అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్‌మిషన్ కింద పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటీ టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్/డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హులైనవారు ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ లోగా దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని కోరారు.
చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే?
జిల్లా అకౌంట్స్ అధికారి ఉద్యోగానికి ఎంబీఏ(ఫైనాన్స్)/ పీజీ ఇన్ కామర్స్ ఉత్తీర్ణత అర్హతగా కలవారు, కనీసం రెండేళ్లు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఇందుకు ఈ నెల 8 నుంచి 13వ తేదీలోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. స్పెషలిస్ట్ ఎండీ (జనరల్ మెడిసిన్), స్పెషలిస్ట్ ఎంఓ(ఓబీజీ), కార్డియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఎన్‌సీడీ వైద్యాధికారి, ఎన్‌ఆర్‌సీ వైద్యాధికారి ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులు ఈ నెల 12న ఉదయం 11గంటలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. వివరాలు శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment