Poor students
-
ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న చట్ట నిబంధన అమలుపై సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.మరోవైపు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. \ఎవరికి ఉచితం? రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్ డెవలప్మెంట్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేసినా ట్యూషన్ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్‌తో నడిచే సీబీఎస్సీ, ఐసీఎస్ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
ఇంగ్లిష్ మీడియం జగన్ విజన్
► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. ► కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. ► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. ► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. ► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ► 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ ► మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 12)న జరిగిన టోఫెల్ జూనియర్ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాలి్వంగ్ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు ► ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. -
చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు
వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. 2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్ జగన్ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్‌లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి. పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు. వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ అందేలా లేదా రేషన్ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం! పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి. కాంట్రాక్టర్ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం. ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్ పెట్టుబడికీ, ప్రైవేట్ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్ గెలిస్తే ఈ మోడల్ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్‌లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్‌కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్‌కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
పేద విద్యార్థులు, దాతల మధ్య వారధిగా రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్ పనిచేస్తుందని గవర్నర్ అన్నారు. అయోధ్య రామాలయ పాదుకలకు పూజలు అయోధ్య రామాలయం కోసం చల్లా శ్రీనివాసశాస్త్రి రూపొందించిన స్వర్ణ పాదుకలకు గవర్నర్ తమి ళిసై మంగళవారం రాజ్‌భవన్‌లో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ఈ పాదుకలు నిత్యం కోట్లాది మంది భక్తుల పూజలను అందుకోనున్నాయని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. నరసింహన్ భేటీ: రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవ ర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. -
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్‌కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
AP: ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాల పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు ముందడుగు వేసింది. ఈ మేరకు ఐబీ సంస్థతో పాఠశాల విద్యా శాఖ కుదుర్చుకున్న ఒప్పందానికి (ఎంఓయూ) బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హర్షధ్వానాల మధ్య ఆమోదం లభించింది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంపునకు మూడో తరగతి నుంచి ప్రతి రోజు గంటపాటు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ అందిస్తోంది. తాజా ఒప్పందంతో ఒకటవ తరగతి నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడుతూ నెమ్మదిగా పై తరగతులకు విస్తరిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అనంతరం సీపీఎస్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అమలుకు ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీం(ఏపీజీపీఎస్) బిల్లు– 2023ను ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బిల్లు–2023నూ అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. ఈ నిర్ణయాలకూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ పేరుతో అవార్డులను అందజేయనున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన పేద అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరిలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తే అదనంగా మరో రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జఫ్రీన్‌కు గ్రూప్–1 ఉద్యోగం కోసం చట్ట సవరణ 2017 డెఫ్ ఒలింపిక్స్ టెన్నిస్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీం కెప్టెన్ షేక్ జఫ్రీన్‌కు గ్రూప్–1 సర్వీసెస్‌లో కో–ఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో నియామకం కల్పించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పేట్రన్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్– 1994ను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జఫ్రీన్‌కు 10 సెంట్ల ఇంటి స్థలం కూడా కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జీరో వేకెన్సీలో టాప్ వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఆరోగ్య శాఖలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తున్నారు. తాజాగా కేన్సర్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు డీఎంఈ పరిధిలోని విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కడప ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్ కేర్ సెంటర్లో 353 పోస్టుల భర్తీ చేస్తున్నాం. ఒంగోలు, ఏలూరు, విజయవాడలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ప్రమోషన్ విధానం/అవుట్ సోర్సింగ్ ద్వారా 168 పోస్టుల భర్తీకి నిర్ణయం. వీటికి తోడు 11 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వివిధ విభాగాల్లో మరో 99 పోస్టులను భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు ఆమోదం లభించింది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేస్తున్నాం. ఆర్డినెన్స్ స్థానంలో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాం. దీంతో ఏపీవీవీపీలోని ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం లభించింది. 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్రంలోని ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కార్యక్రమాలు తలపెట్టాం. ఇందులో భాగంగా తప్పకుండా పేదల ఇళ్లను సందర్శించి ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు. ఆ తర్వాత ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. మెడికల్ క్యాంపుల తేదీలను ముందుగానే ప్రకటిస్తారు. దీర్ఘకాలిక, తీవ్ర వ్యాధులతో బాధ పడేవారికి పూర్తిగా చికిత్స చేయించేంత వరకు తోడుగా నిలుస్తారు. ఇందుకోసం ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉన్న మందులు కాకుండా అదనంగా 162 రకాల మందులు, 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతోంది. స్పెషలిస్ట్ వైద్యుల సూచన మేరకు ఇతర మందులు కూడా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 వరకు దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణకు క్యాబినెట్ ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీ విద్యలో మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు–2016 చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నాం. దీని ద్వారా ప్రైవేటు వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ చట్ట సవరణతో ఇంతకు ముందున్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సిటీలు ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ప్రఖ్యాత వర్సిటీలతో ఇక్కడి ప్రైవేటు వర్సిటీలు విద్యార్థులకు సంయుక్త సర్టిఫికేషన్ డిగ్రీలు అందించాలి. ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలను వర్సిటీలుగా మారిస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. చిరుద్యోగికి పెద్ద సాయం ప్రభుత్వంలో చిరుద్యోగి రిటైరయ్యే సమయానికి కనీసం ఇంటి స్థలం సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తాం. దీనిని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుంది. రిటైరైన తర్వాత చిరుద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో సేవలు అందేలా సీఎం నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల అంచనా ఖర్చు పెరిగింది. 2016–17 నాటి రేట్ల ప్రకారమే ఇళ్ల నిర్మాణ అంచనాలు తయారు చేశారు. తాజా రేట్లను బట్టి చూస్తే 8,424 ఇళ్ల నిర్మాణానికి రూ.70 కోట్లు అదనంగా వ్యయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన్– గ్రామదాన్ చట్ట సవరణ ఆంధ్రప్రదేశ్ భూదాన్–గ్రామదాన్ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆచార్య వినోభా భావే లేక ఆయన నామినేట్ చేసిన వ్యక్తిని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డును నియమించాలి. కానీ ఈ చట్టం వచ్చి 58 సంవత్సరాలు కావడం, వినోభా భావే మృతి చెంది కూడా 41 ఏళ్లవడంతో ఆయన నామినేట్ చేసిన అసలు వ్యక్తి ఎవరో నిర్ధారించడం కష్టంగా మారింది. దీంతో చట్టానికి అనుగుణంగా ప్రభుత్వమే బోర్డు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను నియమించేందుకు వీలుగా చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమిని మంజూరు చేసే అధికారాన్ని బోర్డు కల్పించేలా చట్టంలో మార్పు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పోస్టుల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం – ఆదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం. – కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్ కేడర్ డెప్యూటీ రిజిస్ట్రార్, 6 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ. – సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీ. – ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభాగంలో డెప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (తిరుపతి), ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్(రాజమండ్రి) పోస్టుల ఏర్పాటు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజిమెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగంతో పాటు 10 కొత్త పోస్టుల మంజూరు. – సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ. – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ ట్రిబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరు. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు, 28 డ్రైవర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ. మరిన్ని అంశాలకు కేబినెట్ పచ్చ జెండా – ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రతిపాదిత నిర్ణయం – కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 50 శాతం సీట్లను షెడ్యూల్ ప్రాంతంలోని ఎస్టీ విద్యార్థులకే కేటాయింపు. – వ్యక్తుల గుర్తింపు కోసం ఆధారం వినియోగంపై చట్టబద్ధత కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆధార్ చట్టంపై బిల్లుకు కేబినెట్ ఆమోదం. – నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధం మరో ఏడాది పొడిగింపు. – ఏపీఐఐసీసీకి చెందిన 2 వేల ఎకరాల్లో రూ.2,190 కోట్లతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే తొలుత అనుకున్నట్లు కాకుండా కాకినాడ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ భూముల్లోనే ఈ ప్రాజెక్టు నెలకొల్పాలి. నక్కపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో స్థలం మార్పు చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది. పలు చట్ట సవరణ బిల్లులకు ఆమోదం – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్టు–2017లో భాగంగా వర్సిటీల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే చేపట్టేలా సవరణ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సియేషన్ యాక్ట్ 1963 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ 2023 సవరణల బిల్లు. – ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు–1987 సవరణలకు ఆమోదం. – ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్ 1977కు సవరణ. ఆర్డినెన్స్ స్థానంలో చట్టం తీసుకువస్తూ ప్రవేశపెట్టనున్న బిల్లు. – ది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు (ఏపీ ఎస్ఎస్జీ) బిల్లుకు అమోదం. అభివృద్ధికి భూ కేటాయింపులు – విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్బీఐ ఆధ్వర్యంలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు ఎకరా స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజు ప్రతిపాదికన కేటాయింపు. – పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. – గుంటూరుకు చెందిన విశ్వ మానవ సమైక్యతా సంసత్ విజ్ఞప్తి మేరకు ఎకరా రూ.లక్ష చొప్పున 7.45 ఎకరాల స్థలాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయింపు. – చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణ, శ్రీకాకుళం, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూ కేటాయింపులు. – ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉచితంగా 2.41 ఎకరాల భూమి కేటాయింపు. – సంస్కృతి, కళలు పెంపొందిస్తూ పర్యాటక ఆదాయాన్ని పెంచడంలో భాగంగా మధురవాడలో యూనిటీ మాల్ (కన్వెన్షన్ సెంటర్) నిర్మాణం. – బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాల్టీల పరిధిలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను డీబీఓటీ (డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయింపు. ‘ఐబీ’ సిలబస్ చారిత్రక ఘట్టం అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నాం. రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టం. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయి. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే మూడో తరగతి నుంచి విద్యార్థులకు వారానికి ఆరు రోజులు.. రోజూ గంట పాటు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తున్నాం. వీళ్లు 8, 9 తరగతులకు వచ్చే సరికి మంచి నైపుణ్యం సాధిస్తారు. దీనివల్ల వారికి ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి కూడా మనం తోడ్పాటునందించాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరు మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే అదనంగా మరో రూ.50 వేలు ఇస్తే.. కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టువుతుంది. భవిష్యత్తులో సివిల్ సర్వెంట్లుగా ఎందరో పేదలకు సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చినట్టు ఉంటుంది. – ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌పై మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ -
విద్యార్థులకు ‘విదేశీ’ వరం!
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం విద్యా రంగంలో విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో నిలిచిపోతుంది. మన పిల్లలు టాప్ సీఈవోలుగా ప్రపంచాన్ని శాసించే ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాంటి యూనివర్సిటీల్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు అప్పుల బారిన పడకుండా.. పిల్లలు దిగులు చెందకుండా విదేశాల్లో ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నాం. ఇలా పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పథకానికి పరిమితులు లేకుండా శాచ్యురేషన్ విధానంలో అర్హులందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఏమన్నారంటే.. వీసా నుంచి విమాన చార్జీల దాకా.. మంచి కాలేజీలో సీటు వచ్చినా అంత డబ్బులు కట్టే స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుంది. ఒక భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ 50 విద్యాసంస్ధల్లో సీటు సాధించిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా అర్హత ఉంటే సపోర్టు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వ విద్యాలయాలకు వెళ్లే పిల్లలను విమాన చార్జీలు, వీసా చార్జీల దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పది ఉత్తమ విద్యాసంస్థల్లో ఫీజులిలా.. ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి? సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా? అన్నది ఒక్కసారి గమనిస్తే.. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులున్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా సామాన్యులు, పేదరికం కారణంగా అంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా? అన్నది మొట్టమొదట ఈ పథకం గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈవోలుగా రాణించే స్థాయికి చేరుకుంటారు. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. అందుకే అలాంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే ఏ రకంగా మన పిల్లలను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరణ. నాడు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా గత ప్రభుత్వంలో పరిస్థితి చూస్తే కేవలం రూ.10 లక్షలు.. ఎస్సీ ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? మనమిస్తున్న రూ.1.02 కోట్లు, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ? గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ దొరికేది కాదు. శాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. నేడు అర్హులందరికీ.. ఈరోజు పథకంలో పూర్తి మార్పులు తీసుకొచ్చి శాచ్యురేషన్ విధానంలో అమలు చేస్తున్నాం. అర్హత కలిగి ఉండి టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింప చేస్తున్నాం. గతంలో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.8 లక్షల వరకూ పెంచాం. అర్హత ఉంటే చాలు.. రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఏకైక రాష్ట్రం ఏపీ ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో భావితరాలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గుర్తుంచుకునేలా ఇంత సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదిగి పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలుగు విడతలుగా స్కాలర్షిప్.. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్ షీటు అప్లోడ్ చేయగానే చివరి విడతను విద్యార్థులకు అందించేలా పథకాన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి మన పిల్లలకు అంతా మంచి జరగాలి. తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదు. అప్పుల పాలవుతామనే భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపారనే బాధ ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించాం. పిల్లలు అక్కడకు (విదేశాలకు) వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంకటమురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. గత చంద్రబాబు ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు చేసిన ఆర్థిక సాయం అరకొరే. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.15 లక్షలు, ఇతరులకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ. 6 లక్షలుగా నిర్ణయించడంతో కొద్ది మందికే ప్రయోజనం కలిగింది. లబ్ధిదారుల ఎంపికలోనూ అవినీతి, సిఫార్సులకే పెద్దపీట వేశారు. ఈ కాస్త ఫీజునూ చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఎగనామం పెట్టింది. 2016 – 17 సంవత్సరం నుండి 3,326 విద్యార్థులకు రూ.318 కోట్ల ఫీజులు ఎగ్గొట్టి, ఆ తర్వాత పథకాన్నే ఎత్తివేసింది. ప్రమాణాలు లేని, పేలవమైన ర్యాంకులున్న సంస్థలను ఎంపిక చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. సీఎం వైఎస్ జగన్ సంతృప్త స్థాయిలో అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు అందేలా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేసిన 21 కోర్సుల్లో టాప్ 50 యూనివర్శిటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా, 4వ సెమిస్టర్ విజయవంతంగా పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశాక చివరి వాయిదా చెల్లిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలను https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. పథకానికి సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం ‘జగనన్నకు చెబుదాం (1902 టోల్ ఫ్రీ నంబర్)’లోనూ సంప్రదించవచ్చు. ఇదీ పథకం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు. -
పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు
-
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులను కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జన వరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బుధవారం సీఎం లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న మేలును ఒకసారి పరిశీలిస్తే.. ‘జగనన్న విద్యా దీవెన’.. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. అలాగే.. ► ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ► గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టింది. ఇలా 2017 నుంచి పెట్టిన బాకీలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు. ► ఇలా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇలా.. ► నిజానికి.. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన)తో పాటు భోజన, వసతి సౌకర్యాల (వసతి దీవెన) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ► ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల హానర్స్ కోర్సులు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టారు. ► ఇందులో భాగంగా విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలను ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ► 40 రకాల నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా సేల్స్‌ఫోర్స్‌లో 33,000, ఏడబ్ల్యూఎస్‌లో 23,000, నాస్కామ్‌లో 20,000, పాలో ఆల్టోలో 10,000, ఆల్టెరిక్స్ డేటా అనలిటిక్స్‌లో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందించారు. ఇలా దేశంలో ఒకే ఏడాది రెండు లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు.. ► ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 కాగా.. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గింది. అంతేకాక.. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27శాతం అయితే, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే. ► 2018–19లో 32.4గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి 2020–21 నాటికి 94కు పెరిగింది. ► అలాగే, 2018–19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 2021–22 నాటికి 85,000కు పెరిగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే 80వేల మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఆగస్టు ముగిసేనాటికి ఇది మరింతగా పెరిగే అవకాశముంది. డిజిటల్ విద్య దిశగా అడుగులు.. ► మరోవైపు.. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు.. నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038.. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. అసలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఈ తరహా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. -
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ..
హుజూర్నగర్/మంచిర్యాల అర్బన్/సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్ సురేంద్ర కుమార్ పెయింటర్ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. కూలీ బిడ్డ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్‌తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో మల్టీ పర్పస్‌హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్ ఫలితాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. అత్యధికం 994! ఇంటర్లో 994 మార్కులు టాప్‌ర్యాంక్‌గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్‌కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్‌కు చెందిన పి.రాజేశ్ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్ బోర్డ్ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. ► నిజామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. ► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్ వర్ష (బైపీసీ), సీహెచ్ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు. ► ఖమ్మంలోని ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది. ► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి. ► నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్ 462/470 మార్కులు సాధించింది. చదవండి: అమ్మాయిలదే హవా -
హాస్టల్ విద్యార్థులకు శుభవార్త
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తాజాగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంపుదల చేస్తూ జీఓలను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి. ఇందుకోసం అదనంగా డైట్ చార్జీలకు రూ.132 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితర సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం 2012లో మెస్ చార్జీలను పెంచింది. గత ఎన్నికలకు ముందు (2018) టీడీపీ ప్రభుత్వం హడావుడిగా నామమాత్రంగా డైట్ చార్జీలను పెంచినా అవి అమల్లోకి రాలేదు. నాటి నుంచి ఇప్పటివరకూ హాస్టల్ విద్యార్థులకు పాత చార్జీలనే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 67 హాస్టళ్లు.. 2,500 మంది విద్యార్థులు జిల్లాలో 38 ఎస్సీ, 29 బీసీ హాస్టళ్లలో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో 1,251 మంది, బీసీ హాస్టళ్లలో 1,321 మంది ఉన్నారు. వీరందరికీ చార్జీల పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే హాస్టళ్లలో చేరేందుకు పేద విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారని అధికారులు అంటున్నారు. పేదల చదువులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది హాస్టళ్లలో విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా రానున్న విద్యాసంవత్సరం నుంచి వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పెంచిన చార్జీలు వచ్చే జూన్ నుంచి అమలులోకి రానున్నాయి. –జీవీఆర్‌కేఎస్‌ఎస్ గణపతిరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి, భీమవరం -
పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్‌ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్‌కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది. నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్‌ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్‌లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్‌లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది. రివర్స్ టెండరింగ్‌తో రూ.187 కోట్లు ఆదా ఇక ట్యాబ్‌లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్‌లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది. ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్లైన్లో ఇదే పరికరాన్ని బల్క్‌గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్‌ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్లైన్ పోర్టళ్లు కూడా బల్క్‌లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్‌కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్‌లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్‌లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు.. ఆరోపణ–2: ట్యాబ్ డిస్ప్లే సైజు శ్యామ్‌సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్‌లో, టచ్‌స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్‌సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్‌కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్‌లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. -
పేద విద్యార్థులకు డిజిటల్ విద్య
-
మదనపల్లె: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
గురుభ్యోనమః.. నిరుపేద విద్యార్థుల కోసం షూ పాలీష్ చేస్తున్న ప్రొఫెసర్
తిరువళ్లూరు (చెన్నై): పేద, నిరాశ్రయ విద్యార్థుల చదువు కోసం నిధుల సేకరణలో భాగంగా తమిళ ప్రొఫెసర్ సెల్వకుమార్ పళవేర్కాడులో చెప్పులు, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్ సెల్వకుమార్. అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కళాశాలలో తమిళ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. 2004లో మదర్ థెరిసా పాఠశాలను ఏర్పాటు చేసి 19 ఏళ్లుగా పేద, అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహణ కష్టంగా మారడంతో వినూత్న రీతిలో నిధులను సేకరిస్తున్నాడు. కళాశాలకు సెలవు ఉన్న సమయంలో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెప్పులను తుడుస్తా. మీరు నావద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవాలని కోరుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఇతడి ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. కోటైకుప్పం పంచాయతీ అధ్యక్షుడు సంపత్, మీంజూరు ధామోదరన్, పళవేర్కాడు సంజయ్‌గాంధీ సాయం అందించారు. -
Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్ కంటెంట్‌ను కొనాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అలాంటిది సీఎం జగన్ చొరవ వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్ అందించేందుకు బైజూస్ సీఈవో రవీంద్రన్ ముందుకు వచ్చారన్నారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్‌కు మంచి పేరుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్’ అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. -
కార్పొరేట్ స్కూళ్లలోనూ 'కోటా'
సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది. ఆర్టీఈపై న్యాయ వివాదాలు.. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు. సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఫీజులపై నిర్ణయానికి కమిటీ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది. స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు. ఏటా లక్ష మందికి అవకాశం ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి. -
Scholarships: విద్యార్థులకు అలర్ట్.. ఇది మీ కోసమే..
సాక్షి, అమరావతి: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ ఎస్డీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www. vidyadhan.org అనే వెబ్సైట్ లేదా 8367751309 నంబర్లో సంప్రదించవచ్చు. -
పేద విద్యార్థులపై ట్రోల్స్ చేస్తే తాట తీస్తాం
గుడివాడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ గుక్క తిప్పుకోకుండా ఇంగ్లిష్ మాట్లాడుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెడుతున్న వారి తాటతీస్తామని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటూ విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌ని సైతం అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అందరికీ ఆదర్శంగా నిలవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను స్వయంగా సీఎం కార్యాలయానికి రప్పించి అభినందించారని వివరించారు. అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చక్కగా చదువుకోవాలని సీఎం పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అటువంటి విద్యార్థులపై కొంతమంది ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల ఆధారంగా విమర్శిస్తూ పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేద విద్యార్థులు అంటే అంత అలుసా అని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ట్రోల్స్ పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి, పేదవాళ్ల మీద జోకులు వేస్తూ అవహేళనగా ప్రవర్తిస్తే అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
నాడు–నేడుతో విద్యావ్యవస్థలో మహాయజ్ఞం
మంగళగిరి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో నాడు–నేడుతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి– తెనాలి రోడ్డులోని ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫాండేషన్‌కు దాతలు అందజేసిన మధ్యాహ్న భోజన రవాణా వాహనాలను గురువారం ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. వంటశాలను భోజనం తయారీ నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడంలో అక్షయపాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్‌ప్రెసిడెంట్ వంశీధరదాసు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అక్షయపాత్రకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. దాతలు ఫ్రీడమ్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ సహకారంతో వాహనాలను అందించారు. అక్షయపాత్ర కో–ఆర్డినేటర్ విలాస విగ్రహదాస, ఐటీ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, అగవతరప్పాడు సర్పంచ్ మురళీకృష్ణారెడ్డి అక్షయపాత్ర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం: సీఎం జగన్
-
విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం సాకారమవుతుందన్నారు. ►జగనన్న విద్యా దీవెన.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే పథకం. ►ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ►జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 9,274 కోట్లు. ►టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
సర్కారు బడుల్లో.. సీబీఎస్ఈ పాఠాలు
కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాడు– నేడు పనులతో ఇప్పటికే ఊరి బడిని ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. తాజాగా రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ బోధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్ జిల్లాలో సౌకర్యాలు ఉన్న 35 పాఠశాలల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే బోధన ప్రారంభించనున్నారు. అందుబాటులోకి ఖరీదైన విద్య ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్ఈ సిలబస్‌తో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడం సులభం అవుతుంది. 35 పాఠశాలల్లో అమలు సీపీఎస్ఈ విధానం ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్‌కు మారనున్నాయి. ఇందులో కడప డివిజన్లో 17, ప్రొద్దుటూరు డివిజన్లో 8, రాయచోటి డివిజన్లో 10 హైస్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్నారు. ఇందులో ఆరో తరగతిలో చేరితే ఇంటర్ విద్య వరకు ఇక్కడే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అత్యాధునిక పద్ధతిలో బోధన సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ బోధన కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత. మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నతస్థాయి విద్య అందే అవకాశం ఉంటుంది. – మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లి హైస్కూల్ పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ సిలబస్‌తో బోధన పేద విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మారుమూల పల్లెకు కూడా చేరనుంది. – నారాయణ, ఎంఈవో, కడప ఉన్నతాధికారులకు నివేదిక పంపాం సీబీఎస్ఈ సిలబస్ బోధనకు అనుగుణంగా ఉన్న 35 స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తాం. – శైలజ, డీఈవో, కడప -
ఈ సారు ఎంత మంచోడో.. కూడబెట్టిన 40 లక్షలు ఇచ్చేశాడు
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే. విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన. భార్యతో విజయ్ కుమార్ సార్ ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు. అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. చదవండి: కారడవిలో అడవి బిడ్డల భవిష్యత్తు కోసం 14కి.మీ. నడక! -
ఆర్థికమే కాదు... సామాజికం కూడా!
ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్లే విద్యా రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మన దేశంలో గత కొంతకాలంగా విద్య అనేది అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడ విద్యారంగానికి అతిపెద్ద మార్కెట్ కలిగి ఉందని గుర్తించిన విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడి విద్యార్థులను దోచుకోవడానికి తమ దుకాణాలను తెరవడం మొదలు పెట్టాయి. ఒకపక్క అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో విద్య అనేది వాణిజ్య వస్తువు కాదనీ, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం నేరమనీ తీర్పులు ఇచ్చినా కూడా విద్యా వ్యాపారవేత్తల తీరు మారకపోవడం శోచనీయం. 1995లో ఐక్యరాజ్యసమితి పేద వర్గాల అభ్యున్నతికి కేవలం విద్య మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి అవసరమైన నూతన విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంబానీ బిర్లా కమిటీగా పేర్కొన్న ఈ కమిటీ నివేదిక ప్రకారం, సమాచార సాంకేతిక యుగంలో విద్య అత్యంత అవసరం అనీ, అదే సమయంలో మన దేశం లోని విద్యా వ్యవస్థ అత్యంత వక్రంగా ఏర్పాటు చేయ బడిందనీ వ్యాఖ్యానించింది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను స్వాగతిస్తూ సరికొత్త విధానాలను రూపకల్పన చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే, విద్యారంగాన్ని ప్రైవేటీకరించి ఆ రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను, విదేశీ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ వర్సిటీలకు నిధులను తగ్గిస్తుండటంతో... పేదవాళ్లు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని గ్రహించలేకపోతున్నారు. విద్య అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఈ కమిటీ విస్మరించింది. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ మార్గాల ద్వారా విద్యార్థి వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి ధోరణి వల్ల విద్యా వ్యవస్థలో నాణ్యత అనేది దిగజారి పోతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులకు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు రూపకల్పన చేస్తున్నాయి. ఈ వ్యాపార ధోరణిలో కేవలం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు మాత్రమే బతికి ఉంటాయి. కంప్యూటర్ రంగానికి చెందిన కృత్రిమ మేథస్సు వంటి కొత్త శాఖలు ఆవిర్భ వించడంతో వాటి వైపు విద్యార్థులు పరుగులు తీస్తూ, సాంప్రదాయ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కోర్సులు అన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడినవి. పేద వర్గాలకు ఇవి అందనంత దూరంలో ఉన్నాయి. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ఈ నేపథ్యంలో పేదవాడికి కూడా ఇటువంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులోకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ విధానాన్ని కల్పించి, ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అత్యున్నతమైన ఆధునిక విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పరిచింది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేక మధ్యలోనే తమ చదువులు ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా పేద విద్యార్థులు తమకొచ్చిన ఉపాధి ఉద్యోగ అవకా శాలను వదులుకోవాల్సి వచ్చింది. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నిర్దిష్ట కాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయటం వల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఫీజు రుసుమును తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల తామే స్వయంగా కళాశాలల ఫీజు చెల్లించినట్లయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫీజు రియింబర్స్‌మెంట్ విధానాన్ని ఆర్థిక పరమైన అంశంగానే ప్రభుత్వాలు ఆలోచించాయి. కానీ నేడు పేదలకు ఉద్దేశించిన ప్రతి పథకాన్ని సామాజికపరమైన అంశంగా కూడా చూస్తుండటం వల్ల బలహీన వర్గాల్లో ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మగౌరవం నెలకొన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) - ప్రొఫెసర్ ఈదర శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్, డాక్టర్ వైఎస్సార్ ఏఎన్నార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -
కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి. ఇంకొన్ని అయితే ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్ మనీ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. ఐఐటీలు.. వాటి ఆఫర్లు ఐఐటీ బాంబే: బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే మెరిట్–కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్ అలవెన్స్ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది. ఐఐటీ గాంధీనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ కామన్ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది. బీటెక్ నాలుగేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్షిప్ ఉంటుందని వివరించింది. ఐఐటీ భిలాయ్: అన్రిజర్వ్డ్ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్షిప్ను ఐఐటీ భిలాయ్ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్ మనీని అందించనున్నట్లు పేర్కొంది. ఐఐటీ మద్రాస్: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందితే పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్ –కమ్ –మీన్స్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్షిప్ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఐఐటీ కాన్పూర్ మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ ‘బ్రైట్ మైండ్ స్కాలర్షిప్’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంక్‌లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్షిప్ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్ ఫీజులను ఈ స్కాలర్షిప్ కవర్ చేస్తుంది. -
పేద బిడ్డలకు పట్టం
తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు లను వారం పది రోజుల్లోగా కళాశా లకు వెళ్లి చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీ లకు చెల్లించకపోతే తదుపరి విడ తలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతా లకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కేవలం అక్షరాస్యత మాత్రమే కాకుండా పేద పిల్లలను వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ ఆశయంతోనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు కూడా రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలను కూడా గతంలో చూశామని గుర్తు చేశారు. ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని తన పాదయాత్ర సమయంలో చూశానని, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలని, చదువుకునేందుకు పేదరికం అడ్డు కాకుండా అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలరాతను మార్చే పెద్ద చదువులు పేదరికం తొలగిపోయి తలరాతలు మారాలంటే ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి పెద్ద చదువులు చదివిన వారి సంఖ్య బాగా పెరగాలి. గత సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,259 కోట్లు ఫీజుల కింద చెల్లించాం. దీనివల్ల దాదాపు 21,48,477 మంది విద్యార్ధులకు మేలు జరిగింది. ఇంజనీరింగ్, మెడిసిన్‌కూ రీయింబర్స్మెంట్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇలా కోర్సులేవైనా పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. పీజీ కోర్సులకు కూడా ప్రభుత్వ కాలేజీలలో చదివే వారికి అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రతి మూడు నెలలకొకసారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారే కాలేజీలకు వెళ్లి స్వయంగా వసతులను పరిశీలించి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను అప్పగించాం. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బాగా చదువుతున్నారా? లేదా? అనే విషయాలను అవగతం చేసుకోవడంతోపాటు ల్యాబ్స్, ఇతర సదుపాయాలను తల్లులే స్వయంగా పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లుల పర్యవేక్షణతో ఈ రెండూ జరుగుతాయి. కాలేజీల్లో సమస్యలుంటే యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా 1902 నంబర్‌కు ఫోన్ చేసి తెలియచేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ప్రైవేట్‌లోనూ కోటా గతంలో మెరిట్ ఉన్నా ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రైవేట్ యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌లో 50 శాతం సీట్లు, ఇంజనీరింగ్, డిగ్రీ లాంటి ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కచ్చితంగా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో సవరణలు చేశాం. ఫలితంగా పేద విద్యార్థులకు అవకాశం లభిస్తోంది. ఈ ఏడాది దాదాపు 2,118 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో మంచి ఫలితాలు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల సర్వే నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరుతున్న 17 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2020కి 35.2 శాతానికి పెరిగింది. 2018–19తో పోలిస్తే 2019–20లో జాతీయ స్థాయిలో జీఈఆర్ రేషియో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో జీఈఆర్‌కు సంబంధించి ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28 శాతం పెరుగుదల ఉండగా మన రాష్ట్రంలో మరింత మెరుగైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతం పెరుగుదల నమోదైంది. జాతీయ స్థాయి సగటు కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఉంది. రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లు పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటే సరిపోదని వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్ ఖర్చులు రూ.20 వేలు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. వారు అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే వసతి దీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెనకు ఇప్పటివరకు రూ.2,267 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పిల్లలకు మేనమామలా.. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం. 16 కొత్త మెడికల్ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శరవేగంగా శ్రీకారం చుట్టాం. రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. ట్రైబల్ వర్సిటీకి త్వరలో శంకుస్థాపన విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉంటుంది. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నాయి. త్వరలోనే పనులు మొదలవుతాయి. డిగ్రీ కాలేజీల్లో నాడు – నేడు 2019 నుంచి రాష్ట్రంలో కొత్తగా పది డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశాం. 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నాం. రెండేళ్లలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు.. డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బైలింగువల్ (ద్వి భాషా) టెక్టŠస్‌బుక్స్ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అందుబాటులోకి తెస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతీ డిగ్రీ విద్యార్ధికి అప్రెంటిషిప్, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం జిల్లాల్లోని పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మైక్రోసాఫ్ట్‌తో 40 కోర్సుల్లో ఉచిత శిక్షణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రాజెక్టు కింద 1.62 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్ రెడీ స్కిల్ సొల్యూషన్స్ అంటే 40 రకాల కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందచేసి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాం. 40 స్కిల్ కోర్సుల్లో డేటా ఎనలైటిక్స్, కృతిమ మేథస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ లాంటి 8,600 అంశాలను పొందుపరిచారు. పెద్ద కంపెనీలు, నాస్కామ్ లాంటి సంస్ధలను స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతో అనుసంధానం చేస్తున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జే. శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వారం పది రోజుల్లోగా కళాశాలకు వెళ్లి ఫీజుల కింద చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం జగన్ -
ప్రైవేట్ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్న ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లకు సంబంధించి ప్రభుత్వం కోర్సుల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం జీఓ 57ను విడుదల చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (అమరావతి), వీఐటీ ఏపీ (అమరావతి), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (విజయనగరం), భారతీయ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ–బెస్ట్ (అనంతపురం)లోని బీటెక్, బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీ, సెంచూరియన్ వర్సిటీల్లో బీటెక్ కోర్సులకు, బెస్ట్ వర్సిటీలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీలో బీటెక్ కోర్సు ఫీజును రూ.70 వేలు, సెంచూరియన్‌లో రూ.50 వేలు, బెస్ట్ వర్సిటీలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లకు రూ.70 వేలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2021–22 నుంచి 2023–24 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఫీజులకు అదనంగా డబ్బు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజులు ఈ ఫీజులో కలసి ఉండవని పేర్కొంది. కాగా ఈ వర్సిటీల్లో మొత్తంగా 2,330 బీటెక్ సీట్లు, బెస్ట్ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పేద విద్యార్థుల కల సాకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను మాత్రమే ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఆయా వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోకి తీసుకు వచ్చింది. తద్వారా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదవాలనే మెరిట్ ఉన్న పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 2,330 బీటెక్ సీట్లు, 105 ఏజీ బీఎస్సీ సీట్లు కన్వీనర్ కోటా ద్వారా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. -
పేద మెరిట్ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీసింది. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో 35 శాతం సీట్లు నిరుపేద మెరిట్ విద్యార్థులకే కేటాయించనుంది. ఈ సీట్లను ప్రభుత్వ కోటా (కన్వీనర్ కోటా) కింద రాయితీ ఫీజులతో పేదలకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2017కు సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు ఆయా సంస్థల విధివిధానాల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతోపాటు ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు దక్కనున్నాయి. ‘ప్రైవేటు’కు మాత్రమే మేలు కలిగేలా టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా కాకుండా ఆ వర్సిటీలకు లాభం చేకూరేలా మాత్రమే చట్టంలో నిబంధనలు పెట్టింది. ఆ వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ కల్పించింది. ప్రైవేటు వర్సిటీలకు ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ కూడా రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్ని వ్యవహారాల్లోనూ ఆ వర్సిటీల ఇష్టానుసారానికే వదిలిపెట్టింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించినవారికి మాత్రమే కేటాయిస్తున్నాయి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీల్లోని 35 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీట్లను ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు. ఫీజులపైనా నియంత్రణ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నోటిఫికేషన్ మేరకు ప్రైవేటు వర్సిటీలు ఫీజుల నిర్ణయానికి అకౌంటు పుస్తకాలు, ఇతర పత్రాలను అథారిటీ సమర్పించాలి. ఈ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్సుల వారీగా ఆ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులను సమీక్షించి.. అంతిమంగా వాటి వాదనలను కూడా విని ఫీజులను నిర్ణయిస్తుంది. దీని సిఫార్సుల మేరకు ఆ ఫీజులను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థలపై రూ.15 లక్షలకు మించకుండా పెనాల్టీని విధించే అధికారం అథారిటీకి ఉంటుంది. వర్సిటీలు తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో వివిధ కోర్సుల నిర్వహణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయ స్థాయిలో టాప్ 100 యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీలకు వీలుగా టైఅప్ కలిగి ఉండాలని ప్రైవేటు వర్సిటీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. -
Sister Lissy Chakkalakkal: ఈ స్కూల్లో పిల్లలకు ఇళ్లులేకపోతే టీచర్లే ఇళ్లు కట్టిస్తారంట!!
కొందరు టీచర్లు స్టూడెంట్స్ పట్ల దయతో బుక్స్ కొనిస్తారు. బూట్లు కొనిస్తారు. ఫీజులు కడతారు. బట్టలు కుట్టిస్తారు. కాని కేరళలో ఈ టీచర్ కథ వేరు. ఆమె ఏకంగా ఇల్లే కట్టించి ఇస్తుంది. ఇది నిజం. గత 7 సంవత్సరాలలో 150 ఇళ్లు స్టూడెంట్స్‌కు కట్టి ఇచ్చింది. టీచర్ల విశాలమైన మనసుకు గిన్నెస్ రికార్డు ఉంటే అది ఈమెకే దక్కుతుంది. ఒక టీచర్‌గా పని చేస్తే ఆ టీచర్‌కు ఒక సైన్యం తయారవుతుందని ‘సిస్టర్ లిజీ చక్కలకల్’ను చూస్తే అర్థమవుతుంది. కొచ్చిలో ‘అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్’ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈ 53 ఏళ్ల నన్ తన విద్యార్థినులపై కురిపిస్తున్న దయ అసామాన్యమైనది. 2012 నుంచి నేటి వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె తన విద్యార్థినుల కోసం మొత్తం 150 ఇళ్లు కట్టించింది. ప్రభుత్వమో, వ్యవస్థో, సంస్థో చేయాల్సిన పని కేవలం ఒక టీచర్‌గా ఆమె సాధించింది. ఎలా? ఎందుకు? ఇంటికి వెళ్లి చూడాలి త్రిశూర్‌లో ఎనిమిది మంది సంతానంలో ఒకదానిగా జన్మించిన లిజీ మిగిలిన తోబుట్టువులందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవగా తాను మాత్రం దైవ మార్గంలో మానవ సేవ చేయడానికి అంకితమైంది. కేరళలోని ‘ఫ్రాన్సిస్కన్ మిషనరీస్’లో సభ్యురాలయ్యి తమ మిషనరీ నడిపే స్కూలు ఉపాధ్యాయనిగా పని చేయడం మొదలెట్టింది. కాని టీచర్ పని కేవలం పాఠాలు చెప్పడం కాదు. విదార్థికి సంబంధించిన బాగోగులు కూడా గమనించడం. అందుకే లిజీ స్కూల్ అయ్యాక ‘విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించే’ కార్యక్రమాన్ని స్వీకరించింది. కాని ఆ పరిశీలనలు ఆమెను విపరీతంగా డిస్టర్బ్ చేశాయి. ‘చాలామంది విద్యార్థినులకు అసలు ఇళ్లే లేవు. చాలామంది ఒక్క గది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వయసొచ్చిన అమ్మాయిలకు చాటు లేదు. భద్రత లేదు. వీరికోసం ఏదైనా చేయాలి అనిపించింది’ అంటుంది లిజీ. 2012లో ఒక విద్యార్థిని ఇంటికెళితే ఆ విద్యార్థిని కుటుంబం ఒక పాలిథిన్ షీట్ కప్పుతో ఉన్న గుడిసెలో జీవిస్తున్నట్టు ఆమె గమనించింది. తాగుడు వల్ల తండ్రి చనిపోగా తల్లి పిల్లలను సాకుతోంది. ఆ స్థలం వారిదే అని తెలుసుకుని అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆమె సంకల్పం తీసుకుంది. 2014 నుంచి హౌస్ ఛాలెంజ్ అందరూ మొక్కలు నాటే ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి చేస్తుంటే లిజీ ‘హౌస్ ఛాలెంజ్’ తీసుకుంది. అవును. ఇల్లు లేని తన విద్యార్థినులకు ఇల్లు కట్టించే ఛాలెంజ్ అది. కాని అందుకు డబ్బు? ఇక్కడే ఆమెకు తన ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఒక సైన్యంగా పనికొచ్చారు. ‘మా స్కూల్లో చదువుకునే విద్యార్థినులు వారానికి ఒకసారి ఒక రూపాయి డొనేట్ చేయాలి. అలాగే పుట్టినరోజులు జరుపుకోకుండా అందుకు అయ్యే ఖర్చును డొనేట్ చేయాలి. ఆ డబ్బును ఇల్లు కట్టేందుకు ఉపయోగిస్తాను. అంతే కాదు... మా పూర్వ విద్యార్థులను సహాయం అడుగుతాను. ఊళ్లోని దాతలను సంప్రదిస్తాను. నా ఉద్దేశంలోని నిజాయితీని అర్థం చేసుకుని అందరూ సాయం చేస్తారు. అంతెందుకు.. నేను ఇల్లు కట్టివ్వమంటే మేస్త్రీలు కూడా తక్కువ కూలి తీసుకుని పని చేస్తారు. అలా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ వస్తున్నాను’ అంటుంది లిజీ. అయితే ఆ ఇళ్లు హల్కాడల్కా ఇళ్లు కాదు. కచ్చితమైన మంచి రూపం, నాణ్యత ఉంటాయి. ఒక సెంట్ లేదా రెండు సెంట్ల స్థలంలో 500 చ.అడుగుల నుంచి 600, 700 చదరపు అడుగుల ఇళ్లను ఆమె కట్టి ఇస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఒక్కో ఇంటికి వెచ్చిస్తుంది. ఎలా ఎంపిక? సరే. ఒక స్కూల్లో ఎంతో మంది విద్యార్థినులకు సొంత ఇల్లు ఉండదు. మరి సిస్టర్ లిజీ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది అనంటే దానికి ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. ‘నేను కట్టిచ్చే ఇళ్లు చాలామటుకు వితంతు స్త్రీలకు అయి ఉంటాయి. లేదా భర్త మంచం పట్టి పిల్లలు దివ్యాంగులు అయితే వారికి ప్రాధాన్యం ఇస్తాను. దారుణమైన పేదరికంలో ఉంటే వారికి కట్టి ఇస్తాను. వారి పరిస్థితులు చూడగానే మనకు తెలిసిపోతుంది ఇళ్లు కట్టించి ఇవ్వాలా వద్దా అని’ అంటుందామె. లిజీ కట్టించి ఇచ్చే ఇళ్లలో హాల్, కిచెన్, షాపు పెట్టుకుని బతకాలంటే ఆ ఇంటిలోనే వీధిలోకి ఒక గది ఇలా ప్లాన్ చేసి కట్టి ఇస్తుంది. ‘ఈ దేశంలో ఇల్లు లేని వారే ఉండకూడదు అని నా కోరిక’ అంటుంది సిస్టర్ లిజీ. స్థలాలు కూడా ఇస్తున్నారు సిస్టర్ లిజీ ఇంత వరకూ స్థలాలు ఉండి అక్కడ ఇళ్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది. ఇప్పుడు ఆమె ప్రయత్నం చూసి స్థలదాతలు కూడా ముందుకు వస్తున్నారు. ‘మేము భూమి ఇస్తాం. మీరు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వండి’ అని ఇస్తున్నారు. తాజాగా రంజన్ వర్గీస్ అనే దాత 70 సెంట్ల స్థలం దానం చేస్తే సిస్టర్ లిజీ ఆ స్థలంలో 12 ఇళ్లు కట్టించి తన పేద విద్యార్థినులకు ఇచ్చింది. సొంత ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనకు అతీతం. ఆ విద్యార్థినులు సిస్టర్ లిజీని సాక్షాత్తు దైవదూతలా చూస్తారు. ఇంతకాలం గురుదక్షిణ గురించి విన్నాం. కాని సిస్టర్ లిజీ సేవ చూస్తే గురుదక్షిణ అనేది చిన్నమాట అనిపిస్తుంది. ఇలాంటి గురువులకు ఎటువంటి దక్షిణ ఇవ్వలేం. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించి చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు ఇలా లేని వారికి గూడు ఏర్పాటు చేయడమే అసలైన గురుదక్షిణగా భావిస్తే లిజీ ఆశించినట్టు ఇళ్లు లేనివారే ఉండని రోజు తప్పక వస్తుంది. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
నాణ్యమైన విద్యను అందించడమే సీఎం లక్ష్యం
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చదువుకు పేదరికం అడ్డు పడకుండా ఆయన అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు సమాజంలో అత్యంత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. మంచి వ్యక్తిత్వం, అలవాట్లు, బాధ్యతాయుత జీవనవిధానం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయగలిగితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ ‘సమాజంలో గురువుల పాత్ర–ప్రభుత్వ నూతన విద్యా విధానం’ అనే అంశంపై వెబినార్ నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ఉన్నత విద్య వరకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. రూ.16 వేల కోట్ల వ్యయంతో ‘నాడు–నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చుతున్నారన్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా అందులో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. గత పాలకులు విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. దీంతో విద్య, వైద్యాన్ని కొనలేక అనేక కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. దీన్ని మార్చాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, స్పృహ కల్పించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలన్నదే నూతన విద్యావిధానం లక్ష్యమన్నారు. గ్రామీణ, పేద విద్యార్థులకు మేలు చేయడానికే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ రామలింగేశ్వరస్వామి మాట్లాడుతూ గురుశిష్యుల బంధం చాలా గొప్పదన్నారు. -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్ లైబ్రరీ’
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ తరగతులకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లేని పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్ లైబ్రరీ’అందుబాటులోకి రానుంది. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దూంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ‘యూ అండ్ మీ’, స్ఫూర్తి సంస్థల ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో స్మార్ట్ఫోన్లు కొనే ఆర్థిక పరిస్థితులు లేని విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయం తీసుకోనున్నారు. తెలిసిన వారు, స్నేహితుల నుంచి పనిచేసే స్థితిలో ఉన్న మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్లను సేకరించి గ్రామాల్లోని పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సంస్థలు నిర్ణయించాయి. ఈ విధంగా సేకరించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను గ్రామాల్లోని స్కూళ్లు లేదా పంచాయతీ కార్యాలయాల్లో ప్రిన్సిపాల్ లేదా సర్పంచ్ల పర్యవేక్షణలో ఉంచనున్నాయి. డిజిటల్ పాఠాల హడావుడి ముగిశాక ఈ ఫోన్లు, ఇతర పరికరాలను మళ్లీ సొంతదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇవ్వగలిగిన వారు ముందుకు రావాలి... స్మార్ట్‌ఫోన్ లైబ్రరీ కార్యక్రమాన్ని బీవీ రావు, ఇతర మిత్రులతో కలసి చేపడుతున్నాం. ఈ విధంగా సేకరించిన పది సెల్ఫోన్లను మొదటగా బుధవారం నుంచి మగ్దూంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెస్తున్నాం. ఆ గ్రామంలో సెల్ఫోన్లు లేదా ఇతర సౌకర్యాలు లేని విద్యార్థులు 15 మంది ఉన్నట్టుగా గుర్తించాం. ఈ సౌకర్యాన్ని ఆ విద్యార్థులు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఇదేవిధంగా మిగతావారు కూడా పనిచేసే పాత ఫోన్లను తాము చదువుకున్న లేదా తమ గ్రామంలోని పాఠశాల, పంచాయతీ కార్యాలయంలో అందజేస్తే పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. తమ వస్తువులను అందించే విషయంలో ఇబ్బందులు ఎదురైన వారు ‘యూ అండ్ మీ’వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే సాయం చేసే ఏర్పాట్లు చేశాం. వారు ఏ గ్రామంలో, ఏ స్కూల్లో, ఎక్కడ వాటిని అందజేయమంటే అక్కడికి చేర్చే బాధ్యతను జిల్లాల్లోని సమన్వయకర్తలు తీసుకుంటారు. – సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ -
ఇంగ్లిష్ మీడియం..పేదబిడ్డల బాగు కోసమే
పేదలు తమ పిల్లల బతుకులు మారాలని ఆరాటపడుతున్నా.. మన ఖర్మ కొద్దీ ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. బయట ఒకటి మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నారు. అయితే బిల్లును జాప్యం చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. ఆ బిల్లును మళ్లీ పెట్టి పాస్ చేయించాం – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ఉన్నత విద్యతోనే నిరుపేదల బతుకులు మారతాయని, ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న పెద్ద మనుషులు వారి పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం కోసం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. 94 శాతం పేరెంట్స్ కమిటీలు కూడా ఇంగ్లిష్ మీడియాన్నే కోరుకున్నాయన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివే వారు శాతం కేవలం 25.8 శాతమేనని, పేదరికంతో ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారని సీఎం పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’లో విద్యారంగంపై బుధవారం మేధోమథన సదస్సులో ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ... పేరెంట్స్ కమిటీలు కావాలన్నాయి పేద విద్యార్థులు, వారి కుటుంబాల మేలు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించాం. ఈ క్రమంలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాధ్యమంపై అభిప్రాయాలను కోరాం. దాదాపు 94 శాతం పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉంటేనే తమ పిల్లలు ఆంగ్లం నేర్చుకుని బాగా చదువుకుంటారని, భావి ప్రపంచంతో పోటీ పడగలుగుతారని తేల్చి చెప్పాయి. కొత్త థియరీలు... ► కొంతమంది ప్రతి అడుగులోనూ అడ్డుకుంటూ చివరకు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంగ్లీషు మీడియం తెస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అంటూ కొత్త థియరీలు తెస్తున్నారు. అంతగా తెలుగును గౌరవించాలనే ఈ పెద్దమనుషులు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? అంతా ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. కానీ పేదబిడ్డలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పేదల జీవితంలో మార్పు తెచ్చేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ► సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో పేద విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్లో చదువు కొనసాగించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఉచితంగా అందివ్వాలంటూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. లాక్డౌన్ సమయంలో పిల్లలకు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలంటూ ఢిల్లీలోని 10 ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లు తీసుకున్న నిర్ణయ ప్రభావం సుమారు 50వేల మంది నిరుపేద విద్యార్థులపై పడిందనీ, వీరికి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సమకూర్చుకునే స్తోమత లేదని ‘జస్టిస్ ఫర్ ఆల్’అనే ఎన్జీవో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం జూన్ 10వ తేదీలోగా స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. -
ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
3 నెలలకోసారి ఫీజు రీయింబర్స్మెంట్
ప్రతి విద్యార్థి పూర్తి పరిజ్ఞానం, నైపుణ్యాలతో బయటకు వచ్చేలా ఆయా విద్యా సంస్థలు నడవాలి. అందుకే ఉన్నత విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం. విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని, ఈ దిశగా ప్రతి మూడు నెలలు (తైమాసికం) పూర్తి కాగానే ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇలా ఎప్పుటికప్పుడు చెల్లింపుల వల్ల కాలేజీలకు కూడా మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్.. కాలేజీ ఫీజుల ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘మంచి చదువులు పిల్లలకు భారం కాకూడదు. ప్రభుత్వానికి కూడా భారం కాకూడదు. అదే సమయంలో మనం రూపొందించుకొనే విధానాలు దీర్ఘకాలం అమలు కావాలి. కాలేజీలు తమ కార్యకలాపాలను ప్రశాంతంగా, సాఫీగా ముందుకు తీసుకువెళ్లాలి. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలి. అందుకోసం విద్యార్థుల చదువులకయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించిన మొత్తాలను కూడా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్చి 30 నాటికి ఈ చెల్లింపులు చేసేలా అడుగులు వేస్తున్నాం’ అని అన్నారు. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు ఉన్నత చదువులే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మంచి చదువు అందాలని.. అప్పుడే వారు పరిపూర్ణ పరిజ్ఞానం, నైపుణ్యాలతో పోటీ ప్రపంచంలో నెగ్గుకొని రాగలుగుతారని సీఎం అన్నారు. ఉన్నత చదువులతోనే వారి భవిష్యత్ బంగారు మయం అవుతుందని చెప్పారు. ఇలాంటి మంచి చదువులను అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నామని చెప్పారు. తద్వారా కాలేజీల్లోని సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆయా సంస్థలకు వీలు కలుగుతుందని, బోధనాభ్యసన కార్యకలాపాలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగించగలుగుతాయని అభిలషించారు. ఇందుకోసం రాష్ట్రంలో సస్టెయినబుల్ (స్థిరమైన) ఫీజుల విధానం ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నాణ్యతలో రాజీపడొద్దు.. ప్రతి ఒక్క కాలేజీ నిబంధనలను పాటిస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాణ్యతలో రాజీపడొద్దని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఏపీలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత) -
జగనన్న వసతి దీవెనకు రూ. 2,300 కోట్లు
సాక్షి, అమరావతి: జగనన్న వసతి దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఇటీవల వైఎస్సార్ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95,887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు. ఇంటర్, ఆపైన చదువుతూ.. స్కాలర్షిప్లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10,65,357 మంది కాగా.. కొత్తగా 95,887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది. త్వరలోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు. వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి. ఇంతవరకూ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఫీజుల కింద ప్రభుత్వం రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 2,300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అంటే అదనంగా రూ. 1,500 కోట్లు ఖర్చుచేయాలి. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. -
మాకు ఆంగ్లం.. మీకు తెలుగే!
పేదల పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగిపోతారనే భయమో... ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందనే ఆందోళనో తెలియదు కానీ ఇంగ్లిష్ మీడియం పేరు చెబితే చాలు ప్రతిపక్ష నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ‘మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకోవాలి. పేద బిడ్డలు మాత్రం తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశా లల్లోనే చదవాలి’ అన్నట్లుగా ప్రతిపక్ష నేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సహించలేక దుష్ప్రచారానికి తెగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి మేరకు ప్రతిపక్షం ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘తెలుగు నుడి’ అంటూ మాట్లాడుతున్న పవన్ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. టీడీపీ, జనసేనలో కీలక నేతలంతా తమ పిల్లల్లో ఒక్కరిని కూడా తెలుగు మీడియంలో చదివించకపోవడం గమనార్హం. ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వివరాలు ఇవిగో.. – సాక్షి, అమరావతి - నారా లోకేశ్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఇంగ్లిష్ మీడియంలో, అమెరి కాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో చది వారు. ఆయన కుమారుడు దేవాన్‡్షను హైద రాబాద్‌లోనే ఇంగ్లిష్ మీడియలో చేర్చారు. - టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు కుమారుడు రామ్‌మల్లిక్ ఇంటర్ వరకు హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివి అమెరికాలో ఎంబీఏ చేశారు. కుమార్తె అను హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలోనే చదివి ఎంబీబీఎస్ చేశారు. - కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెలు అదితి, విద్యావతి విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. - టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇద్దరు కుమారులు అమెరికాలో చదువుకున్నారు. - ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. అమెరికాలో బీటెక్, ఎంబీఏ చేశారు. - టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు రాజగోపాల్‌రెడ్డి నెల్లూరులోని నారాయణ, రత్నం విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. నారాయణ కాలేజీలో ఇంటర్, బెంగళూరులో బీటెక్, అమెరికాలో ఎంఎస్ చేశారు. ఆయన కుమార్తె సింధు మెడిసిన్ వరకు నారాయణలో చదివారు. - మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కుమారుడు విశాల్‌కృష్ణ రంగారావు విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె కృతి గోపాల్ 2013 వరకు అక్కడే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. - టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కృష్ణా జిల్లాలోని సెయింట్ జాన్స్ హైస్కూల్లో చదివాడు. ఆయన కుమారుడు ప్రస్తుతం ఒంగోలులోని నెక్స్›్టజెన్ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతున్నాడు. - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. - జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ విదేశాల్లో చదివారు. ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. - టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు రాజేష్ గన్నవరంలోని సెయింట్ జాన్స్, సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో, అమెరికాలో చదివారు. రెండో కుమారుడు క్రాంతి కుమార్ సిద్దార్థ పబ్లిక్ స్కూల్, నలంద జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. అమెరికాలోని కెటారిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. - టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్, హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీలో చదివారు. ఆయన రెండో కుమారుడు తనూజ్ నాయుడు విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. - టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ విశాఖపట్నంలోని విశాఖవేలీ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. సింగపూర్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. కుమార్తె సాయి పూజిత పాఠశాల విద్య ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేశారు. విశాఖలోని సెయింట్ జోసఫ్ కళాశాలలో చదివారు. - టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విశాఖలోని టింపనీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు భారతీయ విజ్ఞాన్ విహార్‌లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాభ్యాసం చేశాడు. - మాజీ మంత్రి నారాయణకు ముగ్గురు సంతానం కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు నిషిత్ నారాయణ ఒకటి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. కుమార్తె శరణి ఒకటి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. లండన్‌లోని న్యూకాస్టిల్ యూనివర్శిటీలో ఎంబీఎ చేశారు. మరో కుమార్తె సింధు పదో తరగతి వరకు నెల్లూరులోని గోమతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్, అమెరికాలో ఎంబీబీఎస్ చేశారు. - మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు స్కూల్ విద్య అనంతపురంలోని సెయింట్ డీపాల్ స్కూల్, రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివారు. హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. - టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇద్దరు కుమార్తెలు హైమా చౌదరి, శ్వేతా చౌదరి విజయవాడ ఆట్కిన్సన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పాఠశాల విద్య చదివారు. ఊటీ, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. - మండలి బుద్ధప్రసాద్ తన ముగ్గురు పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం లోనే చదివించారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ హైదరాబా ద్‌లోని సెయింట్ అల్ఫాన్సా, గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చదివాడు. ఆయన పెద్ద కుమార్తె కృష్ణ ప్రభ హైదరాబాద్‌లో ఇంటర్, డిగ్రీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేశారు. ఆమె కుమార్తెలు ఇద్దరూ అక్కడే ఇంగ్లిష్ మీడియం చదువులే చదువుతున్నారు. బుద్ధ ప్రసాద్ రెండో కుమార్తె అవనిజ కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. -
ఇక పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: ఐదేళ్ల పాటు ఆకాశంలో మబ్బులు చూపించి.. అభివృద్ధి సాధించామంటూ చెప్పుకున్న గొప్పలు ఆరు నెలల కాలంలోనే దూది పింజల్లా తేలిపోతున్నాయి. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి యువత భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేసిన పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ప్రతి ఒక్క పేద, మధ్య తరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా చేయూతనందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ప్రభుత్వం విలువైన పథకాల్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రభుత్వమంటే సమాజాన్ని అభివృద్ధి చేసే నిర్ణయాలు తీసుకునేలా పనిచెయ్యాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాలతో జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా ఫలాలు అందుకోనున్నారు. 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్... వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్మెంట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాది జూలై 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజన్న ప్రసరించిన విద్యావెలుగులు... పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యా ఫలాలు అందించాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు కూడా పేదరికం వల్ల తన బిడ్డని ఉన్నత చదువులు చదివించలేకపోయామన్న నిరుత్సాహపడకూడదన్న లక్ష్యంతో రాజన్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2004లో ఈ పథకం ప్రారంభమైంది. పథకం ప్రారంభం కాకముందు ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం, కొంత వరకు మాత్రమే ఫీజుల చెల్లించేది. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలు, ఈబీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుతో.. ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పెట్టే పరిస్థితి నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎమ్మెస్సీ వంటి ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. ఐదేళ్లు... రూ.100 కోట్ల బకాయిలు... మహానేత వైఎస్సార్ మరణించిన తర్వాత... గడిచిన ఐదేళ్లుగా రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో విశాఖపట్నం జిల్లాలోనే రీయింబర్స్మెంట్ బకాయిలు అక్షరాలా రూ.100 కోట్లకు చేరాయని ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ శివారు ప్రాంతంలో 20కిపైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థి కళాశాలలో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వం కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు అందిస్తుంది. అందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజును ఇస్తామని పేర్కొంటారు. విద్యార్థికి కళాశాలలో అడ్మిషన్ ఇచ్చేలా చేస్తారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏనాడు పట్టించుకోలేదు. ఇంజినీరింగ్ విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో రూ.35 వేలకు మించి ఇవ్వకపోవడంతో.. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందన్న ఆశతో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. మిగిలిన ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు చాలా కుటుంబాలు అప్పులపాలైన ఘటనలూ లేకపోలేదు. ఫీజులు పెంచేసిన టీడీపీ... టీడీపీ అధికారంలో ఉండగా కాలేజీల యాజమాన్యాలకు మేలు కలిగేలా ఫీజులను 30 శాతం మేర పెంచింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. రూ.35వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. అదిపోగా మిగతా భారం మొత్తం విద్యార్థి భరించాల్సి వచ్చేది. ఫలితంగా ఒక్కో విద్యార్థి కుటుంబం కోర్సు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షలకు వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.45 వేలకు పెంచుతామంటూ ఒక జీవోను విడుదల చేసి విద్యార్థులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి గత ప్రభుత్వం రూ.35వేల ఫీజు రీయింబర్స్‌మెంటును కూడా కాలేజీలకు చెల్లించకపోవడంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. మళ్లీ విద్యా సుగంధాలు... ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ.. ప్రతిపక్షనేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచే అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం అమరావతిలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజన్న మరణంతో అస్తవ్యస్తంగా మారిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఊపిరిపోయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యావరాలు అందించేలా పథకాలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సడలించిన నిబంధనలు... ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం నిబంధనల్లో అనేక మార్పులు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ►ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సరానికి ఆదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగిలిన వాళ్లకు రూ.లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందన్న నిబంధనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సడలించింది. వార్షికాదాయం రూ.2.50 లక్షలు లోపు ఉన్న అందరికీ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తిస్తాయి. ►10 ఎకరాల లోపు మాగాణి లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్నవారికి లేదా, రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్న వారూ ఈ పథకానికి అర్హులు. ►ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుంది. ►కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే. ►ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ రెండు పథకాలకు అనర్హులు. ►పట్టణాల్లో 1500 చ.గజాలు ఆస్తి ఉన్న వారికీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ►పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సుల్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల హర్షం... పేదవిద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో పాటు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చదువుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి తల్లిదండ్రులకు తప్పుతుందని విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫీజులెలా చెల్లించాలని ఆందోళన చెందకుండా చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క ఫీజులతో పాటు విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.10 నుంచి రూ.20 వేల వరకూ చెల్లించేందుకూ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్థుల చదువులపైనే దృష్టి సారించగలమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘అమ్మఒడి’కి ఆమోదం
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం జగనన్న అమ్మ ఒడితో పాటు సబ్ ప్లాన్ పరిధిలోని 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించడం, కృష్ణా–గోదావరి డెల్టా కాల్వల శుద్ధి, కార్పొరేట్ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైం అవార్డులు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు, రోబో ఇసుక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్, 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు, అభ్యంతరం లేని పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు గజాల వరకు రూపాయికే రిజిష్ట్రేషన్ వంటి కీలక నిర్ణయాలకూ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని ఇలా.. పథకాలు ఇక చకచకా నవంబర్ 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు నవంబర్ 21న వైఎస్సార్ మత్స్యకార నేస్తం కింద వేట విరామంలో ఏటా ఇచ్చే మొత్తం రూ.4,000 నుంచి రూ.10,000కు పెంపు ఇవి రద్దు.. - విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు. - కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో చంద్రబాబు సమీప బంధువుకు వీబీసీ ఫెర్టిలైజర్స్ పేరుతో ఇచ్చిన 498.93 ఎకరాల భూ కేటాయింపును రద్దు. - పరస్పర అంగీకారంతో స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు. వేతనం పెంపు - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బోధన ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనం నెలకు రూ.16,000కు పెంచడానికి గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ పిల్లలకు అమ్మఒడి జగనన్న అమ్మ ఒడి పథకానికి దారిద్య్రరేఖకు దిగువనున్న ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలందరూ అర్హులు. అర్హులైన పిల్లల తల్లులకు ఏటా జనవరిలో రూ.15 వేలు అందించనున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు వర్తింపజేస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుంది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పేదరికంలో ఉండి తెల్లరేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి, అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్య కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తారు. జగనన్న అమ్మ ఒడికి ఈ సంవత్సరంలో రూ.6,455 కోట్లు వ్యయం చేయనున్నారు. రక్తహీనత నివారించేందుకు అదనపు పౌష్టికాహారం పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలో 7 గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో తొలి విడతగా అమలవుతుంది. గర్భిణీలు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 25 రోజుల చొప్పున రోజూ వేడి అన్నం, కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, తృణ ధాన్యాలు, మాంసకృత్తులు, ఐరన్‌తో సహా అధిక శక్తినిచ్చే పౌష్టికాహారం రేషన్‌గా ఇంటికి సరఫరా చేస్తారు. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.600 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 30 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, 25 రోజుల పాటు 100 గ్రాముల చొప్పున బాలామృతం ఇస్తారు. 3 నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువైన ఆహారం అందిస్తారు. 25 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్లు పాలు, పాయసం లేదా లడ్డూ లేదా బిస్కట్ లేదా కేక్ (50 గ్రాముల బరువు.. బాలామృతంతో తయారు చేసింది) అల్పాహారంగా అందిస్తారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులను అందించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విద్య, సామాజిక సేవ, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు సహా క్రీడా రంగాల్లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు అందజేస్తారు. అవార్డుల కమిటీని ముఖ్యమంత్రి నియమిస్తారు. అవార్డులపై తమ సిఫార్సులను కమిటీ సీఎంకు నివేదించనుంది. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు. జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డుల తరహాలో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డుల ద్వారా ప్రతిభావంతులను గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవోలను కేబినెట్ ఆమోదించింది. - హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 ఆసుపత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్ 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద అమలవుతాయి. - తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్. - తీవ్ర పక్షపాతం, తీవ్రమైన కండరాలు క్షీణత, కదల్లేని స్థితిలో మంచానపడ్డవారికి, బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు స్టేజ్ 3, 4, 5లలో ఉన్న వారికి నెలకు రూ.5 వేల పెన్షన్. - ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అనంతరం రోగులు కోలుకునే వరకు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం. నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు. - గ్రామ, వార్డు సచివాలయాల్లో 397 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి ఆమోదం. హోం శాఖలో అదనంగా పోస్టుల భర్తీ. - రాజ్‌భవన్ సచివాలయంలో తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం. - ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలు, బాండ్లు జారీకి అనుమతి. - రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం. 13 జిల్లా కేంద్రాలు, 4 ప్రాంతాల్లో రీజినల్ కోడ్ సెంటర్లు. - నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు అందేలా చూసేందుకు అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు. మార్కెట్‌కు వచ్చేముందు, వెళ్లే ముందు పరీక్షలు నిర్వహిస్తారు. - 9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్. - కృష్ణా, గోదావరి డెల్టా కాల్వలను శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మిషన్ ఏర్పాటు. ఈ మిషన్‌కు చైర్‌పర్సన్‌గా సీఎం, వైస్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. కాలుష్యాన్ని నివారించి పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తుంది. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ మత్స్యకార నేస్తం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచి ఇవ్వనున్నారు. మోటారైజ్డ్, మెకనైజ్డ్ బోట్లతో పాటు తెప్పలతో సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతంలో చమురు, సహజ వాయువుల కోసం జరిపిన తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్జీసీ చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు హజ్, జెరూసలేం యాత్రికులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు. ఇందుకోసం బడ్జెట్లో వేర్వేరుగా చెరో రూ.14.22 కోట్లు కేటాయించారు. రోబో ఇసుక యూనిట్లకు పావలా వడ్డీ రుణాలు కంకర నుంచి రోబో శ్యాండ్ (ఇసుక) తయారు చేసే స్టోన్ క్రషర్స్ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదికి రూ.37.3 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.186.5 కోట్లు కేటాయించారు. ఈ యూనిట్ల మనుగడలో భాగంగా 50 కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో రోబో శ్యాండ్ను 20 శాతం వాడేలా చర్యలు తీసుకుంటారు. రోబో శ్యాండ్ యూనిట్లుగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఆరు నెలలు గడువు ఇచ్చారు. పేదలకు రిజిస్ట్రేషన్ కానుక అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి వంద చదరపు గజాలలోపు ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించి రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారైతే వంద నుంచి 300 చదరపు గజాల వరకు ఉన్న ఇళ్లను మార్కెట్ విలువ ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన విధానంలో క్రమబద్ధీకరిస్తారు. 300 చదరపు గజాల వరకు ఇలా క్రమబద్ధీకరించుకున్న ఇళ్లను ఐదేళ్ల వరకూ అమ్ముకునే వీలుండదు. పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను అర్హులైన మరొకరు కొనుక్కుంటే వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. భూ కేటాయింపులు రద్దు విశాఖలో లులూ.. విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన రూ.13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎకరం రూ.50 కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని నెలకు రూ.4 లక్షల నామమాత్రపు అద్దెకు కేటాయించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని భావించాం. ఎకరం విలువ రూ.50 కోట్లు అయితే, ఆ సొమ్మును బ్యాంకులో పెడితే వడ్డీనే రూ.2.5 కోట్లు వస్తుంది. అలాంటిది వచ్చే వడ్డీలో కేవలం 20 శాతాన్ని మాత్రమే అద్దె కింద నిర్ణయించడం సబబు కాదు. లులూ కంపెనీకి అప్పనంగా భూమిని కట్టబెట్టడమే కాకుండా, సీఎమ్మార్ సంస్థకు చెందిన మరో 3 ఎకరాల భూమిని కూడా లులూకు ఇవ్వడం కోసం అందుకు ప్రత్యామ్నాయంగా సీఎమ్మార్‌కు అంతకంటే విలువైన భూమిని, అత్యంత విలువైన సిరిపురం ప్రాంతంలో అన్యాయంగా కట్టబెట్టారు. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ టెండర్ దాఖలైతే దాన్ని రద్దు చేయకుండా ఆ సంస్థకే కేటాయించడం వల్ల ప్రజల ఆస్తికి నష్టం జరుగుతున్న దృష్ట్యా ఆ కేటాయింపులను రద్దు చేశాం. జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్.. ఇలా ఉండగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు చేశాం. ప్రజలు నవ్విపోతారని కూడా ఆలోచించకుండా, సొంత వియ్యంకుడికి, లోకేష్ తోడల్లుడికు చెందిన వీబీసీ సంస్థకు అంటే ఇటీవలే మరణించిన ఎంవీవీఎస్ మూర్తికి చెందిన సంస్థకు అతితక్కువ ధరకే అప్పనంగా ఈ భూములు కట్టబెట్టారు. 2015 జూలై 15న భూములు కేటాయించి, పట్టుమని రెండు నెలలు తిరగకుండానే అదే ఏడాది సెప్టెంబర్ 22న ఈ భూములను సీఆర్డీఏ పరిధిలోకి చేర్చారు. ఈ కారణంగా ఈ భూముల రేటు అమాంతం వందల రెట్లు పెరిగింది. ఈ రసాయన పరిశ్రమ స్థాపించాక అది వెదజల్లే కాలుష్యం వల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆరోగ్యాలకు ముప్పు ఏర్పడుతున్నందున రద్దు చేశాం. పరస్పర అంగీకారంతో స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు.. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ (ఏడీపీ) లిమిటెడ్‌ను మూసి వేయాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భాగస్వాములైన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ పరస్పర అంగీకారంతో ఏడీపీని మూసివేయాలని బోర్డులో తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఏడీపీని రద్దుచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పనులు ప్రారంభం కాలేదని కేబినెట్లో చర్చించారు. అలాగే ఏడీపీకి భూములపై జనరల్ పవర్ అటార్నీ కూడా బదిలీ చేయలేదు. అసెండాస్, సెమ్బ్ బ్రిడ్జి విలీనం అంశం ఆమోదించిన ఒప్పందంలో లేదని సింగపూర్ కన్సార్టియం తెలిపింది. ఈ నేపథ్యంలోనే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై చర్చించి సింగపూర్ కంపెనీల కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియం 58 శాతం వాటాతో రూ.306 కోట్ల మూల ధన పెట్టుబడి, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ 42 శాతం వాటాతో రూ.222 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు సర్కారుకు ఒప్పందం చేసుకుంది. -
అప్పుడు టీ అమ్మాడు.. ఇప్పుడు 'నీట్' బోధిస్తున్నాడు
భువనేశ్వర్ : జార్ఖండ్‌కు చెందిన 47 ఏళ్ల అజయ్ బహుదూర్ సింగ్ పేరు ప్రస్తుతం ఒడిశాలో మారుమోగిపోతోంది. భువనేశ్వర్ పట్టణంలో నివసిస్తున్న ఆయన.. మరో సూపర్-30 ఆనంద్‌కుమార్‌లా పేరు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు పేదరికంలో మగ్గిన అజయ్.. అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుతం తన ఇంటిలోనే ఒక గదిని ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకు నీట్ పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాదు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న 19 మంది విద్యార్థుల్లో(2018-19 బ్యాచ్‌కు చెందినవారు) 14 మంది నీట్‌కు అర్హత సాధించడం విశేషం. అదే విధంగా 2017-18 బ్యాచ్‌లో 20 మంది విద్యార్థులకు అజయ్ పాఠాలు బోధించగా..వారిలో 18 మంది నీట్లో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతూ సేవాభావం చాటుకుంటున్న అజయ్ తన నేపథ్యం గురించి చెబుతూ..పరిస్థితుల ప్రభావం వల్ల తాను డాక్టర్ కాలేకపోయినా తనలా మరే ఇతర విద్యార్ధి బాధపడకూడదనే ఇలా పాఠాలు బోధిస్తున్నట్లు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఎంబీబీఎస్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో నాన్న ఆరోగ్యం పాడవడంతో కుటుంబ పోషణ భారమైంది. దాంతో చదువుకు స్వస్తి చెప్పి టీ అమ్మాల్సి వచ్చింది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో... ''జిందగీ'' పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాను. నా దగ్గరికి వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నీట్ పాఠాలు బోధిస్తున్నా అని పేర్కొన్నారు. ''జిందగీ ఫౌండేషన్''ను తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు త్వరలోనే విస్తరించనున్నట్లు వెల్లడించారు. నీట్‌కు అర్హత సాధిస్తా.. 'మాది నిరుపేద కుటుంబం. మా తండ్రి దినసరి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయాను. కానీ జిందగీ ఫౌండేషన్ ద్వారా అజయ్ బహుదూర్ సార్ ఉచితంగా నీట్ పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకొని అందులో చేరాను' అని నీట్‌కు ప్రిపేర్ అవుతున్న రేఖారాణి వెల్లడించింది. ఎంత కష్టపడైనా సరే.. నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. -
ట్రిపుల్ ఐటీ పై పట్టింపేది?
