Telangana News: TS Elections 2023: అభ్యర్థుల ఆస్తులు – అప్పులు.. ఇంకా..!
Sakshi News home page

TS Elections 2023: అభ్యర్థుల ఆస్తులు – అప్పులు.. ఇంకా..!

Published Sat, Nov 11 2023 1:28 AM | Last Updated on Sat, Nov 11 2023 11:24 AM

- - Sakshi

ఎన్నికల నామినేషన్‌లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లలో తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల చేతిలో నగదు అంతంతమాత్రంగా ఉంది. కొందరు అభ్యర్థులతో సమానంగా వారి సతీమణుల పేరుపై చర, స్థిరాస్తులు ఉన్నాయి. కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావులకు స్వంత ఇల్లు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

శ్రీనివాస్‌గౌడ్‌​‍: మహబూబ్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పులు రూ.44,776 ఉన్నాయి. చరాస్తులు రూ.1,14,15,781, స్థిరాస్తులు రూ.51,55,000, చేతిలో నగదు రూ.19,31,480 ఉండగా.. ఆయన సతీమణి శారద పేరుపై చరాస్తులు రూ.2,82,36,165, స్థిరాస్తులు రూ.2,42,43,085, నగదు రూ.53,743, అప్పులు రూ.3,02,72,101 ఉన్నాయి. 2018లో శ్రీనివాస్‌గౌడ్‌ చరాస్తులు రూ.71,94,203, స్థిరాస్తులు రూ.15,46,100 ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,50,000 ఉండగా, అప్పులు లేవు. శారద పేరు మీద చరాస్తులు రూ.2,16,55,711, స్థిరాస్తి రూ.37,47,826లతో కొనుగోలు చేయగా.. స్థిరాస్తుల విలువ రూ.96,00,000, నగదు రూ.1,00,000 అప్పులు రూ.35,29,285 ఉన్నాయి.

లక్ష్మారెడ్డి: జడ్చర్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
బీఆర్‌ఎస్‌ జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డికి రూ.2,54,20,385 విలువగల చరాస్తులు, రూ.4,58,43,750 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,50,000, బంగారం 1,041 గ్రాములు, వ్యవసాయ భూమి 20.20 ఎకరాలు ఉంది. రూ.1,03,62,926 అప్పులు ఉన్నాయి. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత పేరు మీద రూ.14,09,19,271 విలువజేసే చరాస్తులు ఉన్నాయి. రూ.11,40,00,000 విలువగల స్థిరాస్తులతో పాటు చేతిలో నగదు రూ.5లక్షలు, బంగారం 4,053 గ్రాములు, 12.37 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. రూ.14,09,19,271 అప్పులు ఉన్నాయి.
 

జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి: జడ్చర్ల కాంగ్రెస్‌ అభ్యర్థి 
కాంగ్రెస్‌ జడ్చర్ల అభ్యర్థి జనుంపల్లి అనిరు«ద్‌రెడ్డికి రూ.51,32,392 విలువజేసే చరాస్తులు, రూ.1,93,25,948 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.33,450 ఉండగా, అప్పులు రూ.9,96,29,800 ఉన్నాయి. 53 ఎకరాల వ్యవసాయ భూమి, ఉంది. 5 పోలీస్‌ కేసులు ఉన్నాయి. అతడి సతీమణి మంజూష పేరు మీద రూ.11,47,34,486 విలువగల చరాస్తులు, రూ.6,64,10,653 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.21,595, బంగారం 1,215 గ్రాములు 18ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.


బీరం హర్షవర్ధన్‌రెడ్డి: కొల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
బీఆర్‌ఎస్‌ కొల్లాపూర్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి రూ.5,75,00,000 విలువజేసే స్థిరాస్తులతోపాటు రూ.3,84,21,944 విలువైన చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,00,000 ఉండగా, రూ.2,57,81,684 అప్పు ఉంది. మూడు కార్లు ఉన్నాయి. బంగారం 370 గ్రాములు, సింగోటం, ఎత్తం గ్రామాల్లో భూములు ఉన్నాయి.కొల్లాపూర్, బంజారాహిల్స్‌లో నివాసగృహాలు, వనపర్తిలో కమర్షియల్‌ భవనం ఉంది. ఆయన భార్య విజయ పేరు మీద రూ.1,72,000 విలువజేసే స్థిరాస్తులు, రూ.61,45,944 విలువగల చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.1,40,000, బంగారం 650 గ్రాములు, రూ.47,98,339 అప్పు ఉంది. 


యెన్నం శ్రీనివాస్‌రెడ్డి: మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి 
కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి రూ.1,18,42,292 విలువగల చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు రూ.1,48,00,000 విలువగలవి ఉండగా, చేతిలో నగదు రూ.2,00,000 ఉంది. రూ.24,69,314 అప్పులు ఉన్నాయి. ఆయన భార్య తూము ప్రసన్న పేరు మీద రూ.1,22,10,908 విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ.9,31,000లతో స్థిరాస్తి కొనుగోలు చేశారు. స్థిరాస్తుల విలువ రూ.96,00,000లుగా ఉంది. చేతిలో నగదు రూ.1,50,000 ఉండగా, రూ.6,47,869 అప్పులు ఉన్నాయి. 
నిరంజన్‌రెడ్డి: వనపర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
బీఆర్‌ఎస్‌ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2018 ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.1.64కోట్లు కాగా.. 2023లో మొత్తం ఆస్తుల విలువ రూ. 5.10కోట్లకు చేరింది.  రూ.1.08కోట్ల విలువజేసే చరాస్తులతో పాటు రూ.4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.06 కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య వాసంతి పేరుపై  రూ. 2.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి.


బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి: గద్వాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
బీఆర్‌ఎస్‌ గద్వాల అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై రెండు కేసులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2లక్షలు ఉండగా, రూ.4,11,56,750 విలువజేసే స్థిరాస్తులు,  రూ.8,20,7464.43 విలువగల చరాస్తులు ఉన్నాయి. రూ.1,82,20,722 అప్పు ఉంది. ఆయన భార్య జ్యోతి చేతిలో రూ.2లక్షల నగదు ఉండగా, రూ.4,19,10,500 విలువజేసే స్థిరాస్తులు,  రూ.49,48,855 విలువైన చరాస్తులు ఉన్నాయి. కుమారుడు సాకేత్‌రెడ్డి పేరుపై రూ.60వేల విలువైన స్థిరాస్తులతో పాటు రూ.60,904 విలువైన చరాస్తులు ఉన్నాయి.

చిక్కడు వంశీకృష్ణ: అచ్చంపేట కాంగ్రెస్‌ అభ్యర్థి 
కాంగ్రెస్‌ అచ్చంపేట అభ్యర్థి చిక్కడు వంశీకృష్ణకు రూ.76,09,198 విలువజేసే చరాస్తులతో పాటు  రూ.1,88,39,500 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. పూరి్వకుల ఆస్తి రూ.18,39,500 ఉండగా,  రూ. 2,36,53,825 అప్పు ఉంది. ఆయన భార్య అనురాధ పేరు మీద రూ.72,59,608 విలువజేసే చరాస్తులతో పాటు రూ.2,23,05,625 విలువజేసే స్థిరాస్తులు ఉ న్నాయి. పూరి్వకుల ఆస్తి రూ.3,65,625 ఉండగా, రూ. 2,12,33,502 అప్పు ఉంది. కుమారుడు యశ్వంత్‌ పే రుపై రూ.4,60,947 విలువైన చరాస్తులు ఉండగా, కూ తురు యుక్తాముఖి పేరుపై రూ. 39,26,616 విలువజే సే చరాస్తులు ఉన్నాయి. రూ.2.75లక్షల అప్పు ఉంది. 

బోయ శివారెడ్డి: గద్వాల బీజేపీ అభ్యర్థి 
బీజేపీ గద్వాల అభ్యర్థి బోయ శివారెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. రూ.22.50లక్షల విలువజేసే స్థిరాస్తులు ఉండగా, చేతిలో నగదు రూ.5లక్షలు ఉన్నాయి. రూ.90,386 అప్పు ఉంది. ఆయన భార్య జానకమ్మ పేరుపై రూ.23.41లక్షల విలువజేసే స్థిరాస్తులతో పాటు రూ.5లక్షల నగదు ఉంది.

నిరంజన్‌రెడ్డి: వనపర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  
బీఆర్‌ఎస్‌ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2018 ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.1.64కోట్లు కాగా.. 2023లో మొత్తం ఆస్తుల విలువ రూ. 5.10కోట్లకు చేరింది.  రూ.1.08కోట్ల విలువజేసే చరాస్తులతో పాటు రూ.4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.06 కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య వాసంతి పేరుపై  రూ. 2.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి.  


జూపల్లి కృష్ణారావు: కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి  
కాంగ్రెస్‌ కొల్లాపూర్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు స్వంత ఇల్లు లేదు. చౌటబెట్ల శివారులో నూతనంగా ఇంటి నిర్మాణం సాగుతోంది. జూపల్లికి రూ.2,50,36,336 విలువగల స్థిరాస్తులతో పాటు రూ.29,70,049  చరాస్తులు ఉన్నాయి. చేతలో నగదు రూ.4,80,100 ఉండగా, రూ.1,50,00,000 అప్పు ఉంది. బంగారం 10 గ్రాములు, ఒక కారు ఉన్నాయి. చిన్నంబావి, పెద్దకొత్తపల్లి, సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయి. పెద్దదగడ, చౌటబెట్ల శివార్లలో భూములు ఉన్నాయి. ఆయన భార్య సృజన పేరు మీద స్థిరాస్తులు లేవు. రూ.38,82,786 విలువగల చరాస్తులతో పాటు చేతిలో నగదు రూ.52,540, బంగారం 450 గ్రాములు,  వెండి 3.5 కేజీలు ఉంది.  

ఎల్లేని సుధాకర్‌రావు: కొల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి 
బీజేపీ కొల్లాపూర్‌ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు స్వంత ఇల్లు లేదు. మహాసముద్రం, గగ్గలపల్లి, ఇబ్రహీంపట్నంలో భూములు ఉన్నాయి. పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, పాన్‌గల్, కొల్లాపూర్, చైతన్యపురి, నాగర్‌కర్నూల్, శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రూ.1,19,20,000 విలువజేసే స్థిరాస్తులతో పాటు రూ.16,98,326 విలువజేసే చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.1,00,000 ఉంది. ఆయన భార్య భార్య భారతి పేరు మీద రూ.1,64,40,000 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. రూ.4,16,29,464 విలువజేసే చరాస్తులతో పాటు చేతిలో నగదు: రూ.50,000, ఒక కారు, 70 తులాల బంగారం ఉంది.  

ఎపి.మిథున్‌కుమార్‌రెడ్డి :మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి 
బీజేపీ మహబూబ్‌నగర్‌ అభ్యర్థి ఎపి.మిథున్‌కుమార్‌రెడ్డికి చరాస్తులు లేవు. రూ.16,35,76,683 విలువజేసే   స్థిరాస్తులు  ఉన్నాయి. చేతిలో నగదు రూ.80,000 ఉండగా, రూ.38, 78,000 అప్పులు ఉన్నాయి. మిథున్‌కుమార్‌రెడ్డి సతీమణి రిషిక పేరు మీద చరాస్తులు, స్థిరాస్తులు లేవు. చేతిలో రూ.95వేల నగదు మాత్రమే ఉంది.  

చిట్టెం రామ్మోహన్‌రెడ్డి: మక్తల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 
బీఆర్‌ఎస్‌ మక్తల్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి రూ.98,30,000 చరాస్తులతో పాటు రూ.57,35,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మూడు వాహనాలు ఉండగా, రూ.9లక్షల అప్పు ఉంది. ఆయన సతీమణి సుచరిత పేరు మీద రూ.కోటి 31లక్షల విలువైన చరాస్తులతో పాటు  రూ.89లక్షల విలువజేసే స్థిరాస్తులు, రూ.6లక్షల అప్పు ఉంది. రెండు కార్లు ఉన్నాయి.  

గువ్వల బాలరాజు: అచ్చంపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 
బీఆర్‌ఎస్‌ అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుకు రూ.2,70,54,162 విలువజేసే చరాస్తులతో పాటు  రూ.7,20,17,187 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. అప్పు రూ.2,69,73,180 ఉంది. గువ్వల భార్య అమల పేరు మీద రూ.69,06,711 విలువజేసే చరాస్తులతో పాటు రూ.53,07,813 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.2,31,29,600 అప్పు ఉంది.  

సరిత: గద్వాల కాంగ్రెస్‌ అభ్యర్థి 
కాంగ్రెస్‌ గద్వాల అభ్యర్థి సరితకు రూ.45,45,487 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బంగారం విలువ రూ.35లక్షల వరకు ఉంటుంది. చేతిలో రూ.2లక్షల నగదు ఉంది. రూ.5కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 60 తులాలు బంగారం ఉంది.  

సతీష్‌ మాదిగ:అచ్చంపేట బీజేపీ అభ్యర్థి
బీజేపీ అచ్చంపేట అభ్యర్థి సతీష్‌మాదిగకు రూ.10.10లక్షలు, ఆయన భార్య సుగుణ పేరుపై రూ.3లక్షల విలువజేసే చరాస్తులు ఉన్నాయి.  

తూడి మేఘారెడ్డి: వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి 
కాంగ్రెస్‌ వనపర్తి అభ్యర్థి తూడి మేఘారెడ్డి మొత్తం ఆస్తులు విలువ రూ.10.90 కోట్లు కాగా.. అందులో రూ.2.37కోట్ల విలువైన చరాస్తులు, రూ.8.53కోట్ల విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.41కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య తూడి శారద పేరుపై రూ.7.24 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. రూ. 1.98 కోట్ల అప్పు ఉంది.  

అనూజ్ఞరెడ్డి: వనపర్తి బీజేపీ అభ్యర్థి 
బీజేపీ వనపర్తి అభ్యర్థి అనూజ్ఞరెడ్డికి రూ. 2.37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.1.18 కోట్ల చరాస్తులు కాగా, రూ.1.20కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.93లక్షల అప్పు ఉంది.  స్వాతిరెడ్డి పేరుపై రూ.11.08లక్షల విలువజేసే చరాస్తులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement