invitations
-
ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ అవకాశం: మెగాస్టార్ ట్వీట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు అయోధ్య వైపే ఉన్నాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న జరగనున్న మహా ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకానికి ఆహ్వనం రావడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రను ఉర్రూతలూగిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఐదు వందల సంవత్సరాలకుపైగా తరతరాలుగా వేచి చూస్తోన్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన 'చిరంజీవి' అయిన హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే.. స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది.' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతే కాకుండా..' ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ యోగి జీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీరామ్ ' అని తెలిపారు. Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
గవర్నర్‌కు దుర్గగుడి, శ్రీశైలం దసరా ఉత్సవాల ఆహ్వానాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహా్వన పత్రికలను బుధవారం వేర్వేరుగా అందజేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. అనంతరం ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా, ఈవో, చైర్మన్లు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డికి విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆహా్వన పత్రిక అందజేశారు. శ్రీశారదాపీఠాధిపతులకు శ్రీశైలం నవరాత్రుల ఆహ్వానం సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో జరిగే భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహా్వన పత్రికను విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతికి బుధవారం అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని దేవస్థానం పండితులు, అధికారులు కోరారు. ఫిబ్రవరిలో చేపడుతున్న ఆలయ కుంభాభిషేకం గురించి వివరించారు. వైదిక, ఆగమ పద్ధతులను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజుకు స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు!
దేశీయ హాస్పెటాలిటీ చెయిన్ ఓయోను స్థాపించిన రితేష్ అగర్వాల్ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రితేష్ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు.. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు. చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు! -
అఖిలేశ్, మాయవతిలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం!
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. అందులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్‌నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మను సైతం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర. గాజియాబాద్ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్‌పత్, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
పెళ్లి కుదిరిందోచ్చ్... మోదీ, యోగీలకు ఆహ్వానం!
అత్యంత పొట్టి వ్యక్తి తన వివాహం కోసం ఎన్నెళ్లగానో ఎదురుచూశాడు. పెళ్లి కుదరడమే కష్టమైంది. ఎందుకంటే ఆ వ్యక్తి పొడుగు కేవలం 2.3 పొడుగులు. దీంతో తనకు తగిన అమ్మాయికి కోసం వెదకడం చాలా కష్టమైంది. ఒకనొక దశలో ఈవిషయమై రాజకీయ నాయకులను సైతం కలిసాడు సదరు వ్యక్తి. అతనే యూపికి చెందిన అజీమ్ మన్సూరీ. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదరక.. కుదరక వివాహం కుదరడంతో పట్టరాని ఆనందంలో ఉన్నాడు అజీమ్. తన వివాహం విషయమై పలువురు ప్రముఖులను, రాజకీయనాయకులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు తన వివాహం కోసం 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సైతం సంప్రదించాడు. చివరకు ఎట్టకేలకు అజీమ్ తన డ్రీమ్ గర్ల్ బుషారాని మార్చి 2021లో కలుసుకున్నాడు. హాపూర చెందిన ఆమె ఎత్తు మూడు అడుగుల . ఏప్రిల్ 2021లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు అజీమ్. ఐతే ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వచ్చే నెల నవంబర్ 7న వారి విహహం. కానీ అజీమ్ మాత్రం ఐదోతరగతి డ్రాపవుట్. చిన్నప్పటి నుంచి ఎన్నో చీత్కారాలు ఎదుర్కొన్నాడు. ఆఖరికి తనకు తగిన పెళ్లికూతురు దొరకడం కూడా కష్టమైంది. ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. అందుకే తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని ఢిల్లీ వెళ్లి మరీ ఆహ్వనిస్తానని ఆనందంగా చెబుతున్నాడు. (చదవండి: కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై నడ్డా కీలక వ్యాఖ్యలు) -
3న మోదీ సభకు రండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరుకావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆహ్వానాలు పంపించాలని ఆ పార్టీ అగ్రనాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసి, పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పత్రికను అందజేయనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ సభకు హాజరై దిశా నిర్దేశం చేయ నున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్చార్జి అరవింద్ మీనన్ వరుస సమీక్షలు నిర్వహించారు. -
Scholarships: విద్యార్థులకు అలర్ట్.. ఇది మీ కోసమే..
సాక్షి, అమరావతి: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ ఎస్డీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www. vidyadhan.org అనే వెబ్సైట్ లేదా 8367751309 నంబర్లో సంప్రదించవచ్చు. -
వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ అందజేశారు. చదవండి: సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్‌మిషన్ కింద పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటీ టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్/డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హులైనవారు ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ లోగా దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే? జిల్లా అకౌంట్స్ అధికారి ఉద్యోగానికి ఎంబీఏ(ఫైనాన్స్)/ పీజీ ఇన్ కామర్స్ ఉత్తీర్ణత అర్హతగా కలవారు, కనీసం రెండేళ్లు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఇందుకు ఈ నెల 8 నుంచి 13వ తేదీలోగా డీఎంహెచ్ఓ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. స్పెషలిస్ట్ ఎండీ (జనరల్ మెడిసిన్), స్పెషలిస్ట్ ఎంఓ(ఓబీజీ), కార్డియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఎన్సీడీ వైద్యాధికారి, ఎన్ఆర్సీ వైద్యాధికారి ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులు ఈ నెల 12న ఉదయం 11గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. వివరాలు శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను..
సాక్షి,ఇల్లెందు( భద్రాద్రి): అంతా మీ ఇష్టమైపోయింది.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏ కార్యక్రమానికీ సమాచారం ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు గాంధీ జయంతికి నేను ఎందుకు రావాలి... మీరే చేసుకోండి’ అంటూ ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ నాగరత్నమ్మ హాజరయ్యారు. ఇదే సమయంలో గాంధీ జయంతి వేడుక నిర్వహిస్తుండగా రావాలని అధికారులు ఆహ్వానించారు. అయితే, ఇతర కార్యక్రమానికి వస్తే గాంధీ జయంతికి ఆహ్వానిస్తారా.. అసలు ఈ కార్యక్రమం ఉందని తనకు సమాచారమే ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ అప్పారావు ఆమెకు నచ్చజెప్పారు. సమాచారం ఇవ్వాలని యూడీసీకి చెప్పామని, ఆయన మరిచిపోయి ఉంటారని, ఈ విషయంలో యూడీసీకి మెమో ఇస్తామని చెప్పినా ససేమిరా అనడంతో.. చివరకు జెడ్పీటీసీ ఉమ, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు నచ్చ జెప్పడంతో చివరకు ఎంపీపీ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా! -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌కు వర్సిటీ ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై 2 రోజులపాటు సమావేశంలో చర్చిం చనున్నారు. సుమారు 1000 మంది విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు. ‘ఇండియా ఎట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్’ అనే థీమ్ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను సదస్సు నిర్వాహకులు కోరారు. ఆ సంఘాలకు గుర్తింపు లేదు: కేటీఆర్ తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ, తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాలతో కలసి పనిచేయాలని సూచించారు. -
కళాత్మకం : సరికొత్తగా శుభలేఖలు!
సాక్షి, సిటీబ్యూరో :వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిదినగరంలో నడుస్తున్న ట్రెండ్. ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా... భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే... సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
ప్రణబ్‌కు ఇఫ్తార్ ఆహ్వానం పంపాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పష్టంచేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించారన్నారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి.ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు అ ర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను జిల్లా మైనార్టీ శాఖ ఆహ్వానిస్తోంది. అలాగే ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి రత్న కల్యాణి తెలిపారు. రాజేంద్రనగర్ (బాలురు, బాలికలు), ఫరూఖ్‌నగర్ (బాలికలు), శేరిలింగంపల్లి (బాలురు), హయత్‌నగర్ (బాలురు, బాలికలు), ఇబ్రహీంపట్నం (బాలికలు), బాలాపూర్ (బాలురు), మెయినాబాద్ (బాలికలు)లో పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ముస్లిం, క్రైస్తవ, పార్సీ, జైనులు, సిక్కులు, బౌద్ధ విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీ సీ, ఇతరులకు 25 శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 20వ తేదీలోగా www. tmreis. telangana. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, పాస్ పోర్ట్‌సైజు ఫొటో, బర్త్ సర్టిఫికెట్, బోనాఫైడ్, వార్షికాదాయ ధ్రువపత్రాలు అవసరమ న్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సంప్రదించాని కోరారు. -
అందరూ ఆహ్వానితులే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు తదితర వేదికలు తెలుగు వెలుగులతో జిగేల్ మంటున్నాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో తళుకులీనుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి తెలిపారు. గురువారం వారు ‘తెలంగాణ సాహిత్య వైభవం’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు రోజుల తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం అవుతాయన్నారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంను తెలుగుదనం ఉట్టిపడేలా కళాత్మకంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలంకరించినట్లు చెప్పారు. ప్రాంగణానికి నలువైపులా ఎనిమిది ద్వారాల్లో ప్రముఖులకు, ప్రతినిధులకు, సాధారణ ప్రజలకు విడివిడిగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. రవీంద్రభారతిలో కిట్ల పంపిణీ.. హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులకు గురువారం మహాసభల కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ప్రతినిధులకు హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు నేతృత్వంలోని ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్లను అందజేస్తారు. ఇందుకోసం అన్ని చోట్లా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారని, వారందరినీ ఆహ్వాన కమిటీ సాదరంగా ఆహ్వానించి వారి బస కేంద్రాలకు తోడ్కొని వెళుతోందని చెప్పారు. సుమారు 6,000 మంది ప్రతినిధులకు వివిధ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. మహాసభలకు వెళ్లేందుకు, తిరిగి వారిని హోటళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా శాఖ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 150 బస్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే ఎల్బీ స్టేడియం వద్ద 60 ఆహార విక్రయ శాలలు, 25 పుస్తక ప్రదర్శన శాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్, జనగామ తదితర సమీప జిల్లాలకు చెందిన ప్రతినిధులు కిట్ల కోసం రవీంద్రభారతికి రావలసిన అవసరం లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. వారికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. -
చిట్టి బుర్రలు.. గొప్ప ఆవిష్కరణలు
- ఆకట్టుకున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ - అద్భుత సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు అదుర్స్ జంగారెడ్డిగూడెం : ‘భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సజనాత్మకత అనేది తాళం చెవిలాంటిది.. ప్రాథమిక దశలోనే విద్యార్థులలోని సజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలి.’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. ఆ దిశగా సాగే ప్రయత్నాల్లో భాగంగానే విద్యాశాఖ విద్యార్థుల్లో సజనను వెలికితీసేందుకు ఏటా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది. సైన్స్‌లో వినూత్నమైన ప్రయోగాలతో విద్యార్థులూ తమలోని సజనాత్మకతను చాటుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వివిధ రకాల ప్రాజెక్టులతో విద్యార్థులు ఇలా ఆకట్టుకున్నారు. పవనం.. శక్తిదాయకం పవనాల ద్వారా చేంజ్ ఆఫ్ ఎనర్జీ నమూనా ప్రదర్శించాడు శనివారపు పేట హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి కె.ప్రవీణ్. పవనాల ద్వారా విండ్ ఎనర్జీని, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారు అవుతుందో వివరించారు. పవనాల ద్వారా మెకానికల్ ఎనర్జీ సష్టించి భూగర్భ జలాలను వెలికి తీసుకురావచ్చని అలాగే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు. – పవనాల ద్వారా చేంజెస్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్టు నమూనా తయారుచేసిన విద్యార్థి ప్రవీణ్, ఉపాధ్యాయుడు –––––––––––––––––––––– వరద ముప్పునకు ఆటోమేటిక్ చెక్ వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డ్యామ్ గేట్లు ఎత్తివేసే ప్రదర్శన ఇది. కె.గోకవరం హైస్కూల్ విద్యార్థిని నిట్టా ఉదయప్రియ ఈ నమూనాను ప్రదర్శించింది. వరదలు సంభవించిన సమయంలో జలాశయం గేట్లు ఎత్తకపోతే కాలువగట్లు, చెరువు గట్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున జలాశయంలోకి నీరు చేరగానే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తుకుంటాయని వివరించింది. తద్వారా వరదముంపును అరికట్టవచ్చని చెబుతోంది. – వరదల సమయంలో ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తివేసే ప్రదర్శన –––––––––––––––––––––––––––––––––– చెత్త నుంచి సంపద ఉత్పత్తి వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకోవడం ద్వారా పునర్ వినియోగం ఎలా చేసుకోవాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశంపై భీమడోలు డిపాల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఎన్.జ్యోత్సS్న ప్రాజెక్టు తయారు చేసింది. వథా నీరు శుద్ధి చేయడం, వివిధ రకాల వస్తువుల వినియోగం తరువాత పడవేయకుండా వస్తువులుగా మలచడాన్ని ప్రయోగాత్మకంగా వివరించింది. – వథా నీరు, వ్యర్థ పదార్థాలను రీ సైక్లింగ్ చేసే విధానాన్ని వివరిస్తున్న విద్యార్థిని ––––––––––––––––––––––––– పంటను జంతువు తాకగానే సైరన్‌మోత అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పోడు వ్యవసాయంలో పంటలను ఎలా రక్షించుకోవాలో నమూనాను ప్రదర్శించాడు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ విద్యార్థి ఎం.కిశోర్‌బాబు. పంటలను అటవీ ప్రాంతంలోని జంతువులు తాకగానే సెన్సార్ల ద్వారా సైరన్ మోగే విధంగా నమూనాను ప్రదర్శించాడు. సైరన్ నుంచి వచ్చే శబ్దం కారణంగా జంతువులు పారిపోతాయని, తద్వారా పంటను రక్షించుకోవచ్చని వివరించాడు. – పోడు వ్యవసాయాన్ని రక్షించుకునే వి«ధానం తెలిపే నమూనాతో విద్యార్థి –––––––––––––––––––––––––––– మా ఊరు.. సమస్యల సుడిగుండం తమ గ్రామ సమస్యలను గ్రామ నమూనా తయారుచేసి కళ్లకు కట్టేలా ప్రదర్శించాడు పెదపాడు మండలం వడ్డిగూడెం ఎంపీయూపీ స్కూల్ విద్యార్థి ఎం.సుధీర్. తమ గ్రామంలో చేపల పెంపకం సానుకూల అంశం అని, అయితే అపరిశుభ్రత, డ్రైన్లు, రవాణా సౌకర్యం లేక అభివద్ధికి నోచుకోవడం లేదని వివరించాడు. సౌకర్యాలు కల్పించాలని నమూనాలో ప్రదర్శించాడు. – మా ఊరు సమస్యల సుడిగుండం అంటూ గ్రామ నమూనా ప్రదర్శిస్తున్న వడ్డిగూడెం విద్యార్థులు ఇంజిన్‌ఆయిల్ ద్వారా విద్యుదుత్పత్తి వాహనాల్లో వినియోగించి, తొలగించే ఇంజన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు కామవరపుకోట హైస్కూల్ విద్యార్థి ఎ.వెంకన్న. వ్యర్థ ఇంజిన్ ఆయిల్‌ను బాయిల్ చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందని, ఆ ఆవిరికి నీటిని సంయోగపరిచి కెమికల్ ఎనర్జీని సష్టించడం ద్వారా విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించాడు. – మోటార్వాహనాల్లోని తీసివేసిన ఇంజిన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారుచేసే ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయుడు -
మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతిలో నిర్వహించనున్న టీడీపీ మహానాడుకు హాజరవ్వాలని కోరుతూ ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై గురువారం ఆయన పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా మహానాడు నిర్వహించడం ఇది మూడో పర్యాయమన్నారు. అంతకు ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు కళా వెంకటరావు, ఎల్.రమణలతో పాటు రాష్ట్ర మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మహానాడు నిర్వహణ కమిటీల సమన్వయకర్త టీడీ జనార్థనరావులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకున్నారు. వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచి నీరు, టాయిలెట్స్, అతిథులకు గదులు, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు.. జిల్లా మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్చార్జి మంత్రి నారాయణ, స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని, మహానాడు జరిగే మూడు రోజులూ పార్టీ నేతలందరూ అందుబాటులో ఉంటూ ఎవరికి కేటాయించిన బాధ్యతల్లో వారుండాలని సూచించారు. తెలంగాణ నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు హాజరవుతారని ఎల్.రమణ పేర్కొన్నారు. -
మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానాలు
తిరుపతి: ఈ నెల 27వ తేదీ నుంచి తిరుపతిలో జరగబోయే మహానాడుకు ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ సెంటర్లోని హోటల్ ఇంటర్నేషనల్‌లో జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధులు.. అతిథులకు గదులు, భోజనాల కల్పన, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నాయకులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకుని వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచినీరు, టాయిలెట్స్, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్చార్జి మంత్రి నారాయణలతో మాట్లాడారు. -
ఓట్ల వేటలో ‘ఆహ్వానాల’ ఆట
డేట్లైన్ హైదరాబాద్ ఇటు కేసీఆర్, చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, అటు తన కుమారుడితో తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన సంగతి కాదు. విజయవాడలో ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను తిట్టిపోస్తుంటారు. కేటీఆర్ తదితరులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి సోమవారం నాడు ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ వెళ్లారు. ఆ ఆహ్వానాన్ని ఆయన ఆనందంగా స్వీకరించారు. పత్రికలు, వార్తా చానళ్లు కనువిందు చేసే ఈ అపురూప కలయికను కళ్లకు కట్టినట్టు చూపాయి. నిజమే, కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరే సభ్యతను సైతం మరచి ఒకరినొకరు బండబూతులు తిట్టుకున్నారు. అందుకే మొన్నటి కలయిక అపురూపంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రులు ఇరువురూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాస స్థలం చుట్టూ ఉన్న ఆహ్లాదకర వాతావరణం దగ్గరి నుంచి ఏపీ ఆర్థిక పరిస్థితి దాకా చర్చకు వచ్చాయి. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత చిరకాలం వర్ధిల్లాలని, అక్కడా, ఇక్కడా ప్రజలందరి ఆకాంక్ష. దానివల్ల ప్రజలకు మేలు జరగాలన్నది కూడా అందరి కోరిక. గులాబీ కండువాల యాగం అయితే ఇదేదో దీర్ఘకాలం కొనసాగే స్నేహమని ఎవరూ విశ్వసించడం లేదు. వచ్చే నెల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకట్టుకుని, టీఆర్ఎస్ను గెలిపించుకోడానికే చంద్రశేఖర్‌రావు ఈ విజయవాడ ప్రయాణం పెట్టుకున్నారని అందరూ నమ్ముతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్త్తున నిర్వహిస్తూ చంద్రబాబు ఈయనను ఆహ్వానించారు. కాబట్టి ఈయన అదేస్థాయిలో అయుత చండీయాగం తలపెట్టి ఆయనను పిలిచారని కూడా అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు ఒక పక్క చంద్రబాబు నాయుడును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, మరోపక్క తన కుమారుడితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు, రాష్ర్ట మంత్రి కేటీ రామారావు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపు కోసం ఎడాపెడా టీడీపీ వారిని టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న నేపథ్యంలో ఇది ఆశ్చర్యకరం కాదు. ఒక పక్క విజయవాడలో కృష్ణ ఒడ్డున ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను తిట్టిపోస్తుంటారు, కేటీఆర్ వగైరా నాయకులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు. ఇదీ నిఖార్సయిన రాజకీయం అంటే. గులాబీ గూట్లో విజయరామారావు ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కే విజయరామారావు పార్టీ మార్పిడి విషయానికి వద్దాం. పోలీసు శాఖలో మంచి పేరున్న ఆయన ప్రతిష్టాత్మకమైన సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 1999 ఎన్నికలకు కొద్ది మాసాల ముందు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పౌరహక్కులు, తీవ్రవాద ఉద్యమం గురించి మాట్లాడటానికి విజయరామారావుతో బాటు నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంగా నేను ఆయన అనుభవాలను గ్రంథస్తం చేయమని కోరాను. ఆ ఆలోచన ఉంది, తప్పకుండా చేద్దామన్నారు. టీడీపీలోకి చంద్రబాబు తటస్తులను ఆహ్వానిస్తున్నారని, వారిలో విజయరామారావు కూడా ఉన్నారని తదుపరి రెండో రోజున పత్రికల్లో వార్త వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేయగా ఆయన ధ్రువీకరించారు. పోలీసు అధికారిగా మంచి పేరున్న మీరు రాజకీయాల్లో చేరడం ఎందుకని నేను అన్నాను. లేదు, ఇంకా పని చేసే శక్తి ఉంది కదా, రాజకీయాలు మంచి వేదికని ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారాయన. ఆ తరువాత ఒకటి రెండు, రోజుల్లో ఆయన టీడీపీలో చేరడం, 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలవడం, రాష్ర్ట మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తరవాత చాలా కాలం నేను వారిని కలవలేదు. కానీ విషయాలు తెలుస్తూ ఉండేవి. ఇవాళ నడుస్తున్న రాజకీయాలకు విజయరామారావు వంటి వారు పనికి రారన్నది నా అభిప్రాయం. పైగా రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబుతో స్నేహం ఎంతో కాలం కొనసాగడం కష్టమే. అదే జరిగింది. 2004 ఎన్నికలలో ఆయన మళ్లీ గెలవలేదు. ఆ తరువాత టీడీపీలో, దాని అధినేత వద్ద విజయరామారావుకు ఎంత ప్రాధాన్యత లభించిందీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఇట్లాగే జరుగుతుందని విజ్ఞ్ఞులయిన ఆయనకు ముందే తట్టక పోవడం విచారకరం. ఆయన ఆపై మళ్లీ అటువంటిదే ఇంకో నిర్ణయం తీసుకుని ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. విజయరామారావు టీఆర్ఎస్లో చేరడం గురించి మాట్లాడుకునే ముందు ఆయన గురించి మరొక్క విషయం చెప్పుకోవాలి. ఆయన మంత్రి కాకపోతే టీఆర్ఎస్ లేదుగా! తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుని, పార్లమెంట్ ముందు రాష్ర్ట విభజన బిల్లు పెట్టబోతున్న రోజుల్లో, ఒక సందర్భంగా ఆయనను కలిశాను. అక్కడ ఓ పది మందిమి ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నాం. తెలంగాణ రాష్ర్టం ఎవరి వల్ల వచ్చిందని అక్కడున్న వాళ్లను నేను అడిగాను. అందరూ ముక్తకంఠంతో కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల అన్నారు. నేను విజయరామారావును చూపించి వీరి వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్నాను. ఆయన కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. మిగతా వాళ్లు అదెలాగన్నారు. 1999లో తిరిగి గెలిచాక చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి ఆయనను తీసుకున్నారు... అదే సామాజిక వర్గానికి, అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రావును పక్కన పెట్టేశారు. ఆనాడు మిత్రులందరూ పలికిన హితవును మన్నించి చంద్రబాబు, విజయ రామారావుకు బదులు చంద్రశేఖర్‌రావును కేబినెట్లోకి తీసుకుని ఉంటే టీఆర్ఎస్ లేదు కదా! అందుకే తెలంగాణ మలి దశ ఉద్యమం రావడానికి పరోక్షంగానే అయినా విజయరామారావే కారణమన్నాను. ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయి రాష్ర్టం సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలను కించపరిచేందుకు అంటున్న మాటలు కావివి. అప్పుడున్న వాస్తవ పరిస్థితి అది. చంద్రశేఖర్‌రావు కాకపోతే మరొకరు ఉద్యమించే వారు, తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేది. నాడు చంద్రబాబు మంత్రి వర్గ ఏర్పాటు కసరత్తు చేస్త్తున్న సమయంలో, ఒక రోజు రాత్రి ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక టీడీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి చంద్రశేఖర్‌రావును మంత్రివర్గం బయట ఉంచడం మంచిది కాదు, ఈ విషయం చంద్రబాబుకు చెప్పగలరా? అని నన్ను అడిగారు. ఇప్పుడాయన తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్నారు. వృత్తి, ట్రేడ్ యూనియన్ అవసరాల దృష్ట్యా నాకు ముఖ్యమంత్రిని తరచూ కలిసే అవకాశం ఉండేది. సున్నితంగానే ఆ మిత్రుడి అభ్యర్థనను నిరాకరించాను. ఎవరి కారణంగానయితే చంద్రశేఖర్‌రావు ఆ నాడు మంత్రివర్గంలో చేరలేక పోయారో అదే విజయరామారావును ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి మరి. వారెందుకు పిలిచారు? ఈయన ఎందుకు వెళ్లారు? టీఆర్ఎస్, విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం... రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి విజయం సాధించాలని. మరి విజయరామారావు ఎందుకు టీడీపీని వీడి టీఆర్ఎస్కు వలస పోతున్నట్టు? రాజకీయ వ్యూహాలు, ఎత్త్తుగడల విషయానికి వస్తే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు కంటే తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే కొంచెం ఎక్కువే. తెలుగుదేశంలో కరువయిన గౌరవాన్ని టీఆర్ఎస్లో వెతుక్కోడానికే ఆయన బహుశా పార్టీ మారుతున్నారేమో. విజయరామారావుగారి సన్నిహితులు చెబుతున్న ప్రకారం టీఆర్ఎస్లో ఆయన కోసం ఒక గ్రాండ్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. కానీ బయట ప్రచారంలో ఉన్నట్టు కుమార్తె రాజకీయ అరంగేట్రం కోసం ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకుని ఉంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. అంతకంటే ఆయన సుదీర్ఘ వృత్తి జీవితం, స్వల్ప రాజకీయ పయనం అనుభవాలను గ్రంథస్తం చేస్తే భావితరాలకు కొంత మేలు చేసిన వారవుతారు. వ్యాసకర్త, దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com