
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలలో భాగంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఈఎఫ్) తమ కన్య స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మందికి స్కాలర్‌షిప్లను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల ఉన్నత విద్యార్జనకు వీలుగా ఏటా రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని 4–5 సంవత్సరాల పాటు అందిస్తామని చెప్పారు. రూ.6లక్షల లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారై, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఆ పైన మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్స్ దరఖాస్తుకు అర్హత పొందుతారని తెలియజేశారు.
ఇవి చదవండి: ‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు..
Comments
Please login to add a commentAdd a comment