
అరూరికి బీ–ఫాం అందజేత
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ బీ–ఫాం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమవారం హైదరాబాద్‌లో అందుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
బీ–ఫామ్ అందుకున్న ‘చల్లా’
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో సోమవారం పరకాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి బీ–ఫామ్ అందుకున్నారు. తనపై నమ్మకంతో బీ–ఫామ్ అందించిన కేసీఆర్‌కు, సహకరించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment