బీఫాం అందుకుంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవనున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఆదివారం బీఫారాలను స్వయంగా అందజేశారు. తొలి విడతలో మధ్యాహ్నం 51, రాత్రి 18 మందికి బీఫారాలను ఇవ్వగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క అలంపూర్ స్థానానికి మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫారాలను అందించారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్‌ను ప్రకటించినా, ఇటీవల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయుల ఆందోళన నేపథ్యంలో సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి బీఫారాన్ని అందించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిగిలిన ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు లభించడంతో పాటు మేనిఫెస్టో ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
జనం గుండెల్లో కేసీఆర్
సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారు పేరు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చినందుకే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. వరుసగా మూడోసారి సీఎం చేతులమీదుగా బీఫారం అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో ఈసారి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తా.
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వచ్చే ఏడాదికి పాలమూరు ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాను. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు, కేసీఆర్ ఆరోగ్య రక్ష– ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళకు నెల రూ.3 వేల భృతితోపాటు రూ.400కే సిలిండర్ మేనిఫెస్టోలో పొందుపర్చదడం సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment