
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్ పనిచేస్తుందని గవర్నర్ అన్నారు.
అయోధ్య రామాలయ పాదుకలకు పూజలు
అయోధ్య రామాలయం కోసం చల్లా శ్రీనివాసశాస్త్రి రూపొందించిన స్వర్ణ పాదుకలకు గవర్నర్ తమి ళిసై మంగళవారం రాజ్‌భవన్‌లో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ఈ పాదుకలు నిత్యం కోట్లాది మంది భక్తుల పూజలను అందుకోనున్నాయని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. నరసింహన్ భేటీ: రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవ ర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు.