Telangana News: సారొస్తున్నారు
Sakshi News home page

సారొస్తున్నారు..

Published Wed, Oct 18 2023 1:14 AM | Last Updated on Wed, Oct 18 2023 9:54 AM

- - Sakshi

సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బుధవారం జడ్చర్ల వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యా హ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో తొలిసభ నిర్వహిస్తున్న క్రమంలో నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేలా జనసమీకరణకు సన్నాహాలు మొదలుపెట్టారు. కల్వకుర్తి రూట్‌లో పట్టణ శివారులోని గంగాపూర్‌ ప్రధాన రహదారిని ఆనుకు ని ఏర్పాట్లు చేస్తున్న సభకు సుమారు లక్ష మంది వ రకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు.

‘పాలమూరు’ వేదికగా పాగా వేసేలా..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) అభ్యర్థులు గెలుపొందారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఆ తర్వాత పరిణామ క్రమాల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందస్తుగా కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.

ఉమ్మడి పాలమూరులోని అన్ని స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఆగస్టు 21న జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో సెప్టెంబర్‌ 16న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని నార్లపూర్‌ వద్ద పంప్‌హౌస్‌లో మొదటి మోటారును స్విచాన్‌ చేసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్‌ఎల్‌ఐఎస్‌) ప్రారంభించారు.

 మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్‌ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్‌ చైర్మెనన్‌ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాను సస్యశామలం చేసే ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడాన్ని బట్టి పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటేలా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది.

వరాల జల్లు కురిపించేనా..
జడ్చర్లకు సీఎం కేసీఆర్‌ రానున్న సందర్భంగా ఎలాంటి హామీలు గుప్పిస్తారనే దానిపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, జడ్చర్లకు బైపాస్‌ రోడ్డు నిర్మించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వినిపిస్తోంది.

అదేవిధంగా మున్సిపాలిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోడ్గల్‌ను మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో..
బుధవారం జడ్చర్లలో మధ్యాహ్నం, మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌.. ఈ నెల 26 నుంచి మళ్లీ జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. అనంతరం వచ్చే నెల ఆరో తేదీన గద్వాల, మక్తల్‌, నారాయణపేటలో జరగనున్న సభల్లో ఆయన పాల్గొననున్నారు.

హామీ నెరవేరుతోందంటూ..
2018 ఎన్నికల సందర్భంగా నవంబర్‌ 21న సీఎం కేసీఆర్‌ జడ్చర్లకు రాగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రు.

ఈ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ప్రస్తుతం ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వర లో కృష్ణా జలాలు రానున్నందున ప్రతిష్టాత్మక హామీ నెరవేరుతోందని.. అన్ని అడ్డంకులను దాటి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుస్తాన్నామంటూ కేసీఆర్‌ పాలమూరులో ప్రజా ఆశీర్వాద సభలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సభ సజావుగా సాగేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్‌ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్‌ చైర్మెనన్‌ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement