
సాక్షి, హైదరాబాద్ : తెలుగు దేశం, తెలంగాణ జన సమితి పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్నాయి. మహాకూటమిలో భాగంగా తమ పార్టీ తరపున సీటు ఖరారైన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ-ఫారాలు ఇస్తున్నాయి. ఈ ఆదివారం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ 13 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. నందమూరి సుహాసిని తొలిసారి ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తాత ఎన్‌టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారామె.
ఇక తెలంగాణ జన సమితి సైతం ఎన్నిక చేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసింది. మహకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 4 స్థానాలు కేటాయించగా, టీజేఎస్ మాత్రం 7 నియోజవర్గాల అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. మెదక్, సిద్ధిపేట, దుబ్బాక, మల్యాజిగిరి, వరంగల్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు అధ్యక్షుడు కోదండరామ్ ఫారాలు అందజేశారు. కాగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట కూడా తమ అభ్యర్థికి టీజేఎస్ బీ-ఫారం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment