
సాక్షి, వర్థన్నపేట : మహాకూటమి గెలుపుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే నమ్మకం లేదని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వర్ధన్నపేటలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధని, కాంగ్రెస్, టీడీపీలవి మోసపూరిత వాగ్ధానాలని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణను తెచ్చుకున్నామని, రాష్ట్రంలో పరాయిపాలన అవసరమా? అని ప్రశ్నించారు.
ప్రజా కూటమి వస్తే రైతులకు కష్టాలేనన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని, వర్థన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment