రెండు ప్రయత్నాల్లో పాస్ కావాల్సిందే.. | Two attempts to pass the pin .. | Sakshi
Sakshi News home page

రెండు ప్రయత్నాల్లో పాస్ కావాల్సిందే..

Published Tue, Feb 4 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

రెండు ప్రయత్నాల్లో ఉత్తీర్ణత సాధించాలంటూ కేంద్ర ఉపాధి కల్పన శాఖ విధిం చిన నిబంధనతో పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదం కనపడుతోంది.

  •      ఐటీఐ విద్యార్థులకు ఈ ఏడాది నుంచే సెమిస్టర్ల విధానం
  •      కేంద్ర ఉపాధి కల్పన శాఖ నిర్ణయం
  •  పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : రెండు ప్రయత్నాల్లో ఉత్తీర్ణత సాధించాలంటూ కేంద్ర ఉపాధి కల్పన శాఖ విధిం చిన నిబంధనతో పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదం కనపడుతోంది. సెమిస్టర్ విధానాన్ని అమలుచేస్తూ.. రెండు ప్రయత్నాల్లో పాస్ కాకుం టే ఇంటికి పంపించాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. సాధారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా తక్షణ ఉపాధి కోసం ఐటీఐల్లో చేరుతారు. ఇంటర్ ఫెయిల్ అయిన వారు, తక్కువ మార్కులు వ చ్చిన వారు కూడా ఐటీఐవైపే మొగ్గుచూపుతారు. అయి తే, కేంద్ర ఉపాధి కల్పన శాఖ తీసుకున్న డిటెన్షన్ విధానంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు.
     
    ఏడాదికోసారి కాకుండా సెమిస్టర్ల వారీగా
     
    జిల్లాలో 39 ఐటీఐ కళాశాలలు ఉండగా వీటిలో ఆరు ప్రభుత్వ, 33 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, తదితర ట్రేడ్లు సాగుతున్నాయి. రెండేళ్లు, ఏడాది కోర్సులు ఉం డగా, ఏడాదికోసారి ఐదు సబ్జెక్టుల పరీక్షలు ఐదు రోజులు జరిగేవి. ప్రస్తుతం సెమిస్టర్ విధానం ద్వారా ఆరు నెలలకోసారి రెండేళ్ల కోర్సు విద్యార్థులు నాలుగు సార్లు ఇరవై పేపర్లను, ఏడాది కోర్సు విద్యార్థులు రెండుసార్లు పది పేపర్ల పరీక్షలు రాయాలి.
     
    నిబంధన ఇలా....
     
    ఇప్పటి వరకు ఐటీఐ విద్యార్థులు మూడేళ్ల లోపు అంటే ఆరు లేదా ఏడు ప్రయత్నాల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానం ద్వారా ప్రతీ సబ్జెక్ట్‌ను రెండు సెమిస్టర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి సెమిస్టర్ ఉత్తీర్ణత సాధించినా, కాకున్నా రెండో సెమిస్టర్‌కు అనుమతించాలని నిర్ణయించిన కేంద్ర ఉపాధి కల్పన శాఖ మూడో సెమిస్టర్‌లోకి ప్రవేశించాలంటే మాత్రం మొదటి సెమిస్టర్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన విధించింది.
     
    రేపటి నుంచి ప్రాక్టికల్స్....
     
    నూతనంగా ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంలో ఈనెల 5వ తేదీ నుంచి ప్రాక్టికల్స్, 25వ తేదీ నుంచి థియరీ ప రీక్షలు నిర్వహించనున్నారు. కాగా, సెమిస్టర్ విధానం తో ప్రైవేట్ ఐటీఐ కళాశాలల ఆగడాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. గతంలో ప్రవేశాలు లేకుండానే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ఐటీఐ పరీక్షలు రాయించేవారు. దీనికోసం వేలాది రూపాయలు వసూలు చేశారనే విమర్శలున్నాయి. సెమిస్టర్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
     
     నాలుగు అవకాశాలు ఇస్తే...
     సెమిస్టర్ విధానం బాగానే ఉంది. కానీ రెండు ప్రయత్నాల్లో పరీక్ష ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు చదువు మానేయాల్సి వస్తుంది. దీన్ని నాలుగు ప్రయత్నాలకు పెంచితే వారికి మేలు కలుగుతుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించాం.
     - అరుణ్‌కుమార్, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement