతలకు బ్రేక్ వేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. అభ్యర్థులు ఎప్పుడు పార్టీలో చేరారు, సర్వే వివరాలు చెప్పాలని రాష్ట్ర నాయకులను రాహుల్ అడిగారు. అధినేత ఆదేశాలతో దాదాపు 15 స్థానాల్లో ‘ప్యారాచుట్’ అభ్యర్థుల పేర్లను మరోసారి పరిశీలించినట్టు తెలిసింది. మరోవైపు తమకు టిక్కెట్లు దక్కుతాయో, లేదోనని కాంగ్రెస్‌లో చేరిన నేతలు ఆందోళన చెందుతున్నారు. జంప్ జిలానీలకు చెక్ పెట్టాలన్న నిర్ణయంతో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పట్టువీడని సీపీఐ తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. తమకు 5 స్థానాలు కట్టబెట్టాలని కమ్యూనిస్ట్‌లు డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. టీడీపీకి కేటాయించిన 15 స్థానాల్లో 11 సీట్లలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. మిగతా స్థానాలు ఎక్కడ కేటాయిస్తారో ప్రకటించాలని సైకిల్ పార్టీ కోరుతోంది. టీజేఎస్‌కు కేటాయించిన 6 స్థానాలు ఎక్కడిస్తారో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఆశావహుల ఆందోళన వర్ధన్నపేట టికెట్‌ను కాంగ్రెస్ కే కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ముందు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అనుచరుల ధర్నాకు దిగారు. పొత్తులో భాగంగా ఈ సీటును టీజేఎస్‌కు కేటాయిస్తున్నారని ప్రచారం జరగడంతో ఈ ఆందోళన చేపట్టారు. అటు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద కూడా పలువురు నేతల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. వీరిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్వయంగా వీరిని సముదాయించారు. టిక్కెట్లు రానివారిని తర్వాత తగు విధంగా గౌరవిస్తామని, అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయడమే ప్రధాన లక్ష్యమని కార్యకర్తలకు ఉద్బోధించారు. కొసమెరుపు జాబితాపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, అభ్యర్థుల ప్రకటన ఈ రోజా, రేపా అనేది చూడాల్సి ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం రాత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. -
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కుమ్ములాట పరంపర!
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటన అంశాలపై రెండు నెలలుగా అదుగో.. ఇదుగో అంటూ వార్తలు వచ్చి నప్పటికీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు పీటముడి వీడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంటే.. జిల్లాలో మాత్రం మరింత గందరగోళంగా మారింది. పినపాక మినహా మిగిలిన నాలుగు సీట్ల విషయమై ఇప్పటికీ గుంజాటన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు, అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో అసమ్మతులు రగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో అంటకాగడంతో ఇప్పటికే వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కూటమి పార్టీల మధ్య.. ముఖ్యంగా కాంగ్రెస్ – సీపీఐ మధ్య పొత్తులా, కత్తులా అనేలా పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం సీటు విషయంలో నెలకొన్న పీటముడి మరింత బిగుసుకుంది. ఈ క్రమంలో టికెట్ల వ్యవహారం మరింత వెనక్కు వెళుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో.. ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మహాకూటమి శ్రేణుల్లో మహా ఉత్కంఠ నెలకొనగా, ఆశావహులు మాత్రం ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా మారిందంటే నామినేషన్ల చివరి రోజైన ఈనెల 19 వరకు కూడా జిల్లాలోని అభ్యర్థుల ప్రకటనను సశేషంగానే ఉంచుతారేమోననే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ‘అతి’ జాగ్రత్త కాస్తా ‘హస్త’వ్యస్తంగా మారుతుందేమోనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రెండు నెలల క్రితం ఉన్న సానుకూలత.. చివరికి ప్రతికూలంగా మారుతుందని వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇల్లెందు ఎవరికి దక్కేనో? ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు వెళ్లాయి. వీరిలో చీమల వెంకటేశ్వర్లు, హరిప్రియ, డాక్టర్ రామచంద్రనాయక్, దళ్‌సింగ్, ఊకె అబ్బయ్య హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టికెట్‌ను బంజారాలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. తాజాగా రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన హరిప్రియ అనుచరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆమెకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా బరిలోకి దింపుతామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన అబ్బయ్య అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చారు. చీమల వెంకటేశ్వర్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో తనకు టికెట్ ఇవ్వడమే న్యాయమని, కచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోవైపు దళ్‌సింగ్, రామచంద్రనాయక్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభ్యర్థి ప్రకటన తర్వాత ఇక్కడ అసమ్మతి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆవిడేనా? అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీపడుతున్నప్పటికీ.. మొదటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి రేసులో ముందున్నారు. అయితే ఈ సీటు పొత్తుల్లో టీడీపీకి వచ్చే అవకాశం ఉండడంతో నాగమణి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉందని, టీడీపీ కేడర్ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిపోయిందని, కనుక నాగమణికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీకి ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కొత్తగూడెంలో కుమ్ములాట? కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్–సీపీఐ మధ్య చిక్కుముడి ఇంకా సాగుతూనే ఉంది. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్ఛిన్నమయ్యే స్థాయిలో గుంజాటన నడుస్తోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వకపోయినా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూనంనేనికి కొత్తగూడెం టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈ నెల 8న పాల్వంచలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ గృహనిర్భంధం చేసుకున్నాడు.సీపీఐ నాయకులు రంగంలోకి దిగి రాహుల్‌ను బుజ్జగించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ మధ్య గట్టి పోటీ ఉండడంతో పార్టీ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించింది. వనమా పలువురు పార్టీ పెద్దల సహకారంతో టికెట్ రేసులో ముందంజలో ఉండగా, ఎడవల్లి కృష్ణకు టికెట్ ఇప్పించేందుకు రేణుకాచౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమాకే టికెట్ వస్తుందని వార్తలు రాగా, ఇప్పుడు ఎడవల్లికే టికెట్ అనే వార్తలు వస్తున్నాయి. ఎడవల్లికి టికెట్ కోసం రేణుక అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవంత్‌రెడ్డి నడిపించగలడా? భద్రాచలం నుంచి కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న కృష్ణమోహన్, కృష్ణప్రసాద్ ఇద్దరూ కొత్తవారే. అయితే ఇక్కడ నుంచి రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కను దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సీతక్క ములుగు టికెటే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ములుగు మరో మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను ఇక్కడికి పంపించాలనుకోగా, ఆయన కూడా ములుగు కోసమే పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానాన్ని సీపీఐకి ఇచ్చేందుకు సైతం కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
మోగిన రె‘బెల్స్’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న శానసనభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల అంశం తేలకముందే కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక పూర్తికాముందే రెబెల్స్ తమ వాణి వినిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలనే యోచనతో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి పురుడుపోసుకుంది. కూటమి మిత్రపక్షాలకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలనే యోచనతో కొన్ని స్థానాలు కేటాయించాలని భావించింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మిత్రపక్షాలకు స్థానాలు కేటాయించొద్దంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌కే కేటాయించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. తాజాగా టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. పాత జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా వదులుకోవద్దని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం విరుద్ధంగా ఉంటే.. సురేందర్‌రెడ్డి బరిలో ఉండాలంటూ కార్యకర్తలు తీర్మానించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఈసారి కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని పార్టీ అధిష్టానం చెబుతుండగా.. ఎన్నికల బరిలో నిలిచేందుకు పలువురు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరికి మించి ఆశావహు లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహా కూటమి నుంచి ఉమ్మడి జిల్లాలో రెండు స్థానా లను మిత్రపక్షాలకు కేటాయించాలని భావించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. పార్టీ టికెట్ దక్కకపోతే రెబల్‌గానైనా బరిలోకి దిగాలని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీపీసీసీ కార్యదర్శి ఎం.సురేందర్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలాగే మక్తల్‌లో కూడా సీటును టీడీపీకి కేటాయిస్తే.. అక్కడి నుంచి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి బరిలో నిలవాలని భావిస్తున్నారు. అదే విధంగా జడ్చర్ల, దేవరకద్ర తదితర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబెల్స్ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే... గెలిచే సత్తా ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశిస్తున్నాం.. ఈ విషయమై ఆదివారం సాయంత్రం వరకు వేచి చూశాక పార్టీ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంటే కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకు నడుచుకుంటానని టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్‌ను వెంటనే ప్రకటించాలని కోరుతూ కళ్లలో నీళ్లు పెట్టుకొని ఢిల్లీలో నేతల చుట్టూ తిరిగానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి, అంతర్గత సర్వేల్లో ముందున్న వారికే కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు టికెట్ ప్రక టించకపోవడంతో కార్యకర్తల్లో నైర్యాశం నెలకొందన్నారు. టికెట్ల కేటాయింపుల్లో ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. అధిష్టానం పెద్దలు.. కార్యకర్తల మనోభావాలను గమనించి పొత్తుగా కాకుండా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని విన్నవించారు. కార్యకర్తలు, అభిమానులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని అన్నారు. అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అరాచాక పాలనను అంతమోందిస్తామని పేర్కొన్నారు -
టీడీపీ, టీజేఎస్ ఓకే.. సీపీఐ??
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, టీజేఎస్ స్థానాలపై లెక్కలు కొలిక్కివచ్చినా, సీపీఐకి కేటాయించే స్థానాలపై పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సీపీఐ పట్టుబడుతోంది. దీనిపై సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించే అవకాశం ఉంది. పార్టీలకు ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు కేటాయించారన్న దానిపై సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నామినేషన్ ప్రకటనకు ముందే కూటమి పక్షాలకు కేటాయించే స్థానాలపై ప్రకటన చేస్తామని ఉత్తమ్ సైతం ప్రకటించారు. జనగామ టీజేఎస్‌కే.. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూటమి పక్షాల్లోని పార్టీలకు ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు కేటాయించారన్న అంశమై స్పష్టత కొరవడటం, దీనిపై కూటమిలో టీజేఎస్, సీపీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వీటిని కొలిక్కి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆదివారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌లు టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం హాజరయ్యారు. సీట్ల సర్దుబాటు, కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చించారు. ఈ భేటీలో టీజేఎస్‌కు జనగామ, మెదక్, దుబ్బాక, మల్కాజ్గిరి, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేటలతో పాటు వరంగల్ ఈస్ట్ లేదా మిర్యాలగూడలో ఒక స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లుగా తెలిసింది. ఇందులో జనగామ నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మిర్యాలగూడలో సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. జానా కుమారుడి పోటీపై ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే మాత్రం ఆ స్థానం కాకుండా వరంగల్ ఈస్ట్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వనున్నారు. ఇక ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్లలో మాత్రం స్నేహపూర్వక పోటీ చేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. మరోపక్క చాడ వెంకట్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు చర్చలు జరిపారు. సీపీఐకి ముందునుంచీ చెబుతున్నట్లుగా బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాలు కేటాయించేందుకు ఓకే చెప్పగా, కొత్తగూడెం, మనుగోడుపై చర్చలు జరిగాయి. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నందున ఈ స్థానాన్ని పక్కనపెట్టి కొత్తగూడెంపై ఎక్కువ సమయం చర్చించారు. కొత్తగూడెం కాంగ్రెస్‌కే వదిలెయ్యాలని, అధికారంలోకి వచ్చాక సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు బుజ్జగించే యత్నం చేశారు. అయితే ఈ అంశంపై సోమవారం ఉత్తమ్ దగ్గరే తేల్చుకుంటామని చాడ స్పష్టం చేశారు. కాగా, సమావేశం అనంతరం శ్రీనివాస కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, చర్చలు ఫలప్రదం అయ్యాయని ప్రకటించారు. ఐదు సీట్లు ఇస్తే ఓకే.. లేదంటే కటీఫ్: చాడ సాక్షి, హైదరాబాద్: తమతో చర్చించేందుకు ఆదివారం తమ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూతలు పాత పాటే పాడి వెళ్లారని చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదు సీట్లు అడుగుతుంటే మూడు సీట్లే ఇస్తామని చెప్పడంపై చాడ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతీసారి తమనే సర్దుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లెందుకు సర్దుకోవడం లేదని ప్రశ్నించారు. సీట్ల విషయంలో సీపీఐకి ఉన్న ఇమేజ్‌ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోనే నేరుగా తేల్చుకుంటామని, ఐదు సీట్లు ఇవ్వకుంటే సాయంత్రానికల్లా అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ దూతలు వచ్చి చర్చించినా స్థానాలపై స్పష్టత రాలేదని సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని పార్టీలకు భాగస్వామ్యం: ఉత్తమ్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉత్తమ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలూ అసంతృప్తిగా ఉన్నాయని, హరగోపాల్, విమలక్క, గద్దర్ వంటి ఉద్యమకారులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఉద్యమకారులను విస్మరించి, కేవలం నలుగురు వ్యక్తులే నాలుగు కోట్ల ప్రజలను శాసిస్తున్నారని ఆరోపించారు. అటువంటి టీఆర్ఎస్కు ఎన్నికల్లో ఓటమి తప్పదని, డిసెంబర్ 11న మహాకూటమి అఖండ విజయం సాధిస్తుందని, 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీలూ భాగస్వాములుగా ఉంటాయన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత రాష్ట్ర ప్రజల అకాంక్షలను నెరవేర్చడమే తమ తొలి ప్రాధాన్యమని, ఉద్యమ అజెండా అమలుచేసే చట్టబద్ధమైన కమిటీకి కోదండరాం కన్వీనర్‌గా ఉంటారని తెలిపారు. ఉద్యమంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కోదండరాంను కేసీఆర్ అవమానించారని విమర్శించారు. టీజేఎస్‌తో సీట్ల సర్దుబాటు చర్చల అనంతరం ఆయన రమణ, కోదండరాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కూటమి పక్షాలకు ఎన్ని సీట్లు, ఏయే సీట్లు కేటాయించామన్న విషయం ప్రకటిస్తామన్నారు. కూటమిలోని అన్ని పార్టీల్లో ఆశావహులు ఉన్నారని, పోటీచేసే అవకాశం రాని నేతలకు ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాలతో గౌరవం, సుముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి గెలుస్తుందని, అందరికీ తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ, కూటమితో ప్రకంపనలు మొదలయ్యాయని, సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కుటుంబంలో మాదిరే కూటమిలోనూ చిన్నచిన్న సమస్యలున్నా అవన్నీ త్వరలో సర్దుకుంటాయని తెలిపారు. ఏయే సీట్లలో ఏ పార్టీ పోటీ చేయనుందన్న మీడియా ఆసక్తికి త్వరలోనే ఫుల్‌స్టాఫ్ పెడతామని ఓ ప్రశ్నకు కోదండరాం సమాధానమిచ్చారు. ఉద్రిక్తత.. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ టికెట్ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేశ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కోదండరాం వారిని బుజ్జగించారు. -
తుదిదశకు చేరిన కూటమి చర్చలు
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో ఏ పార్టీ ఏ స్ధానంలో పోటీ చేస్తుందన్న వివరాలు సోమవారం వెల్లడిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ నేత ఎల్ రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. తాజా సంప్రదింపులతో కూటమి చర్చలు తుదిదశకు చేరుకున్నాయని నేతలు తెలిపారు. డిసెంబర్ 12న తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టడమే తమ కూటమి ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, మైనారిటీలను మోసం చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసేందుకు కేసీఆర్ యోచిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఒక్క విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలుచేశారని ఆరోపించారు. సానుకూల వాతావరణంలో కూటమి చర్చలు సాగుతున్నాయన్నారు. ఆశావహులు నిరాశ చెందకుండా పార్టీ విజయానికి కృషి చేస్తే నామినేటెడ్ పోస్టులు, మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
