భవిష్యత్తు ప్రశ్నార్థకం
-
పేద విద్యార్థులకు ప్రభుత్వం షాక్
-
రేషన్ కార్డుల లేకపోతే సీటు కట్
ఉదయగిరి: ప్రభుత్వం రకరకాల కొర్రీలతో వివిధ సంక్షేమ పథకాలను అర్హులకు దూరం చేసే ప్రక్రియ ప్రారంభించింది. అవకాశం ఉన్న ప్రతిచోట తమ ప్రణాళికను అమలుచేస్తోంది. అందులో భాగంగా ప్రతినెలా జిల్లాలో వందల సంఖ్యలో రేషన్‌కార్డులు ఆన్‌లైన్ నుంచి దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేకుంటే విద్యార్థులకు వసతి గృహాలలో సీటు ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న అనేకమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల వసతి గృహాల్లో సుమారు 15 వేలమందికి పైగా విద్యార్థులు వసతి పొంది చదువుతున్నారు. ప్రతి ఏటా పెద్దసంఖ్యలో పేద విద్యార్థులు ఈ ప్రభుత్వ వసతి గృహాల్లోనే చేరుతుంటారు. ఇంతవరకు వీరిని వసతిగృహాల్లో సులభంగానే చేర్చుకునేవారు. కానీ గత ఏడాది ఆధార్‌కార్డు ఉంటేనే వసతిగృహాల్లో ప్రవేశం కల్పించారు. కానీ ఈ ఏడాది ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండానే రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని మెలికపెట్టారు. దీంతో జిల్లాలో సుమారు 500 మందికిపైగా పేద విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయా వసతిగృహాల సంక్షేమ అధికారులు విద్యార్థుల్ని చేర్చుకుని భోజనం పెట్టి వసతులు కల్పిస్తున్న తరుణంలో రేషన్‌కార్డు లేకుండా వసతి గృహాలలో ప్రవేశం లేదని ఉన్నతాధికారులు తేల్చేశారు. దీంతో ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పి, వారి పిల్లల్ని తీసుకెళ్లవలసిందిగా చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆర్థికభారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ప్రతినెలా అనేకమంది రేషన్‌కార్డులు తొలగిస్తున్నారని, దీంతో తమ పిల్లలకు ముడిపెట్టడమేమిటని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి షరత్తుల పేరుతో తమ పిల్లలకు చదువులు దూరం చేయవద్దని వేడుకుంటున్నారు.
రేషన్‌కార్డు లేకపోతే ఇబ్బందే–రమణారెడ్డి, ఇన్‌చార్జ్ ఏఎస్‌డబ్ల్యూఓ, ఉదయగిరి
రేషన్‌కార్డులో విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌లో లేకపోతే సీటు ఇవ్వడం లేదు. గతేడాది ఆధార్‌కార్డు ఆధారంగా సీట్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఆధార్‌కార్డు ప్రాతిపదికనే సీట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు తెలియచేశాము. ఆ వివరాలు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందచేశాము. త్వరలో రేషన్‌కార్డు లేకపోయినా, సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనిమీద జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. శాల మేరకు అందచేశాము. త్వరలో రేషన్‌కార్డు లేకపోయినా, సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనిమీద జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాలి