![Thousands of Harish Rao Fans Congratulate To Him - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/15/Harish-Fans3.jpg.webp?itok=yJ9xUgs_)
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన ఈ టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలింది. వందలాది వాహనాల్లో వేలాదిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలిరావడంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్లు కిక్కిరిసాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ అయ్యాయి. అయితే టీఆర్‌ఎస్ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్) కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో హరీష్ అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఎన్నికల్లో వ్యూహకర్తగా హరీష్ రావు తన పావులు కదిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో.. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు. టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌గా వ్యూహాలు రచించడంలో తాను దిట్టా అని మరోసారి నిరూపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment