
సాక్షి, సిద్దిపేట : మహాకూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యిందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకే సీటు లేదని, రాత్రి ఇచ్చిన జనగామ సీటును తెల్లారి లేదనటం ఏంటన్నారు. మహాకూటమిని ఎటుకాకుండా చేశారన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకంలేదని, మహాకూటమిపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ను విషకౌగిలి, దృతరాష్ట కౌగిలిగా అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ దక్కుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో చేతులు కలిపిన వారి పరిస్థితి అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ సభలో చంద్రబాబు నాయుడు కూర్చుంటారా అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఇచ్చే నోట్ల కట్టలు కావాలి కానీ చంద్రబాబు కాదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment