సాక్షి, హైదరాబాద్: ‘తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది’.. ఇది విద్యపై పలు కమిషన్లు నిగ్గు తేల్చిన నిజం. తరగతి గదికి ఆవల చదువులు అంతంతే అని మరోసారి నిరూపితమైంది. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులు విద్యార్థులకు అర్థం కావడంలేదని ఓ సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్ విద్యాబోధనపై యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) ఇటీవల చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆఫ్‌లైన్ బోధనే పాఠశాల విద్యకు లైఫ్‌లైన్ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పకనే చెప్పారు. 68.7 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు అర్థం కాకపోగా, 27.7 శాతం విద్యార్థులకు కొంత మేరకే అరర్థమవుతున్నాయి. (మూడు నెలలు ముప్పుతిప్పలే!)
కేవలం 3.6 శాతం విద్యార్థులకు మాత్రమే ఆన్‌లైన్ తరగతులు అర్థం అవుతున్నట్లు సర్వేలో తేలింది. ఆన్‌లైన్ చదువుల వల్ల ఉపయోగం అంతంతేనని, అందుకే పాఠశాలలను ప్రారంభించి ప్రత్యక్ష బోధన చేపట్టాలని 93.4 శాతం మంది తల్లిదండ్రులు కోరారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు 1,729 మంది టీచర్లతో రాష్ట్రంలోని 489 మండలాల్లోని 1,868 గ్రామాలకు వెళ్లి 22,502 కుటుంబాలను యూటీఎఫ్ సర్వే చేసింది. అందులో 17,282 మంది ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రులు, 5,220 మంది ప్రైవేటు పాఠశాలల తల్లిదండ్రులు, 39,659 మంది విద్యార్థులతోనూ మాట్లాడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 30,458 మంది (76.8%), ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు 9,201 మందితో (23.2%) మాట్లాడి ఈ సర్వే నివేదిక రూపొందించింది.
ఇవీ సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు
పాఠశాల పున:ప్రారంభంపై తల్లిదండ్రుల అభిప్రాయం..
స్కూళ్లు ప్రారంభించి బోధన చేపట్టాలి
(ఆఫ్‌లైన్): 21,017 (93.4%).
ఆన్‌లైన్‌లో బోధించాలి: 1485 (6.6%).
పాఠశాలల తరగతి గదులు భౌతికదూరం పాటించే విధంగా ఉన్నాయా?
ఉన్నాయి: 13,569 (60.3%)
లేవు: 8,933 (39.7%)
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారా? (9,201)
అవును: 1335 (14.5%)
లేదు: 7667 (85.5%)
ఆన్‌లైన్ తరగతులపై 5,220 మంది తల్లిదండ్రుల అభిప్రాయం:
ఉపయోగకరం: 232 (4.4%)
పాక్షికంగా ఉపయోగం: 1,289 (24.7%),
ఉపయోగకరం కాదు: 3,701 (70.9%)
ప్రైవేటులో ఆన్‌లైన్ క్లాస్‌లపై పిల్లల అభిప్రాయం:
ఆన్‌లైన్ క్లాసులు అర్థం అవుతున్నాయి: 331 (3.6%)
కొంతమేరకు అర్థం అవుతోంది: 2,549 (27.7%),
అర్థం కావటం లేదు: 6321(68.7%)
కుటుంబంలో స్మార్ట్ ఫోన్ల పరిస్థితి...
లేవు: 8911 (39.6%)
ఒక్కటే ఉంది: 11,003(48.9%)
రెండున్నాయి: 1665 (7.4%)
స్మార్ట్ ఫోన్ ఉన్న 13,591 కుటుంబాల్లో పిల్లలకిచ్చే వెసులుబాటు:
ఉన్న కుటుంబాలు: 2,990 (22%)
లేని కుటుంబాలు 10,601(78%)
ఫోన్‌లో డేటా కనెక్షన్ ఉందా? ఉంటే ఆన్‌లైన్ క్లాసులకు సరిపోతుందా? (13.591)
సరిపోతుంది: 1.495(11%),
ఉన్నప్పటికీ సరిపోదు: 4,118 (30.3%).
లేదు: 7,978 (58.7%)
మీ ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉందా?
ఉంది: 2,182 (9.7%)
లేదు: 20,320 (90.3%)
మీ ఇంట్లో టీవీ ఉందా?
ఉంది: 19172(85.2%)
లేదు: 3330 (14.8%)
మీ పాఠశాలలో టీవీ ఉందా? ఉంటే వినియోగంలో ఉందా?
వినియోగంలో ఉంది: 8,282 (36.8%),
వినియోగంలో లేదు: 2,340 (10.4%),
అసలే లేదు: 10,778( 47.9%)
మీ పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా?
ఉంది: 5355 (23.8%),
లేదు: 15,369 (68.3%),
తెలియదు: 1778 (7.9%)
మీరు పాఠశాలకు ఎలా వెళ్తారు?
నడక: 25,858 (65.2%)
స్సు: 4,561 (11.5%),
ఇతర వాహనాలు: 9,241
Comments
Please login to add a commentAdd a comment