
వాహనాలను ప్రారంభిస్తున్న సజ్జల, ఎమ్మెల్సీ మురుగుడు తదితరులు
మంగళగిరి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో నాడు–నేడుతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి– తెనాలి రోడ్డులోని ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫాండేషన్‌కు దాతలు అందజేసిన మధ్యాహ్న భోజన రవాణా వాహనాలను గురువారం ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. వంటశాలను భోజనం తయారీ నాణ్యతను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడంలో అక్షయపాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్‌ప్రెసిడెంట్ వంశీధరదాసు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అక్షయపాత్రకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. దాతలు ఫ్రీడమ్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ సహకారంతో వాహనాలను అందించారు. అక్షయపాత్ర కో–ఆర్డినేటర్ విలాస విగ్రహదాస, ఐటీ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, అగవతరప్పాడు సర్పంచ్ మురళీకృష్ణారెడ్డి అక్షయపాత్ర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment