bahiranga sabha
-
బాబు గురి గులకరాయిపైనే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రోజులే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ న గారా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేదలు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్‌వార్ జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే నాపై వేయించటానికి బాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహగర్జనతో సిద్ధం కావాలి. ఫ్యాన్‌కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త! అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్‌కు ఓటు వేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! ఒక్క ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకేలు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దవారి పిల్లలు అసూయపడేలా.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, డిగ్రీ విద్యార్థులకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్.. ఇవన్నీ కొనసాగుతాయి. మీ జగన్ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది. బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు ఫ్యాన్‌పై రెండు ఓట్లు పడితే జగన్ మార్కు విప్లవాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, స్కూళ్ల రూపురేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తెరిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు రద్దు.. వీటన్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి. అందుకే ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. విప్లవాత్మక పాలన కొనసాగేందుకు.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ అంటుంది. పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్లలను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి.. పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కుటుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇతర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను కూడా అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథకాల డబ్బులు మీకు నిజాలే చెబుతాయి. ఇంటికే వలంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారిపోయిన మన గవర్నమెంట్ స్కూళ్లు, పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇవన్నీ మీకు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 2014లో బాబు మోసాలివీ.. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ♦ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? ♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు. ♦ ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి. ఆ ప్యాకేజీ స్టార్‌ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! జగన్‌ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్! ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి! కులాన్ని హోల్‌సేల్‌గా అమ్మేయగలననే భ్రమతో.. ఏపీని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు ఈ మ్యారేజీ స్టార్‌కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండదు! పెళ్లిళ్లే కాదు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు. వెనుకటికి ఒకడు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బెటు్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్‌తో గటగట తాగేది బాబు.. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్! బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్‌తో.. బీజేపీలోకి వదినమ్మ ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్‌లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్‌దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే! మత్స్యకారులకు మాటిస్తున్నా.. కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. బాబుకు మిగిలింది గులక రాళ్లే... చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కనిపించదు. ఎన్నికల తరువాత మోసాలు చేయడం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. మన మైలు రాళ్లు.. గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. -
టీజే ఫ్లాప్ షో!
ఆరు లక్షల మందన్నారు.. సిద్ధం సభలను మించి జనం కదిలివస్తారని ఊదరగొట్టారు.. ఈ సభకు హాజరయ్యే జనసందోహంతో అధికార పార్టీ దిమ్మ తిరిగిపోతుందని పగటి కలలుగన్నారు.. అందుకే రెండు పార్టీలకు పట్టున్న ప్రాంతంలో ఉమ్మడిగా సభ పెట్టారు.. ఎంత చేసినా జనం రారని తెలుసుకాబట్టే తక్కువ స్థలంలో ఏర్పాట్లు చేశారు.. ఆ స్థలం కిక్కిరిస్తే.. దానినే కొండంతలు చేసి చూపిస్తూ చంకలు గుద్దుకోవాలని స్కెచ్ వేశారు.. తీరా 40–50 వేలు కూడా దాటక పోవడంతో బిక్క మొహం వేయడం బాబు, పవన్‌ల వంతు అయితే.. ఇలాగైతే ఈ ఎన్నికల్లోనూ ఏడిసినట్లే అనుకోవడం ఇతర నేతలు, కార్యకర్తల వంతు అయింది. ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిరో టీ–జే మీటింగ్’ అని పాడుకోవాల్సిన తరుణమిది. సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, భీమవరం : జనాదరణ లేక టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ తుస్సుమంది. అంతా.. ఇంతా.. నభూతో.. అన్నట్లు నాలుగైదు రోజులుగా ఊదరగొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు ఈ సభకు వచ్చిన జనం మాటెత్తడం లేదు. టీడీపీ–జనసేన పొత్తుకు జనం మద్దతును ఈ సభతో చాటిచెబుతామంటూ ఇరు పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కేడర్ నిరసనల్ని, మనోభావాల్ని లెక్కచేయకుండా చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిగత అ‘జెండా’తో నిర్వహించిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలివస్తారంటూ ఎల్లో మీడియాలో మోత మోగించారు. తాడేపల్లిగూడెం సమీపంలో 22 ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. తీరా టీడీపీ–జనసేన పార్టీల కేడర్ నిరాదరణతో కాస్తా ఫ్లాప్ షోగా మిగిలింది. ఈ పొత్తు తమకు అంగీకారం కాదని స్పష్టం చేస్తూ నాయకులు, కింది స్థాయి కేడర్ సభను తుస్సుమనిపించారు. ప్రజలు పొత్తుకు బ్రహ్మరథం పడతారని చంద్రబాబు, పవన్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. టీడీపీ–జనసేన సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ జెండా సభకు వారి లక్ష్యంలో పది శాతం మంది కూడా రాకపోవడం ఆ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని ఫోన్లలో సమాచారం అందించినా, ఆ సభకు హాజరైన వారి సంఖ్య చూసి ఆ పార్టీల అగ్ర నేతలు విస్తుపోయారు. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సగం పైగా కుర్చీలు ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కంగుతిన్నారు. టీ–జే పార్టీ నేతల్లో నైరాశ్యం పొత్తు ముసుగు తొలగిపోయి జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌లు, పార్కింగ్‌కు ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీల చొప్పున 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు వేశారు. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క. అయితే సభ ప్రారంభం నుంచి చివరిదాకా సగం గ్యాలరీలు ఖాళీగానే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 5.30 గంటలకు మొదలైంది. మొత్తం 22 గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రముఖులు, మీడియా, మహిళల కోసం ఆరు గ్యాలరీలు, మిగిలినవి కార్యకర్తలకు కేటాయించారు . పట్టుమని 11 గ్యాలరీలు కూడా నిండలేదు. మిగిలిన గ్యాలరీలన్నీ సగం ఖాళీగానే కనిపించాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సగం గ్యాలరీలు నిండలేదు. వాస్తవానికి ఆరు లక్షల మంది జనం వస్తారని టీడీపీ–జనసేన నేతలు చెప్పారు. అయితే అది సాధ్యం కాదని వారికీ తెలుసు. అందుకే తక్కువ స్థలం ఉన్న చోట సభ నిర్వహించి, జనం కిక్కిరిసిపోతే.. దానినే కొండంతలు చేసి చూపాలన్న టీడీపీ, జనసేన అగ్రనేతల పన్నాగం బెడిసికొట్టింది. మొత్తంగా 40–50 వేల మంది కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రసంగాలకు స్పందన నిల్ సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ, జనసేన నేతలు ప్రసంగించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసేవారికే ప్రసంగించే అవకాశం ఇచ్చారు. కేడర్ నుంచి మాత్రం వారి ప్రసంగాలకు స్పందన రాలేదు. చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని రెండు పార్టీల కేడర్ తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే అనేక మంది తిరుగుముఖం పట్టారు. పవన్‌కళ్యాణ్ ప్రసంగించే సమయానికి జనం మరింత పల్చబడ్డారు. ఈ సభలో అన్నీ వెరైటీలే. సభా ఏర్పాట్ల నుంచి అన్ని వన్ బై టూ ఫార్ములాలోనే కొనసాగాయి. జనసేన, టీడీపీ కేడర్ కూడా ఏర్పాట్లు చూసి విచిత్రంగా అనిపించి నవ్వుకున్నారు. గ్యాలరీల్లో ప్రతి కుర్చీలో టీడీపీ, జనసేన జెండాలు పెట్టారు. ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ పార్టీ జెండా ఊపుతూ ఈలలు వేసేలా ఏర్పాటు చేశారు. గ్యాలరీలు నిండక, జనాలు రాక, రెండు జెండాలు పట్టుకోవడానికి కేడర్ ఇష్టపడక పోవడంతో అసలు ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చెరో హెలికాప్టర్లో చేరుకున్నారు. తర్వాత ఒకే బస్సులో ముప్పావు గంటకు పైగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వేదికపైకి వచ్చి మొత్తం కలియదిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇద్దరూ కరచాలనం చేస్తూ హడావుడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ జెండాను, పవన్ కళ్యాణ్ జనసేన జెండాను ఊపి, తర్వాత జెండాలు మార్చుకున్నారు. వేదికపై చంద్రబాబుకు కుడివైపున టీడీపీ నేతలు ఒక గ్రూపుగా, పవన్‌కళ్యాణ్‌కు ఎడమ వైపున జనసేన నేతలు మరొక గ్రూపుగా కూర్చున్నారు. ఇది ప్రజల పొత్తు, చారిత్రక అవసరమంటూ చంద్రబాబు ముగించగా, 24 సీట్లు ఏమీ తక్కువ కాదు.. నన్ను అభిమానించే వాళ్లెవరూ ప్రశ్నించవద్దంటూ పొత్తుల ప్రస్తావనకు పవన్ ఫుల్స్టాప్ పెట్టారు. బూత్ స్థాయిలో బలం లేని మనం ఎక్కువ సీట్లు ఎలా అడగాలంటూ జనసేన కార్యకర్తల్ని పవన్ తీవ్రంగా నిరాశపరిచారు. టీడీపీ నేత నారా లోకేశ్ తొలి ఉమ్మడి సభకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సభలంటే అలా పెట్టాలి టీడీపీ–జనసేన ఉమ్మడి సభకు హాజరైన పలువురు కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభల గురించి మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఈ సభ ఉంటుందనుకున్నామని, ఇలా పేలవంగా జరుగుతుందనుకోలేదని నిట్టూర్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వ తేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద 110 ఎకరాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6–7 లక్షల మందికిపైగా జనం తరలివచ్చారు. రాప్తాడులో 18న నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. -
మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకోండి
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో వచ్చే మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకుని తిరగాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గోదావరి నుంచి 350 టీఎంసీలు రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని, నంద్యాల జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దోపిడి దొంగలుగా మారారని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదని అది మోసాలయాత్ర అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో విత్తన సరఫరా యూనిట్‌ను, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ ధ్వంసం చేశారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం ఎక్కడ తిరుగుతోందని వైఎస్ షర్మిలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. -
సాధికారతను చాటిన ఎచ్చెర్ల
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పట్టం
సాక్షి, నంద్యాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా సముచితస్థానం ఇచ్చి, సామాజిక న్యాయం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే ఆయన కేటాయించారని చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దేశంలోనే మైనార్టీల పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్ బాషా మాట్లాడారు. నా పాలన చూడండి, నా పథకాలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు లేదన్నారు. పేదలకు, పెత్తందార్లకు జరిగే మహా సంగ్రామంలో ప్రజలంతా పేదల ప్రభుత్వమైన వైఎస్సార్సీపీ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే కల్పించలేదని అంజాద్ బాషా గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ, మొట్టమొదటిసారి వీరందరికీ సంపూర్ణ రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి సమున్నత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. నా అక్క, చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అంటూ ఎస్సీలను తన కుటుంబ సభ్యులుగా వైఎస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరుణ దేవుడు ఇటువైపు తొంగిచూసేందుకు కూడా భయపడ్డాడని, వారంతా హైదరాబాద్‌కు వెళ్లగానే మళ్లీ వర్షాలు పడుతున్నాయన్నారు. బీసీల విలువ జగన్ పెంచుతున్నారు.. ఇక సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్న బీసీ ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు సున్నాతో పోలుస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలంతా సున్నాగానే ఉండిపోయారని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక సున్నా ముందు ఒకటి అనే సంఖ్య పెట్టి బీసీల విలువ పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు బీసీలను నీచంగా చూస్తున్నారని.. గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు అవమానిస్తే సీఎం జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. మీ తోకలు కట్ చేస్తానని నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు అవమానిస్తే అదే వర్గానికి చెందిన వారిని పాలకమండళ్ల సభ్యునిగా చేసి సీఎం జగన్ గౌరవించారన్నారు. ఒళ్లు ఎలా ఉందని మత్స్యకారులను చంద్రబాబు బెదిరిస్తే అదేవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ్యకు పంపి గౌరవించిన ఘనత జగన్‌కు దక్కుతుందని అనిల్ చెప్పారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధంలో మనమంతా మంచి కోసం పోరాడుతున్న జగన్ వైపు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చి వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని.. 2024 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌తో పాటు బంపర్ మెజార్టీలు ఇవ్వాలని అనిల్ అభ్యర్థించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. జోరు వానలోనూ ప్రభం‘జనం’.. ఇక మంగళవారం నంద్యాల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రజలే కనిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారు. జై జగన్.. జైజై జగన్.. జోహార్ వైఎస్సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తామంతా నిలుస్తామని నినదించారు. మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైన సభకు వరుణ దేవుడు స్వాగతం పలికాడు. నాయకులంతా సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ కార్యకర్తలు, ప్రజలు నాయకుల కోసం నిరీక్షించారు. సభకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటెత్తారు. వర్షంవల్ల సభ ఆలస్యమైనా ఓపికతో వారంతా ఎదురుచూశారు. తొలుత యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
చేతల్లో చూపిన ఏకైక ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పేదవర్గాలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు పలు సంక్షేమ పథకాలు, సంస్కరణలు చేపడుతూ వారి గుండె చప్పుడయ్యారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విధానాలను అనుసరిస్తూ పేదల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన మార్కాపురం పట్టణంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సమాజంలో గౌరవం కల్పించిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. ఈ వర్గాలకు సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎం వరకూ పదవులు ఇవ్వడంతోపాటు ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన దేశంలో ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. చంద్రబాబు దళిత, బీసీల వ్యతిరేకి అని చెప్పారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? హైకోర్టు జడ్జిలుగా బీసీలు వద్దంటూ మాట్లాడిన వ్యక్తి అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సామాజిక న్యాయాన్ని నెలకొల్పారని తెలిపారు. ఎటువంటి సిఫార్సులు, లంచాలు లేకుండానే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మంచి స్కూళ్లు, నాణ్యమైన విద్య, ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు సహా అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ వర్గాలు సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాజిక న్యాయం పేరు చెప్పి ఈ వర్గాలను చంద్రబాబు మోసం చేస్తే.., వైఎస్ జగన్ వారిని గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. మార్కాపురానికి మెడికల్ కాలేజీ ఓ వరమని అన్నారు. డిసెంబరు నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అశేష జన వాహిని మొత్తం జగనన్న సైనికులని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ప్రతి ఇంట్లో జగన్ ఫొటో ఉందన్నారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ, వారికి అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన, పుస్తకాలు, బూట్లు, బ్యాగులు ఇస్తున్నారన్నారు. ముస్లింలపై రాజద్రోహం కేసు పెట్టిన చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. నేడు పేద వర్గాల్లో ఇంటికో ఇంజినీర్, డాక్టర్ ఉన్నారంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించి పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని, సీఎం జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించారని తెలిపారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఎస్సీలకు కరెంటు సౌకర్యం కల్పించారని చెప్పారు. రూ.1700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే దానిని పూర్తిచేసే బాధ్యత ఆయన కుమారుడు వైఎస్ జగన్ తీసుకున్నారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రూ.1,700 కోట్లు మంజూరు చేశారన్నారు. పొదిలి పెద్దచెరువు, మార్కాపురానికి సాగర్ నీటి పైపులైన్ల కోసం, చెన్నకేశవస్వామి నాలుగు గోపురాలకు రూ.3 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల పిచ్చయ్య, లిడ్‌క్యాప్ చైర్మన్ కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో అన్ని రంగాలు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలను ఆత్మబంధువులా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకగలుగుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా శనివారం భీమిలి నియోజకవర్గం తగరపువలసలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దళితులకు ఏ మేలూ చేయలేదని చెప్పారు. పైగా, అన్ని వర్గాలను మోసం చేశారని, మహిళలపై దాడులు చేయించారని, అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బతుకులు బాగు చేశారని తెలిపారు. బడుగులకు రాజ్యాధికారం రావాలన్న అంబేడ్కర్ కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు. మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు. పేదవాడికి మంచి వైద్యాన్ని, మంచి విద్యను అందిస్తున్నారని, మంచి గూడు ఉండాలన్న ఆలోచనతో ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 650కు పైగా వాగ్దానాలు ఇచ్చాయని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. వారంతా కలిసి మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. ఇంత మంచి ఎప్పుడూ జరగలేదు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న మంచి గతంలో ఎప్పుడూ జరగలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదవాలని సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టారని, ఇది ఇష్టంలేని దత్త పుత్రుడు పవన్ వ్యతిరేకంగా మాట్లాడటం మన దౌర్భాగ్యమని చెప్పారు. ఇటీవల తాను యూఎస్‌లో ఒక సమావేశానికి వెళితే.. ఓ యువకుడు వచ్చి అతని తండ్రి రిక్షా తొక్కే వాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఉన్నత చదువులు చదివానని, ఇప్పుడు సాప్‌్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ఆనందంతో చెప్పాడన్నారు. ప్రస్తుత సీఎం జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మందికి అందించడమే కాకుండా, విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమని కొనియాడారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయనప్పటికీ, జగనన్న సంక్షేమ పథకాల రూపంలో రెండున్నర లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేశాడని ఓ మహిళ ఇటీవల తనతో చెప్పారన్నారు. ఇలా.. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కుల, మత, పార్టీ రహితంగా ఎంతో మంది పేదలు లబి్ధపొందారన్నారు. సీఎం జగన్ బీసీలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే మొదటిగా అభివృద్ధి జరిగేది భీమిలి నియోజకవర్గమని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక మెజారిటీ ఇచ్చి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, మాజీ మంత్రి బాలరాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ‘దొరికిన దొంగ’ చంద్రబాబు: మంత్రి సీదిరి అప్పలరాజు పేదలకు మేలు జరగడం ఇష్టం లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు అచ్చేయడం కాదని, ఈరోజు భీమిలిలో జరిగిన సామాజిక న్యాయాన్ని చూడాలని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వారు రాస్తున్నట్లు తుస్సుమనే యాత్ర కావాలంటే నారా భువనేశ్వరి యాత్ర చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా మత్స్యకారులమంతా వెళితే.. తాట తీస్తా.. తోలు తీస్తా అంటూ అవమానించారన్నారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని అవమానించారు. ఇలా అన్ని వర్గాలను అవమానించిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడని, ఆయనో ‘దొరికిన దొంగ‘ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ సోదరుడు చంద్రబాబు చేసిన అవమానాలను గుర్తుంచుకుని వచ్చే ఎన్నికల్లో సీఎంగా మరోసారి జగనన్నను ఆశీర్వదించాలన్నారు. -
సారొస్తున్నారు..
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం జడ్చర్ల వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యా హ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో తొలిసభ నిర్వహిస్తున్న క్రమంలో నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేలా జనసమీకరణకు సన్నాహాలు మొదలుపెట్టారు. కల్వకుర్తి రూట్లో పట్టణ శివారులోని గంగాపూర్ ప్రధాన రహదారిని ఆనుకు ని ఏర్పాట్లు చేస్తున్న సభకు సుమారు లక్ష మంది వ రకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ‘పాలమూరు’ వేదికగా పాగా వేసేలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అభ్యర్థులు గెలుపొందారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఆ తర్వాత పరిణామ క్రమాల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందస్తుగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి పాలమూరులోని అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఆగస్టు 21న జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో సెప్టెంబర్ 16న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ వద్ద పంప్‌హౌస్‌లో మొదటి మోటారును స్విచాన్ చేసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్ఎల్ఐఎస్) ప్రారంభించారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాను సస్యశామలం చేసే ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడాన్ని బట్టి పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటేలా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. వరాల జల్లు కురిపించేనా.. జడ్చర్లకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఎలాంటి హామీలు గుప్పిస్తారనే దానిపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అదేవిధంగా మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోడ్గల్ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. బుధవారం జడ్చర్లలో మధ్యాహ్నం, మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 26 నుంచి మళ్లీ జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. అనంతరం వచ్చే నెల ఆరో తేదీన గద్వాల, మక్తల్, నారాయణపేటలో జరగనున్న సభల్లో ఆయన పాల్గొననున్నారు. హామీ నెరవేరుతోందంటూ.. 2018 ఎన్నికల సందర్భంగా నవంబర్ 21న సీఎం కేసీఆర్ జడ్చర్లకు రాగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రు. ఈ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ప్రస్తుతం ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వర లో కృష్ణా జలాలు రానున్నందున ప్రతిష్టాత్మక హామీ నెరవేరుతోందని.. అన్ని అడ్డంకులను దాటి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుస్తాన్నామంటూ కేసీఆర్ పాలమూరులో ప్రజా ఆశీర్వాద సభలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సభ సజావుగా సాగేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగామ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
సీఎం పర్యటన సైడ్ లైట్స్ ► 3.46 నిమిషాలకు వికాస్‌నగర్‌కు హెలికాప్టర్ చేరుకుంది. ► 3.49 హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ► 3.51 నిమిషాలకు మంత్రులు, పల్లా, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు. ► 3.52 గంటలకు హెలిపాడ్ నుంచి బయలుదేరారు. ► 3.55 సభా వేదికపైకి చేరుకున్నారు. ► 4.21 ప్రసంగం ప్రారంభించి, 4.49 గంటలకు ముగించారు. వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ తొలి ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడం.. ఆపార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. జనగామ నియోజకవర్గంలోని గత పరిస్థితులను.. తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితులను తన ప్రసంగంలో వివరించారు. ఒక్కో వర్గం వారికి ఏం చేస్తున్నారో.. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారో చెబుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జనగామ పట్టణం సిద్దిపేట రోడ్డున ఉన్న మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచే ప్రజలు, పార్టీ శ్రేణుల రాక మొదలవగా.. 11 గంటల వరకే ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, దివంగత సాయిచంద్ బృందం కళాకారుల తెలంగాణ ధూం ధాం పాటలు సభికులను ఉత్తేజపర్చాయి. జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సీపీ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో డీసీపీ పి.సీతారాం ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి మెడికల్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సిద్ధయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఒగ్గుడోలు విన్యాసాలు, మహిళల కోలాటం, బతుకమ్మలు, బోనాలు, ముస్లిం మైనార్టీల కళారూపాలతో ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం రాక రెండు గంటలు ఆలస్యం.. సీఎం.. బహిరంగ సభలో మధ్యాహ్నం 1.45 గంటలకు పాల్గొనాల్సి ఉండగా.. రెండు గంటలు ఆలస్యంగా 3.55 గంటలకు వచ్చారు. ఆయనకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు స్వాగతం పలికారు. ముందుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం చలోక్తులు.. సభా వేదికపై సీఎం కేసీఆర్ అడుగుపెట్టగానే.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినదించారు. ప్రజలకు అభివాదం చేస్తూనే.. ‘అమ్మో.. పల్లా హుషార్గానే ఉన్నాడు.. నాకు తెలియదు ఇంత దమ్మున్నోడని’ అంటూ తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన చిట్టాను రాజేశ్వర్‌రెడ్డి చదివి వినిపించగా.. ‘దొడ్లకు వచ్చిన గోద.. పెండ పెట్టకుండా ఉంటదా.. నేను వచ్చాను కదా.. ఇక ఆ హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చి తీరుతా.. లేదంటే పల్లా ఊరుకోడు కదా’ అంటూ మాట్లాడారు. రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసి తీరుతామంటూ వాగ్దానం చేశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో కరువుతో అల్లాడిన బచ్చన్నపేటను చూసి ఏడ్చిన.. ఇప్పుడు పచ్చని పొలాలు చూస్తూ మురిసిపోతున్నా.. ఇదే మన తెలంగాణ స్పెషాలిటీ’ అంటూ కేసీఆర్.. నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేశారు. కరువుకు కేరాఫ్‌గా ఉన్న జనగామ రైతుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్ర ముఖం తెలివికి వచ్చిందంటూ అన్నదాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయాలని సీఎం అనడంతో జనం పెద్ద ఎత్తున స్పందించి కేరింతలు కొట్టారు. ఎన్నికల తర్వాత జనగామకు వచ్చి రోజంతా తిరుగుతానంటూ శ్రేణుల్లో జోష్ నింపారు. ‘జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, లద్నూరులో రెండు, మూడువేల మంది మిత్రులు ఉన్నారు.. మేరా దోస్తోంకో చేర్యాల్.. నా దోస్తులు ఉన్న ఇలాఖాలోనే ఎన్నికల చివరి సభ ఉంటుంది’ అంటూ ప్రసంగం ముగించారు. సభావేదికపై నేతలందరూ ఆసీనులవగా అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. కేసీఆర్ ప్రసంగం ముగిసేంత వరకు పక్కన నిల్చున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మహిళా కమిషన్ సభ్యురాలు జి.పద్మ, గాంధీ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పి.జమునలింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త గుజ్జ సంపత్‌రెడ్డి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, బాల్దె సిద్దిలింగం, తాళ్ల సురేశ్‌రెడ్డి, బండ యాదగిరిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి
నిజామాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీలో జోష్ మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. -
కేటీఆర్ షాడో సీఎం
సుభాష్ నగర్ (నిజామాబాద్): మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని... తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరులో, 3న ఇందూరులో నిర్వహించే బహిరంగ సభలలో ప్రధాని పాల్గొంటారన్నారు. ఇందూరు సభలో ప్రధాని మోదీ రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదేం? ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు తెలంగాణకు ఏం మేలు చేశారో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడాన్ని విలేకరులు కిషన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం 17 సార్లు టీఎస్‌పీఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించినా యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. అలాగే దళిత సీఎం హామీతోపాటు దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ హామీని సైతం అటకెక్కించారని... రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం మేలు చేశారో చెప్పాలని ప్రతిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానంటూ దాటవేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు. మోదీ సభకు లక్ష మందితో జనసమీకరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం నిజామాబాద్‌లోని బస్వా గార్డెన్లో ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలను సమీకరించాలన్నారు. మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో మరో వర్గం యువకుడి దాడిలో గాయపడిన యువతి, వారి కుటుంబసభ్యులను మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మజ్లిస్‌ను బుజ్జగింపుల నేపథ్యంలోనే లవ్‌జిహాద్‌తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
‘తిరగబడదాం.. తరిమికొడదాం’తో ప్రజల్లోకి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందులో భాగంగా రానున్న నెల రోజుల పాటు ‘తిరగబడదాం.. తరిమి కొడదాం’కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న నెలరోజుల పాటు రాష్ట్రంలోని గ్రామగ్రామాన కాంగ్రెస్ నేతలు తిరగాలని, ప్రతి ఇంటి తలుపూ తట్టి కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు చేసిన మేలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. శనివారం గాందీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాద వ్, అజారుద్దీన్, పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమ నిర్వహణతో పాటు చేవెళ్లలో ఈనెల 26న నిర్వహించనున్న బహిరంగసభ విజయవంతంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, చేవెళ్ల ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఖమ్మం తరహాలోనే ఈ సభను విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు, కేడర్ పనిచేయాలని కోరారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాల ని సూచించారు. సెప్టెంబర్ 17న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, అప్పటివరకు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయనున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ, తిరగబడ దాం... తరిమికొడదాం కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లలోని అంశాలను, చార్జిషీట్లను విస్తృతంగా ప్రచారం చేయాల ని కోరారు. కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు స్కీంలను కూడా ప్రతి ఇంటికి చేర్చే బాధ్యతను కాంగ్రెస్ కేడర్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమానికి పార్లమెంటరీ స్థానాల వారీగా ఇన్చార్జులను నియమించినట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు. -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
ఖమ్మంలో అమిత్‌షా సభ అదిరిపోవాలి..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా ఈనెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను దేశవ్యాప్త ప్రచారం చేయడం లక్ష్యంగా ‘మహా జన సంపర్క్ అభియాన్’పేరిట నిర్వహిస్తున్న బీజేపీ అగ్రనేతల పర్యటనల్లో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. అమిత్‌షా సభ ఏర్పాట్లకు సంబంధించి శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ కమిటీల సభ్యులతో సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించే సత్తా బీజేపీ నాయకులకు ఉందా? అంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. వారికి కనువిప్పు కలిగేలా, ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించే సమయం వచ్చింది. ఐదు రోజులే గడువుంది. ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలి.. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను సక్సెస్ చేద్దాం.’’అని సూచించారు. ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘నేను ఖమ్మం సభకు పోతున్నా.. మీరూ వస్తున్నారా?’అంటూ విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. భద్రాద్రి రాములోరి దర్శనానికి అమిత్‌షా బహిరంగ సభకు 15న ఖమ్మం విచ్చేస్తున్న అమిత్‌షా భద్రాచలం వెళ్లి శ్రీ రాముల వారిని దర్శించుకుంటారు. ఈ పర్యటనలో భాగంగానే హైదరాబాద్‌లో పార్టీ పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో కూడా అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాగా, మహా జనసంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 25న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగసభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ మేడ్చల్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రోడ్‌షో, నల్లగొండ పట్టణంలో బహిరంగసభలో పాల్గొంటారు. లక్ష జనసమీకరణ లక్ష్యం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో నిర్వహించే అమిత్ షా బహిరంగ సభకు జన సమీకరణపై బీజేపీ దృష్టి సారించింది. లక్ష మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించి సభను సక్సెస్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని 47 మండలాలు, 3 మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో నియమితులైన ఇంచార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఇన్చార్జిలు నియోజకవర్గాల్లోనే మకాం వేసి పోలింగ్ బూత్‌ల వారీగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే ♦ పని చేసేందుకు సిద్ధం.. బిస్తర్ కూడా రెడీ ♦మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ ♦ అధ్యక్ష మార్పుపై మీడియా వార్తలు పట్టించుకోవడం లేదని స్పస్టీకరణ సాక్షి, హైదరాబాద్: పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా , ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనను మారుస్తారని మీడియాలో వచ్చిన వార్తలు పట్టించుకోవడం లేదన్నారు. అవన్నీ కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. ఐతే ఏ నిర్ణయం తీసుకున్నా బిస్తర్ రెడీగా పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ’’కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. మా పార్టీలో అలాంటి లీకులకు తావుండదు’’అని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర మంత్రి పదవి దక్కినప్పుడు వారి పేర్లు బయటటకు వచ్చాయా? అని ప్రశ్నించారు. తాను పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేస్తాననీ, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదన్నారు. బీజేపీలో జాయినింగ్స్ కోసం ఎవరో వస్తారని తాము ఎదురుచూడమని బండి స్పష్టం చేశారు. బీఆర్ఎస్కి బీజేపీతోనే పోటీ బీఆర్ఎస్తోనే బీజేపీకి ప్రధాన పోటీ తప్ప కాంగ్రెస్‌తో కాదని సంజయ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చేయించుకున్న సర్వేలోనే బీజేపీకి ఆదరణ పెరిగినట్టు తేలిందని చెప్పారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే తేల్చిందన్నారు. అందుకే కేసీఆర్ బీజేపీకి భయపడి కాంగ్రెస్‌ను జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడితే, బీఆర్ఎస్కు భవిష్యత్‌లో అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ ఇబ్బంది పడుతోందన్నారు. కాంగ్రెస్ లో ఇక్కడి నుంచి కాకపోతే పాకిస్తాన్ నుంచి అయినా చేర్చుకోనివ్వండి.. మాకేం ఇబ్బంది లేదన్నారు. కవితపై ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోందని చెప్పారు. చార్జిïÙట్ లో పేరు లేకుంటే బీజేపీకి, బీఆర్ఎస్కు మధ్య ఒప్పందం కుదరినట్లా అని బండి ప్రశ్నించారు. తప్పు చేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
అమిత్‌షా చేవెళ్ల సభపై రాజకీయ వేడి
-
సా.6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
-
కాంధార్ లోహలో నేడు బీఆర్ఎస్ సభ
సాక్షి, హైదరాబాద్: ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్రలోని కాంధార్ లోహలో ఆదివారం జరిగే బహిరంగ సభకు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభకు అధ్యక్షత వహిస్తారు. ఆదివారం ఉదయం 12.30 సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బహిరంగ సభ కాంధార్ లోహకు చేరుకుని బస్సులో సభా స్థలికి చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్ ద్వారా నాందేడ్‌కు చేరుకుంటారు. సూర్యాస్తమయానికి ముందే నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరి వస్తారు. నాందేడ్ విమానాశ్రయం నుంచి రాత్రి సమయంలో విమానాలు నడిచే అవకాశం లేనందున సాయంత్రం నాలుగు గంటల లోగా సభ ముగుస్తుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 18 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు కాంధార్ లోహలోని బైల్‌బజార్ కూడలిలో 18 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ వేదికతో పాటు తాత్కాలిక షెడ్ల నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కాంధార్ లోహతో పాటు పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌తో బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీబీ పాటిల్ శనివారం అక్కడికి చేరుకుని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థలపై ఫోకస్ భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడంలో భాగంగా తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. గత నెల 5న నాందెడ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేరికల సభ నిర్వహించగా, ప్రస్తుతం కాంధార్ లోహలో మలి సభను నిర్వహిస్తున్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్, ఎన్సీపీతో పాటు పలు ప్రజా సంఘాలకు చెందిన బీఆర్ఎస్లో చేరారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఆదివారం జరిగే బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నేతలు వెల్లడించారు. తెలంగాణ మోడల్‌కు ప్రాధాన్యత బహిరంగ సభకు జన సమీకరణతో పాటు మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్ స్క్రీన్ ప్రచార వాహనాలను ఉపయోగిస్తోంది. 16 తాలూకాల పరిధిలోని 1,600 గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తతంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రచార రథాలను ఉపయోగిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంధార్ లోహ తరహాలో మరిన్ని సభలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. -
CM KCR: జగిత్యాలకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ పూర్తిచేశారు. సాయంత్రం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 2 లక్షల మందిని సీఎం సభకు సమీకరించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు, నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై నాయకులు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం కూడా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో వస్తుండటంతో సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్సీ కవిత కూడా తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు ►బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ►12.35 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.40 గంటలకు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం ►ఒంటి గంటకు మెడికల్ కళాశాల భవనం, మధ్యాహ్నం 1.15 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభం ►3.10 గంటలకు మోతె గ్రామంలో బహిరంగసభ ►సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరి తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ►మరునాడు ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి, అనంతరం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహవేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత కరీంనగర్‌లోని తీగలబ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు హెలికాప్టర్లో తిరుగుప్రయాణం కానున్నారు. -
నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్
నిర్మల్: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన నంబర్ వన్ తెలంగాణ ద్రోహి, సారా స్కాంలో తన బిడ్డను అరెస్టు చేస్తే ఉద్యమం చేయాలంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్ర ఏడోరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? బీజేపీని, మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడని సంజయ్ విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని, అందుకే సీఎం పీఠంపై కూర్చున్నావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా..? లేక రజాకార్లపై పోరాడిన మరో ఝాన్సీ లక్ష్మీబాయా..? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిందని ఆరోపించారు. అలాంటి కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆయన కుమార్తె కవిత ప్రస్తుతం కేసుల భయంతో ఒకటే విలపిస్తున్నారని, వారి కన్నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుతోందని బండి సంజయ్ ఎదేవా చేశారు. అల్లోల అవినీతి తిమింగలం.. రెండు వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోరు ఇంద్రకరణ్‌రెడ్డి అని, అధికారంలోకి వచ్చాక అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తామని సంజయ్ హెచ్చరించారు. మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. జనవరి 10లోపు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు కాలేరని, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని సంజయ్ సూచించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలన్నారు. హిందు అమ్మాయిలను లవ్‌జిహాద్ పేరిట వేధించే వాళ్ల బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను 35 ముక్కలుగా నరికితే ఒక్క సెక్యులర్ నాయకుడు, ఏ సంఘమూ మాట్లాడలేదని మండిపడ్డారు. కేరళలో లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటే, ట్రిపుల్ తలాక్ పేరిట మహిళలను ఇబ్బందులు పెడుతుంటే క్రైస్తవ, ముస్లిం సంఘాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతాం తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. బీజేపీ అధికారంలోకొస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని అన్నారు. నిర్మల్‌కు బుల్డోజర్లను పంపి అక్రమంగా నిర్మించిన బడా బాబుల ఇళ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపి తీరతామని పునరుద్ఘాటించారు. -
12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు వామపక్షాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితు లను కేడర్‌కు తెలియజెప్పాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ నెల 12న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ ఎన్నికలు రావడానికి కారణం ఎవరనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి. బీజేపీ ఎత్తుగడతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యవ హరిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీ నామా చేయించి, అనంతరం ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయా లన్నది ఎత్తుగడ. బీజేపీ వ్యూహాన్ని ఎండగట్టడం, దాని మతోన్మాద వైఖరిని తూర్పార బట్టడం ఈ సభ ఉద్దేశమని సీపీఐ, సీపీఎం నాయకులు వెల్ల డించారు. అంతేకాదు దేశంలో బీజేపీ ఆర్థిక విధానాల వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియచేస్తామన్నారు. బీజేపీ ప్రమా దాన్ని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కేడర్‌లోకి తీసుకెళ్తారు. రెండు కమ్యూనిస్టు పార్టీల్లోని కేడర్‌లో టీఆర్ఎస్పై అక్కడక్కడ అసంతృప్తి నెలకొంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్న అంశంపైనా కేడర్‌లో కొంత విముఖత వ్యక్తమవుతోంది. దాన్ని పసిగట్టిన రెండు పార్టీలు సభ నిర్వహించడం ద్వారా తమ విధానాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లనున్నాయి. -
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్... నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరవుతుండటంతో జనసమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ కోసం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మునుగోడులో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు భారీ జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్రియాశీల నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి గ్రామాలు, వార్డులవారీగా జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ సభ మర్నాడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌కు ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సభ ద్వారానే బీజేపీలో చేరనున్న నేపథ్యంలో బీజేపీ సభను దృష్టిలో పెట్టుకొని జనసమీరణను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు మునుగోడు సభకు జనసమీకరణపై దృష్టి పెడుతూనే మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరికలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులైన 20 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. శనివారం మనుగోడు సభలో సీఎం సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు సభ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. -
ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం అందించాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ధి చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
సెప్టెంబర్ 17న రాహుల్ సభ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట మరో భారీ బహిరంగసభకు సన్నాహాలు చేస్తోంది. ఈ సభతో నిరుద్యోగులకు స్నేహ‘హస్తం’అందించాలని ప్రయత్ని స్తోంది. ఈ సభకు అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 17న రాహుల్‌గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తాజాగా ఢిల్లీలో ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. మూడు నెలల క్రితం వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభ కాంగ్రెస్‌కు మంచి ఊపు తెచ్చిందని నేతలు భావిస్తున్నారు. తాజాగా నిరుద్యోగ డిక్లరేషన్ సభ ఉంటుందన్న ప్రకటన రావడంతో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వరుస సభలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 17న నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో ఈ సభ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా, ఉద్యోగ ప్రకటనలు, ఇతరత్రా అంశాలతో రైతు డిక్లరేషన్‌లాగా కార్యాచరణ ప్రకటిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో యువతను పార్టీ వైపు ఆకర్షించవచ్చని నేతలు అంచనా వేస్తున్నా రు. ఆ రోజు సభ కోసం పార్టీలోని సీనియర్లతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలపై డిక్లరేషన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. -
‘విజయ సంకల్పసభ’గా మోదీ బహిరంగ సభ!
సాక్షి, హైదరాబాద్: జూలై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగసభకు ‘విజయసంకల్ప సభ’గా నామకరణం చేసినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 2న మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నోవాటెల్–హెచ్ఐసీసీలోని జాతీయ కార్యవర్గ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా మోదీ నోవాటెల్‌లో బసచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అయితే నోవాటెల్‌తో పాటు వెస్టిన్ హోటల్, మరోచోట ఇంకా రాజ్‌భవన్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రెండురోజుల పాటు నగరంలోనే విడిది చేస్తున్న సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లేదా హైదరాబాద్‌లోని ఏదైనా ఒక ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించే (సర్ప్రైజ్ విజిట్’) అవకాశాన్ని కొట్టిపడేయలేమని పార్టీ నాయకులు తెలిపారు. 1న సమావేశాల ఎజెండా ఖరారు జూలై 1–4 తేదీల మధ్య జరిగే భేటీ నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా 1న మధ్యాహ్నమే హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తర్వాత నోవాటెల్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో పాల్గొని జాతీయ సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారు. కాగా సమావేశాలు, మోదీ సభకు ఏర్పాట్ల తుది పరిశీలన నిమిత్తం పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌జీ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల రిజిస్ట్రేషన్లు, బస, భోజనం, మీటింగ్ హాలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. నోవాటెల్‌లో వివిధ కమిటీల ద్వారా చేసిన సన్నాహాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు మంగళవారం సమీక్షించారు. 3న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రూపొందించిన ‘హలో ఆదివాసి, గిరిజన –చలో హైదరాబాద్’పోస్టర్‌ను పార్టీకి చెందిన గిరిజన నేతలతో కలిసి సంజయ్ అవిష్కరించారు. నేటి నుంచి నియోజకవర్గాలకు.. జాతీయ కార్యవర్గసభ్యుల్లో 30 మంది దాకా బుధవారమే నగరానికి చేరుకుంటారు. వారంతా నేరుగా రాష్ట్రంలో తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళతారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు గురువారం తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళతారు. -
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేస్తాం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 2, 3 తేదీల్లో ,తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభను సక్సెస్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈనెల 3న హైదరాబాద్‌లో 10 లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్‌ల నుంచి కార్యకర్తలు, కేంద్ర పథకాల లబ్ధిదారులతోపాటు సామాన్యులు ఈ సభకు తరలొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయకార్యవర్గ భేటీకి సంబంధించి నోవాటెల్ హోటల్లో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం సంజయ్, సమావేశ ఏర్పాట్ల ఇన్చార్జి అరవింద్ మీనన్, పార్టీ నేతలు రామచందర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చాడ సురేశ్‌రెడ్డి, బంగారు శ్రుతి, కొల్లి మాధవి, జె.సంగప్ప పరిశీలించారు. అనం తరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ సర్కా ర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పన్నులభారం మోపుతూ ప్రజలను రాచి రంపాన పెడుతోంది. దీనిపై బీజేపీ బెదరకుండా అనేక పోరాటాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో బీజేపీపట్ల మరింత విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు జరగుతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్‌లో రెండ్రోజులుండటం కార్యకర్తలకు మరింత భరోసాను ఇస్తుంది’అని సంజయ్ వెల్లడించారు. అంతకుముందు సంజయ్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని సహా ఇతర జాతీయ నేతలకు సంబంధించిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. భేషజాలకు పోవద్దు.. బాసరకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను సంజయ్ కోరారు. విద్యార్థుల డిమాండ్లపై చర్చలు జరపకుండా వారి ఆందోళనలకు రాజకీయాలు ఆపాదించడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. 7 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా స్పందించకుండా కేసీఆర్ మరో ‘‘నీరో చక్రవర్తి’’గా వ్యవహరిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. వర్సిటీకి శాశ్వత వీసీ ఉండాలని, విద్యార్థులు కోరుతున్న మొత్తం 12 డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరింపదగినవేనని సంజయ్ అభిప్రాయపడ్డారు. -
3న మోదీ సభకు రండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరుకావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆహ్వానాలు పంపించాలని ఆ పార్టీ అగ్రనాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసి, పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పత్రికను అందజేయనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ సభకు హాజరై దిశా నిర్దేశం చేయ నున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్చార్జి అరవింద్ మీనన్ వరుస సమీక్షలు నిర్వహించారు. -
నేటి నుంచే ‘ప్రజా ప్రస్థానం’
సాక్షి, హైదరాబాద్/చేవెళ్ల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు బుధవారం చేవెళ్లలో శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు చేవెళ్లలోని శంకర్పల్లి క్రాస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. చేవెళ్ల బస్టాండ్ సెంటర్ మీదుగా 2.5 కిలోమీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుని.. సాయంత్రం 3.00 గంటలకు యాత్ర మళ్లీ ప్రారంభిస్తారు. ఎర్రోనికొటల, కందవాడ, గుండాల మీదుగా నారాయన్‌దాస్‌గూడ క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. మొహినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద రాత్రి బస చేస్తారు. తొలిరోజు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత రోజు నక్కలపల్లిలో పాదయాత్ర మొదలై.. కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గుండా సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత యాత్ర మల్కపురం చేరుకుంటుంది. అక్కడ షర్మిల స్థానికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రాత్రికి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస చేయనున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే.. ప్రజల కష్టాలు తెలుసుకొని.. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఇదే చేవెళ్ల నుంచి దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. తండ్రి బాటలోనే షర్మిల ఈ యాత్రకు సిద్ధమయ్యారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు పిట్ట రాంరెడ్డి, పంబల రాజు, నియోజకవర్గ ఇన్చార్జి కె. దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
బలిదానాలు మీ కోసమేనా?
భూపాలపల్లి: ‘‘కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి.. కేటీఆర్, హరీశ్‌రావు మంత్రులు, ఎంపీగా ఓడిపోయిన కవిత ఎమ్మెల్సీ, సంతోష్ రాజ్యసభ సభ్యుడి పదవి అనుభవిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసింది మీ కుటుంబం కోసమేనా..? అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు నేటికీ దుఃఖిస్తూనే ఉన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో మీరు చేసిందేముంది?’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. నక్సల్స్ ఎజెండాయే తమ ఎజెండా అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఎన్నో ఎన్కౌంటర్లు చేయించి విప్లవకారుల రక్తం నేలచిందించాడని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారందరూ పదవులు అనుభవించాలని నక్సల్స్ ఎజెండాలో ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఎందరో అమరుల త్యాగం ప్రత్యేక రాష్ట్రమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఉన్న అప్పటి ఎంపీ విజయశాంతి సైతం ఇప్పుడు కేసీఆర్ వెంట లేదని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని, జాతీయస్థాయిలో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా.. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేర్చడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్నారని, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లడం ఖాయమని రేవంత్ పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు సింగరేణి కార్మికులు దసరా, దీపావళి పండుగలను పక్కనపెట్టి మరీ సకల జనుల సమ్మెలో పాల్గొంటే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ వారి హక్కులను కాలరాస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓపెన్‌కాస్టుల పేరిట ఈ ప్రాంత భూములను బొందలగడ్డలుగా మారుస్తున్నారని.. ఇక్కడి భూమి, నీరు, జీవితాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు గులాబీ పార్టీని బొందపెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ సభలో మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సీతక్క, శాసనమండలి ప్రతిపక్ష నేత జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్ ‘దండోరా’ సభ
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) వెనుక భాగంలోని మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కళాకారుల ప్రదర్శనతో సభ ప్రారంభంకానుంది. మూడు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత 3:45 గంటలకు రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనాయకుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యంఠాగూర్‌లు చేరుకుంటారు. ఈ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, దళిత, గిరిజనులను మోసం చేస్తున్న తీరుపై వివిధ అంశాలతో చార్జిషీట్ విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా ఈ సభలో పాల్గొనేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. సభా వేదిక ముందు భాగంలో 25 వేలకుపైగా కుర్చీలు వేస్తున్నారు. సభవల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకమైన స్థలాలను కేటాయించారు. గురువారం సాయంత్రం సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ ద్వారా కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు. -
ఆదివాసీ.. హస్తినబాట
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి కదిలి వెళ్తున్నారు. మొదట రైళ్లు, విమానాల్లోనే వెళ్తున్నారనే ప్రచారం జరిగినా వాహనాల్లోనూ పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. జిల్లా నుంచి ముందుగా అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో సభలో పాల్గొననున్నారు. జిల్లా నుంచే సుమారు 3వేల మంది వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదివాసీ ఉద్యమంలో హస్తిన సభ మరో మైలురాయిగా నిలిచే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల నుంచి శుక్రవారం వందలాది వాహనాలు ఢిల్లీ బాట పట్టాయి. వాహనాల్లో వెళ్లేవారు శుక్ర, శనివారాల్లో ప్రయాణాన్ని ఎంచుకొని 9న ఢిల్లీలో ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని బయల్దేరుతున్నారు. కొంతమంది ఆదివాసీ నాయకులు శుక్రవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి తమ ఢిల్లీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆదివాసీల పోరాటానికి చిహ్నంగా నిలిచే ఈ స్తూపం నుంచే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. రైలు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో బోగీలను ముందస్తుగా బుక్ చేసుకొని సిద్ధంగా ఉన్న ఆదివాసీలు పెద్ద ఎత్తున శనివారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి బయల్దేరి వెళ్తున్నారు. ఇక హైదరాబాద్, నాగ్‌పూర్ నుంచి విమాన ప్రయాణానికి సంబంధించి ముందుగానే బుకింగ్ చేసుకున్న వందలాది మంది ఆదివాసీలు శనివారం రాత్రి బయల్దేరి వెళ్తున్నారు. డిసెంబర్ 9.. మళ్లీ ఈ తేదికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017 ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మించి దేశ రాజధాని ఢిల్లీలో సభ చేపట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీల గర్జన వినిపించేలా చేస్తున్నారు. ఈ సభలో దేశంలోని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమైన నాయకులు పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి కూడా పాల్గొననున్నారని ఆదివాసీలు చెబుతున్నారు. ఇక్కడి ఆదివాసీలు మాత్రం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఏజెన్సీలో నకిలీ ధ్రువపత్రాల జారీని నిలిపివేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలనే ప్రధాన డిమాండ్లతో తమ గళాన్ని ఈ సభ ద్వారా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ సభకు సంబంధించి ఆదివాసీలు గత కొద్ది నెలలుగా ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా కదులుతూ వస్తున్నారు. నవంబర్ 18న ఉట్నూర్‌లో నిర్వహించిన ర్యాలీ ఢిల్లీ సభకు ముందు బలప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో పోలీసులు నిరంతరం నిఘా సారించడంతో ఆదివాసీలు సభ విషయంలో నిర్ణయాలకు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారని కొంతమంది ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. వేర్వేరు చోట్ల సమావేశాలు నిర్వహిస్తే సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతో రాయిసెంటర్లలో సార్‌మేడిల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా వేలాది మందిని ఈ సమావేశాల ద్వారా ఢిల్లీ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. వందలాది వాహనాలు, రెండు రైళ్లలో వేలాది మంది బయల్దేరుతున్నారు. అలాగే వందలాది మంది విమాన ప్రయాణం ద్వారా ఢిల్లీ చేరుకోనున్నారు.పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఢిల్లీ వెళ్లిన ఎంపీ సోయం బాపురావు సభ జరిగే రాంలీలా మైదానాన్ని పరిశీలించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆదివాసీలు తరలిరానుండడంతో మైదానంలో స్థితిగతులను చూశారు. ఇలా అప్పటి నుంచే సభ విషయంలో సోయం బాపురావు ఏర్పాట్లను ముందుండి చేపట్టారు. ఆ తర్వాత జిల్లాకు తిరిగి వచ్చినా మళ్లీ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఇటు సమావేశాల్లో పాల్గొంటూనే మరోపక్క సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైలు మార్గం ద్వారా సభకు వెళ్తున్న వేలాది మందికి మధ్యలో రెండు చోట్ల భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలో రెండు ఫంక్షన్ హాళ్లలో ఇక్కడినుంచి వెళ్లేవారికి కోసం వసతి కల్పించారు. ఏదేమైనా 9న సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ⇒ ఇది ఆదివాసీ అస్తిత్వ కోసం జరుగుతున్న పోరాటం. మొదట 5వేల మందితో ఢిల్లీలో సభ నిర్వహించాలని అనుకున్నాం. కాని పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా ఆదివాసీలు తరలివస్తుండడంతో ఈ సంఖ్యను అంచనా వేయడం కష్టమే. 50వేలకుపైగా తరలివచ్చే అవకాశం ఉంది. 35 మంది ఆదివాసీ ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు ఫగల్సింగ్ కులస్తే, రేణుక సరోడే, అర్జున్ ముండేలను ఆహ్వానించాం. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు -
నీళ్లేవో.. పాలేవో తేల్చారు
సాక్షి, సూర్యాపేట: ‘హుజూర్నగర్ ముద్దుబిడ్డలకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు అందిం చిన విజయం తప్పకుండా మాలో ఉత్సాహాన్ని, సేవా భావాన్ని పెంచడంతోపాటు మరింత అంకితభావంతో పనిచేసే స్ఫూర్తి కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాపనిందలు అన్నింటినీ విశ్లేషణ చేసి మీరు నీళ్లేవో.. పాలేవో తేల్చిచెప్పారు. బల్లగుద్ది మరీ హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’అని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహిం చిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్డు మార్గం ద్వారా హుజూర్నగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంట వెయ్యికిపైగా వాహనాలు వచ్చాయి. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మీరిచ్చిన ఫలితానికి సరిసమానంగా అభివృద్ధి.. హుజూర్‌నగర్‌లో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు మండల కేంద్రాలను తీసేస్తే 134 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎలా అయితే ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితం ఇచ్చారో దానికి సరిసమానంగా సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్ అద్భుతమైన నియోజకవర్గం అనే పరిస్థితి రావాలి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. రేపో, ఎల్లుండో జీఓ విడుదల చేస్తాం. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్నగర్ మున్సి పాలిటీకి సీఎంగా నా నిధుల నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నా. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొంత పోడుభూముల సమస్య ఉంది. దీనిపై అన్ని జిల్లాలకు నేనే వెళ్తున్నా. మొత్తం మంత్రివర్గం వచ్చి ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. 3 ఫీట్లు జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు.. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి బాటలో పెట్టడానికి వచ్చా. మాటలు మాట్లేడేవారు దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి మూడు ఫీట్లు లేడని మాట్లాడారు. ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉన్నడు. కానీ ఇక్కడ ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చాలా మంది చేసింది చెబితే మీరు (ప్రజలు) నవ్వుతారు. కానీ ఇవ్వాళ మూడు ఫీట్లు ఉన్న మంత్రి 300 కి.మీ. దూరాన ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్ మండలంలోని చివరి గ్రామాలు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు జిల్లా భూములను పునీతం చేస్తుండు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్ల మండలానికి తెచ్చాడు. ఇది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుంది. సాగర్ ఆయకట్టును కాపాడుకుంటాం.. నాగార్జునసాగర్ ఆయకట్టును నల్లగొండ జిల్లాలో కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును తీసుకున్నాం. దీని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు తొలగుతాయి. నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలి. దీనికోసం గోదావరి నీళ్లు సాగర్ ఎడమ కాలువలో పడాలి. ఈ నీళ్లతో రెండు పంటలు ఏటా పండాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నాలుగేళ్లు అహోరాత్రాలు పనిచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ సాగర్ ఆయకట్టుపై పడుతుంది. కచ్చితంగా తిరుగుతా. ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వచ్చే 15–20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటన చేస్తా. ప్రజలను, రైతులను కలుస్తా. ఈ బడ్జెట్లో, వచ్చే బడ్జెట్లో కొన్ని నిధులు మంజూరు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. ఏ ఎత్తిపోతలు కావాలో అన్నీ మంజూరు చేస్తాం. కాలువల లైనింగ్‌లు చేస్తాం. ఈ పనుల్నీ త్వరలో జరుగుతాయి. నవంబర్ మొదటి వారంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ నిపుణులు, నాగార్జునసాగర్ సీఈ నర్సింహతో తిరిగి పరిశీలించాలి. ఎత్తిపోతల రైతాంగానికి శుభవార్త.. ఐడీసీ, నీటిపారుదలశాఖ కింద ఎత్తిపోతల బాధ్యతలు సొసైటీలు, ఎన్జీఓల పరిధిలో ఉన్నాయి. రైతులపై పైసా భారం లేకుండా వాటన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుంది. అందులోని సిబ్బందినీ ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 600 ఎత్తిపోతలకు ఈ ఉపశమనం ఉంటుంది. రైతాంగమంతా సంతోషిస్తుంది. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి ఈ శుభవార్త చెబుతున్నా. కర్రు కాల్చి వాత పెట్టారు.. సైదిరెడ్డికి మీరు (ప్రజలు0 40 వేలకుపైగా మెజారిటీ ఇచ్చారు. కొందరు దుర్మార్గులు ఆయనది గుంటూరు జిల్లా అన్నారు. ఆయనది గుంటూరు జిల్లా కాదు కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టారు. మీ అందరి దీవెనలు ఇలానే ఉంటే ఎవరు ఏమన్నా భయపడకుండా, వెరవకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తాం. మళ్లీ వచ్చినప్పుడు జానపహాడ్ దర్గా, మట్టపల్లి ఆలయం దర్శనం చేసుకుంటా. ఈ రెండు పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తాం. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి సైదిరెడ్డికి విజయం చేకూర్చి కేసీఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్ అని చెప్పిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తాం. -
బాన్సువాడలో సీఎం కేసీఆర్ సభ సక్సెస్
సాక్షి, బాన్సువాడ: ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బాన్సువాడలో నిర్వహించిన ఆశీర్వాద సభ విజయవంతమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. సభలో బాన్సువాడకు సీఎం వరాల జల్లులు కురిపించారు. సీఎం పర్యటన కోసం గత వారం రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయులు పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి రేయింబవళ్లు కష్టపడి ఏర్పాట్లు చేయించారు. సుమారు 40 వేల మంది వరకు జనం రాగా, సభా స్థలి నిండిపోయి, చాలా మంది బయటే ఉండిపోయారు. అంచనాలకు మించి జనం రావడంతో సభా ప్రాంగణం సరిపోక, భవనాల పైకి ఎక్కి సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన సీఎం 12.25 గంటలకు బాన్సువాడకు చేరుకున్నారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన సందర్భంగా మూడు రోజులుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతో పోలీసులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ, బందోబస్తు నిర్వహించారు. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి పర్యవేక్షణలో సుమారు 2 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో పాలు పంచుకున్నారు. సభ సజావుగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అద్భుత పాలనను అందిస్తున్నాం.. ప్రపంచంలో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవింతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఎన్నో సభలను చూశాను కానీ ఈ సభకు హాజరైన ప్రజానీకాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తన జీవితం ధన్యమైందన్నారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని, రైతులకు అన్ని విధాలుగా మేలు చేశారని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన సాయిరెడ్డి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కె.సాయిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తన్‌జీముల్ మసాజిద్, మాజీ కార్యదర్శి అబ్దుల్ వహాబ్ సైతం టిఆర్ఎస్లో చేరారు. -
లక్షన్నర ఎకరాలకు నీళ్లిస్తం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ గ్రౌం డ్స్‌లో సోమవారం టీఆర్ఎస్ ఎన్నికల ప్ర చార సభ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ అధ్యక్షతన జరిగి న సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాకూటమిని ఎండగట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే తిరిగి అధికారం అప్పగిస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా గెలవడం, తాను సీఎం కావడం వల్లే జిల్లా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాను చేయడమేగాక కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ కూడా వస్తదన్నారు. సౌత్ క్యాంపస్ గురించి మాట్లాడుతూ అక్కడి కోర్సులను తిరిగి తీసుకువచ్చి పూర్వవైభవం తీసుకువస్తమన్నారు. కామారెడ్డికి జాతీ య రహదారి ఉన్నదని, రైల్వేలైను ఉందని, దీనికి జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లొస్తే ఇక్కడి రైతులు మంచి పంటలు పండిస్తరని, రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలనే కల నెరవేరుతుందని పేర్కొన్నారు. చిన్నప్పుడు కామారెడ్డికి వస్తే బెల్లం వాసన వచ్చేదన్నారు. ఆ వాసన ఇప్పుడు మాయమైందని, ముందుముందు బెల్లం సమస్యను కూడా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత.. వ్యవసాయ రంగానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామన్నారు. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నామని, దాన్ని వచ్చే ఏడాది రూ.5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. రైతులు ఏకారణంగాతోనైనా చనిపోయినపుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు రైతుబీమా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,400 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించి ఆదుకున్నామన్నారు. బీడీ కార్మికులు ఎన్నో కష్టాలు పడుతుంటే యూనియన్లు యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులను పట్టించుకునేవి కావని కేసీఆర్ పేర్కొన్నారు. తాము బీడీ కార్మికుల విషయంలో ఆలోచించి వారికి రూ. వెయ్యిచొప్పున జీవనభృతి అందిస్తున్నామని, తిరిగి అధికారంలోకి రాగానే రూ.2 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లు రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కిట్‌తో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే కేసీఆర్ కిట్‌తో పాటు రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని టీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. ఇంటింటికీ నీళ్లిచ్చేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మాటలకే పరిమితం.. షబ్బీర్‌అలీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతడని, ఆయన కరెంటు మంత్రిగ ఉన్నపుడు 24 గంటల పాటు రైతులకు కరెంటు ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నామని, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే పరిస్థితులు లేనేలేవని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి సగటు వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్సాదికార సంస్థ పేర్కొన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాడని, ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించి లక్షన్నర ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలని కోరారు. సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, నాయకులు సుభాష్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, ముజీబొద్దీన్, డాక్టర్ అయాచితం శ్రీధర్, నిట్టు వేణుగోపాల్‌రావు, ఎల్.నర్సింగ్‌రావు, సత్యంరావు, మధుసూధన్‌రావు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రజలే గెలవాలి
సాక్షి, మోర్తాడ్/బోధన్: ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవడమే ముఖ్యమని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఉద్ఘాటించారు. ప్రజలు గెలవడం అంటే వారికి మంచి చేసే వారు గెలవడం అని తెలిపారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్, బోధన్, మోర్తాడ్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పార్టీ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ ప్రచారం చేసినా, ఎవరు మాట్లాడినా సావధానంగా వినాలని, ఇంటికి వెళ్లి తీరిగ్గా కూర్చుని ఆయా ఆంశాలపై చర్చ చేయాలని సూచించారు. తమ కోసం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించి వారికే ఓటు వేయా లని కోరారు. 2014 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను బలపరిచారని, ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని విలువైన పనులు చేస్తామని హమీ ఇచ్చారు. కాంగ్రెస్ 40 ఏళ్ల పాలనలో, 17 ఏళ్ల టీడీపీ హయాంలో ఏమి ఉద్ధరించ లేదని విమర్శించారు. ఐదున్నర దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను నాలుగేళ్లలో తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఊహించని పథకాలను తెచ్చాం.. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి, పింఛన్లు, 24 గంటల కరెంట్ సరఫరా తదితర అంశాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు భృతి కింద రూ.వెయ్యి ఇస్తామని మోర్తాడ్ సభలోనే ప్రకటించానని, ఆ మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.2,016కు పెంచుతామన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులందరికీ జీవన భృతిని అందించడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. చంద్రబాబు, కిరణ్‌లపై ధ్వజం కాంగ్రెస్, టీడీపీలు గతంలో మాయా మశ్చీంద్ర కథలు చెప్పి కాలం వెళ్లదీశాయని సీఎం విమర్శించారు. టీడీపీ హయాంలో కరెంటు అడిగిన కర్షకులపై లాఠీచార్జీ చేయించడం, కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. అలాగే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా తెలంగాణ ప్రాంతాన్ని అవహేళన చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే అని విమర్శించారు. వారు చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాము చేసి చూపించామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాట లు చెబుతున్నాడు కాని తన రాష్ట్రంలో తెలంగాణ మాదిరి 24 గంటల నిరంతర విద్యుత్‌ను ఎందుకు అందించడం లేదని విమర్శించారు. జల సిరులు నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాల భూములు ఎండిపోయే దశలో ఉంటే సింగూర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని మళ్లించి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం జహీరాబాద్‌లో ధర్నా చేసి కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 365 రోజుల పాటు నిండు కుండలా ఉండేలా చేస్తున్నామని సీఎం తెలిపారు. రోజుకో టీఎంసీ నీటిని తెచ్చి కాకతీయ కాలువ, వరద కాలువ, లక్ష్మి, ఇతర కాలువలను నీటితో నింపి మత్స్యకారులకు కూడా జీవనోపాధిని మెరుగుపరుస్తామని తెలిపారు. మళ్లీ మా ప్రభుత్వమే రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ తర్వాత పూర్తి కాబోతుందని, ఆ ప్రాజెక్టు ప్రారంభమైతే నిజాంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడూ ఎండిపోదని చెప్పారు. పుష్కలంగా సాగు నీరు వస్తుందని, బోధన్ ప్రాంతంలో రెండు పంటలు పండే అవకాశం కలుగుతుందన్నారు. ఎప్పుడో పాడుబడిన నిజాంసాగర్ కాలువను ఆధునికీకరించి చిట్టచివరి భూముల వరకు నీళ్లందించేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కాలువల వెంబడి తిరిగి పంటలను కాపాడరన్నారు. ఎంపీ కవిత, సీఎం ప్రసంగం చిత్రీకరణ సాక్షి, కామారెడ్డి టౌన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు వీడియో చిత్రీకరించారు. సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న ఎన్నికల పరిశీలకఎన్నికల్లో ప్రజలే గెలవాలి -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు భరోసా
సాక్షి, నిజామాబాద్: కాకతీయ కాలువ లీకేజీ నీటి ఆధారంగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు, రానున్న ఎండా కాలంలో కూడా మెట్పల్లి వరకు ఉన్న ఆయకట్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందిస్తామని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, మోర్తాడ్ (బాలొండ) బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించారు. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే.. అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. మోర్తాడ్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ పునర్జీన పథకం పనులు పూర్తయితే ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుందని అన్నారు. ఆయకట్టు భూములకు నీరు అందించే బాధ్యతను తానే తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. భీమ్‌గల్‌లో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, బాల్కొండకు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీలు గుప్పించారు. భీమ్‌గల్ బస్సుడిపో ఏర్పాటు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌స్ట్రిప్.. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చేసారి విమానంలోనే దిగుతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. నియోజకవర్గంలో 65 వేల మంది ఆసరా పింఛను లబ్ధిదారులు ఉన్నారన్న కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయమ ని అన్నారు. ఒక్క రూరల్ నియోజకవర్గంలోనే 50 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశామని, గిరిజనులంతా సర్పంచ్‌లుగా ఎన్నికై స్వయంగా పాలన చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాని రైతులందరికీ ఆరు నెలల్లో పంపిణీ చేస్తామన్నారు. తనతో పాటు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో జిల్లాకు స్వయంగా వచ్చి అందజేస్తామని అన్నారు. బోధన్ ప్రాంతానికి రెండు పంటలకు సాగునీరు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బోధన్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నిజాంసాగర్ నిండుకుండలా మారుతుందని, బోధన్ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరందుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాంసాగర్ ప్రధాన కాలువను ఆధునీకరించామని ఆయకట్టు చివరి భూములకు సాగునీరందిస్తున్నామన్నారు. సుడిగాలి పర్యటన విజయవంతం.. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలో సుడిగాలి పర్యటన విజయవంతం కావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. ఎన్నికల ప్రచారంలోభాగంగా ఒకే రోజు జిల్లాలో డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, మోర్తాడ్ (బాల్కొండ) నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సభలకు పెద్ద ఎత్తున శ్రేణులు, ఆయా నియోజకవర్గాల వాసులు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగసభను ముగించుకుని హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.20 గంటలకు డిచ్పల్లి బహిరంగసభకు చేరుకున్నారు. ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన జనాలనుద్దేశించి సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇక్కడి నుంచి మ ధ్యాహ్నం 2 గంటలకు బోధన్‌కు చేరుకున్నారు. అక్కడి బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు చేరుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థులు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్ పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 27 జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి పర్యటన కొనసాగనుంది. జిల్లా కేంద్రలోని గిరిరాజ్ డిగ్రీ క ళాశాలలో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇందుకు గా ను కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పలుసా ర్లు సభాస్థలిని పరిశీలించారు. ప్రధాని పర్యటన ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం కేంద్ర బలగాలు ఎస్పీజీ(ప్రత్యేక రక్షణ బృందాలు) జిల్లాకు వచ్చాయి. రైల్వే స్టేషన్లో ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచారు. ఒక్కో ప్లాటూన్‌లో వంద మంది ప్రత్యేక బలగాలు వచ్చా యి. కేంద్ర నిఘా బృందాలు సైతం జిల్లా కేంద్రం లో డేగ కన్ను వేశారు. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు కళాశాల స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సీపీ కార్తికేయ బం దోబస్తుపై దృష్టి సారించారు. శనివారం సభాస్థలా న్ని పరిశీలించారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభ కో సం నిజామాబాద్‌తో పాటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల నుంచి పోలీసులు బందోబస్తు కోసం రానున్నారు. ప్రధా న మంత్రిగా నరేంద్రమోడీ తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వచ్చినా నాడు ప్రధాని హోదాలో లేరు. రేపు కేసీఆర్ పర్యటన జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటన కొనసాగనుంది. నిజామాబాద్‌రూరల్, బోధన్, బా ల్కొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా రు. ఇందుకుగాను పోలీసులు బందోబస్తు పరిశీలించారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ కేసీఆర్ హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించారు. -
జనం మధ్యనే జీవన్‌రెడ్డి సతీమణి
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించగా టీఆర్ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి వేదికపైకి వెల్లకుండా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. -
‘కాళేశ్వరం’తో మానేరుకు జీవం
సాక్షి, సిరిసిల్ల: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్మాల ఎగువ మానేరులోకి నీళ్లు తీసుకు వస్తం.. ఏడాదిపొడవునా ఇందులో నీళ్లుంటే.. మానేరువాగుకు జీవం వస్తుంది. మధ్యమానేరు, ఎల్ఎండీ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గోదావరి నదిలోకి నిరంతరం నీటిపారకం ఉంటుంది.. ఈ పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి నీటిసమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది..’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ తెలంగాణలోనే ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నియోజకవర్గానికో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి కల్తీలేని నాణ్యమైన సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. రేషన్ డీలర్లను ఆదుకుంటామని, ఐకేపీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నలకు భరోసా కల్పించాం.. సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని, ఇప్పుడు ఆత్మహత్యలు ఆగాయని, నేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడం తనకు సంతోషాన్నిచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. అపెరల్ పార్క్‌లో ఉత్పత్తి చేసిన గుడ్డ రెడిమెడ్ వస్త్రాలుగా తయారై అమెరికా మార్కెట్లో అమ్మే స్థాయికి చేరుకోవాలన్నారు. సిరిసిల్ల నుంచి ఉద్యమ సమయంలో వెళ్తున్నప్పుడు ఆత్మహత్యలు వద్దని గోడలపై రాతలు కనిపించాయని, అప్పుడు నిజంగానే నేతన్నల బాధలు చూసి ఏడ్చానన్నారు. కేటీఆర్ లేకుంటే సిరిసిల్ల 50 ఏళ్లయినా జిల్లా అయ్యేది కాదన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి కృషి చేస్తానని కేసీఆర్ అన్నారు. మొన్నటివరకు యాదాద్రి అభివృద్ధిపై దృష్టిసారించామని, ఇక రాజన్న దయతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కొంత భూసేకరణ జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామన్నారు. కులవృత్తులను కాపాడేందుకు గొర్రెల పంపిణీ, గీతకార్మికుల చెట్టుపన్ను రద్దు, మత్స్యకార్మికులకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు చేయూతనిస్తున్నామన్నారు ఇసుక దొంగలను అరికట్టాం.. ‘నేను చెప్పేది వాస్తవమైతే సిరిసిల్ల, వేములవాడలో చెరో లక్ష మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.. లేకుంటే డిపాజిట్లు పోగొట్టాలి’ అని కేసీఆర్ అన్నారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.9.56 కోట్లని, అదే టీఆర్ఎస్ హయాంలో నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం రూ.2,057 కోట్లని కేసీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఇసుక ఆదాయాన్ని మింగిన దొంగలెవరో చెప్పాలన్నారు. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, ఎకోన్ముఖంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ గుగులోతు రేణ, డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ గోక బాపురెడ్డి, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ : కేటీఆర్ మంత్రి దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ వన్‌గా ఉందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల సభలో మాట్లాడుతూ కార్మిక, ధార్మిక, కర్శక క్షేత్రమైన జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారున. ఆశీర్వాద సభకు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ప్రజలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో వేములవాడ అభివృద్ధి: చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి వేములవాడలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వేమువాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు అన్నారు. 40 వేల ఎకరాలకు గోదావరి జలాలు ఎల్లంపల్లి ద్వారా వచ్చాయని, సూరమ్మ చెరువుతో కొన్ని సాగునీటి ఇబ్బందులు తీరాయన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కో ట్లు వచ్చాయని పేర్కొన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించి మధ్యమానేరు నిర్వాసితులకు ఉపాధి చూపాలని రమేశ్‌బాబు కోరారు. -
ఆశీర్వదించండి.. అన్నీ సాధిద్దాం..!
సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, మరోసారి ఆశీర్వదిస్తే అనుకున్నది సాధిద్దామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు తలమానికంగా మారిన కరీంనగర్ భవిష్యత్‌లో వాటర్ జంక్షన్‌గా మారనుందని, జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో హుజూరాబాద్ ప్రాంత ప్రజలు చురుకైన పాత్ర పోషించారన్న కేసీఆర్, ఆ ఉద్యమంలో సోదర సమానుడు ఈటల రాజేందర్, పితృసమానులైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మీరంతా కూడా నా వెనుక అడుగులో అడుగేసి నడిచారని’ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం ఇందిరానగర్–శాలపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతాంగం 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంతానికి డోకా ఉండదన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్‌లు మన హుజూరాబాద్ నెత్తిమీదనే ఉన్నాయని, ఎల్ఎండీ కావొచ్చు.. మిడ్ మానేరు కావొచ్చని, మంత్రి రాజేందర్ అన్నట్లుగా వాటి వల్ల కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్ కాబోతోందని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్నారు.. ఈ ప్రాంతానిది కీలక పాత్ర.. తెలంగాణ ఉద్యమ సందర్భంగా హుజూరాబాద్ ప్రాంత ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలిచారని ఇందిరానగర్ సభలో సీఎం కేసీఆర్ ఉద్యమ రోజులను నెమరు వేసుకున్నారు. ‘2001లో అద్భుతమైనటువంటి చైతన్యం చూపించిన ప్రాంతం ఇదని, తెలంగాణ వచ్చేనాడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడుతూ కష్టపడి పోరాటం చేశామని అన్నారు. ఆ సమయంలో ఈటల రాజేందర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇద్దరు ఉద్యమంలో ప్రతీ మలుపులో తోడుగా చివరి వరకు ఉన్నారని, వారితో మీరందరూ పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన ధైర్యంతో కొట్లాడి కొట్లాడి చివరకు రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయం నుంచి హుజూరాబాద్ ప్రాంతంతో తనకు విడదీయరాని బంధం ఉందన్న కేసీఆర్, జమ్మికుంట ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడిన భిక్షపతి సంఘటనను గుర్తు చేశారు. ‘తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు భిక్షపతి అనే మిత్రుడు కరెంట్ బిల్లు చెల్లించలేక హెండ్రిన్ (పురుగులు మందు) తాగి చనిపోయాడు.. మేమంతా జమ్మికుంటకు వచ్చాం.. బాధపడ్డాం, కన్నీరు పెట్టుకున్నాం.. అలాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మీ అందరి దీవెనలతో కంటిరెప్పపాటు కూడా కరెంట్ పోకుండా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం’ అని కేసీఆర్ వివరించారు ఈటల రాజేందర్ నా కుడిభుజం.. హుజూరాబాద్‌ను అద్భుతంగా మలిచాడు.. ‘ఈటల రాజేందర్ మీ అందరికీ తెలుసు.. ఆయన నా కుడి భుజం, బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగినా ఆయన హుజూరాబాద్‌లో ఉండడం మీ అదృష్టం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘నేను, నా కుడి భుజం బలంగా ఉండాలంటే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని’ ప్రజలను కోరారు. రాజేందర్ కనీవినీ ఎరుగని రీతిలో హుజూరాబాద్‌ను అభివృద్ధిలో అద్భుతంగా మలిచాడని కేసీఆర్ కితాబిచ్చారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఈటల రాజేందర్ కష్టపడి చెక్‌డ్యాంలు కట్టించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన చెక్ డ్యాంలు రాజేందర్ దక్షతకు నిదర్శనమని, అవన్ని ఎప్పుడూ నీళ్లతో 365 రోజులు నిండే ఉంటాయని, ఎండిపోయే పరిస్థితే ఉండదన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో నీటి కష్టాలే ఉండవన్నారు. ఆయన పనితీరుపై తనకు ఇప్పుడే సర్వే రిపోర్టు వచ్చిందని, ఆ సర్వేలు 80 శాతం ఓట్లు వచ్చి గెలుస్తాడాని చెప్తున్నాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ అద్భుతంగా అభివృద్ధి చేశాడని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇందిరానగర్ సభ సక్సెస్.. టీఆర్ఎస్లో కేసీఆర్ జోష్.. హుజూరాబాద్ మండలం ఇందిరానగర్–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన జనం ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. హుజూరాబాద్ నుంచి సభాస్థలి, జమ్మికుంట అంతా కూడా గులాబీమయమైంది. ప్రాంగణం గులాబీ జెండాలు.. నినాదాలతో మార్మోగింది. సభ అనుకున్న సమయం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకే మొదలు కాగా, వేలాదిగా జనం సభకు తరలి వచ్చారు. కేసీఆర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా ప్రజల తాకిడి పెరుగుతూ వచ్చింది. సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, బోనాలు, డప్పు చప్పుళ్ల ప్రదర్శనతో తరలివచ్చారు. యువత బైక్ ర్యాలీలతో సందడి చేస్తూ సభావేదికకు వచ్చారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2.20 గంటలకు ఇందిరానగర్ సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక బలగాల పర్యవేక్షణ మధ్యన సభాస్థలికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీ, టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు, దేశిపతి శ్రీనివాస్ వేదికపైకి వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి, ఈద శంకర్‌రెడ్డి, కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఇందిరానగర్–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ భారీ బందోబస్తు మధ్య సాగింది. రెండు రోజులుగా పోలీసులు, భద్రతా సిబ్బంది సభా ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందిరానగర్ సభ సక్సెస్ కావడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్‌ను పెంచింది. ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, దేశిపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బండ శ్రీనివాస్, చొల్లేటి కిషన్‌రెడ్డి, చందా గాంధీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, హుజూరాబాద్ ఎంపీపీ సరోజినీ దేవి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు గిట్టుబాటే లక్ష్యం
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. కేసీఆర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభిస్తుందన్నారు. సాక్షి, కామారెడ్డి/నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: వ్యవసాయం మీద ఆధారపడ్డ ఎల్లారెడ్డి ప్రజల సాగునీటి కష్టాలు తీరబోతున్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ధర్మరావుపేట, మోతె, గుజ్జుల్, కాటేవాడి రిజర్వాయర్లతో పది టీఎంసీల సాగునీరు ఈ భూములకు అందుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. మిషన్ కాకతీయ ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మరమ్మతులు చేయించారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక చెరువులను పునరుద్ధరణ చేయించుకున్న నియోజవర్గం ఎల్లారెడ్డి అన్నారు. తన గజ్వేల్ నియోజకవర్గంలోకంటే కూడా ఎల్లారెడ్డిలోనే అత్యధిక చెరువులను పునరుద్ధరించామన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 457 చెరువులను పునరుద్ధరించామన్నారు. మంజీర లిఫ్టు, భీమేశ్వర వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం, పోచారం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామని, పెట్టుబడి సహాయం కూడా అందించి రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభిస్తుందన్నారు. వాటి నిర్వహణ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రైతులను ధనవంతులను చేయడమే తన లక్ష్యమన్నారు. రైతులు సంతోషంగా ఉంటే తన జీవితానికి అదే తృప్తి అని, అందుకోసమే తాను నిరంతరం శ్రమిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశమంతా మనవైపే చూస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో గిరిజనులకు సంబంధించి పోడు భూముల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరెంట్ ఆగం కావద్దంటే, పింఛన్లు పెరగాలంటే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్నారు రవీందర్‌రెడ్డిని పెద్దోడిని చేస్తా... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తన కుడిభుజంగా ఉన్నారని, ఏనాడూ మడమ తిప్పలేదని, ఉద్యమాన్ని వదలలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రవీందర్‌రెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలువనున్నాడన్నారు. 80 శాతం ఓట్లు రవీందర్‌రెడ్డికి వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. రవీందర్‌రెడ్డికి వచ్చే మెజారిటీని చూసి పక్కనే ఉన్న బాన్సువాడ అభ్యర్థి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈర్ష్య పడవద్దన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన రవీందర్‌రెడ్డి మామూలు ఎమ్మెల్యేగా ఉండడని, ఆయనకు ఉన్నతి లభిస్తుందని పేర్కొన్నారు. రవీందర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడని కొనియాడిన సీఎం.. ఆయన హయాం లో రైతులకు ఎంతో మేలు జరిగిందని, కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఏనుగు మంజులారెడ్డి వందన సమర్పణతో సభ ముగిసింది. సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జిల్లా చైర్మన్ సంపత్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు. మళ్లీ ఆశీర్వదించండి టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): డిసెంబర్ 7న జరుగనున్న ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. డిసెంబర్ 7న జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తనను మీ బిడ్డగా, తమ్మునిగా, అన్నగా భావించి తనకు మరోసారి అవకాశమిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సైడ్‌లైట్స్ ఎల్లారెడ్డి: గాంధారి మండలం నుంచి వచ్చిన ఖాయితీ లంబాడా గిరిజన మహిళల నృత్యాలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎల్లారెడ్డిలో బస్‌డిపోలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో సాయంత్రం 4.38 గంటలకు హెలీక్యాప్టర్ దిగింది సీఎం కేసీఆర్‌తో పాటు కేశవరావు, దేశ్‌పతి శ్రీనివాస్ హెలీక్యాప్టర్ నుంచి దిగారు. మంత్రి పోచారం, ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 4.48 గంటలకు సీఎం సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక మైనారిటీ నాయకులు ఇమామ్–ఎ–జమీన్ దట్టీ కట్టారు. పోచారం, రవీందర్‌రెడ్డి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు. 4.55కు ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్.. 18 నిమిషాల పాటు కొనసాగించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్ మరోమారు లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించారు. ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సభాస్థలిలో వెనక కూర్చున్న వాళ్లను ముందుకు వదలండని కెసిఆర్ చెప్పడంతో బ్యారికేడ్లు తెరవగా ఒక్కసారిగా జనాలు ప్రెస్ గ్యాలరీలోకి దూసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రెస్ గ్యాలరీలో ఉన్న వాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించనున్నామన్న కేసీఆర్ హామీకి యువత నుంచి మంచి స్పందన లభించింది. ప్రజలు ద్విచక్ర వాహనాలపైనే ఎక్కువగా సభకు తరలి వచ్చారు. దాదాపు 5 వేల ద్విచక్ర వాహనాలు వచ్చినట్లు అంచనా. -
ప్రచారానికి ప్రముఖులు
ఎన్నికల వేళ జిల్లాకు ప్రముఖులు తరలి రానున్నారు. పదిహేను రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిం చనున్నారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నాయకులు సైతం బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగియనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే అభ్యర్థులంతా ముఖ్య నేతలను రంగంలోకి దించనున్నారు. సాక్షి, కామారెడ్డి: అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు ప్రచారం చేయడానికి జిల్లాకు వరుస కడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. మరికొందరు ప్రముఖుల ప్రచారానికి సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్ర నాయకులు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొనడానికి వస్తారని, అయితే వారి పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. 20న సీఎం కేసీఆర్ రాక.. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభ ఈ నెల 20న ఎల్లారెడ్డిలో జరుగనుంది. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరఫున బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలను భారీగా సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బాన్సువాడ రోడ్డులో సభతో పాటు హెలిప్యాడ్ కోసం ఇప్పటికే పోలీసు అధికారులు స్థలాలను పరిశీలించారు. పనులు కూడా మొదలు పెట్టారు. నియోజక వర్గంలోని ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. విజయశాంతి రోడ్‌షో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి ఈ నెల 20న కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు షబ్బీర్‌అలీ, జాజాల సురేందర్ తరపున రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. దోమకొండ మండలంతో పాటు కామారెడ్డి పట్టణం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్‌షోలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విజయశాంతి పర్యటనకు మహిళలు ఎక్కువ మందిని తరలించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి రాక.. ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున ఈ నెల 22న ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పరిపూర్ణానంద స్వామి పాల్గొంటారు. బీజేపీలో చేరిన తరువాత పరిపూర్ణానంద స్వామి ఇటీవల కామారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో తొలి రాజకీయ ప్రసంగం చేశారు. ఎల్లారెడ్డిలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించేందుకు గాను ఈ నెల 22న రానున్నారు. పరిపూర్ణానంద సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్‌షా, యూపీ సీఎం సైతం.. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వచ్చే నెల 3, 5 తేదీలలో జిల్లాలో çపర్యటించనున్నారు. 3న బీజేపీ చీఫ్ అమిత్‌షా కామారెడ్డిలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. అలాగే 5న ఎల్లారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ప్రసంగించనున్నారు. ముఖ్య నేతల పర్యటనలను విజయవంతం చేయడానికి ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. -
మోదీ ప్రభుత్వంలో ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది
-
సీపీఎం బహిరంగ సభ ప్రారంభం
హైదరాబాద్: వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం అభ్యుదయ సామాజిక శక్తులన్నీ ఏకం కావాలనే ఆశయంతో సీపీఎం నిర్వహిస్తోన్న బహిరంగ సభ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జాతీయ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు, తెలకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట టీవీ టవర్ నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. లాల్ సలామ్, జైభీమ్ కలిస్తేనే కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. మూడో కూటమి విధానాలు చూసి కీలక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమే తమ లక్ష్యమన్నారు. దేశంలో మతోన్మాత రాజకీయాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు.నిజాం, రజాకార్లను ఎదుర్కొన్న మగ్దూం మొహినుద్దీన్ స్పూర్తితో భవిష్యత్ కోసం ముందడుగు వేయాలని సూచించారు. -
తెలంగాణలో బీజేపీ కొత్త మర్గాలు
-
గార్లదిన్నెలో బహిరంగసభ నిర్వహణపై కేసు
గార్లదిన్నె: వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 3వ తేది గార్లదిన్నెలో నిర్వహించిన బహిరంగసభపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. బహిరంగసభకు పోలీసులే అనుమతులు ఇచ్చినప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించారనీ, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని కేసు నమోదు చేశారు. ఆదేవిధంగా మేలుకొలుపు యాత్ర సందర్భంగా నార్పల బస్టాండు వద్ద బహిరంగ సభ నిర్వహించడంపై నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీఆర్ఎస్కు దీటుగా సభ పెడదాం!
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు జూన్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లోనే నిర్వహిద్దామని ప్రతిపాదన అంగీకరించిన బాబు హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు దీటుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. మే నెలాఖరులో నిర్వహించే మహానాడు తరువాత ఈ సభ జరపాలని భావిస్తున్నట్లు టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్య తదితరులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ సభకు హాజరైన జనం, చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చర్చకు వచ్చాయి. ‘10 లక్షల మంది జనం వస్తారని గొప్పలు చెప్పుకొన్నారు. తీరా చూస్తే 2 లక్షలు కూడా దాటలేదు. మనం తలచుకుంటే అంతకన్నా ఎక్కువ మందిని తీసుకురావచ్చు. మహానాడు తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లోనే టీడీపీ సభ పెట్టి తడాఖా చూపిస్తాం..’ అని రేవంత్, ఎర్రబెల్లి తదితర నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అంగీకరించిన బాబు.. పకడ్బందీగా సభ నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించినట్లు సమాచారం. అంతకన్నా ముందు మే నెలలో ఖమ్మంలో సభ నిర్వహించి ఆ జిల్లా టీడీపీ వెంటే ఉందన్న సందేశాన్ని పంపించాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందున రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని, అందుకోసం సరైన వేదికను నిర్ణయించాలని నేతలు చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలను డిసెంబర్‌లోపు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు 20 డివిజన్ల బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల సన్నద్ధతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం, పథకాల్లో అవినీతి, హామీల అమల్లో వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లాలని బాబు సూచించినట్లు తెలిసింది. కాగా.. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసేందుకు టీటీడీపీ నేతలు అపాయింట్మెంట్ తీసుకున్నారు. చింతలను బీజేపీ సిఫారసు చేయలేదు: బాబు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో బీజేపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని నియమించాలని భావించినా ఆ పార్టీ నేతలెవరూ ఆయన పేరు సిఫారసు చేయలేదని చంద్రబాబు వెల్లడించారు. టీటీడీలో తెలంగాణ నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేలు జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్యతో పాటు బీజేపీ నుంచి చింతలను ఖరారు చేసినట్లు బాబు చైనా పర్యటనకు ముందు ప్రకటించారు. అయితే సోమవారం విడుదల చేసిన జీవోలో చింతల పేరు లేదు. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం చంద్రబాబును కలిసినప్పుడు ఆరా తీయగా పైవిధంగా ఆయన స్పందించారు. కానీ ముందే పేరు ప్రకటించి తరువాత వెనక్కు త గ్గడం వల్ల చింతలకు ఇబ్బందేమోనని ఎర్రబెల్లి పేర్కొనగా... ‘హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న టీటీడీకి చెందిన బాలాజీ భవన్ స్థాయిని పెంచుదాం. దానికి చింతలను చైర్మన్ చేసి, టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదా కల్పిద్దాం’ అని బాబు చెప్పినట్లు సమాచారం. -
జన సమీకరణలో గులాబీ శ్రేణులు
- నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ - జిల్లా నుంచి 50వేల మంది - పార్టీ నేతల సమావేశాలు - ప్రత్యేక వాహనాల ఏర్పాటు ఆదిలాబాద్ టౌన్ : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు జిల్లాకు నుంచి 50 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ విజయవంతం కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించడానికి నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ జిల్లా నుంచి 25వేల మంది, తూర్పు జిల్లా నుంచి మరో 25వేల మందిని బహిరంగ సభకు తరలించనున్నట్లు టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభకు తరలివెళ్లేందుకు జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల నుంచి ఉదయం 8గంటలకు బయల్దేరి సభకు చేరుకుంటామని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 5,500 మందిని తరలిస్తున్నట్లు చెప్పారు. 100 బస్సులు, పది జీపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3వేల మంది తరలి వెళ్లనున్నారు. ఇందుకోసం 42 బస్సులు, 55 జీపులు ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గం నుంచి 3వేల మందికి గాను 25 బస్సులు, 107 జీపులు, నిర్మల్ నియోజకవర్గం నుంచి 4,500 మంది కోసం 80 బస్సులు, 150 కార్లు ఏర్పాటు చేశారు. ముథోల్ నియోజకవర్గం నుంచి 3,300 మందిని తరలించడానికి 60 బస్సులు, 30 జీపులు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి కనీసం 50 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా చూస్తున్నారు. బహిరంగ సభ బాధ్యతలను మండల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. మందమర్రిలో ఆదివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు తరలిరావాలి నిర్మల్ రూరల్ : హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని రాష్ర్ట గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐకేరెడ్డి నివాస భవనంలో ఆదివారం సాయంత్రం చలో హైదరాబాద్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి 50వేల మంది సభకు హాజరవుతారని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, తుల శ్రీనివాస్, మారుగొండ రాము, గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని దారులు రాజధాని వైపే
- బహిరంగ సభకు తరలిన గులాబీ దండు - టీఆర్ఎస్ వాహనాలతో కిటకిటలాడిన రహదారులు జిల్లాలోని అన్ని దారులు హైదరాబాద్‌లో వైపు దారితీశాయి. పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు సోమవారం జిల్లా నుంచి గులాబీ దండు తరలింది. నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావసభకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్ నినాదాలు హోరెత్తాయి. బహిరంగసభకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ కిటకిటలాడాయి. సాక్షి, సంగారెడ్డి: పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం కావడంతో గులాబీ శ్రేణులు పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో నేతలందరూ పెద్ద సంఖ్యలో జనసమీకరణతో రాజధానికి బయలుదేరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ నేతృత్వంలో జహీరాబాద్ ప్రాంత నాయకులు భారీ సంఖ్యలో హైదరాబాద్ వెళ్లారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి పదివేల మంది నాయకులు, కార్యకర్తలు బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తల వాహనాల్లో కొద్దిసేపు వారితో కలిసి ప్రయాణించారు. నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు బహిరంగసభకు వెళ్లారు. గణేష్‌గడ్డ వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి బహిరంగసభకు కార్యకర్తలకు స్వాగతం పలికారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సుమారు 320 వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు బయలు దేరిన వారిలో మున్సిపల్మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ చిన్న, మాజీ కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. రాష్ట్రభారీ నీటి పారుదల శాఖామాత్యులు హరీష్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల పర్యవేక్షణలో జనాలను తరలించారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బహిరంగ సభకు వెళ్లే వాహనాలను పంపించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మెదక్ నియోజకవర్గం నుంచి సుమారు 21వేల మంది తరలివెళ్లారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలి వెళ్లారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి సభకు తరలి వెళ్తున్న బస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభకు అందోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల నుంచి సుమారుగా 100 ఆర్టీసీ బస్సులలో తరలివెళ్లారు. టీఆర్ఎస్ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. 150కి పైగా వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరి వెళ్లారు. 54 ఆర్టీసీ బస్సులు, 70కి పైగా స్కూలు బస్సులతో పాటు ప్రత్యేక వాహనాల్లో కూడా కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్లిన వారిలో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్, నియోజకవర్గం ఇన్చార్జి కె.మాణిక్‌రావులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేగుంట నుంచి తరలి వెళ్లారు.