సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరుకావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆహ్వానాలు పంపించాలని ఆ పార్టీ అగ్రనాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసి, పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పత్రికను అందజేయనున్నారు.
ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ సభకు హాజరై దిశా నిర్దేశం చేయ నున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్‌చార్జి అరవింద్ మీనన్ వరుస సమీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment