పేదల పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగిపోతారనే భయమో... ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందనే ఆందోళనో తెలియదు కానీ ఇంగ్లిష్ మీడియం పేరు చెబితే చాలు ప్రతిపక్ష నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ‘మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకోవాలి. పేద బిడ్డలు మాత్రం తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశా లల్లోనే చదవాలి’ అన్నట్లుగా ప్రతిపక్ష నేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సహించలేక దుష్ప్రచారానికి తెగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి మేరకు ప్రతిపక్షం ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘తెలుగు నుడి’ అంటూ మాట్లాడుతున్న పవన్ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. టీడీపీ, జనసేనలో కీలక నేతలంతా తమ పిల్లల్లో ఒక్కరిని కూడా తెలుగు మీడియంలో చదివించకపోవడం గమనార్హం. ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వివరాలు ఇవిగో..
– సాక్షి, అమరావతి
- నారా లోకేశ్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఇంగ్లిష్ మీడియంలో, అమెరి కాలోని స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో చది వారు. ఆయన కుమారుడు దేవాన్‡్షను హైద రాబాద్‌లోనే ఇంగ్లిష్ మీడియలో చేర్చారు.
- టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు కుమారుడు రామ్‌మల్లిక్ ఇంటర్ వరకు హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి అమెరికాలో ఎంబీఏ చేశారు. కుమార్తె అను హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలోనే చదివి ఎంబీబీఎస్ చేశారు.
- కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెలు అదితి, విద్యావతి విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివారు.
- టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇద్దరు కుమారులు అమెరికాలో చదువుకున్నారు.
- ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. అమెరికాలో బీటెక్, ఎంబీఏ చేశారు.
- టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు రాజగోపాల్‌రెడ్డి నెల్లూరులోని నారాయణ, రత్నం విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. నారాయణ కాలేజీలో ఇంటర్, బెంగళూరులో బీటెక్, అమెరికాలో ఎంఎస్ చేశారు. ఆయన కుమార్తె సింధు మెడిసిన్ వరకు నారాయణలో చదివారు.
- మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కుమారుడు విశాల్‌కృష్ణ రంగారావు విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె కృతి గోపాల్ 2013 వరకు అక్కడే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు.
- టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కృష్ణా జిల్లాలోని సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో చదివాడు. ఆయన కుమారుడు ప్రస్తుతం ఒంగోలులోని నెక్స్›్టజెన్ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతున్నాడు.
- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు.
- జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ విదేశాల్లో చదివారు. ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు.
- టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు రాజేష్ గన్నవరంలోని సెయింట్ జాన్స్, సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో, అమెరికాలో చదివారు. రెండో కుమారుడు క్రాంతి కుమార్ సిద్దార్థ పబ్లిక్ స్కూల్, నలంద జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. అమెరికాలోని కెటారిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు.
- టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్, హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీలో చదివారు. ఆయన రెండో కుమారుడు తనూజ్ నాయుడు విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుతున్నాడు.
- టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ విశాఖపట్నంలోని విశాఖవేలీ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. సింగపూర్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. కుమార్తె సాయి పూజిత పాఠశాల విద్య ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేశారు. విశాఖలోని సెయింట్ జోసఫ్ కళాశాలలో చదివారు.
- టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విశాఖలోని టింపనీ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు భారతీయ విజ్ఞాన్ విహార్‌లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాభ్యాసం చేశాడు.
- మాజీ మంత్రి నారాయణకు ముగ్గురు సంతానం కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు నిషిత్ నారాయణ ఒకటి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. కుమార్తె శరణి ఒకటి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. లండన్‌లోని న్యూకాస్టిల్ యూనివర్శిటీలో ఎంబీఎ చేశారు. మరో కుమార్తె సింధు పదో తరగతి వరకు నెల్లూరులోని గోమతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్, అమెరికాలో ఎంబీబీఎస్ చేశారు.
- మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు స్కూల్ విద్య అనంతపురంలోని సెయింట్ డీపాల్ స్కూల్, రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివారు. హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.
- టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇద్దరు కుమార్తెలు హైమా చౌదరి, శ్వేతా చౌదరి విజయవాడ ఆట్కిన్‌సన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో పాఠశాల విద్య చదివారు. ఊటీ, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
- మండలి బుద్ధప్రసాద్ తన ముగ్గురు పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం లోనే చదివించారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ హైదరాబా ద్‌లోని సెయింట్ అల్ఫాన్సా, గోకరాజు గంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చదివాడు. ఆయన పెద్ద కుమార్తె కృష్ణ ప్రభ హైదరాబాద్‌లో ఇంటర్, డిగ్రీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేశారు. ఆమె కుమార్తెలు ఇద్దరూ అక్కడే ఇంగ్లిష్ మీడియం చదువులే చదువుతున్నారు. బుద్ధ ప్రసాద్ రెండో కుమార్తె అవనిజ కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు.
Comments
Please login to add a commentAdd a comment