ఇంగ్లిష్‌ మీడియం జగన్‌ విజన్‌ | english medium jagan vision: English studies for poor students in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీడియం జగన్‌ విజన్‌

Published Sat, Apr 13 2024 5:38 AM | Last Updated on Sat, Apr 13 2024 5:38 AM

english medium jagan vision:   English studies for poor students in andhra pradesh - Sakshi

ఇదీ జగన్‌ బ్రాండ్‌ గవర్నెన్స్‌  

పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్‌ చదువులు 

ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌  

పిల్లలు అంతర్జాతీయంగా రాణించేలా ‘టోఫెల్‌’ శిక్షణ 

సంపన్నుల పిల్లలకే పరిమితమైన ఐబీ విద్య మన స్కూళ్లలో..  

ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ 

అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్‌ పాఠ్యపుస్తకాల రూపకల్పన 

ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియామకం 

నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ 

► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి..  
► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. 
► కేవలం కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా?  
► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా..  
► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు.  
► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు.  
► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం బోధన.. 
► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ విధానం.. 
► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌  
► 2025 జూన్‌ నుంచి ఐబీ సిలబస్‌ 
► మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్‌ బోధన’’ – సాక్షి, అమరావతి 

బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు 
విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్‌ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్‌ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్‌ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్‌ కెపాసిటీ బిల్డింగ్‌’ శిక్షణ ఇచ్చారు.

ఇందుకోసం ఇఫ్లూ, రివర్‌సైడ్‌ లెరి్నంగ్‌ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్‌ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది.  

డిజిటల్‌ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌ల పంపిణీ  

ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీల ఏర్పాటు

విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్‌ టెక్‌ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్‌ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్‌ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది.

డిజిటల్‌ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్‌ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్‌ చానెళ్లు, యూట్యూబ్‌ చానెల్‌ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్‌ క్లియరెన్స్‌ బాట్‌’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌, టోఫెల్‌ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది.  

మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్‌ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్‌ ఇమేజ్‌ విధానంలో ముద్రించి బైలింగ్వుల్‌ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్విసెస్‌ (ఈటీఎస్‌)తో టోఫెల్‌ శిక్షణ అందిస్తోంది.

టోఫెల్‌ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్‌ జూనియర్‌లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్‌ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్‌ 12)న జరిగిన టోఫెల్‌ జూనియర్‌ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు.  

ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య
మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్‌ మీడియం బోధన, సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్‌ క్లాస్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్‌ నుంచి ప్రారంభం కానుంది.

తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్‌. లేటరల్, డిజైన్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాలి్వంగ్‌ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్‌ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.  

మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు 
► ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కితాబు..’’ 
► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌’’ 
​​​​​​​►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్‌ –నికోబార్, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ 
​​​​​​​►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ 

సీబీఎస్‌ఈ బోధన 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్‌ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్‌లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసింది.

292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్‌ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్‌ జూనియర్‌ కళాశాలలను బాలికల జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement