
పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం
అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతే వెల్స్‌ఫార్గో సంస్థ లక్ష్యమని వెల్స్‌ఫార్గో ఇండియా సొల్యూషన్స్ కార్పొరేటర్ సస్టేయినబిలిటీ ఉపాధ్యక్షుడు విష్ణుప్రియ సక్సేనా పేర్కొన్నారు.
రాయదుర్గం, న్యూస్‌లైన్: అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతే వెల్స్‌ఫార్గో సంస్థ లక్ష్యమని వెల్స్‌ఫార్గో ఇండియా సొల్యూషన్స్ కార్పొరేటర్ సస్టేయినబిలిటీ ఉపాధ్యక్షుడు విష్ణుప్రియ సక్సేనా పేర్కొన్నారు. రాయదుర్గం లోని వెల్స్‌పార్గో ఐటీసంస్థలో 5వ తేదీనుంచి 10వ తేదీ వరకు ఏటా నిర్వహించే ‘ది స్పర్శ్ ఫండ్ రైజింగ్ వీక్’లో భాగంగా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విష్ణుప్రియ సక్సేనా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
ఇజ్జత్‌నగర్, హఫీజ్‌పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కొత్తగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎన్‌జీఓ సంస్థతో కలిసి దత్తత తీసుకొని మౌలిక వసతుల కల్పనకు 2011 నుంచి శ్రీకారం చుట్టామన్నారు. గత ఏడాది బెంగళూరు, హైదరాబాద్‌లలోని సంస్థ ప్రాంగణాల్లో 200 స్టాళ్ళను ఏర్పాటు చేతితో, ఇంట్లో తయారుచేసిన వస్తువులు, తినుబండారాలను విక్రయించామన్నారు. ఈ ఏడాది కూడా కార్ వాషెష్,మ్యూజిక్, చేతితో తయారుచేసిన అభరణాలు, పాటలు అంకితం ఇవ్వడం, ఇంట్లో తయారుచేసిన తినుబండారాలు, ఇతర వస్తువులు విక్రయించడం, గేమింగ్ స్టాల్స్ ను నిర్వహణ, ఎక్స్‌క్లూసివ్ లంచ్ కోసం బిడ్డింగ్ వంటివి ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తామన్నారు.