Minister Ramana
-
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించండి: మంత్రి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర మంత్రి రమణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కల్యాణకుప్పం గ్రామంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. సమావేశానికి యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ, విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే మణిమారన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రమణ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని డీఎంకే పార్ట్టీ, కరుణానిధి కుటుంబం దోచుకుని వందేళ్ల అభివృద్ధిలో వెనక్కు నెట్టారని ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లోప్రకటించిన హామీలను నిలబెట్టుకునే విధంగా వాటికి కట్టుబడి వుంటామని రమణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ఆదర్శవంతమైన పాలన అందిస్తే, డీఎంకే అవినీతివంతమైన పాలన అందించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరిస్తే తాము మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రమణ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని డీఎంకే కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి అన్నాడీఎంకే పార్టీ నేతలతో పాటు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రమణ సూచిం చారు. తిరువళ్లూరు జిల్లా పూండిలో ఉచిత వైద్యశిబిరం, నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ చైర్మన్ అమ్ము మాధవన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే పథకాలు ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. నిరుపేదలకు అన్ని విధాల అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. వందశాతం మంది ప్రజలకు ఏదో రూపంలో సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని సూచించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్షపాతం లేకుండా అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఇప్ప టి వరకు దాదాపు 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను సరైన రీతిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు అండగా ఉంటాం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:నిరుపేద విద్యార్థులకు అండ గా ఉంటామని రాష్ర్ట రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి రమణ తెలిపారు. తిరువళ్లూరులోని జిల్లాలోని వెల్లియూర్, కాకలూరు, సెవ్వాపేట తదితర ప్రభుత్వ పాఠశాల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేసే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా పూందమల్లి శాసనసభ్యుడు మణిమారన్, రాష్ట్ర మంత్రి రమణ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. 549 మంది నిరుపేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి రమణ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, పరిశోధనలకు వారిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న ల్యాప్‌టాప్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని నూతన పరిశోధనలపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ విద్యాశాఖకు పూర్తి స్థాయిలో నిధులను కేటాయించినట్టు ఆయన తెలిపారు. పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ సెల్వకుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.