పార్వతీపురం (విజయనగరం) : పార్వతీపురంలోని కెనరాబ్యాంక్ శాఖ నిరుపేద విద్యార్థులకు నగదు సాయం అందించింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లోని పేద విద్యార్థులకు కెనరా బ్యాంక్ మేనేజర్ ఎ.రవికుమార్ శుక్రవారం రూ.22,500 నగదును అందించారు. పేదరికంతో బాధపడకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు.