న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో పేద విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చదువు కొనసాగించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఉచితంగా అందివ్వాలంటూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలంటూ ఢిల్లీలోని 10 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూళ్లు తీసుకున్న నిర్ణయ ప్రభావం సుమారు 50వేల మంది నిరుపేద విద్యార్థులపై పడిందనీ, వీరికి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సమకూర్చుకునే స్తోమత లేదని ‘జస్టిస్ ఫర్ ఆల్’అనే ఎన్‌జీవో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం జూన్ 10వ తేదీలోగా స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment