ప్రధాన వార్తలు

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ఆదివారం ( జులై20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరపున పోరాడే వారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు . వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వపు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్ని అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2025 లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే. చంద్రబాబు తన హయాంలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు తన 2014-19 కాలంలో మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారు. దానికి సంబంధించి ఆధారాలతో సహా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయించేందుకు, ఇప్పటి పాలసీని సమర్ధించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూనే మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం తన గత హయాంలోని అవినీతి పద్ధతులను పునః ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు,పర్మిట్ రూమ్‌లు వెలిశాయి.మా హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేయించాం. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఆ చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. మద్యం మాఫియా రంగంలోకి దిగిందివైన్ షాపులకు లైసెన్స్ మంజూరు విషయంలో మాఫియాదే పైచేయి అయింది. మా హయాంలో పారదర్శకంగా జరిగిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నారు.చంద్రబాబు మద్యం స్కాంతో సహా అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన మీద ఉన్న కేసుల దర్యాప్తును నిలిపివేశారు. ఆ విషయాల నుండి దృష్టి మళ్ళించడానికి మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.వైఎస్సార్సీపీని ఎవరూ ఏమీ చేయలేరు చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది.అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి, జైలుపాలు చేయటానికే సిట్‌ని ఏర్పాటు చేశారు.కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలోనే తేలుతుంది. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు చట్టం ముందు ఇది ఎంతమాత్రం నిలబడదు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్సార్సీపీని ఎవరూ ఏమీ చేయలేరు.ప్రజా గొంతుకగా వైఎస్సార్సీపీప్రజల గుండెల్లో వైఎస్సార్సీపీ బలంగా పాతుకుపోయింది. ప్రతిపక్షంగా వున్న పార్టీని అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలు నిలబడవు. వైఎస్సార్సీపీని అణచివేయాలనుకున్న ప్రతిసారీ మేము ధైర్యంగా నిలబడ్డాం. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకగా నిలబడతాం. ఈ అన్యాయాన్ని ఎదుర్కుంటూ వైఎస్సార్సీపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది’ అని స్పష్టం చేశారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం.

నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం
కర్ణాటక సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను మార్చే అవకాశం ఉందని, ఆ స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమైందంటూ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య కానీ, డీకే శివ కుమార్ కానీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే నిన్న (శనివారం, జూలై 19వ తేదీన) మైసూర్ జిల్లాలో జరిగిన పార్టీ ఈవెంట్లో ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సీఎం సిద్ధరామయ్య బహిరంగంగానే వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేరును పేర్కొనాలనే సూచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను కీర్తించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సాధన సమావేశం’లో సీఎం సిద్ధరామయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు,. అయితే అత్యవసరంగా ఆయన బెంగళూరు బయల్దేరాల్సి ఉండటంతో వేదిక పైనుంచి ఉన్నపళంగా వెళ్లిపోయారు. అయితే సిద్ధరామయ్య ప్రసంగానికి సిద్ధమైన క్రమంలో పార్టీ ముఖ్యులను పరిచయం చేసే క్రమంలో డీకే పేరు ప్రస్తావించలేదు. అయితే డీకే, డీకే, డీకే అంటూ సభకు వచ్చిన జనం నుంచి స్పందన వచ్చింది. దీనిపై సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో డీకే పేరును మరిచిపోయారనే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు చెందిన ఒక న్యాయవాది.. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యకు కోపం మరింత ఎక్కువవైంది. ‘ డీకే శివకుమార్ ఇక్కడ లేరు.. అవునా.. కాదా.. దయచేసి మీరు వెళ్లి కూర్చోండి. మీరు ఏ తరహా న్యాయవాది’ అంటూ కాస్త స్వరం పెంచి మరీ సిద్ధరామయ్య అనడంతో ఇది పార్టీలోని, ప్రభుత్వంలో అంతర్గత లుకలుకల్ని బయటపెట్టింది.

‘అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు’
గుంటూరు: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, జూలై 20) గుంటూరు నుంచి మాట్లాడిన అంబటి.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. ‘తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయం. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు. రాష్ట్ర అభివృద్ధి, తమకు సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారు. చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ ఆ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వలన వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధంఅసలు మద్యం కేసులో మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?, ఎల్లోమీడియా రాసిందే పోలీసులు ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో రాస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే స్కాంలో నుండి పుట్టాడు. డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటఙ, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ మలినాలను తొలగిస్తానంటూ కబుర్లు చెప్తున్నారు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు’ అని అంబటి స్పష్టం చేశారు.

చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుబ్‌మన్ గిల్..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.ఇప్పుడు మాంచెస్టర్‌లో శుబ్‌మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. అనంతరం బర్మింగ్‌హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లుమహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులుశుభ్మన్ గిల్ (భారత్) - 2025లో 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులురాహుల్ ద్రవిడ్ (భారత్) - 2002లో 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 2018లో 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులుసునీల్ గవాస్కర్ (భారత్) - 1979లో 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులుసలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 1992లో 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులుగిల్కు కఠిన పరీక్ష..కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై

ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపు
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపుఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు: సజ్జల తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసుఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారులిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగిందిఏడాదికి రూ. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారుతన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ మీద బయట ఉన్నాడు ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారుమిథున్ రెడ్డి రిమాండ్ పై ముగిసిన వాదనలు మిథున్ రెడ్డి ECG హెల్త్ రిపోర్ట్స్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులువాటిని కోర్టుకు సమర్పించలేదని కోర్టుకు తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులువై క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కనుక సెంట్రల్ జైలుకి అనుమతివ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురాజమండ్రి లేదంటే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురిమాండ్ పై మరికొద్ది సేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తిజైల్లో కూడా వై క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరిన మిథున్ రెడ్డి న్యాయవాదులుస్పెషల్ బ్యారక్ కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుభద్రత ,హెల్త్,ములాఖత్ లకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు చేసిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుకొనసాగుతున్న వాదనలులిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలుమిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించనున్న ఇ.కోటేశ్వరరావుకోర్టుకు వచ్చిన వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,లేళ్ల అప్పిరెడ్డి,భరత్కోర్టు బయట పోలీసుల ఓవరాక్షన్.. న్యాయాధికారికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులుబార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకున్నారని ఫిర్యాదులిక్కర్ కేసులో ఏం తేల్చారు?: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందిఈ క్రమంలోనే నా తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందిఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారుగతంలోనూ మిథున్‌రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టారుమిథున్రెడ్డిపై పెట్టింది తప్పుడు కేసేలిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఏం తేల్చారుమా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారుతప్పు చేయలేదు కాబట్టి మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడురాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాతిరస్కారం తప్పదువిజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్ అధికారులుకోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులుకోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులుకోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులుపోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలులిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్రెడ్డికాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్అక్రమ కేసులకు జడిసేది లేదురాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారుఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమంలిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదులిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదువైఎస్సార్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు:::ఎమ్మెల్యే విరుపాక్షివిజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలుకోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులుఅడ్వకేట్లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులుపోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులుగేట్లు సైతం మూసేసిన పోలీసులుప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుకాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలుఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ శ్రేణుల అడ్డగింతవైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంలిక్కర్ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్సీపీజీజీహెచ్కు తరలించే ముందు సిట్ కార్యాలయం వద్ద మిథున్రెడ్డివాట్ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్!రిమాండ్ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్ స్కాంలో.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమద్యం స్కామ్.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025

మీ పాన్‌కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారేమో..
కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్ కార్డు వివరాలతో లోన్ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్. అవును ఫ్రాడే మరి. డౌట్‌గా ఉందా? మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండిమీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండిమీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.👉 ఇది చదివారా? ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవుఫేక్ లోన్ బయటపడితే ఏం చేయాలి?మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్‌కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..అసురక్షిత సైట్లు, యాప్‌లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌లలో మీ పాన్ కార్డు నంబర్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్ఎంఎస్/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి.

జగన్‌కు సన్నిహితుడనే నా తనయుడ్ని అరెస్ట్ చేశారు
చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని.. ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన. సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది. అసలు లిక్కర్ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు.

లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్‌తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?)

సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్‌పై చెలరేగిపోయారు. సమయం సందర్భం లేకుండా గంగవెర్రులెత్తిపోయారు ..ఏయ్ జగన్ అంటూ ఊగిపోయారు.అసలు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్లు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ నిలదీశారు... తన సినిమాలకు సంబంధించి అవసరమైతే ప్రజలకి ఫ్రీ షో చూపిస్తానని టికెట్ల ధరల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లేది లేదని డైలాగులు కొట్టారు.మొత్తానికి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు వచ్చింది. దాదాపు ఐదేళ్లు క్రితం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అపుడపుడూ షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి ఆమధ్య నిర్మాణం పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.. మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్‌లోని ఆర్థిక అవకాశవాది బయటకు వచ్చాడు.అవసరం అయితే తాను ఫ్రీగా సినిమా చూపిస్తాను అంటూ గతంలో కొట్టిన డైలాగులు కొండెక్కించిన పవన్ ఇప్పుడు వ్యాపారి రూపంలోకి వచ్చారు. నిర్మాత ఏఎం రత్నం నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ ఆయనకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ల ధరలు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఈమేరకు టికెట్ ధరలు పెరిగాయి.ఇందులో భాగంగాజూలై 23న వేసే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్,మల్టీఫ్లెక్స్ ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్‌లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. అవతలివాళ్లకు వచ్చేసరికి బోలెడు రూల్స్ మాట్లాడే పవన్ ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఆర్థికలాభం మాత్రమే చూసుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలకు. చేతలకు మధ్య చాలా తేడా ఉంటుందని మరోమారు స్పష్టమైంది* సిమ్మాదిరప్పన్న
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా 'నువ్వుంటే చాలే'
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైఎస్ జగన్
బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ రివీల్.. కమెడియన్‌తో సమంత
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’
‘అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు’
'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం
చిటికెలో సినిమా.. ఫోన్‌తోనే!
ఇరుకు దారులకు చురుకైన కారు..!
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
ఎలుక... ఎంత పని చేసింది!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా 'నువ్వుంటే చాలే'
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైఎస్ జగన్
బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ రివీల్.. కమెడియన్‌తో సమంత
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’
‘అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు’
'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం
చిటికెలో సినిమా.. ఫోన్‌తోనే!
ఇరుకు దారులకు చురుకైన కారు..!
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
ఎలుక... ఎంత పని చేసింది!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
సినిమా

యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో బాగుందనే టాక్ వస్తే తప్పితే కొత్త సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే ఇలా జరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ మేరకు ట్వీట్ చేయడంతో సదరు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)మిగతా చోట్ల ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు చాలా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కళ్లు చెదిరేలా ఉంటాయి. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్ కూడా తినుబండరాల ధరలు చూసి షాకయ్యాడు. తను కొన్న టికెట్ రేటు కంటే వీటికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ట్విటర్లో చెప్పుకొచ్చాడు. కనీసం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లేందుకైనా అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ కాస్త దృష్టి పెడితే బాగుంటుందని, అప్పుడే జనాలు థియేటర్లకు వస్తారని అన్నాడు.కొన్నిరోజుల ముందు నిర్మాత నాగవంశీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయమై తన అనుభవాన్ని బయటపెట్టారు. తలో రెండు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఏకంగా రూ.1000కి పైనే అయ్యాయని అన్నారు. దీంతో ఇప్పుడీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు.. జనాలు థియేటర్లకు రావట్లేదని తెగ బాధపడిపోతున్నారు. అయితే కంటెంట్ విషయంలో దృష్టి పెట్టడంతో పాటు వీటి రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే జనాలు కాస్తోకూస్తో రావడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే మాత్రం పూర్తిగా ఓటీటీలకు అలవాటు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?)

'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్ఏ' సినిమా తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల అయింది. ఒక్క యాక్సిడెంట్ కోట్ల మాఫియాకు ఎలా దారి తీసిందో ఈ సినిమాలో చూపించిన తీరు చాలా బాగుంది. ఆపై తెలుగులో థియేటర్లలోకి వచ్చిన ఒక్క రోజులోనే ఓటీటీలోకి వచ్చిన మూవీ కావడంతో భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది. జులై 18 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం జులై 19న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించాడు. సోషల్‌మీడియాలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటంటే..పుట్టిన బిడ్డ పురిటిలోనే చేతులు మారిపోతున్న సంఘటనలు నేటి సమాజంలో ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. ఇదే పాయింట్‌తో 'డీఎన్ఏ' కథను ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు నీల్సన్ వెంకటేశన్ విజయం సాధించారు. చెన్నై వీధుల్లో ఆనంద్ (అథర్వ) తాగేసి రోడ్లపై తిరుగుతుంటాడు. తను ప్రేయించిన అమ్మాయి శరణ్య (మానస చౌదరి) దూరం కావడంతో కుంగిపోయి ఉంటాడు. ఇదే వివషయంలో తండ్రీకొడుకుల మధ్య రోజూ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే, పెళ్లి చేస్తే జీవితంలో సెట్ అవుతాడని భావిస్తారు. ఈ క్రమంలో దివ్య (నిమిషా సజయన్)తో పెళ్లి చేస్తారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా కూడా ఆమెతో పెళ్లికి ఆనంద్ ఒప్పుకుంటాడు.ఆనంద్ అలా మారిపోవడం పట్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పెళ్లి చేస్తే దారిన పడతాడు అనే ఉద్దేశంతో, దివ్య (నిమిషా సజయన్) సంబంధాన్ని సెట్ చేస్తారు. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా, ఆమెతో పెళ్లికి ఆనంద్ అంగీకరిస్తాడు. వారి పెళ్లి జరిగిపోతుంది. కొంత కాలానికి దివ్య గర్భవతి అవుతుంది. ప్రముఖ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే, బాబును ఇంక్యుబేటర్‌లో పెట్టాలని వైద్యులు తీసుకెళ్తారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డను దివ్య చేతుల్లో పెట్టగానే, అది తన బిడ్డ కాదని దివ్య గొడవ చేస్తుంది. ఆమె మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంది కాబట్టి అలా చెబుతుందని అందరూ అనుకుంటారు. ఆమె మాటలు ఎవరు నమ్మరు. అయితే, దివ్య మాటలకు ఆనంద్ చుట్టూ గందరగోళం నెలకొంటుంది. దివ్య బాధను చూడలేక మరో ఆసుపత్రిలో బాబుకు డీఎన్ఏ టెస్ట్ చేపిస్తాడు. అక్కడ ఆ బిడ్డ కాదని తెలుస్తోంది. తమ బాబును ఎవరో కిడ్నాప్ చేశారని ఆనంద్ గుర్తిస్తాడు. అయితే, మరో బిడ్డను తమకు వదిలేసి ఎందుకు వెళ్లారని ఆనంద్‌కు అర్థం కాదు. దివ్య బిడ్డను ఎవరు తీసుకెళ్లారు..? పోలీసులతో కలిసి ఆనంద్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు..? తన బిడ్డను ఎలా పట్టుకున్నాడు..? వేరే బిడ్డను తమకు ఎందుకు ఇచ్చారు..? తెలియాలంటే ఎలా ఉందంటే..ఇదొక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, వాటికి భిన్నంగా డీఎన్ఏ కథను దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ చెప్పాడు. సినిమా ప్రారంభంలో ఆనంద్ జీవితాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడినప్పటికీ తన బిడ్డ మాయం అయిన క్షణం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. మద్యానికి బానిస అయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్‌కు ఆనంద్ వెళ్తాడు. అక్కడ అతనిలో వచ్చిన మార్పు వల్లనే మానసిక సమస్యతో బాధ పడుతున్న దివ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ సీన్లు మన అందరికీ కనెక్ట్ అవుతాయి. కథ ప్రారంభంలో ఆనంద్ బ్రేకప్ బాధలు, అమ్మాయి పెళ్లి కష్టాలు వంటి సీన్లు కొత్తగా ఏమీ అనిపించవు. అయితే, ఎస్సై చిన్నస్వామి సాయంతో తన బిడ్డ కోసం ఇన్వెస్టిగేషన్‌ను మొదలు పెడతాడు ఆనంద్.. ఈ క్రమంలో ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలను ఎలా కిడ్నాప్ చేస్తారు..? వారు ఏడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? వంటి సీన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇదే సమయంలో మూఢ విశ్వసాలతో పుట్టిన బిడ్డలను నరబలి ఇచ్చే ఆచారాలను కూడా దర్శకుడు చూపాడు. సినిమా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. ఇన్వ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..డీఎన్ఏ చిత్రంలో ఆనంద్‌గా అధర్వ మెప్పించాడు. దివ్య పాత్రలో నిమిష సజయన్ అద్భుతంగా నటించింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లలో అధర్వ మెప్పిస్తే.. బిడ్డను కోల్పోయిన తల్లిగా నిమిష నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. పార్తీబన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్లుగా ఉంటుంది. అయితే, ఫస్టాఫ్ లెంగ్త్ తగ్గిస్తే బావుండేది. ఇందులోని పాటలు బాగా మైనస్‌గా నిలుస్తాయి. సినిమా బాగా ఆసక్తిగా ఉన్నప్పుడు సడెన్‌గా వచ్చే పాటలతో చిరాకు తెప్పిస్తాయి. తమిళ్లో సుమారు నెల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో 'మై బేబీ'గా విడుదలైంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను డీఎన్ఏ మెప్పిస్తుంది.

'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?
రీసెంట్గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. 'జూనియర్' చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్)హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' రానుంది. ఇంతలోనే 'జూనియర్' కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)

నిర్మాత 'ఏఎం రత్నం'పై ఫిర్యాదు.. పాత బాకీలు చెల్లించండి
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు జులై 24న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక నోట్ విడుదలైంది. నిర్మాత ఏఎం రత్నం మీద రెండు వేర్వేరు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఫిర్యాదుల చేశాయి. ఈ మేరకు టీఎఫ్‌సీసీ ఒక నోట్ విడుదల చేసింది.ఏఎం రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి సంబంధించి రూ. 2.6 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏషియన్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. ఆపై ముద్దుల కొడుకు, బంగారం చిత్రాలకు సంబంధించి కూడా రూ.90 లక్షలు ఇవ్వాల్సి ఉందని మహాలక్ష్మీ ఫిల్మ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, నిర్మాతగా ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్‌కు ముందే తమ బాకీలు క్లియర్ చేయాలని ఆ సంస్థలు అభ్యర్థించాయి. ఈ విషంయలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు (నైజాం) సహకరించాలని కోరారు.#HHVM ఆక్సిజన్ సినిమా బకాయిల మీదఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ pic.twitter.com/FRN9ulQEJ6— devipriya (@sairaaj44) July 20, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ విధర్బ జట్టుతో తెగదింపులు చేసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్లో తిరిగి కర్ణాటక తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల కర్ణాటకకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా 2022లో కర్ణాటక జట్టులో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్.. తన మకాంను విధర్బకు మార్చాడు. ఈ క్రమంలో రెండు సీజన్ల( 2023, 2024) పాటు విధర్బకు నాయర్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజనల్లోనూ కరుణ్ అద్బుతంగా రాణించాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గత సీజన్లో రంజీ ఛాంపియన్‌గా విధర్బ నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి విదర్భను రన్నరప్‌గా నిలబెట్టాడు.ఈ ప్రదర్శనల కారణంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. నాయర్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. కానీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం నాయర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 6 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. కర్ణాటక సీనియర్ పేసర్ వాసుకి కౌశిక్ వచ్చే సీజన్లో గోవా తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమలో కౌశిక్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గోవా క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు

2007 వరల్డ్ కప్ సీన్ రిపీట్.. బౌల్ అవుట్లో గెలిచిన సౌతాఫ్రికా
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన బౌల్-అవుట్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోలేడు. టై అయిన మ్యాచ్‌లో బౌల్-అవుట్ నియమం ద్వారా భారత్ విజయం సాధించింది. ఇప్పడు అచ్చెం అటువంటి సీన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో రిపీటైంది.ఈ టోర్నీలో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రిస్ గేల్(2), పొలార్డ్(0) వంటి స్టార్ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్ సిమ్మన్స్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్, స్మట్స్, ఓలీవర్ తలా వికెట్ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్‌లు చేయగా.. విండీస్ ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్ క్రికెట్ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Bowl-Out Decides SA vs WI Thriller 🍿You can't write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac— FanCode (@FanCode) July 19, 2025

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు
మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్టు జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయపడగా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్ష్‌దీప్ చేతి వేలికి గాయమైంది. అర్ష్‌దీప్ కోలుకోవడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్‌కు తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు.దీంతో అతడు ఉన్నపళంగా భారత్ నుంచి లండన్‌కు బయలుదేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికారిక టెస్టుల్లో భారత-ఎ తరపున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్-2025 సీజన్లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్కే తరపున ఆడాడు. ఐపీఎల్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.చదవండి: WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!

WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను భారత ప్లేయర్లు బాయ్‌కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్షాట్లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ధావన్ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్‌లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
బిజినెస్

‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్‌బాట్‌కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్‌ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫామ్‌పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025

ఎలక్ట్రిక్ కార్ల జోరు.. రానున్న రోజులు ఈవీలవే..
కొత్త మోడల్స్ ఎంట్రీతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్ఎడ్జ్ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్ఎడ్జ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.దేశీయంగా 2022 క్యాలెండర్ ఇయర్లో 5,151గా ఉన్న పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఫోర్ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది.

అంచనాలు మించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ. 12,768 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 11,059 కోట్లతో పోలిస్తే సుమారు 15 శాతం పెరిగింది. ఇది సుమారు రూ. 11,747 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10.6 శాతం పెరిగి రూ. 19,553 కోట్ల నుంచి రూ. 21,635 కోట్లకు చేరింది. ఇది సుమారు రూ. 20,923 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.ట్రెజరీ కార్యకలాపాలు మినహా, ఇతరత్రా ఆదాయం 13.7 శాతం పెరిగి రూ. 7,264 కోట్లకు ఎగిసింది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.9 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో ఇది రూ. 11,696 కోట్లు. మొత్తం వడ్డీ ఆదాయం రూ. 38,996 కోట్ల నుంచి రూ. 42,947 కోట్లకు చేరింది. అసెట్స్ రూ.24,07,395 కోట్ల నుంచి రూ. 26,68,636 లక్షల కోట్లకు చేరాయి.తగ్గిన ఎన్పీఏలు..సమీక్షాకాలంలో బ్యాంక్ అసెట్ నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 2.15 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచి్చంది. నికర ఎన్పీఏ నిష్పత్తి 0.43 శాతం నుంచి 0.41 శాతానికి గ్గింది. నికర వడ్డీ మార్జిన్ 4.41 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గింది. అయితే, ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో రూ. 1,332 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ రూ. 1,815 కోట్లకు ఎగిసింది. బ్యాంక్ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 11 శాతం పెరిగి, దాదాపు రూ. 1,427 వద్ద ఉంది.డిపాజిట్లు 12.8% అప్సమీక్షా కాలం ఆఖరు నాటికి డిపాజిట్లు 12.8 శాతం పెరిగి రూ. 16,08,517 కోట్లకు చేరాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 38.7 శాతంగా ఉంది. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 11.2 శాతం, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 7.6 శాతం పెరిగాయి.దేశీయంగా రుణాల పోర్ట్‌ఫోలియో 12 శాతం పెరిగి రూ. 13,31,196 కోట్లకు చేరింది.నికర వడ్డీ మార్జిన్ 4.36 శాతం నుంచి 4.34 శాతానికి నెమ్మదించింది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ మినహాయించి) 13.7 శాతం వృద్ధితో రూ. 6,389 కోట్ల నుంచి రూ. 7,264 కోట్లకు చేరింది.ఫీజు ఆదాయం వార్షికంగా రూ. 5,490 కోట్ల నుంచి 7.5 శాతం వృద్ధితో రూ.5,900 కోట్లకు పెరిగింది.రిటైల్ రుణాలు వార్షికంగా 6.9 శాతం పెరిగాయి. మొత్తం లోన్ పోర్ట్‌ఫోలియోలో వీటి వాటా 52.2 శాతంగా ఉంది. కార్పొరేట్ పోర్ట్‌ఫోలియో 7.5 శాతం పెరిగింది.క్యూ1లో బ్యాంక్ కొత్తగా 83 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 7,066కి, ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 13,376కి చేరుకుంది.

నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.23,422 కోట్లు
న్యూఢిల్లీ: జీవితేతర బీమా (నాన్ లైఫ్) కంపెనీల ప్రీమియం ఆదాయం జూన్‌లో రూ.23,422 కోట్లుగా ఉంది. 2024 జూన్ నెల ప్రీమియం ఆదాయంతో పోల్చి చూస్తే 5.2 శాతం వృద్ధి చెందింది. కానీ, 2024 జూన్ నెలలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదాయం 8.4 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ‘‘1/ఎన్ నిబంధనకు మారాల్సి రావడం పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్‌లో వృద్ధి సింగిల్ డిజిట్‌కు నిదానించింది. ప్యాసింజర్ వాహన బీమా వృద్ధి ఆగిపోయింది. ఈ ప్రభావాన్ని బీమా సంస్థలు ఇతర వాణిజ్య మర్గాల రూపంలో కొంత వరకు తగ్గించుకోగలిగాయి’’అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది. ప్రీమియం వృద్ధి మోస్తరుగానే ఉన్నప్పటికీ 2024–25లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.3 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు గుర్తు చేసింది. నియంత్రణపరమైన మద్దతు, ఇన్సూర్టెక్కు ఆమోదం (టెక్నాలజీ ఆధారిత బీమా సంస్థలు), డిజిటలైజేషన్ వేగవంతం కావడం, మధ్యతరగతి ప్రజలు పెరగడం అనుకూలించినట్టు తెలిపింది. వృద్ధి వేగం ‘‘బీమా ట్రినిటీకి ప్రభుత్వ పరమైన మద్దతుతో నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధి వేగాన్ని అందుకోనుంది. రిటైల్ హెల్త్ విభాగంలో స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు (ఒక్క ఆరోగ్య బీమా సేవలు అందించేవి) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి’’అని కేర్ఎడ్జ్ తెలిపింది. మోటారు బీమా వృద్ధి విషయమై రానున్న రోజుల్లో వాహన అమ్మకాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, థర్డ్ పార్టీ బీమా టారిఫ్‌ల సవరణను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతిపాదిత కాంపోజిట్ లైసెన్స్ అమల్లోకి వస్తే మధ్య కాలానికి ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడింది. 1/ఎన్ నిబంధన అన్నది పాలసీలకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ఆరంభంలోనే కాకుండా.. కాలవ్యవధి మొత్తానికి సమానంగా వెల్లడించడానికి సంబంధించినది.
ఫ్యామిలీ

పిల్లల కోసం కలలను నేస్తున్నారు..! వైకల్యాన్నే గౌరవప్రదమైన గుర్తింపుగా..
చేపకళ్ల బుజ్జీ.. బజ్జోవమ్మా!అమ్మ నిన్ను పతంగుల ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అక్కడవి మబ్బుల్లా తేలుతుంటాయి.. గాలి తరగల మీద ఎగురుతుంటాయి.. ఎరుపు, ఆకుపచ్చ.. బులుగు.. పసుపు రకరకాల వర్ణాలతో ఆకాశానికి రంగులద్దుతాయి..నీకూ నింగిలో ఎగరాలనుందా.. మబ్బుల్లా.. పతంగుల్లా.. గాలి తెమ్మెరలా.. అయితే చిట్టి చిలకమ్మా.. నిద్దురపో హాయిగా.. సూరీడూ సద్దు మణిగినిద్దరోయాడు.. నువ్వూ బజ్జో.. పతంగుల లోకాన్ని చూసొద్దాం!ఇలాంటి పోయమ్స్, రైమ్స్ మీ పాపాయి బెడ్ షీట్స్ మీదో.. బ్లాంకెట్ల మీదో ఉంటే..! హాయిగా బజ్జోవడమే కాదు.. కంటికి ఇంపైన రంగుల్లోని ఆ అక్షరాలకు ఆకర్షితులై వేవేల వర్ణాల ఊహలను పోగేసుకుంటారు.. పెద్దయ్యాక దాన్నో అద్భుత జ్ఞాపకంలా చదువుకుంటారు. అలాంటి బాల్యాన్ని స్వచ్ఛమైన నూలు గుడ్డలో అంతే స్వచ్ఛమైన రంగుల్లో ముంచి మెత్తగా అందిస్తోంది ‘వైట్వాటర్’ అనే కిడ్స్ వేర్ బ్రాండ్! ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ మీద అజ్రక్, కాంతా, కచ్, ఇక్కత్.. ఇలా దేశం నలుమూలల నైపుణ్యాలను డిజైన్ చేస్తున్నారు. వీటికి దేశంలో సరే పశ్చిమాసియా, సింగపూర్, అమెరికా, ఇటలీ దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ‘వైట్ వాటర్’ ఇద్దరు అక్కాచెల్లెళ్ల బ్రెయిన్ చైల్డ్.. వాళ్ల అవిరామ కృషి.వివరాల్లోకి.. శ్వేత, అంకిత ధరీవాల్ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీళ్ల స్వస్థలం అహ్మదాబాద్. శ్వేత స్పెషల్లీ చాలెంజ్డ్. సరిగ్గా నడవలేదు. అంకితకు విటిలిగో! వీళ్ల ప్రయాణం కేవలం పిల్లల కోసం స్కిన్ ఫ్రెండ్లీ దుస్తులను తయారుచేసే సంస్థను నెలకొల్పడమే కాదు.. గుర్తింపు, గౌరవాన్ని పొందడం కూడా! ఆ ప్రయాణం దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఓ వేసవిలో మొదలైంది. అప్పటికి శ్వేత టెక్స్టైల్ డిజైనర్. రచయిత కూడా. తన పిల్లల కోసం ఆర్గానిక్ కలర్స్‌తో హాయిగా స్కిన్ఫ్రెండ్లీగా ఉండే కాటన్ దుస్తుల కోసం వెదుకుతోంది. ఎక్కడా దొరకలేదు. అప్పడనిపించింది వాటిని తనే తయారు చేస్తే..? అని! అంతే! సోదరి అంకిత సహాయంతో దేశమంతా తిరిగి నాణ్యమైన నేత, నైపుణ్యం గల మహిళా చేనేత కళాకారులను కలుసుకుంది. వాళ్లందరినీ తన ప్రాజెక్ట్‌లో భాగం చేసి 2017లో ‘వైట్వాటర్’ను ప్రారంభించింది.వైట్.. స్వచ్ఛతకు, వాటర్.. పారదర్శకమైన జీవన ప్రవాహానికి చిహ్నం. అందుకే ఆ బ్రాండ్లోగోలో సముద్రంలో చేప ఈదుతున్నట్టుగా ఉంటుంది. ‘ఇది పిల్లలు తాము సృష్టించాలనుకుంటున్న ప్రపంచంలోని భద్రత’ను సూచిస్తుంది అంటారు ఈ అక్కాచెల్లెళ్లు. దీన్ని అంకిత డిజైన్ చేసింది. ఆమె లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ విద్యార్థి. దుస్తులనేమో శ్వేత డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్స్‌తో పిల్లలకు స్టోరీస్ కూడా చెప్పాలనుకుంటుంది. అందుకే పిల్లల కోసం తాము తయారు చేసే టవల్స్, బెడ్ షీట్స్, దుప్పట్లు, పిల్లో కవర్స్ మీద పోయెమ్స్, జోలపాటలు, రైమ్స్‌ను రాస్తుంది. ఈ బ్రాండ్ కుర్తా సెట్స్‌నూ తయారు చేస్తుంది. ‘మాది కేవలం ఒక బ్రాండ్ కాదు.. ఒక ఉద్యమం.. గుర్తింపు కోసం, గౌరవం కోసం చేసే మూవ్మెంట్. అందుకే మా డిజైన్స్ ఐడెంటిటీ, డిగ్నిటీ, పోయెట్రీ, పర్పస్‌తో మిళితమై ఉంటాయి. మా ఈ బ్రాండ్ ఫిలాసఫీని మా వైకల్యమే షేప్ చేసింది’ అని చెబుతారు శ్వేత, అంకిత. అలా వాళ్లు పిల్లల కోసం దుస్తులనే కాదు కలలనూ నేస్తున్నారు. (చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్‌కు కూడా ఇదే సమస్య!)

పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..!
చాలా చిన్నపిల్లల్లో నోటి నుంచి చొల్లు / జొల్లు కారుతుండటం చాలా కనిపించేదే. వైద్య పరిభాషలో చొల్లు/జొల్లు స్రవించే కండిషన్‌ను ‘సైలోరియా’ అనీ, ఇంగ్లిషు వాడుకభాషలో దీన్ని ‘డ్రూలింగ్’ అని అంటారు. నెలల పిల్లల్లో ముఖ్యంగా నాలుగు నెలల నుంచి 18 నెలల వరకు చిన్నపిల్లల్లో ఇది సాధారణంగా కనిపించేదే. ఆ టైమ్‌లో అంత చిన్న పిల్లల్లో అలా చొల్లు / జొల్లు స్రవిస్తుండటం చాలా సాధారణం. కానీ నాలుగేళ్లు దాటిన తర్వాత కూడా జొల్లు కారడం జరుగుతుంటే... అంటే పెద్ద పిల్లల్లోనూ ఇదే కనిపిస్తుంటే అది కొన్ని సీరియస్ సమస్యలకు సూచన కావచ్చు. పెద్దపిల్లల్లో ఇలా చొల్లు స్రవించడానికి దానికి కారణాలేమిటో, వాళ్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో తెలుసుకుందాం. చిన్నారుల్లో వాళ్ల నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ పూర్తిగా అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం వస్తుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు వస్తూనే ఉంటే దాన్ని కాస్త సీరియస్‌గా తీసుకోవాలి. అంటే దాన్ని సాధారణ విషయంగా అనుకోకుండా కాస్త అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. పెద్ద పిల్లల్లో చొల్లు / జొల్లును సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలంటే...?కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలా చొల్లు / జొల్లు కారుతుండటం జరుగుతుంది. అంటే వాళ్లలోని ఆరోగ్య సమస్య కారణంగా వాళ్ల నోట్లో స్రవించిన లాలాజలాన్ని వాళ్లు తమంతట తామే మింగలేనందువల్ల ఇలా జొల్లు / సొల్లు స్రవిస్తుంటుంది. ఇక కొందరు చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేక΄ోవడానికి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) ఉన్నా చొల్లు/జొల్లు కారుతుంటుంది. పైగా ఇలాంటి సమస్యలు ఉన్నపుపడు జొల్లు కారడం మరింత పెరుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం. తొలుత తీసుకోవాల్సిన జాగ్రత్తలు...పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు / జొల్లు కారుతున్నప్పుడు వాళ్లంతట వాళ్లే తమ లాలాజల స్రావాన్ని మింగుతుండేలా వాళ్లకు అలవాటు చేయాలి. ఇక లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా వాళ్లకు మింగడం ప్రక్రియను అలవాటు చేయించవచ్చు. అడ్వాన్స్డ్ చికిత్సగా... మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం అనే ఒక రకం ఇంజెక్షన్‌ను లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. జొల్లు స్రవించే పిల్లలకు ఇవీ సూచనలు... అన్నిటికంటే ముఖ్యంగా ఏడాదిన్నర దాటాక కూడా పిల్లల్లో చొల్లు / జొల్లు స్రవిస్తుంటే ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) తరచూ గుటక వేస్తూ లాలాజలం మింగడం అలవాటు చేయడంనోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ పిల్లల్లో చొల్లు/జొల్లు స్రవించకుండా అరికట్టడానికి బాగానే ఉపయోగపడతాయి. అప్పటికీ అలాగే స్రవిస్తుంటే పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, అసలు కారణం తెలుసుకోడానికి అవసరమైన పరీక్షలు చేయించాలి. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్సలు ఉంటాయి. (చదవండి: ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..)

అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్‌లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్‌హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి.

పెరిగే ఒత్తిడి కంటికీ కాటే..!
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైనా, మెదడుపైనా ప్రతికూల ప్రభావాలను చూపి, అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు గుండె, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ మొదలైన అంశాలపై ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగానే పడి గుండె΄ోటు మొదలుకొని, జీర్ణసమస్యలూ, మానసిక సమస్యలూ వస్తాయి. అలాగే కంటి విషయంలో ఒత్తిడి తన దుష్ప్రభావాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం.కంటిపై ఒత్తిడి దుష్ప్రభావం ఎలాగంటే... కంటిపై పడే దుష్ప్రభావాలకంటే ముందుగా... అసలు ఒత్తిడి వల్ల దేహంపై కలిగే ప్రభావాలేమిటో, అసలవి ఎందుకు కలుగుతాయో చూద్దాం. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం ‘ఫైట్’ లేదా ‘ఫ్లైట్’ అనే పరిస్థితికి సిద్ధమవుతుంది. అంటే పోరాడు’ కుదరకపోతే పారిపో’ అనే పరిస్థితులకు దేహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి. ఆ హార్మోన్ల వల్ల దేహం చాలా కొద్ది వ్యవధిలోనే పారిపోవడానికి లేదా పోరాటానికి అవసరమైన బలాన్ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురి కావడం, వాటికి అవసరమైన రక్తప్రవాహం అందక΄ోవడం, కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కంట్లో ఉండేవీ కండరాలే కావడంతో అన్ని కండరాల్లాగానే వీటిపైన కూడా ఆ దుష్ప్రభావాలు పడతాయి.కంటిపై ఒత్తిడి పెంచే అంశాలివి... ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యేవారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. అన్ని రకాల ఒత్తిళ్లతో పాటు మరికొన్ని అంశాలు కళ్లపై తమ ప్రభావాన్ని నేరుగా పడేలా చేస్తాయి. అవి... ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూస్తుండటం. (అది టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఏదైనా కావచ్చు); నిద్రలేకపోవడం; వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుండటం... ఇవన్నీ కంటిపైనా ఒత్తిడి పడేలా చేస్తాయి.ఒత్తిడి కారణంగా వచ్చే కంటి సమస్యలివి... కన్ను స్ట్రెయిన్ కావడం (ఏస్థెనోపియా) : డిజిటల్ స్క్రీన్స్‌కు నిత్యం ఎక్స్΄ోజ్ అవుతూ ఉండటం. ఈ కారణంగా కళ్లు స్ట్రెయిన్ అవుతుంటే తలనొప్పి, కళ్లు ΄÷డిబారడం, మసక మసగ్గా కనిపించడం వంటివి.డ్రై ఐస్ : ఒత్తిడి కారణంగా కళ్లలో స్రవించే నీరు (కన్నీరు లేదా లాక్రిమస్ సెక్రిషన్) తగ్గుతుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడంతో పాటు కళ్లలో ఇసకపడ్డట్లు ఫీలింగ్, ఇరిటేషన్, కళ్లమంటల వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లర్డ్ విజన్ : కంటి చుట్టూతా ఉండే కండరాలు ఒత్తిడితో బిగుసుకుపోతున్న కారణంగా... చూపు స్పష్టంగా కనిపించక ఎదుటనున్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కళ్లలో సన్నటి కన్నీటి పొర అవరించినప్పుడూ ఇలా మసగ్గా కనిపించవచ్చు. కన్ను అదరడం (ట్విచ్చింగ్) : కన్ను అదరడం చాలామందిలో కనిపించే సాధారణమైన అంశం. కన్ను అదరడాన్ని బట్టి కొందరు శుభసూచనలను / అశుభసూచకాలను దీనికి ఆ΄ాదిస్తుంటారు. ఇలా కన్ను అదరడాన్ని (ట్విచ్చింగ్ను) దీన్నే వైద్య పరిభాషలో ‘మయోకైమియా’ అంటారు. ఇది దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా కన్ను అదురుతుండటం చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కాంతికి ప్రతిస్పందించడం (లెట్ సెన్సిటివిటీ) : తీవ్రమైన కాంతిలో కన్ను చాలా ఇబ్బందికి గురయ్యే విషయం తెలిసిందే. ఒత్తిడితో కన్ను రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి... మైగ్రేన్‌ను కలగజేస్తుందన్న విషయం తెలిసిందే. మైగ్రేన్‌లో కన్ను మామూలు కాంతిని కూడా చూడలేక΄ోతుంది. అలాగే ఆరుబయట తీవ్రమైన కాంతి ఉన్నప్పడూ కన్ను తెరుచుకోడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కంటి భ్రమలూ, భ్రాంతులు (విజువల్ హేలూసినేషన్స్) : అరుదుగా కొన్ని సందర్భాల్లో కంటికి కొన్ని దిగ్భ్రమలు కలుగతాయి. దాంతో కంటి ముందు లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కాంతిపుంజాలు వెలుగుతున్నట్లుగానూ, అవి తేలుతూ పోతున్నట్లుగానూ (వీటినే ఫ్లోటర్స్ అంటారు), మెరుపులు మెరుస్తున్నట్లుగా దిగ్భ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా కన్ను దేన్నీ చూడలేకపోవచ్చు కూడా. ముఖ్యంగా ఇలాంటివి ఆక్యులార్ మైగ్రేన్ అనే కండిషన్లో కలుగుతాయి.మేనేజ్మెంట్ / చికిత్స...లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమంగా కన్నీటిని ఇచ్చే చుక్కల మందులూ, ల్యూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, కన్ను సరిగా చూడలేక΄ోతున్న సందర్భాల్లో యాంటీ గ్లేర్ కళ్లజోడు, కన్ను పూర్తిగా అలసి΄ోతున్నప్పుడు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలను డాక్టర్లు చెబుతారు. దీనికి తోడు పూర్తి దేహానికి ఒత్తిడి తొలగేందుకు యోగా, పప్రాణాయామ వంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలంటూ చెబుతారు. ఇక కొందరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీనికి తోడు దేహానికి తగినన్ని ద్రవాలు అందుతూ దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేలా నీరూ, ద్రవాహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, మంచి ΄ోషకాహారం తీసుకోవడం వంటి మంచి జీవనశైలి మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. చివరగా... ఇటీవల వైగవంతమైన జీవనశైలిలో కంటినీ, కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మొదట్లో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా కంటికి వచ్చే అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పెట్టక΄ోవచ్చుగానీ... ఇదే వత్తిడి దీర్ఘకాలం ఉంటూ అదేపనిగా కంటిపై ఒత్తిడి కలగజేస్తే అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూక్తిని అనుసరించి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిపై దృష్టి కేంద్రీకరించి, దాన్ని పూర్తిగా తగ్గించుకోవలన్న వాస్తవం కంటి విషయంలో మరింతగా ఆచరించాల్సిన సత్యం. కంటిపై ఒత్తిడి తగ్గి... కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే...ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూస్తుండాలి.ప్రతి రెండు గంటలకోసారి (కంప్యూటర్ చూడ్డంలాంటి) పనికి బ్రేకిచ్చి 10 – 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే గంటా లేదా రెండుగంటల ముందర మొబైల్ ఆపేయాలి. రాత్రి చీకట్లో లైట్ లేకుండా మొబైల్గానీ, లాప్టాప్గానీ చూడకూడదు.ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. (చదవండి: అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..)
ఫొటోలు
అంతర్జాతీయం

లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం
అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం జనం మీదకు దూసుకెళ్లిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం లాస్ ఏంజిల్స్ ఈస్ట్ హాలీవుడ్‌లోని శాంటా మోనికా బులివర్డ్ వద్ద ఓ వాహనం గుంపులోకి దూసుకెళ్లింది, ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఆంబులెన్సులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. గాయపడ్డవాళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో 8–10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. టాకోలను విక్రయించే ఓ బండిని ఢీకొట్టి, ఆపై క్లబ్ బయట ఉన్న గుంపులోకి వాహనం దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాహన డ్రైవర్ స్పృహ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని కొందరు చెప్పినప్పటికీ.. పోలీసులు ఎలాంటి ఎలాంటి ధృవీకరణ చేయలేదు. BREAKING: Sad and chaotic news coming from East Hollywood, Los Angeles where over 20 people injured and many in critical condition!A vehicle had plowed into a crowd of people, the Los Angeles Fire Department reported on Saturday.The incident occurred on Santa Monica… pic.twitter.com/i0JuEJyhlN— I Came, I Saw, They died 🇺🇸📢🇺🇸 (@4ortunefame) July 19, 2025

భారత్–పాక్ ఘర్షణలో 5 ఫైటర్ జెట్లు నేలమట్టం
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు నేలమట్టమయ్యాయని చెప్పారు. అవి గాల్లోనే పేలిపోయి నేలకూలాయని, అది నిజంగా దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. అయితే, కూలిపోయిన యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి? అనే సంగతి ట్రంప్ బయటపెట్టలేదు. అవి భారత్‌కు చెందినవా? లేక పాకిస్తాన్‌కు చెందినవా? లేక ఇరు దేశాలకు చెందినవా? అనేది ప్రకటించకపోవడం గమనార్హం. వైట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి రిపబ్లికన్ సెనేటర్లు ఇచ్చిన విందు కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. తాను చొరవ తీసుకోవడం వల్లే భారత్–పాక్ మధ్య యుద్ధంగా ఆగిపోయిందని పునరుద్ఘాటించారు. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు పరస్పరం ఘర్షణకు దిగాయని, దాడులు చేసుకున్నాయని.. తాను రంగంలోకి దిగి ఆపకపోతే అది తీవ్రమైన యుద్ధంగా మారేదని అన్నారు. తన హెచ్చరికలతో రెండు దేశాలు దిగొచ్చాయని, ఘర్షణకు ముగింపు పలికాయని స్పష్టంచేశారు. భారత్, పాక్‌లపై ‘వాణిజ్య’హెచ్చరికల అస్త్రం ప్రయోగించానని, దాంతో అవి తన మాట విన్నాయని తెలిపారు. గత ఆరు నెలల పాలనలో ఎంతో సాధించామని, ఎన్నో యుద్ధాలు ఆపేశామని, అందుకు గర్వపడుతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. #WATCH | Washington, D.C.: US President Donald Trump says, "We stopped a lot of wars. And these were serious, India and Pakistan, that was going on. Planes were being shot out of there. I think five jets were shot down, actually. These are two serious nuclear countries, and they… pic.twitter.com/MCFhW406cT— ANI (@ANI) July 18, 2025ట్రంప్ ప్రమేయం లేదు ఆపరేషన్ సిందూర్‌లో తమకు కొంత నష్టం వాటిల్లిందని, యుద్ధ విమానాలు కోల్పోయామని భారత్ సైన్యం ఇప్పటికే అంగీకరించింది. అయితే, పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ, అందుకు ఆధారాలేవీ చూపించలేదు. పాక్ ప్రకటనను భారత సైన్యం ఖండించింది. మే 31వ తేదీన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై, శిక్షణా శిబిరాలపై దాడులు చేశామని వెల్లడించారు. ముష్కరులను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టామని, ఈ క్రమంలో తమకు కొంత నష్టం జరిగిన మాట నిజమేనని తెలిపారు. ఇండియాకు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశామంటూ పాక్ చేసిన ప్రకటనలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. భారత్–పాక్ ఘర్షణను ఆపేశానంటూ ట్రంప్ గతంలోనూ తనకు తానే కితాబిచ్చుకోగా, భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాక్ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడంతో స్పందించి దాడులు నిలిపేశామని, ఇందులో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని తేల్చిచెప్పింది. భారత సైన్యం మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.

పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్‌టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్‌లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్‌లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం.

భారత్, పాక్‌పై ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పాత పాటే పాడారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే, కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని చెప్పారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.Trump just reminded India who’s boss again. He said I stopped war b/w India , Pakistan but dropped a bonus 5 Indian jets shot down ⚡️. Sorry Don it’s 6-Nill 💀 pic.twitter.com/ookpeprp9K— Awais 🐺 (@awais4226) July 19, 2025భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. గతంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్.. మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌నకు మతి మరుపు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు.
జాతీయం

ఒడిశాలో అమానవీయం
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండుగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితులు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. బయాబర్ గ్రామంలోని నవగోపాల్పూర్ బస్తీలో శనివారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్ వచ్చి అడ్డగించారు. సమీపంలోని భార్గవి నది గట్టుకు బలవంతంగా లాక్కెళ్లారు. చేతులు కట్టేసి పెట్రోల్ చల్లి, నిప్పంటించి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఎనిమిదో తరగతి వరకు చదుకుంది. మధ్యలో చదువు మానేసింది. ఆమె తండ్రి మెకానిక్‌గా పని చేస్తున్నాడు. బాలిక పట్ల రాక్షసంగా ప్రవర్తించిన దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని ఒడిశా డీజీపీ వై.బి.ఖురానియా ప్రకటించారు. బాలికను హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించారన్నది తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిపడ్డాయి. మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపించారు. విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది. ‘బేటీ బచావో’ అంటే ఇదేనా? అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు రక్తంతో తడిచాయని విమర్శించింది. ఒడిశాలో వారం రోజుల క్రితమే కాలేజీ విద్యార్థిని(20) ఆత్మాహుతికి పాల్పడింది. ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తుండడంతో భరించలేక తనకు తానే నిప్పంటించుకొని మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

23 నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26వ తేదీ దాకా యునైటెడ్ కింగ్డమ్(యూకే), మాల్దీవ్స్ దేశాల్లో పర్యటించనున్నారు. రెండు దేశాలతో దౌత్య, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మోదీ తొలుత ఈ నెల 23, 24న యూకేలో పర్యటిస్తారు. అత్యంత కీలకమైన ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేస్తారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో చర్చలు జరుపుతారు. అలాగే ఈ నెల 25, 26న మాల్దీవ్స్‌లో మోదీ పర్యటన కొనసాగనుంది. మాల్దీవ్స్ 60వ జాతీయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

తోటపని.. పిల్లలకు మంచిదని!
దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు గాల్లోంచి వీచి పిల్లల్లో ప్రవేశించవు. తల్లి ఒడి నేర్పించాలి. తండ్రి తన భుజాల పైకి ఎక్కించుకుని లోకాన్ని చూపించాలి. గురువు చెప్పే గద్దింపు పాఠాలు నేర్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. ఎదిగేకొద్దీ ఒదుగుతాడు. అయితే ఇల్లు, బడి మాత్రమే కాకుండా బిడ్డకు బుద్ధులు నేర్పే పాఠాల్లో మరో ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే... తోట పని. తోటను చూస్తూ, తోటలో పని చేస్తూ పెరిగి పెద్దయిన పిల్లలు సాటి మనుషులకు చల్లని నీడ అవుతారని, మానవత్వానికి ఊడలు అవుతారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లలోనే పెరిగి పెద్దయి ఒకేసారి బయటికి అడుగు పెట్టే పిల్లల్లో ప్రకృతి సహజ లక్షణాలైన నెమ్మది, ప్రశాంతత ఉండవు. జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలవటం, కలుపుకొని పోవడం తెలియవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్లో దూసుకుపోతుంటారు కానీ, జీవితంలో ఉన్నచోటే ఉండిపోతారు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచపు రోబో పిల్లల్ని తోట పనికి పంపాలి. తోటపని పిల్లల్ని మలిచే కుమ్మరి వంటిది. పెద్దయ్యాక బతకటానికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలా బతకాలో చిన్నతనంలోనే తోట పని నేర్పిస్తుంది.తోటపనిలోకి ఎలా దింపాలి?ఆటలా ఉంటే చాలు, పిల్లలు దేనికైనా ‘సై’ అంటారు. కనుక తోటపనిని కూడా వాళ్లకు ఆటలా నేర్పించాలి. ఇందుకు మీరూ వాళ్లతో కలిసి ఆటలోకి దిగాలి. వంటింటి నుంచే మీ ఆటను మొదలుపెట్టండి. టమాటాను కోసి, అందులోంచి కొన్ని విత్తనాలను తీసి, ఎండబెట్టి, ఒక చిన్న కుండీలో నాటండి. ‘ఆహారం ఏదీ నేరుగా ప్యాకెట్లలో వచ్చేయదు. గింజ వేయటానికి నేల, మొక్క మొలిచాక సూర్యరశ్మి కోసం సూర్యుడు, మొక్క ఫలించటానికి కొంత సమయం, అప్పటి వరకు వేచి ఉండటానికి మనకు సహనం అవసరం’ అని పిల్లలకు నేర్పించటానికి ఇదొక చక్కని మార్గం.ఒక మొక్కను అప్పగించండిపాత టీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు లేదా టిన్ డబ్బాలలో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను నాటండి. ఆ కప్పులు లేదా డబ్బాలకు మీ పిల్లల చేత వారికి చేతనైనట్లుగా అందమైన పెయింట్స్ వేయించండి. లేదా స్టిక్కర్లతో అలంకరించనివ్వండి. అలా ఒక రీసైకిల్ పాట్ గార్డెన్‌ను తయారవనివ్వండి. అప్పుడు వారు ఆ మొక్కల్ని తమ సొంతమైనవిగా భావిస్తారు. మొక్కకు వారినే ఏదో ఒక పేరు పెట్టమని చెప్పండి. అలా వాటితో అనుబంధం ఏర్పడుతుంది. వాటి ఆలనా, పాలనను వారే ఇష్టంగా తీసుకుంటారు. రోజూ ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఆ మొక్కను పలకరిస్తారు. చిన్నతనంలో మొక్కలతో ఏర్పడిన బాంధవ్యమే, పెద్దయ్యాక సాటి మనుషులతోనూ ఏర్పడుతుంది.సేంద్రియ ఎరువు తయారీవంట గది వ్యర్థాలు, తోటలో రాలిపడిన ఆకులు, మట్టి.. వీటన్నిటినీ ఒక పారదర్శకమైన సీసాలో ఒకదానిపైన ఒకటి పొరలుగా వేసి అవన్నీ కుళ్లిపోయి సహజమైన ఎరువుగా ఎలా మారుతుందో పిల్లలకు చూపించవచ్చు. నిజంగా అదొక అద్భుతమైన ప్రయోగంగా, మారువేషంలో ఉన్న ఒక సైన్స్ పాఠంలా పిల్లలకు అనిపిస్తుంది.విత్తనం నాటితే ఓర్పు మొలుస్తుంది⇒ తోటపని అంటే కేవలం మొక్కల పాదుల్ని శుభ్రం చెయ్యటం, మొక్కలకు నీళ్లు పెట్టటం మాత్రమే కాదు.⇒ మట్టిని తవ్వటం అనేది శ్రమించటాన్ని నేర్పిస్తుంది.⇒ విత్తనాలను నాటడం అన్నది ఆశగా⇒ ఎదురుచూడటం అలవరుస్తుంది.⇒ ఎదురుచూడటం అంటే తొందరపడకపోవటం. ఓపికపట్టడం. జీవితానికి అత్యంత కీలకమైన ఈ లక్షణాలను తోటపని బాల్యంలోనే అలవరుస్తుంది.⇒ ఇక మొక్కలకు నీళ్లు పెట్టటం బాధ్యత అవుతుంది. నీళ్లు పెట్టడం మర్చిపోయి, మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరువకూడదని తెలిసివస్తుంది.ఎదిగే దశలు ఉత్తేజపరుస్తాయితోటపని చేసే క్రమంలో మొక్కలు ఎదగటంలోని దశలు పిల్లలను ఉత్తేజపరుస్తాయి. మొక్కలు పెరగటానికి, పవ్వులు పూయటానికి, కాయలు కాయటానికి సమయం పడుతుందని వారు గ్రహిస్తారు. స్వయంగా నాటి, నీళ్లు పోసి, సంరక్షించిన మొక్కలు పుష్పించినప్పుడు, కాయలూ పండ్లూ కాసినప్పుడు తామే ప్రకృతిని పెంచి పెద్ద చేసిన గొప్ప ఆత్మవిశ్వాసపు భావన పిల్లల్లో అంకురిస్తుంది. వారిపై వారికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తోటపనిలోని ఈ అనుభవాలన్నీ జీవితంలో మున్ముందు అక్కరకు వస్తాయి.సృజనాత్మకత, సాత్విక గుణాలు⇒ తోటపని ప్రకృతితో పిల్లలకు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మొదట్లో భయపెట్టిన వానపాములు తరవాత నేస్తాలు అవుతాయి. వర్షం ఉత్సాహమై కురుస్తుంది.⇒ తూనీగలు మీదకొచ్చి వాలతాయి. సీతాకోక చిలుకలు తలపై ఎగురుతాయి.⇒ పక్షులన్నీ రాగాల కోయిలలే అవుతాయి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకతను, సాత్విక గుణాలను ప్రేరేపిస్తాయి. మున్ముందు జీవితంలో అలుముకునే నిరాశ, నిస్పృహలకు, అనిశ్చిత పరిస్థితులకు కూడా తోటపనే వైద్యం, చికిత్స నేర్పి పంపుతుంది.తోటపనితో ఏమేం తెలుస్తాయి?⇒ సమస్యలను ఎలా పరిష్కరించాలి?⇒ ప్రణాళికతో పనిచేయడం⇒ సమయం, వనరుల సద్వినియోగం⇒ లక్ష్యసాధన⇒ కష్టం విలువఏమేం పెరుగుతాయి?⇒ ఆత్మవిశ్వాసం⇒ ఆత్మగౌరవం⇒ ఓర్పు, సహనం⇒ బాధ్యత⇒ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు⇒ ఎలా చేస్తే పని విజయవంతమవుతుందన్న ఆలోచనా ధోరణి⇒ పర్యావరణ పరిరక్షణ స్పృహఏమేం తగ్గుతాయి?⇒ ఒత్తిడి, ఆందోళన⇒ కోపం, అసహనం⇒ ఒక పనిని గుడ్డిగా చేయడం⇒ మొక్కలను నరికేయడం/కొట్టేయడం

స్మార్ట్ గూఢచారి!
అకస్మాత్తుగా మీ ఫోన్ దానంతటదే బ్లింక్ అవుతుంది. ఏదో మెసేజ్! తెరిచి చూస్తే అంకెలు, అక్షరాలు ఉంటాయి. అవేమిటో అర్థం కాదు. హఠాత్తుగా మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయి ఉంటుంది. నిజానికి అప్పటికి గంట క్రితమే మీరు మీ ఫోన్‌ని పూర్తిగా చార్జి చేసి ఉంటారు. మీ ఫోన్‌ని మీరు ఉపయోగించకుండానే వేడెక్కిపోతుంటుంది. ఏదో సాంకేతిక సమస్య అని మీరు పట్టించుకోక పోవచ్చు. కానీ అవన్నీ... స్పైయింగ్ సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో చొరబడి ఉండొచ్చనే దానికి సంకేతాలు కావచ్చునని అంటున్నారు నిపుణులు. మరోవైపు – స్మార్ట్ఫోన్ల ద్వారా నిఘా, గూఢచర్యం, సైబర్‌క్రైమ్‌లు పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్స్మార్ట్ఫోన్ లో మన వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడే అనేక యాప్‌లు.. మనకు సంబంధించిన కాంటాక్ట్‌లు, లొకేషన్ హిస్టరీ, ఫొటోలు.. ఇలా అన్నింటి యాక్సెస్ తీసేసుకుంటున్నాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లో మన జీవితం తెరిచిన పుస్తకం అయిపోయింది. ఎంతో అమూల్యమైన ఆ సమాచారాన్ని ఎవరో, ఎక్కడి నుంచో రహస్యంగా వెతుకుతూ ఉంటే? చూస్తూ ఉంటే? మనకు తెలియకుండా వేరెవరికో ఇచ్చేస్తే? సర్వం పోగొట్టుకున్నట్లే. జీవితమే తలకిందులైపోవచ్చు కూడా. అందుకే స్పైవేర్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ‘స్పైవేర్’ అనేది మన ఫోన్లోని విలువైన సమాచారాన్నంతా రాబట్టేందుకు రూపొందిన హానికరమైన సాఫ్ట్వేర్. మనకు తెలియకుండానే అది మన పాస్‌వర్డ్‌లన్నీ కనిపెట్టేస్తుంది. మన కదలికలన్నిటినీ గమనిస్తుంటుంది. మనం చేసిన కాల్స్‌నీ, మనకు వచ్చిన కాల్స్‌నీ రికార్డ్ చేస్తుంటుంది. మనకు తెలియకుండానే మన మైక్రోఫోన్, కెమెరాలను కూడా పని చేయించటం మొదలుపెట్టేస్తుంది.మనకెలా తెలుస్తుంది?..: మీ ఫోన్లో స్పైవేర్ చొరబడి మిమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి :ఫోన్ పనితీరులో ఆకస్మిక సమస్యలు: యాప్‌లు పని చేయటం మానేస్తాయి లేదా ఫోన్ బాగా స్లో అయిపోతుంది. బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవటం: స్పైవేర్ అన్నది ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంటుంది. ఫోన్ బ్యాటరీ మొత్తాన్ని తాగేస్తుంది. అంతుచిక్కని డేటా వినియోగం: మీ మొబైల్ డేటా బిల్లు మీ వాడకానికి మించి అమాంతం పెరిగిపోయిందీ అంటే స్పైవేర్ మీ డేటాను వేరొకరికి బదిలీ చేస్తోందని అర్థం!వేడెక్కడం: మీ ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటే వెనుక ఏదో స్పయింగ్ పని నడుస్తూ ఉండొచ్చు. వింత సందేశాలు: వింత అక్షరాలు లేదా లింక్‌లతో కూడిన టెక్స్ట్ మెసేజ్‌లు వస్తుంటే అవి మీ ఫోన్లోని స్పైవేర్‌కు అందుతున్న ఆదేశాలు / సందేశాలు కావచ్చు.స్పైవేర్‌ను వేటాడటం ఎలా?మీ ఫోన్లో స్పైవేర్ సంకేతాలు కనిపిస్తే కనుక మీరు దానిని వేటాడి మట్టుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. అయితే ఆ వేట మీది ఏ రకం ఫోన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీది ఆండ్రాయిడ్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి నుంచి యాప్స్‌లోకి వెళ్లండి. అక్కడ మీకేమైనా తెలియని యాప్‌లు కనిపిస్తున్నాయేమో చూడండి.» డివైజ్ అడ్మిన్ యాప్స్‌ని చెక్ చేసి, అక్కడ ఏయే పర్మిషన్లు హైలైట్ అయి ఉన్నాయో గమనించండి.» మాల్వేర్బైట్స్, లేదా అవస్త్ వంటి పేరున్న యాంటీ స్పైవేర్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోండి.» ఆ తర్వాత వైరస్ల కోసం పూర్తిగా స్కాన్ చెయ్యండి. కొత్త ఫైల్స్ ఏమైనా వచ్చి చేరాయా అని తెలుసుకోవటం కోసం డౌన్లోడ్ ఫోల్డర్స్ చెక్ చేయండి.» గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఆన్‌లో పెట్టుకోండి.మీది ఐఫోన్ అయితే» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి యాప్స్ పర్మిషన్స్ పరిశీలించాలి.» అక్కడి వి.పి.ఎన్. అండ్ డివైజ్ మేనేజ్మెంట్ ఆప్షన్లో అపరిచిత ఫైల్స్ ఉన్నాయేమో చూడాలి.» ముఖ్యంగా ఐఓస్ను అప్డేటెడ్గా ఉంచుకోవాలి. చాలావరకు స్పైవేర్లు సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని లోనికి ప్రవేశిస్తాయి.» సాధారణంగా యాపిల్‌లోని ‘వాల్డ్ గార్డెన్’ రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల స్పైవేర్ అంత ఈజీగా చొరబడలేదు. అలాగని స్పైవేర్ అటాక్ అసాధ్యం అని చెప్పలేం. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు పూర్తి నియంత్రణను, అధికారిక యాప్ స్టోర్ వెలుపల ఉన్న యాప్‌లను ఇన్ స్టాల్ చేసే సామర్థ్యాన్ని అందించడానికి ఫోన్ తయారీదారు విధించిన సాఫ్ట్వేర్ పరిమితులను తొలగించే ‘జైల్బ్రేక్’ మార్గాన్ని స్పైవేర్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.నివారణే ఉత్తమ పరిష్కారంస్పైవేర్ను గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ, దాన్ని నివారించడం మాత్రం సులభమే. అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్ స్టాల్ చేసుకోండి. ఎస్.ఎం.ఎస్., వాట్సాప్, లేదా ఈమెయిల్ నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని ‘జైల్బ్రేక్’ చేయకూడదు. అలా చేస్తే కీలకమైన భద్రతా కవచాలు తొలగిపోతాయి. అలాగే పటిష్టమైన, ఎవ్వరికీ ఊహకు కూడా అందని పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. సాధ్యమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. పబ్లిక్ వై–ఫైలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఓ ఫోన్‌ని తెరిచి పెట్టుకోకండి. ఫైళ్లు, సినిమాలు వంటి డౌన్లోడ్ చేయడం చేశారో.. మీ పని అయిపోయినట్టే. ఇక మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ని తొలగించి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను తిరిగి ఇన్ స్టాల్ చేయడం స్పైవేర్‌ను తొలగించడానికి మిగిలిన ఏకైక, ఉత్తమమైన మార్గం.కేంద్ర ప్రభుత్వ ఆందోళనడిజిటల్ గూఢచర్యానికి స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌లను సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు ఉన్నట్టే సోషల్ మీడియా సంస్థలకూ ఉండాలని కర్ణాటక హైకోర్టులో ‘ట్విట్టర్’ చేసిన వాదనలకు స్పందిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా డిజిటల్ గూఢచర్యం అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సెలబ్రిటీలు తమ కోసం వచ్చే సందర్శకులను ఫోన్లు బయటే పెట్టి రమ్మని విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి నేడు నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఎన్ఆర్ఐ

లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
క్రైమ్

భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
చంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్ బీఎస్ఎన్ఎల్లో టెక్నీషియన్ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్ వద్ద లోకేశ్వర్ కాపు కాశాడు. బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లోకేశ్వర్ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.

ఆ మృగాడికి బెయిల్ ఇవ్వలేం..
సాక్షి, అమరావతి: కామవాంఛతో యజమాని భార్యను కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తరువాత ఆమె మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మృతురాలిపట్ల పిటిషనర్ పాశవికంగా, మృగంలా ప్రవర్తించాడని హైకోర్టు తెలిపింది. ఇలాంటి వారికి బెయిల్ మంజూరుచేస్తే అది సమాజంపై దు్రష్పభావం చూపుతుందని స్పష్టంచేసింది. ‘యజమాని భార్యను హత్యచేయడం ద్వారా అతని నమ్మకాన్ని పిటిషనర్ దారుణంగా వమ్ముచేశాడు. కాంపౌండర్‌గా తన ఇంట్లోనే ఉండేందుకు యజమాని స్థానం కల్పించాడు. విశ్వాసంగా ఉంటూ ఇంట్లో ఒకరిగా నమ్మకం కలిగించి పిటిషనర్ ఈ నేరానికి ఒడిగట్టాడు. కామవాంఛతో రగిలిపోయి మృతురాలిపట్ల ఓ మృగంలా ప్రవర్తించాడు. తన వాంఛను తిరస్కరించడంతో ఆమె తలపై అతిదారుణంగా, విచక్షణారహితంగా కొట్టి చంపాడు. హత్య అనంతరం కూడా అతని క్రూరత్వం ఏమాత్రం ఆగలేదు. మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు. చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ఆరోపణల తీవ్రత ఎంతమాత్రం తగ్గదు’.. అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు. బంధువని ఆశ్రయమిస్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి గత 16 ఏళ్లుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తన భార్య అర్పితా బిశ్వాస్, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన దూరపు బంధువైన నయన్ బిశ్వాస్కు శ్రీకాంత్ తన ఆసుపత్రిలో కాంపౌండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 2024 డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మద్యం తాగారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు. నయన్ బిస్వాస్ హాలులో నిద్రపోయాడు. తెల్లవారి శ్రీకాంత్ లేచి చూసేసరికి అర్పిత ఇంట్లో లేదు. ఆమె గది నిండా రక్తం ఉంది. ఆమె కోసం వెతకగా, ఇంటికి సమీపంలో మురికికాలువలో తలపై తీవ్రగాయాలతో చనిపోయి నగ్నంగా కనిపించింది. దీంతో కావలి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అర్పితపట్ల నయన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఎదురుతిరగడంతో ఎక్కడ నిజం బయటకు చెప్పేస్తుందోనన్న కారణంతో ఆమెను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.బెయిల్ పిటిషన్లు కొట్టివేత.. నిందితుడు నయన్ బిశ్వాస్ నెల్లూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టేసింది. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నయన్ బిశ్వాస్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ అతని పిటిషన్‌ను కొట్టేశారు.

నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్‌తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్‌షాక్‌కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్‌లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్‌ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్‌కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్‌తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025

నోటీసు పీరియడ్‌లో ఉండగానే, పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్‌మెన్‌కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది. భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌కాల్స్‌కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్‌లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్‌కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలుఅత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)అనియంత్రిత డెడ్లైన్లుపరిమిత మానసిక ఆరోగ్య మద్దతుముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్‌స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించి సాయం పొందండి. తెలంగాణలో.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఆంధ్రప్రదేశ్‌లో.. 1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100జీజీహెచ్ కాకినాడ.. 98499-03870