పేద విద్యార్థులకు అండగా ఉంటాం
Published Sun, Sep 1 2013 1:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:నిరుపేద విద్యార్థులకు అండ గా ఉంటామని రాష్ర్ట రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి రమణ తెలిపారు. తిరువళ్లూరులోని జిల్లాలోని వెల్లియూర్, కాకలూరు, సెవ్వాపేట తదితర ప్రభుత్వ పాఠశాల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేసే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా పూందమల్లి శాసనసభ్యుడు మణిమారన్, రాష్ట్ర మంత్రి రమణ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. 549 మంది నిరుపేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి రమణ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, పరిశోధనలకు వారిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న ల్యాప్‌టాప్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని నూతన పరిశోధనలపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ విద్యాశాఖకు పూర్తి స్థాయిలో నిధులను కేటాయించినట్టు ఆయన తెలిపారు. పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ సెల్వకుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement