పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్‌షిల పంపిణీ
Published Sun, Jul 17 2016 10:22 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
ఒంగోలు కల్చరల్ : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కమ్యూనిటీ హాలులో ఏర్పాౖటెన కార్యక్రమంలో ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులు 108 మందికి ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు పీవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాయత్రీ విద్యాపథకం ద్వారా ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామన్నారు. రూ.1,25,000లు ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ల కింద అందజేసినట్లు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి అందజేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూత అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సేవా సమితి ప్రధాన కార్యదర్శి ధేనువుకొండ వెంకటసుబ్బారావు సేవా సమితి లక్ష్యాలు వెల్లడించారు. కార్యక్రమంలో మహంకాళి వెంకటశేషయ్య, ఎంవీఎస్ శర్మ, సముద్రాల భీమశంకరశాస్త్రి, రంగనాథ్, కామేశ్వరరావు, శివ పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్‌తో పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవా సమితిని వారు అభినందించారు.
Advertisement