అక్షరాలా చెదిరిన రాజముద్ర | Education sector totally down ruled by present rulers | Sakshi
Sakshi News home page

అక్షరాలా చెదిరిన రాజముద్ర

Published Tue, Apr 8 2014 2:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

అక్షరాలా చెదిరిన రాజముద్ర - Sakshi

అక్షరాలా చెదిరిన రాజముద్ర

* ఎవరి హయాంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు
* వైఎస్ హయాంలో వికసించిన విద్యారంగం
* తరువాతి పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన వైనం

 ‘ప్రపంచాన్నే మార్చడానికి ఉపయోగపడగల అత్యంత శక్తిమంతమైన ఆయుధం విద్య’
 - నెల్సన్ మండేలా
 
చింతకింది గణేష్: విద్యారంగ అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మి ఆచరించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. పేద విద్యార్థుల ఉన్నత విద్య కలను నిజం చేసేందుకు, విద్యావకాశాలను అన్ని వర్గాల ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. తన హయాంలో 18 విశ్వవిద్యాలయాలు, 6 వేల సీట్లతో ట్రిపుల్ ఐటీలతో పాటు 6,500 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఆయన కన్నా ముందు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలో దిక్కూమొక్కూ లేక నీరసించి ఉన్న విద్యారంగంలో జవసత్వాలు నింపారు.
 
 * పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు.
 * గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అందించే లక్ష్యంతో సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ స్కూళ్లలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే 99 శాతం ఉంటారు. కాబట్టి 9, 10 తరగతుల్లోని 21 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వర్తింపజేశారు.
 
 వైఎస్ జగన్ ఆలోచనలు..

*     నిరుపేదలకు  ఉన్నత విద్యను అభ్యసించడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం
*     మహిళల కోసం మరిన్ని విద్యా సంస్థలను ప్రత్యేకంగా నెలకొల్పడం
 *    వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 6,500 సక్సెస్ స్కూళ్లను విజయవంతం చేయడం
 *    స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం
 *    రాష్ర్టంలో అంతర్జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం
 
  వైఎస్ హయాంలో స్థాపించిన వర్సిటీలు

 

యూనివర్సిటీ ఆయన పుణ్యమే
 విద్యకు పెద్దపీట వేసింది వైఎస్సారే. గతంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారికి మాత్రమే పెద్ద చదువులు ఉండేవి. ఎస్సెస్సీ, ఇంటర్‌తో చదువులాపేసే పేద విద్యార్ధి కూడా ఇప్పుడు ఉన్నత చదువులు చదువు తున్నాడంటే అది వైఎస్ పు ణ్యమే. తెలంగాణ యూనివ ర్సిటీని నిజామా బాద్‌లో నెలకొల్పిన ఆయన కృషి మరవలేనిది. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని భావించిన రాజశేఖరరెడ్డి విద్యారంగం అభివద్దికి బాటలు వేశారు.
 -పులి జైపాల్, ఖలీల్‌వాడి, నిజామాబాద్
 
 అంతా వైఎస్ చలవే
 వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు.  ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పారు. దీనివల్ల డాక్టర్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు పేద విద్యార్థులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విద్యార్థులను నిర్లక్ష్యం చేశాయి.    జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ఉద్యోగావకాశాలు మళ్లీ మెరుగుపడతాయి.
 - అంజలయ్య,  మహబూబ్‌నగర్   
 
 ప్రైవేటుకు ధారాదత్తం
*     విద్యను బాబు వ్యాపారంగా మార్చారు. పేద విద్యార్థులకు దాన్ని ఒక కలగా మిగిల్చారు.
*     రేషనలైజేషన్ (క్రమబద్ధీకరణ) సాకుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎత్తేశారు.
*     భారీ సంఖ్యలో ఖాళీలు పేరుకుపోయినప్పటికీ ఉపాధ్యాయుల నియామ కాలను సక్రమంగా చేపట్టలేదు.
*     కొత్త ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటును పట్టించుకోలేదు.
*     పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా చేశారు.
*    స్కాలర్‌షిప్‌ల మంజూరులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు.
*     విద్యా రంగంలో కూడా కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టారు.
*     టీచర్లకు, లెక్చరర్లకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వలేదు.
*     చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు 3 మాత్రమే.
 
 చదువుల తల్లికి నీరాజనం
*     ఉన్నత విద్యను వికేంద్రీకరించే ఉద్దేశంతో మొత్తం 18 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు.
*     అనేక డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం అందించారు.
*     జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు తోడ్పాటునందించారు.
*     అంతర్జాతీయ స్థాయి కలిగిన హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ పిలానీ వంటి సంస్థల ఏర్పాటుకు చొరవ చూపారు.
 
 సక్సెస్ స్కూళ్లు
*      6,500 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసి, 6 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్య అందించారు.
*     అన్ని స్థాయిల్లోనూ డ్రాపవుట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
 మధ్యాహ్న భోజనం
*     కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా, దానిని 9, 10 తరగతులకు కూడా వైఎస్ వర్తింపజేశారు.
*     ఇందుకు ఏటా అయ్యే ఖర్చు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు.
 
 ట్రిపుల్ ఐటీలు
*     గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో ఏపీ ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు.
*     రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాల యాన్ని  ఏర్పాటు చేసి దాని నేతృత్వంలో తెలంగాణలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, కోస్తాంధ్రలోని నూజి వీడులో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు.
*     ఒక్కో క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌కు సంబం ధించి 2,000 సీట్లను అందుబాటులోకి తెచ్చారు.
 
 అంతులేని నిర్లక్ష్యం
*     విద్యా రంగంపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు.
*     ఫీజుల పథకాన్ని ఎత్తివేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.
*     ట్రిపుల్ ఐటీల్లోని ఒక్కో క్యాంపస్‌లో 1000 చొప్పున 3000 సీట్లను గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేశారు.
*     బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీల్లో నిధుల కొరత సాకుతో సీట్ల సంఖ్యను సగానికి తగ్గించారు.
*     వైఎస్ తర్వాత రాష్ర్టంలో చెప్పుకోదగ్గ ప్రభుత్వ విద్యా సంస్థ ఒక్కటీ రాలేదు.
*     సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం టీచర్లను నియమించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైఎస్ హయాంలో ప్రారంభమైన వర్సిటీల అభివృద్ధికి ప్రయత్నించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement