సాక్షి, అమరావతి: ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు గుర్తించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా 16న ధర్నా చేస్తానని హెచ్చరించిన బాబు 22వ తేదీ నాటికి పూర్తిగా మాటమార్చి యూటర్న్ తీసుకున్నాడని తెలిపారు. గతంలో బీజేపీతో పొత్తుల విషయంలో పలుమార్లు యూటర్న్‌లు తీసుకొని చంద్రబాబు రికార్డు సాధించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ, మళ్లీ ప్రత్యేక హోదా.. ఇలా రోజుకొక నిర్ణయం తీసుకున్న బాబుకి ఏ విషయంలోనూ స్పష్టతలేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి దేశమంతా తిరిగి అందరి కాళ్లా వేళ్లా పడ్డారని గుర్తుచేశారు. అమిత్‌షా పుట్టిన రోజుకి మాత్రం తండ్రీకొడుకులు పోటీ పడి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారన్నారు.
చంద్రబాబే ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టారట...
తాము ఆంగ్లానికి వ్యతిరేకం కాదని, ఎప్పుడో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టామని, కానీ అప్పట్లో వైఎస్ జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు మాట్లాడటం విని ప్రజలు నవ్వుకొంటున్నారని మంత్రి పేర్ని అన్నారు. పవన్ నాయుడు ఎన్నికల సమయంలో నెల్లూరులో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివానని చెప్పారని, క్రిస్టియన్ మతం చాలా గొప్పదని, నెల్లూరులో మిషనరీ స్కూల్ తనకు దేశభక్తి నేర్పిందని ఆయనే అన్నాడని గుర్తుచేశారు. సుజనాచౌదరిది బాబు భజన పార్టీ అని తెలిపారు. సుజనా చౌదరి కాల్‌డేటా పరిశీలిస్తే ఆయన ఏ పార్టీ అనేది స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెడితే కన్నా లక్ష్మీనారాయణ మతం రంగుç ³#లుముతారన్నారు.
చంద్రబాబుకు జ్ఞానోదయం
Published Sat, Nov 23 2019 4:48 AM | Last Updated on Sat, Nov 23 2019 5:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment