B forms
-
బీ ఫారాలు.. రూ. 95 లక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం, ఇతర వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఈ నెల 18న కీలక సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18న జరిగే సమావేశంలో వారికి బీ ఫారాలు అందజేస్తారు. ఎన్నికల ఖర్చుల కోసం ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి పార్టీ తరఫున ఒక్కో అభ్యరి్థకి రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేస్తారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరవుతారు. భేటీ అనంతరం పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆత్మస్థైర్యం పెంచేలా.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ప్రచారంలో లేవనెత్తాల్సిన అంశాలు, పార్టీ కేడర్‌తో సమన్వయం, ఓటు బ్యాంకును కాపాడుకోవడం తదితరాలపై సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామనే భావనతో ఉన్న ప్రజలకు మరింత చేరువయ్యేలా దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. వాగ్దానాల అమలులో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సీఎంగా కేసీఆర్ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా సూచనలు చేస్తారన్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను కూడా పార్టీ నేతలకు వివరించి వారిలో ఆత్మస్తైర్యం నూరిపోసేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే ఇప్పటికే చేవెళ్ల, అందోలులో ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఇటీవలి సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బస్సు యాత్రకు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని మరోమారు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 18న జరిగే భేటీలో కేసీఆర్ బస్సు యాత్ర, రూట్‌మ్యాప్‌పైనా చర్చించి షెడ్యూల్ ఖరారు చేస్తారు. -
RS Election: YSRCP అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు. సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ జగన్‌ను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం -
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీఫామ్‌లు మంటలు రేపుతున్నాయి. అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్వో కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నిరసన తెలిపారు. బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సంగారెడ్డి బీఫామ్‌ను పులిమామిడి రాజుకు బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. కాగా, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్‌రావుకు చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. ఇప్పటికే తుల ఉమ నామినేషన్ దాఖలు చేయగా, వికాష్‌రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
ప్రధాన పార్టీలోల్లో క్షణ క్షణం.. నిరీక్షణం
హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయడానికి ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. బీఫాం చేతికొచ్చేంత వరకు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాలుగు ప్రధాన పారీ్టల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికార బీఆర్ఎస్ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. నేటికీ వాటికి అభ్యర్థులనే ప్రకటించలేదు. టికెట్లు ప్రకటించిన వారిలో బీఫాంల పంపిణీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ, పాతబస్తీ పరిధిలోని చారి్మనార్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్ అభ్యర్థులకు ఇంతవరకు బీఫారాలను జారీ చేయలేదు. దాంతో బీఫాం చేతికందేంత వరకు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. ఇక గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం తేల్చకపోవడంతో ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి. ఎంఐఎంలో మూడు పెండింగ్ నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, బహదూర్‌పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోనూ రెండు కాంగ్రెస్ పార్టీ సైతం పాతబస్తీలోని చార్మినార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో కలిసి ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి అభ్యర్థని వెల్లడించలేదు. బీజేపీకి జనసేనతో కిరికిరి ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సైతం నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆపార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో దానికి ఏయే సీట్లు కేటాయిస్తారోనన్న టెన్షన్‌తో బీజేపీ ఆశావహులున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్‌తోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ∙జనసేన శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలను కోరుతున్నట్లు తెలిసి బీజేపీ శ్రేణులు గందరగోళంలో మునిగాయి. ఎట్టకేలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్‌ను జనసేనకు వెళ్లకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపులు ఫలించినట్లు సమాచారం. వివిధ కారణాలతో నగరంలోని నాలుగు ప్రధాన పారీ్టలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయోననే చర్చ జరుగుతోంది. -
ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో?
సాక్షి, జోగుళాంబ గద్వాల: అలంపూర్ రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు బీఫామ్ ఇంకా అందలేదు. చల్లా వర్గీయుడు విజేయుడు, ఎమ్మెల్యే అబ్రహం వేర్వేరుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. మరో వైపు,తన తనయుడు శ్రీనాథ్‌కు సీట్ ఇవ్వాలంటూ మంద జగన్నాథ్ పట్టుబడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అటు ఎమ్మెల్యే అబ్రహం, ఇటు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు శుక్రవారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బీఫాం విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని, తనకే వస్తుందని, మహిళలు, వృద్ధులు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, తనను ఆదరించాలని ఎమ్మెల్యే అబ్రహం కోరారు. ఈమేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు ఉండవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యర్థులకు తీసిపోనట్లుగా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది. చదవండి: ‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్! -
బీ-ఫాం అందుకున్న అరూరి,చల్లా
అరూరికి బీ–ఫాం అందజేత వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ బీ–ఫాం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమవారం హైదరాబాద్‌లో అందుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీ–ఫామ్ అందుకున్న ‘చల్లా’ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో సోమవారం పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి బీ–ఫామ్ అందుకున్నారు. తనపై నమ్మకంతో బీ–ఫామ్ అందించిన కేసీఆర్‌కు, సహకరించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అలంపూర్ మినహా..
మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఆదివారం బీఫారాలను స్వయంగా అందజేశారు. తొలి విడతలో మధ్యాహ్నం 51, రాత్రి 18 మందికి బీఫారాలను ఇవ్వగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క అలంపూర్ స్థానానికి మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫారాలను అందించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్‌ను ప్రకటించినా, ఇటీవల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయుల ఆందోళన నేపథ్యంలో సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి బీఫారాన్ని అందించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిగిలిన ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు లభించడంతో పాటు మేనిఫెస్టో ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జనం గుండెల్లో కేసీఆర్ సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారు పేరు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చినందుకే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. వరుసగా మూడోసారి సీఎం చేతులమీదుగా బీఫారం అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో ఈసారి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తా. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వచ్చే ఏడాదికి పాలమూరు ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాను. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు, కేసీఆర్ ఆరోగ్య రక్ష– ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళకు నెల రూ.3 వేల భృతితోపాటు రూ.400కే సిలిండర్ మేనిఫెస్టోలో పొందుపర్చదడం సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. -
51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్‌లు అందజేసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ‘‘మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎన్నికల కో ఆర్డినేటర్ భరత్ కుమార్‌కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈ రోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో వైపు, 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదని, మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయని కేసీఆర్ చెప్పినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ అన్ని స్థానాలకు బీఫామ్‌లు ఇస్తారని అంతా భావించారు.. కానీ 51 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే బీఫామ్‌లు ఇవ్వలేదని, ఆ స్థానాలను మార్చనున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో వారిలో టెన్షన్ నెలకొనగా.. వారు ఎవరనేది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..! -
TS Elections: నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించడంతో.. అధికార బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. అదే రోజు బీఫామ్స్‌ను అభ్యర్థులకు అందజేయడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాలుగు రోజుల పాటు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో ఈ టూర్ ఖరారైంది. 15వ తేదీ బీఫామ్స్ అందజేసి.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారు కేసీఆర్. అదే రోజు.. హుస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో, అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం జడ్చర్లలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇక.. నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డిలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు వేసి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నాం కామారెడ్డికి వెళ్లి మరో నామినేషన్ వేస్తారు. ఆపై అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న ఉండనుంది. ఫలితాలు 6న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల -
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
-
సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్.. అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా
-
సీఎం జగన్ చేతుల మీదగా బీఫాం అందుకున్న రుహుల్లా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫాం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్ పాల్గొన్నారు. చదవండి: సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి ఈ సందర్భంగా రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల క్రితం అమ్మ కరీమున్నీసా మరణించారని.. సీఎం వైఎస్ జగన్ పిలిపించి ఈ రోజు బీఫామ్ ఇచ్చారని తెలిపారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నానని పేర్కొన్నారు. మైనారిటీలంతా సీఎం జగన్‌కి రుణపడి ఉంటారన్నారు. మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బీఫాంలు అందజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పార్టీ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూమాటి మాధవరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరికి సీఎం జగన్ బీఫాంలు అందజేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. లేనిపక్షంలో అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. చదవండి: (ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), ఇసాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప) ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పాలవలస కుటుంబంలో మూడో తరం నేత ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. పేరు: పాలవలస విక్రాంత్ పుట్టిన తేదీ: 23–12–1971 చదువు: బీఈ తండ్రి: పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్ తల్లి: ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీ భార్య: గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీ పిల్లలు: సాయి గణేష్, మణికంఠ కార్తికేయ పదవులు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ రవాణా శాఖ అధికారిగా సేవలందించి.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. పేరు: దేవసాని చిన్న గోవిందరెడ్డి పుట్టినతేదీ: 23.02.1956 విద్యార్హత: ఎంటెక్, ఐఐటీ మద్రాస్ భార్య పేరు: తులసమ్మ కుమారులు: గోపీనాథ్‌రెడ్డి, ఆదిత్యానాథ్‌రెడ్డి కుమార్తె: డాక్టర్ సుష్మ, అల్లుడు రమేష్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి మైనార్టీ నేతగా.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేరు: ఇసాక్‌బాషా పుట్టిన తేదీ: 4–6–1962 చదువు: బీకాం తల్లిదండ్రులు: జాఫర్ హుస్సేన్, జహ్నాబీ భార్య: రహ్మద్ బీ (గృహిణి) పిల్లలు: ఫిరోజ్ బాషా, హర్షద్ పదవులు: గతంలో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. -
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
-
పెన్మత్స సురేష్‌బాబుకు బీఫాం అందజేత
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్‌బాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్‌బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌బాబును అభ్యర్థిగా దించారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. మీడియాతో సురేష్‌బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత త్వరగా టిక్కెట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఓదార్పు యాత్రతో పాటు ప్రతి కార్యక్రమంలో నాన్నగారితో కలిసి పాల్గొన్నాను.గత ఎన్నికల్లో వైఎస్ జగన్ నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను.అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉంటున్నాను. మా తండ్రి చేసిన సేవలకు గుర్తించి తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని ’’ సురేష్‌బాబు తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాల జారీ
-
టికెట్ కలిపింది ఇద్దరినీ...
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు. ఇదే విషయమై లక్ష్మణ్‌ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు. -
డీసీసీలకు ఏ-ఫారంలు అందజేసిన టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు నగరా మోగిన వేళ.. కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మల్లు భట్టివిక్రమార్క, జనారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, దామోదర్ రాజనర్సింహలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 మంది డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ ఏ-ఫారంలు అందజేసింది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేసే బాధ్యతను డీసీసీలకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో బరిలో నిలిచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పగించింది. అలాగే బి-ఫారమ్ పొందిన అభ్యర్థి 20 రూపాయల ప్రమాణ పత్రం ఇచ్చేలా ఒక ఆఫిడవిట్ రూపొందించి డీసీసీలకు అందజేసింది. కాగా, వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో మూడు దశల్లో 32 జిల్లాల పరిధిలోని 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు విడతల ఎన్నికల ఫలితాలను ఒకేసారి మే 27న ప్రకటించనున్నారు. -
బీఫారం పోయింది... దొరికింది
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పార్లమెంట్‌కు పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి చెందిన బీఫారం, ఇతర సర్టిఫికెట్లు పోవడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతం లో వేమిరెడ్డి మేనేజర్ వెంకటేశ్వర్రావు కాచిగూడ నుంచి బైకుపై బయల్దేరాడు. కాచిగూడ చౌరస్తా వద్దకు రాగానే బైకు వెనకవైపు తగిలించిన సంచి జారిపడిపోయింది. వెనుకనే మరో బైకుపై వస్తున్న హోంగార్డు ముని వెంకటరమణ ఇది గమనించాడు. ఆ సంచిని వెంకటేశ్వర్రావుకు ఇచ్చేందుకు యత్నించినా వీలు కాలేదు. డీజీపీ ఆఫీసులో పనిచేసే ముని వెంకటరమణ కార్యాలయానికి వెళ్లాక ఆ సంచీని తెరి చి చూడగా.. అందులో వేమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన బీఫారం (నకలు), నామినేషన్లకు సంబంధించిన పత్రాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఉన్నాయి. అందులో ఆధార్ కార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కాల్ రిసీవ్ చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మేనేజర్‌కి డీజీపీ ఆఫీసుకు వెళ్లా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన మేనేజర్ వివరాలు ధ్రువీకరించుకున్నాక మునివెంకటరమణ ఆ ఫైల్‌ను అడ్మిన్ ఆర్ఐ జంగయ్య సమక్షంలో అతనికి అందజేశాడు. నిజాయితీగా డాక్యుమెంట్లను ఇచ్చిన హోంగార్డును ఉన్నతాధికారులు అభినందించారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ‘బి’ ఫామ్‌లు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ‘బి’ ఫామ్‌ల (అభ్యర్థిత్వాలను అధీకృతం చేసే పత్రాలు) పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ చేపట్టింది. 25 లోక్‌సభ, 175 శాసనసభ అభ్యర్థుల ‘బి’ ఫామ్‌లపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే సంతకాలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ సమన్వయకర్తలకు పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్రత్యేక సహాయకుల ద్వారా పంపుతున్నారు. కొందరు అభ్యర్థులు తామే స్వయంగా తీసుకువెళ్లనున్నారు. నామినేషన్ల గడువు ముగియడానికి బాగా ముందుగానే ‘బి’ ఫామ్‌లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా పార్టీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధాన క్యాంపెయినర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలతో పాటు పార్టీకి ఆకర్షణగా నిలిచే మరికొందరితో ఈ జాబితాను రూపొందించనున్నారు. ఈ నెల 17 నుంచి రోజుకు మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ జగన్ ప్రచార వేడిని రాజేశారు. ఈ నెల 25 తర్వాత రోజుకు నాలుగు సభల్లో ప్రసంగించడం ద్వారా మరింత ఊపు తీసుకురానున్నారు. విజయమ్మ, షర్మిల ఈ నెల 27 నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.