ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం | free bus pass | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం

Published Fri, Aug 5 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం

ఉచిత బస్సుపాసుల పంపిణీ అభినందనీయం

  • వైఎస్సార్‌సీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి
  • భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
  • రావులపాలెం :
    కొత్తపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ చిర్ల సోమసుందరరెడ్డి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఆయన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు నిధులతో నియోజకవర్గంలోని వేలాది మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు ఇవ్వడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. చిర్ల సోమసుందరరెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విద్యార్థులకు ఏడాది కాలానికి ఉచిత బస్సుపాసుల పంపిణీ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్‌ చిర్ల సోమసుందరరెడ్డి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహానాయకుడని అన్నారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జగ్గిరెడ్డి తండ్రి పేరుతో చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా సుమారు 3 వేల మందికి ఉచిత బస్సుపాసులు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీలు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, వైస్‌ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు గుడిమెట్ల శారద, కొండేపూడి రామకృష్ణ, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు తేతలి పద్మనాభరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, ప్రచార కార్యదర్శి మసునూరి వెంకటేశ్వరరావు, జిల్లా సేవాదళ్‌ కన్వీనర్‌ మార్గన గంగాధరరావు, మాజీ జెడ్పీటీసీలు అప్పారి విజయకుమార్, బొక్కా వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, ముత్యాల వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement