సాక్షి, అమరావతి: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ ఎస్‌డీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్‌షిప్‌లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు.
చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www. vidyadhan.org అనే వెబ్‌సైట్ లేదా 8367751309 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment