
సాక్షి,గుంటూరు: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట దక్కింది. ఇద్దరు నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.