సాక్షి, నిర్మల్: ఉత్తర తెలంగాణ పేదింటి విద్యార్థుల కలల చదువు.. కల్పతరువు.. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ. చదువులమ్మ కొలువుదీరిన చోట 272ఎకరాల విశాల ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాక్షేత్రం కొలువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో ప్రారంభమైంది. మొత్తం ఏడువేల మంది విద్యార్థుల కలల ప్రపంచమిది. ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన పేదింటి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. అలాంటి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నవారూ అరకొర పర్యవేక్షణే చేపడుతుండటంతో ఇక్కడి క్యాంపస్‌లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రిపుల్‌ఐటీలో తాజాగా కీచక చేష్టలూ వెలుగులోకి రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఏళ్లుగా ఇన్చార్జి పాలన.. పేద పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చాలన్న వైఎస్ఆర్ ఆశయంతో ఏర్పడిందే ట్రిపుల్ఐటీ. తెలంగాణలో ఏకైక ట్రిపుల్ఐటీ బాసర ఆర్జీయూకేటీ. ఉన్న ఒక్క చదువుల క్షేత్రంపై ఏళ్లుగా వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీని ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. శాశ్వత వీసీని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీకి రెగ్యులర్ వీసీ ఉండాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తున్నా..కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడి క్యాంపస్‌పై శీతకన్ను కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియామకంపై చర్చించకపోవడం గమనార్హం. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేశారు. అనంతరం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్‌కు ఇన్చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. పర్యవేక్షణ కరువై.. ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీని నియమించడం లేదు. ఏళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఇన్చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్‌బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే పూర్తి దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఆయన ఇన్చార్జిగా ఉన్న బాసర క్యాంపస్‌పై పడుతోంది. ఎప్పుడన్నా.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా ఇన్చార్జి వీసీ క్యాంపస్‌కు రావడం లేదు. ఇక్కడి ఏఓ, రిజిస్ట్రార్ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. వైస్ చాన్స్‌లర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు, అధ్యాపకుల్లో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కీచక చేష్టలు.. ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లాంటి అధ్యాపకులూ ఇక్కడ ఉన్నారు. పదోతరగతి వరకు బాగా చదువుకుని, ట్రిపుల్‌ఐటీలో ప్రవేశమే లక్ష్యంగా అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునేవారు దాపురించారు. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన క్యాంపస్‌లో కొంతమంది అధ్యాపకుల వికృత చేష్టలకు అద్దం పట్టింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్నతస్థానంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల చేసిన పని అధ్యాపకవృత్తినే తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెల్ఫోన్లో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించడంతో పాటు కేసులనూ నమోదు చేశారు. ఇక ఇలాంటి కీచక చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్న వారు మరికొందరు ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దొరికితేనే దొంగ.. అన్న రీతిలో వీరు చేస్తున్న కథలు బయటపడక పోవడంతో గుట్టుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి, అక్రమాలకూ ఆస్కారం.. ట్రిపుల్ఐటీకి వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వచ్చే ఉత్తమ పురస్కారాలను అందుకుంటున్న ఇన్చార్జి వీసీ ఇక్కడి అక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల కోసం వచ్చే లాప్‌టాప్‌లు, యూనిఫాంలలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ మెస్‌లలో లోపాలపైనా విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని, అన్ని విభాగాలనూ వారికే దక్కేలా చూస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అకాడమిక్ పరంగా కూడా ఇన్చార్జి వీసీ ఉండటంతో విభాగాధిపతులపై పర్యవేక్షణ కరువైంది. ఈక్రమంలో రవి వరాల వంటి వారు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో భద్రతపైనా భరోసా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేవిషయంపై సోమవారం క్యాంపస్‌ను తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా.. 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్ఐటీ లో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువు లు సాధించారు. గ్రామీణ విద్యార్థులకు అ త్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పేదింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ఐటీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇక ముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇందు కోసం అత్యుత్తమ రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని తెలిపారు. బౌన్సర్లతో వసూళ్లు వద్దు: బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు. టీచర్స్ కోటా బిల్లుకు ఆమోదం కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్ కేడర్ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్ స్థానంలో అమలవుతుంది. -
విద్యాహక్కు.. ఇక ఉండదు చిక్కు
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సొమ్ము చెల్లిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లలు, పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నా పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు. ఐదేళ్లలో రూ.591.50 కోట్ల నష్టం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రూ.103.26 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఒక్కసారి స్కూల్లో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే విద్యనభ్యసిస్తారు. ఇలా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ.520 కోట్ల వరకు చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 34,421 మంది విద్యార్థులకు వాటిల్లో చదువు చెప్పించేందుకు ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీలు 22,814 మంది, ఎస్టీలు 11,580 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఇదిలావుంటే.. కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన వారిని ఇంటర్మీడియెట్‌లో చేర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2019–20 సంవత్సరానికి 3,765 మంది విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చారు. ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు, రూ.3 వేల పాకెట్ మనీ కలిపి మొత్తం రూ.38 వేల చొప్పున ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ఏటా రూ.14.30 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.71.50 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కార్పొరేట్ కళాశాలల్లో ఎస్సీలు 1,795 మంది, ఎస్టీలు 582 మంది, బీసీలు 1,050 మంది, మైనార్టీలు 189 మంది, కాపులు 83, ఈబీసీలు 65 మంది, దివ్యాంగుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు గడచిన ఐదేళ్లలో సుమారు రూ.591.50 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గేది. ఇకపై కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యాహక్కు చట్టం కింద ఆయా వర్గాల్లోని పేదలకు 25 శాతం సీట్లు విధిగా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యాహక్కు చట్టం అమలుకు చిక్కు ఉండదని, పేదవర్గాల వారికి మేలు కలుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఎంబీబీఎస్ సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ నెల ఆరో తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ఈడబ్ల్యూఎస్ కోటాను ఈ వైద్య విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలు చేయాలంటే 25 శాతం ఎంబీబీఎస్ సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా కోటా నీట్ రాసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌తో ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరగగా, మరో 387 సీట్లు కూడా వాటికి తోడు కానున్నాయి. ఈ రిజర్వేషన్లు కల్పించాలంటే సీట్ల సంఖ్య పెంపు తప్పనిసరి. జనరల్ కోటా సీట్లు తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో పదిశాతం సీట్లు అంటే 155 సీట్లు పెంచితే సరిపోతుంది అనుకుంటాం. కానీ మొత్తం సీట్ల సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పాటించాలన్న మరో నిబంధన ఉంది. లెక్క ప్రకారం 49 శాతం సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్‌లోకి వెళ్లాలి. ఇలాగాకుండా ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు వదిలేసి, మిగతా 90 శాతం సీట్లలో 49 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేస్తే వారికి సీట్లు తగ్గుతాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. రిజర్వేషన్ల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సి ఉంది. -
‘కస్తూర్బా’.. పేద విద్యార్థినులకు వరం
గుంటూరు, సత్తెనపల్లి: బడి ఈడు పిల్లలందరికీ విద్యనందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం విద్యాశాఖ సమగ్రశిక్షా అభియాన్ ద్వారా పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. అనేక కారణాల వల్ల చాలా మంది 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. వారిలో అధిక శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలే. వారికి రెసిడెన్షియల్ పద్దతిలో ఆరు నుంచి పదో తరగతి వరకు గుణాత్మక విద్యను అందించడానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని మన రాష్ట్రంలో 2005 ఆగస్ట్14న ప్రారంభించారు. బాలికల అక్షరాస్యతా శాతం, రాష్ట్ర అక్షరాస్యతా శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 352 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా, మన జిల్లాలో 24 ఉన్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన కేజీబీవీలు నేడు వేలాది మంది విద్యార్థినిలకు ఉచితంగా విద్యనందిస్తున్నాయి. గతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యనందించేవారు. ప్రస్తుతం జిల్లాలోని నాదెండ్ల, బెల్లంకొండ కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తున్నాయి. కొన్ని విద్యాలయాల్లో ఆంగ్ల మాద్యమంలోనే విద్య నందించడం విశేషం. విద్యతో పాటు కంప్యూటర్, ఆటలు, కరాటే, యోగ, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి బాలికలోల ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు జిల్లాలో 24 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మూడు మైనార్టీలకు కేటాయించారు. నరసరావుపేట, పిడుగురాళ్ల, పోతవరం (చిలకలూరిపేట) వీటిల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. నాదెండ్ల, బెల్లంకొండలో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, దాచేపల్లి, గురజాల, పిల్లుట్ల, రెంటచింతల, దుర్గి, మాచర్ల ,వెల్దుర్తి, కారంపూడి,రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, ఈపూరు, క్రోసూరు, అచ్చంపేట ప్రాంతాల్లో కేజీబీవీలు కొనసాగుతు న్నాయి. ఒక్కో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో తరగతికి 40 మంది చొప్పన 200 మంది చదువుతున్నారు. అలా 24 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో 4,800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నట్లు అంచనా. ప్రతి విద్యార్థినికి పౌష్టి కాహారాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజూ గుడ్డు, వారానికి ఒకసారి కోడి మాంసాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఉచితంగా పుస్తకాలు, శుద్ధి చేసిన నీరు ఏర్పాటు చేశారు. బాలికల ఖర్చుల కోసం ప్రతి నెలా కాస్మోటిక్ చార్జీలు అందిస్తుంది. ప్రతినెలా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అంద జేస్తారు. ప్రతి కేజీబీవీలకు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు కంప్యూటర్లో ప్రావీణ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు తెలిపారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను మాత్రమే భర్తీ చేయనుండగా 6వ తరగతిలోకి కొత్తగా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల వారు మే ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థినుల పురోగతికి సోపానం కేజీబీవీలు పేద విద్యార్థినుల పురోగతికి సోపానాలు. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. చదువుతో పాటు నాయకత్వ నైపుణ్యాలు, యోగ, ధ్యానం, కరాటే తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ ఉంటుంది. మే ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ లింక్ రానుంది. – బి.రాజ్యలక్ష్మి, డీసీడీఓ, గుంటూరు -
మేం చెప్పిందే ‘సెంటర్’
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నెగ్గేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలన్న ప్రభుత్వ సంకల్పం మసకబారుతోంది. కోచింగ్ సెంటర్ల ఎంపికలో గోల్మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 17 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయగా, ఈసారి వీటితోపాటు కొత్తగా మరో మూడు కేంద్రాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కార్యాయలం(సీఎంవో) ఆదేశించింది. దీంతో మొత్తం 20 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పైరవీలు ఫలించినట్లు సమాచారం. తాము సూచించిన కేంద్రాలనే ఎంపిక చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అనుకున్నది సాధించినట్లు తెలుస్తోంది. సివిల్స్ శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగడానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి. అర్హులైన విద్యార్థులకు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కోచింగ్ సెంటర్ల ఎంపిక కోసం ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన నాలుగు కమిటీలను నియమించింది. ఈ కమిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల డైరెక్టర్లు, కాపు కార్పొరేషన్ ఎండీ నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోని కోచింగ్ సెంటర్లను ఈ కమిటీలు పరిశీలించాయి. 17 సెంటర్లను ఎంపిక చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి తమ నివేదికను అందజేశాయి. అనంతరం మరో 3 కోచింగ్ సెంటర్లను చేర్చాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 20 కోచింగ్ సెంటర్లను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 20 సెంటర్లలో చాలావరకు అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సినవేనని ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నాలుగు నెలలు వృథా సివిల్స్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి జూన్ నెలాఖరున పోటీ పరీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమిటీలు, తనిఖీలు అంటూ కాలయాపన చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, అస్మదీయ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. నాలుగు నెలల సమయం వృథా అయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జూన్‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గడువు సరిపోదని వాపోతున్నారు. కోచింగ్ ఫీజు విద్యార్థులకు ఖాతాలకు.. సివిల్స్ కోచింగ్ ఫీజును నేరుగా కోచింగ్ కేంద్రాలకు ఇవ్వకుండా, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. కోచింగ్ సెంటర్లను 3 విభాగాలుగా విభజించారు. ఏడాదికి ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజు కింద మొదటి విభాగం కేంద్రానికి రూ.1.30 లక్షలు, రెండో విభాగం కేంద్రానికి రూ.1.15 లక్షలు, మూడో విభాగం కేంద్రానికి రూ.లక్ష చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెలనెలా విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారు. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతోపాటు మెయింటెనెన్స్ ఫీజు జమ అవుతుంది. ట్యూషన్ ఫీజును విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫీజు నెలకు రూ.10,000, ఢిల్లీలో కోచింగ్ తీసుకునే వారికి రూ.12,000 ఇస్తారు. రవాణా ఖర్చుల కింద రూ.2,000 అందజేస్తారు. నేటి నుంచి కౌన్సెలింగ్ సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం కేటాయించిన కోచింగ్ సెంటర్లలో నేటి నుంచి జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావు తెలిపారు. -
తండా బిడ్డ.. హస్తిన గడ్డ..!
హైదరాబాద్: ఇప్పటి వరకు ఢిల్లీని మ్యాప్‌లో చూడడమే గానీ.. ఎప్పుడూ వెళ్లని నిరుపేద విద్యార్థులు వారు. అలాంటిది అక్కడే ఉన్నత విద్య చదువుకునే అవకాశం రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. వీరంతా మారుమూల గ్రామాలు, తండాల్లో నివాసముండేవారే. వీరిలో చాలా మంది తల్లిదండ్రులు రోజు కూలీలే. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ చదివేందుకు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 94 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఏడాది కేవలం 12 మందే సీట్లు సాధించగా ఈసారి 94 మందికి అవకాశం రావడం విశేషం. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఎంపికైన 62 మందిలో 30 మంది బాలికలు కాగా, 32 మంది బాలురు ఉన్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల నుంచి 32 మంది ఎంపిక కాగా అందులో 17 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాలలైన హన్స్‌రాజ్, హిందూ, రామ్జాస్, మిరండా హౌజ్, కేశవ మెమోరియల్, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్, ఎస్ఆర్సీసీ, శ్రీవెంకటేశ్వర, దౌలత్‌రామ్ వంటి ప్రఖ్యాత కళాశాల్లో సీట్లు పొందడం విశేషం. మాకెంతో గర్వంగా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకులాల పుణ్యమా అని, ప్రవీణ్‌సార్ చలవతో మా పాప మానసకు ఢిల్లీలోని హిందూ కళాశాలలో చదువుకునే అవకాశం వచ్చింది. మాది ఖమ్మం జిల్లా టి.పాలెం మండలంలోని పిండిపోలు గ్రామం. రోజువారీ కూలీ చేసే మాకు ఇది ఎంతో గర్వంగా ఉంది. – ఉపేందర్ ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం బాగా చదివి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. రామ్జాస్ కళాశాలలో బీఎస్సీ హానర్స్ మ్యాథ్స్‌లో సీటు సాధించా. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలన్నది నా తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేరుస్తా. – సురేశ్‌నాయక్ చాలా సంతోషంగా ఉంది.. ఐఏఎస్ అధికారినై పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. మాది సూర్యా పేట జిల్లా కపూరియాతండాకు చెందిన నిరుపేద కుటుంబం. మిరండా హౌజ్‌లో బీఎస్సీ హానర్స్ బాటనీ కోర్సులో సీటు సాధించా. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా గురుకులాల చలవే. – స్వాతి -
చదువుల తల్లులకు అండగా నిలిచిన పోసాని
-
ఎంపిక చేశాక.. పథకమే లేదన్నారు!
సాక్షి, హైదరాబాద్: నిన్నటి వరకు..: రూ. వంద కోట్ల నిధులు.. 17 రకాల పథకాలు.. వరుసగా పాలకమండలి సమావేశాలు.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అర్హుల ఎంపిక, రుణాల మంజూరు కసరత్తు.. ఇప్పుడు..: కేవలం మూడు పథకాలకే ప్రభుత్వ ఆమోదం... మిగతా పథకాలు మాయం.. ఎంపికైన లబ్ధిదారుల్లో ఆందోళన.. పనికి రాకుండా పోయిన కేటాయింపు పత్రాలు, మంజూరు పత్రాలు.. ... ఇది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దుస్థితి. నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు మేలు చేసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్, 17 రకాల పథకాలను ప్రకటించినా ఆచరణలోకి మాత్రం రాలేదు. ఆయా పథకాలకు లబ్ధిదారులుగా ఎంపికైన పేద బ్రాహ్మణ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అర్హులను ఎంపిక చేసినా.. పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి ప్రభు త్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 17 పథకాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్ల స్థాపనకు రుణాలు, విదేశాల్లో పేద విద్యార్థులకు విద్యా రుణాలు, వేద పాఠశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం తదితర అంశాలకు సంబం« దించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన పరిషత్.. అర్హులను ఎంపిక చేసి, మంజూరు పత్రాలను జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.2 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. కానీ తర్వాత వెలువడిన జీవో నం.584తో గందరగోళం మొదలైంది. వివేకానంద విదేశీ విద్యా పథకం, రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద పాఠశాలలకు ఆర్థిక సాయం పథకాలకు మాత్రమే ఆమోదం ఉందని అందులో తెలిపారు. దాంతో మిగతా పథకాలను తొలగించినట్టేనని వార్తలు వెలువడటంతో.. అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని ఔత్సాహికులకు పారిశ్రామిక రుణాలు అందించే ‘బ్రాహ్మ ణ ఎంట్రప్రెన్యూర్స్ డెవలప్మెంట్ స్కీం (బెస్ట్)’ కింద రుణాల కోసం ఎదురుచూస్తున్నవారు షాకయ్యారు. బెస్ట్ కింద తొలివిడతగా 155 మందిని ఎంపిక చేయగా.. కొందరు ఇప్పటికే ప్రైవేటుగా అప్పులు తెచ్చి యూనిట్ల ఏర్పాటు పనులు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు రుణాలందకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ ఆమోదించనందునే.. సీఎం ఆమోదం మేరకే 17 పథకాలకు రూపకల్పన చేసినా మూడింటికే ఆమోదం రావటమేమిటని పాలకమండలి ఆరా తీయగా.. వాటిని ఆర్థిక శాఖ ఆమోదించలేదనే సమాచారం తెలియడంతో సీఎంను కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరిషత్ పాలకమండలి సభ్యులు వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, పురాణం సతీశ్‌లకు బాధ్యత అప్పగించారు. పథకాలన్నీ పునరుద్ధరిస్తాం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్ ఏర్పడి తదనుగుణంగానే పథకాలకు రూపకల్పన చేసింది. కానీ ఆర్థిక శాఖ నుంచి యథాలాపంగా వెళ్లిన ఓ ఫైలు వల్ల ఈ అయోమయం ఏర్పడింది. త్వరలోనే సీఎంతో చర్చించి పథకాలన్నీ అమలయ్యేలా చూస్తాం.. – రమణాచారి, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ -
సాయమందిస్తే.. సత్తా చాటుతాం !
నూజివీడు : ఆ నలుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. రెక్కలు ముక్కలు చేసుకుని తల్లిదండ్రులు వారిని చదివించుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఇంజినీరింగ్ విద్యలోనూ అసాధారణ ప్రతిభ చూపెట్టి విదేశాల్లోని యూనివర్సిటీలను సైతం మెప్పించారు. వీరి ప్రతిభను మెచ్చి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డీ స్కూల్ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఈ నెలలో అమెరికా వెళ్లేందుకు విద్యార్థుల వద్ద చేతిలో చిల్లిగవ్వలేదు. తల్లిదండ్రులు సైతం డబ్బు ఖర్చుపెట్టి అమెరికా పంపించే పరిస్థితుల్లో లేరు. అమెరికా వెళ్లి రావాలంటే విమాన టికెట్లు, వెళ్లిన తరువాత ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ దాదాపు రూ.2లక్షలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు ఉంటే సాయమందించాలని విద్యార్థులు కోరుతున్నారు. దాతలు దయతలచి సాయమందిస్తే అమెరికా వెళ్లి తమ సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. ఎంపికైన విద్యార్థులు వీరే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి 125 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరైతే గడ్డం సాయికుమార్ (సీఎస్ఈ ప్రథమ సంవత్సరం), లాల్‌సింగ్ నాయక్ (మెకానికల్ ద్వితీయ సంవత్సరం), పుప్పాల ప్రతాప్ (సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం), వంకలపాటి సాయిదుర్గాప్రసాద్ (ఈసీఈ ద్వితీయ సంవత్సరం) ఎంపికయ్యారు. వీరికి ఆరువారాల పాటు ఆన్లైన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులు శిక్షణ ఇచ్చిన తరువాత ఫెలోషిప్‌ను ప్రకటించారు. మార్చి 15 నుంచి 19వ తేదీ వరకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించే సిలికాన్ వ్యాలీ మీట్ అప్–2018 స్ప్రింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ వారు ఆహ్వానం పంపించారు. యూనివర్సిటీలో నిర్వహించే మీట్లో విద్యార్థులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఆర్థిక స్థోమత లేదు తల్లిదండ్రులు తిరుపతిరావు, లక్ష్మీలు ఇద్దరూ షాపుల్లో పనిచేస్తారు. తమ్ముడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. అమెరికా వెళ్లాలంటే రూ.2లక్షలు ఖర్చుచేసే స్థోమత లేదు. దీంతో ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుతున్నా.– వంకలపాటి సాయిదుర్గాప్రసాద్,కృష్ణలంక, విజయవాడ కూలికి వెళ్లి చదివిస్తున్నారు రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చా. నాన్న మల్లయ్య, అమ్మ పార్వతి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ నన్ను చదవిస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన డబ్బులు తీసుకురావడం సాధ్యం కాదు.– గడ్డం సాయికుమార్, చీమలమర్రి, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా అమ్మ కష్టపడి చదివిస్తోంది మా నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ లక్ష్మి కూలి చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. తమ్ముడు ఉన్నప్పటికీ ఇంటి వద్దే గొర్రెలు మేపుతాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ్ముడిని చదివించడం లేదు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే సిలికాన్ వ్యాలీకి వెళ్లగలం.– మూడు లాలూనాయక్, చౌడవరం తండా, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా ఆదుకుంటేనే వెళ్లగలం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. అక్కను ఎంబీఏ చదివిస్తున్నారు. అంత డబ్బు పెట్టడమంటే సాధ్యమయ్యే పనికాదు. ఎవరైనా ఆదుకుంటేనే తాము వెళ్లగలం.– పుప్పాల ప్రతాప్, ప్రజ్ఞం,నిజాపట్నం మండలం, గుంటూరు జిల్లా -
కస్తూర్బాల్లో ఇంటర్
తిర్యాణి(ఆసిఫాబాద్): కస్తూర్బాగాంధీ విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారనున్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ చదవలేని వారి కోసం ప్రభుత్వం ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చింది. దీంతో ఈ సంవత్సరం పదో తరగతిచదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే కస్తూర్బావిద్యాలయాల్లోనే చదువుకునే అవకాశం కల్పించనుంది. దీంతో విద్యార్థినుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు చదువు మధ్యలో మానేయ్యకుండా ఉండడానికి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతీ మండలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత వసతితో విద్యను అందిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు కూడ ఆశించిన విధంగా వస్తున్నాయి. దీంతో పేద విద్యార్థినులు మేలు పొందుతున్నారు. కానీ పదో తరగతి తర్వాత విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన బోధన ఇంటర్ వరకు లేకపోవడంతో చాల మంది విద్యార్థినులు పదో తరగతితోనే చదువు ముగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నా హాస్టల్ వసతి లేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మరో కారణమేమిటంటే పదో తరగతి తర్వాత ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఈ మేరకు విద్యావేత్తలు, అధికారులు ఆలోచన చేసి కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశపెడితే డ్రాపౌట్లను తగ్గించవచ్చనే ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలతో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యకు అనుకూలంగా ఉన్న కేజీబీవీ పాఠశాలల వివరాలు సేకరించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అందులో 2,325 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొత్తగా పెంచికల్‌పేట, చింతలమానెçపల్లి, లింగాపూర్‌లలో 2017 జూలైలో కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 6,7 తరగతుల్లో విద్యాబోధన ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతోంది. కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యను కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలోని కేజీబీవీలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్బాల్లో 6,7 తరగతుల విద్యార్థులు 325 పోను పాత పాఠశాలల్లో చదువుకునే 2100 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. డ్రాపౌట్లకు చెక్.. జిల్లాలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవ సాయం, వ్యవసాయ కూలీపై ఆధారపడి జీవించేవారే. దీంతో అధిక కుటుంబాలు ఇంటర్ చదివించే స్థోమత లేక మధ్యలో చదువు మాన్పిస్తున్నారు. ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెడితే విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించడానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. దీంతో డ్రాపౌట్లను కూడా తగ్గించవచ్చని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేద విద్యార్థినులకు వరం కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెడితే పేద విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన విద్య లభిస్తుంది. దీంతో వారికి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కలుగుతుంది. ఇంటర్ తర్వాత కేజీబీవీల్లో డిగ్రీ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోని కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. – ఎన్.శంకర్, కేజీబీవీల జిలా ప్రత్యేకాధికారి -
టాపర్ల.. షికార్లు!
నర్వ, మరికల్: ‘మంచి మార్కులు తెచ్చుకుంటే ముంబాయికి విహారయాత్రకు తీసుకెళ్తానని.. విమానంలో చక్కర్లు కొట్టిస్తానని.. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నింటిని చూయిస్తానని పారిశ్రామికవేత్త నర్వ లక్ష్మికాంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే ఉత్తమ గ్రేడులు సాధించిన వారికి విమానంలో తీసుకెళ్లి.. నగరంలో విహారం చేయించారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం... నర్వ, మరికల్ మండలాలకు చెందిన టెన్త్ టాపర్లతోపాటు ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులకు స్ఫూర్తి యాత్ర నూతనోత్సాహం కలిగించింది. రెండు రోజులు కొనసాగిన ఈ యాత్రలో లక్ష్మీకాంత్‌రెడ్డి స్వయంగా శంషాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. అక్కడి చారిత్రక, ప్రసిద్ధ స్థలాలను విద్యార్థులు వీక్షించారు. తాజ్హోటల్లో కాఫీలు, టిఫిన్లు.. జుహుబీచ్లో అరేబియా సముద్రపు అలల సోయగం.. గరంగరం మసాల దినుసుల ఆరగింపు.. ఆకాశాన్ని తాకే అంభానీ భవంతులు.. వింతలు.. విశేషాలు చూస్తూ విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు. అక్కడి జ్ఞాపకాలు వారి మాటల్లోనే విందాం.. మరిచిపోని అనుభూతి టెన్త్ పరీక్షల్లో టాపర్‌గా వచ్చినందుకు విమానంలో వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇందుకు లక్ష్మీకాంత్‌రెడ్డికి కృతజ్ఙతలు. ఇంకా బాగా చదివితే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయని అనిపిస్తోంది. –శ్రావణి ఇంటర్ మీడియట్ మరికల్ గ్రామం విమాన ప్రయాణం బాగుంది టెన్త్‌లో మండల టాపర్‌గా వచ్చాను. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. సర్కారు బడుల్లో సత్తా చాటితే ఇలాంటి యాత్రలుంటాయని తెలిస్తే అందరు పోటీపడి చదువుతారు. – నర్మద, మరికల్ గ్రామం ముంబైలో మస్తుగ తిరిగినం ముంబై వీధుల్లో మస్తుగ తిరిగినం. అంబానీ భవంతి.. తాజ్‌హోటల్, ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద ఇళ్లు చూసినం. బీచ్‌లోని బాగా తిరిగినం. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. – నందిని, నర్వ గ్రామం పిల్లలకు కొత్త ఉత్సాహం సర్కారు బడుల్లో చదివే పిల్లలు కారు ప్రయాణానికి కూడా నోచుకోరు. అలాంటిది లక్ష్మీకాంత్‌రెడ్డి సహకారంతో పేద విద్యార్థులు విమానంలో తిరిగారు. అందరు కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఇలాంటి రోజులు నిత్యం వస్తాయి. – బాల్‌రాజు, ఎంఈఓ, నర్వ -
పేద విద్యార్థులకు హీరో చేయూత..!
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరు పేదలుచ అనాథలకు తన దేవి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. 2017-18 సంవత్సరానికి గానూ సుగాలి జాతికి చెందిన 15 మంది పేద విద్యార్థులకు లయోలా కళాశాలో సీట్లు ఇప్పించి, వారి చదువుకు ఖర్చునంతా తన దేవి ట్రస్ట్ ద్వారా అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈసారీ లేనట్లేనా?
– పేద పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు హుళక్కే – చట్టాన్ని అమలు చేయని ప్రైవేటు పాఠశాలలు – ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి ధర్మవరం : విద్యాహక్కు చట్టానికి ప్రైవేటు పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం ప్రకారం. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలి. కానీ ఈ చట్టం తమకు వర్తించదన్నట్లు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి. పూర్తవుతున్న ఆడ్మిషన్లు .. జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు దాదాపు పూర్తికానున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యిదాకా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయి. జీఓ నెంబర్–1 ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంది. ఆరు నెలల వరకు అడ్మిషన్లు కొనసాగించాలి. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రవేశ పరీక్షలు పెట్టి, డొనేషన్లు తీసుకుని విద్యార్థులను ముందస్తుగానే చేర్చుకుంటున్నారు. కార్పొరేట్, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ. వేలల్లో అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. నెలసరి ఫీజులు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నిర్ణయించారు. కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీ విద్యార్థికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారంటే వారి దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ–టెక్నో, ఈ– గవర్ననెన్స్అంటూ 6వ తరగతి నుంచి 10వ వరకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు ఫీజులను నిర్ధారించారు. సాధారణ ప్రైవేటు పాఠశాలలు కూడా అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఏ పాఠశాలలో కూడా గవర్నింగ్ బాడీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుని ఆ బాడీ నిర్ణయం మేరకు ఫీజులను వసూలు చేయడం లేదు. 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలన్న నిబంధనను ఏ పాఠశాల అమలు చేయడం లేదు. 25 శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. అయినా చాలా పాఠశాలలు ఈ చట్టాన్ని కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, వారి తోడ్పాటు కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లన్ని పూర్తయిన తరువాత చట్టం అమలుపై ఒత్తిడి తెస్తే ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే అందులో చేర్చుకున్న విద్యార్థుల పేర్లను ప్రభుత్వ ఖాతాలో జమ చేసి.. అటు తల్లిదండ్రులతోనూ, ఇటు ప్రభుత్వం నుంచి డబ్బును డబుల్ ధమాకా రూపంలో దండుకునే అవకాశం లేకపోలేదు. కనిపించని ఉపాధ్యాయుల అర్హత, ఫీజుల పట్టిక.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు విధిగా ఉపాధ్యాయుల అర్హత వివరాలను, ఫీజుల వసూళ్ల పట్టికను బోర్డుల ద్వారా ప్రదర్శనకు ఉంచాలి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్య బోధించేందుకు నియమితులైన ఉపాధ్యాయులు డీఎడ్, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బీఈడీ తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే బోధించాలి. అయితే అర్హతలేని వారు బోధిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు జిల్లాలో అధికంగానే ఉన్నాయి. అర్హతలేని ఉపాధ్యాయులే అధికం కావడంతో ప్రభుత్వ పాఠశాలలు మినహా ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల వివరాల పట్టిక కనిపించడం లేదు. -
పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: వెనకబడిన కులాలు, పేద విద్యార్థుల ఉజ్వల భవితకు గురుకుల పాఠశాలలు పునాది వేయబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల బీసీ గురుకుల పాఠశాలల వసతి గృహాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.కిషన్‌రెడ్డితో కలసి ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీలు, బలహీనవర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
మా అబ్బాయి సొంత ప్రతిభతోనే చదివాడు
ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: మా అబ్బాయి సొంత ప్రతిభతోనే ఉన్నత చదువులు చదువుకున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలని సీఎం సూచించారు. విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థులతో ఆయన బుధవారం విజయవాడలోని ఎ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పాలనలో అవినీతి జరగనివ్వనని, లంచాలు తీసుకునే వారిని బజారుకీడుస్తానని హెచ్చరించారు. ఇండియాకు యంగ్ దేశంగా పేరుందని, దేశానికి యువతే పెద్ద సంపదని తెలిపారు. పిల్లలు మట్టిలో మాణిక్యాలని, ప్రపంచాన్ని జయించే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. విద్యకు వయస్సుతో సంబంధం లేదన్నారు. తాను నిరంతర విద్యార్థినని, నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని పేర్కొన్నారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. టెక్నాలజీని వినియోగించడంలో మనమే నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. యువత కేవలం ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా చేయాలని సూచించారు. అమెరికాలో తెలుగువారే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారన్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్టని, సెల్‌ఫోన్ ద్వారా స్కాలర్షిప్ స్టేటస్ చూసుకునే అవకాశం జ్ఞాన భూమి యాప్ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. టీ అమ్ముకునే వ్యక్తి మన దేశానికి ప్రధాని అయ్యారని, యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, విజన్ ప్రకారమే పనలు చేస్తానని తెలిపారు. నేడు మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఉదయానికి మార్చినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది. -
ఆణిముత్యాలకు అండాగా..
-
ప్రతిభ గల పేద విద్యార్థులను చదివిస్తాం
ఓయూ పూర్వవిద్యార్థుల ఫోరం హైదరాబాద్: ఓయూ శతాబ్ది ఉత్సవాలను పురస్క రించుకొని ప్రతిభ గల పేద విద్యార్థులను చదివి స్తామని ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఛైర్మన్ పాపారావు పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిభగల పేద విద్యార్థులను గుర్తించి ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం తరఫున చదివి స్తామన్నారు. ఉత్సవాల ముగింపునకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా మూడురోజులపాటు ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఆధ్వర్యంలో ఉచిత సేవలు అందించనున్నట్లు చైర్మన్ పాపారావు తెలిపారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యే వారికి కలిగే సందేహాలు, ఇతర వివరాలకు 9490747967, 9348812123, 9848125732 నంబర్లకు ఫోన్ చేసి తెలుసు కోవచ్చని చెప్పారు. -
పేద విద్యార్థులను ప్రోత్సహించండి
కోసిగి: ప్రతి ఒక్కరు తమ సంపాదనలో పేద విద్యార్థుల చదువుకు కొంత కేటాయిస్తే మహా పుణ్యం లభిస్తుందని ముస్లిం మైనార్టీ వక్ఫ్‌బోర్డ్ కమిషనర్ ఎస్.ఎండీ ఇక్బాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోసిగిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బాల్యం 10వ తరగతి వరకు కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో సాగినట్లు తెలిపారు. చదువుకున్న పాఠశాల కోసం తమ వంతుగా సాయం చేద్దామని ఉద్దేశంతోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించే ఆపరేటర్‌కు ఏడాది పాటు జీతం రూ.60వేలు విరాళంగా అందించారు. అలాగే రెండు కంప్యూటర్లు, స్పోర్ట్స్ కిట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పలువురు నాయకులు పాఠశాల అభివద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణంలో చెట్లు నాటారు. అలాగే స్థానిక శ్రీ మార్కండేయ స్వామి ఆలయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసి ఉరుకుంద ఈరన్న ఉత్సవాలకు ట్రాఫిక్ లేకుండా సేవలు అందించిన నారాయణ డిగ్రీ , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఆయన అందజేశారు. అనంతరం స్థానిక పెద్ద మసీదు సమీపంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యులు దళవాయి మంగమ్మ, కోసిగి సర్పంచ్ ముత్తురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పెండ్యాల ఆదినారాయణ శెట్టి, తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ వరలక్ష్మి, టీడీపీ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు, సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ ఇంతియాజ్ బాషా, కిద్మతేమిల్లత్ రాష్ట్ర అధ్యక్షులు నవాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం
వైఎస్సార్సీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి రావులపాలెం : కొత్తపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఆయన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు నిధులతో నియోజకవర్గంలోని వేలాది మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు ఇవ్వడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. చిర్ల సోమసుందరరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విద్యార్థులకు ఏడాది కాలానికి ఉచిత బస్సుపాసుల పంపిణీ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహానాయకుడని అన్నారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జగ్గిరెడ్డి తండ్రి పేరుతో చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా సుమారు 3 వేల మందికి ఉచిత బస్సుపాసులు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీలు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు గుడిమెట్ల శారద, కొండేపూడి రామకృష్ణ, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు తేతలి పద్మనాభరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, ప్రచార కార్యదర్శి మసునూరి వెంకటేశ్వరరావు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, మాజీ జెడ్పీటీసీలు అప్పారి విజయకుమార్, బొక్కా వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, ముత్యాల వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
కాస్మోటిక్ చార్జీలు కరువు!
బడులు ప్రారంభమైనా విద్యార్థులకు అందని రూ.62లు యూనిఫాంలకు దిక్కులేదు.. ఇబ్బంది పడుతున్న చిన్నారులు మెదక్: వసతిగృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఇప్పటి వరకు కాస్మొటిక్ చార్జీలు అందలేదు. బడులు తెరచి రెండు నెలలు కావొస్తున్నా ‘సొమ్ము’ అందకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు దాదాపు 150 ఉన్నాయి. వీటిలో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు ప్రభుత్వం అందించే రూ.62లతో సబ్బులు, నూనెలు, హెయిర్ కట్ చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందించడంతో మాసిన దుస్తులు, పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడు పాఠశాలలు ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఫలితంగా చిరిగిన దుస్తులతో తరగతులకు హాజరవుతున్నారు. ఏటా పాఠశాలలు ప్రారంభమైన 10 రోజుల్లోనే అధికారులు యూనిఫామ్స్ అందించేవారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. పాలకులు, అధికారులు వసతిగృహాల్లో నిద్రలు చేసిన పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
పేద విద్యార్థులకు ‘సంజీవని‘ చేయూత
అనంతపురం సెంట్రల్ : పేద విద్యార్థులకు సంజీవని రక్తదాతల సంస్థ చేయూతనిచ్చింది. కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న అనంతసాగర్ కాలనీలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పలకలు, నోట్‌బుక్స్, పెన్నులు తదితర వస్తువులను సంస్థ నిర్వాహకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీకి సీసీగా పనిచేస్తున్న మురళీమోహన్ కుమారుడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ నాగSసరోజినిదేవీ, త్రివేణి, కానిస్టేబుల్స్ కిరణ్, సత్యనారాయణ, శివ, సాయి పాల్గొన్నారు. -
భవిష్యత్తు ప్రశ్నార్థకం
పేద విద్యార్థులకు ప్రభుత్వం షాక్ రేషన్ కార్డుల లేకపోతే సీటు కట్ ఉదయగిరి: ప్రభుత్వం రకరకాల కొర్రీలతో వివిధ సంక్షేమ పథకాలను అర్హులకు దూరం చేసే ప్రక్రియ ప్రారంభించింది. అవకాశం ఉన్న ప్రతిచోట తమ ప్రణాళికను అమలుచేస్తోంది. అందులో భాగంగా ప్రతినెలా జిల్లాలో వందల సంఖ్యలో రేషన్‌కార్డులు ఆన్లైన్ నుంచి దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేకుంటే విద్యార్థులకు వసతి గృహాలలో సీటు ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న అనేకమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల వసతి గృహాల్లో సుమారు 15 వేలమందికి పైగా విద్యార్థులు వసతి పొంది చదువుతున్నారు. ప్రతి ఏటా పెద్దసంఖ్యలో పేద విద్యార్థులు ఈ ప్రభుత్వ వసతి గృహాల్లోనే చేరుతుంటారు. ఇంతవరకు వీరిని వసతిగృహాల్లో సులభంగానే చేర్చుకునేవారు. కానీ గత ఏడాది ఆధార్‌కార్డు ఉంటేనే వసతిగృహాల్లో ప్రవేశం కల్పించారు. కానీ ఈ ఏడాది ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండానే రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని మెలికపెట్టారు. దీంతో జిల్లాలో సుమారు 500 మందికిపైగా పేద విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయా వసతిగృహాల సంక్షేమ అధికారులు విద్యార్థుల్ని చేర్చుకుని భోజనం పెట్టి వసతులు కల్పిస్తున్న తరుణంలో రేషన్‌కార్డు లేకుండా వసతి గృహాలలో ప్రవేశం లేదని ఉన్నతాధికారులు తేల్చేశారు. దీంతో ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పి, వారి పిల్లల్ని తీసుకెళ్లవలసిందిగా చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆర్థికభారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ప్రతినెలా అనేకమంది రేషన్‌కార్డులు తొలగిస్తున్నారని, దీంతో తమ పిల్లలకు ముడిపెట్టడమేమిటని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి షరత్తుల పేరుతో తమ పిల్లలకు చదువులు దూరం చేయవద్దని వేడుకుంటున్నారు. రేషన్‌కార్డు లేకపోతే ఇబ్బందే–రమణారెడ్డి, ఇన్చార్జ్ ఏఎస్డబ్ల్యూఓ, ఉదయగిరి రేషన్‌కార్డులో విద్యార్థుల పేర్లు ఆన్లైన్లో లేకపోతే సీటు ఇవ్వడం లేదు. గతేడాది ఆధార్‌కార్డు ఆధారంగా సీట్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఆధార్‌కార్డు ప్రాతిపదికనే సీట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు తెలియచేశాము. ఆ వివరాలు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందచేశాము. త్వరలో రేషన్‌కార్డు లేకపోయినా, సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనిమీద జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. శాల మేరకు అందచేశాము. త్వరలో రేషన్‌కార్డు లేకపోయినా, సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనిమీద జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాలి -
పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిల పంపిణీ
ఒంగోలు కల్చరల్ : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కమ్యూనిటీ హాలులో ఏర్పాౖటెన కార్యక్రమంలో ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులు 108 మందికి ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు పీవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాయత్రీ విద్యాపథకం ద్వారా ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను అందజేస్తున్నామన్నారు. రూ.1,25,000లు ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ల కింద అందజేసినట్లు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి అందజేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూత అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సేవా సమితి ప్రధాన కార్యదర్శి ధేనువుకొండ వెంకటసుబ్బారావు సేవా సమితి లక్ష్యాలు వెల్లడించారు. కార్యక్రమంలో మహంకాళి వెంకటశేషయ్య, ఎంవీఎస్ శర్మ, సముద్రాల భీమశంకరశాస్త్రి, రంగనాథ్, కామేశ్వరరావు, శివ పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్‌తో పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవా సమితిని వారు అభినందించారు. -
ఎయి'డెడ్' స్కూల్స్
ప్రభుత్వ పాఠశాలలు తగినన్ని లేని రోజుల్లో పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎందరో దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పిన ఎయిడెడ్ పాఠశాలలు నేడు పాలకుల నిర్లక్ష్యానికి కుదేలవుతున్నాయి. ఈ స్కూళ్లలో పోస్టుల భర్తీపై నిషేధం విధించడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆయా పాఠశాలలకు దూరమవుతున్నారు. ఫలితంగా జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. * పోస్టులు భర్తీ చేయక.. పిల్లలు రాక కుదేలు * టీచర్లకు పదోన్నతులు, రేషనలైజేషన్ నిల్ * విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా ఇవ్వని వైనం ఏలూరు సిటీ : ఉన్నతాశయాలతో ఏర్పాటైన ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వ వైఖరితో మూతపడే పరి స్థితి వచ్చింది. పోస్టుల భర్తీపై బ్యాన్ విధించటంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు స్కూళ్లకు దూరమవుతున్నారు. జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేక దీనావస్థకు చేరుకున్నాయి. స్కూళ్లలో పోస్టులు భర్తీ నిలుపుదల, రేషనలైజేషన్ చేయకపోవటంతో టీచర్లు లేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుండగా, ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం సౌకర్యాలు లేకపోగా వేధింపులకు గురవుతున్నారు. 37 యాక్ట్‌తో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సర్వీసంతా కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయిలో సొమ్మును తీసుకునే అవకాశంలేని దుస్థితిలో ఉన్నారు. ఏమిటీ వివక్ష : జిల్లాలో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 240 ప్రాథమిక పాఠశాలలు, 40 ఉన్నత పాఠశాలలు, మరో ఐదు యూపీ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఆర్సీఎం, సీఎస్ఐ, ఐసీఎం, సీబీసీఎన్సీ, హిందూ ధార్మిక సంస్థలు, ముస్లిమ్ మైనార్టీ ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతోన్న పేదవర్గాల పిల్లలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో 17 వేల 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు కనీసం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు. యాక్ట్ 37ను రద్దు చేయాల్సిందే ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర మానసిక వేదన కలిగించే యాక్ట్ 37ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జీవితకాలమంతా ఉపాధ్యాయ వృత్తిలో కష్టపడి పనిచేయగా వచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వం వెనక్కిలాక్కోవటం దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ఎయిడెడ్ సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీసుగా గుర్తించి ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకానికి అర్హత కల్పిస్తూ 1980లో ప్రభుత్వం ఉత్తర్వులతో రెగ్యులర్ సర్వీస్‌తో వేతనాలు పొందుతున్నారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన చట్టం 37తో పరిస్థితులు తిరగబడ్డాయి. ఈ చట్టంతో 1980 నుంచి 2005 మధ్యకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తీసుకున్న రెగ్యులర్ సర్వీస్ వేతనాలను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు తీసుకున్న ఇంక్రిమెంట్ల సొమ్మును సైతం రికవరీ చేయాల్సి రావటంతో పదవీవిరమణ అనంతరం ఉపాధ్యాయులకు చిల్లిగవ్వకూడా మిగిలే పరిస్థితి కన్పించటంలేదు. మూతపడుతున్న పాఠశాలలు ఏలూరులోని డగ్లస్ ఎయిడెడ్ పాఠశాల మూతపడింది. దెందులూరులో ఏళ్ల నాటి నైట్ హైస్కూల్‌ను సైతం మూసివేశారు. శనివారపుపేటలోని సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల విలీనమైంది. ఉంగుటూరు, బుట్టాయిగూడెం, ఆకివీడు, పెనుగొండ పరిసర ప్రాంతాలు, ఉంగుటూరు, మెట్ట ప్రాంతాల్లోని ఎయిడెడ్ విద్యాసంస్థలు పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. సుమారు 100కు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో గుడ్డిలో మెల్లలా నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలలు సైతం దీనావస్థకు చేరుకున్నాయి. ఆకివీడులోని సీబీసీఎన్సీ ఉన్నత పాఠశాల భవనం శిథి లావస్థకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం కోర్టులకు ఎక్కటంతో అభివృద్ధి నిలిచిపోయింది. రేషనలైజేషన్ చేయాలి ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయటంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించే సౌకర్యాలు కల్పించాలి. ఎయిడెడ్ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేయాలి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. - కేజే విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ పాఠశాలలపై వివక్ష ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోంది. యాక్ట్ 37ను వెంటనే రద్దు చేసి, అన్ఎయిడెడ్ సర్వీస్‌కు రక్షణ కల్పించాలి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిషేధం ఎత్తివేయాలి. ఎయిడెడ్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. - టి.కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ -
చదువులతో చెలగాటం
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పాతరేస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నిరుపేద విద్యార్థులకు వరం.. ఫీజు రీయింబర్స్మెంట్. ప్రతిభ ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేని విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతోమంది పేద పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు టీడీపీ ప్రభుత్వం క్రమంగా చాపచుట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ‘కాగ్’ మొట్టికాయలు వేసినా, విద్యార్థులు ఆందోళన చేసినా, ప్రతిపక్షం నిలదీసినా ప్రభుత్వం చలించడం లేదు. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా.. ఫీజు రీయింబర్స్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1,690 కోట్ల బకాయిల చెల్లింపుపై ఇప్పటికీ నోరువిప్పడం లేదు. విసుగెత్తిపోయిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామంటూ అల్టిమేటం జారీ చేశాయి. దీంతో మరో గత్యంతరం లేక విద్యార్థుల తల్లిదండ్రులు అధిక వడ్డీలకుఅప్పులు తెచ్చి ఫీజులు చెల్లించారు. అప్పులు పుట్టని వందలాది మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో.. కోర్సులు పూర్తయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల్లో చేరలేని దుస్థితి దాపురించింది. 1.51 లక్షల మందిపై అనర్హత వేటు * రాష్ట్రంలో ఆర్టీఎఫ్(రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు), ఎంటీఎఫ్(మెయింటనెన్స్ ఛార్జీలు) రూపాల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. * 2015-16లో కొత్తగా 6,61,210 మంది, రెన్యూవల్ కోసం 8,53,216 మంది... వెరసి 15,14,426 మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆర్టీఎఫ్ రూపంలో రూ.1,987.83 కోట్లు, ఎంటీఎఫ్ రూపంలో రూ.571.95 కోట్లు.. మొత్తం రూ.2,559.78 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. * ఉపకార వేతనాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం 1,51,534 మంది విద్యార్థులపై అనర్హత వేటు వేసింది. ఇందులో 34 వేల మంది ఎస్సీలు, 9,870 మంది ఎస్టీలు, 51 వేల మంది బీసీలు ఉన్నారు. * వడపోతల తర్వాత 13,62,892 మందిని అర్హులుగా తేల్చింది. వీరికి ఆర్టీఎఫ్ రూపంలో రూ.1,845.13 కోట్లు, ఎంటీఎఫ్ రూపంలో రూ.448.8 కోట్లు.. మొత్తం రూ.2,293.93 కోట్లు కేటాయించింది. అంటే 1.51 లక్షల మంది విద్యార్థుల కడుపుకొట్టిన ప్రభుత్వం రూ.265.85 కోట్లు మిగుల్చుకుంది. * ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య పెరగడం పరిపాటి. అయినా ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు 13 లక్షల మందికే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తోంది. విద్యార్థులు సంఖ్యను తగ్గించడానికి అడ్డగోలు నిబంధనలను అమల్లోకి తెస్తోంది. నిబంధనల పేరిట విద్యార్థులపై అనర్హత వేటు వేస్తోంది. 2014-15లో దాదాపు 85 వేల మందిపై అనర్హత వేటు వేయగా, 2015-16లో ఏకంగా 1.51 లక్షల మందిని అనర్హులను చేయడం గమనార్హం. కాగ్ కన్నెర్ర చేసినా మొద్దునిద్రే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) పలు సందర్భాల్లో తప్పుపట్టింది. 2012-13లో ఫీజు రీయింబర్స్మెంట్ తీరును ‘కాగ్’ సమీక్షించింది. ఫీజులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నాయని తేల్చింది. దీనివల్ల విద్యార్థుల ఆత్మాభిమానం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2015-16లోనైనా విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు రీయింబర్స్ చేయాలని 2015 ఆగస్టు 7న ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగ్ పదేపదే కడిగిపారేసినా ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం గమనార్హం. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏప్రిల్ నాటికి రూ.1,690 కోట్లు ఉన్నాయి. విద్యార్థులు ఉద్యమాలు చేయడం, ప్రతిపక్షం ఒత్తిడి చేయడంతో ఇటీవల సుమారు రూ.526 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇక 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.60.15 కోట్లను ఇప్పటికీ చెల్లించలేదు. 2016-17 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కనీసం రూ.2,400 కోట్లు అవసరం. అంటే.. మొత్తం రూ.4,150 కోట్లు కావాలి. కానీ, 2016-17 బడ్జెట్లో విద్యార్థుల ఫీజుల కోసం కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. తెలంగాణలో ఏపీ విద్యార్థుల పరిస్థితి ఘోరం తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. విభజన నేపథ్యంలో 2014-15 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం ఏర్పడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ విద్యార్థుల ఫీజులను తామే చెల్లిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మిన 8,432 మంది ఏపీ విద్యార్థులు 2014-15లో హైదరాబాద్‌లో వివిధ కాలేజీల్లో చేరారు. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. 2014-15కు సంబంధించిన ఫీజులను ఏపీ ప్రభుత్వం చెల్లించలేదు. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనూ చంద్రబాబు మళ్లీ అదే హామీ ఇవ్వడంతో 9,444 మంది ఏపీ విద్యార్థులు తెలంగాణలో వివిధ కళాశాలల్లో చేరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తేవడంతో ఫిబ్రవరి 24న తెలంగాణ ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాజ్యాంగంలోని 371(డీ) ఆధారంగా విద్యార్థుల ‘స్థానికత’ను తేల్చి చెల్లించేలా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న సంవత్సరానికి ముందు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఏ రాష్ట్రంలో చదివి ఉంటే ఆ రాష్ట్రమే వారి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడానికి ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి 17,876 మంది విద్యార్థులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ దరఖాస్తులను ప్రభుత్వం కనీసం పరిశీలించకపోవడం గమనార్హం. తెలంగాణ సర్కారు మాత్రం స్థానికత ఆధారంగా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తోంది. ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రైవేట్ కాలేజీలు తేల్చిచెప్పాయి. ఫీజులు చెల్లించని విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో 40 మంది ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. 30 మంది విద్యార్థుల ఫీజులను వారి తల్లితండ్రులు అప్పులు చేసి చెల్లించారు. తాము ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్ష రాసేందుకు యాజమాన్యం అనుమతించడం లేదని మిగిలిన 10 మంది విద్యార్థులు వాపోయారు. రూ.1,690 కోట్ల బకాయిలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2016-17 బడ్జెట్లో రూ.2,400 కోట్ల మేర నిధులు కేటాయించినా.. వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 2015-16 విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా ఫీజు రీయింబర్స్మెంట్, ఎంటీఎఫ్ రూపంలో మొత్తం రూ.1,690 కోట్లు బకాయిపడింది. ఫీజు రీయింబర్స్మెంట్ సగమే ‘‘ఇంజనీరింగ్ ఈ ఏడాదితో పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సగమే వచ్చింది. పూర్తిస్థాయిలో రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. మొత్తం ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ మేనేజ్మెంట్ అంటోంది’’ - సీహెచ్ శిరీషా, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా వడ్డీలకు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్నాం ‘‘ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ సంవత్సరానికి రూ.37,500 చొప్పున ప్రభుత్వం చెల్లించా లి. అయితే ఫీజులను సమయానికి చెల్లించకపోవడంతో కళాశాల వాళ్లు ముందు మమ్మల్ని కట్టమంటున్నారు. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ వస్తే తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం గడువులోగా ఫీజులు చెల్లిస్తేనే మాలాంటి పేదలకు ఉపశమనం కలుగుతుంది’’ - టి.నాగసాయిదొర, ఇంజనీరింగ్ విద్యార్థి, కాకినాడ బకాయిల మాటేంటి? రాష్ట్ర విభజనకు ముందు 2011 నుంచి 2014 నాటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ 58 శాతం, తెలంగాణ 42 శాతం బకాయిలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ సర్కారు బకాయిలను విడుదల చేయడం లేదు. 2011-12, 2012-13, 2013-14లో దాదాపు 40 వేల మంది ఏపీ విద్యార్థులు హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో చేరి చదువులు పూర్తి చేసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో ఏపీ వాటా కింద రూ.285 కోట్లు విడుదల చేస్తే.. తమ వాటా నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కా నీ, ఏపీ సర్కారు నోరువిప్పడం లేదు. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు రాక ఉద్యోగాల్లో చేరలేని దుస్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. -
5 వేల స్కూళ్లకు తాళం!
♦ హేతుబద్ధీకరణ పేరుతో ప్రాథమికోన్నత ♦ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం ♦ 6, 7 తరగతుల స్కూళ్లు సమీప హైస్కూళ్లలో విలీనం! ♦ రాష్ట్రవ్యాప్తంగా 5,475 స్కూళ్లకు ముప్పు ♦ 6 లక్షల మంది విద్యార్థులు, 27,500 టీచర్లపై ప్రభావం ♦ వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ ఊసెత్తని సర్కారు.. మరోపక్క టీచర్ పోస్టుల కుదింపు యత్నం ♦ డ్రాపవుట్లు పెరుగుతాయని అధికారుల ఆందోళన ♦ ప్రభుత్వ చర్యలు ప్రైవేటు పాఠశాలలకు ఊతమిచ్చేలా ఉన్నాయంటున్న ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలకు ఊతమిస్తూ.., ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) అన్న ముసుగు తొడిగింది. ఈ ప్రక్రియతో గత ఏడాది రాష్ట్రంలోని 1,500 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. 10 మందికంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లను పక్కనే ఉన్న మరో స్కూల్లో విలీనం చేశారు. దీనివల్ల పక్క గ్రామాలకు వెళ్లలేని పేద విద్యార్థులు ఉచిత విద్యకు దూరమయ్యారు. ఇప్పుడు రెండో దశ కింద 6, 7 తరగతుల విద్యార్థులుండే ప్రాథమికోన్నత పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారన్న నెపంతో ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను పక్క గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో లేదా హైస్కూళ్లలో (ఉన్నత పాఠశాలల్లో) విలీనం చేయాలని నిర్ణయించారు. ఇదే జరిగితే రాష్ట్రంలో 5,475 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క.. వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీ ఊసెత్తకుండా.. ఉన్న టీచర్ పోస్టులనూ కుదించేలా పావులు కదుపుతోంది. పాఠశాల విద్యలో ప్రాథమిక, ఉన్నత విభాగాలనే ఉంచి, మధ్యలోని ప్రాథమికోన్నత స్కూళ్లను మూసివేయించాలన్నది ప్రభుత్వ విధానమని అధికారులు చెబుతున్నారు. 5,475 ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేస్తే, దాని ప్రభావం దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు, 27,500 మంది టీచర్లపై పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల మూసివేతతో ప్రాథమిక స్థాయిలో డ్రాపవుట్ల సంఖ్య పెరిగి స్కూళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. అలా జరిగితే డ్రాపవుట్లు మరింత పెరుగుతాయని అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఊతమిచ్చేలా: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నా అందులో సరిపడా టీచర్లను నియమిచనందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఇపుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలే మూతపడితే ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివే టులో చేర ్చడం ద్వారా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండో దశలో ప్రాథమిక స్థాయి పాఠశాలలనూ క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. నాలుగైదు పాఠశాలలను విలీనం చేసే పనిలో విద్యా శాఖ ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్య 80 మందికన్నా తక్కువగా ఉంటే సాధారణ ప్రాథమిక పాఠశాలగానే కొనసాగిస్తారు. అంతకుమించి ఉంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా భావించి అదనపు టీచర్లు, భవనాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలలెన్నో: రాష్ట్రంలో మొత్తం 60,456 పాఠశాలలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అందులో ప్రభుత్వ స్కూళ్లు 632, జిల్లాపరిషత్, మండల పరిషత్ స్కూళ్లు 38,587, రె సిడెన్సియల్ స్కూళ్లు 29, మోడల్ స్కూళ్లు 155, కస్తూరిబా బాలికా విద్యాలయాలు 352, మున్సిపల్ స్కూళ్లు 2,116, ఇతర ప్రభుత్వ విభాగాల యాజమాన్యాల్లోని స్కూళ్లు 3,051 ఉన్నాయి. ప్రయివేటు స్కూళ్లు 15,534 ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇది మొత్తం స్కూళ్లలో 25 శాతమే. కానీ ఒకే గుర్తింపు చూపుతూ పలు పాఠశాలలను అనధికారికంగా నిర్వహిస్తున్న సంస్థలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా తెప్పించిన సమాచారం ప్రకారం 2 వేలకుపైగా స్కూళ్లున్నట్లు తేల్చారు. కానీ అంతకన్నా ఎక్కువగానే గుర్తింపులేని పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. -
మట్టిలో మాణిక్యాలు
పేదరికం వెంట వచ్చినా.. ఆర్థిక కష్టాలు వెంటాడినా.. చదువులో మాత్రం వారు మెరిశారు. వారి కష్టానికి మార్కుల రూపంలో ప్రతిఫలం అందుకున్నారు. మట్టిలో మెరిసిన ఈ మాణిక్యాలు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు హైదరాబాద్ విద్యార్థులు కన్నవారి కష్టానికి మార్కుల కానుక.. హిమాయత్‌నగర్: తండ్రి చిన్న కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చదువు విలువ తెలిసినవారు కూతురిని చదివిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆ బాలిక చదువులో రాణించి ఉత్తమ మార్కులు సాధించి కన్నవారికి కానుకగా ఇచ్చింది. ఈసీఐఎల్‌కు చెందిన షేక్ ఖజామియా మాదాపూర్‌లో ఓ పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వస్తున్న తక్కువ వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కుమార్తె షేక్ మస్తానీ హిమాయత్‌నగర్ న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్లో చేరింది. జూనియర్ ఇంటర్లో 420/440 మార్కులు సాధించి శెభాష్ అనిపించుకుంది. డాక్టర్ కావాలనే ఆకాంక్షతో బైపీసీ గ్రూప్‌లో చేరినట్టు తెలిపింది. చాయ్ అమ్ముతూ చదువు.. హిమాయత్‌నగర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో చదువుకునే విద్యార్థి తరగతులు పూర్తవగానే సాయంత్రం తన తండ్రికి సాయంగా చాయ్బడ్డీలో పనిచేస్తాడు. అయితేనేం.. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. హిమాయత్‌నగర్‌లోని న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ 477/500 మార్కులు సాధించాడు. ఇతడి తండ్రి సుల్తాన్‌బజార్‌లో చిన్న చాయ్బడ్డీ నడుపుతున్నాడు. తండ్రి పడే కష్టాన్ని చూడలేని అభిషేక్ కళాశాల అవ్వగానే నాన్నకు సాయంగా దుకాణంలో పనిచేస్తాడు. తన బిడ్డ చదువులో రాణించడంతో కన్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికసించిన విద్యా కుసుమం.. జీడిమెట్ల: అటో డ్రైవర్ కుమార్తె సీనియర్ ఇంటర్ ఎంపీసీలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. తండ్రి పడే కష్టానికి తగిన ఫలితం సాధించాలని కష్టపడి ఈ ఘనతను సొంతం చేసుకుంది. అపురూప కాలనీకి చెందిన అటో డ్రైవర్ శ్రీహరిరాజు కుమార్తె బి.ఎన్.వి. సౌజన్య ఇంటర్ ఎస్ఆర్ నగర్‌లోని నారాయణ కళాశాలలో చదివింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో 988/1000 మార్కులు సాధించింది. పదో తరగతిలో సైతం 10/10 పాయింట్లు సాధించి శభాష్ అనిపించుకుంది. భవిష్యత్తులో ఇంజినీర్ కావాలన్నదే తన ధ్యేయమని సౌజన్య తెలిపింది. -
అ(ఉ)పకారంపై కొనసాగుతున్న విచారణ
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తే.. లేని పేర్లు సృష్టించి అధికారులు కాజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వీరిని హాస్టల్ విద్యార్థులుగా చూపించి లక్షల రూపాలు మింగేశారు. ఆలస్యంగానైనా ఇది కాస్త వెలుగులోకి రావడంతో అవినీతి నిరోధక శాఖాధికారులు నిజాలు వెలికి తీసేందుకు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా దీని సంగతి, వెనుకనున్న పెద్దల సంగతి తేల్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే తప్పులు చేసిన అధికారులు తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలను ఆశ్రరుుంచారని సమాచారం. మరి ఏసీబీ ఎంత వరకు నిజాలను వెలికితీసి అధికారుల భరతం పడుతుందో వేచి చూడాల్సిందే! శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను హాస్టల్ విద్యార్థులుగా చూపిస్తూ ఏటా రూ.లక్షలు కాజేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖాధికారులు రోజంతా విచారణ కొనసాగించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో ఓ బృందం విచారణలో రెండో రోజూ కలెక్టరేట్ చుట్టూ తిరిగింది. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను మంగళవారం నేరుగా కలసిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు సుదీర్ఘంగా చర్చించారు. జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతరావు చాంబరులో ఇన్చార్జి బీసీ సంక్షేమ శాఖాధికారిగా ఉన్న ధనుంజరావును విచారించారు. ఆయన వద్ద రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్కాలర్‌షిప్పుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలరాజును ఉదయం 10నుంచి రాత్రివరకు ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారించారు. 305 మంది విద్యార్థుల సొమ్ము మళ్లింపు... జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో బీసీ విద్యార్థులు గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారని చూపిస్తూ ప్రభుత్వం నుంచి రూ.లక్షలాధిగా నిధులు దారి మళ్లించేశారు. అందులో గిరిజన సంక్షే మ అధికారులతో పాటు బీసీసంక్షేమ శాఖ ఉద్యోగులు భాగస్వాములు కావడంతో ఇటీవల సస్పెండైన గిరిజన సంక్షేమశాఖ అధికారి ఖాతాకు నిధులు మళ్లించారు. ఈ వ్యవహారంలో రెండు శాఖల అధికారులతో పాటు భ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలను వ్యక్తం చేసిన కలెక్టర్ లీడ్ బ్యాంకు మేనేజరు రామిరెడ్డిని పిలిపించి ఖాతాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బిల్లులు ఆన్లైన్లో అందజేస్తే టీబీఆర్ నంబరు జనరేట్ అయ్యింది. దీంతో ట్రెజరీ నుంచి నేరుగా ప్రస్తుత ఎస్టీ హాస్టల్ వార్డెన్‌గా ఉన్న ఝూన్సీ ఖాతాలోకి 305మంది విద్యార్థులకు సంబంధించిన నిధులు జమయ్యాయి. ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.32.02 లక్షలు జమైంది. అంతకు ముందే గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి సస్పెండ్ కావడంతో ఆ నిధులు డ్రా చేసేందుకు అకౌంటు హోల్డర్‌గా ఉన్న ఝూన్సీ ముందుకు రాలేదు. అధికారికే రూ.5 లక్షలు ఇవ్వజూపారు... గత ఏడాది ఇదే వ్యవహారానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలో పర్యవేక్షణాధికారిగా ఉన్న అధికారికి రూ.లక్ష ముడుపుగా అందజేసి ఖాతాలో చేరిన రూ.లక్షలు కాజేశారు. ఈ ఏడాది ప్రభుత్వం ఫిబ్రవరిలో వార్డెన్ ఖాతాకు జమైన రూ.32.02 లక్షలు విత్‌డ్రా చేయడానికి ముందు సదరు అధికారికి రూ.5లక్షలు ముడుపుగా అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు గిరిజన బాలికల వసతిగృహంలో బాలురు ఉన్నట్టు చూపించి నిధులు దారి మళ్లించడం మరో ఆసక్తి గొలిపే అంశం. 305 మంది విద్యార్థుల్లో కొందరు పురుషుల పేర్లు ఉండడంతో సదరు అధికారి ఉలిక్కిపడ్డారు. చేసేదిలేక ఆ అధికారి కలెక్టర్‌కు సమాచారం అందించారు. రాజకీయ పైరవీలు ఉపకార వేతనాలను హాస్టల్ మెస్చార్జీలుగా చూపించి కాజేసేందుకు ప్రయత్నించిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు రాజకీయ పైరవీలకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ పెద్దలకు బంధువులమంటూ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఖాతాలు సృష్టించి నిధులు దారి మళ్లించడమే కాకుండా గిరిజన సంక్షేమ శాఖలో ఓ అధికారికి రూ.5లక్షలు ఇవ్వజూపిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులపై విచారణ ఎప్పటికి మొదలవుతుందో వేచిచూడాలి. అజయ్‌కుమార్‌కు ఓప్రైవేటు కాలేజీలో వాటా? ఈ వ్యవహారంలో ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించి తిరిగి ఆ సొమ్మునే చెక్కుగా మార్చుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి గురైన అజయ్‌కుమార్ పాలకొండ మండలం బుక్కూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కారులో రూ.24లక్షల విలువైన చెక్కును పోలీసులు కనుగొన్నారు. ఇంత మొత్తంలో చెక్కు ఈయన చేతికి ఎలా చిక్కిందన్నది ప్రశ్న. అజయ్‌కుమార్ పాలకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో వాటాదారునిగా ఉన్నట్టు చెబుతున్నారు. చెక్కు ఇచ్చిన అధికారి సస్పెన్షన్‌లో ఉండడంతో ఆ దిశగా పోలీసు విచారణ మొదలైంది. అజయ్‌కుమార్ నోరు విప్పితే అసలు నిందితులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ తనిఖీలు శ్రీకాకుళం టౌన్ : పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను స్వాధీన పరచుకుని పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను వెల్ఫేర్ అధికారికి ప్రభుత్వం కేటాయించిన బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఆ ఖాతాలో గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన డైట్ బిల్లులను మార్చి నెలలో ప్రభుత్వం చెల్లించింది. జూన్ నుంచి మార్చి నెల వరకు ఆ ఖాతాకు ఇతర నిధులేవీ చేరే అవకాశం ఉండదు. కాని ఈ ఖాతాలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్టేట్ బ్యాంకు నుంచి లావాదేవీలను సేకరించిన డీఎస్పీ రంగరాజు వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది. -
‘వసతి’కి ఎసరు!
హాస్టళ్లను దశలవారీగా మూసివేస్తున్న సర్కారు ఇప్పటికే 22 మూసివేత మరో 20 మూసివేసేందుకు రంగం సిద్ధం విద్యార్థులకు శాపంగా మారనున్న ప్రభుత్వ నిర్ణయంస పిఠాపురం : నిరుపేద విద్యార్థుల చదువుకు తోడ్పడుతున్న సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం ఎసరు పెడుతోంది. వాటిని దశల వారీగా మూసివేస్తూ.. పేదలకు చదువును దూరం చేస్తోంది. వార్డెన్‌కు సైతం తెలియకుండా ‘వసతి’కి ప్రభుత్వం ఎసరు పెడుతున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాస్తవానికి వసతి గృహాలను దశలవారీగా మూసివేసే పనికి ప్రభుత్వం గత ఏడాదే శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఎస్సీ వసతి గృహాలను మాత్రమే మూసివేయగా దానిని ఈ ఏడాది ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా విస్తరించింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 94, బీసీ సంక్షేమ వసతి గృహాలు 120 ఉన్నాయి. వీటిలో సుమారు 9400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గత ఏడాది 22 సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ వసతి గృహాలను మూసివేయగా, ఈ ఏడాది మరో 20 ఎస్సీ, బీసీ వసతి గృహాలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో సుమారు 1500 మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి వేలితోనే వారి కన్ను పొడిచేలా.. వార్డెన్ల వేలితోనే వారి కన్ను పొడిచేలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. జిల్లాలోని హాస్టళ్లలో గత మూడేళ్లకు సంబంధించిన విద్యార్థుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తక్కువగా (వందలోపు) ఉన్న హాస్టళ్లను వెంటనే మూసివేయాల్సిందిగా ఆయా వార్డెన్లే అభ్యర్థించినట్లుగా నివేదికలను మారుస్తూ, వాటిని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవ్వరికీ అనుమానం రానివిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్లినప్పుడు ఈ తతంగం చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర శాఖలకు వార్డెన్ల బదిలీ! మూసివేసే హాస్టళ్ల వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎవరు ఏ శాఖకు వెళతారో ఆప్షన్ ఇవ్వాల్సిందిగా వార్డెన్లను అధికారులు ఆదేశిస్తున్నారు. కొందరు గ్రామ కార్యదర్శులుగానూ మరికొందరు వీఆర్ఓలుగాను వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. వీధిన పడనున్న సిబ్బంది కుటుంబాలు హాస్టళ్ల మూసివేత పుణ్యమా అని.. వాటిల్లో పని చేసే ఆయాలు, వాచ్మన్లు, వంటపనివారు, సహాయకులు సుమారు 120 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ సిబ్బంది వాపోతున్నారు. క్రమబద్ధీకరణ మాత్రమే.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట హాస్టళ్లను మూసివేస్తున్నాం. అలాగే, అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలను మూసివేసి, అక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉన్న హాస్టళ్లలో ఆ విద్యార్థులకు వసతి కల్పిస్తాం. వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియ ఏదీ చేపట్టలేదు. ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి తదుపరి చర్యలుంటాయి. అన్ని హాస్టళ్లూ మూసివేస్తారన్న దానిలో నిజం లేదు. - ఎంసీ శోభారాణి, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ, కాకినాడ మాకు ఇబ్బందే.. మా అమ్మానాన్న నిరుపేదలు. వాళ్లు చదువు చెప్పించలేని పరిస్థితుల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నాలాగే చాలామంది వసతి గృహాల వల్లే చదువుకుంటున్నారు. వీటిని మూసివేస్తే మాకు ఇబ్బందే. - ఆర్.పవన్‌కుమార్, విద్యార్థి, ఉప్పాడ హాస్టళ్లే దొరికాయా? పేద విద్యార్థులకు విద్యనందించడానికి ఉద్దేశించిన హాస్టళ్లే దొరికాయా మూసివేయడానికి? ఎటువంటి ప్రయోజనం లేని పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. అంతేకానీ మాలాంటి నిరుపేదల ఆసరాను తొలగించడం చాలా అన్యాయం. - సీహెచ్ చిన్న, విద్యార్థి, ఉప్పాడ -
డబ్బులివ్వరూ..
♦ బీసీ ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు 32,646 మంది ♦ ఫీజులకు రూ.46 కోట్లు అవసరమైతే వచ్చింది రూ.29 కోట్లు ♦ ఈబీసీ ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు 20,437 మంది ♦ ఫీజులకు రూ.40 కోట్లు అవసరమైతే వచ్చింది రూ.19 కోట్లే ♦ విద్యా సంవత్సరం ముగింపులో విద్యార్థుల అవస్థలు కడప రూరల్ : నిరుపేద విద్యార్థులకు ఫీజు మంజూరు చేయడంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారం వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్యా సంవత్సరం ముగు స్తున్నా ఫీజు సొమ్ము పూర్తిగా విడుదల చేయక పోవడంతో రెన్యూవల్ విద్యార్థులపై ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిరుపేద బీసీ, ఈబీసీ విద్యార్థులు 2015-16 విద్యా సంవత్సరానికి అనుమతి పొందిన 487 కళాశాలల్లో ఫీజుల పథకం కింద విద్యను అభ్యసిస్తున్నారు. కీలకమైన విద్యా సంవత్సరం ముగింపు దశలో అరకొరగా ఫీజులు మంజూరు కావడంతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు మానసిక వేదనకు లోనవుతున్నారు. వివిధ కోర్సుల్లో కొత్తగా చేరిన బీసీ విద్యార్థులు 13,318 మంది, రెన్యూవల్ 19,328 మంది కలిపి మొత్తం 32,646 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కాలేజీ ఫీజులకు మొత్తం రూ.46 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.29 కోట్లు వచ్చింది. ఇంకా రూ.17 కోట్లు రావాల్సి ఉంది. మొత్తం 32,646 మంది విద్యార్థుల్లో ఫ్రెషర్స్ 11,459 మందికి 50 శాతం 17,243 మంది రెన్యూవల్స్ విద్యార్థులకు 75 శాతం ఫీజులను మొత్తం 28,702 మందికి మంజూరు చేశారు. స్కాలర్షిప్పులకు సంబంధించిన రూ.14 కోట్లు మంజూరు చేసింది. ఫీజులకు సంబంధించి ఆయా కళాశాలల పరిధిలో 3,944 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ లేని కారణంగా డబ్బులు విడుదల కాలేదు. ఈబీసీలకు మంజూరు చేసింది రూ.19 కోట్లే ఈబీసీలు ఫ్రెషర్స్ 7011 మంది, రెన్యూవల్స్ 13,428 మంది కలిపి మొత్తం 20,439 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కాలేజీ ఫీజులకు రూ.40 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.19 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం 20,439 మంది విద్యార్థులకుగాను ఫ్రెషర్స్ 1824 మందికి 50 శాతం, రెన్యూవల్ విద్యార్థులు 1044 మందికి 75 శాతం ఫీజులను మంజూరు చేశారు. తాజాగా ఐదు వేల దరఖాస్తులు ఫుల్ షేప్‌లో కార్యాలయానికి వచ్చాయి. వివిధ కళాశాలల నుంచి 3057 మంది దరఖాస్తులు రావాల్సి ఉంది. బడ్జెట్ లేని కారణంగా కొత్త విద్యార్థులకు ప్రయోజనం చేకూరడం అనుమానమే. విద్యార్థులకు ఫీజుల పరీక్ష విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిందంటే ముఖ్యంగా రెన్యూవల్ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఈ దశలో ఆయా కళాశాలల యాజమాన్యాలు మిగిలిన ఫీజు చెల్లించమని ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. అలా విద్యార్థులపై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ఫలితంగా నిరు పేద విద్యార్థులు అటు ఫీజు చెల్లించలేక, ఇటు యాజమాన్యాల పోరును భరించలేక అవస్థలకు గురవుతున్నారు. -
నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం
విజయనగరం టౌన్ : నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఏటా ఆర్థిక సాయం అందిజేస్తామని ప్రముఖ సంపాదకుడు, రచయిత దివంగత కె.ఎన్.వై.పతంజలి సతీమణి ప్రమీల తెలిపారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పతంజలి స్ఫూర్తి పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్టు, వ్యంగ్యరచయిత జి.ఆర్.మహర్షికి మంగళవారం అందజేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమీల మాట్లాడుతూ ఈ ఏడాది స్ఫూర్తి పురస్కారం మహర్షికి అందివ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. అవార్డు గ్రహీత మహర్షి మాట్లాడుతూ పతంజలి రచనలన్నీ సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చే బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి మనుషుల జీవితాల నుంచి వచ్చినవేనని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్య అతిధిగా జెడ్పీ సీఈఓ గనియా రాజకుమారి మాట్లాడుతూ 35 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన పతంజలి అందరికీ స్పూర్తిదాయకమన్నారు. అనంతరం కెఎన్‌వై పతంజలి - సాహిత్యం అనే అంశంపై ప్రసాదవర్మ (విశాఖ) మాట్లాడుతూ మనుషులు మనుషులుగానే ఉండాలి. వారి మధ్య అసమానతలు అనేవి ఉండరాదని పతంజలి తన కథల్లో చూపించగలిగారన్నారు. జి.ఆర్.మహర్షి - సాహిత్యంపై ఎన్.కె.బాబు ప్రసంగించారు. భీశెట్టి బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగెస్సుల రాజు, చాగంటి తులసి, రంగారావు, కృష్ణాజీ, పివి.నరసింహరాజు పాల్గొన్నారు.