Sajjala Bhargava Reddy
-
ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ
-
సజ్జల భార్గవ్ క్వాష్ పిటిషన్.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.అంతకుముందు.. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు.ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది. ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట ...
-
సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట లబించింది. భార్గవరెడ్డికి రెండు వారాలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో వాదనలు వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది.కాగా టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులపై సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సజ్జల భార్గవ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడ్డారని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించి వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై రెండు వారాల్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా ఉండాలని పేర్కొంది. -
‘మూడో వ్యక్తి కంప్లయింట్ చేస్తే కేసు పెడతారా?’
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.ఇక.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు.. బాపట్ల కోర్టులో వర్రా రవీందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘ఏ కేసులో మిమ్మల్ని అరెస్టు చేశారో తెలుసా?’’ అని రవీందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. అయితే.. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు తనకు ఇవ్వలేదని రవీందర్‌రెడ్డి చెప్పారు. దీంతో.. పోలీసులను న్యాయమూర్తి మందలించారు. అలాగే.. వర్రాకు వచ్చే నెల 13వ తేదీదాకా రిమాండ్ విధించారు.