పొత్తులు.. కత్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన కూటమిలో కలకలం మొదలైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అధినేతలకు తలనొప్పిగా మారింది. ఎంత బుజ్జగించినా, గెలిస్తే అందలమెక్కిస్తామన్నా.. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ససేమిరా అం టున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం మొదలుపెట్టిన వీరికి ఈ సర్దుబాటు వ్యవహారం మింగుడుపడడంలేదు. ఇంతదాకా వచ్చాక త్యాగాల పేరిట మాకు టికెట్ ఇవ్వకపోవడమేమిటని రుసరుసలాడుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కూటమి మాటెలాగున్నా టికెట్ల పర్వం ముగిస్తే చాలని అధినాయకులు అనుకుంటున్నారు లీకువీరులు! అసలుకన్నా కొసరు ఎక్కువ అన్నట్టు వార్‌రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ, చిలువలు పలువలు చేసి లీకులిచ్చేవాళ్లతో తలనొప్పి తప్పట్లేదు. ఇదిగో టికెట్..అదిగో కట్ అంటూ కొత్త కొత్త కథనాలల్లి ఆశావహులనుసందిగ్ధంలో పడేస్తున్నారు. కాంగ్రెస్ తాజాగా సీట్లు ఖరారు చేసినట్లు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు పట్టుకుంది. ప్రధానంగా మన జిల్లాలో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో అత్యధికంగా ఆ పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. అయితే, కూటమి పుణ్యామా అని ఈ సారి ఆ సీట్లు దక్కవేమోనన్న బెంగ ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎల్బీనగర్ సీటుపై కన్నేసిన ఆశావహుడు సామ రంగారెడ్డి ఇటీవల అమరావతికి వెళ్లి అధినేత బాబును కలిసి విషయం వివరించడంతోపాటు కాంగ్రెస్‌తో పొత్తు సిట్టింగ్ సీట్లకే ఎసరుతెస్తోందని వివరించారు. అయినా, చంద్రబాబు తనదైన శైలిలో త్యాగం చేయకతప్పదు అన్నట్లు తెలుస్తోంది. కొండంత ఉత్సాహంతో వెళ్లిన రంగారెడ్డి నిరుత్సాహంతో వెనుదిరగక తప్పలేదు. అంతకంతకూ అసహనం పెరగడంతోపాటు కార్యకర్తల ఒత్తిడి ఎక్కువ కావడంతో నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. గాంధీభవన్‌కు తాకిన సెగ! టీడీపీతో సయోధ్య కాంగ్రెస్‌లోనూ ముసలం పుట్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా నాలుగు సీట్లను ఆ పార్టీకి కేటాయించనున్నారనే ప్రచారం హస్తం ఆశావహులను కలవరపరుస్తోంది. మహాకూటమి పురుడు పోసుకున్న మొదటి రోజే గత ఎన్నికల్లో ఉప్పల్ అభ్యర్థిగా బరిలో దిగిన బండారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరగా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత మందిని పక్కచూపులు చూసేలా చేస్తున్నాయి. ఉప్పల్, కూకట్పల్లి స్థానాలను దాదాపుగా టీడీపీకి కేటాయించినట్లు కాంగ్రెస్ సంకేతాలిస్తోంది. ఇవిగాకుండా పరిశీలనలో శేరిలింగంపల్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం, సీమాంధ్ర ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈ సీటును ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. దీంతో ఈ స్థానం కూడా దాదాపుగా ‘దేశం’ కోటాలో చేరే అవకాశం దాదాపుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అవాక్కయిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మూడు రోజుల క్రితం గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు. ఆయన మద్దతుదారు ఒకరు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను హస్తినకు పిలిపించి మాట్లాడింది. మరోవైపు టీజేఎస్‌తో పొత్తు కూడా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. మల్కాజిగిరి స్థానాన్ని సర్దుబాటులో భాగంగా టీజేఎస్‌కు వదలాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయగా.. సీట్ల పంపిణీ అనంతరం కూటమి పక్షాల్లో కీచులాటలు మరింత రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. రాజేంద్రనగర్ సెగ్మెంట్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాంగ్రెస్ తరఫున ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి కాకుండా.. పొత్తులో టీడీపీ కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి సంపూర్ణ సహకారం అందడం కష్టంగానే కనిపిస్తోంది. -
‘కలిసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు’
సాక్షి, సిరిసిల్ల : ‘శాసనసభ రద్దయి రెండు నెలలైంది. వీళ్ల ముఖాలకు కలిసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు. కలసి ప్రభుత్వాన్ని నడుపుతారా? గూట్లో రాయి తీయనోళ్లు.. ఏట్లో రాయి తీస్తరట’అని మహాకూటమిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కూటమి సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటామని చెప్పారు. ‘రాహుల్ సీట్లిస్తే, చంద్రబాబు నోట్లు ఇస్తున్నడు..రాహుల్ సీట్లకు, చంద్రబాబు ఓట్లకు తెలంగాణ ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలె’అని పిలుపునిచ్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే.. ప్రాజెక్టులను అడ్డుకోడానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబుతో జతకట్టిన మాయాకూటమిని నమ్మి మోసపో వద్దని చెప్పారు. చంద్రబాబుకు జుట్టు చేతికిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు. పాపం కోదండరాం సార్‌ను ఇరికిచ్చిండ్రు ‘కోదండరాం సార్ అమాయకుడు. ఆయన్ను పట్టుకు ని కాంగ్రెసోళ్ల చేతిలో కూర్చోబెట్టిన్రు. పాపం సారును ఇరికిచ్చిండ్రు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది మామూలు హస్తం కాదని, భస్మాసుర హస్తమని పేర్కొన్నారు. ఎవరు పట్టుకుంటే వాళ్లు భస్మం అయితరు.. పాపం కోదండరాం సార్ ఆ చెయ్యి పట్టిండు..ఆయన పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. గతంలో తాను సోనియాను అ మ్మా బొమ్మా అంటే ఐదు ఫీట్లు ఉన్నోడు కూడా ఆరు ఫీట్లు ఎగిరిండ్రు.. చంద్రబాబు మీ సోనియమ్మ ను ఎన్ని తిట్లు తిట్టిండు.. సోనియా ఈ దేశం పాలిట దెయ్యం.. అవినీతి అనకొండ.. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని..ఇటాలియన్ మాఫియా.. అంటూ తిట్టిన చంద్రబాబుతో సిగ్గులేకుండా కలసి తిరుగుతారా? అని దుయ్యబట్టారు. కూటమికి అధికారమిస్తే రైతు ల నోట్లో మట్టికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రైతును రాజుగా చేయడమే తమ ధ్యేయమని కేటీఆర్ తెలిపారు. గతంలో అర్ధరాత్రుల్లో కరెంటు కోసం కావలి కాసే పరిస్థితి ఉండేదని, విత్తనాలు, ఎరువు లు, పురుగు మందుల కోసం రైతులు బారులు తీరే వారని గుర్తు చేశారు. అలాంటి స్థితి నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందు కు కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం మరో 4 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి కాబోతోందని తెలిపారు. రైతుల దగ్గరికి వెళ్లాలంటేనే భయమేసేది: పోచారం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కృతజ్ఙతతో పెట్టుకున్న మొట్టమొదటి రైతు ఆశీర్వాదసభ ఇదేనని చెప్పారు. ‘నేను టీడీపీలో మంత్రిగా పనిచేసిన.. అప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయమేసేది.. ఇప్పుడు తలెత్తుకుని మాట్లాడుకుంటున్నం. వందకుపైగా సీట్లలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలి’అని ఆయన కోరారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ జాబితాలో మళ్లీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో నెలకొన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం గురువారం అభ్యర్థుల తొలి జాబితాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరాలు తెలిపారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ దూత హోదాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో శనివారం ఏపీ రాజధాని అమరావతిలో భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో శనివారం ప్రకటించాల్సిన జాబితా మరోమారు వాయిదా పడిందని, కాంగ్రెస్ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిన తొలి జాబితాలోనూ చంద్రబాబు సూచన మేరకు మార్పుచేర్పులుంటాయని తెలియవచ్చింది. అందుకే 10న జాబితాను విడుదల చేస్తామంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా గురువారం ఢిల్లీలో ప్రకటించినప్పటికీ శనివారం కూడా జాబితా వెలువడలేదని సమాచారం. మరోవైపు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇంతవరకు ఒక్క అభ్యర్థి పేరును కూడా ప్రకటించకపోవడంపట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కారణం ఏమిటి? గత 15 రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఊరిస్తూనే ఉంది. అదిగో... ఇదిగో, ఈరోజు.. రేపు, ఎల్లుండి అంటూ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు, అనధికారికంగా జరుగుతున్న ప్రచారం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలో పడేస్తోంది. ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం పొందిన 74 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనలోనూ ఎందుకు ఆలస్యమవుతోందనే విషయమై పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు టీపీసీసీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం, కీలక నాయకుల అలకలు, ఆగ్రహాలు, వారసులకు టికెట్లు ఆశిస్తున్న నేతల కినుక లాంటివి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఆధిపత్యం కోసం కీలక నేతలు అభ్యర్థుల ఖరారులో వేర్వేరు వ్యూహాలను అమలుపర్చడంతో జాబితా గందరగోళంగా తయారైందనే చర్చ జరుగుతోంది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నామని, గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తామని పైకి ప్రకటించినా ముఖ్య నాయకులు తమ అనుయాయులకు ప్రాధాన్యమిచ్చేలా సిఫారసులు చేశారని, అధిష్టానం నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా జాబితాలో పేర్లను చేర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి నేతలకు చెక్‌పెట్టేలా కొందరు టీపీసీసీ ముఖ్యులు అధిష్టానం వద్ద చేసిన ప్రయత్నాలు వారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తాను చేయించిన సర్వేల్లో గెలుస్తారని తేలిన 24 మందితో కూడిన జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అధిష్టానం ముందు పెట్టినప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా కొందరు అడ్డుకున్నారని రేవంత్ అలకవహించినట్లు సమాచారం. అలాగే తమకు చెక్‌పెట్టాలనే వ్యూహంలో భాగంగా నకిరేకల్, మునుగోడు స్థానాలను ఇంటి పార్టీతో ముడిపెట్టడంపై కోమటిరెడ్డి సోదరులు మండిపడుతున్నారని తెలియవచ్చింది. తాము అడుగుతున్న స్థానాల విషయంలో అభ్యంతరాలు చెప్పడంతోపాటు తమ అనుచరుడికి ఇవ్వాల్సిన సీటుకు కూడా ఎసరు పెడుతుండటంతో వారు ఢిల్లీ స్థాయిలో మళ్లీ పావులు కదుపుతున్నారని తెలిసింది. మరోవైపు ఏఐసీసీ వద్ద జరిగిన కీలక భేటీల్లో జానా, ఉత్తమ్‌ల మధ్య కూడా అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదనే చర్చ జరుగుతోంది. భువనగిరి స్థానానికి ఉత్తమ్ ఒకరి పేరు ప్రతిపాదిస్తే జానా మరో పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలా కీలక నేతల మధ్య పొరపొచ్చాలతోపాటు తమ వారసులకు టికెట్లు ఇవ్వడంలేదని అధిష్టానం ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో కొందరు నాయకులు ఇంకా ఢిల్లీలో లాబీయింగ్ చేసుకునే పనిలో ఉన్నారు. బీసీల ఆందోళనా కారణమేనా..? కాంగ్రెస్‌లోని బీసీ నేతలకు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదు. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తమకు ఇవ్వాల్సిన స్థానాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించాలని ప్రతిపాదించడం, సామాజిక సమీకరణలను సరిగా పాటించకపోవడం బీసీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యమిచ్చి మరికొన్ని కులాలను విస్మరించేలా అభ్యర్థుల జాబితా తయారు చేశారని వారు మండిపడుతున్నారు. తమకు 45 సీట్లు కేటాయించడంతోపాటు సీఎం పదవి ఇవ్వాలంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద పలువురు నేతలు ఆందోళనకు దిగడంతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్ Ððవెళ్లి వారిని సముదాయించాల్సి వచ్చింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, ఓయూ జేఏసీ నేతలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు ఉండటంతో వారు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రజారాజ్యం, టీఆర్ఎస్లలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు, పార్టీకి చేదోడువాదోడుగా ఉంటున్న పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కూడా తన సీటు కోసం ఢిల్లీలో మకాం వేయాల్సి రావడం గమనార్హం. ఖైరతాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనతోపాటు అదే టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి. వినోద్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటన్నింటికీతోడు కాంగ్రెస్ ఖరారు చేసుకున్న 74 స్థానాల్లో కొన్నింటిని మిత్రపక్షాలు ఆశిస్తుండటం, ఆయా సీట్ల విషయంలో కూటమి పార్టీలతో చర్చలు పూర్తి కాకుండానే మిత్రపక్షాలకు 26 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రకటించడం కూడా జాబితా ఆలస్యం అయ్యేందుకు కారణంగా కనిపిస్తోంది. నేడు కూడా జాబితా రానట్లే! డైలీ సీరియల్లా వాయిదా పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆదివారం కూడా లేనట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తున్న నేపథ్యంలో ఆదివారం జాబితా విడుదల చేయవద్దన్న టీపీసీసీ సూచన మేరకు అధిష్టానం దాన్ని వాయిదా వేసిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఖరారు చేసిన 74 సీట్లలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేసేందుకు ఢిల్లీలో కసరత్తు జరుగుతుందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. కారణమేదైనా ఆదివారం కూడా జాబితా రాదని, నోటిఫికేషన్ రానున్న 12వ తేదీ అర్ధరాత్రి లేదా 13వ తేదీన తొలి జాబితా వస్తుందని, అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయితే ఒకే దఫాలో అందరి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్‌లోనే ఉంటుందని, కూటమి భాగస్వామ్య పక్షాలందరితో కలసి అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ రోజున అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు వద్దకు జాబితాపై రాష్ట్ర నేతల ఆగ్రహం? ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ దూత హోదాలో అశోక్ గెహ్లాట్ శనివారం అమరావతికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం, కూటమి అభ్యర్థుల జాబితాను బాబు ఆమోదం నిమిత్తం తీసుకెళ్లడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మహాకూటమి పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్నే జీర్ణించుకోలేకపోతున్నామని, అయినా టీఆర్ఎస్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో సర్దుకుపోదామనుకున్నా మొత్తం పార్టీనే చంద్రబాబు చేతిలో పెట్టడమేంటనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణులను విస్మయపరుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా చంద్రబాబు క్లియరెన్స్ ఇవ్వడమంటే ఆత్మహత్యాసదృశమేనని, 74 మందితో జాబితా సిద్ధమైనా బాబు ఆమోదం కోసం ఆపడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తుంటారన్న విషయాన్ని ఏ క్షణంలో మర్చిపోతామో అప్పుడే రాజకీయంగా అగాథంలో కూరుకుపోతామని ఆయన వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయానికి అద్దం పడుతోంది. కాగా, కూటమి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ఆమోదం కోసం తీసుకెళుతున్నారని ‘సాక్షి’ముందే చెప్పినట్లుగానే తాజా పరిణామాలు జరుగుతుండటం, శనివారం వెలువడాల్సిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వాయిదాపడటం గమనార్హం. -
కూటమిపై సోషల్ మీడియాలో జోకులు
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో వ్యంగ్యంగా జోకులు వేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. టీజేఎస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కీలక సందర్భంలో సీట్లపై తేల్చకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సి ఉందని, కూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్సే ఈ జాప్యానికి కారణమని తెలిపారు. సీట్ల సర్దుబాట్లపై రోడ్ మ్యాప్ లేనందునే అనిశ్చితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు సర్దుబాటు, ఎజెండా అంశాలపై ఇప్పటికీ సరైన స్పష్టత లేద న్నారు. సీట్ల సర్దుబాటుపై రెండు మూడురోజు ల్లో పూర్తవుతుందన్నారు. పార్టీ కార్యాలయం శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సీట్ల సర్దుబాటు, పొత్తుల ప్రక్రియ, భవిష్యత్తు కార్యచరణపై చర్చ జరిగినట్లు కోదండరాం తెలిపారు. సీట్లను గౌరవంగా ఇవ్వకుంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినట్టు చెప్పా రు. ఉమ్మడి సింబల్ గురించి ఈసీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు. అడిగింది 39 స్థానాలు...దక్కింది 8 స్థానాలు గత 35 ఏళ్లుగా వరంగల్ పశ్చిమ, నిజామాబాద్, తాండూర్ వంటి చాలా స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ అసలు గెలవలేదని, కాంగ్రెస్‌పార్టీ బలహీనంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లోనే టీజేఎస్ స్థానాలకు కోరిందని తెలిపారు. అలాంటి 21 నియోజకవర్గాల్లో టీజేఎస్‌కు నిలదొక్కుకునే శక్తి ఉందని వివరించారు. కూటమిలో మొత్తంగా తాము ముందుగా 39 అసెంబ్లీ స్థానాలను కోరామని ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీటు చొప్పున 17 నియోజకవర్గాలు ఇవ్వాలని అడిగినట్టుగా ఆయన వెల్లడించారు. ఆ తరువాత 12 స్థానాలకు అంగీకరించామని, చివరకు 10 స్థానాలను కూడా ఒప్పుకున్నట్టుగా కోదండరాం చెప్పారు. కాం గ్రెస్ పార్టీ 8 స్థానాలతో జాబితాను ఇచ్చిందన్నారు. కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదనే... బెల్లంపల్లి, అశ్వారావుపేట వంటి పేర్లను కూడా వాటిలో చేర్చారని కోదండరాం చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ సీట్లు అడిగామని, మెద క్, దుబ్బాక స్థానాలను ఇచ్చారని చెప్పారు. చివరికి టీజేఎస్‌కు ఇచ్చిన 8 స్థానాల్లో స్పష్టతను ఇవ్వాలని కోరామన్నారు. సిద్దిపేటతో పాటు అనేక స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నారు. కూటమి స్ఫూర్తి్తని దెబ్బతీయకూడదనే ఓపిగ్గా ఉన్నామన్నారు. -
ఇంకా అయోమయమే!
ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది. టీఆర్ఎస్, బీఎల్ఎఫ్ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి మహాకూటమి, బీజేపీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీంతో అందరి దృష్టి పీసీసీ ప్రకటించబోయే జాబితాపైనే ఉంది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ లేనందున తొలి అభ్యర్థుల జాబితాలో సునీతాలక్ష్మారెడ్డి పేరు ఉండనుంది. మెదక్ అసెంబ్లీ స్థానంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహాకూటమిలో భాగంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్ కోరుతోంది. ఎట్టిపరిస్థితుల్లో టీజేఎస్‌కే దక్కుతుందని, వదులుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనార్ధన్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మెదక్ అసెంబ్లీ స్థానం ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్నారు. సాక్షి, మెదక్ : నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాతో జిల్లాలో కొంత క్లారిటీ వచ్చే అవశాశం ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం మెదక్ టికెట్‌పై ఉంది. మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణతోపాటు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో తాను జరిపిన చర్చల వివరాలను నేతలకు వివరించారు. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు మెదక్ స్థానం కేటాయించారని జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని, కాంగ్రెస్ పోటీ చేయటం ఖాయమని విజయశాంతి చెప్పినట్లు సమాచారం. మెదక్ నుంచి తాను పోటీచేసే అవకాశం లేదని మెదక్ నియోకజవర్గ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనూ ఉంటూ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ముకుల్ వాస్నిక్, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీలను కలిసి మెదక్ టికెట్ ఇప్పించాలని కోరారు. కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గానే పోటీచేయాలనే అంశంపై శశిధర్‌రెడ్డి తన మద్దతుదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 11న బీజేపీ అభ్యర్థుల ప్రకటన బీజేపీ పార్టీ సైతం ఇప్పటి వరకు మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్ టికెట్ కోసం నియోజకవర్గ నాయకులు రాంచరణ్‌యాదవ్, కటికె శ్రీనివాస్ తదితరులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య సైతం మెదక్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఆకుల రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నుంచి బీజేపీ నాయకులు గోపీ, రఘువీర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. 11వ తేదీన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసేందుకు టీఆర్ఎస్.. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 11వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ , నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు బీఫామ్ అందజేయనున్నారు. బీఫామ్ అందుకున్న అనంతరం 17, 18, 19 తేదీల్లో వరుసగా మూడుసెట్ల నామినేషన్లు వేసేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి నామినేషన్ ఎప్పుడు వేయాలన్న అంశంపై మద్దతుదారులతో చర్చిస్తున్నారు. 18, 19 తేదీల్లో మదన్‌రెడ్డి కూడా నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి -
టెన్షన్..సీట్ల టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్ కూటమి పొత్తులు, సీట్ల లెక్కల వ్యవహారం నేడు తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఏ స్థానంలో ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కూటమిలోని టీడీపీ, టీజేఎస్ పార్టీల సర్దుబాట్లకు సంబంధించి న వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంలో మాత్రం ఇప్పటికీ చిక్కుముడులు వీడలేదు. దీంతో సీట్ల లెక్కలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో తేలలేదు. కొత్తగూడెంపై వీడని ప్రతిష్టంభన జిల్లాలోని ఏకైక జనరల్ నియోజకవర్గం కొత్తగూడెం విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వివిధ దశల్లో సర్వేలు నిర్వహించింది. వివిధ రకాలుగా వడపోత కార్యక్రమాలు నిర్వహించింది. నోటిఫికేషన్ సమయం సమీపించినా కూటమి పార్టీల పొత్తుల వ్యవహారంలో ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీట్ల సర్దుబాట్ల విషయంలో అనేక కొర్రీలు, కిరికిరీలు తలెత్తడంతో పీటముడి పడింది. కొత్తగూడెం సీటు విషయానికి వస్తే ఇక్కడ మరింత గందరగోళం నెలకొంది. ఈ సీటు కోసం సీపీఐ పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో హోరాహోరీ నెలకొంది. దీంతో ఈ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీటు విషయమై రాజకీయ వర్గాలతో పాటు, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. మొదటి జాబితాలో ఎవరెవరికీ..? అనేక ములుపులు తిరుగుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీల టికెట్ల వ్యవహారం తుది దశకు చేరినప్పటికీ ఇంకా కొన్ని సీట్ల విషయంలో సరైన స్పష్టత రాలేదు. నేడు (శనివారం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను 74 మంది పేర్లతో విడుదల చేయనున్నారు. రెండో జాబితా ఆదివారం ప్రకటిస్తామని చెబుతున్నప్పటికీ పలు సందేహాలు కలుగుతున్నాయి. నామినేషన్ల చివరి రోజు వరకు పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో 64 రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల్లో లబ్..డబ్ అనే విధంగా ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో పినపాక ఒక్కటే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పినపాక అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరు ఖరారైనట్లు సమాచారం. అశ్వారావుపేట స్థానం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడం, ఇక్కడ టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు బరిలో ఉండడం దాదాపు ఖాయమైనట్లే. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు విషయమై హైటెన్షన్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. వీరిద్దరిలో ఎవరిని బుజ్జగిస్తారో లేదా సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఇద్దరిని బుజ్జగిస్తారో అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ సీటు కోసం సీపీఐ గట్టి పట్టు పడుతుండడంతో పాటు, ఇవ్వనిపక్షంలో కూటమి నుంచి బయటకు వెళతామని సీపీఐ అల్టిమేటం ఇవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాష్ట్రవ్యాప్త పొత్తు కొత్తగూడెం సీటుతో ముడిపడినట్లైంది. ఇల్లెందు, భద్రాచలం పెండింగే.. ఇల్లెందు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఐదుగురు అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఊకె అబ్బయ్య, హరిప్రియలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఈ క్రమంలో మొదటి జాబితాలో ఇల్లెందు అభ్యర్థి పేరు ప్రకటించకుండా అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు భద్రాచలం అభ్యర్థి విషయంలోనూ ఎంపిక ఓ కొలిక్కి రాకపోవడంతో దీన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ నుంచి పోటీకి కారం కృష్ణమోహన్, కృష్ణబాబు రేసులో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. సీతక్క మాత్రం ములుగు నుంచి పోటీ చేసేందుకే పట్టుబడుతున్నారు. ములుగు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పొదెం వీరయ్యను భద్రాచలం నుంచి పోటీ చేయించేందుకు ప్రతిపాదించగా.. అందుకు ఆయన సుముఖంగా లేకపోగా ములుగు కోసమే భీష్మిస్తున్నారు. దీంతో ములుగుతో పాటు భద్రాచలం సీటు విషయాన్ని సైతం కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్న సీట్ల విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనివే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రకటించి 2 నెలల నాలుగు రోజులు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండనుంది. గత సెప్టెంబరు 6వ తేదీన శాసనసభ రద్దు చేయడంతో ఇప్పటికి రెండు నెలల నాలుగు రోజులు అయింది. టీఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో రెండు విడతలు ప్రచారం నిర్వహించారు. -
జిల్లాలో సీట్ల సర్దుబాటులలో వీడని ఉత్కంఠ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల మరికాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పలు వాయిదాల అనంతరం పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. అందులో భాగంగా ఎలాంటి వివాదం లేని స్థానాల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున దాదాపు 10 స్థానాలకు పోటీ చేసే నేతల పేర్లను అధిష్టానం ఆమోదించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ టీపీసీసీ ముఖ్యనేతలు మేనిఫేస్టో రూపకల్పనలో భాగంగా దుబాయి పర్యటనకు వెళ్లారు. దీంతో అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించే అవకాశం అనుమానమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే వారి విషయమై ఏకాభిప్రాయం కోసం పరిశీలన సాగుతోంది. ఇంకా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించి ఒకేసారి నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే 12వ తేదీనే మొత్తంఅభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి మాత్రమే స్థానం కాంగ్రెస్ నేతృత్వంలో రూపం సంతరించుకున్న మహాకూటమి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగస్వామ్య పక్షాలకు స్థానం దక్కడం లేదని తెలుస్తోంది. కేవలం కూటమిలోని టీడీపీకి మాత్రమే రెండు స్థానాలు మాత్రమే కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క స్థానం కోసం తీవ్రంగా పట్టుబడుతోంది. స్థానం దక్కించుకోవడానికి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు సైతం చేస్తోంది. అయితే టీజేఎస్ కోరుతున్న మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతుండడంతో... టీజీఎస్‌కు సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీజేఎస్ తరఫున బరిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి కూడా అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే ఆలస్యమా? కాంగ్రెస్ తరఫున కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్న వారందరినీ ఇటీవల ఢిల్లీకి పిలిచిన అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు బరిలో ఎవరు నిలిచినా మిగతా వారు మద్దుత తెలపాలని సూచించింది. పోటీలో నిలవకుండా త్యాగం చేసిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. అందుకు కొందరు సమ్మతించగా.. మరికొన్ని చోట్ల మాత్రం అసంతృప్తులు పార్టీ ఫిరాయించే ప్రమాదముందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను మరికాస్త ఆలస్యం చేయడం ద్వారా నామినేషన్ల పర్వం మొదలైతే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు మరికాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అన్ని స్థానాలకు అభ్యర్థులను 12న ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పొంచి ఉన్న రెబెల్స్ బెడద రానున్న ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద ఖాయమని తెలుస్తోంది. కూటమిలో భాగంగా రెండు స్థానాల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. అంతేకాదు మరికొన్ని చోట్ల కూడా ఆశావహులు ఎక్కవగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా కూటమికి కేటాయించే రెండు స్థానాల్లో కాంగ్రెస్ శ్రేణులు రెబెల్స్‌గా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి టీడీపీకి అవకాశం కల్పిస్తే టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న మారేపల్లి సురేందర్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన అనుచరగణం పత్రికా ప్రకటనలతో హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే మక్తల్‌లో కూడా టీడీపీ అవకావం ఇస్తున్నందున.. కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసే ఒకటి, రెండు చోట్ల కూడా అసంతృప్తులు బరిలో దిగాలని భావిస్తున్నారు. -
‘మహా’ ముడి వీడితేనే..!?
మహాకూటమి సీట్ల సర్దుబాటు, స్థానాల కేటాయింపుపై చిక్కుముడి వీడటం లేదు. రోజుకో రకమైన లీకులతో మహాకూటమి భాగస్వామ్య పార్టీల కేడర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలలో విడివిడిగా, భాగస్వామ్య పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కూటమి పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీపీసీసీ నుంచి పొన్నం ప్రభాకర్, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సీట్ల సర్దుబాటు, కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలలో కూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. రోజుకో రకమైన ప్రచారాన్ని తెరమీదకు తెస్తుండటంతో సుమారు రెండు నెలలుగా సాగుతున్న గందరగోళానికి తెరపడకపోగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు పీటముడిగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పొత్తుల్లో భాగంగా టీజేఎస్ రెండు, టీటీడీపీ, సీపీఐలు తలా ఒక స్థానాలను ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి. అంతకంటే ఎక్కువ సీట్లే అడిగినా.. చివరి నిమిషంలో ఈ సంఖ్యతో సరిపెట్టుకునేందుకు మెట్టు దిగాయి. అయితే.. హుస్నాబాద్ నియోజకవర్గం విషయంలో మాత్రం సీపీఐ అస్సలు రాజీ పడటం లేదు. 12 నుంచి ఎనిమిదికి, ఎనిమిది స్థానాల నుంచి ఐదుకు తగ్గిన సీపీఐ హుస్నాబాద్‌ను మాత్రం వదులుకోబోమని స్పష్టం చేస్తోంది. తాజాగా శుక్రవారం మరోమారు అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసిన ఆ పార్టీ నాయకత్వం ఐదు స్థానాలు, హుస్నాబాద్‌పై అమీతుమీ తేల్చుకుంటామనే ప్రకటించాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే విధంగా టీజేఎస్ రామగుండం, హుజూరాబాద్ స్థానాలను అడుగుతుండగా.. రామగుండంపై సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే.. తాజాగా ప్రొఫెసర్ కోదండరామ్ జనగాం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం లేవడంతో, రామగుండం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ సైతం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీపీ మొదట హుజూరాబాద్ ఆ తర్వాత కోరుట్లను ప్రతిపాదించినా.. చివరకి ధర్మపురికి చేరింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించే అభ్యర్థుల తొలిజాబితా శనివారానికి వాయిదా వేశారు. శనివారమైనా ప్రకటిస్తారా? అన్న సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. సింగిల్నేమ్పై చిర్రు బుర్రు.. ఊగిపోతున్న కాంగ్రెస్ ఆశావహులు.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండి ఒక్క స్థానంలో సస్పెన్స్ పెట్టింది. ఈ 12 నియోజకవర్గాలతోపాటు చొప్పదండి అభ్యర్థికి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘బి’ఫామ్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి అందరికీ ఆహ్వానం కూడా అందింది. కాంగ్రెస్, మహాకూటమిల పొత్తులు, అభ్యర్థుల ప్రకటనపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ, స్క్రీనింగ్ కమిటీలు ఏఐసీసీకి సింగిల్‌నేమ్ పంపడంపై ఆ పార్టీ ఆశావహులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంథని, జగిత్యాల, సిరిసిల్ల, మానకొండూరు, కరీంనగర్ మినహా అంతటా అసంతృప్తులు, ఆశావహులు ఆగ్రహంతో ఉన్నారు. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ పేరు పంపారన్న ప్రచారంతో ఏనుగు మనోహర్‌రెడ్డి, కొలగాని మహేష్ తదితరులు అసంతృప్తిగా ఉన్నారు. చొప్పదండిలో ఓయూ జేఏసీ నేత డాక్టర్ మేడిపల్లి సత్యం పేరు ఒక్కటే ఉండటంతో సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, బండ శంకర్, నాగి శేఖర్ తదితరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి పేరు ఒక్కటే పంపడంపై జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేష్, స్వరం రవి, పరిపాటి రవీందర్‌రెడ్డి తదితరులు ఆగ్రహంతో ఉన్నారు. పెద్దపల్లిలోని సీహెచ్ విజయరమణారావును సూచించడంపై ఈర్ల కొంరయ్య, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి తదితరులు ‘కిం కర్తవ్యం? అన్న ఆలోచనలో పడ్డారు. రామగుండం, కోరుట్ల, ధర్మపురిలలో ఇదే పరిస్థితి నెలకొనడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయ సమీకరణలు కూడా మారుతాయన్న చర్చ జరుగుతోంది. -
5 సీట్లలో పోటీ
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్యపక్షాలైన సీపీఐ, తెలంగాణ జన సమితి తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. తెలంగాణ జన సమితికి 8, సీపీఐకి 3 స్థానాలు కేటాయించినట్లు గురువారం ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం అత్యవసరంగా సమా వేశమైంది. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లం పల్లి స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించింది. పార్టీ రాష్ట్ర నేత గోద శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. తమకు కేటాయించిన సీట్ల సంఖ్య అవమానకరంగా ఉందని, కేటాయించిన సీట్లు కూడా తాము కోరుకున్నవి కావని భేటీలో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన సీట్లు ఆమోదయోగ్యమా కాదా అనేది సంప్రదించకుండానే సీట్లను ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్ఎస్ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావంతో కూడిన విశ్వాసముండాలి. దీనికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలకు పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తిపరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ వ్యవహరించడం దారుణం’ అని సీపీఐ మండిపడింది. టీఆర్ఎస్ను ఓడించాలనే ప్రధాన లక్ష్యంతోనే తాము పనిచేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీజేఎస్ కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డి, నేతలు సాంబశివరావు, టి. శ్రీనివాస్‌రావు, పశ్య పద్మ తదితరులు కాసేపు సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డితోనూ సమావేశమయ్యారు. కూటమిని వీడుదామా...? కోదండరాంతో జరిగిన భేటీలో కూటమిని వీడి 30 స్థానాల్లో పరస్పర అవగాహనతో పోటీ చేద్దామని సీపీఐ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కోదండరాం సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ తీరు అభ్యంతరకరంగా ఉందని కోదండరాం ఏకీభవించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో కూటమిని వీడితే టీఆర్ఎస్కు ప్రయోజనం చేసినట్లు అవుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. సీట్ల విషయంలో ఇంకా సమస్యలు ఉన్నాయని, వాటి కోసం అన్ని స్థాయిల్లో ఒత్తిడి తెద్దామని కోదండరాం సూచించారు. దీనికోసం తాను కూడా చొరవ తీసుకుంటానని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు తెలిసింది. -
గజిబిజి.. గందరగోళం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సీట్ల పంపకాలు.. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ సాచివేత ధోరణి మిత్రపక్షాలను డోలాయమానంలో పడేస్తోంది. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్నా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, టీజేఎస్ పార్టీల్లో సస్పెన్స్ నెలకొంది. సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతునప్పటికీ, ఏయే స్థానాలు కేటాయించారనేది తేలకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలను గురువారం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించినా.. ఇందులో మన జిల్లాలో ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఏవీ అనేది ప్రకటించలేదు. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన నెలకొంది. దీనికితోడు భాగస్వామ్య పక్షాలకే కేటాయించేస్థానాలపైనా ఉత్కంఠ కొనసాగిస్తోంది. దీంతో మొత్తంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. రోజుకో మాట.. గురువారం లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మొదట ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా మరో రెండు రోజుల గడువు తీసుకుంది. శనివారం నాడు తొలి జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ పార్టీ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. ఇదిలావుండగా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాతోపాటు మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారనే ప్రచారంతో ఎవరెవరికి ఏ సీటు కేటాయిస్తారో తేలిపోతుందని అంతా భావించారు. కానీ, అభ్యర్థుల వడపోతలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యం మిత్రపక్షాలను కలవరపరుస్తోంది. దీనికితోడు పొత్తులపై జరుగుతున్న రోజుకో ప్రచారం.. ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోననే ఆందోళన కలుగుతోంది. టీడీపీకి ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఇవ్వనున్నట్లు ఇరుపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిపై అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప స్పష్టత రాదు. అయితే, ఆ లోపు ఈ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరగడమేగాకుండా సీటు దక్కకపోతే అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. ఒకవేళ వీటిని టీడీపీకి కేటాయించాలని భావిస్తే ముందుగానే ఆశావహులను బుజ్జగించడం ద్వారా నష్టనివారణ చర్యలకు దిగే ఆస్కారముంది. కానీ, ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు క్రతువు మొదలు పెట్టకపోవడం.. మిత్రపక్షాలకిచ్చే సీట్లను ప్రకటించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ స్థానంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే కుటుంబానికి ఒక టికెట్టు అంక్ష ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారగా.. తాజాగా టీడీపీ జాబితాలో ఈ స్థానం కూడా ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. -
నేడో.. రేపో.. జాబితా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం సర్దుకు వచ్చింది. రాష్ట్రంలో పొత్తులో భాగంగా 13 టీడీపీకి, 8 టీజేఎస్, 3 సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు గాను 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకే అవకాశం కల్పించనుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ జన సమితి, టీడీపీకి తల ఒక సీటు కేటాయించాలని ప్రతిపాదన కాగా సీపీఐ కేటాయింపు స్థానంలో హుస్నాబాద్ కీలకంగా మారింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పట్టుపడుతున్నాయి. ఆ స్థానం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ చర్చకు తావిచ్చింది. రామగుండం స్థానంలో టీజేఎస్ పార్టీ నుంచి ప్రొఫెసర్ కోదండరాంకు కేటాయించాలనే అభిప్రాయం కాంగ్రెస్ వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు నిరాశే మిగలనుంది. అలాగే ధర్మపురి స్థానం సైతం టీడీపీ కావాలని కోరుతుండగా ఆ స్థానం టీడీపీకి కేటాయింపుపై సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా చేసిన ప్రకటన మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. పొత్తుల్లో భాగంగా పార్టీ సీట్ల కేటాయింపుపై కొన్నిచోట్ల తర్జనభర్జన జరుగుతోంది. హుస్నాబాద్, రామగుండం, ధర్మపురి మినహాయించి పది చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే టీపీసీసీ, భగత్ చరణ్‌దాస్ స్టీరింగ్ కమిటీ దాదాపుగా 13 నియోజకవర్గాల్లో ఒకే పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు పది స్థానాల్లో మొదటి విడతగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో తాటిపర్తి జీవన్‌రెడ్డి (జగిత్యాల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), ఆరెపల్లి మోహన్ (మానకొండూర్), కేకే మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), జువ్వాడి నర్సింగరావు (కోరుట్ల), మేడిపల్లి సత్యం (చొప్పదండి), సీహెచ్ విజయరమణారావు (పెద్దపల్లి) పేర్లను శుక్ర లేదా శనివారాల్లో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐ పట్టుపట్టడంతో ఆ స్థానం అభ్యర్థిని రెండో విడతలో ప్రకటించే అవకాశం ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ప్రతిపాదించగా పొత్తుల్లో టీడీపీకి ప్రకటిస్తే యాదిబాల్రెడ్డి పేరు ప్రతిపాదించనున్నారు. రామగుండం స్థానాన్ని టీజేఎస్ అధినేత కోదండరాంకు ప్రతిపాదించనున్నారు. సర్దుబాటు కేటాయింపులపై సీపీఐ సీరియస్‌గా పరిగణిస్తోంది. కేవలం మూడు స్థానాలే కేటాయించగా అందులో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మినహాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు మరోమారు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. -
కూటమి... తప్పని ఓటమి
పదమూడో సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ఓట్లు కురిపించాయి. మహాకూటమి అభ్యర్థులు మెదక్, సిద్దిపేటలో మాత్రమే విజయం సాధించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పన్నెండో శాసనసభ (2004–09) ఎన్నికల్లో మెదక్ జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ పదమూడో శాసనసభ (2009–14) ఎన్నికల్లో ‘మహాకూటమి’ రూపంలో తెరమీదకు వచ్చింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమితో పోటీ చేసిన కాంగ్రెస్, 2009 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమిలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ భాగస్వామ్య పక్షాలుగా బరిలోకి దిగాయి. టీడీపీ ఆరు, టీఆర్ఎస్ మూడు, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేసేలా సీట్ల అవగాహన కుదిరింది. మెదక్, గజ్వేల్, పటాన్చెరు, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డిలో టీఆర్ఎస్, నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థి పోటీ చేశారు. టీఆర్ఎస్కు కేటాయించిన సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో టీడీపీ కూడా సొంత పార్టీ అభ్యర్థిని స్నేహపూర్వక పోటీ పేరిట బరిలోకి దించింది. నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థిగా దివంగత సీపీఐ నేత విఠల్‌రెడ్డి కుమారుడు కిషన్‌రెడ్డి పోటీ చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కక పోవడంతో టీఆర్ఎస్ తిరుగుబాటు నేత పద్మా దేవేందర్‌రెడి మెదక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దుబ్బాక నుంచి టీడీపీ టికెట్ దక్కని చెరుకు ముత్యంరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వరుస విజయాలు సాధించిన ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన నందీశ్వర్‌గౌడ్ (పటాన్చెరు), తూంకుంట నర్సారెడ్డి (గజ్వేల్) తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.సినీనటుడు చిరంజీవి సారథ్యంలో ఏర్పాటైన ‘ప్రజారాజ్యం’ పార్టీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో ఏర్పాటైన నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీలో విలీనమైంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిరంజీవి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత 1956, 1962, 1967, 1972లో తరచూ నియోజకవర్గాల సంఖ్య, పేర్లు మారుతూ వచ్చాయి. 1978 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాలను శాస్త్రీయంగా విభజించడంతో మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది. 2009లో జరిగిన పునర్విభజన మూలంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా పదికి పరిమితమయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల భౌగోళిక పరిధిలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా నుంచి రామాయంపేట అంతర్దానం కాగా, కొత్తగా పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ జనరల్ కేటగిరీలో చేరగా, జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. దొమ్మాట నియోజకవర్గంలోని మెజారిటీ మండలాలు, గ్రామాలతో ‘దుబ్బాక’ నియోజకవర్గం ఏర్పాటైంది. మూడు మంత్రివర్గాల్లో ముగ్గురు 2009 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించారు. మైనంపల్లి హనుమంతరావు (మెదక్, టీడీపీ), టి.హరీష్‌రావు (సిద్దిపేట, టీఆర్ఎస్) మహాకూటమి అభ్యర్థులుగా గెలుపొందారు. వైఎస్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. జె.గీతారెడ్డి (సమాచార శాఖ), దామోదర రాజనర్సింహ (మార్కెటింగ్, గిడ్డంగులు), సునీత లక్ష్మారెడ్డి (చిన్న నీటి పారుదల) శాఖ మంత్రులుగా పనిచేశారు. 2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో కే.రోశయ్య సీఎం పదవి చేపట్టగా, వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన దామోదర, గీత, సునీత చేరారు. 2010 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి పదవి చేపట్టగా, ఈ ముగ్గురు నేతలకే మళ్లీ మంత్రి పదవి దక్కింది. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత విద్య, గీతారెడ్డి (భారీ పరిశ్రమలు), సునీత లక్ష్మారెడ్డి (స్త్రీ, శిశు సంక్షేమం) మంత్రులుగా కిరణ్ కేబినెట్లో పనిచేశారు. సిద్దిపేటలో మళ్లీ ఉప ఎన్నిక ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోమారు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్‌రావు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 95,858 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ కాగా, ఈ ఎన్నికలో విజయం ద్వారా హరీశ్‌రావు కేవలం ఆరేళ్లలో వరుసగా నాలుగో పర్యాయం అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. టీడీపీ నుంచి దొమ్మాట ఎమ్మెల్యేగా 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయాలతో హ్యాట్రిక్ సాధించిన ముత్యంరెడ్డి 2009లో కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టి.హరీశ్‌రావు వరుసగా మూడో సారి గెలుపొందారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలోనూ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. జనరల్ స్థానంగా మారిన గజ్వేల్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి గెలుపొందారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా సంగారెడ్డి స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయించినప్పటికీ, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చింతా ప్రభాకర్‌ను బరిలోకి దించింది. 2004లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన జగ్గారెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. అందోలు రిజర్వుడు స్థానం నుంచి మరోమారు విజయం సాధించిన దామోదర రాజనర్సింహ వైఎస్, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. షెట్కార్ కుటుంబంతో ఒడంబడిక చేసిన కాంగ్రెస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన కిష్టారెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. -
కాంగ్రెస్ తొలి జాబితా రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడింది. 74 మంది అభ్యర్థులతో కూడిన తమ మొదటి జాబితాను మిత్రపక్షాల జాబితాలతో కలిపి శనివారం ఉదయం హైదరాబాద్‌లో కాంగ్రెస్ విడుదల చేయనుంది. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14 స్థానా లు, తెలంగాణ జనసమితికి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. 94 స్థానాలకూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ప్రతిపాదించగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) 74 స్థానాలకు ఆమోదం తెలిపింది. మంగళ, బుధవారాల్లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు చొప్పున పేర్లను ప్రతిపాదించి సీఈసీకి పంపింది. సీఈసీ ఇదివరకే 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా గురువారం 17 స్థానాల్లో అభ్యర్థులను ఎంపి క చేసింది. గురువారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో సీఈసీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యు లు ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, అహ్మద్ పటే ల్, వీరప్ప మొయిలీ, అంబికాసోనీ, అశోక్ గెహ్లాట్‌లతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా, బోసురాజు మీడియాతో మాట్లా డారు. ‘‘పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 74 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మిగిలిన సీట్లపై సీఈసీ ఈనెల 11 లేదా 12న నిర్ణయం తీసుకుంటుంది. తొలి జాబితా ఈ నెల 10న హైదరాబాద్‌లో కూటమి పార్టీలతో కలిసి జాబితా విడుదల చేస్తాం’’అని తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఎక్కడ? తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్, మునుగోడు, మహబూబ్‌నగర్ స్థానాలను కోరుతోంది. నకిరెకల్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయినందున ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్ భార్య చెరుకు లక్ష్మి పోటీ చేయనున్నారు. చెరుకు సుధాకర్‌గౌడ్ మునుగోడు(జనరల్) ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎన్నం శ్రీని వాస్‌రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ, ఆ స్థానంలో కాంగ్రెస్ లేదా టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద సీట్లు పెండింగ్‌లో భక్తచరణ్ దాస్ నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ 94 స్థానాలకూ అభ్యర్థులను ప్రతిపాదించినప్పటికీ సీఈసీ 74 స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికను ఆమోదించింది. మిగిలిన 20 సీట్లను (ఇందులో తెలంగాణ ఇంటి పార్టీకి 1 వెళు తుంది) పెండింగ్‌లో పెట్టింది. వీటిలో కొన్ని స్థానాలను సీపీఐ, మరికొన్ని స్థానాలను టీజేఎస్ ఆశి స్తుండడం.. ఒక్కోస్థానం నుంచి పోటీ తీవ్రంగా ఉండటం కారణంగా ఆయా స్థానాలను రెండో విడతలో వెలువరించనున్నారు. ఇప్పుడే ఆయా స్థానా లను ప్రకటిస్తే అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంటుందని, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు వలస వెళ్లే ప్రమాదం ఉందన్న వ్యూహంతో వీటిని పెండింగ్‌లో పెట్టినట్టు తెలు స్తోంది. మునుగోడు, పటాన్చెరువు, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, రాజేంద్రనగర్, నకిరేకల్, నాగర్‌కర్నూల్, తుంగతుర్తి, మహబూబ్‌నగర్, దేవరకొండ, కంటోన్మెంట్, వరంగల్ ఈస్ట్, ఎల్.బి.నగర్, బోథ్, ఆదిలాబాద్, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌తోపాటు మరో రెండు కీలక స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. రేవంత్ వర్సెస్ ఉత్తమ్ అభ్యర్థుల ఖరారు విషయంలో టీపీసీసీ ముఖ్య నేతల మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ మా త్రం ఆ జాబితాను అసలు పరిగణనలోకే తీసుకోవద్దని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. -
‘లెక్క’తేలినట్టేనా?
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య లెక్కలు తేలినట్టేనా? గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుపుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతల మధ్య అంగీకారం కుదిరినట్టేనా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా గురువారం రాత్రి చేసిన ప్రకటనకు కూటమిలోని పార్టీలు కట్టుబడి ఉంటాయా?– ఇవీ ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే విషయాలను కలసి ప్రకటిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే ముందు రోజూ భాగస్వామ్య పార్టీలతో జరిపిన చర్చలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కుంతియా చేసిన ప్రకటన కూటమి పార్టీల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. పూర్తి అంగీకారం కుదరకముందే, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కసరత్తు కొలిక్కి రాకముందే కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్ల సంఖ్యను ప్రకటిం చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటనకు కూటమిలోని ఇతర పక్షాలు కట్టుబడి ఉంటాయా లేక అందులోనూ మార్పుచేర్పులుంటాయా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. సంఖ్య సరే.. స్థానాలెక్కడ? కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3, తెలంగాణ ఇంటి పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తాయని కుంతియా వెల్లడించారు. అయితే టీడీపీ 18 సీట్లు కావాలని అడుగు తున్నప్పటికీ, 14 స్థానాలకు అంగీకరించే అవకాశాలున్నాయి. టీజేఎస్ 11 సీట్లు కావాలని అడుగుతుండగా, తమకు 4 స్థానాలైనా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. అయితే ఈ రెండు పార్టీల్లో టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 సీట్లు కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ సీట్లు అటో ఇటో అయినా పోటీచేసే స్థానాలేంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేల్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏయే స్థానాలు ఏ పార్టీకి ఇవ్వాలన్న విషయంలో కూడా ఓ అవగాహనకు వచ్చి ఉంటుందని.. తమ అభిప్రాయాలు, వాదనలు వినకుండానే, చర్చలు పూర్తిస్థాయిలో జరగకుండానే సీట్ల సంఖ్యను ప్రకటించి బంతిని తమ కోర్టులోకి నెట్టిందని కూటమిలోని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తాము ప్రతిపాదిస్తున్న స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే జాబితా ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో చర్చిస్తోందని.. ఒకటి రెండు చోట్ల తప్ప కూటమి పక్షాలతో పెద్దగా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కుంతియా చెప్పిన విధంగా అన్నీ సర్దుకుంటాయా... స్వల్ప మార్పులేమైనా ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే! శనివారం కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే అంశంపై అప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోనూ ‘కుతకుత’ కూటమిలో సర్దుబాట్లు పూర్తిస్థాయిలో జరగక ముందే స్థానాల సంఖ్యను ప్రకటించిన కాంగ్రెస్‌లో అంతర్గతంగా సామాజిక సమీకరణలు కుదురుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు కనీసం 34 స్థానాలు ఇవ్వాలని పార్టీలోని బీసీ నేతలు కోరుతుండగా, 32 సీట్లను ఇవ్వచ్చనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ చర్చల అనంతరం ఈ సంఖ్య 25కు పడిపోయిందని కాంగ్రెస్‌లోని బీసీ నేతలంటున్నారు. బీసీలు ఆశిస్తున్న స్థానాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇస్తున్నారని.. శేరిలింగంపల్లి, జనగామ స్థానాలను వదులుకోకుంటే బీసీ నేతలే పోటీచేస్తారని వారంటున్నారు. దీనికి తోడు అగ్రవర్ణాలకు చెందిన నేతలు పోటీచేసే అవకాశమన్న స్థానాలను మాత్రం మిత్రపక్షాలు కోరుతున్నప్పటికీ, ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లోనూ ఒకటి, రెండు సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. అత్యధిక జనాభా ఉన్న యాదవ, ముదిరాజ్ కులస్తులను సీట్ల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ‘‘యాదవులు, ముదిరాజ్‌లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ సామాజికవర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు రెండు సామాజిక వర్గాలకు చెరో రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా సిట్టింగ్‌లందరికీ అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ మాత్రం మాకు 6 నుంచి 7 సీట్లు ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో’’ అని ఢిల్లీలో ఉన్న బీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన సీట్లు ఇవీ.. టీడీపీ : శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్పల్లి, చార్మినార్, మలక్‌పేట, అశ్వారావుపేట, ఖమ్మం, సత్తుపల్లి, మక్తల్, దేవరకద్రలతోపాటు, వరంగల్ ఈస్ట్ లేదా వెస్ట్‌లలో ఒకస్థానం. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పఠాన్‌చెరు, కోదాడల్లో రెండు స్థానాలు. టీజేఎస్ : జనగాం, మెదక్, మల్కాజ్గిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్దన్నపేట, మిర్యాలగూడ స్థానాలు ఖరారు కాగా.. చెన్నూరు, మహబూబ్‌నగర్, వరంగల్ (ఈస్ట్)లలో రెండు కావాలని టీజేఎస్ అడుగుతోంది. సీపీఐ : బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్‌లు ఖరారయ్యాయని సమాచారం. అయితే, బెల్లంపల్లి బదులుగా మంచిర్యాల కావాలని సీపీఐ కోరుతోంది. అదనంగా కొత్తగూడెంతో పాటు నల్లగొండ జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని ఆశిస్తోంది. ఇంటిపార్టీ : నకిరేకల్ లేదా మునుగోడు కాంగ్రెస్ చెప్పిన కూటమి లెక్క ఇదే... పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య కాంగ్రెస్ 93 టీడీపీ 14 టీజేఎస్ 08 సీపీఐ 03 ఇంటిపార్టీ 01 మొత్తం 119 -
ప్రాజెక్టులను అడ్డుకోవడానికే కూటమి
సాక్షి,మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడానికే మహాకూటమి పేరుతో కుట్రలు పన్నుతున్నారని దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మల్లుపల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో రామలింగారెడ్డికి పలు కుల సంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గొల్ల కురుమ సంఘం సభ్యులు రామలింగాడ్డిని గొంగడి కప్పి గొర్రెపిల్లతో ఘనంగా సన్మానించారు. మహిళలు మంగళహారతులు, విజయ తిలకాలు దిద్ది ఆశిర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి పేరుతో వచ్చే నాయకులను గెలిపిస్తే సాగు నీటిని అందించే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోతాయని ఆరోపించారు. దీంతో తెలంగాణలో సాగు నీరు లేక వ్యవసాయం నల్లేరుపై నడకలాగా మారే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మహాకూటములు ఎదరువచ్చి నిలిచినా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులకు గుర్తించిన కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాడన్నారు. మరో సారి అధికారంలోకి వస్తే వ్యవసపాయ రంగానికి కావాల్సిన సాగు నీటితో పాటు ఎకరానికి రూ.10 వేలు పంట సాయంగా అందిస్తాడన్నారు. రైతుబంధు, రైతు బీమా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిబాటలో నిలుపుతామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయి నీళ్లొస్తే దుబ్బాక రైతాంగం కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీ తుమ్మల బాల్‌రాజు, ఎంపీటీసీలు సుక్క శ్రీనివాస్, గొట్టం భైరయ్య, ధార స్వామి, టీఆర్ఎస్ నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల వెంకట్‌రెడ్డి, కాలేరు శ్రీనివాస్, బుర్ర లింగంగౌడ్, వల్లాల సత్యనారాయణ, ఎల్లం, దుబ్బరాజం, లింగం, ఎల్ముల స్వామి, గంగాధర్, అంజిరెడ్డి పాల్గొన్నారు. -
మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం
ఢిల్లీ: మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. స్క్రీనింగ్ కమిటీలో ఖరారు కాని 15 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలెట్టింది. సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, రాజేంద్రనగర్, దుబ్బాక, మెదక్, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్ ఈస్ట్, కొత్తగూడెం, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, మేడ్చల్, పటాన్చెరువు, జుక్కల్ స్థానాలకు చెందిన ఆశావహులతో ఈరోజు కాంగ్రెస్ వార్ రూంలో చర్చలు జరగనున్నాయి. ఒక్కొక్క జిల్లాకు గంట సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ సీట్ల కేటాయింపు విషయంలో జనసమితి, సీపీఐ ఒత్తిడికి కాంగ్రెస్ తలొగ్గినట్లు కనపడుతోంది. తెలంగాణాలో ఉన్న 119 సీట్లలో 29 సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వడానికి కాంగ్రెస్ అదిష్టానం సిద్ధపడుతోంది. మహాకూటమిలో భాగంగా ఇప్పటికే టీడీపీకి 14 స్థానాలు ఖరారైనట్లు అందరి నోళ్లలో నానుతోంది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు పోను మిగిలిన 90 సీట్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధపడుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సంప్రదింపులు పూర్తయిన తర్వాతే జాబితే వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. -
పొత్తు కుదరకపోతే!.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ..
సాక్షి, న్యూఢిల్లీ : నేటి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ బుధవారం జరిగిన కమిటీ మీటింగ్‌లో రెండో జాబితాకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసింది. అసంతృప్త నేతలను స్క్రీనింగ్ కమిటీ బుజ్జగించింది. సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీతో సమస్యలేదంటోంది కాంగ్రెస్. టీజేఎస్, సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లోనూ ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పూర్తిచేసింది. ఒకవేళ పొత్తు కుదరకపోతే ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ చేయించాలని చూస్తోంది. రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. -
కాంగ్రెస్ నేతల మధ్య వాడివేడీ చర్చ!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గర పడుతున్నా మహాకూటమిలో సీట్ల పంపీణీ కొలిక్కి రావటం లేదు. సీట్ల పంపిణీ చర్చలకు మాత్రమే పరిమితమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక పలు సీట్లపై పీడముడి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో నేతల మధ్య వాడివేడీ వాదనలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాల నుంచి వేరు వేరుగా అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్టంభన ఏర్పడింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అభ్యర్థులతో, తొలినుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. పారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. పోటాపోటీ ప్రతిపాదనలతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరికి మించి అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి. నియోజకవర్గం అభ్యర్థుల పేర్లు ఎల్లారెడ్డి పైలా కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డి, నల్ల మడుగు సురేందర్ బాల్కొండ అనిల్, రాజారామ్ యాదవ్ , అన్నపూర్ణమ్మ నిజామాబాద్ రూరల్ వెంకటేశ్వర రావు, భూపతి రెడ్డి నిజామాబాద్ అర్బన్ మహేష్ గౌడ్, అరికెల నర్సారెడ్డి మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు , అరవింద్ రెడ్డి సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఇల్లందు హరిప్రియ, ఊకె అబ్బయ్య దేవరకొండ బిల్యానాయక్, జగన్ ధర్మపురి దరువు ఎల్లన్న, లక్ష్మణ్ కుమార్ మెదక్ విజయశాంతి, శశిధర్ రెడ్డి పెద్దపల్లి వీర్ల కొమరయ్య, విజయ రమణారావు, సురేష్ రెడ్డి , సవితా రెడ్డి ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి , క్యామ మల్లేష్ -
ఢిల్లీకి చేరినా రాజకీయం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ కథ క్లైమాక్స్‌కు చేరింది. సీను హస్తినకు మారింది. ఒకేసారి పూర్తి జాబితా విడుదలకు ఏఐసీసీ ముహూర్తం ఖరారు చేయడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం రోజున జాబితా వెల్లడిస్తామని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించినా.. టీడీపీ, టీజేఎస్, సీపీఐతో జతకట్టిన కాంగ్రెస్‌కు సీట్ల తకరారు తలనొప్పి కలిగించింది. మిత్రపక్షాలతో ఎడతెగని చర్చలు జరిపినా పోటీచేసే స్థానాలపై కూడా సీపీఐ, టీడీపీతో అవగాహన కుదరకపోవడం చికాకు తెప్పిస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీట్ల కేటాయింపుల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో రాష్ట్ర నాయకత్వం మెత్తబడింది. ఈ క్రమంలోనే టీడీపీ, టీజేఎస్‌లతో సీట్ల సంఖ్యపై దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరింది. సీపీఐతో రేపో మాపో సయోధ్య కుదురుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఈ నెల 9న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు.. తమ అభ్యర్థిత్వం ఖరారు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మాకంటే మాకు.. టీడీపీ–కాంగ్రెస్‌ల పొత్తు ఇరుపార్టీలపై ప్రభావం చూపుతోంది. ఓటు బ్యాంకు కలిసివస్తున్నా.. సీనియర్లు, ద్వితీయశ్రేణి నేతలను డైలమాలో పడేస్తోంది. టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లతో కాంగ్రెస్.. కాంగ్రెస్ పట్టుబడుతున్న స్థానాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలను టీడీపీ అడుగుతోంది. ఇందులో శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్పల్లి సెగ్మెంట్లను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అనివార్యమైతే రాజేంద్రనగర్‌ను కూడా త్యాగం చేయడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ సెగ్మెంట్ల ఆశావహులకు తాజా సమీకరణలు మింగుడుపడడం లేదు. నాలుగేళ్లుగా పార్టీకోసం కష్టించిన తమకు గాకుండా పొత్తు పేరిట టీడీపీ ఎగురేసుకుపోయే ఎత్తుగడ వేయడం తట్టుకోలేకపోతున్నారు. ఎవరికి వి‘పొత్తు’ మహాకూటమితో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా మన జిల్లాలో ఉండడంతో ఎవరి స్థానాలకు గండి కొడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ శివార్లలో ఇరుపార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడినా బీజేపీతో పొత్తు టీడీపీకి లాభించింది. ఆ పార్టీ శివారు సెగ్మెంట్లను క్లీన్‌స్వీప్ చేసింది. మల్కాజిగిరి, మేడ్చల్ మినహా మిగతా స్థానాలన్నింటినీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆర్.కృష్ణయ్య తప్ప మిగతా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. లీడర్లు పార్టీని వీడినా కేడర్ చెక్కుచెదరలేదు. సీమాంధ్ర ఓటర్లపై ఆశ శివారు ఓటర్లలో అత్యధికం సీమాంధ్రులున్నారు. గతంలో బీజేపీ–దేశం కూటమికి పట్టంకట్టిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్–టీడీపీకి అండగా నిలుస్తారని మహాకూటమి అంచనా వేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుందని, ఇది బీజేపీపై వ్యతిరేకత పెంచనుందని భావిస్తోంది. ఈ అంశం టీడీపీ–కాంగ్రెస్‌కు ఉభయతారకంగా పనిచేస్తుందని భావించిన టీడీపీ–కాంగ్రెస్‌లు పాత వైరాన్ని మరిచి మిత్రపక్షంగా మారిపోయాయి. టీడీపీలోనూ ముసలం.. టీడీపీలో కూడా పొత్తు సంకటస్థితిని సృష్టిస్తోంది. టికెట్ తమకే ఖాయమని భావించి కొన్నాళ్లుగా గ్రౌండ్వర్క్చేస్తున్న కొందరి సీట్లకు కాంగ్రెస్ పొత్తుతో ముప్పు ఏర్పడింది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ ఔత్సాహికులకు నిరాశ కలిగిస్తోంది. ఒంటరిగా బరిలో దిగుతామని భావించి ఆర్థికంగా నష్టపోయిన తర్వాత సీట్లను త్యజించాల్సిరావడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. అలాగే మల్కాజిగిరిని ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తారనే ప్రచారం అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. ఏమాత్రం బలంలేని టీజేఎస్‌కు ఈ సీటు ఇవ్వాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ.. ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తుండడంతో అసంతృప్తికి లోనైన టీడీపీ శ్రేణులు పక్కపార్టీలవైపు చూస్తున్నాయి. -
ఎక్కడా!... మహా కూటమి..
ఖమ్మం,ఇల్లెందు: ముందస్తు ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నా..పోరాటాల పురిటిగడ్డలో మహాకూటమి అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడట్లేదు. నెల రోజుల క్రితం టీఆర్ఎస్ అభ్యర్థిగా, తాజామాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో వరుసగా పాగా వేసిన సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ నుంచి గుమ్మడి నర్సయ్యను అభ్యర్థిగా కాస్త ఆలస్యంగానే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) మద్దతుతో ప్రకటించారు. అయితే..ఎన్డీలో రాయల వర్గం, చంద్రన్న వర్గాల నుంచి వేర్వేరుగా అభ్యర్థులు పోరుసల్పుతున్నారు. చంద్రన్నవర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావమేంటో చూపుతామని ఆ పార్టీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి బరిలోకి వస్తున్నారు. తాజాగా బహుజన్‌సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి కాట్రావత్ మోహన్‌నాయక్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే..అందరి దృష్టి మాత్రం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహాకూటమి నుంచి అభ్యర్థి ఎవరు తెరపైకి వస్తారా..? అని ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ, సీపీఐ జత కలుస్తుండడంతో మరింత బలంగా మారే అవకాశముంది. జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి పోరులో ప్రస్తుతానికైతే..కీలక అభ్యర్థి ప్రకటన కోసం నియోజకవర్గ ఓటర్లు ఆసక్తితో చూస్తున్నారు కాంగ్రెస్‌లో ఆశావహులు అనేకం కాంగ్రెస్‌లో మాత్రం ఇల్లెందు టికెట్ మీద కన్నెసిన వారు 30 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురు..ఇద్దరు ఆదివాసీ నాయకులు, మరో ఇద్దరు బంజారా నాయకులు సీటు తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. అయితే..ఇద్దరిని ఫైనల్ చేశారని, వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందో అభ్యర్థుల్లో హైరానా మొదలైంది. ఇప్పటికే ఆశావహులు ఇళ్లను వదిలి రాజధాని హైదరాబాద్‌లో మకాం వేసి..తమకు తెలిసిన సీనియర్ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి సైతం దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు. అసమ్మతి ఉన్నా..ఆగని కోరం టీఆర్ఎస్ అభ్యర్థి, ఇల్లెందు తాజామాజీ కోరం కనకయ్య..నెలరోజులుగా మండలాలు, గ్రామాలను చుట్టివేస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులను ఊర్లలో తిప్పుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. న్యూడెమోక్రసీ కంచుకోటగా ఉన్న గ్రామాలు, గూడేల్లో సైతం తిరుగుతూ..కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. అయితే..టీఆర్ఎస్కు అసమ్మతి బెడద కూడా పీడిస్తోంది. ఆ పార్టీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ లకావత్ దేవీలాల్‌నాయక్, మాజీ మండల అధ్యక్షుడు అజ్మీరా భావ్‌సింగ్ నాయక్, ఆయా మండలాల మాజీ మండల అధ్యక్షులు అసమ్మతి నేతలుగా మారుతున్నారు. తమకు పార్టీలో గుర్తింపు లేదని అలకపాన్పు ఎక్కారు. అయితే..ఇది ఎలాంటి ప్రభావం చూపనుందో తేలాల్సి ఉంది. ఎన్డీలో సిద్ధాంత రాద్దాంతం సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీలో రాయల వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఇటు చంద్రన్న వర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీపడుతున్నారు. ఈ దఫా ఈ రెండు గ్రూపుల మధ్య సిద్ధాంత..రాద్దాంతం మొదలైంది. రాయల వర్గం తన అభ్యర్థిని ప్రకటించకముందే చంద్రన్న వర్గానికి మద్దతును కోరి..ఒకే అభ్యర్థిని బరిలోకి దించుదామని కోరింది. ఈ క్రమంలో బీఎల్ఎఫ్ ఇల్లెందులో గుమ్మడి నర్సయ్యకు మద్దతు ప్రకటించింది. మరుసటి రోజు రాయల వర్గం సదస్సు ఏర్పాటు చేసుకుని గుమ్మడి పేరును ప్రకటించగా..ప్రతిగా చంద్రన్న వర్గం నుంచి సత్యం పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఉజ్వల గ్యాస్‌పై బీజేపీ ఆశలు బీజేపీకి పరిమిత సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యారు. ప్రధాని ఉజ్వల యోజన గ్యాస్ పథకం కింద 20 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామని, బీజేపీ నేతలు అభ్యర్థి మోకాళ్ల నాగ స్రవంతిని రంగంలోకి దింపి ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. అమిత్‌షా లాంటి అగ్రనేతను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఒకరు.. బీజేపీ టికెట్ అశించి రాకపోవడంతో కాట్రావత్ మోహన్‌నాయక్ బీఎస్పీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈయన అభ్యర్థిత్వం ఖరారైతే..ప్రచారం చేసుకోనున్నారు. -
టీజేఎస్‌కు ఇచ్చే సీట్లపై కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఇప్పటికీ పీటముడి వీడటం లేదు. ఇటు టీడీపీకి, అటు తెలంగాణ జనసమితి(టీజేఎస్)కు ఇచ్చే స్థానాలపై కూటమి పెద్ద కాంగ్రెస్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీజేఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసమితికి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సీట్లలో కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ మెలిక పెట్టినట్టు సమాచారం. స్నేహపూర్వక పోటీపై జనసమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చే సీట్లలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయించాల్సి ఉండటంతో అటూ టీజేఎస్‌లోనూ సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సమావేశమైన జనసమితి కోర్‌కమిటీ.. మంగళవారంలోపే సీట్ల కేటాయింపుపై తుది ప్రకటన చేయాలని డిమాండ్చేసింది. -
ఢిల్లీ వద్దు.. అసెంబ్లీ ముద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇంతకాలం లోక్‌సభ బరిలో దిగాలనే వ్యూహాలకు పదునుపెట్టిన నేతలు ఇప్పుడు శాసనసభపై గురిపెట్టారు. పార్లమెంటు ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండడంతో ‘ముందస్తు’ ఆలోచనను అధినాయకత్వం ముందుంచారు. అసలు ఇలా మనసు మార్చుకోవడానికి కారణం తెలంగాణకు జమిలీ ఎన్నికలు జరగకపోవడమే. ఎమ్మెల్యేగా జాతకాన్ని పరీక్షించుకొని అంతగా అయితే లోక్‌సభ సీటుకు పాగా వేయవచ్చని భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి పరాభవం పాలైన ఇద్దరు యువనేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడమే మంచిదనే అభిప్రాయానికొచ్చారు. దానికి అనుగుణంగా రణక్షేత్రంలోకి దిగారు. అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు 2014 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్), తూళ్ల వీరేందర్‌గౌడ్(టీడీపీ) ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో వీరిరువురు టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి వీరేందర్‌గౌడ్ మొదట్నుంచి అసెంబ్లీ బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. 2014లో ఉప్పల్ సీటును ఆశించినప్పటికీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాల్సిరావడంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగాల్సివచ్చింది. ఈ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణలు మారినా ఆయన మాత్రం టీడీపీనే నమ్ముకున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ నుంచి రంగంలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌తో పొత్తు కుదరడం.. ఈ సీటును టీడీపీకి సర్దుబాటు చేస్తుండడంతో వీరేందర్‌కు కలిసివస్తోంది. మరోవైపు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. అయితే, టీడీపీ పొత్తు ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆపార్టీ ప్రతిపాదించిన సీట్లలో రాజేంద్రనగర్ కూడా ఉండడం ఆయన ఒకింత కలవరానికి గురిచేస్తోంది. మల్లారెడ్డి సైతం.. మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా ఈ సారి శాసనసభ వైపు మొగ్గుచూపుతున్నారు. మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు టీఆర్ఎస్ అధిష్టానం కూడా సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కంటోన్మెంట్ నుంచి పోటీకి సై అంటున్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని చేవెళ్ల బరిలో నిలపాలని పీసీసీ భావించింది. ఈ అంశంపై ఆయనతో సంప్రదింపులు కూడా జరిపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎంపీగా పోటీచేయాలని కేఎల్లార్ కూడా భావించారు. అనూహ్యంగా శాసనసభకు ముందస్తు రావడంతో ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇదే సీటుపై కన్నేసిన జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా పోటీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు నెలల క్రితం రాహుల్‌గాంధీ జిల్లా పర్యటనలో తన మార్కును ప్రదర్శించారు. కుటుంబానికి ఒకే సీటు షరతుతో కార్తీక్‌రెడ్డికి టికెట్ నిరాకరిస్తే బరిలో దిగడానికి కర్చీఫ్ వేశారు. ఇలా ఎవరికి వారు శాసనసభ కదనరంగానికి సై అంటున్నారు.. -
గిడ్డి ఈశ్వరి, వాసుపల్లి సీట్లకు ఎసరు..
టీడీపీ–కాంగ్రెస్ బంధం బలపడనుండడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇరు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా ఈ బంధం కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఈ పొత్తు వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన అధికార టీడీపీ నేతల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో ఆశావహులను సైతం ఇదే గుబులు వేధిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలు విభజనతో రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్‌తో జత కట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి బద్ధ శత్రువులుగా పోరాడుతున్న ఈ రెండు పక్షాలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారాయి. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ ఆశలు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళన అప్పుడే ఒకరిద్దరు టీడీపీ సిట్టింగ్‌లు, పలువురు ఆశావహుల్లో మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు గడిచిన ఎన్నికల్లో విభజన పాపం వెంటాడడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత బాలరాజు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. ద్రోణంరాజు మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్–టీడీపీ పొత్తు కారణంగా బాలరాజు పాడేరు, శ్రీనివాస్ విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. వాసుపల్లి సీటుకు ఎసరు.. పీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ టీడీపీ నగర పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినందున శ్రీనివాస్ మళ్లీ ఇదే స్థానాన్ని కోరుకునే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే వాసుపల్లి సీటు గల్లంతైనట్టే. అయితే గతంలో పొత్తు కారణంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తరం సీటును కాంగ్రెస్‌కు వదిలేస్తామన్న ప్రతిపాదన వచ్చినా ద్రోణంరాజుఆ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాల్లేవంటున్నారు. దీంతో కాంగ్రెస్ పొత్తుతో వాసుపల్లి సీటు గల్లంతయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే కనుక జరిగితే విశాఖ ఉత్తరం నుంచి వాసుపల్లిని బరిలోకి దించే ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తుందని భావిస్తున్నారు. గిడ్డి ఆశలు గల్లంతైనట్టే.. టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామన్నారని.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైతే అప్పటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని, తనకు ఇక ఢోకా లేదన్న సాకుతో కన్నతల్లిలాంటి పార్టీనే కాదు ఓట్లేసి గెలిపించిన గిరిజనులను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే ఈశ్వరిలో కనీసం ఎమ్మెల్యే సీటైనా దక్కుతుందా.. లేదా ? అన్న ఆందోళన నెలకొంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి మణికుమారితోపాటు మరికొందరు ఈశ్వరికి చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలుండడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి బాలరాజు కోసం పాడేరు స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఆశావహుల మాట అటుంచితే.. ఎన్నో ఆశలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కన్పిం చడం లేదని స్పష్టమవుతోంది. విశాఖ, అరకు పార్లమెంటు స్థానాల కోసం కాంగ్రెస్ పట్టు గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, కిశోర్ చంద్రదేవ్‌లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండడంతో పొత్తులో భాగంగా విశాఖ, అరకు పార్లమెంటు సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు నుంచి టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ స్థానం కోసమే ఎక్కువగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్న సుబ్బిరామిరెడ్డి విశాఖ పార్లమెంటు సీటును కూడా కోరాలని అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువుచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఒకే జిల్లాలో రెండు స్థానాలు ఇచ్చే అవకాశం లేనందున అరకుకే పొత్తు ఖరారయ్యే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
టీడీపీ, టీజేఎస్, సీపీఐ పోటీచేసే స్థానాలివే
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష మహాకూటమికి సంబంధించి సీట్ల పంపకాల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. కూటమిలోని పార్టీలకు సీట్ల పంపకాల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. 95 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. మిగతా 24 స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వనుంది. కూటమిలో భాగంగా టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన టికెట్లు ఇవేనని విశ్వసనీయంగా తెలిసింది. కూటమిలో భాగంగా టీడీపీకి ఈ కింది సీట్లు ఇవ్వనుంది.. 1) ఖమ్మం 2) సత్తుపల్లి 3) అశ్వరావుపేట 4) మక్తల్ 5) దేవరకద్ర 6) కోదాడ/సికింద్రాబాద్ 7) నిజామాబాద్ రూరల్ 8) కూకట్ పల్లి 9) శేరిలింగంపల్లి 10) ఉప్పల్ 11) పటాన్ చెరువు 12) రాజేంద్రనగర్ 13) మలక్ పేట్ 14) చార్మినార్ ఇక టీజేఎస్ ఆరు సీట్లలో పోటీ చేయనుంది. అవి 1) సిద్దిపేట్ 2) రామగుండం 3) అంబర్ పేట్/ ముషీరాబాద్ 4) చెన్నూరు 5) ఓల్డ్ సిటీ(1) 6) ఓల్డ్ సిటీ(2) ఇక బెల్లంపల్లి, దేవరకొండ, కొత్తగూడెం, మునుగోడు లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల టికెట్లను సీపీఐకి కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుంది. -
మూడో వంతు సీట్లలో తిరుగుబావుటా!
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీలో తుపాను ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ఓ వైపు కూటమి పార్టీలతో పొత్తు విషయం కొలిక్కిరాక సతమతమవుతుంటే.. మరోవైపు, ఎన్నికల బరిలో దిగడంపై కాంగ్రెస్ నేతల్లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. పోటీ చేసే అభ్యర్థుల ఖరారు జాబితాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. తిరుగుబాటు తుట్టెను కదిపేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరగడమే ఆలస్యం.. రెబెల్స్‌గా పోటీచేసేందుకు, ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు.. ఖరారైన అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు మున్ముందు ముసళ్ల పండుగ తప్పదనిపిస్తోంది. దాదాపు 30–40 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని.. 30 చోట్ల రెబెల్స్ బెడద తప్పకపోవచ్చని పార్టీ ముఖ్యనేతలే చెబుతుండటం గమనార్హం. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్‌లో టికెట్ ఆశించే నేతల సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తారు. కొన్నిచోట్ల పోటీచేసే సామర్థ్యమున్న నాయకులు ఐదు మంది కూడా ఉంటారు. అయితే, ఈసారి కూడా అందుకు భిన్నమైన పరిస్థితులేమీ కనిపించడం లేదు. మొత్తం రాష్ల్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ.. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. గరిష్టంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి 30 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడిప్పుడే అసమ్మతి ఛాయలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఒకవేళ అనుకున్నది జరక్కపోతే ఏంచేయాలనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు గానూ.. టికెట్లు ఎవరికి వచ్చినా ఆరు చోట్ల రెబల్స్ బరిలో దిగే అవకాశముందన్న సమచారం కాంగ్రెస్ పెద్దల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి టీఆర్ఎస్కు పట్టున్న జిల్లాల్లో అసమ్మతి బెడద కనిపిస్తుండడంతో టీపీసీసీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పార్టీ బలంగా ఉందని భావిస్తున్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ అసమ్మతి, అసంతృప్తి స్పష్టంగానే బహిర్గతం కానున్నాయి. గ్రేటర్లో ‘కూటమి’ కట్టేనా? గ్రేటర్ హైదరాబాద్‌లో కూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్‌లకు ఎన్ని టికెట్లు ఇస్తారన్న స్పష్టత రాకపోవడంతో పరిస్థితి గందరగళంగా ఉంది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు ఇస్తారా.. కాంగ్రెస్ పోటీచేస్తుందా అన్నది తేలలేదు. సనత్‌నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాల్లోనూ కొంత గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో.. కనీసం 40 స్థానాల్లో రగలనున్న అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లబరచాలన్నది కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిలో నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమేననే పైకి చెబుతున్నప్పటికీ.. ఈసారి అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. బలమైన నేతలు ‘రెబల్స్’ అయ్యే అవకాశాలున్న స్థానాలు: వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్, బక్క జడ్సన్, డాక్టర్ విజయ్‌కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి విజయ రామారావు, ఇందిర, మాదాసి వెంకటేశ్, దొమ్మాటి సాంబయ్య ఆశావహుల జాబితాలో ఉన్నారు. వరంగల్ (వెస్ట్)లో.. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆర్మూర్ టికెట్ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజారాం యాదవ్ రెబల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు బాల్కొండలో వేముల రాధికారెడ్డి పేరు తెరపైకి రాగా.. టికెట్ రాకపోతే రెబల్‌గా పోటీచేయాలని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ప్లాన్ చేస్తున్నారు. బోధన్‌లో సుదర్శన్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. తానూ పోటీచేస్తానని ఉప్పు సంతోశ్ బహిరంగంగా ప్రకటించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ పోటీ ఖాయమే అయినా నల్లవెల్లి అశోక్ నామినేషన్ రెబల్‌గా వేస్తానంటున్నారు. జుక్కల్‌లో గంగారాం, అరుణతారల్లో ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు పోటీ చేయడం తప్పేట్లు లేదు. బాన్సువాడలో కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేశ్, మల్రెడ్డి రాంరెడ్డిలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రమేశ్, సి.లక్ష్మారెడ్డి, సునీతా సంపత్‌లు టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కె.మృత్యుంజయం, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తమకే టికెట్ అని భరోసాతో ఉన్నారు. హుస్నాబాద్‌ను సీపీఐకి ఇస్తే.. అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి స్వతంత్రుడిగా బరిలో ఉండడం ఖాయమే. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇచ్చినా అక్కడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వనమా వెంకటేశ్వరరావు, ఎడవెల్లి కృష్ణల్లో ఒకరు పోటీ చేయడం ఖాయమే. హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్‌లు టికెట్ ఆశిస్తున్నారు. చొప్పదండిలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం మధ్య ప్రధాన పోటీ ఉంది. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్, కవ్వంపల్లి సత్యనారాయణ ఆశావహుల జాబితాలో ఉన్నారు. వేములవాడలో ఏనుగు మనోహర్‌రెడ్డి, కనగాల మహేశ్, ఆది శ్రీనివాస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్‌లు టికెట్ నాకంటే నాకేనని పోటీ పడుతున్నారు. దేవరకొండలో జడ్పీ చైర్మన్ బాలూ నాయక్, రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన బిల్యానాయక్, ఉత్తమ్ అనుచరుడు జగన్‌లాల్ నాయక్ పోటీలో ఉన్నారు. మునుగోడులో ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, బీసీ కోటాలో నారబోయిన రవిల పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లాయని అంటున్నారు. టికెట్ రాకపోతే రెబల్‌గా పోటీకి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్ అనుచరుడు డాక్టర్ ప్రసన్న రాజ్ టికెట్లు అడుగుతున్నారు. నారాయణ్‌ఖేడ్‌లో డాక్టర్ పి.సంజీవరెడ్డి, సురేశ్ షెట్కార్‌లు టికెట్ ఆశిస్తున్నారు. దుబ్బాకలో చెరుకు ముత్యంరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, మద్దుల నాగేశ్వర్రెడ్డిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇల్లెందులో 30 మంది టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా స్థానికంగా పట్టున్న ఒకరిద్దరు నేతలు బరిలో ఉండే అవకాశం ఉంది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డిలు నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. సిర్పూర్లో పాల్వాయి హరీశ్ బాబు, రావి శ్రీనివాస్‌లు ప్రధాన ఆశావహులుగా ఉన్నారు. -
‘కేసీఆర్ కుటుంబపాలన అంతానికే మహాకూటమి’
సాక్షి, జగిత్యాల : అకారణంగా అసెంబ్లీని రద్దు చేసి.. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా 20 రోజులుగా బయటికిరాని కే చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబపాలన అంతానికే మహాకూటమిగా ఒక్కటయ్యామని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. నమ్మిన తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ.. మహాకూటమి ఏర్పాటుతో ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. డీకే అరుణ బండారం బయట పెడతానని హీనంగా మాట్లాడిన కేసీఆర్! .. నీ కూతురు బండారం బయట పెడితే సహించగలవా అని ప్రశ్నించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి మీద తమకు నమ్మకం ఉందని అన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మహాకూటమిపై మండిపాటు జగిత్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మహాకూటమిపై మండిపడుతున్నారని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన నుంచి విముక్తి పొందేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పించటానికి, రైతులకు, మహిళలకు అండగా నిలువటానికి మహాకూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. -
కలవగానే విడదీయాలి!
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్షతో ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి... ముందస్తు ఎన్నికల గెలుపు విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహా కూటమిని ఆధారంగా చేసుకుని... అందులోని పార్టీలను దెబ్బతీసే వ్యూహాన్ని రచించింది. కూటమిలోని పార్టీల్లో సీట్ల సర్దుబాటుతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని నేతల్లో వీలైనంత ఎక్కువ మందిని టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. కూటమి ఏర్పడి, పార్టీల వారీగా పోటీ చేసే సీట్ల విషయంలో అధికారిక ప్రకటన రాగానే వ్యూహాన్ని వేగంగా అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉండే నేతలతో చర్చలు జరిపే బాధ్యతను టీఆర్ఎస్లోని కొందరు నేతలకు అప్పగించింది. ప్రధానంగా కాంగ్రెస్‌లో పోటీ చేసే అవకాశం రాని నేతలపై దృష్టి సారించింది. పొత్తులతో మెజారిటీ సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న మహాకూటమిని అదే అంశంతో చిత్తు చేయాలని టీఆర్ఎస్ కసరత్తు తీవ్రం చేసింది. సీట్ల సంఖ్యపై స్పష్టత రాగానే... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కలసి మహాకూటమిగా ఏర్పడేందుకు అంతా సిద్ధమైంది. పార్టీల వారీగా పోటీ చేసే సీట్ల సంఖ్యను తేల్చే ప్రక్రియ కొనసాగుతోంది. సీట్ల సంఖ్యపై స్పష్టత రాగానే... ఏయే నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో నిర్ణయం వెలువడనుంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 25, సీపీఐ 12, టీజేఎస్ 33 స్థానాలు అడుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం టీడీపీకి 10, టీజేఎస్ 4, సీపీఐ 3 స్థానాలను ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. పార్టీల వారీగా కేటాయించే సీట్ల సంఖ్యపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి నాలుగు పార్టీలు కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు పలువురు నాలుగేళ్లుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మిత్రపక్ష పార్టీలకు స్థానాలకు కేటాయించే స్థానాల్లో కాంగ్రెస్ ఆశావహులకు అవకాశం రాదు. కాంగ్రెస్ లెక్కల ప్రకారమే మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలు 17 వరకు ఉండనున్నాయి. కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తే కాంగ్రెస్ వదులుకునే సీట్లు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం రాని కాంగ్రెస్ నేతల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి నేతలతో చర్చలు జరిపే ప్రక్రియను అధికార పార్టీ మొదలుపెట్టింది. పలువురు టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు ఇప్పటి నుంచే ఇలాంటి నియోజకవర్గాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసంతృప్త నేతలను స్వయంగా కలసి... టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని... ప్రభుత్వ పరంగా పదవులు, ఇతర అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నారు. కూటమిలో పార్టీల వారీగా సీట్లు ఖరారైన రోజే... అసంతృప్త నేతలను స్వయంగా కలసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు వీరంతా సిద్ధమయ్యారు. అసంతృప్త నేతలను కలసి అక్కడి నుంచే టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులతో ఫోన్లో మాట్లాడించడం, వెంటనే పార్టీలో చేర్పించడం జరిగిపోయేలా ప్రణాళిక సిద్ధమైంది. మరోవైపు టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లోని నేతలతోనూ టీఆర్ఎస్ ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. పొత్తులతో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వీరు పార్టీ మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఎక్కువగా కాంగ్రెస్ వారే... మహాకూటమిలో పొత్తులో భాగంగా ఎక్కువగా కాంగ్రెస్ వారే పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. సత్తుపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు/బాల్కొండ, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ముషీరాబాద్, కోదాడ, కంటోన్మెంట్, సికింద్రాబాద్, పరకాల నియోజకవర్గాలను ఇవ్వాలని టీడీపీ గట్టిగా కోరుతోంది. మల్కాజ్గిరి, తాండూరు, మంచిర్యాల, చెన్నూరు, ముథోల్, వరంగల్ పశ్చిమ స్థానాల కోసం టీజేఎస్ డిమాండ్ చేస్తోంది. హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా స్థానాలను తప్పనిసరిగా ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. ఇదే తరహాలో పొత్తు కుదిరితే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వారికి పోటీ చేసే అవకాశాలు ఉండవు. దీంతో ఈ సెగ్మెంట్లలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులపై, ద్వితీయ శ్రేణి నేతలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. -
మళ్లీ ఆయనే సీఎం కావాలంటున్నారు!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో జతకట్టి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఇండియాటుడే సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 46 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీతో కలవడం వల్ల ఆయన విశ్వసనీయత కోల్పోలేదని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. నితీశ్ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను వెళ్లగొట్టిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందా? అని ప్రశ్నించగా 49 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 40 శాతం కాదని చెప్పారు. 11 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు. ఈనెల 22 నుంచి 26 వరకు 40 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017, జూలైలో మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి 2015 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత.. నితీశ్ ఈ రెండు పార్టీలను వదిలేసి బీజేపీతో జత కట్టడాన్ని అప్పట్లో చాలా మంది తప్పుబట్టారు. కమలం పార్టీతో పొత్తు అనైతికమని దుయ్యబట్టారు. అయితే తాజా సర్వేలో నితీశ్‌కు ప్రజలు జై కొట్టడం విశేషం. -
‘ఆ ఎమ్మెల్యేకు మాటలు ఎక్కువ, పని తక్కువ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి వీస్తుందని, అందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో హరీశ్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు తెలంగాణ సాధకులకు, ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయని విమర్శించారు. తెలంగాణ వివక్షకు కారణమైన కాంగ్రెస్, అన్యాయం చేసిన టీడీపీలు ఒక్కటయ్యాయని దుయ్యబట్టారు. కేంద్రం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలన్నారు. -
కాంగ్రెస్ కూటమి కుదురుకునేనా?
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ ఆవిర్భావం నుంచి ఆగర్భ శత్రువుగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం చేతులు కలపాలనుకోవడం అవకాశవాద రాజకీయమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు సీపీఐ, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ని కూడా కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేయాలనుకోవడం జాతీయ రాజకీయాల్లో కీలకమైన పరిణామమే. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే 1982లో ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. 1995లో చంద్రబాబు నాయుడు పార్టీని చీల్చినప్పటికీ ఆయన తన ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా రాజకీయాలు నడిపించాల్సి పరిస్థితి కూడా తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. ఎంతగా అంటే... రాయల సీమలో 2017 వరకు ఇరు పార్టీల మధ్య కొనసాగిన రాజకీయ ఘర్షణల్లో దాదాపు 970 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 560 మంది టీడీపీ కార్యకర్తలు మరణించినట్లు క్రై మ్ రికార్డు బ్యూరో లెక్కలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నాలుగేళ్లలో ఆ పార్టీ పరిస్థితి మరింతగా క్షీణించింది. టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది సభ్యులు పాలకపక్ష తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోగా, ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌ది అన్న కారణంగా అక్కడ ఐదు శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ నాటకీయంగా బయటకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలబడాలన్న వ్యూహంతో ఇరు పార్టీలు పరస్పరం చేతులు కలిపేందుకు సిద్ధపడ్డాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల ప్రభుత్వం వ్యతిరేక ఓటు పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్‌కు ప్రస్తుత మహా కూటమి ఎంత మేరకు సఫలీకృతమవుతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల పోలింగ్ ఏజెన్సీ ‘వీడీపీ అసోసియేట్స్’ ప్రకటించిన సర్వే ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 41 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 27 శాతం, బీజేపీకి పది శాతం, ఎంఐఎంకు ఆరు శాతం, టీడీపీకి నాలుగు శాతం ఓట్లు వస్తాయి. సీపీఐకి, తెలంగాణ జన సమితి కూడా చెరి రెండేసి శాతం ఓట్లు వస్తాయి. ఈ లెక్కన మహా కూటమికి వచ్చే ఓట్ల శాతం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే 35 శాతం ఓట్లు రావచ్చు. అంటే టీఆర్‌ఎస్‌కన్నా ఇంకా ఆరు శాతం ఓట్లు తక్కువే వస్తున్నాయి. ఇకపోతే ఒక తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన మరో సర్వే ప్రకారం కూడా ట్రెండ్ దాదాపుగా ఇలాగే ఉన్నట్లు కనిపించింది. అయితే, పార్టీ మధ్య పొత్తులను పరిగణలోకి తీసుకోకుండానే ఆ ఛానల్ కూడా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పొత్తు కూడిన పార్టీలకు విడివిడిగా వచ్చే ఓట్ల శాతాన్ని మొత్తంగా పరిగణలోకి తీసుకున్నా కూడా పాలకపక్షంకన్నా తక్కువ శాతం ఓట్లే వస్తున్నట్టు తెలియజేసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇతర కేటగిరీల కింద కూడా వర్గీకరించి విశ్లేషిస్తే ప్రస్తుత ఎన్నికలపై ముందస్తు అంచనాలపై ఒక అభిప్రాయానికి రావచ్చని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. పరిగణలోకి తీసుకోవాల్సిన వర్గీకరణ అంశాలు రద్దయిన రాష్ట్ర అసెంబ్లీలో మహా కూటమి భాగస్వామ్య పక్షాలకు ఉన్న సీట్లెన్నీ? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహాకూటమి ఉమ్మడి ఓట్ల శాతం ఏయే నియోజక వర్గాల్లో ఎక్కువ? ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహాకూటమి ఉమ్మడి ఓట్ల శాతం పది శాతం కన్నా తక్కువ? ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకన్నా మహా కూటమి ఉమ్మడి ఓట్ల శాతం పది నుంచి 20 శాతం ఎక్కువ. ఏయే నియోజక వర్గాల్లో విజయం సాధించిన పార్టీకి, మహా కూటమి ఉమ్మడి ఓట్ల శాతం మధ్య వ్యత్యాసం 20 శాతం కన్నా ఎక్కువ. 2014లో ఎన్నికల్లో విజయం సాధించిన మహా కూటమి భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు టీఆర్ఎస్కు ఫిరాయించడం వల్ల కోల్పోయిన సీట్లెన్నీ? 2014లో వాటికి వచ్చిన ఓట్ల శాతాన్ని రానున్న ఎన్నికల్లో కూడా దక్కించుకోగలవని భావిస్తే... ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి కచ్చితంగా బదిలీ అయితే మహా కూటమికి అదనంగా 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయం సాధించిన గజ్వేల్ నియోజకవర్గ ఓటింగ్ సరళని విశ్లేషిస్తే... గత ఎన్నికల్లో కేసీఆర్ 44 శాతం ఓట్లతో అక్కడి నుంచి విజయం సాధించగా, అక్కడ కాంగ్రెస్, టీడీపీలకు ఉమ్మడిగా 51 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ వంటేరు ప్రతాప్ రెడ్డి మహాకూటమి తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయన కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంటుందా? అన్నది వేరే విషయం. మూడవ వర్గీకరణ కింద అదనంగా 19 సీట్లు రావాలంటే మహాకూటమికి అనుకూలంగా ఐదు శాతం ఓట్లు స్వింగ్ కావాలి. అప్పుడు కూడా మహా కూటమికి మొత్తం వచ్చే సీట్లు 53. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కన్నా ఏడు సీట్లు తక్కువే ఉంటాయి. ఫిరాయింపుల కారణంగా టీడీపీ కోల్పోయిన 12 సీట్లను, కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ఏడు, సీపీఐ ఒక్క సీటుతోపాటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న రెండు సీట్లను కైవసం చేసుకోవడంతోపాటు మహాకూటమి పక్షాల మధ్య ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగి, ఐదు శాతం ఓట్ల స్వింగ్ ఉన్నప్పుడు గరిష్టంగా 53 స్థానాలను మహా కూటమి గెలుచుకో గలుగుతుంది. ‘వీడీపీ అసోసియేట్స్’ చేసిన సర్వే ప్రకారం 2014లో టీఆర్ఎస్కు 34 శాతం ఓట్లు రాగా, ఈ సారి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 27 శాతానికి పెరుగుతాయి. టీడీపీకి 15 నుంచి 4 శాతానికి పడిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ భారీగా దెబ్బతిన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 150 వార్డులకుగాను 100 వార్డులను టీఆర్ఎస్ గెలుచుకొంది. టీడీపీ 44 నుంచి ఒక్క స్థానానికి, కాంగ్రెస్ 52 నుంచి రెండుకు పడిపోయాయి. ఈ రకంగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణాదిలో విజయావకాశాలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి టీడీపీ, సీపీఐ పార్టీల ప్రభావం కూడా బాగానే ఉన్న ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో మహా కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి ఓట్ల శాతం 37 శాతం కాగా, సీపీఐ, జన సమితి ఓట్లు కలిస్తే టీఆర్‌ఎస్‌కన్నా ఎక్కువ శాతం ఓట్లు రావచ్చు. సహజంగానే ఈసారి కాస్త ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో మరింత బలపడటమే కాకుండా తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రయోజనం పొందొచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉండొచ్చు. -
‘మహాకూటమి మీడియా కల్పన మాత్రమే’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీయేను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం భిన్నంగా స్పందించారు. మహాకూటమి అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని... ఒంటరిగానే బీజేపీని ఎదుర్కోగల సామర్థ్యం తమ పార్టీకి ఉందంటూ వ్యాఖ్యానించారు. కాగా నరేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వీరికి లోన్లు మంజూరయ్యాయంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇండియా టుడే ప్రతినిధితో మాట్లాడిన రణ్‌దీప్ సూర్జేవాలా.. వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల గురించి స్పష్టత ఇచ్చారు. మోదీజీ వీటికి సమాధానం చెప్పాలి.. రఘురాం రాజన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘2014కు ముందు ఎన్పీఏ(నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్) విలువ 2.80 లక్షల కోట్ల రూపాయాలు. కానీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఆ విలువ 12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. కేవలం నాలుగేళ్లలో ఇది ఎలా సాధ్యమైందో మోదీజీ సమాధానం చెప్పాలి. అదే విధంగా గతేడాది వెలుగులోకి వచ్చిన బ్యాంకు మోసాల విలువ లక్ష కోట్ల రూపాయలు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎన్డీయే ప్రభుత్వమేనని’ రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధర విషయంలో తామేమీ చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఎక్సైజ్ సైజ్ సుంకాన్ని తగ్గించిందని పేర్కొంటూ... మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు. అవన్నీ బోగస్ కేసులు.. మోదీ ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని విమర్శిస్తున్న కాంగ్రెస్.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిలు పైన బయట ఉన్నారు కదా అన్న ప్రశ్నకు బదులుగా.. అవన్నీ బోగస్ కేసులని, వారిద్దరికి క్లీన్చిట్ లభిస్తుందని రణ్‌దీప్ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమని నైతికంగా దెబ్బతీసేందుకే బీజేపీ ఈ విషయాలను హైలెట్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుల రాజకీయాలకు అనుకూలమా.!? కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ డీఎన్ఏ కలిగి ఉందనడంలో తన ఉద్దేశాన్ని తెలుపుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అదే విధంగా అగ్రవర్ణాలకు చెందిన పేదల బాగోగులను కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే బ్రాహ్మణులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండాలన్నాను. అందులో తప్పేముందంటూ రణ్‌దీప్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ శివభక్తుడు.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివభక్తుడని, ఆయనకు పరమత సహనం మెండుగా ఉందని రణ్‌దీప్ వ్యాఖ్యానించారు. బీజేపీలాగా హిందూ మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకునే కుటిల బుద్ధి తమ నాయకుడికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడాన్ని సమర్థిస్తూ.. బీజేపీని నడిపించే ఆరెస్సెస్ భావజాలం భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదకరమైందేనని వ్యాఖ్యానించారు. -
‘మహాకూటమి ప్రజల ఆకాంక్ష’
సాక్షి, ముంబై : పాలక బీజేపీపై భావసారూప్యత కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం విపక్షాలకు పిలుపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మహాకూటమి ఏర్పాటు రాజకీయ నాయకుల సెంటిమెంట్ మాత్రమే కాదని, ఇది ప్రజల ఆకాంక్ష అని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు ఈ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. ‘బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని నరేంద్ర మోదీలను ఢీకొనేందుకు మహాకూటమి ఏర్పాటు కేవలం రాజకీయ నాయకుల కోరిక మాత్రమే కాదు...ఇది ప్రజల ఆకాంక్ష’ అని ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తూ కీలక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న క్రమంలో దీన్ని ఎలా నివారించాలనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోందని చెప్పుకొచ్చారు. పెరుగుతున్న పెట్రో ధరలపై కూడా రాహుల్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విపక్షాలు కోరుతున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు. నోట్లరద్దు ద్వారా చిన్న వ్యాపారులు, పరిశ్రమలు, వర్తకులపై భారీ దాడి జరిగిందన్నారు. గబ్బర్‌సింగ్ ట్యాక్స్(జీఎస్టీ)తో ముంబైలోని తోలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. గత యూపీఏ హయాంలో ముడిచమురు బ్యారెల్ ధర 130 డాలర్లు ఉంటే ప్రస్తుతం 70 డాలర్లకు తగ్గినా పెట్రో ధరలు మాత్రం భగ్గుమంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముడిచమురు ధరలు తగ్గినా వాటి ప్రయోజనాన్ని సామాన్య పౌరులకు మోదీ ప్రభుత్వం బదలాయించలేదన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నిస్తూ ఇదంతా కేవలం 15 నుంచి 20 మంది సంపన్న పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో రాహుల్ పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. ఆయన మంగళవారం ఆరెస్సెస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి భివాండి కోర్టులో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. -
కూటమిలో చేరే ప్రసక్తే లేదు...!
సాక్షి, ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన పార్టీ మరోసారి స్పష్టం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న కూటమి (మహా అఘాది)లో చేరాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ శివసేనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శివసేన నేత హర్షల్ ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని కూల్చడం ఇష్టంలేకే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో శివసేన ఇంకా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నందు వల్లే సామాన్యులు, రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం పోరాడటం సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వాన్ని కూల్చడానికే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని, వారి ఆటలో పావుగా మారేందుకు శివసేన సిద్ధంగా లేదన్నారు. శివసేనకు చెందిన మరో నేత మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే నుంచి బయటికి రావాలని ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని తెలిపారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారే తప్ప బీజేపీని వీడిన తర్వాత మరో పార్టీతో జతకట్టే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా బీజేపీ వ్యతిరేక కూటమిలో శివసేన చేరడానికి సుముఖంగా లేదన్న వార్తలపై ముంబై కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ స్పందించారు. శివసేన, కాంగ్రెస్ పార్టీ రెండు వేర్వేరు ధ్రువాలని, కాంగ్రెస్ ఏర్పాటు చేసే కూటమిలో శివసేన భాగస్వామ్యమయ్యే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
టార్గెట్ బీజేపీ.. సిద్ధమవుతున్న గ్రాండ్ అలయన్స్!
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయం సాధించడంతో జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఎదుర్కొనేందుకు ఒక కూటమిగా జట్టు కట్టాలని భావిస్తున్నాయి. యూపీ, బిహార్ ఉప ఎన్నికల విజయాలు.. ఈ మేరకు మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలకు బలమైన ఊతం ఇస్తున్నాయని తాజాగా ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమమ్ తెలిపారు. ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటుకోసం ఇప్పటికే సోనియాగాంధీ, శరద్ పవార్ కలిసి పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. గోరఖ్‌పూర్, ఫుల్ఫూర్ ఉప ఎన్నిల్లో బీజేపీ ఓడిపోయిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న ఢిల్లీలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కాబోతున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకే రాహుల్ ఈ భేటీలు చేపడుతున్నట్టు భావిస్తున్నారు. అటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా మహాకూటమి ఏర్పాటు సాధ్యమేనని అంచనా వేశారు. ప్రతిపక్ష కూటమి సత్తా ఏమిటో యూపీ ఉప ఎన్నికల ఫలితాల్లో వెల్లడైందంటూ.. ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఆయన ఉటంకించారు. ఆయన తనయుడు, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కొన్నిరోజుల కిందట ఢిల్లీలో యూపీఏ చీఫ్ సోనియాగాంధీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోనియా ఈ విందు ఇచ్చినట్టు భావించిన సంగతి తెలిసిందే. సోనియా ఇచ్చిన విందుకు హాజరైన సీపీఐ నేత డీ రాజా కూడా బీజేపీ వ్యతిరేక భావసారూప్య పార్టీల కూటమి ఏర్పాటు సాధ్యమేనంటూ పేర్కొన్నారు. అయితే, యూపీలో విజయాలతో జోరుమీదున్న ఎస్పీ మాత్రం ప్రతిపక్ష మహాకూటమిపై వేచి చూసే ధోరణి కనబరుస్తోంది. 2019 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుకు అవకాశముందా? అని ప్రశ్నించగా.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సన్నిహితుదు రాంగోపాల్ యాదవ్.. ఏర్పాటు కావొచ్చేమో.. వేచిచూడండంటూ బదులిచ్చారు. -
ముషర్రఫ్‌కు ఊహించని ఝలక్
-
ఒక్క ప్రకటన... ‘మాస్టర్’ ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్
ఇస్లామాబాద్ : ఎలాగైనా తిరిగి అధికారంలోకి వద్దామని భారీ వ్యూహరచన చేసిన మాజీ సర్వసైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు ఊహించని ఝలక్. ఆయన కొత్తగా ప్రకటించిన అవామీ ఇత్తెహాద్ కూటమిలో చేరేందుకు పలు కీలక పార్టీలు విముఖత వ్యక్తంచేశాయి. షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్‌ను ఎదుర్కునేందుకు ముషారఫ్ శనివారం ‘పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్’ మహా కూటమిని ఏర్పాటు చేశారు. పీఐఏకు 74 ఏళ్ల ముషర్రఫ్ సారథ్యం వహిస్తుండగా.. ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పార్టీలకు విజ్ఞప్తి చేశారు కూడా. పాకిస్థాన్ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ) , ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్పీ), మజ్లిస్ వహెదత్-ఈ-ముస్లిమీన్(ఎండబ్ల్యూఎం), సున్ని ఇత్తెహద్ కౌన్సిల్(ఎస్ఐసీ) ఇలా 23 పార్టీలను తమతో చేతులు కలపాల్సిందిగా ముషర్రఫ్ కోరారు. అయితే ఆయా పార్టీలు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షమైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ ఈ విషయంలో ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, పంజాబ్ బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే త్వరగతిన ఎన్నికలు జరగాలని... ఆ పోరాటంలో స్వచ్ఛరాజకీయాలకే తాము ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా వెనకంజ వేశాయన్నది స్పష్టమౌతోంది. ఏది ఏమైతేనేం ముషర్రఫ్ మహాకూటమి ఘోరంగా విఫలమైందని రెండో రోజే రాజకీయ విశ్లేషకులు నిర్ధారించారు. -
ప్రధాని మోదీని ఓడించాలంటే..?
న్యూఢిల్లీ: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అడ్డుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. మహాకూటమితోనే బీజేపీ, మోదీని ఎదుర్కొగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించగలదని అనుకోవడం మూర్ఖత్వమన్నారు. కలిసికట్టుగా పోరాడితే 2019లో బీజేపీపై విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పారు. ‘సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు చాలాపెద్ద నష్టమే జరిగింది. కానీ 2014 పార్లమెంటు ఎన్నికల్లో 59 శాతం, 2017 యూపీ ఎన్నికల్లో 69 శాతం ప్రజలు ప్రధానికి ఓటు వేయలేద’ ని మణిశంకర్ తెలిపారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌లో ఎటువంటి ఇబ్బంది లేదన్న అయ్యర్, జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడుతోందని అంగీకరించారు. పార్టీని పటిష్టం చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి యువతరాన్ని చేర్చుకోవాలని అయ్యర్ సూచించారు. 2004 స్ఫూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన కోరారు. కేంద్రంలో యూపీఏ ఓడిపోవడానికి కారణం ఈ కూటమి చెల్లాచెదురు కావడమేనన్నారు. అప్పట్లో సోనియా గాంధీ మిత్రపక్షాలను కలుపుకునిపోయారని, ఇప్పడు రాహుల్ గాంధీపై ఆ బాధ్యత ఉందన్నారు. మహాకూటమి ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా బలపడాలని అయ్యర్ సూచించారు. -
2019లో మోదీని ఎదుర్కోవాలంటే..?
న్యూఢిల్లీ: 'వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే నేత ఎవరూ లేరు. 2019 ఎన్నికలను మరిచి 2024లో గెలవడంపై దృష్టిసారించాలి'.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలివి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కోవాలంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మహాకూటమి తరహాలో అన్ని పార్టీలు ఏకం కావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. 'మోదీ గాలిని తట్టుకుని, బీజేపీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లతో బీఎస్పీ పొత్తుపెట్టుకోవాలి. లేకపోతే బీజేపీని ఓడించడం కష్టం' అని జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించిన సంగతి తెలిసిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో తమ పార్టీ బలహీనంగా ఉందని, 2019 ఎన్నికలకు తప్పనిసరిగా మహా కూటమిని ఏర్పటు చేయాలని అన్నారు. యూపీలో మహాకూటమి లేనందువల్లే బీజేపీ గెలిచిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి అభిప్రాయపడ్డారు. మోదీకి పోటీగా మహాకూటమి తరఫున బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా బరిలో దింపాలని జేడీయూ నేతలు చెప్పారు. -
ఎన్నికలు ముంచుకొచ్చినా.. తేలని పొత్తులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలిదశ నామినేషన్లకు గడువు గట్టిగా వారం రోజులు కూడా లేదు. కానీ అక్కడ ఇంకా పొత్తుల విషయం తేలలేదు. అఖిలేష్ నేతృత్వంలో ఏర్పడుతుందనుకుంటున్న మహాకూటమిలో అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ఉంటుందో లేదోనన్న అనుమానాలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ.. ఇవన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలని, తద్వారా బీజేపీ, బీఎస్పీలను ఓడించాలని ముందునుంచి భావిస్తున్నారు. అయితే.. తొలిదశలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. అదే ఇప్పుడు పొత్తు విషయంలో ప్రధాన అడ్డంకిగా మారింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు కూడా. దాదాపు వారం రోజుల క్రితం తొలిదఫా చర్చలు జరిగాయి. అప్పుడు ఆర్ఎల్డీకి 23 టికెట్లు ఇస్తామని సమాజ్‌వాదీ ఆఫర్ చేసింది. అయితే తమకు మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం కావాలని అజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కానీ దానికి అఖిలేష్ బృందం అంగీకరించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ చర్చలన్నవి ఏమీ జరగలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని మొదటి రెండు దశల్లో.. ముజఫర్ నగర్, మీరట్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, ఆగ్రా, మథుర లాంటి ప్రాంతాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఇక్కడ సీట్లు బాగానే గెలుచుకుంది. ఇక్కడ తమకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే బీజేపీని గట్టి ఎదుర్కోగలమని ఆర్ఎల్డీ అంటోంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీకి వచ్చిన స్థానాలు 8 మాత్రమే. అందువల్ల ఇప్పుడు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న విషయంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో.. ఏం చేయాలోనని తలపట్టుకుంటున్నాయి. -
అసోంలో గ్రాండ్ అలయెన్స్
గువాహటి: రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, జడీయూలు ఇప్పటికే గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడినట్లు ఏఐయూడీఎఫ్ చీఫ్, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ప్రకటించారు. ఈ మహా కూటమిలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. బీహార్‌లో బీజేపీని మట్టి కరిపించిన మహా కూటమి భాగస్వాములు జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో తాము చర్చలు జరిపామని, మహా కూటమిలో చేరేందుకు వారు సమ్మతి వ్యక్తం చేశారని అజ్మల్ వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాటీకి కలసి రావాలని తాము కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పలికామని, ఆ పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉందని అజ్మల్ తెలిపారు. అలాగే ఇప్పటికే బీజేపీతో చేతులు కలిపిన అస్సాం గన పరిషద్‌ను కూడా మనసు మార్చుకొని తమతో కలసి రావాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కూడా తమతో కలిసొస్తే మతవాద శక్తులను మట్టికరిపించగలమని అన్నారు. దేశంలో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని, నరేంద్ర మోదీ ప్రతిష్టకు ఎవరూ సాటిరారని ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విర్రవీగిన బీజేపి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జేడీయూ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్యుడు అరుణ్ కుమార్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీ పట్ల అస్సాం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. -
'వారి స్నేహం నిలవదు.. బద్దలవడం ఖాయం'
పాట్నా: బిహార్‌లో గ్రాండ్ అలయెన్స్ ఎంతో కాలం కోనసాగదని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే ఈగోల కారణంగా జేడీయూ, ఆర్జేడీ స్నేహం చెదిరిపోతుందని, అవి విడిపోతాయని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఆర్జేడీ ఆలోచనలు వేరని, జేడీయూ ఆలోచనలు వేరని ఆరెండు ఎక్కువకాలం కొనసాగబోవని అన్నారు. బిహార్ ఎన్నికల్లో ఓటమిపాలుకావడానికి గల కారణాలు శోధించేందుకు ఆయన తన నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అనుకోని విధంగా గ్రాండ్ అలయెన్స్ వైపు గాలిమళ్లిందని అన్నారు. నియోజకవర్గాల వారిగా అది గెలుపులు దక్కించుకున్న ఓట్ల విషయంలో ఎన్డీయేకన్నా తక్కువ స్థాయిలోనే సాధించాయని చెప్పారు. త్వరలోనే ఈ గ్రాండ్ అలయెన్స్ కు బీటలు వారనుందని, అది మీరు తప్పక చూస్తారని, మధ్యంతర ఎన్నికలు కూడా వస్తాయని చెప్పారు. -
'మహాకూటమిపై నిర్ణయం నాన్నదే'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లోనూ మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. బహుజన సమాజ్ వాది పార్టీ, ఇతర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెరపైకి తెచ్చారు. దీనిపై యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. మహాకూటమిపై నిర్ణయం తన తండ్రి ములాయం చేతుల్లో ఉందని తెలిపారు. మహాకూటమి ఏర్పాటు చేయాలా, వద్దా అనేది తానేలా చెబుతానని ప్రశ్నించారు. ఏ నిర్ణయమైనా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డ్, ములాయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎస్పీ, బిఎస్పీ జట్టు కట్టే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. ఆర్జేడీ-జేడీ(యూ)తో పోల్చుకుంటే ఎస్పీ-బిఎస్పీ మధ్య సంబంధం భిన్నమైనదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టాంతా రాష్ట్రాభివృద్ధిపైనే అని చెప్పారు. నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి మీరు, మీ తండ్రి హాజరవుతారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సమాధానం ఇవ్వలేదు. అలాగే ఈనెల 22న జరగనున్న ములాయం జన్మదిన వేడుకలకు నితీశ్, ములాయం హాజరవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించలేదు. -
యూపీ ఎన్నికల్లో మహాకూటమి?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుని, మహాకూటమిగా పోరాడే అవకాశం ఉందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే ఏయే పార్టీలతో పొత్తులు ఉండొచ్చనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. అయితే, సమాజ్‌వాదీ - బీఎస్పీల మధ్య పొత్తు ఉండొచ్చని ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఫరీద్ మహఫూజ్ కిద్వాయ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే, బిహార్‌లో అంతకుముందు కూడా జేడీయూ - ఆర్జేడీల మధ్య అలాంటి పరిస్థితే ఉన్నా.. ఆ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తే సత్ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుచేశారు. బిహార్ తరహాలోనే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. బిహార్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ పంచాయతీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఇచ్చారని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము ఈ ఎజెండాతోనే పోటీకి దిగుతామని చెప్పారు. -
20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బిహార్ అధికారపక్షం జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై నితీశ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సమావేశమవుతాయి. ఈ సమావేశంలో మహాకూటమి శాసనసభ పక్ష నాయకుడిగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఈ నెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేయనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. నితీశ్‌తో పాటు 36 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశముంది. రేపు నితీశ్ కుమార్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత శాసన సభను రద్దు చేయాలని నితీశ్ సిఫారసు చేస్తారు. ఇదే రోజు మహాకూటమి సంయుక్త సమావేశం అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నితీశ్ ప్రకటన చేస్తారు. ఇదిలావుండగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఈ రోజు సమావేశమై శాసనసభ పక్ష నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఈ పదవికి రఘోపూర్ నుంచి ఎన్నికైన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ పేరు వినిపిస్తోంది. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందే మహాకూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ పేరును ప్రకటించారు. -
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు!
న్యూఢిల్లీ: గతంలో అనేక సార్లు జరిగినట్టే ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఘోరంగా తప్పాయి! బిహార్‌లో బీజేపీ విజయం తథ్యం అని ప్రకటిం చినా సర్వేలన్నీ తారుమారయ్యాయి. రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుం దని పేరున్న ‘టుడేస్ చాణక్య’ కూడా తప్పులో కాలేసింది. ఇప్పుడు తన అంచనాకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. బీజేపీ కూటమి ఏకంగా 155 సీట్లు నెగ్గుతుందని, మహాకూటమి 83 సీట్లకే పరిమితం అవుతుందని టుడేస్ చాణక్య తెలిపింది. అయితే ఫలితాలు పూర్తి భిన్నంగా రావడంతో ‘మా అంచనాలు తప్పినందుకు మా మిత్రులు, శ్రేయోభిలాషులు, అందరినీ క్షమాపణలు కోరుతున్నాం. బిహార్ నాడి పట్టలేకపోయాం. విజేతలకు అభినందనలు’ అని ఆ సం స్థ ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని కూటమి 120-130 సీట్లు గెల్చుకుం టుందని, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి 105-115 సీట్లు దక్కించుకుంటుందన్న ఎన్డీటీవీ అంచనా కూడా తప్పింది. దైనిక్ జాగరణ్ జరిపిన సర్వేలో ఎన్డీఏ 130, మహా కూటమి 97 సీట్లు గెల్చుకుంటాయని తేలింది. ఏబీపీ న్యూస్-నీల్సన్ కూడా బీజేపీ కూటమి 130, మహా కూటమి 108 సీట్లు నెగ్గుతుందని తెలిపింది. ఇండియా టుడే-సిసిరో బీజేపీ కూటమి 120, మహాకూటమి 117 సీట్లు గెల్చుకుంటాయని అంచనా వేసింది. కచ్చితంగా అంచనా వేసినవి ఇవీ: కొన్ని సంస్థలు, నిపుణులు బిహార్ ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్ బిహార్‌లో నితీశ్ కూటమిదే విజయమని, మహకూటమి 130 సీట్లకుపైగా సొంతం చేసుకోవచ్చని చెప్పారు. న్యూస్ నేషన్ కూడా వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చింది. ఈ సంస్థ మహా కూటమికి 122, బీజేపీకి 117 సీట్లు వస్తాయని చెప్పింది. న్యూస్ఎక్స్, సీఎన్ఎక్స్ కూడా మహాకూటమి 135 సీట్లు నెగ్గి విజయం సాధిస్తుందని చెప్పింది. -
ఓట్ల పరంగా ఏకైక అతిపెద్ద పార్టీ బీజేపీ
పట్నా: బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించింది. భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది. నితీశ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎన్డీయే కూటమి అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పోల్చితే మహాకూటమి కొత్తగా, అనూహ్యంగా సాధించిందేమీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరు కూటముల్లో పోటీచేసి 49.8% ఓట్లు సాధించగా ఈసారి ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేసి 41.9% ఓట్లను మాత్రమే సాధించగలిగాయి. సీట్ల పరంగా చూస్తే మహాకూటమిలోని పార్టీల బలాబలాలు మారినా ఓట్ల పరంగా చూస్తే ఆ కూటమి నష్టపోయింది. అలాగే ఎన్డీయే కూటమి ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 2010 ఎన్నికల్లో బీజేపీ, ఎల్జేపీ కలిపి 24% ఓట్లను సాధించగా ఈసారి ఒంటరిగానే బీజేపీ 24.8% ఓట్లను సాధించింది. అపుడు కూటమిలో జేడీయు కూడా ఉంది. 2010 ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆర్జేడి, కాంగ్రెస్‌తో ఈసారి జేడీయూ చేతులు కలిపింది. 49.8% ఓట్లు సాధించిన మూడు పార్టీలతో మహా కూటమి అవతరించింది. నితీశ్‌కుమార్ పాలనపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ఆర్జేడీ, కాంగ్రెస్‌లను ఓటర్లు ఇప్పటికే రెండుసార్లు శిక్షించి ఉండడంతో మహా కూటమి సునాయాసంగానే విజయం సాధించింది. సీట్లు కోల్పోయినా ఓట్ల పరంగా చూస్తే బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 91.5 లక్షల ఓట్లు సాధించగా ఆర్జేడీ 67.9 లక్షలు, జేడీయు 62లక్షలు, కాంగ్రెస్ 25 లక్షల ఓట్లు సాధించాయి. బీజేపీ 24.8%, ఆర్జేడీ 18.5%, జేడీయూ 16.7 %, కాంగ్రెస్6.7% ఓట్లు సాధించాయి. ఏ రాష్ర్టంలోనైనా అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంటు ఎన్నికలను ఒకే గాటన కట్టడానికి వీల్లేదు. ఈరెండింటినీ జనం వేర్వేరుగానే భావిస్తారు. బిహార్ ఫలితాలు అసహనానికి చెంపపెట్టు అని, ఉదారవాదానికి జేజేలు పలికారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కూటముల అమరికే ఫలితాలను ప్రభావితం చేసిన ప్రధానాంశం. దాంతోపాటు సామాజిక వర్గాల పొందిక, స్థానిక సమస్యల ప్రాతిపదికన కూడా మహాకూటమిలోని పార్టీలు తమ ఓట్లను తాము కాపాడుకోగలిగాయి. -
ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం..
జాతీయ స్థాయిలో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొంటాం నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌ల ప్రతిన పది జన్మలైనా కలిసే ఉంటామన్న లాలూ అన్ని వర్గాల మద్దతుతోనే ఈ విజయం సానుకూల దృక్పథంతో బిహార్ అభివృద్ధికి కృషి చేస్తా: నితీశ్ విభజన శక్తులను బిహార్ ప్రజలు తరిమికొట్టారు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తా: లాలూ పట్నా: బీజేపీకి సమర్థవంతమైన ప్రతిపక్షంగా, జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతామని మహా కూటమి నేతలు నితీశ్ కుమార్(జేడీయూ), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ) స్పష్టం చేశారు. బిహార్‌లో ఘన విజయం ఖాయమని తేలడంతో వారిరువురు ఆదివారం సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంగా నితీశ్ కుమారే కొనసాగుతారని లాలూ ప్రసాద్ విస్పష్టంగా ప్రకటించారు. సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలను బిహార్ ప్రజలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని నితీశ్ పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న అభిప్రాయాన్ని ఈ ఫలితాలు ప్రతిఫలించాయన్నారు. బీజేపీయేతర పార్టీలు ఇందుకు కలసిరావాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, అందులో భాగంగా దేశమంతా పర్యటిస్తానని లాలూ ప్రసాద్ ప్రకటించారు. మతవాద శక్తులను తరిమికొట్టేందుకు రైతులు, కూలీలు, అణగారిన వర్గాలతో మమేకమవుతానన్నారు. ‘బీజేపీ చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. బిహార్ ప్రజలు చాలా పరిణతితో ఓట్లేశారు. దళితులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు. వారికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని నితీశ్ హామీ ఇచ్చారు. తనకెవరిపైనా కక్ష లేదని, సానుకూల దృక్పథంతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ సహా తనకందరూ శుభాకాంక్షలు తెలిపారని, బిహార్ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని నితీశ్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలపై బిహార్ ఫలితాల ప్రభావం చాన్నాళ్ల పాటు ఉంటుందని లాలూ ప్రసాద్ విశ్లేషించారు. ‘ఇది ఏ ఒక్క పార్టీ విజయమో కాదు. ఇది మహా కూటమి సంయుక్తంగా సాధించిన విజయం. మా మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అది విఫలయత్నమే అవుతుంది. కనీసం మరో పది జన్మల పాటు మేం కలిసే ఉంటాం’ అని తనదైన శైలిలో లాలూ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం, ఆరెస్సెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే.ఈ లాంతరు(ఆర్జేడీ ఎన్నికల చిహ్నం)తో దేశమంతా తిరుగుతాను. వారణాసి(మోదీ నియోజకవర్గం) కూడా వెళ్తాన’న్నారు. మత సహనంపై మోదీకి అమెరికా అధ్యక్షుడు సలహా ఇవ్వడాన్ని లాలూ ప్రస్తావించారు. -
‘జనతా’ బ్రదర్స్ జయభేరి
బిహార్ ఎన్నికల్లో ‘మహా’ విజయం 178 స్థానాలు కైవసం.. మూడింట రెండొంతుల మెజారిటీ ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాల్లో జయకేతనం కేవలం 58 స్థానాల్లో గెలుపుతో చతికిలపడిన ఎన్డీయే బీజేపీకి 53, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీకి చెరో రెండు సీట్లు 21 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెల్చుకున్న మాంఝీ పార్టీ మూడోసారి బిహార్ సీఎం పీఠం అధిష్టించనున్న నితీశ్‌కుమార్ బిహార్ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. మోదీ, నితీశ్‌ల హోరాహోరీ పోరులో బాహరీ (బయటివాడు)ని కాదని.. బిహారీకే పట్టం కట్టారు. మోదీ చరిష్మాను పక్కనబెట్టి నితీశ్ ఇమేజ్‌కే ఓటేశారు. ముచ్చటగా మూడోసారి నితీశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమికి తిరుగులేని మెజారిటీనిచ్చారు. కూటమి నేతలు సైతం ఊహించని స్థాయిలో మూడింట రెండొంతుల స్పష్టమైన మెజారిటీని వారికి అందించారు. ముఖ్యంగా ‘జనతా’ సోదరులు నితీశ్(జేడీయూ), లాలూ ప్రసాద్(ఆర్జేడీ)లకు ఓట్ల హారతి పట్టారు. పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు గానూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమి 178 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 58 స్థానాలకే పరిమితమైంది. మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 80 స్థానాల్లో, జనతాదళ్(యునెటైడ్) 71 సీట్లలో, కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించాయి. ఆర్జేడీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీయే తరఫున బీజేపీ అత్యధికంగా 53 సీట్లు గెలుచుకోగా, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ చెరో రెండు స్థానాల్లో గెలుపొందాయి. మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఎన్డీయే నుంచి బీజేపీ 159 సీట్లలో పోటీ చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, పప్పూయాదవ్‌కు చెందిన జనాధికార పార్టీ ఖాతా తెరవలేకపోయాయి. సీపీఐ(ఎంఎల్) 3, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. నితీశ్‌కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కూటమి సారధిగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. 2010 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, జేడీయూలు 206 స్థానాల్లో విజయం సాధించాయి. అందులో జేడీయూ 115, బీజేపీ 91 సీట్లు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆర్జేడీ 22 సీట్లలో, కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో గెలుపొందాయి. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన జేడీయూ, ఆర్జేడీలు అనూహ్యంగా, అతితక్కువ సమయంలోనే తేరుకోవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 40 స్థానాలకు గానూ 31 స్థానాలు గెలుచుకుంది. బిహార్ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని విజయానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు వెల్లడించారు. విభజన శక్తుల కుట్రలను కాదని, అభివృద్ధి ఎజెండాకే బిహార్ ప్రజలు పట్టం కట్టారని నితీశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రకటించారు. మతవాద బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానని లాలూ ప్రసాద్ ప్రకటించారు. ఆ ఇద్దరూ ‘చేతు’లు కలిపితే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం బిహార్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు 10 సీట్లకు గానూ ఆరింటిలో విజయం సాధించడంతో.. మహా కూటమి ఏర్పాటుకు దారులు పడ్డాయి. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడమే మార్గమని భావించిన ఆ మూడు పార్టీలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కటై మహా కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడ్డాయి. మరోవైపు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు, అసహనంపై దేశవ్యాప్త ప్రచారం, మోదీ ‘డీఎన్ఏ’ కామెంట్ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించ గా.. నితీశ్ క్లీన్ ఇమేజ్, లాలూ కుల సమీకరణాలు కూటమి గెలుపునకు బాటలు వేశాయి. మోదీకి మరో ఎదురుదెబ్బ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. సుడిగాలి పర్యటనల్తో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రధాని చేయని రీతిలో దాదాపు 30కి పైగా సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. దాంతో ఈ ఓటమిని మోదీ వ్యక్తిగత పరాజయంగా ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించింది. తరువాత జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో పీడీపీతో కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించింది. ఆ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలయింది. మొత్తం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 స్థానాలు గెల్చుకోగా, బీజేపీ 3 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. అనంతరం ఈ ఎన్నికలు మోదీకి, బీజేపీకి ఊహించని స్థాయిలో ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఇది ఏ ఒక్క పార్టీ విజయమో కాదు. ఇది మహాకూటమి సంయుక్తంగా సాధించిన విజయం. మా మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అది విఫలయత్నమే అవుతుంది. కనీసం మరో పది జన్మల పాటు మేం కలిసే ఉంటాం. నరేంద్రమోదీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అందులో భాగంగా దేశమంతా పర్యటిస్తాం. బీజేపీయేతర పార్టీలు ఇందుకు కలసిరావాలి. - లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) బీజేపీ చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. బిహార్ ప్రజలు చాలా పరిణతితో ఓట్లేశారు. దళితులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు. వారికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. - నితీశ్‌కుమార్ (జేడీయూ) బిహార్ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తూ, ఓటమిని అంగీకరిస్తున్నాం. ఘనవిజయం సాధించిన నితీశ్, లాలూలకు అభినందనలు తెలియజేస్తున్నా. - అమిత్ షా (బీజేపీ) బిహార్‌లో మహాకూటమి గెలుపు... విద్వేషంపై ప్రేమ.. విభజనపై ఐక్యత.. అసహనంపై సహనం సాధించిన విజయం.. మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. - రాహుల్ గాంధీ (కాంగ్రెస్) -
'మహా' విజయం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మహా లౌకిక కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో మహా కూటమి 178 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని సాధించగా, ఎన్డీఏ కూటమి 58 సీట్లను దక్కించుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోరంగా విఫలమైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు. చివరకు ఆ పార్టీ నేతలే గెలుపుపై ధీమాగా ఉన్నా అతి పెద్ద విజయాన్ని మాత్రం ఊహించలేదు. బిహార్ ఎన్నికల అనంతరం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ తేలిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు బిహార్‌లో పాగా వేసి విజయం కోసం పావులు కదిపినా ఎటువంటి ప్రభావం కనిపించలేదు. నితీష్ అభివృద్ధి మంత్రానికే ప్రజలు పెద్దపీట వేసి మహా కూటమని గెలిపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ , ఆర్జేడీ నేత, లాలూ కుమారులు, తేజస్వివి, తేజ్ ప్రతాప్ యాదవ్, జేడీయూ నేతలు విజయ్ కుమార్ యాదవ్, శ్యామ్ రాజక్ లు గెలుపుబావుటా ఎగురవేశారు. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలు.. జేడీ(యూ) -178 ఎన్డీఏ కూటమి- 58 ఇతరులు-7